బీటెక్ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేసిన ఐదుగురు యువకులను గురువారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
బోడుప్పల్ : బీటెక్ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేసిన ఐదుగురు యువకులను గురువారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్‌ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతాపూర్ అరోరా కాలేజీలో మహమ్మద్ అతారుద్ధీన్, మహమ్మద్ అజారుద్దీన్, షేక్ మహమ్మద్ జబీబుల్లా బీటెక్ చదువుతున్నారు. బుధవారం సాయంత్రం కాలేజీ వదిలిపెట్టిన తరువాత బస్సు కోసం బస్టాప్‌లో వేచి ఉన్నారు.
అయితే పర్వతాపూర్‌కు చెందిన వరికుప్పల సురేష్(21), కొమరె మధు(21), నిమ్మగూడ శ్రీకాంత్‌గౌడ్(21), సుర్వి సంపత్‌గౌడ్ (26), బి. వినోద్ కుమార్ (25)లు వారి పట్ల అసభ్యకరంగా మాట్లాడి దాడి చేశారు. దీంతో వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. వారి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు.