ఆదిలాబాద్: సుపారి ఇచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తన భర్త జాదవ్ గజానంద్‌ను భార్యనే హత్య చేయించిన సంఘటన ఇటీవల జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్ర ధాన నిందితురాలి గా ఉన్న మృతుని భార్య విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విష యం తెలిసిందే.
ఆది లాబాద్ పట్టణంలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విజయలక్ష్మి బ్లేడ్ ముక్కలు మింగినట్లుగా జైలు ఽఅధికారులతో ఆదివారం సాయంత్రం తెలిపింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నట్లుగా పేర్కొనడంతో జైలు అధికారులు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు 24గంటల పాటు పర్యవేక్షణలో ఉంచారు.
అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి బ్లేడు ముక్కలు లేవని నిర్దారించారు. దీంతో జైలు సిబ్బంది ఆమెను తిరిగి జైలుకు తరలించారు. ఈ విషయమై జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్‌ను సంప్రదించగా ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉండడంతో తిరిగి జిల్లా జైలుకు తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment