highdrama
-
రిమాండ్ మహిళా ఖైదీ.. హైడ్రామా!
ఆదిలాబాద్: సుపారి ఇచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తన భర్త జాదవ్ గజానంద్‌ను భార్యనే హత్య చేయించిన సంఘటన ఇటీవల జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్ర ధాన నిందితురాలి గా ఉన్న మృతుని భార్య విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విష యం తెలిసిందే.ఆది లాబాద్ పట్టణంలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విజయలక్ష్మి బ్లేడ్ ముక్కలు మింగినట్లుగా జైలు ఽఅధికారులతో ఆదివారం సాయంత్రం తెలిపింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నట్లుగా పేర్కొనడంతో జైలు అధికారులు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు 24గంటల పాటు పర్యవేక్షణలో ఉంచారు.అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి బ్లేడు ముక్కలు లేవని నిర్దారించారు. దీంతో జైలు సిబ్బంది ఆమెను తిరిగి జైలుకు తరలించారు. ఈ విషయమై జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్‌ను సంప్రదించగా ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉండడంతో తిరిగి జిల్లా జైలుకు తరలించినట్లు తెలిపారు. -
ప్రేమిస్తే.. అంతే! ప్రేయసి పనికి అందరూ అవాక్కు! వైరల్ వీడియో
పిల్లలు ప్రేమించుకుంటారు. అదేదో సినిమాలో అన్నట్టు ‘‘ఈ పెద్దవాళ్లు ఉన్నారే...’’ కారణాలు ఏవైనా పెళ్లికి వ్యతిరేకిస్తారు.. దాదాపు ప్రతీ ప్రేమ కథలోనూ ఈ ట్విస్ట్ ఉంటుంది. కానీ చావనైనా చస్తాను గానీ.. ప్రియుడిని వదిలేది అంటూ పట్టుబట్టిన ఒక ప్రేయసి కథ ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్, జముయ్ జిల్లా టెటారియా గ్రామానికి చెందినవర్ష కుమారి, ధునియామన్రాన్ గ్రామానికి చెందిన ఉమేష్ యాదవ్ ప్రేమించు కున్నారు. ఇది తెలిపిన అమ్మాయి తరపు కుటుంబం వీరి ప్రేమను నిరాకరించింది. హడావిడిగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని చూసి మార్చి 11న పెళ్లి ముహూర్తం నిశ్చయించేశారు. పెళ్లి సన్నాహాలు ఊపందుకున్నాయి. అంతా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. గ్రామంలో, తెలిసిన వారికి పెళ్లి కార్డులు పంపిణీ చేశారు. ఇక సమయం లేదు మిత్రమా అనుకుందేమో..సరిగ్గా పెళ్లికి ఎనిమిది రోజులు ఉండగా శనివారం రాత్రి వర్ష ఇంట్లోనుంచి పారిపోయింది. క్షణం ఆలస్యం చేయకుండా గుడిలో ప్రియుడు ఉమేష్‌ను పెళ్లాడింది. ఇంతలో కుమార్తె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.వీరి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. జముయి జిల్లాలోని బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధునియామారన్ గ్రామంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆ గ్రామానికి చేరుకుని అమ్మాయిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఇక్కడే హై డ్రామా నెలకొంది. #जमुई में तिलक और हल्दी की रस्म के बाद लड़की ने भागकर प्रेमी से शादी रचा ली। शिकायत पर पुलिस ने जब पकड़ा तो दोनों एक दूसरे से लिपट गए। #viralvideo @NavbharatTimes pic.twitter.com/ByfC46eZxp — NBT Bihar (@NBTBihar) March 4, 2024 అమ్మాయిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. పెద్ద తోపులాట జరిగింది. అయితే చావనైనా చస్తాను గానీ భర్తను వీడేది లేదంటూ అతడిని గట్టిగా వాటేసుకుంది. ఇద్దరినీ విడదీసేందుకు పోలీసులుఎంత యత్నించినా పట్టువీడలేదు. చివరికి పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కానీ ఆ తరువాత మేజర్లు కావడంతో పోలీసులు కొత్త జంటను ఇంటికి పంపించారు. ఈ సంఘటన బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. -
కర్ణాటక హైడ్రామా : ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాహాబాహీ
-
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాహాబాహీ
సాక్షి, బెంగళూర్ : కర్ణాటకలో రిసార్ట్స్ రాజకీయాలు వేడెక్కాయి. బెంగళూర్‌లోని ఈగల్టన్ రిసార్ట్స్‌లో సేదతీరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలిసింది. ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు బాహాబాహీకి తలపడగా, ఈ అంశాన్ని కాంగ్రెస్‌లో కీచులాటలకు సంకేతంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, జేఎన్ గణేష్‌ల మధ్య వాగ్వాదం జరగ్గా సింగ్ తలపై గణేష్ బాటిల్ విసిరికొట్టారని సమాచారం. గాయపడిన ఆనంద్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించారని స్ధానిక మీడియా వెల్లడించింది. కాగా ఆనంద్ సింగ్‌ను ఛాతీ నొప్పి రావడంతోనే ఆస్పత్రిలో చేర్పించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇక బీజేపీ నుంచి బేరసారాలు జరుగుతాయనే భయంతో పాటు సీఎల్పీ భేటీకి నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసార్ట్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్‌ను కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. -
పోలీసుల అదుపులో పాత నేరస్తుడు మృతి
-పట్టుకునేందుకు ప్రయత్నిస్తే కొంగల మందు తాగాడన్న పోలీసులు -విచారణ తీరు తాళలేకే అంటున్న బంధువులు విజయవాడ: కృష్ణా జిల్లా పోలీసుల అదుపులో ఉన్న ఓ పాత నేరస్తుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... గన్నవరం పట్టణానికి చెందిన హౌసింగ్ డిపార్టుమెంట్ ఉద్యోగి కుమారుడైన పుల్లా రమేష్ అలియాస్ వెంకట రమేష్ (28) పాత నేరస్తుడు. మంగళవారం పెనమలూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్కు వచ్చిన సమాచారం మేరకు ఎస్.ఐ. వెంకటరమణ సిబ్బందితో కలిసి కానూరు మురళీనగర్కి చెందిన ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాత్రి 11.30 గంటలకు రమేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వెంట తెచ్చుకున్న కొంగల మందు మింగాడు. పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బంధువుల ఆరోపణలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో రమేష్‌ను అదుపులోకి తీసుకుని పెనమలూరు పీఎస్‌కు తరలించారు. గొలుసు చోరీలపై పోలీసు విచారణ తాళలేక రాత్రి 11 గంటల సమయంలో విషం తీసుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిస్థితి వివరించడంతో ప్రభుత్వాస్పత్రికి తరిలించారు. కుటుంబ సభ్యులు మాత్రం నోరు విప్పేందుకు సాహసించడం లేదు. జరిగిన సంఘటనపై పటమట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో వైద్యుల బృందంతో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. అర్ధరాత్రి నుంచే హైడ్రామా రమేష్ ఆత్మహత్యపై మంగళవారం అర్ధరాత్రి నుంచే హైడ్రామా చోటు చేసుకుంది. నగర డీసీపీ జి.వి.జి.అశోక్‌కుమార్, అదనపు డీసీపీ (క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు సహా పలువురు ఉన్నతాధికారులు, అధికారులు పడమట పోలీసు స్టేషన్లో సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉదయం మరోమారు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా మొదలు పోస్టుమార్టం పూర్తయ్యే వరకూ అధికారులు అక్కడే ఉండి కుటుంబ సభ్యులు, బంధువుల కదలికలపై నిఘా పెట్టారు. ఇదే సమయంలో కమిషనరేట్ నుంచి రమేష్ నేరాల చిట్టాను ఉటంకిస్తూ పత్రికా ప్రకటన జారీ చేశారు. దొంగతనాలకు నేతృత్వం వహించే రమేష్ వద్ద కొంగల మందు ఎందుకుందనే దానిపై పోలీసుల నుంచి తగిన సమాధానం లేదు.