ఢిల్లీ: ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లపై ప్రపంచ దేశాల అధినేలతో చర్చిస్తున్నారు. ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు రోమ్ వెళ్లిన నరేంద్ర మోదీ శనివారం పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశం అయ్యారు. ఫ్రాన్సిస్ పోప్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను కలిసిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. వాటికన్ సిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్ మధ్య గంట పాటు సమావేశం కొనసాగింది.
(చదవండి: మహాత్ముని తర్వాత మోదీయే: రాజ్‌నాథ్)
షెడ్యూల్ ప్రకారం 20 నిమిషాలు కొనసాగాల్సినప్పటికీ, గంట పాటు కొనసాగిన మీటింగ్‌లో పేదరిక నిర్మూలన సహా అనేక విస్తృత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ధరిత్రి పరిరక్షణ చర్యలపై చర్చించారు. భారత్ పర్యటనకు రావాలని పోప్ ఫ్రాన్సిస్‌కు ఆహ్వానం పలికారు మోదీ. నవంబర్ 1 నుంచి 2 వరకూ గ్లాస్గోలో పర్యటించనున్నారు మోదీ. గ్లాస్గోలో రెండు రోజులపాటు జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ(కాప్) సదస్సుకు 120 దేశాల అధ్యక్షులు, ప్రతినిధులు హాజరవుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment