misbehave
-
HYD: కీచక కండక్టర్.. యువతి ట్వీట్‌కు ఆర్టీసీ రి‘యాక్షన్’
సాక్షి, రంగారెడ్డి: సిటీ బస్సులో కండక్టర్ తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి వాపోయింది. మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్న బస్సులో కండక్టర్ తనను అసభ్యంగా తాకినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు టీజీఎస్ఆర్టీసీ ఎండీ, షీ టీమ్స్, హైదరాబాద్ పోలీసులకు ఎక్స్ ద్వారా ఫిర్యాదు చేసింది.‘ఈ నెల 15న (మంగళవారం)మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్నా. ఆధార్ కార్డు లేకపోవడంతో రూ. 30 డబ్బులిచ్చి టికెట్ తీసుకున్నా. బస్సు రద్దీగా ఉండటంతో అదే అదనుగా భావించిన కండక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను అనుచితంగా తాకాడు. 2 సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు. అంకుల్ ఏం చేస్తున్నారంటూ గట్టిగా అరవగానే వెనక్కి వెళ్లిపోయాడు. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.తాజాగా ఈ ఫిర్యాదుపై టీజీఎస్ఆర్టీసీ స్పందించింది. ఫరూక్ నగర్ కండక్టర్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌లో ‘ఫరూఖ్‌నగర్ డిపోకు చెందిన ఒక కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది. టీజీఎస్ఆర్టీసీ మహిళా భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. ప్రతి రోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది.’ అని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఫరుఖ్‌నగర్ డిపోనకు చెందిన ఒక కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా #TGSRTC యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన చర్యలను సంస్థ… pic.twitter.com/pCzfcZRUz4— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) July 16, 2024 -
మంచిర్యాల బస్టాండ్ లో ఓవర్ యాక్షన్
-
స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లోని ఓ స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ అకృత్యాలు వెలుగు చూశాయి. స్కానింగ్ వచ్చే మహిళలు న్యూడ్ ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. అనేక మంది ఆ కామాంధుని అకృత్యాలకు బలయ్యారు. ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు విషయం వెలుగులోకి వచ్చింది.స్కానింగ్ సెంటర్లో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు.. విచారణ ప్రారంభించారు.నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ యజమాని డాక్టర్ చంద్రశేఖర్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు.. ఆపరేటర్ ప్రశాంత్ స్పై కెమెరాతో ఫొటోస్ వీడియో తీసినట్లు తెలిసిందని బాధితుల ఫిర్యాదుతో ప్రశాంత్‌ను పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. ప్రశాంత్‌ను ఉద్యోగం నుంచి తొలగించామని కూడా చెప్పారు. ప్రశాంత్ అమ్మాయిలతో చాట్ చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డాక్టర్ చంద్రశేఖర్. -
టీడీపీ కార్యకర్త వికృత చేష్టలు.. కాలేజీ విద్యార్థినిలతో అసభ్య ప్రవర్తన
సాక్షి, ఏలూరు: ముసునూరు మండలం గోపవరంలో టీడీపీ కార్యకర్త వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. గోపవరానికి చెందిన విద్యార్ధినులతో టీడీపీ కార్యకర్త వడ్లపట్ల మురళి(50) అసభ్యంగా ప్రవర్తించాడు. గోపవరం గ్రామానికి చెందిన 20 మంది విద్యార్ధులు ఏలూరులోని శ్రీ చైతన్య కాలేజ్‌లో చదువుతున్నారు. వీరంతా గత నెల 30వ తేదీన కాలేజ్ బస్సులో ఏలూరు నుంచి గోపవరం వస్తుండగా వడ్లపట్ల మురళి అసభ్యంగా ప్రవర్తించాడు. మురళి చేష్టలపై ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు సమాచారమచ్చింది.. దీంతో గోపవరంలో బస్సును ఆపిన తల్లిదండ్రులు.. మురళిని నిలదీశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త విద్యార్థిని తండ్రితో ఘర్షణకు దిగి గాయపరిచాడు.మురళి చర్యలతో భయపడిన బాధితులు.. తమకు రక్షణ కల్పించాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును ఆశ్రయింంచారు. స్పందించిన ఎమ్మెల్యేక టీడీపీ కార్యకర్త మురళిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. విద్యార్ధినులు, వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మురళి గతంలో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అన్ని కేసులను పరిగణలోకి తీసుకుని అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: విషాదం.. స్కూల్ బస్సు కిందపడి ఒకరు.. ఆర్టీసీ బస్సు ఢీకొని మరో చిన్నారి -
నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. జీర్ణించుకోలేకపోయా: ప్రగతి షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు తెరపై తల్లి పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. యాక్టివ్‌గా ఉంటూ వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది ప్రగతి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఓ సినిమా సెట్లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులకు గురైనట్లు తెలిపింది. అందులోనూ ఓ స్టార్ కమెడియన్ చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: డబ్బు కోసం ఆ పని కూడా చేయాల్సి వచ్చింది: ప్రముఖ నటి ) ప్రగతి మాట్లాడుతూ..' ఆయన సెట్లో నాతో చాలా బాగా మాట్లాడతారు. చాలా పద్ధతిగా ఉంటారు. అయితే ఒకరోజు నాతో మిస్ బిహేవ్ చేశాడు. ఆ తర్వాత దాన్ని జీర్ణించుకోవడం నా వల్ల కాలేదు. ఆ రోజు నాకు ఏం వర్క్ చేయాలనిపించలేదు. లంచ్ చేయలేకపోయా. ఆఖరికి టీ కూడా తాగాలనిపించలేదు.' అని అన్నారు. ఆ తర్వాత జరిగిన విషయం గురించి మాట్లాడుతూ.. 'ఆయన షూటింగ్ అయిపోయి వెళ్లిపోతుంటే క్యారవాన్‌లోకి తీసుకెళ్లి ప్రశ్నించా. మీతో ఎప్పుడైనా మిస్ బిహేవ్ చేశానా అడిగా. నేను అక్కడే రియాక్ట్ అయితే మీ పరిస్థితి ఏంటని నిలదీశా. మీరు కాబట్టే ఒక్క నిమిషం అలా సైలెంట్‌గా ఉండిపోయా.' అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రగతి పట్ల మిస్ బిహేవ్ చేసిన స్టార్ కమెడియన్ పేరు మాత్రం ఆమె బయటికి చెప్పలేదు. కాగా.. గతేడాది డీజే టిల్లు, రంగరంగ వైభవంగా, పెళ్లిసందడి చిత్రాల్లో కనిపించింది. (ఇది చదవండి: రెండోపెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన నటి ప్రగతి ) -
యువతితో డెలివరి బాయ్ అసభ్య ప్రవర్తన.. బుద్ధి చెప్పిన స్థానికులు
-
విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్ట్‌పై లైంగిక వేధింపులు
అమృత్సర్: అంతర్జాతీయ విమానంలో ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన ఘటన మరోటి వెలుగుచూసింది. పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం.. శనివారం షార్జా నుంచి అమృత్‌సర్‌కు బయల్దేరిన ఇండిగో సంస్థ అంతర్జాతీయ విమానంలో పంజాబ్‌లోని కోట్లీ గ్రామానికి చెందిన రాజీందర్ సింగ్ ప్రయాణిస్తున్నారు. విమానంలో తప్పతాగాక అతను విమాన మహిళా సిబ్బంది(ఎయిర్ హోస్ట్) ఒకరితో గొడవకు దిగాడు. ఈ సందర్భంగా ఆమెను లైంగికంగా వేధించాడు. గొడవను గమనించిన తోటి విమాన సిబ్బంది వెంటనే అమృత్‌సర్‌లోని కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో విమానం అమృత్‌సర్‌లోని శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే రాజీందర్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. భారత శిక్షాస్మృతిలోని 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. చదవండి: కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన -
ట్రైయిన్‌లో మరో అసభ్యకర ఘటన.. మద్యం మత్తులో టికెట్ ఎగ్జామినర్..
ఇటీవల ట్రైయిన్‌లో టికెట్ కలెక్టర్ల వరుస అనుచిత ప్రవర్తన ఘటనలు మరువక మునుపే ఓ ప్యాసింజర్ రైలులో అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. మద్యం మత్తులో టికెట్ ఎగ్జామినర్ ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో నిలంబూరు నుంచి కొచ్చవేలి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో జరిగింది. దీంతో రైల్వే పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ చేశారు. వివరాల్లోకెళ్తే.. రైలు రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ నిలంబూర్ కొచువేలిలోని అలువా స్టేషన్ దాటిన తర్వాత ఈ అనూహ్య ఘటన జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలికి ఆర్ఏసీ టికెట్ వచ్చింది. దీంతో ఆమె ఎస్4లో కూర్చొని ఉండగా ఒక టిక్కెట్ ఎగ్జామినర్ (టీఈ) వచ్చి ఆమె పక్కనే కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆమె చేతిని గట్టిగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె వెంటనే తిరువనంతపురంలోని రైల్వే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెతోనూ 35 ఏళ్ల టీఈతోనూ మాట్లాడి విచారించి, సదరు టీఈని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత టీఈకి వైద్య పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఆ మహిళ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చారు. కోర్టు అతనికి 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీని విధించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: బహుభార్యత్వంపై కొరడా ఝళిపిస్తున్న అస్సాం! సీఎం కీలక ప్రకటన) -
Hyderabad: విద్యార్థినితో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: విద్యార్థిని పట్ల ఓ ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. టీచర్స్‌కాలనీకి చెందిన ఓ విద్యార్థిని స్థానిక ఓ కార్పొరేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శివసాయినగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ యాకయ్య ఆ విద్యార్థినితో పాటు మరో ముగ్గురిని రోజూ ఆటోలో స్కూల్‌కు తీసుకెళ్లి తీసుకువస్తాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు స్కూల్ వదిలిన తర్వాత అందరినీ ఆటోలో ఎక్కించుకొని బయలుదేరాడు. మిగతా ముగ్గురిని వారి వారి ఇళ్ల వద్ద వదిలి ఆ విద్యార్తిని ఇంటికి తీసుకెళ్లకుండా వేరే చోటికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 1:20 గంటల వరకు ఇంటికి చేరుకునే కూతురు 1:30 గంటల వరకు రాకపోవడంతో తండ్రి ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆటో డ్రైవర్ మిగతా పిల్లలను వదులుతున్నాను సార్.. మా ఇంటికి వెళ్లే క్రమంలో మీ పాపను వదిలి వెళ్తానని సమాధానం చెప్పి పది నిమిషాల్లో ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లిన విద్యార్థిని ఆటో డ్రైవర్ తనను ఇంటికి తీసుకురాకుండా మరో చోటికి తీసుకెళ్లి నా పట్ల అసభ్యంగా వ్యవహరించాడని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తండ్రి ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిచాడు. జరిగిన విషయంపై నిలదీసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాడు. -
మహిళతో ఎస్ఐ అసభ్య ప్రవర్తన.. ఇంటికి వెళ్లాక ఫోటోలు పంపాలని..
బెంగళూరు: పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళతో ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించారు. వరకట్నం కేసుకు సంబంధించి సాక్షిగా వచ్చిన మహిళను వేధించినంట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగింది. వరకట్నం విషయంపై సాక్షిగా సుద్ధగుంటపాళ్య పోలీసు స్టేషన్‌కు పిలుపించుకున్న ఎస్ఐ మంజునాథ్‌స్వామి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ మహిళలు ట్విట్టర్లో బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌కు ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు. స్నేహితురాలి విడాకుల కేసులో సాక్షిగా వివరాలను ఇవ్వటానికి స్టేషన్‌కు వెళ్లాను. ఎస్ఐ మంజునాథస్వామి మొదట చాలా స్నేహపూర్వకంగా మాట్లాడారు. అనంతరం అతడి నిజస్వరూపం బయట పడింది. విచారణ సమయంలో తన చేతులు పట్టుకుని ముద్దు పెట్టడానికి యత్నించాడు’. అని బాధితురాలు ఆరోపించారు. స్టేషన్లో కుర్చోన్న తన నడుం గిల్లి, క్యాబిన్ పక్కన ఉన్న రూంకు రావాలని పిలిచాడని, అదే సమయంలో మా అమ్మ ఫోన్ చేయటంతో మాట్లాడుకుంటూ బయటకు వెళ్లటంతో అతడి నుంచి తప్పించుకున్నట్లు వివరించారు. స్టేషన్లోనే కాకుండా ఇంటికి వచ్చిన తరువాత వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పెట్టి మానసికంగా వేధిస్తున్నట్లు బాధితురాలు ఎస్ఐపై ఆరోపణలు చేశారు. ఇంటికి వెళ్లాక వాట్సాప్‌లో తన ఫోటోలు పంపాలని బలవంతం చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు సాక్షులను తీసుకోవటం సరి అయితే తన ఫోటోలను పంపాలని సూచించటం ఎంత వరకు న్యాయమని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తను స్టేషన్లో ఉన్నంత వరకు ఏమి మాట్లాడలేక భయంతో ఉన్నట్లు వివరించారు. ఎస్ఐ ఘటనకు సంబంధించి బాధితురాలు ఫఙర్యాదు చేసిందని డీసీపీ సీకే బాబా తెలిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
Video: యువతితో రైల్వే టీసీ అసభ్య ప్రవర్తన.. మద్యం మత్తులో రెచ్చిపోయి..
బస్సు, రైలు, విమానం.. ఇలా ప్రతి చోట ప్రయాణికులకు భద్రత కరువవుతోంది. ప్రయాణిస్తున్న వారితో అనుచితంగా ప్రవర్తించడం, మూత్ర విసర్జన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ బెదిరింపు ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న రైల్వే టికెట్ కలెక్టర్.. మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఉదంతం కర్ణాటకలో చోటుచేసుకుంది. కేఆర్ పురం రైల్వే స్టేషన్‌లోని టికెట్ కలెక్టర్.. అక్కడే నిలబడి ఉన్న మహిళా ప్రయాణికురాలి వద్దకు వచ్చి టికెట్ చూపించాలని అడిగాడు. అయితే ఆ సమయంలో టీసీ ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. యువతి తన ఫోన్లో టికెట్ కోసం వెతుకుతుండగా.. ఆమె టికెట్ లేకుండా రైలు ఎక్కిందని టీసీ ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. స్టేషన్లో జరుగుతున్న తతంగాన్ని అక్కడే ఉన్న కొందరు తమ ఫోనల్లో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇందులో.. నన్ను ఎందుకు వేధిస్తున్నారు. నేను టికెట్ బుక్ చేసుకున్నాను కాబట్టే ఇక్కడ ఉన్నానంటూ యువతి టీసీతో గట్టిగా అరవడం కనిపిస్తోంది. దీనిపై టీసీ స్పందిస్తూ.. టికెట్ చూపించి వెళ్లు.. ఇది నా పని అంటూ హిందీలో చెప్పడం చూడవచ్చు. చదవండి: ‘అధికారంలోకి వచ్చాక.. నీ సంగతి చెప్తా’.. కర్ణాటక డీజీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ కాగా తాను టిక్కెట్‌ను బుక్ చేసుకున్నానని, దానిని వేరే టిక్కెట్ కలెక్టర్‌కి చూపించానని యువతి పేర్కొంది. అయినా టీసీ తనపై దుర్భాషలాడుతూ.. తాకేందుకు ప్రయత్నించాడని యువతి ఆరోపించింది. తనతో ఎందుకు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అతన్ని ప్రశ్నించింది. స్టేషన్లో ఉన్న మరికొందరు ప్రయాణికులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అక్కడి నుంచి మెల్లగా జారుకుంటున్న టీసీని.. యువతి దగ్గరికి లాక్కొచ్చారు. చివరికి ఈ విషయం రైలే శాఖ వరకు చేరడంతో టీటీఈని నైరుతి రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. Drunk TT pulled her at KJM . While the girl was telling she had her ticket, showed ticket to TT but TT didn't listen anything,pulled her and still misbehave with her.We need explanation for on duty drunk TT.@RailMinIndia@Central_Railway please take strict action against the TT. pic.twitter.com/UUjRcm8X1w — Karishma behera (@karishma_behera) March 14, 2023 -
విమానంలో స్మోకింగ్ చేసి రచ్చ.. ప్యాసింజర్‌ను కట్టేసిన సిబ్బంది..
ముంబై: లండన్ నుంచి ముంబై వస్తున్న విమానంలో భారత సంతతికి చెందిన అమెరికన్ రచ్చ రచ్చ చేశాడు. వాష్రూంకెళ్లి సిగరెట్ కాల్చాడు. దీంతో అలరాం మోగగా సిబ్బంది వెళ్లి అతడి వద్ద నుంచి సిగరెట్ లాక్కుని పడేశారు. విమానంలో స్మోకింగ్ చేయొద్దని నిబంధనలు ఉన్నా.. ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించారు. అయితే అతడు మాత్రం చేసినపనికి సిగ్గుపడకుండా సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. వారితో దురుసుగా ప్రవర్తించాడు. అయితే ఎలాగోలా అతడ్ని తీసుకెళ్లి సీటులో కూర్చోబెట్టారు. కానీ అతను మాత్రం ఊరుకోకుండా విమానం డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా అతడు ఊరుకోలేదు. దీంతో అతడి కాళ్లు చేతులు, కట్టేసి సీటులో కూర్చొబెట్టారు. విమానంలో రచ్చ రచ్చ చేసిన ఇతని పేరు రమాకాంత్. వయసు 37 ఏళ్లు. ముంబై చేరుకున్నాక విమానాశ్రయంలో పోలీసులకు ఇతడ్ని అప్పగించారు. ఈ ఘటనపై వారు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: జానపద గాయకుడిపై కరెన్సీ నోట్ల వర్షం.. వీడియో వైరల్.. -
విమానంలో మరో ఘటన..మహిళా ఫ్లైట్ అటెండెంట్ల పట్ల అసభ్య ప్రవర్తన
తీవ్ర కలకలం రేపిన ఎయిర్ ఇండియాలోని తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటన మరువక మునుపే మరో ఘటన చోటు చేసుకుంది. గో ఫస్ట్ విమానంలోని మహిళా ఫ్లైట్ అటెండెంట్ల పట్ల ఒక విదేశీ టూరిస్ట్ అసభ్యంగా ప్రవర్తించి.. వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. జనవరి 5న ఢిల్లీ నుంచిగోవా వెళ్లే గో ఫస్ట్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఒక విదేశీ పర్యాటకుడుతో ఫ్లైట్ అటెండెంట్ కూర్చొగా..అతను మరొకరితో అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సదరు వ్యక్తిని గోవాలోని కొత్త విమానాశ్రయంలోని భద్రతా ఏజెన్సీకి అప్పగించారు. ఆ తర్వాత డీజీసీఏకి ఈ విషయమై సమాచారం అందించారు. గోవాలోని మోపాలో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాలు చేసిన రోజే జరగడం గమనార్హం. ఇప్పటికే విమానాల్లో ఇలాంటి ఘటనలపై డైరక్టరేట్ జనరల్ సవిల్ ఏవియేషన్ సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు వరుసగా బయటకు రావడంతో సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా అంతర్గత కమిటీని సైతం డీజీసీఏ ఏర్పాటు చేసింది. (చదవండి: వినూత్నంగా జనగణన..ఫుల్ క్లారిటీ ఇచ్చిన బిహార్ సీఎం) -
టీడీపీ నేత దూషించి, దాడి చేశాడు
సాక్షి, ప్రొద్దుటూరు: తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి నల్లబోతుల నాగరాజు తనపై దాడి చేసి, దూషిస్తూ నైటీ చింపేశాడని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని వరసిద్ధి వినాయక నగర్‌కు చెందిన లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. నల్లబోతుల చిట్స్ నిర్వాహకుడుగా ఉన్న నల్లబోతుల నాగరాజు వద్ద గతంలో తాను అప్పు తీసుకుని ప్రతి నెలా అధిక వడ్డీని చెల్లిస్తున్నానన్నారు. కొద్ది రోజులుగా తన భర్త శివప్రసాద్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో జాప్యం జరిగిందని, వడ్డీతో సహా పూర్తి డబ్బు చెల్లిస్తామని తెలిపామన్నారు. అయినా వినకుండా శనివారం నల్లబోతుల నాగరాజుతోపాటు మరికొంత మంది తమ ఇంటి వద్దకు వచ్చి తనపై దాడి చేసి నైటీ చింపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటిలో ఉన్న తన భర్త శివప్రసాద్‌ను దూషించి, జుట్టుపట్టుకుని గాయపరిచారని తెలిపారు. వెంటనే డబ్బు చెల్లించకుంటే చంపుతామని కత్తితో బెదిరింనట్లు ఆమె వివరించారు. ఘటనపై ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం నల్లబోతుల నాగరాజు కేసు రాజీ కావాలని ఇతరులతో మాట్లాడిస్తున్నారని తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట విషాదం) -
బుద్ధి మారని ఉపాధ్యాయుడు.. వాట్సాప్‌లో హనీమూన్ గురించి విద్యార్థినితో..
సాక్షి, బెంగళూరు: ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి బుద్ధి మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. తరచూ విద్యార్థినుల వద్ద అశ్లీలంగా ప్రవర్తించడం అతనికి అలవాటుగా మారింది. ఉన్నత పాఠశాల విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు ఇంటి ముఖం పట్టాడు. ఈ ఘటన కోలారు తాలూకాలోని నరసాపురం ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. హనీమూన్ గురించి చర్చ విద్యార్థిని మొబైల్‌కు అశ్లీల మెసేజ్‌లు పంపాడని ఆమె తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి పాఠశాల వద్దకు వచ్చి కన్నడ ఉపాధ్యాయుడు సిఎం ప్రకాష్‌ను నిలదీశారు. బీఈఓ ఎదుట ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. వాట్సాప్‌లో హనీమూన్ గురించి తమ కూతురితో చర్చలు చేశాడని వారు ఆరోపించారు. ఈ ఉపాధ్యాయుడు 2010లో కూడా ఇదే పాఠశాలలో ఒక విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి సస్పెండు అయ్యాడు. అప్పుడు అక్కడి బదిలీ అయ్యి తిరిగి ఇదే పాఠశాలకు తిరిగి వచ్చాడు. తాజా సంఘటన నేపథ్యంల ఈ టీచర్‌ను బీఈఓ కన్నయ్య సస్పెండు చేశారు. చదవండి: (వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య) -
నిజామాబాద్ లో కీచక టీచర్ కు దేహశుద్ధి
-
అధికారి గల్లా పట్టుకున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
-
కీచక ఉపాధ్యాయులు.. మొన్న మహిళా ఉద్యోగి.. నేడు విద్యార్థినితో
సాకక్షి, కరీంనగర్: అక్షర జ్ఞానం అందించి అందరిలో మిన్నగా భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు కొందరు పెడదారిలో వెళ్తు ఉపాధ్యాయ వృత్తికి అపవాదు తీసుకువస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఓ పాఠశాలలో మహిళా ఉద్యోగిపై, విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్న ఘటనపై ఫిర్యాదులు అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. – మొన్న వేములవాడ.. నేడు సిరిసిల్ల.. వేములవాడ రూరల్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళ హెచ్ఎంను అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు దుర్భాషలాడాడు. దీంతో సదరు హెచ్ఎం వేములవాడ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ బన్సీలాల్ ఘటనపై పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విషయం తెలుకున్న డీఈవో రాధాకిషన్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘం నాయకులు స్పందిస్తు విచారణ చేపట్టకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని విద్యాశాఖ అధికారులను విమర్శించారు. ఈ ఘటన మరువకముందే మరో ఉపాధ్యాయుడు ఏకంగా విద్యార్థిని వేధింపులకు గురిచేసిన ఘటన సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. తనను పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యారి్థని తన తల్లికి తెలపడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఈక్రమంలో పోలీసులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. పర్యవేక్షణ కరువు... ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అనుసరిస్తున్న పాఠ్య ప్రణాళికలు విద్యార్థులకు ఉన్న వసతులపై పర్యవేక్షించే శాశ్వత అధికారులు జిల్లాలో లేరు. విద్యాశాఖలో 640 ప్రభుత్వ పాఠశాలలుంటే వీటిని పర్యవేక్షించడానికి ముగ్గురు ఎంఈఓలున్నారు. వీరందరూ ఏదో ఒక పాఠశాలలో హెచ్ఎంలుగా పనిచేస్తున్న వారేకావడం గమనార్హం. వీరి పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం, గతంలో వీరితో పనిచేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది వీరి ఆదేశాలను పాటించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా డీఈవో కూడా డిప్యూటేషన్‌లో పనిచేస్తుండం గమనార్హం. ఇలా పర్యవేక్షణ అధికారులు రెగ్యులర్ కాకపోవడంతో పర్యవేక్షణ లోపం జిల్లాలో అధికంగా ఉందని ఇదే కారణంగా అనేక పాఠశాలలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఉపాధ్యాయ సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. వెంటనే రెగ్యులర్ ఎంఈవోలు, డీఈవో వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు వచ్చింది. దీనిపై చట్టపరమైన చర్యలుంటాయి. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. – లక్ష్మారెడ్డి, ఎస్సై, తంగళ్ల్లపల్లి -
బాలీవుడ్ నటికి చేదు అనుభవం.. క్యాబ్ డ్రైవర్ ఎంత పని చేశాడంటే?
ముంబైలో బాలీవుడ్ నటితో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ క్యాబ్ డ్రైవర్. ఇంటికి వెళ్లేందుకు శనివారం రాత్రి 8.15 గంటలకు నటి మానవ నాయక్ క్యాబ్ బుక్ చేసుకుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో క్యాబ్ ఎక్కిన నటి క్యాబ్ డ్రైవర్‌ను ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని వారించింది. అయినా వినకుండా అలాగే ముందుకెళ్లాడు. అతన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు రూ.500 జరిమానా విధించారు. ఆ తర్వాత కారును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లమని నటి చెప్పడంతో వినకుండా మరింత వేగంతో ముందుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక చీకటి ప్రదేశంలో కారు నిలిపాడు. దీంతో ఆమె ఆందోళనకు గురైంది. ఐదు వందల ఫైన్ మీరు కడతారా అంటూ నటిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు క్యాబ్ డ్రైవర్. అంతే కాకుండా ఆమెను దూషించాడు. వెంటనే గ్రహించిన నటి గట్టిగా అరవడంతో రోడ్డుపై వెళ్తున్న ద్విచక్రవాహనదారులు, ఆటోవాలా ఆమెను రక్షించారు. దీంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సురక్షితంగా బయటపడినా తీవ్రమైన భయాందోళనకు గురైనట్లు మానవ నాయక్ తెలిపింది. మానవ నాయక్ హిందీతో పాటు పలు మరాఠీ చిత్రాల్లో నటించింది. pic.twitter.com/BLIe0v5DV2 — Manava Arun Naik (@Manavanaik) October 15, 2022 ఈ విషయంపై ముంబై జాయింట్ సీపీ స్పందించారు. నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు తీవ్రంగా పరిగణిస్తామని వెల్లడించారు. డీసీపీ స్థాయిలో దీనిపై విచారణ చేపడతామని ఆమె పోస్ట్‌కు ఆయన బదులిచ్చారు. ఈ ఘటనలో క్యాబ్ సంస్థను వివరణ కోరుతున్నట్లు జాయింట్ సీపీ తెలిపారు. -
సాయం కోరిన స్నేహితుడి ప్రేయసిపై కన్నేసి.. ఇద్దరిని ఇంటికి పిలిపించి..
సాక్షి, హైదరాబాద్: సాయం కోరిన స్నేహితుడి ప్రేయసిపై కన్నేశాడో యువకుడు. మాయమాటలతో స్నేహితుడిని, తన ప్రేయసిని ఇంటికి రప్పించి వారికి తెలియకుండా వారున్న రూమ్‌లో సీక్రెట్ కెమెరా అమర్చాడు. ఆ తర్వాత నుంచి తన కోరిక తీర్చాలంటూ వెంటపడి వేధించిన యువకుడు ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు. మరో ఘటనలో అడ్రస్ చెబుతున్న యువతి పట్ల అసభ్యకరంగా తాకుతూ ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్ సైతం జైలు పాలయ్యాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన షీటీం బృందం.. వివరాలను కోర్టులో పొందుపరిచారు. నాంపల్లిలోని మెట్రోపొలిటన్ క్రిమినెల్ కోర్టు ఇద్దరికీ ఎనిమిదేసి రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు షీటీం అడిషినల్ డీసీపీ సి.శిరీషరాఘవేంద్ర తెలిపారు. నగరానికి చెందిన అబ్థుల్ సాల్మన్(23) తన స్నేహితుడు, ప్రియురాలికి తన ఇంటిలో చోటు కల్పించాడు. వారిద్దరూ శారీరకంగా కలిసిన సన్నివేశాల్ని ఫోన్లో చిత్రీకరించి తనతో కూడా గడపాలంటూ యువతిని బెదిరించాడు. దీనిపై యువతి, తన ప్రియుడు షీటీం పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన షీటీం అబ్దుల్ సాల్మన్ వద్ద ఉన్న ఫోన్‌ను పరిశీలించగా దానిలో నగ్నచిత్రాలు ఉన్నట్లు స్పష్టమవ్వడంతో వాటిని స్వాధీనం చేసుకుని కోర్టుకు అందజేశారు. అదేవిధంగా కొద్దిరోజుల క్రితం నారాయణగూడ మెట్రో స్టేషన్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని మహ్మద్ హైదర్అలీఖాన్(25) అనే క్యాబ్ డ్రైవర్ తనకు అడ్రస్ చెప్పాలంటూ కోరాడు. తను అడ్రస్ చెప్పేందుకు హైదర్ అలీఖాన్ వద్దకు రావడంతో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో యువతి చాకచక్యంగా డ్రైవర్ ఫొటోలు, కారు నంబర్‌ను తన ఫోన్లో క్యాప్చర్ చేసి షీటీంకు పంపింది. రంగంలోకి దిగిన షీటీం బృందం మహ్మద్ హైదర్ అలీఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన తప్పును ఒప్పుకున్నాడు. సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను సేకరించి కోర్టులో సమర్చించారు. ఈ ఇద్దరి వ్యవహారంపై గురువారం ఇద్దరికీ వేర్వేరుగా 8 రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. -
కన్న కూతురిపై కన్నేసిన కామాంధుడు.. అసభ్యకర ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: కామాంధుడైన ఓ తండ్రి కన్న కూతురిపై లైంగికదాడికి యత్నించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్ రోడ్ నెంబర్–7లో బాధితురాలు(9) నివాసం ఉంటోంది. బాధితురాలి తండ్రి మక్సూద్ హుస్సేన్(46) చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం నుంచి తల్లిదండ్రులు విడివిడిగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా మూడు నెలలుగా బాలిక ముభావంగా ఉంటోంది. దీంతో తల్లి బాలికను ప్రశ్నించింది. తండ్రి మక్సూద్ హుస్సేన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక దాడికి యత్నించాడని తెలిపింది. దీంతో బాధితురాలితో కలిసి తల్లి శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. చదవండి: నువ్వు చచ్చిపోతే నా కొడుక్కి మూడో పెళ్లి చేస్తా... -
Hyderabad: మహిళ పట్ల ఆర్ఐ అసభ్య ప్రవర్తన..ఒంటరిగా రా ఇస్తాననడంతో
సాక్షి, హైదరాబాద్: మంజూరైన వితంతు పింఛన్ కార్డును ఇవ్వాలని ఆర్ఐని అడగగా జాప్యం చేస్తూ ఒంటరిగా రా ఇస్తానని చెప్పడంతో ఈ విషయాన్ని సదరు మహిళ బంధువులకు చెప్పడంతో వారొచ్చి ఆర్ఐని తహసీల్దార్ సమక్షంలోనే చితకబాదిన ఘటన కలకలం రేపింది. ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్‌లో ఉంటున్న మైనార్టీ మహిళ(28), వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. తనకు మంజూరైన కార్డు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ఆర్ఐ విజయ్‌నాయక్‌ను అడిగింది. ఫించన్ మంజూరైంది కానీ.. కార్డు రాలేదని, రోజు ఇబ్బంది పెటొద్దు ప్రేమతో అడిగి తీసుకోవాలంటూ ఆర్ఐ నాలుగైదు రోజులుగా ఇదే సమాధానం చెబుతున్నాడు. ఈ క్రమంలో గురువారం మరోసారి సదరు మహిళ ఫించన్ కార్డు కోసం కార్యాలయానికి వచ్చి విజయ్‌నాయక్‌ను కార్డు అడిగింది. మళ్లీ అతడు అదే సమాధానం ఇచ్చాడని కుటుంబ సభ్యులతో పాటు బస్తీ వాసులకు తెలిపింది. కాసేపటి తర్వాత కార్యాలయానికి వచ్చిన వారు తహసీల్దార్ అయ్యప్ప సమక్షంలోనే విజయ్‌నాయక్‌పై దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన తహసీల్దార్‌ను సైతం నెట్టివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో గొడవ సద్దుమణిగింది. ఫించన్ మంజూరైంది ఇంకా కార్డు రాలేదని రాగానే ఇస్తానన్నాను.. తప్ప ఒంటరిగా రా అనలేదని ఆర్ఐ విజయ్‌నాయక్ చెప్పుకొచ్చారు. కార్డు ఇవ్వడం ఆలస్యమైనందుకే బంధువులు, స్థానికులతో వచ్చి తనపై దాడి చేశారని ఆర్ఐ పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఇరువురు గాంధీనగర్ పోలీస్ పరస్పర ఫిర్యాదు చేసినట్లు సీఐ మోహన్‌రావు తెలిపారు. -
శ్రీచైతన్య పాఠశాలలో దారుణం
సాక్షి, హైదరాబాద్(లింగోజిగూడ): 9వ తరగతి విద్యార్థి పట్ల హాస్టల్ వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్‌నగర్ పాత రోడ్డులోని శ్రీ చైతన్య హాస్టల్లో పని చేస్తున్న కృష్ణ గత వారం రోజులుగా 9వ తరగతి బాలుడుతో పాటు ఇతర విద్యార్థులను రాత్రి సమయంలో పక్కన పడుకుని వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు బాలుడు తన తల్లిదండ్రులకు విషయం తెలియజేయడంతో బుధవారం హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం హయత్‌నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్డెన్ కృష్ణను పాఠశాల యజమాన్యం మంగళవారమే హాస్టల్ నుంచి తొలగించింది. హాస్టల్‌కు అనుమతి లేదని, ఇప్పటికే నివేదిక తయారు చేసి పై అధికారులకు పంపించామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎంఈఓ హీర్యానాయక్ తెలిపారు. చదవండి: (Hyderabad: ఇక కీలక ఘట్టమే.. నగరంలో ఆ ఫ్లైఓవర్లన్నీ బంద్) -
అత్తతో అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల శిక్ష
ఒంగోలు: అత్త పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ రెండో అదనపు జిల్లా జడ్జి ఎంఏ సోమశేఖర్ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..చీరాలకు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి చెప్పుల దుకాణం నిర్వహించేది. ఆమె కుమార్తెను చిత్తూరు జిల్లాకు చెందిన కోలా జాన్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు సంతానం. ఈ క్రమంలో అదనపు కట్నం కావాలంటూ భార్యను నిత్యం జాన్ వేధించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో జాన్..భార్య తల్లికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధించేవాడు. చివరకు ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో చీరాలకు వచ్చి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించబోగా ఆమె కేకలు వేస్తూ బయటకు వచ్చింది. అనంతరం భర్తతో కలిసి చీరాల పోలీసులకు ఫిర్యాదుచేయగా అప్పటి సీఐ వి.సూర్యనారాయణ దర్యాప్తుచేసి కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. నేరం నిరూపణ అయినట్లుగా న్యాయమూర్తి పేర్కొంటూ నిందితుడు జాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కేసును అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యత్తపు కొండారెడ్డి వాదించగా, కోర్టు లయన్ ఆఫీసర్‌గా లక్ష్మీనారాయణ వ్యవహరించారు. చదవండి: (తప్పుడు ఆరోపణలు చేస్తే.. మీరే ఫూల్స్ అవుతారు: ఆర్కే రోజా) -
వారిద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. అయితేనేం వారి కనుసన్నల్లోనే..
వారిద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. అయితేనేం అంతా వారిష్టం. వారి కనుసన్నల్లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) కొనసాగుతోంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ అండతో వారిద్దరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాలనలోనూ వారు జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరో అడుగు ముందుకేసి అధికారులు, సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఆస్పత్రిలో పరికరాల కొనుగోళ్లలోనూ వారిదే పైచేయి. సూపరింటెండెంట్ వారి చేతిలో కీలుబొమ్మలా మారడంతో లక్షల రూపాయల విలువైన ఎక్విప్మెంట్ కొనుగోళ్లను వారికే నామినేషన్‌పై అప్పగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, నల్లగొండ: కంచే చేను మేసినట్లుగా ఉంది జీజీహెచ్‌లో సూపరింటెండెంట్ వ్యవహారశైలి. ఆస్పత్రికి రోజూ ఇన్‌పేషంట్లుగా రెండుమూడొందల మంది, అవుట్పేషంట్లుగా ఐదారు వందల మంది వైద్యం కోసం వస్తుంటారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉండడంతో రోగులు ఇతర పట్టణాల నుంచి కూడా వస్తారు. ఆస్పత్రిని పర్యవేక్షిస్తూ వైద్యులు, సిబ్బందిని నిత్యం సమన్వయం చేసుకుంటూ రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన అధికారి వారందరికీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యులతో పాటు ఇతర ఉద్యోగులను చులకన భావంగా చూడడం వల్ల వారు మనకెందుకులే అన్న తీరుగా రోగుల పట్ల వ్యవహరిస్తున్నారు. వైద్యులు, ఉద్యోగులు అందించే సలహాలను, సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుని సమన్వయం చేయాల్సిన అధికారి వ్యవహారశైలిపైఅందరూ గుర్రుగా ఉన్నారని తెలిసింది. టెండర్లు పిలువకుండానే రూ.50 లక్షల సామగ్రి కొనుగోలు జీజీహెచ్‌లో రెండు నెలల క్రితం ఆపరేషన్ థియేటర్లో రూ.50 లక్షల విలువ చేసే ఎక్విప్మెంట్తో పాటుగా ఏసీలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే వాటి కొనుగోలు కోసం ఎలాంటి టెండర్లు పిలవకుండానే వారే కొన్ని సంస్థల పేరుతో టెండర్లు దాఖలు చేసినట్లు సృష్టించి తన సామాజిక వర్గానికి చెందిన అవుట్సోర్సింగ్ ఉద్యోగికి టెండర్లు వచ్చేలా చేసి కొనుగోలు చేసినట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. నాణ్యత లేని పరికరాలు, ఏసీలను కొనుగోలు చేసి ఆస్పత్రి ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆస్పత్రి వర్గాలే బాహాటంగా చెపుతున్నాయి. మందుల కొనుగోలు విషయం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులకు వేధింపులు జీజీహెచ్‌లో పనిచేసే ఉద్యోగులపై సూపరింటెండెంట్ వేధింపులకు పాల్పడుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఒక ఉద్యోగిపై ఆయన వ్యవహరించిన తీరుపై ఆస్పత్రి ఎదుట ఉద్యోగులు ఆందోళన చేసి కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మహిళా, పురుషులు అనే తేడా లేకుండా ఏకవచనంతో మాట్లాడడం, ఇతర పదజాలాన్ని వాడడం వల్ల మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై వివరణ కొరడానికి పర్యవేక్షకుడిని ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
ఫిర్యాదు చేసిందని బాలిక హత్య
దొడ్డబళ్లాపురం: ఒక వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తన తండ్రితో చెప్పుకోవడం ఆ బాలిక పాలిట శాపంగా మారింది. ఆ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసి తానూ కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా జిందాల్ క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది. వీరందరూ వలస కార్మికులే. జిందాల్ అల్యూమినియం కంపెనీ ఉద్యోగి లక్ష్మణ్‌సింగ్.. జిందాల్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు. ఇతడి కుమార్తె ఖుషి (11)ని ఇదే క్వార్టర్స్‌లో ఉండే నందకిశోర్ అనే వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. క్వార్టర్స్‌లో ఖుషి కుటుంబం రెండవ అంతస్తులో నివసిస్తుంటే మొదటి అంతస్తులో నందకిశోర్ ఉంటున్నాడు. ఖుషి కిందకు వస్తున్నప్పుడు నందకిశోర్ అసభ్యంగా ప్రవర్తించేవాడట. ఈ విషయం ఖుషి తన తండ్రితో చెప్పడంతో నందకిశోర్‌తో గొడవపడ్డాడు. అసోసియేషన్ ముందు పంచాయతీ పెట్టి ఇల్లు ఖాళీ చేయాలని చెప్పించాడు. ఇదే ఆక్రోశంతో నందకిశోర్ సోమవారం ఖుషిని టెర్రస్‌పైనే కత్తితో పొడిచి అనంతరం తానూ కత్తితో పొడుచుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ నందకిశోర్‌ను ఆస్పత్రిలో చేర్చినప్పటికీ చికిత్స ఫలించక మృతి చెందాడు. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ఇద్దరితో ప్రేమాయణం.. రెండో ప్రియుడంటే ఎంతో ఇష్టం.. అతడి కోసం..) -
బాలికలతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
సాక్షి, కృష్ణా: విద్యార్థినులకు తండ్రి స్థానంలో ఉండి విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే లెక్క తప్పాడు. పాఠాలు బోధించే నెపంతో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఉయ్యూరు మండలం పెద ఓగిరాల జెడ్పీ పాఠశాలలో సాయిబాబు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉయ్యూరులో నివాసం ఉంటారు. 9, 10 తరగతులకు గణితం బోధిస్తారు. పాఠాలు బోధించే క్రమంలో విద్యార్థినులతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ తాకరాని ప్రదేశాల్లో చేతులు వేస్తున్నారు. రోజూ ఇలాగే ప్రవర్తిస్తుండటంతో భరించలేక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. సోమవారం సాయంత్రం పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు హెచ్ఎం సుధారాణికి ఫిర్యాదు చేసి ఘటనపై నిలదీశారు. హెచ్ఎం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు ఉడాయించటంతో దీనిపై తల్లిదండ్రులు ఉయ్యూరు రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసిన పోలీసులు సదరు ఉపాధ్యాయుడుపై అసభ్యకర ప్రవర్తన, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. హెచ్ఎం పైనా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆందోళన చేశారు. ఎంఈఓ కనకమహాలక్ష్మి, రూరల్ ఎస్ఐ రమేష్ పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎంఈఓ కనకమహాలక్ష్మి తెలిపారు. ఉపాధ్యాయుడు సాయి బాబును సస్పెండ్ చేస్తూ డీఈఓ తాహెరా సుల్తానా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. -
సత్యసాయి: టీడీపీ నేత పరిటాల సునీత దురుసు ప్రవర్తన
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ సోమవారం పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు. వీరిద్దరూ అనుచరులతో కలిసి భారీ సంఖ్యలో వాహనాల్లో పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు బయల్దేరారు. రామగిరి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న చెక్‌పోస్టు వద్ద వీరి వాహనాలను ఎస్ఐ జనార్దన్ నాయుడు ఆపారు. సీఎం పర్యటన ఉన్నందున భద్రత కారణాల దృష్ట్యా ఇన్ని వాహనాలను అనుమతించలేమని, కొన్నింటిని మాత్రమే పంపుతామని చెప్పారు. దీంతో పరిటాల సునీత శివాలెత్తారు. ‘గేటు ఎత్తరా.. ఏం చేస్తాడో చూద్దాం’ అంటూ అనుచరులు, రౌడీషీటర్లను ఉసిగొల్పారు. ఇది మంచి పద్ధతి కాదని, పరిస్థితులను అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరినా పట్టించుకోలేదు. ఎస్ఐతో సునీత, శ్రీరామ్ దురుసుగా ప్రవర్తించారు. ‘మీరు పంపకపోతే మేం దౌర్జన్యం చేస్తాం’ అంటూ బెదిరించారు. ఎస్ఐ అనే గౌరవం లేకుండా ‘ఏందయ్యా.. నువ్వు..’ అంటూ ఏకవచనంతో మాట్లాడారు. చివరకు చెక్‌పోస్టు గుండా నాలుగు వాహనాలు వెళ్లేందుకు ఎస్ఐ అనుమతించారు. కానీ పరిటాల అనుచరులు పోలీసుల ఆదేశాలను సైతం లెక్కచేయలేదు. దౌర్జన్యంగా చెక్‌పోస్టు గేటు పైకెత్తారు. వేరే మార్గాల గుండా వాహనాల్లో తరలివెళ్లారు. చదవండి: (అయ్యో జనార్దనా: ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి) -
బంజారాహిల్స్: బాలికను కారులో తీసుకెళ్లి అసభ్యకర ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని ఒక పబ్‌కి వెళ్లిన బాలికను కారులో తీసుకెళ్లి కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ చెందిన ఒక బాలిక(17) జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని అమ్నేషియ ఇన్సోనియా పబ్‌కు స్నేహితులు ఇచ్చిన పార్టీకి గత నెల 28న హాజరైంది. అదే రోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో ఒక బెంజి, ఇన్నోవా కార్లలో వచ్చిన కొందరు యువకులు ఆ బాలికను తీసుకెళ్లారు. ఆ తరువాత రెండు గంటల తరువాత బాలిక తిరిగి వచ్చింది. అయితే.. బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని బాలిక తండ్రి బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మెడపై చిన్న గాయం అయ్యిందని, సంఘటన జరిగిన సమయం నుంచి షాక్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన ఫిర్యాదు చేయగా పోలీసులు పొక్సో కింద కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చదవండి: అదృశ్యమైన బాలికను నాలుగు నెలలు గదిలో బంధించి.. -
మెట్రో స్టేషన్లో యువకుడి వికృత చేష్టలు.. లిఫ్ట్ ఎక్కి.. బట్టలు విప్పి
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేట మెట్రో స్టేషన్ లిఫ్ట్‌లో ఒంటరిగా వెళ్లే మహిళల ఎదుట వికృత చేష్టలకు పాల్పడుతున్న యువకుడిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖైరతాబాద్‌కు చెందిన ఓ మహిళ మంగళవారం షాపింగ్ చేసేందుకు అమీర్‌పేటకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు అమీర్‌పేట చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న మెట్రో స్టేషన్ లిఫ్ట్ ఎక్కింది. వెనకాలే వచ్చిన ఓ యువకుడు లిఫ్ట్‌లోకి ఎక్కాడు. బట్టలు విప్పి వికృత చేష్టలు చేయడాన్ని గమనించిన ఆమె భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి మెట్రో సెక్యూరిటి సిబ్బందికి తెలిపింది. సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో అతను ఒడిషాకు చెందిన రాజుగా గుర్తించారు. సోమవారం నగరానికి వచ్చిన అతను ఉదయం నుంచి లిఫ్ట్‌లో ఇలాగే ప్రవర్తిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ప్రయాణికులకు ఊరట.. లష్కర్లో మినీ బస్సులు టికెట్ రూ.5 -
సఖి కేంద్రంలోనే రాత్రి నిద్ర.. మహిళా సిబ్బందితో అసభ్యంగా..
సాక్షి, సూర్యాపేట: ఆపదలో చిక్కుకున్న మహిళలకు ఆశ్రయమిచ్చి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఎన్జీఓల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రతి జిల్లాలో సఖి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిగా ఎన్జీఓల పర్యవేక్షణలో నడుస్తుండటంతో పలు వివాదాలకు నిలయాలుగా మారాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల సఖీ కేంద్రం డైరెక్టర్ వెంకట్‌రెడ్డి వ్యవహార శైలి పలు అనుమానాలకు తావిస్తోంది. సఖి కేంద్రాన్ని నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నాడని, నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని, మహిళా సిబ్బందితో అసభ్యంగా మాట్లాడుతాడనే ఆరోపణలు వెంకట్‌రెడ్డిపై ఉన్నాయి. రాత్రివేళ వెంకట్‌రెడ్డి సఖి కేంద్రంలోనే నిద్రిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సోమవారం రాత్రి సఖి కేంద్రంలో వెంకట్‌రెడ్డి ఎంజాయ్ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రాత్రి 12గంటలకు పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా వెంకట్‌రెడ్డి అక్కడే ఉండటంతో విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. నిబంధనల మేరకు పురుషులు రాత్రి సమయంలో అక్కడ ఉండటం నిశిద్ధం. అక్కడ పనిచేసే మహిళా సిబ్బందితో చనువుగా ఉండటం కోసమే వెంకట్‌రెడ్డి తరచూ అక్కడ బస చేస్తాడని గుసగుసలు వినపడుతున్నాయి. దీనిపై వెంకట్‌రెడ్డిని వివరణ కోరగా.. విధుల్లో భాగంగానే రాత్రివేళ సఖి కేంద్రంలో ఉన్నానే తప్ప.. తనకు మరో ఉద్ధేశం లేదని తెలిపాడు. చదవండి: అయ్యో! ఎంత ఘోరం.. అనారోగ్యంతో బాబు, ఆవేదనతో తల్లి.. -
అమానవీయం: తల్లిపై కొడుకు అసభ్యకర ప్రవర్తన, లైంగిక వేధింపులు
సాక్షి, వరంగల్: నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లి పట్ల ఓ కామాంధ కొడుకు కొద్దిరోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆగ్రహంతో ఉన్న తండ్రి .. ఆ కొడుకును నరికి చంపాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల శివారు గాజాతండాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. సీరోలు ఎస్ఐ లావుడ్య నరేష్ తెలిపిన కథనం ప్రకారం.. తండాకు చెందిన దారావత్ రమేష్ (36) భార్యాపిల్లలతో నెల్లికుదురు మండలం వావిలాల గ్రామంలో ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం భార్య అతన్ని విడిచి వెళ్లిపోయింది. దీంతో అతను గాజాతండాకు వచ్చి తల్లిదండ్రులు భాషా, అచ్చాలు వద్ద ఉంటున్నాడు. భార్య పోయిందని మద్యానికి బానిసైన రమేశ్ రోజూ ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో తల్లి అచ్చాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం తండ్రి భాషాకు పింఛన్ డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు రావడంతో తండ్రితో గొడవపడ్డాడు. గొడవలు పడుతుండడం, తల్లిని లైంగికంగా వేధిస్తుండడంతో ఆగ్రహంతో ఉన్న తండ్రి భాషా ఇంట్లో ఉన్న గొడ్డలితో కొడుకు రమేష్ గొంతు, మెడపై నరికాడు. రమేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. కొడుకును నరికి చంపిన విషయం తండాలో తెలియడంతో వెంటనే సీరోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై లావుడ్య నరేష్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విషయాన్ని మరిపెడ సీఐ సాగర్‌కు వివరించడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. హత్య చేసిన తండ్రి భాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రెండేళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. కేకలు వేయడంతో..
సాక్షి హయత్‌నగర్: అభం శుభం ఎరుగని రెండేళ్ళ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరు.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గుల్షన్ సహాని (26) పెయింటింగ్ పనులు చేస్తూ హయత్‌నగర్‌లో నివాసముంటున్నాడు. ఈ నెల 12న సమీపంలో నివసించే ఓ రెండేళ్ళ బాలికతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు నిందితున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బస్సు ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి నాగోలు: ఆర్టీసీ బస్సు ఢీకొని రిటైడ్డ్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్బీనగర్ చిత్రలేవుట్ కాలనీలో నివాసం ఉండే కజ్జం మల్లయ్య(76) రిటైర్డ్ ఉద్యోగి. బుధవారం సాయంత్రం శివగంగ కాలనీ నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వైపు పల్సర్ బైక్‌పై తిరిగి వస్తున్నాడు. సిరీస్ రోడ్డు ఎస్బీఐ ఏటీఎం వద్ద యూటర్న్ తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్‌ను వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. దీంతో మల్లయ్య తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్ధితికి చేరుకున్నాడు. స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్‌కు తరలించగా, వైద్యులు పరీక్షించి మల్లయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎల్బీనరగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అల్వాల్‌లో ప్రత్యక్షం.. ఉప్పల్‌లో అదృశ్యం -
యువతిపట్ల అసభ్య ప్రవర్తన.. కారులో ఖాళీ ఉందంటూ వెకిలివేషాలు
సాక్షి, బంజారాహిల్స్: పబ్‌లో పార్టీ ముగించుకుని బయటకు వచ్చిన యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసుల సమాచారం మేరకు.. టోలీచౌకి ప్రాంతానికి చెందిన యువతి(28) సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. మంగళవారం రాత్రి మరో స్నేహితురాలితో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నం. 36లోని రోగ్ క్లబ్ పబ్‌కు విందు కోసం వచ్చింది. చదవండి: (Hyderabad: మసాజ్ సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు) పబ్ మూసిన తర్వాత కిందకు వచ్చిన యువతి వ్యాలెట్ డ్రైవర్ కోసం వేచి ఉన్న సమయంలో అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చారు. ఆమెతో మాటలు కలిపేందుకు ప్రయత్నించడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడారు. తమ కారులో ఖాళీ ఉందంటూ వెకిలివేషాలు వేశారు. దీంతో బాధితురాలు బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (మూడేళ్లు సహజీవనం.. ఇపుడు దూరంగా ఉంటోందని..) -
పెద్దసారు పాడుబుద్ధి.. విద్యార్థినులు బడికి వెళ్లకపోవడంతో..
సాక్షి, హుజూర్నగర్ (నల్గొండ): గురుశిష్యుల సంబంధానికి మచ్చతెచ్చాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన బంధువులు సదరు హెచ్ఎంను నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బడితపూజ చేశారు. ఈ ఘటన చింతలపాలెం మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతలపాలెం మండలం అడ్లూరుకు చెందిన కొందరు విద్యార్థులు పక్క గ్రామమైన తమ్మారం ప్రాథమిక పాఠశాలకు కాలినడకన వెళ్లి చదువుకుంటున్నారు. చదవండి: ఫేస్బుక్ స్నేహం.. అశ్లీల వీడియోలతో మోడల్‌కు బెదిరింపులు రెండు రోజులుగా ఇద్దరు విద్యార్థినులు పాఠశాలకు వెళ్లకపోవడంతో కుటంబ సభ్యులు ఆ అమ్మాయిలను నిలదీశారు. దీంతో వారు హెచ్ఎం అనిల్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. దీంతో వారు హెచ్ఎంను నిలదీయండంతో నిర్లక్ష్యంగా సమాధాన మిచ్చాడు. దీంతో కోపోద్రిక్తులైన వారు ఆయనపై దాడిచేశారు. హెచ్ఎంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హెచ్ఎంపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు. చదవండడి: వీడియో వైరల్: మైనర్ బాలికపై గ్రామస్తుల అకృత్యం.. ప్రియుడితో పారిపోయిందని.. -
Viral: ‘వధువును అవమానించిన వరుడు.. విడిపోవటం మంచిది’
వివాహ వేడుకలో వధువరులు ఉత్సాహంగా ఉంటూ.. అన్ని కార్యక్రమాల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తారు. వధువు, వరుడు ప్రవర్తించే తీరు.. వివాహానికి వచ్చినవారికి కూడా ఉత్సాహన్ని కలిగిస్తుంది. వధువరులు ఇద్దరూ ఒకరిపైఒకరు సంతోషంతో పెళ్లి వేడుకలోనే ప్రేమను కురిపిస్తారు. అయితే కొంతమంది మాత్రం పెళ్లిలో విచిత్రంగా ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించిన వధువరుల వివాహాలు మధ్యలోనే ఆగిపోయినట్లు పలు వార్తల్లో చూశాం. కొన్ని జంటల్లో తమకు వివాహం జరుగుతుందన్న ఆసక్తి అసలు కనిపించదు. అయితే తాజాగా ఓ పెళ్లి వేడుకలో వధువుపై వరుడు ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన రిషెప్షన్ వేదికపై పెళ్లి దండలు మార్చుకునే క్రమంలో పెళ్లి కొడుకు విచిత్రంగా ప్రవర్తించాడు. ఇద్దరు వేదికపై నిల్చోని ఉంటారు. మొదటిగా పెళ్లి కూతురు.. వరుడి మెడలో దండ వేసి అలా నిల్చోని ఉంటుంది. అనంతరం వరుడు దండ వేయటం ఇష్టం లేదన్నట్లుగా దూరం నుంచే వధువుపైకి విసురుతాడు. దీంతో ఆ పూల దండ కిందపడుతుంది. ఇంత జరిగినా వధువు మాత్రం ఎటువంటి స్పందన లేకుండా మౌనంగా అలా నిల్చుండి పోయింది. ఈ ఘటనను చూసిన వివాహానికి వచ్చినవాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఈ వీడియోను అఫిషియల్ వైరల్ క్లిప్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 8వేల మంది వీక్షించారు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు వరుడు ప్రవర్తించినపై కామెంట్లు చేస్తున్నారు. ‘వరుడు.. వధువును అవమానించాడు’, ‘వరుడు చాలా దారుణమైన వ్యక్తిగా ఉన్నాడు.. మీరు ఇప్పుడే విడిపోవటం మంచిది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_viralclips) -
దోమలగూడ: విద్యార్థినులతో కీచక టీచర్ అసభ్య ప్రవర్తన..
సాక్షి, హైదరాబాద్: దోమలగూడలో విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. గగన్ మహల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు పిల్లల ఫోటోలు తీస్తూ తాను చెప్పినట్లు వినాలని వేధింపులకు గురిచేస్తున్నాడు.. కీచక టీచర్ శ్రీనివాస్ పవర్తనతో విద్యార్థినులు స్కూల్‌కు వెళ్లేందుకు భయపడుతున్నారు. రోజురోజుకీ అతడి విచిత్ర చేష్టలు ఎక్కువ అడంతో స్కూల్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఏడుస్తూ కూర్చున్నారు. చదవండి: ముగిసిన నవదీప్ విచారణ: కీలకంగా మారిన ‘పబ్’ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి శ్రీనివాస్‌ను నిలదీశారు. దీంతో కొంతకాలంగా పిల్లలతోపాటు తోటి మహిళా టీచర్లతోనూ అతడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తేలింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తన వైఖరిలో మార్పు రాలేదని చెప్పారు హెచ్ఎం జ్యోతి. కీచక టీచర్ శ్రీనివాస్ దివ్యాంగుడు కావడంతో తల్లిదండ్రులు దాడి చేయకుండా పోలీసులకు అప్పగించారు. చదవండి: హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఎక్కడ? -
వామ్మో.. శివారు ప్రాంతంలో బాలునిపై వికృత చేష్టలు..
సాక్షి, కరీంనగర్‌క్రైం: బాలుడిపై వికృతచేష్టలకు పాల్పడడంతోపాటు ఎవరిౖకైనా చెబితే చంపుతానని బెదిరించిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.1200 జరిమానా విధిస్తూ కరీంనగర్ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం... చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన బాలుడిని 2017 మార్చి 19 తేదీన ఆదే గ్రామానికి చెందిన నూనె రవి అనే వ్యక్తి భూపాలపట్నంలో ఎవరూ లేని శివారు ప్రాంతానికి తీసుకెళ్లి తన మర్మాంగాన్ని బాలుడి నోట్లో పెట్టి వికృతచేష్టలకు పాల్పడ్డాడు. చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. సీఐ సిహెచ్ రమేశ్ కేసును విచారణ చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. సాక్షులను ఏపీపీ వెంగళదాస్ శ్రీనివాస్ విచారించారు. కరీంనగర్ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి మాధవికృష్ణ, నూనె రవికి ఏడేళ్ల జైలుతోపాటు రూ.1200 జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు. -
మియాపూర్: ఐదేళ్ల చిన్నారిని లిఫ్టులోకి లాక్కెళ్లి..
సాక్షి, మియాపూర్: అపార్ట్మెంట్లోకి దూరి అక్కడ ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను లిఫ్టులోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. రాజస్థాన్‌లోని గోరక్‌పూర్‌కు చెందిన గోరక్ ప్రసాద్, రేణుక పదేళ్ల నుంచి మియాపూర్ హాఫీజ్‌పేట్‌లోని మార్తాండనగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ ఇంటిరీయర్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. మూడో కుమార్తె(5) సోమవారం మధ్యాహ్నం దుకాణంలో చాక్లెట్ తీసుకొని అపార్ట్మెంట్ ముందు ఆడుకుంటోంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్మెంట్లోకి వచ్చి చిన్నారిని అపార్ట్మెంట్ లిఫ్టులోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. చిన్నారి ఏడ్చుకుంటూ తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. -
'ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించిన కెపాసిటీ నాది'
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): కరోనా రోగులతో ఆసుపత్రి నిండిపోయింది.. ఇంకా బయటి నుంచి వస్తూనే ఉన్నారు. వైద్యులు, సిబ్బంది క్షణం తీరికలేకుండా సేవలు చేయడంలో మునిగిపోయారు.. ఆక్సిజన్ సకాలంలో అందక ముగ్గురు రోగులు చనిపోయిన ఉదంతం ఇంకా మరవలేదు.. అంతలోనే ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలోకి వచ్చి హల్చల్ సృష్టించారు. వైద్యులను, సిబ్బందిని హడలెత్తించారు. చివరికి పోలీసులకు చిక్కి రిమాండ్ పాలయ్యారు. అసలు విషయమేమిటంటే... తస్కీన్, అమరేందర్ అనే ఇద్దరు వ్యక్తులు యూనిట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ (ఎన్సీఐడీ) పేరిట ఇన్వెస్టిగేషన్ అధికారులుగా అవతారమెత్తారు. ఆదివారం ఆసుపత్రిలో సకాలంలో ఆక్సిజన్ అందక ముగ్గురు రోగులు చనిపోయిన ఘటనను ‘సుమోటోగా స్వీకరించిన’వీళ్లు రెండు రోజులు ఆలస్యంగా మంగళవారం సాయంత్రం ఆ దవాఖాన వద్దకు వచ్చారు. వేర్ ఈజ్ యువర్ సూపరింటెండెంట్..? ఫ్లోర్ ఇన్చార్జ్ షాహీదా వద్దకు వెళ్లి ఆక్సిజన్ ప్లాంట్‌కు దారి అడిగారు. ‘వీ ఆర్ ఫ్రం ఎన్సీఐడీ. వేర్ ఈజ్ యువర్ సూపరింటెండెంట్ ఛాంబర్ అండ్ వేర్ ఈజ్ ఆక్సిజన్ ప్లాంట్’ అంటూ గద్దించారు. వీళ్లు నిజమైన సీఐడీ అధికారులుగా భావించిన ఆమె ప్లాంట్‌కు దారి చూపించారు. వారు తమ ఫోన్లతో అక్కడ ఫొటోలు, వీడియోలు తీశారు. అక్కడ నుంచి రిసెప్షన్ వద్దకు రాగా... అదే సమ యంలో ఓ మహిళా కోవిడ్ రోగి అడ్మిషన్ కోసం వచ్చారు. అయితే నిబంధనల ప్రకారం రోగి రక్తంలో ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గిపోతేనే అడ్మిషన్ ఇవ్వాలి. ఆ మహిళలకు 85 శాతం ఉండటంతో ఆసుపత్రిలో చేర్చుకోవడం కుదరదంటూ సిబ్బంది చెప్పారు. ఇది చూసిన ఈ ఎన్సీఐడీ ద్వయం రెచ్చిపోయింది. అసలు ఈ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది, ప్రతి చోటా లంచం తీసుకుం టున్నారు, డబ్బు ఇవ్వకపోతే అడ్మిట్ చేసుకోవట్లేదు.. అంటూ ఆరోపణలు చేసింది. ఐసీయూలో వైద్యురాలికి బెదిరింపు.. అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు ఐసీయూలోకి దూసుకుపోయి ఫొటోలు, వీడియోలు తీయడం మొదలెట్టారు.. అక్కడ విధుల్లో ఉన్న ఓ వైద్యురాలు వీరిని గమనించి ‘ఎవరండీ మీరు.. ఐసీయూలోకి ఎందుకు వచ్చారు? అంటూ ప్రశ్నించగా.. ‘ఎవతివే నువ్వు? ఉద్యోగం చెయ్యాలని ఉందా లేదా’అంటూ ఆమెపై రంకెలు వేశారు. మా సంగతి మీకు తెలీదంటూ బెదిరింపు.. ఈ హైడ్రామాతో దాదాపు రెండు గంటలపాటు వైద్యులు, సిబ్బంది హడలిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న స్పెషల్ ఆఫీసర్ విజయేంద్ర బోయి అబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డిని అప్రమత్తం చేశారు. ఆయనతోపాటు నారాయణగూడ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు తమ సిబ్బందితో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులను చూశాక కూడా ఆ ఇద్దరూ ‘మా సంగతి మీకు తెలీదు, మేం తలచుకుంటే ఇక్కడ ఎవ్వరూ ఉద్యోగాలు చేయ్యలేరంటూ’బెదిరింపు ధోరణిని ప్రదర్శించారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠాణాకు తరలించి విచారించగా ఎన్సీఐడీకి సంబంధించిన అసలు విషయం బయటపడింది. వైద్యులను దూషించినందుకు, దౌర్జన్యానికి దిగినందుకు కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హల్చల్ చేస్తున్న సమయంలో వీరి వెంట ఉన్నది ఎవరు? వీరితో సంబంధాలు ఏంటి? అనే అంశాలు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ద్వయం గతంలోనూ ఇలాంటి బెదిరింపుల దందాలు చేసిందా? అనేది ఆరా తీస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ పోలీసుల లేఖ నారాయణగూడ పోలీసులు ఇరువురినీ అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఈ ద్వయం గతంలోనే తమ సంస్థను రిజిస్ట్రేషన్ చేయాలంటూ సంబంధిత రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు వీరి వ్యవహారశైలిని వివరిస్తూ, రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. అయితే హల్చల్ చేయడానికి వారు ఇలా యూసీఐడీలుగా అవతారమెత్తారని, ఇక్కడ ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. అసలు వీరెవరంటే... డబీర్పురకుచెందిన మహ్మద్ తస్కీన్ ఆలిండియా సీనియర్ స్పెషల్ ఆఫీసర్, ప్రెసిడెంట్‌గా, మెట్టుగూడ వాసి అమరేందర్ సెక్రటరీగా యూసీఐడీ సంస్థను ఏ ర్పాటు చేశారు. దీన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటూ సంబంధిత రిజిస్ట్రార్‌కు పంపిన దరఖాస్తు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈలోపే విజిటింగ్ కార్డులు ముద్రించుకు న్న ఈ ద్వయం రోడ్లపైకి ఎక్కింది. ఇందు లో యూనిట్ అనే పదాన్ని చిన్నగా... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్‌ను పెద్దగా ఎర్ర అక్షరాలతో ముద్రించారు. అందులోనే వర్కింగ్ ఎగైనెస్ట్ క్రైమ్ అని రాశారు. ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించిన కెపాసిటీ నాది అట్నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ ఛాంబర్‌కు వీళ్లిద్దరూ వెళ్లారు. ఆ సమయంలో ఛాంబర్లో నోడల్ అధికారి డాక్టర్ మల్లిఖార్జున్, అడిషినల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజ వెరోనికా, ఆర్ఎంవో నీరజ ఉన్నారు. వారిని చూస్తూ రెచ్చిపోయిన ఎన్సీఐడీ ప్రెసిడెంట్, సెక్రటరీలు ‘ఆదివారం ఆక్సిజన్ అందక రోగులు ఎందు కు చనిపోవాల్సి వచ్చింది? ఆక్సిజన్ పూర్త య్యే వరకు మీరేం చేస్తున్నారు?’అంటూ చిందులేశారు. అక్కడున్న అధికారులు ‘మీరు ఎవరు?’అంటూ వీరిని ప్రశ్నించారు. దీంతో ‘ఏం సూపరింటెండెంట్.. నన్నే అడుగుతావా? నేను ఎవర్ని అనుకుంటున్నావ్. ఈటల రాజేందర్ లాంటి వాడినే మంత్రి పదవి నుంచి తప్పించిన కెపాసిటీ నాది. మైండ్ యువర్ వర్డ్స్.. నీ అంతుచూస్తా’అంటూ వారిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. -
ఓయో రూమ్‌కు వస్తే ఉద్యోగం ఇస్తా..
సాక్షి, బంజారాహిల్స్: ఉద్యోగం కావాలంటే ఓయో రూమ్‌కు రావాలంటూ ఓ ఉద్యోగి అసభ్యంగా చాటింగ్ చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన యువతి(28) వారం క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని ఓ ఇమ్మిగ్రేషన్ సంస్థలో ఉద్యోగానికి హాజరైంది. ఇక్కడ పని చేస్తున్న మాజీ మేనేజర్ సుమంత్ మూడ్రోజుల క్రితం ఆమెతో చాటింగ్‌లో చేయసాగాడు. ఓయో రూమ్ బుక్ చేశానని ఉద్యోగం అక్కడే ఇస్తానంటూ చెప్పాడు. ఆందోళన చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు ఇమ్మిగ్రేషన్ సెంటర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుమంత్‌పై పోలీసులు ఐపీసీ 509 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: మహిళ ఫిర్యాదు.. యాంకర్ శ్యామల భర్త అరెస్ట్ ) -
డ్యాన్స్ స్కూల్: కొవ్వు తగ్గిస్తానని చెప్పి గదిలోకి తీసుకెళ్లి..
సాక్షి, కంటోన్మెంట్: డ్యాన్స్ స్కూల్లో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిర్వాహకుడిని బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ వెల్లడించిన వివరాల మేరకు తిరులమగిరి దుర్గావిహార్ కాలనీలో నివాసముండే బాలిక బోయిన్పల్లి మార్కెట్ సమీపంలోని అర్బన్ డ్యాన్స్ వరల్డ్‌లో మూడు నెలలుగా శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో సంబంధిత డ్యాన్స్ స్కూల్ నిర్వాహకుడు సుదర్శన్ బాలిక నడుము వద్ద కొవ్వును తగ్గిస్తానని, అందుకు ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8గంటల సెషన్లో వర్కవుట్స్‌కు రావాల్సిందిగా సూచించాడు. దీంతో బాలిక గత నెల 26 నుంచి ఉదయం వేళలో వర్కవుట్స్‌కు వెళ్తోంది. తను ఇచ్చే శిక్షణకు సంబంధించి ఇన్‌స్ట్రాగామ్ రీల్ చేయాల్సి ఉంటుందని బాలికకు సూచించాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం వర్కవుట్స్ సమయంలో డ్యాన్స్ స్కూల్‌కు వచి్చన బాలికను ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మరుసటి రోజు బాలిక ఇంట్లో వాళ్లకు విషయం తెలుపగా డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. చదవండి: భర్త మందలింపు; టైలరింగ్ షాప్‌కు వెళ్తున్నానని చెప్పి.. -
మాదాపూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్ : నిత్యం జన సంచారం ఉండే మాదాపూర్ ప్రాంతం అది. ఓ ఐటీ మహిళా ఉద్యోగిని నడుచుకుంటూ అదే రహదారిపై తాను పనిచేసే కంపెనీకి వెళుతున్నారు. ఇంతలో ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే నిందితుడి చొక్కా పట్టుకొని గట్టిగా నిలదీయడంతో దాడికి యత్నించాడు. అయినా ఆమె భయపడలేదు. ధైర్యంగా ఎదురు దాడి చేసింది. అనంతరం గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అతడిని పట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. సికింద్రాబాద్ వారాసిగూడలో నివాసముంటున్న ఓ మహిళ మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నాలుగు నెలల గర్భిణి అయిన ఆమె రోజూ మాదిరిగానే గురువారం రాత్రి 8 గంటలకు విధులకు వచ్చారు. అనంతరం రాత్రి తొమ్మిది గంటల సమయంలో భర్త తన కంపెనీ వద్దకు రావడంతో ఇద్దరూ కలిసి భోజనం చేసేందుకు సమీపంలోని వైఎస్సార్ చౌరస్తాకు వెళ్లారు. భోజనం అనంతరం భర్త ఇంటికి వెళ్లిపోగా ఆమె ఫోన్లో మాట్లాడుతూ నడుచుకుంటూ సమీపంలో ఉన్న కంపెనీకి బయల్దేరారు. ఇంతలో ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆమె మెడపై చేయి వేసి అసభ్యకరంగా తాకాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆమె తలపైకి ఎత్తి చూడగా అతను అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనించారు. వెంటనే అతడిని వెంబడించి నిలదీసింది. సమాధానం చెప్పకుండా నిందితుడు ఆమెపై దాడికి దిగాడు. ఆమె ఏ మాత్రం భయపడకుండా.. అతడిపై ఎదురు దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. అనంతరం గట్టిగా కేకలు వేయడంతో చుట్టటుపక్కల వారు గమనించి అతడిని పట్టుకున్నారు. వెంటనే బాధితురాలు 100కు ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. -
100కి ఫోన్ చేసినందుకు... కానిస్టేబుల్ వీరంగం
సాక్షి, హైదరాబాద్: అల్లరిమూక గొడవపై డయల్ 100కి ఫోన్ చేసిన ఓ యువకుడిపై సైబరాబాద్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై బాధిత యువకుడి కుటుంబసభ్యులు డీజీపీ, సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. సంబంధిత కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వారికి హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల హెచ్ఏఎల్ కాలనీలో అల్లరిమూక గొడవపై సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఓ వ్యక్తి డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో జీడిమెట్ల కానిస్టేబుల్ కాటేశ్వరరావు కాలనీకి వచ్చి అల్లరిమూకను చెదరగొట్టాడు. ఆ తర్వాత డయల్ 100కి ఫిర్యాదు చేసిన అతడిని ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు పిలిచిన కానిస్టేబుల్ .. ‘అర్థరాత్రి పూట నా నిద్ర ఎందుకు చెడగొట్టావురా? ఎవరు కొట్టుకుని చస్తే నీకెందుకురా?’ అంటూ బూతు పురాణం అందుకున్నాడు. అంతకాకుండా రెండు చెంపలు వాయించి, తిడుతూ జీపులో జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. కుటుంబసభ్యులతో మాట్లాడనివ్వకుండా యువకుడి ఫోన్‌ను కాసిస్టేబుల్ లాక్కున్నాడు. మరోవైపు యువకుడు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనతో అరగంటపాటు కాలనీ అంతా గాలించారు. అయితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాక ఆ యువకుడు మీడియా సంస్థ ఉద్యోగి అని తెలుసుకున్న కానిస్టేబుల్ తిరిగి ఇంటి వద్ద దిగబెట్టాడు. ఈ సంఘటనపై కుటుంసభ్యులు డీజీపీతో పాటు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. డయల్ 100కి ఫోన్ చేస్తే.. ఇంటి నుంచి తీసుకెళ్లి మరీ ఎలా కొడతారంటూ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ వారికి హామీ ఇచ్చారు. -
మహిళా టీచర్లపై అసభ్య ప్రవర్తన
శాలిగౌరారం: మహిళా ఉపాధ్యాయుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరుగురు విద్యార్థులను ఉపాధ్యాయులు చితకబాదారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో జరిగిన ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ స్కూల్లో 708 మంది విద్యార్థులున్నారు. వారిలో 500 మంది పాఠశాల స్థాయిలో ఉండగా, మరో 208 మంది ఇంటర్ విద్యార్థులు. మోడల్ స్కూల్లో 8 మంది మహిళా టీచర్లు ఉన్నారు. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఆరుగురు విద్యార్థులు మహిళా ఉపాధ్యాయుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో విద్యార్థులను ఉపాధ్యాయులు సోమవారం ప్రిన్సిపాల్ చాంబర్లోకి పిలిపించి విచారించారు. చాంబర్‌లోని సీసీ కెమెరాలను నిలిపివేసి ఉపాధ్యాయులు విద్యార్థులను కర్రలతో కొట్టారు. ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో నడవలేని స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ విద్యార్థి నకిరేకల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో విషయం వెలుగులోకి రావడంతో పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మయ్య పాఠశాలను సందర్శించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. -
కీచక గురువు..!
మచిలీపట్నం: విద్యార్థులకు ఫిట్నెస్ పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తన వక్రబుద్ధిని చూపించాడు. కన్నబిడ్డల్లాంటి విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. మచిలీపట్నం మండలం చిన్నాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.సస్పెండ్ ఉత్తర్వులు, డెప్యూటీ డీఈఓ విచారణ నివేదిక మేరకు ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... చిన్నాపురం హైస్కూల్లో వ్యాయామ ఉపా«ధ్యాయుడు(పీడీ)గా పనిచేస్తున్న పి. సాంబశివరావు మాస్టారు చేష్టలు , అసభ్యకరమైన ప్రవర్తన శృతిమించడంతో ఆందోళన చెందిన కొంతమంది విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. సదరు వ్యాయామ ఉపాధ్యాయుడి వ్యవహారం తేల్చేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. విషయం ప్రధానోపాధ్యాయుడి దృష్టికి రావడంతో ఉన్నతాధికారులకు తెలియజేశాడు. బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తడం, ఇదే సమయంలో సదరు వ్యాయామ ఉపాధ్యాయుడు సెలవులో ఉండటంతో దీనిలో నిజాలు నిగ్గు తేల్చేందుకు మచిలీపట్నం డెప్యూటీ డీఈఓ బత్తుల సత్యనారాయణమూర్తి రంగంలోకి దిగారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇతర సహ ఉపాధ్యాయుల నుంచి జరిగిన పరిణామాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది బాలికలతో కూడా ఆయన మాట్లాడి వ్యాయామ ఉపాధ్యాయుడి తీరుపై ఆరా తీశారు. వ్యాయామ ఉపాధ్యాయుడు సాంబశివరావు బాలికలతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడని విచారణలో తేలడంతో దీనిపై సమగ్ర నివేదికను డీఈఓకు అందజేశారు. దిశ ఘటనతో ఓ పక్క దేశవ్యాప్తంగా అట్టుడికిపోతున్న తరుణంలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడంపై జిల్లా విద్యాశాఖాధికారులు తీవ్రంగానే స్పందించారు. సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడంతో పాటు, ముందస్తు అనుమతులు లేకుండా హెడ్ క్వార్టర్‌ను విడిచి వెళ్లకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువు బాలికలతో ఈ రీతిన వ్యవహరించడంపై ఉపాధ్యాయవర్గాల్లో సర్వత్రాచర్చనీయాంశమైంది. వ్యాయామ ఉపాధ్యాయుడు బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా తన విచారణలో తేలిందని డెప్యూటీ డీఈఓ బత్తుల సత్యనారాయణ మూర్తి సాక్షి వద్ద ధ్రవీకరించారు. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
ఇరిగేషన్ అధికారులపై టీడీపీ నేత వీరంగం
సాక్షి, డోన్: పట్టణానికి చెందిన టీడీపీ నేత పుట్లూరు శీను వీరంగం సృష్టించాడు.పెద్దొంక ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన మైనర్ ఇరిగేషన్ అధికారులపై శివాలెత్తాడు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను అటకాయించడమే కాకుండా తన అనుచరులతో కలిసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. పట్టణ శివారులోని వెంకటనాయినిపల్లె రస్తా పక్కన గల పెద్దొంక నీటి పరివాహక ప్రాంతాన్ని కొందరు టీడీపీ నాయకులతో పాటు పుట్లూరు శీను కుటుంబ సభ్యులు కూడా ఆక్రమించారనే అభియోగాలున్నాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు గత 15రోజులుగా పెద్దొంక, బోగందాని వంక నీటి పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను మైనర్ ఇరిగేషన్ అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే మైనర్ ఇరిగేషన్ డీఈ విద్యాసాగర్, ఏఈ నారాయణ, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం సాయంత్రం శీను పొలంలో కొలతలు వేసేందుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అతను తన కుటుంబ సభ్యులను వెంటదీసుకుని వెళ్లి అధికారులపై విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ విషయంపై మైనర్ ఇరిగేషన్ డీఈ విద్యాసాగర్ సోమవారం రాత్రి 8గంటలకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
క్రమ శిక్షణ అంటే ఇదేనా..!
సాక్షి, గుంటూరు: క్రమ శిక్షణకు మారు పేరుగా చెప్పుకునే పోలీస్‌శాఖలో కొందరి కారణంగా ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. మద్యం తాగితే గుట్టు చప్పుడు కాకుండా ఉండాల్సిన కొందరు పోలీసులు, హోంగార్డులు మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి దాడులకు యత్నించడం, ఘర్షణలకు పాల్పడటం లాంటి సంఘటనలు కారణంగా పోలీసులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది. గడిచిన రెండు నెలల్లో జిల్లాలోని గుంటూరు, వినుకొండ, నరసరావుపేట పట్టణాల్లో చోటు చేసుకున్న సంఘటనలు అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రాజధాని జిల్లాలోనే పోలీసులు క్రమశిక్షణ పాటించక పోవడంపై ఎస్పీలు పీహెచ్డీ రామకృష్ణ, ఆర్ జయలక్ష్మిలు సీరియస్‌గా పరిగణిస్తూ సస్పెండ్లు చేస్తున్నా కొందరి తీరులో మాత్రం మార్పు రాక పోవడం విచారకరం. సస్పెండ్లు కొనసాగిందిలా... రెండు నెలల వ్యవధిలో బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహించిన కానిస్టేబుళ్లను వరుసగా ఎస్పీలు సస్పెండ్ చేస్తూ వచ్చారు. గుంటూరులో గాడ్జిల్లా గ్లాసులు రోడ్డు పక్కన విక్రయించే చిరు వ్యాపారి వద్దకు ఓ కానిస్టేబుల్ మద్యం తాగి వెళ్లి డబ్బు ఇవ్వకుండా గాడ్జిల్లా గ్లాసు సెల్‌ఫోన్‌కు వేయాలంటూ దుర్బాషలాడిన సంఘటనపై అర్బన్ ఎస్పీ విచారణ చేపట్టి అతనిని సస్పెండ్ చేశారు. ఇటీవల మరో కానిస్టేబుల్ పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో మద్యం తాగి విధులకు హాజరైన కానిస్టేబుల్‌ను గుర్తించి విచారణలో వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేశారు. నరసరావుపేటలో అర్ధరాత్రి దాటాక కూడా బార్లో మద్యం తాగేందుకు అనుమతించాలంటూ బారు యజమానిపై దాడికి యత్నించిన సంఘటనలో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. నాలుగు రోజుల క్రితం వినుకొండలో ఓ ప్రయివేటు ఫంక్షన్‌కు హాజరైన కానిస్టేబుళ్లు, హోంగార్డులు మద్యం సేవిస్తూ ఘర్షణకు పాల్పడటం ఆపై సీఐకు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకోక పోగా సీఐ చిన్నమల్లయ్య తనను దుర్బాషలాడారంటూ హోంగార్డు స్వేచ్చా కుమార్ డీఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఎస్పీ జయలక్ష్మి నరసరావుపేట డీఎస్పీని ఆదేశించారు. పోలీస్‌బాస్‌లు గస్తీలపై దృష్టి సారించాలి... రాత్రి వేళల్లో నిర్వహిస్తున్న గస్తీలపై పోలీస్‌బాస్‌లు మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పోలీస్‌శాఖలోని ఓ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు బాధ్యతలను కానిస్టేబుళ్లు, హోంగార్డులకు అప్పగించి వెళుతుండటంతో వారు కూడా రికార్డుల్లో సంతకాలకు పరిమితం కావడంతో రాత్రి తనిఖీల్లో కొందరు కానిస్టేబుళ్లు మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నారని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటేనే వారిలో మార్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. -
సోదరి పట్ల అసభ్యకరంగా..
మల్కాజిగిరి: సోదరి వరుసయ్యే బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అన్నను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ సంజీవరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరి పటేల్‌నగర్‌కు చెందిన బాలరాజ్, భాగ్యలక్ష్మి దంపతులు నాచారంలోని ఓ కంపెనీ క్యాంటిన్లో పని చే సేవారు. ఆలేరులో ఉంటున్న తన సోదరుడితో బాలరాజ్‌కు స్ధల వివాదం నడుస్తోంది. మంగళవారం ఈ విషయం మాట్లాడేందుకు అతడి సోదరుడి కుమారుడు సంతోష్ మల్కాజిగిరికి వచ్చాడు. సాయంత్రం స్థలం విషయం మాట్లాడుకున్న అనంతరం బాలరాజ్ భార్యతో కలిసి పనికి వెళ్లాడు. ఆ తర్వాత మద్యం తాగి ఇంటికి వచ్చిన సంతోష్ బాలరాజ్ కుమార్తె పట్ల అసభ్యకంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఈ విషయం తల్లితండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం నిందితుడడు సంతోష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మహిళతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
సాక్షి, నిజామాబాద్ : రక్షించాల్సిన కానిస్టేబులే కీచకుడిగా మారాడు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ విధులకు వచ్చిన కానిస్టేబుల్ దయానంద్ స్థానిక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ఇందల్వాయి మండలం రంజిత్ నాయక్ తాండాలో చోటుచేసుకుంది. కానిస్టేబుల్ ప్రవర్తనతో తండావాసులు ఆందోళన చేపట్టారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఇందల్వాయి పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ దయానంద్‌పై చర్యలకు అధికారులు ఆదేశించారు. అతనిపై వేటు పడే అవకాశం ఉంది. -
బస్సులో అసభ్యకరంగా వ్యవహరిస్తూ..
పనాజీ : దేశవ్యాప్తంగా మీటూ ప్రకంపనలు సాగుతుంటే గోవాలోని బస్సులో ఓ వ్యక్తి తన జననాంగాలు చూపుతూ ఓ యువతి పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ పట్టుబడ్డాడు. బస్సులో బాధిత బాలికకు దగ్గరగా వచ్చిన సదరు వ్యక్తి తన మర్మాంగాలను చూపుతూ అమర్యాదకరంగా ప్రవర్తించాడు. బాలిక పక్కనే మరో మహిళ కూర్చుని ఉన్నా లెక్కచేయని నిందితుడు తనను తాకుతూ వికృతానందం పొందాడని బాధితురాలు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత చేసి పట్టుబడిన అనంతరం పొరపాటుగా ఇదంతా జరిగిందని ఆ వ్యక్తి చెబుతున్నాడని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ ఎస్ఎం కోఆర్డినేటర్ హసిబా అమిన్ ట్వీట్ చేశారు. సిగ్గుమాలిన పనిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు కోరారు. -
నా కూతుర్ని అలా అగిడితే.. ఒక్క పంచ్ ఇస్తా జాగ్రత్త!
‘‘పనికోసం వచ్చే అమ్మాయిలను తమ పలుకుబడి ఉపయోగించి తప్పుగా ప్రవర్తించడం చాలా దారుణం’’ అన్నారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. పని ప్రదేశాల్లో వేధింపుల గురించి సైఫ్ మాట్లాడుతూ– ‘‘వాళ్లకు రక్షణగా ఎవరూ లేరని అసభ్యంగా ప్రవర్తించడం తప్పు. ఒకవేళ నా కూతుర్ని (సారా అలీఖాన్) ఎవరైనా అక్కడికి వచ్చి కలువు.. ఇక్కడికి రా.. అని అడిగితే నేనూ తనతో కలిసి వెళ్లి వాళ్ల మొహం మీద ఒక్క పంచ్ ఇస్తా. ఎవరైనా తనని ఏదైనా అన్నా కూడా వాళ్లు నన్ను కోర్ట్‌లో కలవాల్సి ఉంటుంది. తప్పదు, కానీ నా రియాక్షన్ ఇలానే ఉంటుంది. అలా చేస్తేనే మళ్లీ అలా చేయకుండా ఉంటారు. ప్రతి అమ్మాయికీ ఇలాంటి రక్షణ ఉండాలని కోరుకుంటా’’ అని పేర్కొన్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. సారా అలీఖాన్ ప్రస్తుతం ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’ షూటింగ్ కోసం స్విట్జర్ల్యాండ్లో ఉన్నారు. అజయ్ దేవగన్ హీరోగా చేయనున్న ‘తానాజీ’లో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపిస్తారట. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘సాక్రెడ్ గేమ్స్’ సీజన్ 2 షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నారు సైఫ్. -
విద్యార్థులతో వికృత చేష్టలు.. సృష్టికి విరుద్ధంగా..
సాక్షి, హైదరాబాద్ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బిడ్డలతో సమానంగా చూసుకోవాల్సిన విద్యార్థులతో సృష్టికి విరుద్ధంగా లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. హైస్కూలు ఉపాధ్యాయుడు విద్యార్థులతో వికృతంగా ప్రవర్తించిన సంఘటన రాంనగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాంనగర్‌లోని, రాంనగర్ హైస్కూల్లో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజు గత మూడు రోజులుగా ఏడవ తరగతి విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో సదరు విద్యార్థి స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరిస్తున్నాడు. దీంతో ఆ విద్యార్థి తండ్రి బుధవారం కుమారుడిని బలవంతంగా పాఠశాలకు తీసుకురాగా ఏడుపు మొదలుపెట్టాడు. ఏమైందని గట్టిగా నిలదీయగా అడ్మినిస్ట్రేటర్ రాజు గత మూడు రోజులుగా తన క్యాబిన్‌కు తనను పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపాడు. దీంతో కోపోద్రిక్తుతులైన తల్లిదండ్రులు, బంధువులు రాజుపై దాడి చేయడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. 9వ తరగతికి విద్యార్థిపై కూడా అతను ఇదే విధంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
ఇటలీ యువతి పట్ల యువకుడి అసభ్య ప్రవర్తన
సాక్షి, చెన్నై: చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో శుక్రవారం ఇటలీ యువతి వద్ద అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం హోటట్ సిబ్బంది యువకుడిని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. ఇటలీ దేశానికి చెందిన యువతి ఎలిజిబెత్ (28). ఆమె భర్త చెన్నైలోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం భర్తను చూడడానికి చెన్నైకి వచ్చిన ఎలిజిబెత్ ప్రస్తుతం చెన్నై ఎంఆర్సీ నగర్‌లోని ప్రముఖ స్టార్ హోటల్ ఉంటున్నారు. ఎలిజిబెత్ శుక్రవారం తన భర్తను చూసి మాట్లాడిన తరువాత విశ్రాంతి కోసం హోటల్‌కు వచ్చారు. తన గదికి వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కారు. ఆ సమయంలో అదే లిఫ్టులో ఎక్కిన యువకుడు ఎలిజబెత్ వద్ద అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ యువతి కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది అక్కడికి వచ్చారు. ఆ యుకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పట్టినపాక్కం పోలీసులకు అప్పగించారు. విచారణలో అతను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన హరికుమార్ (28) అని తెలిసింది. అదే ప్రాంతంలోని మరో స్టార్ హోటల్లో జరిగిన తన పెద్దనాన్న కుమార్తె వివాహానికి చెన్నైకు వచ్చినట్టు తెలిసింది. -
వైద్య విద్యార్థినిపై ప్రొఫెసర్ వికృత చేష్టలు
-
యువతితో అసభ్య ప్రవర్తన..
-
అమీర్‌పేట మెట్రో స్టేషన్లో లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం కీర్తి ప్రతిష్టలను మరోసారి దేశవ్యాప్తంగా తెలియచేసిన ఘనత హైదరాబాద్ మెట్రో రైలుది. అలాంటి మెట్రో స్టేషన్లు పలు అసాంఘీక కార్యక్రమాలకు నెలవులుగా మారుతున్నాయి. మెట్రో ప్రారంభమైన నెల రోజులు కాకముందే ఓ ప్రబుద్దుడు యువతుల ఫోటోలు అసభ్యకరంగా తీస్తూ దొరికిన సంగతి మర్చిపోకముందే మరో సంఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌కు చెందిన యువతి గురువారం పనినిమిత్తం జేఎన్టీయూ వెళ్లడానికి మెట్రోరైలు ఎక్కింది. అమీర్‌పేట స్టేషన్ వద్ద ఇంటర్చేంజ్ సమయంలో ఎలా వెళ్లాలంటూ అక్కడ విధులు నిర్వహిస్తున్న నితిన్ రెడ్డిని అడిగింది. మూడో అంతస్తుకు వెళ్లాలని చెప్పిన నితిన్‌రెడ్డి.. ఆమెతోపాటు లిప్ట్‌లో ఎక్కి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేశాడు. ఈ సంఘటతో షాక్ తిన్న యువతి, ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నితిన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. -
వివాహితతో డాక్టర్ అసభ్య ప్రవర్తన
-
బంజారాహిల్స్‌లో యువతిపై రెచ్చిపోయిన పోకిరీలు
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో పోకిరీలు రెచ్చిపోయారు. రోడ్డు నెంబర్ 12లో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను అనకూడని మాటలు అనడంతోపాటు బైక్‌లు దిగి వెళ్లి ఆ యువతిపై చేయి చేసుకున్నారు. దీంతో వారికి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా ఆ యువతి గట్టిగా ప్రతిఘటించింది. ఆమెకు దారిన పోయేవారు కూడా ఆ యువకులను పట్టుకునేందుకు పోగవడంతో ఆ పోకిరీలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ నెల 11న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులకు పోకిరీలు పాల్పడిన దుశ్చర్యలకు సంబంధించిన ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న పోకిరీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారు దొరికిన తర్వాత కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. -
ఎమ్మెల్యే శంకర్ కేసుపై చర్చ
-
హైదరాబాద్‌లో మహిళపై అత్యాచారయత్నం
-
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా సిబ్బందితో అనుచితంగా, వికృతంగా ప్రవర్తించే ప్రయాణికులకు చెక్ పెట్టేందుకు నిర్ణయించింది. ప్రయణీకుల భద్రతే ముఖ్యమైనప్పటికీ, వేధింపులకు దిగిన ప్రయాణికులకు సంకెళ్లు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల సిబ్బందిపై వేధింపుల ఉదంతాలు చోటుచేసు కోవడంతో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటివరకూ అంతర్జాతీయ విమానాల్లో మాత్రమే అనుమతి ఉన్న రిస్ట్రెయినర్స్ ను ఇక మీదట జాతీయ, అంతర్జాతీయ విమానాల్లోకూడా తీసుకెళ్లనున్నట్టు నివేదికలుచెబుతున్నాయి. ఇకమీదట దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులను నియంత్రించేందుకుగాను ప్లాస్టిక్ సంకెళ్లను తీసుకెళ్లనున్నట్టు ఎయిర్ ఇండియీ అధ్యక్షుడు అశ్విన్ లోహాని తెలిపారని రిపోర్ట్ చేశాయి. విమానం, ప్రయాణీకుల భద్రత విషయంలో ఎలాంటి రాజీలేదని తెలిపారు. అదే సందర్బంగా తమ సిబ్బంది రక్షణ కూడా ముఖ్యమే అన్నారు. విమానాల్లో దుష్ప్రవర్తన ఇటీవల కాలంలో బాగా పెరుగుతోందని, తమ పైలట్లు పూర్తి అసహనంతో ఉంటున్నా, లైంగిక వేధింపులు లాంటివి చోటు చేసుకున్నాయని ఆశ్విన్ చెప్పారు. అయితే పూర్తిగా నియంత్రణ కోల్పోయినపుడు మాత్రమే ప్లాస్టిక్ సంకెళ్ల ద్వారా వారిని నియంత్రిస్తామని తెలిపారు. అనంతరం వారిని దర్యాప్తు ఏజెన్సీలకు అప్పగిస్తామన్నారు.కాగా జనవరి 2 న మస్కట్-ఢిల్లీ విమానంలో ఎయిర్ హోస్టెస్ పై లైంగిక దాడి, డిసెంబర్ 21 న ముంబై-న్యూయార్క్ విమానంలో సహ-ప్రయాణీకుడి అనుచిత ప్రవర్తన నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తోంది. -
బాలికపై సర్పంచ్ భర్త అత్యాచారయత్నం
-
మోడల్ స్కూల్లో కీచక ఉపాధ్యాయుడు
-
గిరిజనులపై దుందుడుకు వైఖరి తగదు
రాజవొమ్మంగి ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌పై అఖిల పక్ష నాయకుల నిరసన, రాస్తారోకో పరిష్కారానికి డీజీఎం హామీతో పరిస్థితి ప్రశాంతం రాజవొమ్మంగి : రాజవొమ్మంగి ఆంధ్రాబ్యాంకు మేనేజర్ జనార్థన్ దుందుడుకు వైఖరిని నిరసిస్తూ ఖాతాదారులు, అఖిలపక్ష నేతలు గురువారం ఆందోళనకు దిగారు. దాదాపు రెండు గంటలకు రాస్తారోకో చేశారు. గిరిజనులను విసుక్కోవడం, పాస్ పుస్తకాలను విసిరికొట్టడం వంటి చర్యలతో రెండేళ్లుగా వేధిస్తున్నాడని ధ్వజమెత్తారు. తొలుత ఖాతాదారులు మేనేజర్‌ను కలసి మీ పద్ధతిని మార్చుకోవాలని కోరారు. ఇప్పటికే పెద్దనోట్లు చెల్లక ఖాతాదారులు, స్థానిక గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనికి తోడు మీ తీరు మరింత బాధిస్తున్నదని వివరించారు. దీనితో మేనేజర్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి తనకు రక్షణ కోరారు. పోలీసులు ఆప్రాంతానికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో మేనేజర్ తీరును నాయుకులు, స్థానికులు సీఐ కేఎన్. మోహనరెడ్డి, తహశీల్దార్ పద్మావతి, ఎస్సై రవికుమార్లకు వివరించారు. అలాగే మేనేజర్ జనార్దన్‌ను కలసి అధికారులు సమస్య అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఆంధ్రాబ్యాంకు డీజీఎంను ఫోన్లో సంప్రదించి ఆందోళన వివరించారు. దీనితో శుక్రవారం తాను స్వయంగా రాజవొమ్మంగి వచ్చి పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇవ్వడంతో ఆందోళన కారులు తమ నిరసనను తాత్కాలికంగా విరమించారు. వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దాట్ల వేంకటేష్‌రాజు, చప్పా నూకరాజు, పార్టీ నేతలు శాంతకుమారి, చీడిపల్లి అప్పారావు, ముప్పన మోహన్ కుమార్, చప్పా నూకరాజు, బీజేపీ మండల అధ్యక్షుడు చింతలపూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
9ఏళ్ల బాలికతో యువకుడి అసభ్య ప్రవర్తన
-
అనుప్రియపై దాడి, 158 మందిపై కేసు
ప్రతాప్‌గఢ్: కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో 158 మందిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాణిగంజ్ పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టారు. స్థానిక నాయకుడు వినోద్ దూబే సహా 157 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. అనుప్రియ పటేల్, అప్నా దళ్ కార్యకర్తల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అనుప్రియ పటేల్ ఆదివారం ప్రతాప్‌గఢ్ జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కాన్వాయ్ పై దుండగులు దాడి చేశారు. అధికార సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలే తన కాన్వాయ్‌పై దాడిచేశారని అనుప్రియ ఆరోపించారు. తమ రోడ్ షోను అడ్డుకోవాలన్న కుట్రతో తమపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రినైన తనకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. -
'ఉపాధ్యాయ వృత్తి లో కీచక టీచర్'
-
'నేను వీఐపీని.. నాకు సిగ్నల్ లేదు..తప్పుకో'
-
'నేను వీఐపీని.. నాకు సిగ్నల్ లేదు..తప్పుకో'
న్యూఢిల్లీ: దేశంలో వీఐపీ కల్చర్ పెరిగిపోతోంది. వారి ఆగడాలు రోజుకింత పెరిగిపోతున్నాయి. వారి చేష్టలతో సామాన్య జనాలకు తెగ ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ప్రశ్నించినవారిపై దాడికి సిద్ధపడుతున్నారు. మొన్నటికి మొన్న కేంద్రంమంత్రి మహేశ్ శర్మ కారును ఆపారనే కారణంతో ఆయన ప్రభుత్వేతర సిబ్బంది సెక్యూరిటీ గార్డ్స్ పై దారుణంగా దాడి చేసిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. నోయిడాలో ఈ ఘటన ఆగస్టు 24న జరిగింది. దీనిని రికార్డు చేసిన ప్రశాంత్ సక్సేనా అనే వ్యక్తి తన ఫేస్ బుక్ ఖాతాలో దానిని పోస్ట్ చేయగా సదరు వీఐపీ నిర్వాకంపై పలువురు పెదవి విరుస్తున్నారు. అందులో రికార్డయిన ప్రకారం నోయిడాలోని ఓ చౌరస్తా వద్ద ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడింది. దాంతో అన్ని వాహనాలు ఆగాయి. వాటి పక్కన ఓ కారు ఆగింది. అందులోని ఒక వ్యక్తి అతడి కారు ఎదురుగా ఉన్న ఓ మోటారు సైకిలిస్టును పక్కకు జరగమని అడిగాడు. ఇంకా సిగ్నల్ పడలేదుగా అని అతడు ప్రశ్నించగా తాను వీఐపీనని చెప్పాగా.. అంటు దురుసుగా మాట్లాడాడు. ఈ క్రమంలో అతడిపై దాడి చేసినంత పనిచేశాడు. ఇదంత ఓ కారులో కూర్చుని ఉన్న ప్రశాంత్ తన ఫోన్ లో రికార్డు చేస్తుండగా అతడి కూతురు తండ్రికి చెప్పడంతో రికార్డు చేస్తున్న ప్రశాంత్ పైకి దూసుకొచ్చి ఆ ఫోన్ ను కిందపడేశాడు. నోయిడాలోని సెక్టార్ 57లో ఉదయం 8గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై ఫిర్యాదు
హోసూరు(బెంగళూరు): తాలూకలోని తొరపల్లి అగ్రహారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయుడు శేఖర్ బాలికల మరుగుదొడ్లవైపు చూస్తున్నారన్న ఫిర్యాదు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లిక శనివారం విచారణ చేపట్టారు. తొరపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 198 మంది విద్యార్థులున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వేరు వేరుగా మరుగుదొడ్లను నిర్మించారు. గణిత ఉపాధ్యాయుడు శేఖర్ కొద్ది రోజుల కిందట కెలమంగలం పాఠశాలకు బదిలీ చేయంచుకెళ్లారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని రాజ్యలక్ష్మి కోరిక మేరకు ఆరు నెలల క్రితం మళ్లీ శేఖర్ తొరపల్లి పాఠశాలకు వచ్చాడు. కొద్ది రోజులుగా శేఖర్ విద్యార్థినుల మరుగుదొడ్లవైపు చూస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లిక విద్యార్థులు, తల్లి దండ్రులను విచారణ చేసి శేఖర్‌ను సెలవుపై వెళ్లవలసిందిగా సూచించారు. ఈ సందర్భంగా తొరపల్లి అగ్రహారం గ్రామంలోని పాఠశాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. హోసూరు సబ్ఇన్స్పెక్టర్ సెంధిల్‌కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అసభ్యంగా ప్రవర్తించిన యువకులకు రిమాండ్
బంజారాహిల్స్ : పబ్‌లో పీకలదాకా మద్యం సేవించి యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ గురుస్వామి కథనం మేరకు... సరూర్‌నగర్ ఎర్రకుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ సయీద్(25), చాంద్రాయణగుట్టకు చెందిన అహ్మద్ బిన్ ఇజ్రీస్ జుబాలి(25) ఈ నెల 25న మరో ఇద్దరు స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని కాక్టైల్స్ పబ్‌కు వచ్చి పీకల దాకా మద్యం సేవించారు. పబ్ మూసేశాక సెల్లార్లోకి వచ్చి వాహనాలను తీస్తున్న సమయంలో.. అదే పబ్ నుంచి తన స్నేహితురాళ్లతో కలిసి ఓ యువతి(23) పార్కింగ్ వద్దకు వచ్చింది. తాగిన మత్తులో ఈ నలుగురు కలిసి యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె చెయ్యి పట్టుకొని లాగారు.. అసభ్యంగా దూషించారు. దీంతో బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీల ఆధారంగా సయీద్, జుబాలిని అరెస్టు చేసి వీరిపై ఐపీసీ సెక్షన్ 354(బి), 334, 506ల కింద కేసులు నమోదు చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నా తమ్ముడు అలా చేయడు: సల్మాన్ ఖాన్
ముంబై: జర్నలిస్టు పట్ల దరుసుగా ప్రవర్తించిన తమ్ముడు అర్బాజ్ ఖాన్ ను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వెనకేసుకొచ్చాడు. పెళ్లి వార్తల గురించి తన కుటుంబాన్ని వేధించొద్దని మీడియాను కోరారు. తన తమ్ముడు దురుసుగా ప్రవర్తించలేదని, అతడు ఎప్పుడూ అలా చేయడని అన్నాడు. తల్లిదండ్రులతో కలిసి బాంద్రాలోని ఓ హోటల్ కు గురువారం రాత్రి డిన్నర్ కు వెళ్లిన అర్బాజ్ ఖాన్ ను జర్నలిస్ట్ ఒకరు సల్మాన్ పెళ్లి గురించి అడిగాడు. దీంతో సహనం కోల్పోయిన అర్బాజ్.. జర్నలిస్ట్ పట్ల పౌరుషంగా ప్రవర్తించాడు. తన తమ్ముడు స్థానంలో ఎవరు ఉన్నా అలాగే చేస్తారని సల్మాన్ సమర్థించాడు. తన పెళ్లి వార్తల గురించి తన కుటుంబ సభ్యులు, స్నేహితుల వెంట పడొద్దని విజ్ఞప్తి చేశాడు. తాను ఎప్పుడు పెళ్లి చేసుకునేది ట్విటర్ ద్వారా వెల్లడిస్తానని చెప్పాడు. ప్రియురాలు లులియాను పెళ్లాడేందుకు సల్మాన్ సిద్ధమవుతున్నాడని బాలీవుడ్ లో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. దీనిపై సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. -
అసభ్య ప్రవర్తనతో ఉబర్ డ్రైవర్ అరెస్ట్
బెంగళూరు : ఉబర్ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. మహిళ ప్రయాణికురాలిని వేధించిన ఘటనలో ఉబర్ క్యాబ్ డ్రైవర్‌ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే క్యాబ్ ఎక్కిన తనతో ఉబర్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ మహిళ ట్విట్టర్ ద్వారా తమకు ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. మహిళ ఫిర్యాదుతో క్యాబ్ డ్రైవర్ సురేష్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతడు రెండు నెలల క్రితమే విధుల్లోకి చేరినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలో దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఉబర్ కారు డ్రైవర్ మహిళను దారుణంగా రేప్ చేయటంతో ఢిల్లీ సర్కారు ఏకంగా ఉబర్ పై నిషేధం కూడా విధించిన విషయం తెలిసిందే. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉబర్ డ్రైవర్ల వ్యవహారశైలిపై పలు ఆరోపణలు ఉన్నాయి. -
విద్యార్థులపై దాడి: యువకులు అరెస్ట్
బోడుప్పల్ : బీటెక్ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేసిన ఐదుగురు యువకులను గురువారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతాపూర్ అరోరా కాలేజీలో మహమ్మద్ అతారుద్ధీన్, మహమ్మద్ అజారుద్దీన్, షేక్ మహమ్మద్ జబీబుల్లా బీటెక్ చదువుతున్నారు. బుధవారం సాయంత్రం కాలేజీ వదిలిపెట్టిన తరువాత బస్సు కోసం బస్టాప్‌లో వేచి ఉన్నారు. అయితే పర్వతాపూర్‌కు చెందిన వరికుప్పల సురేష్(21), కొమరె మధు(21), నిమ్మగూడ శ్రీకాంత్‌గౌడ్(21), సుర్వి సంపత్‌గౌడ్ (26), బి. వినోద్ కుమార్ (25)లు వారి పట్ల అసభ్యకరంగా మాట్లాడి దాడి చేశారు. దీంతో వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. వారి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
విద్యార్థినితో అసభ్య ప్రవర్తన, అరెస్ట్
మల్కాజిగిరి : విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఫ్లోర్ ఇన్చార్జిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ నరసయ్య కథనం ప్రకారం... విజయనగరం జిల్లా రావికర్రవలస గ్రామానికి చెందిన వెంకటరమణ అలియాస్ పులి(29) మౌలాలిలోని డాక్టర్ కెకెఆర్ గౌతం పాఠశాలలో నాలుగు సంవత్సరాల నుంచి ఫ్లోర్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని పట్ల గత కొద్ది కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. బాధిత విద్యార్థిని ఈ నెల 11వ తేదీన కుటుంబసభ్యులకు విషయం తెలియజేయడంతో ఆమె తండ్రి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మంగళవారం పాఠశాల వద్దకు వెళ్లి వెంకటరమణను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. -
అమ్మాయిల గదిలోకి వెళ్లి హంగామా...
హైదరాబాద్: తప్పతాగి ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి రాత్రి వేళ అమ్మాయిల గదిలోకి వెళ్లి హంగామా సృష్టించాడు. సోమవారం అంబర్‌పేట ఎస్ఐ మహిపాల్ తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక శంకర్‌నగర్‌కు చెందిన ధృవకుమార్ ఇంట్లో నలుగురు అమ్మాయిలు గది అద్దెకు తీసుకొని ఉంటూ చదువుకుంటున్నారు. ధృవకుమార్ కుమారుడు నిషాంత్(25) సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆదివారం రాత్రి 11.30 ప్రాంతంలో తప్పతాగి ఉన్న నిషాంత్ అమ్మాయిల గదిలోకి చొరబడి అనుచితంగా ప్రవర్తించాడు. అమ్మాయిలు పెద్దగా కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారిని పిలించారు. వారు నిషాంత్‌ను మందలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిషాంత్‌పై నిర్భయ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. విద్యార్థినిపై అఘాయిత్యం.. జీడిమెట్ల: విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. రంగారెడ్డినగర్ డివిజన్ విజయనగర్ కాలనీకి చెందిన బాలిక(14) చింతల్‌లోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈనెల 12న తల్లిదండ్రులు బయటకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై స్థానికుడు రమేష్ (19) లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రమేష్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
రైల్లో పోకిరి వేషాలు: ముగ్గురి అరెస్ట్
కాచిగూడ (హైదరాబాద్) : రైల్లో ప్రయాణీకుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తూ వెకిలి చేష్టలకు పాల్పడిన ముగ్గురు పోకిరీలను కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రైల్వే సిఐ సి.లింగన్న తెలిపిన వివరాల ప్రకారం... ధర్మవరం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైల్లో హర్యానా రాష్ట్రానికి చెందిన ముఖేష్ కుమార్ (23), పర్వీన్ కుమార్ (20), అనూష్ (21)ల పోకిరీ చేష్టలతో విసిగిపోయిన తోటి ప్రయాణీకులు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు. -
అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడి అరెస్ట్
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : పదేళ్ల బాలుడి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పాఠశాల డైరెక్టర్‌ను ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 2వ తేదీన వట్టేపల్లిలోని అర్కామ్ పాఠశాలలో ఓ విద్యార్థి పట్ల పాఠశాలల డైరెక్టర్లలో ఒకరైన ఇలియాస్(25) అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. -
నటితో కపిల్ అసభ్య ప్రవర్తన
ముంబై: 'కామెడీ నైట్ విత్ కపిల్' టెలివిజన్ కార్యక్రమంతో స్టార్ హోదా సంపాదించుకున్న కపిల్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. మరాఠి నటి దీపాలి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించి అభాసుపాలయ్యాడు. తాను చేసిన పనికి ట్విటర్ లో క్షమాపణలు చెప్పాడు. ఇంటర్నేషనల్ మరాఠి ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్-2015 పార్టీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాగినట్టు కనబడిన కపిల్ పలువురు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తనతో డాన్స్ చేయాలని బలవంతపెట్టాడు. మరాఠి నటి దీపాలిని కూడా ఇదే విధంగా బలవంతం చేశాడు. అతడితో డాన్స్ చేసేందుకు ఆమె నిరాకరించింది. 'నాతో డాన్స్ చేయాలని ఉందని కపిల్ చెప్పాడు. కానీ నేను అంగీకరించలేదు. అతడికి దూరంగా వెళ్లిపోయా. కపిల్ ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసినవారితోనే నేను డాన్స్ చేస్తా' అని దీపాలి తెలిపింది. ఈ ఘటనపై కపిల్ శర్మ క్షమాపణ చెప్పాడు. తాను అందరిలాంటి వాడినేనని, తప్పులు చేయడం మానవ సహజమని ట్వీట్ చేశాడు. I fall, I rise, I make mistakes, I live, I learn, I've been hurt but I am alive.i am human, I am not perfect but I am thankful :) — KAPIL (@KapilSharmaK9) November 3, 2015