italian woman
-
చీర కాల కోరిక నెరవేరింది ఇలా...
చీరకట్టుకోవాలనేది ఆ బామ్మ కల. బామ్మది ఇండియా అయితే ఆమె కల గురించి ఆశ్చర్యపోవాల్సిందే. ‘అదేం భాగ్యం!’ అనుకోవాల్సిందే. అయితే బామ్మగారిది ఇండియా కాదు ఇటలీ. ఇటాలియన్ డీజె, ఇన్ఫ్లు్లయెన్సర్ వోలీ ఎస్సే బామ్మ ఇరవై సంవత్సరాల క్రితం తన కుటుంబంతో మన దేశానికి వచ్చింది. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఆమెకు బాగా నచ్చాయి. ముఖ్యంగా చీర ఆమెకు బాగా నచ్చింది. అప్పటినుంచి చీర ధరించాలనే కోరిక మనసులో ఉండిపోయింది. ‘ఈరోజు నీ కలను నిజం చేస్తాను’ అని బామ్మను చీరతో సర్ప్రైజ్ చేసింది మనవరాలు వోలీ. చీర ధరించి తన చిరకాల కోరిక నెరవేర్చుకున్న బామ్మ కళ్లలోని వెలుగు చీరకు కొత్త అందం తెచ్చింది. -
ఇటలీ యువతి పట్ల యువకుడి అసభ్య ప్రవర్తన
సాక్షి, చెన్నై: చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో శుక్రవారం ఇటలీ యువతి వద్ద అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం హోటట్ సిబ్బంది యువకుడిని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. ఇటలీ దేశానికి చెందిన యువతి ఎలిజిబెత్ (28). ఆమె భర్త చెన్నైలోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం భర్తను చూడడానికి చెన్నైకి వచ్చిన ఎలిజిబెత్ ప్రస్తుతం చెన్నై ఎంఆర్సీ నగర్‌లోని ప్రముఖ స్టార్ హోటల్ ఉంటున్నారు. ఎలిజిబెత్ శుక్రవారం తన భర్తను చూసి మాట్లాడిన తరువాత విశ్రాంతి కోసం హోటల్‌కు వచ్చారు. తన గదికి వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కారు. ఆ సమయంలో అదే లిఫ్టులో ఎక్కిన యువకుడు ఎలిజబెత్ వద్ద అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ యువతి కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది అక్కడికి వచ్చారు. ఆ యుకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పట్టినపాక్కం పోలీసులకు అప్పగించారు. విచారణలో అతను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన హరికుమార్ (28) అని తెలిసింది. అదే ప్రాంతంలోని మరో స్టార్ హోటల్లో జరిగిన తన పెద్దనాన్న కుమార్తె వివాహానికి చెన్నైకు వచ్చినట్టు తెలిసింది. -
నన్ను.. నేను.. పెళ్లి చేసుకున్నా?!
ఇదేంటి.. శీర్షికలో తప్పుందా.. లేకనేను తప్పు చదివానా.. అన్న అనుమానం మీకు వచ్చిందా? మ అనుమానం నిజమే.. శీర్షికలో పొరపాటు లేదు. మరి ఇదేం విడ్డూరం.. ఒంటరిగా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అసలు ఎక్కడైనా జరుగుతుందా? అన్న సందేహం మీకు వచ్చిందా? మీ అనుమానాల నివృత్తి కోసం ఈ స్టోరీని చదివేయండి. న్యూఢిల్లీ : ఇదిగో ఇక్కడ ఫొటోలో పెళ్లి కూతురు దుస్తుల్లో ధగధగా మెరుస్తున్న అమ్మాయి పేరు లారా మెస్సీ. ఉండేది ఇటలీలోని మిలన్ పట్టణంలో.. అక్కడ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తోంది. పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అనే మాట ఈ అమ్మాయి విషయంలో అక్షరాలా నిజం. పెళ్ళి చేసుకోవడానికి నాకు పురుషుడితో పనిలేదు.. నన్ను నేనే వివాహం చేసుకుంటాను.. అని పట్టుబట్టి అలాగే చేసుకుంది. తనను తాను చేసుకునే పెళ్లికి కూడా ఈ అమ్మడు.. అక్షరాలా రూ. 8 లక్షలను ఖర్చుచేసింది. ఈ ఒంటరి పెళ్లిని మెస్సీ బంధువులైన 70 కుటుంబాల వారు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లిని అక్కడి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అధికారులు గుర్తించలేదట. ఇంతకూ ఈ అమ్మడు ఇంత అఘాయిత్యపు చేష్టలకు ఎందుకు దిగిందనే సందేహం పెళ్లికి వచ్చిన ఒక పెద్దాయన వచ్చింది. అదే తడవుగా.. మెస్సీని అడిగేశాడు.. అందుకు మెస్సీ సమాధానమిస్తూ.. నేను ఒక అబ్బాయి 12 ఏళ్ల పాటు లివ్ రిలేషన్ షిప్ కొనసాగించాం.. ఈ మధ్యనే మేం బ్రేకప్ అయ్యాం.. బ్రేకప్ తరువాత నాకు ఒకటే అనిపించింది.. స్త్రీ జీవించేందుకు మగ తోడు అవసరం లేదనిపించింది.. అందుకే ఇలా ఒంటరిగా నన్ను నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పింది. అన్నట్లు కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు.. గురువారం తన 40 పుట్టిన రోజును జరుపుకుంది. మరో విషయం ఏమిటంటే.. సాధారణంగా ఎలా పెళ్లి జరుగుతుందో.. అచ్చం అలాగే అన్ని కార్యక్రమాలు నిర్వహించారు., ఈ వివాహానికి హాజరైన వారంతా.. పిదకాలం.. పిదపబుద్ధులు అనుకుంటూ వెళ్లి పోయారు. -
సాధువు లైంగిక వేధింపులపై ఫిర్యాదు
ఒక సాధువు తనను వేధిస్తున్నాడంటూ ఇటలీకి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శనివారం నాడు విచారణ ప్రారంభించారు. తనను చూసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నితాయీ దాస్ అనే సదరు సాధువు తనపై యాసిడ్‌తో దాడి చేస్తానని కూడా బెదిరించినట్లు బ్రిజ్ బాసి దేవి దాసి తెలిపారు. ఆమె గత 40 ఏళ్లుగా బృందావనంలోనే ఉంటున్నారు. బ్రిజ్ బాసి దేవి ఫిర్యాదుపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు మథుర సీనియర్ ఎస్పీ మంజిల్ సైనే తెలిపారు.