
సాక్షి, చెన్నై: చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో శుక్రవారం ఇటలీ యువతి వద్ద అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం హోటట్ సిబ్బంది యువకుడిని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. ఇటలీ దేశానికి చెందిన యువతి ఎలిజిబెత్ (28). ఆమె భర్త చెన్నైలోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం భర్తను చూడడానికి చెన్నైకి వచ్చిన ఎలిజిబెత్ ప్రస్తుతం చెన్నై ఎంఆర్‌సీ నగర్‌లోని ప్రముఖ స్టార్ హోటల్ ఉంటున్నారు.
ఎలిజిబెత్ శుక్రవారం తన భర్తను చూసి మాట్లాడిన తరువాత విశ్రాంతి కోసం హోటల్‌కు వచ్చారు. తన గదికి వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కారు. ఆ సమయంలో అదే లిఫ్టులో ఎక్కిన యువకుడు ఎలిజబెత్ వద్ద అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ యువతి కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది అక్కడికి వచ్చారు. ఆ యుకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పట్టినపాక్కం పోలీసులకు అప్పగించారు. విచారణలో అతను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన హరికుమార్ (28) అని తెలిసింది. అదే ప్రాంతంలోని మరో స్టార్ హోటల్‌లో జరిగిన తన పెద్దనాన్న కుమార్తె వివాహానికి చెన్నైకు వచ్చినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment