Woman Wore Saree And Walked On The Streets Of Rome; Video Viral - Sakshi

చీర అందమే అందం! ఇటలీ వాసులనే ఫిదా చేసింది!

Aug 2 2023 1:25 PM | Updated on Aug 2 2023 3:11 PM

Woman Wore Saree And Walked On The Streets Of Rome - Sakshi

విదేశాల్లో ఉంటే కచ్చితంగా ఏ దేశస్తులైనా అక్కడి ఆహార్యానికి తగ్గట్టుగా ఉంటాం. మన సంప్రదాయాలకు సంబంధించిన దుస్తులు పర్సనల్‌గానే వాడతాం గానీ. అంత తేలిగ్గా అవి వేసుకుని బయటకు రాం. లేదా అక్కడ మన కమ్యూనిటీ వాళ్లు ఉంటే..అంతా ఒకచోట కలిస్తే గనుక మన దేశ సంప్రదాయాన్ని ఫాలో అవుతాం. అలా కాకుండా ఎలాంటి సందర్భం లేకుండా ఫారినర్స్‌ రద్దీగా ఉండేచోట మనం గనుక మన వేషధారణలో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించండి.

అలాంటి వీడియోని పల్లవి రాజ్‌ అనే కంటెంట్‌ క్రియేటర్‌ ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేయడంతో  నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంది. ఆ వీడియోలో ఓ మహిళ ఇటలీలోని రోమ్‌ వీధుల గుండా ఓ మహిళ చీర కట్టుకుని ఓ దేవతా మాదిరి వెళ్లింది. అక్కడ సరిగ్గా వందలాదిమంది విదేశీయులు బారులుతీరి ఉన్నారు. వారంతా ఒక్కసారిగా ఆమె వంకే చూస్తూ ఉండిపోయారు. మరికొందరూ ఫోటోలు తీశారు. మరికొందరూ వావ్‌ అంటూ నోరెళ్లబెట్టారు కూడా.  ఎక్కడైన మన సంప్రదాయానికి అందరూ ఫిదా కావల్సిందే కదా. ఎప్పటకీ మన చీరే ట్రెండీ ఫ్యాషన్‌ దానికి మించిది మరోకటి లేదు అని మరోసారి రుజువైంది.

(చదవండి: 46 వేల ఏళ్లనాగి పురుగుకి జీవం పోస్తే..పిల్లల్ని కనడం ప్రారంభించింది!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement