
ముంబై: లండన్ నుంచి ముంబై వస్తున్న విమానంలో భారత సంతతికి చెందిన అమెరికన్ రచ్చ రచ్చ చేశాడు. వాష్‌రూంకెళ్లి సిగరెట్ కాల్చాడు. దీంతో అలరాం మోగగా సిబ్బంది వెళ్లి అతడి వద్ద నుంచి సిగరెట్ లాక్కుని పడేశారు. విమానంలో స్మోకింగ్ చేయొద్దని నిబంధనలు ఉన్నా.. ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించారు.
అయితే అతడు మాత్రం చేసినపనికి సిగ్గుపడకుండా సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. వారితో దురుసుగా ప్రవర్తించాడు. అయితే ఎలాగోలా అతడ్ని తీసుకెళ్లి సీటులో కూర్చోబెట్టారు. కానీ అతను మాత్రం ఊరుకోకుండా విమానం డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా అతడు ఊరుకోలేదు. దీంతో అతడి కాళ్లు చేతులు, కట్టేసి సీటులో కూర్చొబెట్టారు. విమానంలో రచ్చ రచ్చ చేసిన ఇతని పేరు రమాకాంత్. వయసు 37 ఏళ్లు. ముంబై చేరుకున్నాక విమానాశ్రయంలో పోలీసులకు ఇతడ్ని అప్పగించారు. ఈ ఘటనపై వారు కేసు నమోదు చేసుకున్నారు.
చదవండి: జానపద గాయకుడిపై కరెన్సీ నోట్ల వర్షం.. వీడియో వైరల్..