
86 ఏళ్ల పోప్.. శ్వాస కోశ సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు..
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ అస్వస్థతో బుధవారం ఆస్పత్రిలో చేరారు. 86 ఏళ్ల పోప్ శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు, ఆయన్ని రోమ్‌లోని(ఇటలీ) జెమెల్లీ ఆస్పత్రిలో చేరినట్లు వాటికన్ సిటీ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.
మరికొన్ని రోజులు ఆయన ఆస్పత్రిలోనే ఉంటారని తెలుస్తోంది. అయితే శ్వాస కోశ సంబంధిత సమస్యలే అయినప్పటికీ.. ఆయన కోవిడ్ సోకలేదని స్పష్టం చేసింది ఆ ప్రకటన. ఆయన అనారోగ్యంపై వార్తలు బయటకు రాగానే.. త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు పంపుతున్నారు పలువురు.
గత కొంతకాలంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏడాదికాలంగా పలు ముఖ్యకార్యక్రమాలకు ఆయన గైర్హాజరు అవుతున్నారు.
ఇదీ చదవండి: ప్రజల ఇష్టానుసారమే నిర్ణయం తీసుకుంటాం!