దోమలగూడ: విద్యార్థినులతో కీచక టీచర్‌ అసభ్య ప్రవర్తన.. | Domalguda Psycho Teacher Miss Behave With Girls Students | Sakshi
Sakshi News home page

దోమలగూడ: విద్యార్థినులతో కీచక టీచర్‌ అసభ్య ప్రవర్తన..

Published Mon, Sep 13 2021 9:17 PM | Last Updated on Mon, Sep 13 2021 9:26 PM

Domalguda Psycho Teacher  Miss Behave With Girls Students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దోమలగూడలో విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. గగన్‌ మహల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో శ్రీనివాస్‌ అనే ఉపాధ్యాయుడు పిల్లల ఫోటోలు తీస్తూ తాను చెప్పినట్లు వినాలని వేధింపులకు గురిచేస్తున్నాడు.. కీచక టీచర్ ‍శ్రీనివాస్‌ పవర్తనతో విద్యార్థినులు స్కూల్‌కు వెళ్లేందుకు భయపడుతున్నారు. రోజురోజుకీ అతడి విచిత్ర చేష్టలు ఎక్కువ అడంతో స్కూల్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఏడుస్తూ కూర్చున్నారు.
చదవండి: ముగిసిన నవదీప్‌ విచారణ: కీలకంగా మారిన ‘పబ్‌’

విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి శ్రీనివాస్‌ను నిలదీశారు. దీంతో కొంతకాలంగా పిల్లలతోపాటు తోటి మహిళా టీచర్లతోనూ అతడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తేలింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తన వైఖరిలో మార్పు రాలేదని చెప్పారు హెచ్ఎం జ్యోతి. కీచక టీచర్‌ శ్రీనివాస్ దివ్యాంగుడు కావడంతో తల్లిదండ్రులు దాడి చేయకుండా పోలీసులకు అప్పగించారు.
చదవండి: హైదరాబాద్‌: వినాయక నిమజ్జనం ఎక్కడ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement