గ్రామీణ బ్యాంకులో గోల్‌మాల్‌  | golmal in grameena bank | Sakshi
Sakshi News home page

గ్రామీణ బ్యాంకులో గోల్‌మాల్‌ 

Published Wed, Jan 31 2018 11:22 AM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM

golmal in grameena bank

సాక్షి, రంగారెడ్డి: అజీజ్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోని కోట్లాది రూపాయల డబ్బు  ఖాతాదారులకు తెలియకుండానే మాయం అయింది. సమాచారం తెలిసిన ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పరిసర గ్రామాల ప్రజలు బ్యాంకుకు తరలివస్తున్నారు. గ్రామస్తుల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని బ్యాంకు సిబ్బంది ఫిక్స్‌డ్‌ డిపాజట్లలోని డబ్బును మాయం చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఎఫ్‌డీలో డబ్బు మాయం అయిందన్న సమాచారంతో నాగిరెడ్డిగూడెం వాసి అయిన ఓ ఖాతాదారు కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్సలందిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement