domalaguda
-
Ramakrishna Math: రామకృష్ణ మఠంలో స్వర్ణోత్సవ సంబరాలు!
హైదరాబాద్: రామకృష్ణమఠం 50 వసంతాలు పూర్తిచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని బేలూర్ మఠానికి అనుబంధంగా భారతదేశంలో, విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి. భాగ్యనగరంలో 1973లో రామ కృష్ణ మఠం స్థాపించారు. దోమల్‌గూడలో ఉన్న ఈ మఠం 2023 డిసెంబర్లో 50 సంవత్సరాలను పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలను జరుపుకోవడానికి సిద్ధమయింది. స్వర్ణోత్సవాల సందర్భంగా.. ఈ నెల 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానంద.. మూర్తిత్రయం ఆదర్శాలతో ప్రపంచ వేదికలపై భారతీయతను చాటుతున్న మహోన్నత సేవా సంస్థ రామకృష్ణ మఠం. మానవసేవే.. మాధవ సేవగా ఇటు ఆధ్యాత్మిక సౌరభాలను, అటు సామాజిక సేవను నలుదిశలా వ్యాప్త చేస్తోంది. స్వర్ణోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శ్రీశ్రీ చండీ హోమం, భజనలు, మ్యూజిక్ కన్సార్ట్, బహిరంగ సభ వంటి ఈ ఆధ్యాత్మిక సంబరాల్లో పాల్గొనాల్సిందిగా హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు బోధ మయానంద పిలుపునిచ్చారు. ఇవి చదవండి: Sadhvi Bhagawati Saraswati: హాలీవుడ్ టు హిమాలయాస్ -
చివరికి మిగిలింది విషాదమే
గాందీ ఆస్పత్రి: దోమలగూడ వంట గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కాలిన గాయాలతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అయిదుగురిలో ముగ్గురు శుక్రవారం మృతి చెందారు. ధనలక్ష్మి, పద్మ, అభినవ్‌లు శుక్రవారం మరణించగా, బుధవారం శరణ్య మృతి చెందింది. దోమలగూడ రోజ్‌గార్ కాలనీకి చెందిన పద్మ అనే మహిళ బోనాల వేడుకలకు పద్మారావునగర్ బాపూజీనగర్‌లో నివసిస్తున్న కుమార్తె ధనలక్ష్మి, ఎల్బీనగర్లో ఉంటున్న సొంత చెల్లెలు నాగమణి కుటుంబాలను ఆహా్వనించింది. ధనలక్ష్మితోపాటు భర్త లాలాజీ శ్యామ్, కుమార్తె శరణ్య, కుమారులు అభినవ్, విహాన్‌లు, చెల్లెలు నాగమణి, భర్త ఆనంద్‌లు ఈ నెల 10న రోజ్‌గార్ కాలనీలోని పద్మ ఇంటికి చేరుకున్నారు. మంగళవారం పిండివంటలు చేసేందుకు స్టవ్‌ను వెలిగించగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఒకే గదిలో ఉన్న ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. అదే సమయంలో అల్లుడు శ్యామ్ బయటకు వెళ్లడంతో ప్రమాదం నుంచి బయట పడ్డాడు. మంటలను అదుపుచేసి గాయపడిన ఏడుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న క్షతగాత్రులను పీఐసీయూ, టీఎంటీ, బర్న్స్వార్డుల్లో వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. చికిత్స పొందుతూ బుధవారం శరణ్య (7), శుక్రవారం పద్మ (53) ధనలక్ష్మి (29) అభినవ్ (8) మృతి చెందారు. నేను ఎవరి కోసం బతకాలి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో పద్మారావునగర్ బాపూజీనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు, కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. అత్త, భార్య, ఇద్దరు పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని, మరో చిన్నారి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడని తాను ఇంకా ఎవరికోసం బతకాలని శ్యామ్ కన్నీటి పర్యంతమయ్యాడు. పోస్టుమార్టం అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను బాపూజీనగర్‌కు తరలించి ముషీరాబాద్ మొరంబంద శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. గాయపడిన మరో చిన్నారి విహాన్ (3) ఆల్వాల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు ఆనంద్, నాగమణిల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. -
దోమలగూడ: విద్యార్థినులతో కీచక టీచర్ అసభ్య ప్రవర్తన..
సాక్షి, హైదరాబాద్: దోమలగూడలో విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. గగన్ మహల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు పిల్లల ఫోటోలు తీస్తూ తాను చెప్పినట్లు వినాలని వేధింపులకు గురిచేస్తున్నాడు.. కీచక టీచర్ శ్రీనివాస్ పవర్తనతో విద్యార్థినులు స్కూల్‌కు వెళ్లేందుకు భయపడుతున్నారు. రోజురోజుకీ అతడి విచిత్ర చేష్టలు ఎక్కువ అడంతో స్కూల్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఏడుస్తూ కూర్చున్నారు. చదవండి: ముగిసిన నవదీప్ విచారణ: కీలకంగా మారిన ‘పబ్’ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి శ్రీనివాస్‌ను నిలదీశారు. దీంతో కొంతకాలంగా పిల్లలతోపాటు తోటి మహిళా టీచర్లతోనూ అతడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తేలింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తన వైఖరిలో మార్పు రాలేదని చెప్పారు హెచ్ఎం జ్యోతి. కీచక టీచర్ శ్రీనివాస్ దివ్యాంగుడు కావడంతో తల్లిదండ్రులు దాడి చేయకుండా పోలీసులకు అప్పగించారు. చదవండి: హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఎక్కడ? -
చైన్ స్నాచింగ్ అంటూ హైడ్రామా.. కథ భలే అల్లింది!
సాక్షి, హిమాయత్‌నగర్: తన చైన్ స్నాచింగ్ అయిందంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసులు అలర్ట్ అయ్యారు. గంటలోపే ఆమె చెప్పింది కట్టుకథని అని తేల్చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...దోమలగూడ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఓ మహిళ జ్యువెలరీస్‌లో హౌస్ కీపర్‌గా పనిచేస్తుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు పని పూర్తి చేసుకొని తెలుగు అకాడమీ లేన్‌లో నుంచి నడుచుకుంటూ వస్తుండగా రాంగ్రూట్లో బైక్‌పై వచ్చి ఇద్దరు యువకులు.. ఓ అడ్రస్ చెప్పమని అడుగుతూ తన మెడలోని మూడు తులాల బంగారపు పుస్తెల తాడును లాక్కుని పరారైనట్లు పోలీసులకు ఆమె తెలిపింది. అయితే, సీసీ కెమెరా ఫుటేజీలను గమనించిన నారాయణగూడ ఇన్స్పెక్టర్ భపతి గట్టుమల్లు ఆమె చెప్పేది కట్టుకథ అని, ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసిందని గుర్తించారు. ఆమెను ప్రశ్నించగా.. చేసిన తప్పును ఒప్పుకుంది. డబ్బులు అవసరం కావడంతో తనతో పనిచేసే ఓ వ్యక్తికి పుస్తెల తాడును కుదవ పెట్టమని ఇచ్చానని, రెండు, మూడు రోజుల్లో కుదవ పెట్టి రూ.30వేలు తెస్తానని మాట ఇచ్చాడని చెప్పింది. డబ్బులు ఆలస్యం అవుతుండటంతో తన అవసరాన్ని తీర్చుకోవడానికి ఈ కట్టుకథ అల్లిందని ఇన్స్పెక్టర్ గట్టుమల్లు వెల్లడించారు. చదవండి: మరియమ్మ కుమారుడికి ఉద్యోగం, రూ.35 లక్షల చెక్కు -
ఆ ఆస్పత్రి పరిసరాల్లో భయం భయంగా..
సాక్షి, హైదరాబాద్: అంతార్జతీయ విమాన సర్వీసులు రద్దు చేసి నేటికి వారం రోజులైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా రద్దు చేసింది. ప్రస్తుతం విదేశాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ 14 రోజులు. ఇది మరో వారం రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం 25 వేల మంది క్వారంటైన్లో ఉన్నారు. వీరిలో ఎంత మందికి లక్షణాలు బయట పడనున్నాయి..? వీరి నుంచి మరెంత మందికి వైరస్ విస్తరించి ఉంటుంది..? వంటి ప్రశ్నలకు రాబోయే ఈ వారం పది రోజుల్లో జవాబు దొరుకుతుంది. వచ్చే కేసులను బట్టే వైరస్ వ్యాప్తి ఏ దశలో ఉందనే అంశంపై ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత సంఖ్యతో పోలిస్తే రాబోయే వారం పది రోజుల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సామాజిక బాధ్యతలకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, ఇదొక్కటే వైరస్‌కు విరుగుడుకు మార్గమని సూచిస్తున్నారు. (కరోనా: ధోని విరాళం రూ. లక్ష.. సిగ్గు పడండి!) ఆ ఆస్పత్రి పరిసరాల్లో భయం భయంగా.. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 59 పాజిటివ్ కేసులు నమోదైతే..వీటిలో అత్యధికంగా 40పైగా కేసులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే కావడం విశేషం. గురువారం దోమలగూడకు చెందిన డాక్టర్ దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, తాజాగా శుక్రవారం ఆయన తల్లికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో గ్రేటర్లో ఇప్పటి వరకు లోకల్ కాంటాక్ట్‌ల సంఖ్య ఆరుకు చేరింది. ఇదిలా ఉంటే డాక్టర్ దంపతులకు వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో సోమాజిగూడలోని ఆయన పని చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రిలో ఇప్పటికే చికిత్స పొందుతున్న రోగులు, వారికి సహాయంగా వచ్చిన బంధువులు, ఇతర వైద్య సిబ్బందితో పాటు ఆస్పత్రి చుట్టు పక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసుల్లో ఆందోళన మొదలైంది. (కరోనా : డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!) కార్పొరేట్ వైద్యులపై విమర్శల వెల్లువ.. నగరంలో అనేక కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ప్రముఖ వైద్య నిపుణులు ఉన్నారు. కానీ వీరిలో ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా పాజిటీవ్ బాధితులకు, అనుమానంతో వస్తున్న బాధితులకు చికిత్స అందించేందుకు ముందకురాక పోవడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీ, ఫీవర్, ఛాతి ఆస్పత్రుల్లో చికిత్సలు అందిస్తున్న ప్రభుత్వ వైద్య సిబ్బందిపై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇదిలా ఉంటే నగరంలో ఒక్కో కార్పొరేట్ ఆస్పత్రికి ఒకే పేరుతో రెండు మూడు బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వనరులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కానీ వాటిని వదిలేసి కరోనా చికిత్సల పేరుతో పేదలు చికిత్స పొందే గాంధీని పూర్తిగా ఖాళీ చేసి వాటిని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. (తెలంగాణ: ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్) ఇదిలా ఉంటే విదేశాల నుంచి వచ్చిన వారిని సెల్ఫ్ క్వారంటైన్ చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలను జీహెచ్ఎంసీ, పోలీస్, అధికారుల బృందం రెడ్‌జోన్‌గా ప్రకటించింది. ఇలా రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు తగిలించారు. ఆ నివాసాల్లోకి ఎవరూ వెళ్లవద్దంటూ కచ్చితమైన సూచనలు జారీ చేశారు. నిత్యం ఆ ప్రాంతాలు తమ పర్యవేక్షణలో ఉంటాయని సూచిస్తున్నారు. ఇలా కోవిడ్–19 క్వారంటైన్ రెడ్‌జోన్ బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో చుట్టుపక్కల నివాసితులు అప్రమత్తంగా ఉండి ఆ ప్రాంతాల సమీపంలోకి వెళ్లకూడదని అధికారులు పేర్కొంటున్నారు. చందానగర్, కోకాపేట, గచ్చిబౌలి..తుర్కయాంజల్, కొత్తపేట రెడ్ జోన్లో ఉన్నాయి. (ఒకేరోజు 14 మందికి కరోనా పాజిటివ్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డాక్టర్ దంపతులకు కరోనా పాజిటివ్..
-
డాక్టర్ దంపతుల నుంచి మరెంత మందికో..?
సాక్షి, హైదరాబాద్: ఒకరి తర్వాత మరొకరు కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఇప్పటి వరకు 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 27 కేసులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే కావడం విశేషం. విదేశాలకు వెళ్లి వచ్చిన నేపథ్యం లేకపోయినప్పటికీ ఒక భార్య....ఒక కుమారుడు....ఇంకొక తల్లి ....ఇలా కరోనా వైరస్ భారిన పడ్డారు. తాజాగా దోమలగూడకు చెందిన డాక్టర్ దంపతులు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు శంషాబాద్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించే మరో స్టాఫ్ నర్సు కూడా కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. (డాక్టర్ దంపతులకు కరోనా పాజిటివ్) స్వీయ నియంత్రణ పాటించక పోవడం, నిర్లక్ష్యంగా ఉండటం మూలంగా పలు థర్డ్ కాంటాక్ట్ కేసులకు కారణమైంది. కుటుంబ సభ్యుల ప్రాణాలను పణంగా పెడుతుంది. ఇంట్లోని వారు ఒకరి తర్వాత మరొకరు ఆస్పత్రుల్లో చేరుతుండటం, వీరిలో ఇప్పటికే చాలా మంది విచ్చలవిడిగా బయట తిరగడం, బంధువులు, స్నేహితులు, ఇతరుల మధ్య గడపడంతో ఈ వైరస్ మరెంత మందికి విస్తరించి ఉంటుందనే విషయాన్ని క్లోజ్ కాంటాక్ట్ కేసులను పరిశీలిస్తున్న వైద్యులు కూడా అంతుబట్టడం లేదు. మార్కెట్లు, నిత్యవసరాలంటూ స్వీయ నియంత్రణ పాటించకుండా ఇలాగే విచ్చలవిడిగా తిరిగితే..భవిష్యత్తులో భారీ విపత్తులనే చవిచూడాల్సి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. (కరోనా మూడో దశకు చేరుకుంటే?) డాక్టర్ దంపతుల నుంచి మరెంత మందికో..? తాజాగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన డాక్టర్ దంపతులు దోమలగూడలో ఉంటున్నారు. నిజానికి వీరు కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న గాంధీ, ఫీవర్, ఛాతి ఆస్పత్రుల్లో పని చేయడం లేదు. సోమాజిగూడలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. కరోనా బాధితులకు చికిత్స చేయకుండా, విదేశాలకు వెళ్లి వచ్చిన నేపథ్యం కూడా లేకుండా వీరికెలా వైరస్ సోకిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. ఆస్పత్రిలో వీరు ఎంత మందితో కలిసి పని చేశారు? ఎంత మంది రోగులను పరీక్షించారు? ఏ ఏ రోగులు ఎక్కడెక్కడ ఉంటున్నారు? ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? కుటుంబ సభ్యుల్లో ఎంత మంది వీరికి క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్నారు..? వంటి ప్రశ్నలకు వైద్య ఆరోగ్యశాఖ వద్ద ఇప్పటి వరకు సమాధానం లేదు. (మీకు అర్థమవుతోందా?) నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు నగరానికి నాలుగు వైపులా ఉన్న విజయవాడ, వరంగల్, బెంగళూరు, ముంబై జాతీయ రహదారులపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా సరిహద్దు జిల్లాల నుంచి కూడా ఇతరులెవరూ సిటిలోపలికి రాకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. శివారుల్లోనే కాదు కోర్ సిటీల్లోనూ ఎక్కడిక్కడ దార్లను మూసివేశారు. శివార్లలోని పలు కాలనీల్లో రోడ్లకు అడ్డంగా పెద్దపెద్ద రాళ్లు, చెట్ల కొమ్మలు నరికి వేశారు. అయినప్పటికీ కొంత మంది యువకులు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. కనీసం మాస్క్ కూడా ధరించడం లేదు. వైరస్‌పై అంతో ఇంతో అవగాహన ఉన్నవాళ్లు...ఉన్నత చదువులు చదు వుకున్న యువతే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే....వైరస్‌ను ఎలా నియంత్రించగలమని వైద్యనిపుణులు ప్రశ్నిస్తున్నారు. (లాక్డౌన్: ఏంటి సర్.. మీకిది కూడా తెలియదా?) గాంధీ ఎమర్జెన్సీ కేసులు ఉస్మానియాకు షిఫ్ట్ః గాంధీ జనరల్ ఆస్పత్రిలో కరోనా నోడల్ సెంటర్ ఉండటం, అనుమానిత లక్షణాలతో బాధపడుతూ చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం, ఐసోలేషన్ వార్డులో 30కిపైగా పాజిటివ్ ఉన్నవారు చికిత్స పొందుతుండటం, అత్యవసర విభాగానికి వచ్చే రోగులకు వైరస్ విస్తరించే ప్రమాదం ఉండ టంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వివిధ రోడ్డు, ఇతర ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు సహా గుండె, కాలేయ, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం అత్యవసర విభాగాలకు చేరుకుంటున్న రోగులను ఇకపై ఉస్మానియాకు తరలించాలని నిర్ణయించింది. ఆ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
పాత పద్ధతిలోనే ‘గ్రూప్స్’ పరీక్షలు నిర్వహించాలి
దోమలగూడ: ప్రభుత్వం గ్రూప్–1, 2, 3 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలు అన్లైన్లో కాకుండా పాత పద్ధతినే నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేదంటే సర్వీస్ కమిషన్ కార్యాలయన్ని ముట్టడించి చైర్మన్‌ను కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. ఇందిరాపార్కు వద్ద ఏపీ, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిరుద్యోగులు ధర్నా చేశారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2కు మల్టీ సెషన్స్ పద్ధతిలో నిర్వహించడాన్ని వ్యతిరేకించారు. దీని వల్ల ఐదేళ్లుగా పాత పద్ధతిలో సిద్ధమవుతున్న వారికి అన్యాయం జరుగుతుందన్నారు. సంస్కరణలు, మార్పులను రెండు, మూడేళ్ల ముందే ప్రకటించి, అభిప్రాయాలు సేకరించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాత పద్ధతిలోనే గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే విధానం పాటించాలని విజ్ఞప్తి చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికలల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండున్న ఏళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయక పోవడం దారుణమైన మోసమని విమర్శించారు. ధర్నాలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాసు తదితరులు మాట్లాడారు. -
ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం తగదు
దోమలగూడ: ఉద్యోగాల భర్తీలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రాష్ట్రాల నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్, బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారన్నారు. నిధులు, నియామకాలు, నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని, నేడు నిధులు కాంట్రాక్టర్లకు భోజ్యమయ్యాయని, నియామకాలు గాలికి, నీళ్లను సముద్రానికి వదిలేశారన్నారు. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం 3 వేల ఇంజనీరింగ్ పోస్టులను మాత్రమే భర్తీ చేయడం దారుణ మన్నారు, గ్రూపు2 సర్వీసు ఉద్యోగాలను నోటిఫై చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. గ్రూపు 1నోటిఫికేషన్లు విడుదల చేయలేదని, టీచర్ల పోస్టులు భర్తీ చేయడం లేదని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం 10 వేల టీచర్ల పోస్టులు మినహా ఒక్క పోస్టు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు గుణపాఠం తప్పదని హెచ్చరిం చారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌గౌడ్, కృష్ణ, రాజేందర్, కృష్ణయాదవ్, శ్రీనివాస్, కి షోర్, రాజు, గంగనబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
దోమలగూడ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే అమలు చేసే వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు అన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దుచేయాలని కోరుతూ టీసీపీఎస్ఈఎ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయులు మహాధర్నా నిర్వహించారు. టీజీఎ అధ్యక్షులు, ఎమ్మేల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, జనార్దన్‌రెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు నర్సిరెడ్డి, చావ రవి, పీఆర్టీయూ నాయకులు హర్షవర్ధన్‌రెడ్డి, నరోత్తమరెడ్డి, ఎస్టీయూ నాయకులు భజంగరావు, సదానందగౌడ్, ఆర్‌యూపీపీ అధ్యక్షులు అబుల్లా తదితరులు సంఘీభావం ప్రకటించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ యూపీఎ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాల్లో చీకట్లు నింపిందన్నారు. సీపీఎస్ విధానం అమలుతో ఉద్యోగం వచ్చిందన్న సంతోషం లేకుండా పోయిందన్నారు. సీపీఎస్ రద్దుపై వచ్చే అసెంబ్లీ మాట్లాడుతానని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి తీర్మానం చేసేలా కృషి చేస్తానన్నారు. సీపీఎస్ రద్దు విషయాన్ని ఇప్పటికే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుళ్లానని, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్కొన్నారు. కృష్ణకుమార్ మాట్లాడుతూ సీపీఎస్ విధానం అమలు కోసం బీకే భట్టాచార్య కమిటీ ఇచ్చిన నివేదిక లోపభూయిష్టమైందన్నారు. సీపీఎస్ ఉద్యోగికి, అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేకపోవడంతో సీపీఎస్ కుటుంబాలకు భద్రత, సంక్షేమం లేదన్నారు. ఉద్యోగులు మరణించినా, పదవీ విర మణ చేసిన తర్వాత కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. సమైఖ్య రాష్ట్రంలో ఇచ్చిన జీవో 653, 654, 655 లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెల్కిచర్ల రవి, వీరేశం, దర్శన్‌గౌడ్, బుచ్చన్న, దేవయ్య, శ్రీధర్, సునీల్‌కుమార్, బషీర్, సురేష్, సీహెచ్ సంతోష్, శ్రీనివాస్, సుధాకర్, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీతో విద్యారంగంపై ప్రభావం
దోమలగూడ: నాణ్యమైన విద్యను అందించాలనే ప్రజల అకాంక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గత విద్యా విధానాన్నే అవలంబిస్తే తెలంగాణ సాధించుకుని ఏం లాభమని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రభుత్వ బడుల మూసివేతను వ్యతిరేకిస్తూ, ‘రేషనలైజేషన్‌ను అడ్డుకుందాం.. విశ్వవిద్యాలయాలను కాపాడుకుందాం’ పేరుతో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యావిధానం కార్పొరేట్, సామ్రాజ్యవాద శక్తులకు ఊడిగం చేసేలా ఉందన్నారు. తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక టాక్స్ విధించి విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఎస్టీ బిల్లు విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వ విద్యా బోధన సరిగా జరగదని కార్పొరేట్, మార్కెట్ శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. వీసీలను నియమించకుండా, నిధులు ఇవ్వకుండా యూనివర్సిటీలను ధ్వంసం చేస్తున్నారని, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 12 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రొఫెసర్ కె చక్రధరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ప్రైవేట్ విద్యా సంస్థలను పోషిస్తుందన్నారు. ప్రభుత్వం ఆర్ధిక లావాదేవీలు జరిగే రంగాలనే ప్రోత్సాహిస్తుందని, విద్యరంగం బలోపేతం పట్ల నిబద్దత లేదని అన్నారు. కేంధ్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం పేరుతో ప్రైవేటీకరణను, విదేశీ సంస్థల పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు హిందూత్వ ఆలోచనలను రుద్దాలని చూస్తుందన్నారు. ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, కామన్ స్కూలు విధానాన్ని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
సమన్యాయంపైనే మానవజాతి మనుగడ
దోమలగూడ, న్యూస్‌లైన్: సమాజంలో అసమానతలు పోవడానికి స్ఫూర్తి కాళోజీ రచనలేనని, వాటిని ఆకళింపు చేసుకుని ఆచరణలో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ బి. సుభాషణ్‌రెడ్డి అన్నారు. దోమలగూడలోని హైదరాబాదు స్టడీసర్కిల్ ఆడిటోరియంలో కాళోజీ శత జయంత్యుత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. కాళోజీ ఉత్సవ్ సమాచార పత్రిక మొదటి, రెండవ సంచికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమన్యాయం పైనే మానవ జాతి మనుగడ ఆధారపడి ఉందన్నారు. సమన్యాయం ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో రాసుకున్నా.. ఇంకా అసమానతలే కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో భూ సంస్కరణలు, అర్బన్‌ల్యాండ్ సీలింగ్ అమలులోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా సేద్యం చేసుకోవడానికి ఎకరం భూమి, ఇల్లు కట్టుకోవడానికి వంద గజాల స్థలం లేని ఎంతోమంది పేదలు ఉన్నారని అన్నారు. చట్టాలు చేస్తున్నా వాటిలో లోపాలు, లొసుగులు, జాప్యాలతో న్యాయం జరగడం లేదని వాపోయారు. జాతి సంపద దోపిడీకి గురవుతోందని, మానవ వనరులను కొద్దిమందే అనుభవిస్తున్నారన్నారు. కార్యక్రమానికి కాళోజీ శత జయంత్యుత్సవ కమిటీ చైర్మన్ బి. న ర్సింగరావు అధ్యక్షత వహించగా.. ప్రొఫెసర్ కేశవ్‌రావ్ జాదవ్, ప్రముఖ కవి, విమర్శకులు డాక్టరు అంబటి సురే ంద్రబాబు, కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధి టి. ప్రభాకర్, ‘కాళోజీ ఉత్సవ్’ పత్రిక సంపాదకులు వేణు సంకోజు, జలంధర్‌రెడ్డి, ఎ. వేణుగోపాల్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
నేటినుంచి అధిక ధరలపై పోరు
దోమలగూడ,న్యూస్‌లైన్: రానున్న ఎన్నికల్లో ప్రజావ్యతిరేక కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని, అది కూడా లెఫ్ట్ పార్టీల నాయకత్వంలో రావాలని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీఎంపీ అబనీరాయ్, రాష్ట్రకార్యదర్శి జానకిరాములు అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓ హోటల్లో ఈనెల 11,12,13 తేదీల్లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశ వివరాలను బుధవారం దోమలగూడ ఎస్ఎంఎస్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారని, కాంగ్రెస్, బీజేపీలను పక్కకు పెట్టడడమే ఇందుకు నిదర్శనమన్నారు. వామపక్షాలు కూడా ప్రజాసమస్యలపై నిత్యం ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రజామద్దతు అనుకున్నంత కూడగట్ట లేకపోతున్నామని, దీనిపై ఆలోచన చేయాల్సిన ఆవశ్యత ఉందన్నారు. ధరల పెరుగుదలపై ఈనెల 16 నుంచి 31 వరకు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. రాష్ట్రం విడిపోకూడదనేదే తమ పార్టీ విధానమని, అదే క్రమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తున్నట్లు వారు చెప్పారు. పార్టీ యువజన విభాగమైన ఆర్వైఎఫ్ జాతీయ మహాసభలు మార్చి 2 నుంచి ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.