![Two Karnataka Congress MLAs Get Into A Fight At Resort - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/20/%E0%B0%86%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C.jpeg.webp?itok=2QI_aJ8L)
అపోలో ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, బెంగళూర్ : కర్ణాటకలో రిసార్ట్స్ రాజకీయాలు వేడెక్కాయి. బెంగళూర్‌లోని ఈగల్టన్ రిసార్ట్స్‌లో సేదతీరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలిసింది. ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు బాహాబాహీకి తలపడగా, ఈ అంశాన్ని కాంగ్రెస్‌లో కీచులాటలకు సంకేతంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, జేఎన్ గణేష్‌ల మధ్య వాగ్వాదం జరగ్గా సింగ్ తలపై గణేష్ బాటిల్ విసిరికొట్టారని సమాచారం. గాయపడిన ఆనంద్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించారని స్ధానిక మీడియా వెల్లడించింది.
కాగా ఆనంద్ సింగ్‌ను ఛాతీ నొప్పి రావడంతోనే ఆస్పత్రిలో చేర్పించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇక బీజేపీ నుంచి బేరసారాలు జరుగుతాయనే భయంతో పాటు సీఎల్పీ భేటీకి నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసార్ట్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్‌ను కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment