వైరల్
చీరకట్టుకోవాలనేది ఆ బామ్మ కల. బామ్మది ఇండియా అయితే ఆమె కల గురించి ఆశ్చర్యపోవాల్సిందే. ‘అదేం భాగ్యం!’ అనుకోవాల్సిందే. అయితే బామ్మగారిది ఇండియా కాదు ఇటలీ. ఇటాలియన్ డీజె, ఇన్‌ఫ్లు్లయెన్సర్ వోలీ ఎస్సే బామ్మ ఇరవై సంవత్సరాల క్రితం తన కుటుంబంతో మన దేశానికి వచ్చింది.
ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఆమెకు బాగా నచ్చాయి. ముఖ్యంగా చీర ఆమెకు బాగా నచ్చింది. అప్పటినుంచి చీర ధరించాలనే కోరిక మనసులో ఉండిపోయింది. ‘ఈరోజు నీ కలను నిజం చేస్తాను’ అని బామ్మను చీరతో సర్‌ప్రైజ్ చేసింది మనవరాలు వోలీ. చీర ధరించి తన చిరకాల కోరిక నెరవేర్చుకున్న బామ్మ కళ్లలోని వెలుగు చీరకు కొత్త అందం తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment