hospitalised
-
ఆస్పత్రిలో అద్వానీ
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ(97) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అబ్జర్వేషన్లో ఉన్నారని వైద్యులు ప్రకటించారు.ఇదిలా ఉంటే.. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అద్వానీ గతంలోనూ అస్వస్థతకు లోనయ్యారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది.. కొన్నిరోజులకే వెంటనే కోలుకున్నారు.BJP leader and Bharat Ratna LK Advani admitted to Apollo hospital in Delhi.— News Arena India (@NewsArenaIndia) December 14, 2024క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యాక అద్వానీ మీడియా ముందు కనిపించడం అరుదుగా మారింది. రామమందిర ప్రారంభానికి ఆహ్వానం అందినప్పటికీ.. వయసురిత్యా ఇబ్బందులతో ఆయన హాజరుకాలేకపోయారు. మొన్న.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి తర్వాత ప్రధాని మోదీ కూడా అద్వానీ నివాసానికి వెళ్లారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు మోదీ.. అద్వానీ ఆశీస్సులు తీసుకున్నారు.ఇదీ చదవండి: సంవిధాన్.. సంఘ్ కా విధాన్ కాదు -
వేడి వేడి కిచిడీ పడి ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలు..
ఉత్తరప్రదేశ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మధురలోని ఆశ్రమం వద్ద ప్రసాదం కోసం క్యూలో వేచి ఉన్నఇద్దరు మహిళా భక్తులపై 'కిచిడీ' వడ్డించే వ్యక్తి జారిపడి వేడి ఆహారం వారిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. క్యూలో నిలబడిన మరో ఎనిమిది మంది మహిళలకు కూడా పాత్రలోని వేడి వేడి కిచిడీ పడటంతో స్వల్ప గాయపడ్డారు. గాయపడిన భక్తులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిని ప్రథమ చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. కాగా ఇద్దరు భక్తులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు.మధురలోని బృందావన్ ప్రాంతంలోని గౌరీ గోపాల్ ఆశ్రమంలో శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం భక్తులందరూ పరిక్రమ మార్గ్ సంత్ కాలనీలో ఉన్న గౌరీ గోపాల్ ఆశ్రమానికి చేరుకోగా.. బయట ప్రసాదం పంపిణీ చేస్తుండటాన్ని గమనించారు. బియ్యం, పప్పుతో చేసిన కిచిడీని తీసుకునేందుకు భక్తులు క్యూలో నిల్చున్నారు. ఈక్రమంలో కిచిడీని పాత్రను తీసుకొస్తున్న వ్యక్తి జారిపడిపోయాడు. అతని చేతిలోని వేడి ఆహారం పక్కన నిలబడి ఉన్న మహిళలపై పడినట్లు జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వందనా అగర్వాల్ చెప్పారు. ఈ సంఘటన భక్తులను భయాందోళనకు గురిచేసిందని, గాయపడిన 10 మంది మహిళలను ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు. -
ఆస్పత్రిలో ఊర్వశి రౌతేలా.. లక్ష గులాబీలు పంపిన అభిమానులు (ఫోటోలు)
-
Uttar Pradesh: కలుషిత ఆహారం తిన్న 60 మందికి అస్వస్థత
మధురలో శ్రీకృష్ణాష్టమి వేళ విషాదం చోటుచేసుకుంది. పండుగ నాడు ఉదయమంతా ఉపవాసం ఉండి, సాయంత్రం వేళ బక్వీట్(గోధుమ తరహా ఆహారధాన్యం) పిండితో చేసిన పకోడీలు తిన్న 60 మందికిపైగా జనం అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటన మధురలోని ఫరా ప్రాంతంలో చోటుచేసుకుంది. బక్వీట్ పకోడీలు తిన్న కొద్దిసేపటికే చాలామంది కడుపునొప్పి, వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. స్థానికులు వీరిని వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆరోగ్యం మరింతగా క్షీణించిన ఆరుగురిని ఆగ్రాలోని ఎస్ఎన్ ఆస్పత్రికి తరలించారు. అలాగే 15 మంది బాధితులను మధుర జిల్లా ఆస్పత్రికి, 11 మందిని బృందావన్‌లోని ఆస్పత్రికి తరలించారు.కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్టాఫ్ నర్సు జస్వంత్ యాదవ్ మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ కారణంగా 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారన్నారు. వీరింతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటన అనంతరం జిల్లా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ అధికారులు బక్వీట్ పిండి విక్రయించిన ఇద్దరు దుకాణదారులపై కేసు నమోదు చేశారు. -
ప్రముఖ గాయని పి సుశీలకు అస్వస్థత
-
'వాటర్ పాయిజనింగ్'తో ఆస్పత్రిపాలైన వ్యక్తి! ఎందువల్ల వస్తుందంటే..?
ఫుడ్ పాయిజనింగ్‌లా ఏంటీ వాటర్ పాయిజనింగ్. నీళ్లు కూడా పాయిజన్‌గా అవుతాయా..? లేక కలుషిత నీటి వల్ల ఇలా జరుగుతుందా అంటే..?. అవేమీ కాదు. తాగాల్సిన నీటికంటే అధికంగా తాగితే ఈ పరిస్థితికి గురవ్వుతామని చెబుతున్నారు నిపుణుల. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. అసలేంటి వాటర్ పాయిజనింగ్? ఎలా ప్రాణాంతకమో? సవివరంగా చూద్దాం.టెక్సాస్‌కి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు జూన్‌లో తీవ్ర వేసవి వేడికి గురయ్యాడు. చెప్పాలంటే తీవ్ర వేడిమికి తాళ్లలేక అధికంగా నీటిని తాగాడు. సుమారు 11 లీటర్ల మేర నీళ్లు ఆత్రంగా తాగేశాడు. అంతే కాసేపటికి కారం, అలసట, ఛాతీ నొప్పిని వంటి సమస్యలతో స్ప్రుహ కోల్పోయాడు. వెంటనే అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడు నీటి పాయిజన్కి గురయ్యినట్లు నిర్థారించారు. అసలేంటి నీటి పాయిజన్ అంటే..వేడి, తేమతో కూడిన పరిస్థితుల్లో నివశించే ప్రజలు అధిక దాహానికి గురవ్వుతారు. త్వరగా నీటిని తాగి డీహైడ్రేషన్ నష్టాన్ని భర్తీ చేయాల్సిఉంటుంది. ఇలా తాగేటప్పుడూ అధికంగా తాగితే నీటిపాయిజన్కి గురవ్వుతారు. వెంటనే ఇది కిడ్నీలు, ఎలక్ట్రోలైట్లు, సోడియంపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ నీటిని అధికంగా తీసుకున్న వెంటనే ఎలక్ట్రోలైట్లు, ఉప్పు కరిగిపోవడం జరుగుతుంది. దీంతో ఆ అధిక నీటిని మూత్రపిండాలు బయటకు పంపలేక పాయిజన్‌గా మారిపోవడం జరుగుతుంది.ఇది ఉబ్బరం, పాలీయూరియా, హైపోనాట్రేమియా (సీరం సోడియం గాఢత 135 mEq/L కంటే తక్కువ), వాపు, బలహీనమైన జీవక్రియకు దారితీస్తుంది. మూత్రపిండాలు ఒక సమయంలో పరిమిత నీటిని మాత్రమే నిర్వహించగలవు. తక్కువ వ్యవధిలో అధిక మొత్తంలో ద్రవాలను నిర్వహించడం తీవ్రమైన పరిణామలకు దారితీసి.. కణాల వాపు, గుండెపోటు వంటి లక్షణాలు ఎదురవ్వుతాయి. లక్షణాలు..కండరాల బలహీనత లేదా తిమ్మిరిరక్తపోటు పెరుగుదలద్వంద్వ దృష్టిగందరగోళంఇంద్రియ సమాచారాన్ని గుర్తించలేకపోవడంశ్వాస తీసుకోవడంలో ఇబ్బందిమానసిక రుగ్మతలో బాధపడుతున్నవారు, క్రీడాకారులు, సైనిక శిక్షణ, అధిక శ్రమతో కూడిన పనులు చేసేవారు అధికంగా నీటిని తాగకూడదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) ప్రకారం అమెరికాలో ప్రతి ఏడాది మూడు నుంచి ఆరు మిలియన్ల మంది ఈ వాటర్ పాయిజనింగ్ బారినపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఎంత నీరు తాగితే మంచిదంటే..ఒక వ్యక్తి రోజూలో ఎంత నీరు తాగొచ్చు అని చెప్పేందుకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు. అయితే ఆరోగ్యానికి అవసరమైనంత మేర నీటిని తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. హైపోనట్రేమియాకి గురై, మూత్రపిండాలపై ప్రభావం పడేలా నీటిని అధికంగా తీసుకోకూడదు. విపరీతమైన వేడి వాతావరణంలో శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత కాపాడుకునేలా రోజుకి సుమారు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: రోజూ ఎనిమిది గ్లాసుల పాలు తాగేవాడినంటున్న బాబీ డియోల్.. దీని వల్ల వచ్చే సమస్యలివే..!) -
ఎమ్మెల్సీ కవిత డిశ్చార్జి, మళ్లీ తీహార్ జైలుకు..
ఢిల్లీ, సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆమెను అధికారులు తిరిగి తీహార్ జైలుకు తీసుకెళ్లారు. గత రెండు రోజులుగా జ్వరంతో ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. మంగళవారం ఉదయం ఆమె హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అధికారులు ఆమెను దీన్‌దయాళ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించి.. డిశ్చార్జి చేశారు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఆమెను అరెస్ట్ చేయగా.. వంద రోజులకు పైగా ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె కస్టడీని కోర్టు పొడిగిస్తూ వెళ్తుండగా.. మరోవైపు ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
ఆశ్రమంలో ఇద్దరు చిన్నారులు మృతి.. 10 మంది పరిస్థితి విషమం
మధ్యప్రదేశ్‌లోని మహ్లార్‌గంజ్‌లో గల యుగపురుష్ ధామ్(ఆశ్రమం)లో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా వీరు మృతి చెందారని తెలుస్తోంది. ఆశ్రమానికి చెందిన మరో 10 మంది చిన్నారులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని సమాచారం. యుగపురుష్ ధామ్ ఆశ్రమంలో ఉంటున్న కరణ్, ఆకాశ్ మృతి చెందారు.12 ఏళ్ల కరణ్ దేవాస్ జిల్లా సోన్‌కచ్చా నివాసి. 15 నెలల క్రితం అతనిని అధికారులు ఆశ్రమంలో చేర్పించారు. అలాగే ఏడేళ్ల ఆకాశ్‌ను మూడు నెలల క్రితం ఆశ్రమంలో చేర్పించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం కరణ్ అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఇదేవిధంగా మంగళవారం ఉదయం ఆకాశ్ మృతి చెందాడు.ఆశ్రమ పర్యవేక్షకులు తెలిపిన వివరాల ప్రకారం ఆశ్రమంలోని కృష్ణ అనే బాలుడు తొలుత ఇన్ఫెక్షన్కు గురయ్యాడు. ఆ తరువాత ఆ బాలుడు అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. అయితే ఆ తరువాత ఆశ్రమంలోని మిగిలిన చిన్నారులు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు చిన్నారులు ఈ ఆశ్రమానికి వచ్చి చదువులు సాగిస్తుంటారు. 2006లో 78 దివ్యాంగ చిన్నారులతో ఈ ఆశ్రమం ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఆశ్రమంలో 2017 మంది చిన్నారులు ఉన్నారు.కలెక్టర్ ఆశీష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఆశ్రమానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వీరిలో ఒక బాలుడు డయారేయాతో, మరో బాలుడు ఫిట్స్‌తో మృతి చెందాడు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. -
నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
బన్స్కా బిస్ట్రికా: దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో(59) పరిస్థితి విషమమే అయినప్పటికీ నిలకడగా ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఆయనతో గురువారం మాట్లాడినట్లు ఎన్నికైన అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీ చెప్పారు. ఫికో ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రధాని ఫిగోకు ఐదు గంటలపాటు ఆపరేషన్ చేసినట్లు బన్స్కా బిస్ట్రికాలోని ఎఫ్డీ రూజ్వెల్ట్ హాస్పిటల్ డైరెక్టర్ మిరియమ్ లపునికోవా గురువారం చెప్పారు. విషమమే అయినప్పటికీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఇలా ఉండగా, ప్రధాని ఫికోపై కాల్పులకు పాల్పడిన వ్యక్తి(71) ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేనట్లుగా తేలిందని ఇంటీరియర్ మంత్రి మటుస్ సుటాజ్ ఎస్టోక్ తెలిపారు. ప్రధానిపై హత్యాయత్నం రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు. ఫికో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు అతడు తెలిపాడన్నారు. కవి కూడా అయిన నిందితుడు గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అతడి పేరు, ఇతర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. బుధవారం హండ్లోవా పట్టణంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఫికోపై దుండగుడు తుపాకీతో పలుమార్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న వేళ చోటుచేసుకున్న ఈ ఘటన యూరప్ వ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత ఉక్రెయిన్‌కు అనుకూలంగా వ్యవహరించిన స్లొవాకియా అనంతరం రష్యా అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా పలు చర్యలు తీసుకుంది. ఫికో రాజకీయ ప్రత్యర్థి, మరికొద్ది రోజుల్లో పదవిని వీడనున్న అధ్యక్షురాలు జుజానా కపుటోవా గురువారం రాజధాని బ్రాటిస్లావాలో మీడియాతో మాట్లాడు తూ.. ‘సమాజంలో పెరుగుతున్న విద్వేషాలకు నిదర్శనం ఈ ఘటన. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తాం’అని తెలిపారు. ఈ సమయంలో ప్రతి పౌరుడూ బాధ్యతగా మెలగాలని ఆమె కోరారు. -
చికెన్ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత
ముంబై: చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని సంతోష్ నగర్లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. -
సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ
న్యూఢిల్లీ: ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ అనూహ్యంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా తరచుగా వాంతి చేసుకుంటోన్న సద్గురుకు స్కానింగ్ నిర్వహించగా.. బ్రెయిన్లో కొంత తేడాను గమనించారు వైద్యులు. ఈ నెల 17న ఢిల్లీ అపొలో ఆస్పత్రికి తరలించగా.. ఆయనకు బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా చేసినట్టు తెలిసింది. సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రస్తుత వయస్సు 66 సంవత్సరాలు. మార్చి 17న ఢిల్లీ అపొలో ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా.. బ్రెయిన్లో స్వెల్లింగ్ వచ్చినట్టు గుర్తించారు. అలాగే కొంత మేర బ్లీడింగ్‌ను గుర్తించారు. ఢిల్లీ అపొలో ఆస్పత్రిలో డాక్టర్ వినీత్ సురీ నేతృత్వంలోని బృందం ఎమ్మారై పరీక్షలు నిర్వహించగా బ్లీడింగ్ ఎక్కువగా కనిపించినట్టు తెలిసింది. పరిస్థితి విషమించకుండా ఉండాలంటే తక్షణం శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన డాక్టర్లు.. వెంటనే ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిసింది. వైద్యబృందంలో డాక్టర్ వినీత్ సూరితో పాటు డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీ ఉన్నారు. ఆపరేషన్ తర్వాత సద్గురుకు సంబంధించిన అన్ని హెల్త్ పారామీటర్లు మెరుగవుతున్నట్టు తెలిసింది. దీనిపై ఢిల్లీ అపొలో నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. View this post on Instagram A post shared by Sadhguru (@sadhguru) కర్ణాటకలోని మైసూర్లో ఓ తెలుగు కుటుంబంలో పుట్టిన జగ్గీ వాసుదేవ్ నలుగురి సంతానంలో ఆఖరివాడు. సద్గురు తండ్రి రైల్వేశాఖలో కంటి డాక్టర్. 11ఏళ్లప్పుడు యోగా నేర్చుకున్న సద్గురు స్కూలు మైసూర్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీషులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మోటార్ డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టపడే సద్గురు.. పాతికేళ్ల వయస్సులో మోటారు సైకిల్‌పై చాముండి కొండ పైకి వెళ్ళి ఓ ఆధ్యాత్మిక అనుభవం కలిగిందని చెబుతారు. ఆ తర్వాత ధ్యానమార్గం పట్టి ఈషా ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి ఆర్ధిక, సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది. కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో సద్గురుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. Neurologist Dr. Vinit Suri of @HospitalsApollo gives an update about Sadhguru’s recent Brain Surgery. A few days ago, Sadhguru underwent brain surgery after life-threatening bleeding in the brain. Sadhguru is recovering very well, and the team of doctors who performed the… pic.twitter.com/UpwfPtAN7p — Isha Foundation (@ishafoundation) March 20, 2024 1983లో మైసూరులో మొదటి యోగా క్లాస్‌ను నిర్వహించాడు. 1989 లో కోయంబత్తూర్ లో ఈశా యోగ సెంటర్ ఏర్పాటు చేశాడు. కోయంబత్తూరు నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెళ్ళంగిరి పర్వత పాదాల చెంత పదమూడు ఎకరాల భూమిలో ఈ సెంటర్ నడుస్తోంది. 1999లో సద్గురు ఆశ్రమ ప్రాంగణంలో ధ్యానలింగం ఏర్పాటు చేశారు. ఏ ప్రత్యేక మతానికీ, విశ్వాసానికీ చెందని ధ్యానలింగ యోగాలయం ధ్యానానికి మాత్రమే నిర్దేశించామని, కాంక్రీటు, స్టీలు ఉపయోగించకుండా ఇటుకరాళ్ళూ, సున్నంలతో 76 అడుగుల గోపురం, గర్భగుడిని నిర్మించామని సద్గురు చెబుతారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, జైన్, టావో, జొరాష్ట్రియన్, జుడాయిజం, షింటో, బౌధ్ధ మతాల గుర్తులతో, అన్ని మతాల ఏకత్వాన్ని చాటుతూ ఓ సర్వధర్మ స్థంభాన్ని ఏర్పాటు చేశారు -
ప్రతిభా పాటిల్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న పాటిల్ మహారాష్ట్రలోని పూణెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 89 ఏళ్ల మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం భారతి ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సీనియర్ వైద్యులొకరు మీడియాతో మాట్లాడుతూ ‘మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు’ అని తెలిపారు. ప్రతిభా పాటిల్ భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి. ఆమె 2007 నుంచి 2012 వరకు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నారు. -
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు అస్వస్థత
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వీ హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని అంబర్‌పేట ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆయన ప్రస్తుత ఆరోగ్యంపై సమాచారం అందాల్సి ఉంది. -
అమెరికాలో ఫ్లూతో 15 వేలమంది మృతి!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో గల సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, ఈ సీజన్లో ఇప్పటివరకు అమెరికాలో సుమారు రెండు లక్షల 50 వేల మంది ఫ్లూ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు 15 వేల మరణాలు సంభవించాయి. ఫిబ్రవరిలో ఇన్ఫ్లుయెంజా బారినపడిన చిన్నారుల మరణాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో మొత్తం 74 మంది చిన్నారులు ఇన్‌ఫ్లుయెంజాతో ఆసుపత్రిలో చేరారు. గడిచిన వారంలో 11 వేలకు పైగా భాధితులు ఆసుపత్రిలో చేరినట్లు పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇన్ఫ్లుఎంజా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఆరు నెలలలోపు చిన్నారులకు వార్షిక ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలని అధికారులు తెలిపారు. -
నటుడు మిథున్ చక్రవర్తిని పరామర్శించిన బీజేపీ నేత
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి(73) తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం మిథున్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆయనను వీడియోలో చూసిన అభిమానులు భగవంతునికి ధన్యవాదాలు చెబుతున్నారు. #WATCH | West Bengal BJP chief Sukanta Majumdar met veteran actor and BJP leader Mithun Chakraborty at a private hospital in Kolkata pic.twitter.com/4FRNoTuwKb — ANI (@ANI) February 11, 2024 కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన మిథున్ చక్రవర్తిని బీజేపీ నేత సుకాంత్ మజుందార్ పరామర్శించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిథున్ చక్రవర్తికి చెందిన వీడియోను ఏఎన్ఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో మిథున్ చక్రవర్తి హాస్పిటల్ బెడ్‌పై పడుకుని, వైద్యులతో మాట్లాడటాన్ని చూడవచ్చు. మిథున్ చక్రవర్తి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు ఈ వీడియోలో స్పష్టమవుతోంది. భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా మిథున్ చక్రవర్తిని కలుసుకుని పరామర్శించారు. #WATCH | West Bengal: Former Indian cricketer Sourav Ganguly arrives at a private hospital in Kolkata to meet his mother, who is admitted here. pic.twitter.com/c4goODkOX1 — ANI (@ANI) February 11, 2024 -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి!
కర్ణాటకలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడిలోని కుక్కడి గ్రామంలో గల ఒక బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటచేసుకుంది. ఈ పేలుడు శబ్దం చాలా మైళ్ల దూరం వరకూ వినిపించింది. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. పేలుడు శబ్దం నాలుగు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది. సమీపప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను వర్గీస్ (62), స్వామి (60), చేతన్ (24)గా గుర్తించినట్లు దక్షిణ కన్నడ పోలీసు సూపరింటెండెంట్ సీబీ రిషియంత్ తెలిపారు. ఈ ఉదంతంపై విచారణ జరిపి, పేలుడుకు గల కారణాలను తెలుసుకుంటున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
జాంబియాలో కలరా కల్లోలం.. పాఠశాలల మూసివేత!
దక్షిణాఫ్రికా దేశమైన జాంబియా కలరా వ్యాధితో పోరాడుతోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కలరా కారణంగా జాంబియాలో 400 మందికి పైగా బాధితులు మృతిచెందారు. 10 వేలమందికి మందికి పైగా జనం ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని లుసాకాలోని అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియంను కలరా చికిత్స కేంద్రంగా మార్చారు. జాంబియన్ ప్రభుత్వం సామూహిక టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. అలాగే దేశంలోని పలు కలరా పీడిత ప్రాంతాలలో రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం అందజేస్తోంది. ‘జాంబియా పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్’ తెలిపిన వివరాల ప్రకారం జాంబియాలో కలరా వ్యాప్తి గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఆ నెలలో కలరా కారణంగా 412 మంది మృతిచెందారు. అలాగే 10,413 కలరా కేసులు నమోదయ్యాయి. దేశంలోని 10 పది రాష్ట్రాలలో తొమ్మిది రాష్ట్రాలు కలరా బారిన పడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు రెండు కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో రోజుకు 400కు పైగా కలరా కేసులు నమోదవుతున్నాయి. కలరా అనేది నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది అపరిశుభ్రత కారణంగా వ్యాపిస్తుంది. కలుషిత నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల కలరా సోకుతుంది. గత ఏడాది ఆఫ్రికాలోని మరో దేశమైన జింబాబ్వేలో కూడా కలరా వ్యాపించింది. ఇక్కడ కూడా స్వచ్ఛమైన తాగునీటి కొరత ఉంది. కలరా వ్యాపిస్తున్న మణికాలాండ్, మాస్వింగో రాష్ట్రాల్లో అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్య 50కి పరిమితం చేశారు. -
ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్: చచ్చిన ఎలుక ఎక్స్ట్రా, కట్ చేస్తే..!
వండుకునే ఓపిక లేకనో, కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడో లేదా కొత్తగా తినాలనే ఆశతోనే రెస్టారెంట్లనుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని లాగించేస్తున్నారా? అయితే ఇకపై ఇలా చేయాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిందే. అంతేకాదు మనం తినబోతున్న ఆహారం శుభ్రంగానే ఉందా లేదా అనేది చెక్ చేసుకోకపోతే అంతే సంగతులు. ఎందుకంటే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి షాకిచ్చే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక వ్యక్తి ముంబై రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన ఆహారాన్ని హ్యాపీగా ఆరంగించేశాడు. కానీ ఆతరువాతే అసలు తిప్పలు మొదలయ్యాయి. ఫలితంగా ఒకటి రెండు కాదు 75 గంటల పాటు ఆసుపత్రి పాలయ్యాడు. I Rajeev shukla (pure vegetarian) from prayagraj visited Mumbai, on 8th Jan'24 night ordered veg meal box from BARBEQUE NATION, worli outlet that a contained dead mouse, hospitalised for 75 plus hours. complaint has not been lodged at nagpada police station yet. Please help pic.twitter.com/Kup5fTy1Ln — rajeev shukla (@shukraj) January 14, 2024 రాజీవ్ శుక్లా తన బాధాకరనమైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీని ప్రకారం జనవరి 8న ముంబై వెళ్లాడు. ఫుడ్ చైన్ బార్బెక్యూ నేషన్‌కు చెందిన వర్లీ అవుట్లెట్ నుండి వెజ్ మీల్ ఆర్డర్ చేశాడు. కొంత ఆహారం తిన్న తరువాత అందులో చనిపోయిన ఎలుకను చూసి షాకయ్యాడు. ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఫుడ్ ఆర్డర్ రసీదు, డెలివరీ ప్యాకేజీ, ఫుడ్ ఫోటోతోపాటు తను ఆసుపత్రిలో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. అలాగే తానింకా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కూడా ట్వీట్ చేశాడు. స్పష్టం చేశాడు.దీంతో ఇది నెట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తమ తమ అనుభవాలను పంచుకుంటూ ట్వీపుల్ స్పందించారు. బార్బెక్యూనేషన్, ఇతర అధికారుల హ్యాండిల్‌లను ట్యాగ్ చేశారు. దీంతో జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ బార్బెక్యూ నేషన్ స్పందించింది. సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామంటూ రిప్లై ఇచ్చింది. -
దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమం!
కరాచీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. తీవ్ర ఆనారోగ్యంతో ఉన్న దావూద్‌ను సోమవారం పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారట. అయితే అతనిపై విష ప్రయోగం జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి స్పష్టత లేనట్లుగా తెలుస్తోంది. అతను మరో రెండు రోజుల పాటు ఆసత్రిలో ఉండి చికిత్స తీసుకొనున్నట్లు సమాచారం. పాక్ మీడియా కథనాల ప్రకారం.. ఆస్పత్రి లోపల దావూద్ ఇబ్రహీం కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స తీసుకుంటున్నాడు. ఆస్పత్రిలోని ఒక ఫ్లోర్ మొత్తం దావూద్ ఒక్కడే పేషెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతన్ని చూడటానికి కుటుంబసభ్యులు, ఆస్పత్రి ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మాఫియా డాన్ గురించి ఈ ఏడాది జనవరిలో అతని సోదరి ఆసక్తికర విషయాలు చెప్పింది. రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి దావూద్ కరాచీలోనే ఉంటున్నట్లు ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణలో ఆమె తెలిపింది. మరోవైపు.. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు.. పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించినట్లు ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. చదవండి: ‘మధ్యధరా’లో పడవ మునిగి 60 మంది మృతి -
పెన్షన్ సొమ్ము కోసం భర్తకు నిప్పు!
ప్రపంచంలో అంతకంతకూ అడుగంటుతున్న మానవత్వానికి ఉదాహరణగా నిలిచే ఉదంతం మహారాష్ట్రలోని థానేలో వెలుగు చూసింది. స్థానిక కళ్యాణ్ నగర్లో ఓ భార్య.. భర్త పెన్షన్ కోసం అతనికి నిప్పంటించి, హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనలో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీడియాకు ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. మరో ఇద్దరి సహకారంతో ఈ మహిళ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. 61 ఏళ్ల భర్తకు నిప్పంటించి చంపేందుకు ప్రయత్నించిన నేరంపై సదరు మహిళపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితుని కుమార్తె స్నేహితులైన ఇద్దరు యువకులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. కాగా ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అతని భార్య.. అతనికి నెలనెలా వచ్చే పెన్షన్ విషయమై గొడవ పడేది. అలాగే ఆ ఇద్దరు యువకులు తమ ఇంటికి రావడంపై అతను అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. తన ప్రాణాలకు ఆ యువకుల వలన ముప్పు ఉందని బాధితుడు గతంలో ఆ యువకులిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. అతని భార్యతో పాటు ఆ ఇద్దరు యువకులు అతనికి నిప్పంటించారు. దీనిని గమనించిన పొరుగింటివారు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: ‘ఇదేందిది... హల్దీ ఫంక్షన్లో ఇంత అవసరమా?’ -
విజయకాంత్ ఆరోగ్యంపై వివరణ ఇచ్చిన తమిళనాడు మంత్రి
డీఎండీకే అధినేత, కోలీవుడ్ సినీ నటుడు విజయకాంత్ తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డ విజయకాంత్ ఆపరేషన్ చేయించుకున్నారు. మళ్లీ అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఆయన తిరిగి చికిత్స పొందుతున్నారు. విజయకాంత్‌కు వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడిన మంత్రి ఈమేరకు చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న విజయకాంత్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి చెప్పడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. విజయకాంత్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు వచ్చాయని డీఎండీకే పార్టీ నేతలు చెప్పారు. తాజాగా మంత్రి సుబ్రహ్మణియన్ కూడా ఇదే విషయాన్ని అధికారికంగా తెలిపారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. రెగ్యులర్‌గా ఆయనకు అందించే చికిత్సలో భాగంగానే ప్రస్తుతం కూడా చికిత్స కొనసాగుతున్నదని , ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. రెండు మూడు రోజులలో విజయకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని పేర్కొంది. -
ఆస్పత్రిలో చేరిన విజయకాంత్.. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్
డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలోచికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. డీఎండీకే అధినేత విజయకాంత్ సినీ, రాజకీయ పయనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను కోశాధికారి పదవితో ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్ భుజాన వేసుకుని ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితులలో విజయకాంత్‌ను చూడలేక పోతున్నామే అన్న ఆవేదనలో ఉన్న కేడర్‌కు ఇటీవల ఆయన దర్శనం కల్పించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన తన జన్మదిన వేడుకకు విజయకాంత్ హాజరయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసిన కేడర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నుంచి ఇంట్లోనే విజయకాంత్ ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఆరోగ్య పరంగా సమస్యలు తలెత్తడంతో హుటాహుటిన నగరంలోని ఓ ఆస్పత్రికి ఆదివారం తరలించారు. ఆయనకు ఆస్పత్రిలో పరిశోధనలు, చికిత్సలు కొనసాగుతున్నాయి. విజయకాంత్ ఆస్పత్రిలో చేరిన సమాచారంతో డీఎండీకే వర్గాలలో ఆందోళన నెలకొంది. అదే సమయంలో వదంతులు, ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇందుకు ముగింపు పలికే విధంగా డీఎండీకే కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్‌కు సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించినట్టు వివరించారు. ఆయన రెండు రోజులలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేడర్‌కు భరోసా ఇచ్చారు. -
‘గ్రేట్ స్మోగ్ ఆఫ్ లండన్’ అంటే ఏమిటి? నాలుగు రోజుల్లో వేలమంది ఎలా మృతి చెందారు?
సరిగ్గా 70 ఏళ్ల క్రితం లండన్‌లో ఆ రోజు పగటిపూట హఠాత్తుగా చీకటి కమ్ముకుంది. గాలి కలుషితమై నల్లగా మారి, అంతటా వ్యాపించడంతో వేల మంది ఊపిరాడక మృతి చెందారు. నేటికీ ఈ సంఘటన ఇంగ్లండ్‌నే కాదు యావత్ ప్రపంచాన్ని భయపెడుతుంది. ఈ ఘటనను ‘గ్రేట్ స్మోగ్ ఆఫ్ లండన్’ అని పిలుస్తారు. విపరీతమైన కాలుష్యం కారణంగా నాలుగు రోజుల్లోనే 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఏర్పడిన పొగమంచు వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ఈ భయంకరమైన ‘చీకటి’ 1952 డిసెంబర్ తొలిరోజుల్లో బ్రిటిష్ రాజధాని లండన్‌లో విధ్వంసం సృష్టించింది. ఇళ్లను వెచ్చగా ఉంచేందుకు, పారిశ్రామిక వినియోగానికి బొగ్గును విపరీతంగా ఉపయోగించడం కారణంగా ఈ నల్లని పొగమంచు ఏర్పడింది. ఈ పొగమంచు 1952 డిసెంబర్ 5న మొదలై, తదుపరి ఐదు రోజులు అంటే డిసెంబర్ 9 వరకు కొనసాగింది. లండన్‌వాసులు అప్పటికే దశాబ్దాలుగా పొగమంచుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ ఘటన వారిని షాక్‌కు గురిచేసింది. ఈ పొగమంచు కారణంగా లక్ష మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. కాలుష్యం కారణంగా ఇక్కడి ప్రజల నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చింది. శ్వాసకోశ వ్యాధులు తలెత్తాయి. లండన్‌లో వాయు కాలుష్యం 13వ శతాబ్దం నుండే మొదలైంది. దీనిని గమనించి 1301లో ఎడ్వర్డ్- I లండన్‌లో బొగ్గును కాల్చడాన్ని నిషేధించారు. 16వ శతాబ్దం నాటికి అక్కడి గాలి అత్యంత విషపూరితంగా మారింది. గ్రేట్ స్మోగ్ అనేది బ్రిటీష్ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోతుంది. 1956లో బ్రిటన్‌లో తొలిసారిగా క్లీన్ ఎయిర్ యాక్ట్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి వాతావరణ పరిస్థితుల్లో మెరుగుదల కనిపించింది. ఇది కూడా చదవండి: ఆ నిచ్చెనంటే ఎందుకు భయం? జెరూసలేంలో 273 ఏళ్లుగా ఏం జరుగుతోంది? -
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(65) సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షల అనంతరం.. గవర్నర్‌కు అపెండిసైటిస్‌గా వైద్యులు ధృవీకరించారు. గవర్నర్ అస్వస్థత గురించి రాజ్‌భవన్ అధికారుల నుంచి సమాచారం అందుకున్న వైద్యులు తొలుత విజయవాడకే వచ్చి గవర్నర్‌కు పరీక్షలు చేశారు. ఆస్పత్రిలో చేరాలని ఆయనకు సూచించారు. వైద్య నిపుణుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరిన గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం.. అపెండిసైటిస్‌గా తేల్చారు. వెంటనే గవర్నర్ నజీర్‌కు రోబోటిక్ విధానం ద్వారా సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రేపు డిశ్చార్జ్ ఆయన అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై.. సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి తిరుపతి, తిరుమల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. గవర్నర్ అస్వస్థత సమాచారం అందుకున్న వెంటనే.. సీఎం జగన్ అధికారులతో మాట్లాడారు.గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత.. అపోలోకు తరలింపు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. వివరాల ప్రకారం.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుంటుంబ సభ్యులు వెంటనే ఆయనను బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాస్త అసౌకర్యం, నీరసం ఉందని కుమారస్వామి చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. Health bulletin on HD Kumaraswamy | "Currently, he is hemodynamically stable, comfortable and coherent and has been kept under close observation," Apollo Specialty Hospital, Jayanagar pic.twitter.com/qMDI9wlyqz — ANI (@ANI) August 30, 2023 ఇక, చికిత్స అనంతరం అపోలో వైద్యులు మాట్లాడుతూ.. కుమార స్వామి తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కుమారస్వామికి చికిత్స జరుగుతోందని అపోలో హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. ఆయనకు అన్ని రకాల టెస్ట్‌లు నిర్వహించినట్లు తెలిపారు. చికిత్స చేస్తున్నామని.. ఆ చికిత్సకు కుమారస్వామి ఆరోగ్యం కూడా బాగానే సహకరిస్తోందని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన డాక్టర్లు.. అది ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం పలువురు ప్రముఖులు బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి చేరుకుని కుమారస్వామిని పరామర్శించారు. Former Karnataka Chief Minister HD Kumaraswamy admitted to Apollo Hospital in Bengaluru as he suffers a high temperature. A health bulletin released by the hospital says that the former CM is responding to treatment and is on the road to recovery. #HDKumaraswamy #Karnataka… pic.twitter.com/uDdhqa7x0c — NewsFirst Prime (@NewsFirstprime) August 30, 2023 గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయనకు ఒళ్లు నొప్పులతో పాటు జ్వరం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. గత వారం రోజులనుంచి ఆయన పలు మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలార్ జిల్లా పర్యటకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. తీరికలేని పని వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవలే కుమార స్వామికి గుండె సంబంధిత ఆపరేషన్ కూడా జరిగింది. దీంతో కుటుంసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ రద్దు..