golmal
-
అజయ్ దేవగన్– రోహిత్ శెట్టి కాంబినేషన్లో మరో సినిమా ప్రకటన
బాలీవుడ్లో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తాజాగా విడుదలైన వారి కాంబో నుంచి విడుదలైన సింగమ్ అగైన్ యాక్షన్ హంగామాతో థియేటర్స్ వద్ద సందడి చేస్తుంది. ఇప్పటికే సింగమ్ ప్రాంఛైజీలో భాగంగా 3 చిత్రాలు వచ్చాయి. అయితే, వారిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుంది. గోల్మాల్ ప్రాంఛైజీ నుంచి మరో ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రోహిత్ శెట్టి తాజాగా అధికారికంగా ప్రకటించారు.'సింగమ్' వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం గోల్మాల్ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వారిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన గోల్మాల్ రిటర్న్స్ (2008) సూపర్ హిట్ అయింది. ఈ ఫ్రాంచైజీలో గోల్మాల్ 3 (2010), గోల్మాల్ 4 (2017) కూడా వచ్చాయి. గోల్మాల్ 5 2025లో రానుందని ఆయన ఆయన ప్రకటించారు.బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల లిస్ట్‌లో 'గోల్మాల్' కూడా తప్పకుండా ఉంటుంది. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజీలో వచ్చిన నాలుగు భాగాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు పార్ట్5 ప్రకటన రావడంతో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ పెరిగింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. 'సింగమ్ అగైన్‌తో సినీ అభిమానులకు ఓ యాక్షన్ చిత్రాన్ని అందించాను. త్వరలో వారిని అన్‌లిమిటెడ్‌గా నవ్వించడానికి 'గోల్మాల్ 5' కోసం ప్లాన్ చేస్తున్నట్లు' అయన ప్రకటించారు. -
ఐపీఎల్ ఫైనల్ టికెట్ల అమ్మకంలో మాయాజాలం
-
ఏపీ విద్యాశాఖ వింత పోకడలపై సర్వత్రా విమర్శలు
-
‘వెలిగొండ’ టెండర్లలో సీఎం రమేష్ చేతివాటం
సాక్షి, అమరావతి : వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్ల(సొరంగాల) టెండర్లలో లాలూచీ పర్వం మరోసారి బట్టబయలైంది. రెండో టన్నెల్ పనుల్లో రూ.300 కోట్లకుపైగా కమీషన్లు కొట్టేసేందుకు ముఖ్యనేత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన కోటరీలోని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్, నవయుగ, పటేల్ ఇంజనీరింగ్ సంస్థలతో అదనపు(ఎక్సెస్) ధరలకు బిడ్లు దాఖలు చేయించారు. శనివారం ఫైనాన్స్(ఆర్థిక) బిడ్‌ను తెరిచి, సీఎం రమేష్ సంస్థకు ఈ పనులు అప్పగించనున్నట్లు సమాచారం. వెలిగొండ ప్రాజెక్టును 2017 నాటికే పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. టన్నెళ్ల పనులను వేగవంతం చేయాలన్న సాకు చూపి నిబంధనలు తుంగలో తొక్కి 2016 జూలై 5న కాంట్రాక్టర్లకు రూ.68.44 కోట్లు ఇచ్చేసింది. అయినా పనుల్లో వేగం పెరగడం లేదంటూ 60సీ నిబంధన కింద రెండు టన్నెళ్ల కాంట్రాక్టర్లపై వేటువేసింది. మొదటి టన్నెల్లో మిగిలిపోయిన 3.6 కిలోమీటర్ల పనుల విలువను రూ.116.44 కోట్లుగా.. రెండో టన్నెల్లో మిగిలిపోయిన 8.037 కిలోమీటర్ల పనుల విలువను రూ.299.48 కోట్లుగా స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ) లెక్కగట్టింది. అయితే, ముఖ్యనేత ఒత్తిడి మేరకు మొదటి టన్నెల్లో మిగిలిన పనుల అంచనా విలువను రూ.292.15 కోట్లు, రెండో టన్నెల్లో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.720.26 కోట్లకు పెంచేసింది. నోటిఫికేషన్‌కు ముందే బేరసారాలు మొదటి టన్నెల్ పనులకు రూ.234.04 కోట్ల అంచనా వ్యయంతో, రెండో టన్నెల్ పనులకు రూ.570.58 కోట్ల అంచనా వ్యయంతో మార్చి 26న టెండర్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ జారీ చేయకముందే కాంట్రాక్టర్లతో ముఖ్యనేత బేరసారాలు జరిపారు. పెంచిన అంచనా వ్యయం రూ.596 కోట్లలో.. సింహభాగాన్ని కమీషన్ల రూపంలో రాబట్టుకోవడానికి పథకం రచించారు. గత నెల 20న ఫైనాన్స్ బిడ్ తెరిచారు. తొలి టన్నెల్ పనులకు ఇద్దరు కాంట్రాక్టర్లు, రెండో టన్నెల్ పనులకు ఒకే కాంట్రాక్టర్ బిడ్లు దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ టెండర్లను ఆమోదించకూడదు. అయినా ఆమోదించాలంటూ ముఖ్యనేత ఒత్తిడి తెచ్చారు. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో రెండో టన్నెల్ టెండర్లను రద్దు చేశారు. రెండోసారీ అదే తీరు రెండో టన్నెల్‌కు 570.58 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎల్ఎస్(లంప్సమ్)– ఓపెన్ విధానంలో ఈ నెల 8న మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మూడు సంస్థలతో అదనపు ధరలకు టెండర్లు దాఖలు చేయించేలా ముఖ్యనేత వ్యూహం రచించారు. అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన సంస్థకు పనులు దక్కేలా మిగిలిన ఇద్దరు కాంట్రాక్టర్లతో బిడ్లు దాఖలు చేయించినట్లు అధికారులు చెబుతున్నారు. బుధవారం తెరిచిన టెక్నికల్ బిడ్‌లో కుమ్మక్కు పర్వం బహిర్గతమైంది. శనివారం ఫైనాన్స్ బిడ్ తెరిచి, సీఎం రమేష్ సంస్థకు పనులు కట్టబెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో 300 కోట్ల రూపాయలకుపైగా ముడుపులు చేతులు మారనున్నట్లు అంచనా. -
రాబంధువులు
అధికార పార్టీ నేతల బంధువులు రాబందుల అవతారమెత్తారు. నాలుగేళ్లుగా సాగుతున్న దోపిడీ పర్వంలో కొత్త అంకానికి తెర తీశారు. మాయోపాయాలతో పేదలకు అందాల్సిన అణు పరిహారం సొమ్మును గుటకాయ స్వాహా చేశారు. డబ్బు కాజేయడానికి అధికారుల నుంచి అగ్ర నాయకుల వరకు అందరినీ సమయానుకూలంగా వినియోగించుకున్నారు. రణస్థలం: తెలుగుదేశం పాలనలో దోపిడీల పర్వం కొనసాగుతోంది. ఎక్కడ అభివృద్ధి పనులు జరిగితే అక్కడ అధికార పార్టీ నాయకుల అక్రమాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తాజాగా కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం పరిహారం స్వాహా చేసిన అంశంలోనూ టీడీపీ నేతల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బినామీల రూపంలో నాయకులు, వారి బంధువులే రాబందులై పరిహారం తినేసినట్లు సమాచారం. అణు విద్యుత్ భూ సమీకరణ విస్తీర్ణం అణు విద్యుత్ భూ సేకరణలో భాగంగా 2,348 ఎకరాలు అవసరం కాగా ఇందులో ప్రభుత్వ భూమి 763.51 ఎకరాలు, గ్రామ కంఠం 52.89 ఎకరాలు, అసైన్డ్ భూమి 495.76 ఎకరాలు, జిరాయితీ 604.11 ఎకరాలు, టౌన్ షిప్ 372 ఎకరాలు, డిప్లేస్డ్ ల్యాండ్ 150ఎకరాలు ఉంది. రాత్రికి రాత్రే.. కొవ్వాడ అణు పరిహారం ప్రక్రియలో ఆక్రమిత భూములకు కూడా పరిహారం అందిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో ఎప్ప టి నుంచో పేదలు సాగు చేస్తుండడంతో వారికి కూడా పరిహారం అందించాలని నిర్ణయించారు. దీన్ని అదనుగా తీసుకున్న అధికార పార్టీ నాయకులు అక్రమాలకు తెర తీశారు. మండల కేంద్రంలోని ఓ మీ సేవా కేంద్రం వద్ద రాత్రికి రాత్రి అక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేశారు. రెవెన్యూ అధికారుల అండదండలతో ప్రభుత్వ భూమిలో ఖాళీల వివరాలు తెలుసుకుని తమ కుటుంబాల పేరున అణు సర్వేలో గెడ్డలు, వాగులు, కొండ పోరంబోకు భూములు అని తేడా లేకుండా నమోదు చేయించుకున్నారని సమాచారం. పరిహారం జాబితాలో వీరి పేర్లు చూసి రైతులు ఎంతగా మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరకు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. నాయకుల బంధువులే.. అధికార పార్టీకి చెందిన రణస్థలం మండల ఎంపీపీ గొర్లె విజయకుమార్, గొర్లె లక్ష్మణరావు, మైలపల్లి వెంకటేష్, సుంకరి ధనుంజయ వీరితోపాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీకే రాఘవన్ల పేర్లు ఈ అవినీతి బాగోతంలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పరిహారం వ్యవహారంలో వీరి జోక్యంపై మితిమీరుతోందని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. బంధువులు, సన్నిహితులు, నౌకర్ల పేరుతో పత్రాలు సృష్టించి పరిహారం కాజేసినట్లు తెలిసింది. నాలుగు విడతల్లో అందించిన 700 మంది గల పరిహార రైతుల జాబి తాలో 65 శాతం మంది అనర్హులేనని, వీరంతా అప్పటికప్పుడు పత్రాలు పట్టుకుని వచ్చిన వారేనని మండలం మొత్తం కోడై కూస్తోంది. ఇప్పటి వరకు 700 ఎకరాల వరకు పరిహారం అందజేశారు. గొర్లె విజయకుమార్ టీడీపీ ఎంపీపీ: తప్పుడు పత్రాలతో బినామీలకు ఇచ్చిన భూములు 87.50 ఎకరాలు. జీరుకొవ్వాడ గ్రామ రెవెన్యూలో సర్వే నంబర్ 67–1 నుంచి 67–30వరకు çసర్వే నంబర్ 43–81నుంచి 43–97వరకు కుటుంబసభ్యుల పేరున 87.50 ఎకరాలు. గొర్లె లక్ష్మణరావు: మాజీ జెడ్పీటీసీ సభ్యులు, ప్రస్తుత టీడీపీ నాయకులు. ఈయన దాదాపు 32 ఎకరాలకు తనవారి పేరిట తప్పుడు పత్రాలు సృష్టించారు. దానికి పరిహారం కూడా అందుకున్నట్లు సమాచారం. వీకే రాఘవన్: (తూర్పు గోదావరి జిల్లా వాసి) టెక్కలి గ్రామ రెవెన్యూలో 6.74 ఎకరాలు, బినామీల పేర్లతో పోరంబోకు భూమి సుమారు 45.23 ఎకరాలకుపైగా ఆక్రమించాడు. రుక్మిణి అగ్రికల్చరల్ ప్రైవేటు లిమిటెడ్, విజయ్ మిట్టల్ పేరున 18.28 ఎకరాలు పోరంబోకు భూమిని ఆక్రమణ భూమిగా నమోదు చేశారంటే రెవెన్యూ యంత్రాంగం ఎంత బాగా పనిచేస్తోందో అర్థమవుతుంది. ఇవే కాక ఈ భూములను అతని అనుచరులను బినామీలుగా సృష్టించి పరిహారం కాజేశారు. ఈ నలుగురి చేతిలో సుమారు 183 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. మొత్తం అక్రమాల్లో పాల్గొన్న వారి చేతిలో రెండు వందలకుపైగా ఎకరాలు ఉన్నట్లు తెలిసింది. ఈ భూమికి అందించే పరిహారం మొత్తం నాయకుల చేతికే వెళ్తుంది. పార్టీలోకి వస్తేనే పరిహారం.. అల్లివలస ఎంపీటీసీ, కోటపాలెం సర్పంచ్‌లు అణు భూములను బినామీలు, బంధువుల పేర్లతో గత సర్వేలోనే నమోదు చేయించుకున్నారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో తొలుత కోటపాలెం సర్పంచ్ ఎస్.ధనుంజయ, తర్వాత అల్లివలస ఎంపీటీసీ మైలపల్లి వెంకటేష్ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు టీడీపీ కండువా కప్పుకున్నారు. కళా సంతకం పెడితే.. అణు పరిహార జాబితాలో పేరు, భూముల రికార్డులు సి ద్ధంగా ఉన్నా అణు పరిహారం అందాలంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే కళా వెంకటరావు గ్రీన్ కలం తో సంతకం పెట్టాలి. ఆ వెంటనే టీడీపీ నాయకులకు ప రిహారం అందిపోతుంది. దీనిపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిహారం కోసం తాము ప్రయాస పడుతుంటే ఇలా చేయడం తగదంటున్నారు. వలస వచ్చినోడికి పరిహారం మా తండ్రి పేరున సర్వే నంబర్ 24–6 సబ్ డివిజన్ 23లో 1.21 ఎకరాల డీపట్టా భూమి ఉంది. ఆ భూమిని తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడకు పనికోసం వచ్చిన వీకే రాఘవన్ పేరిట ఆక్రమణ భూమిగా నమోదు చేశారు. సమాచార సేకరణ చట్టం ద్వారా పత్రాలు సేకరించాను. బ్యాంకులో లోను మంజూరు చేసిన పత్రాలు కూడా చూపించినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో తప్పక న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. – యతిరాజ్యం అప్పలరాజు, బాధితుడు పరిశీలనలో లేదు.. అణు పరిహారంలో 1473 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంటే అందులో 512 ఎకరాలు ఆక్రమణదారులకు, 188 ఎకరాలు వరకు డీపట్టాదారులకు ఇప్పటివరకు పరిహారం చెల్లించాం. 80 ఎకరాలు నాన్ రెసిడెన్సీ, ఐదు ఎకరాలు మించిన వారు ఉన్నారు. 25 ఎకరాలు న్యాయస్థానంలో ఉంది. 30 ఎకరాలు పరిశీలనలో ఉంది. మరో 600 ఎకరాల ఖాళీ స్థలం ఉంటే అందులో గెడ్డలు వాగులు 170 ఎకరాలు ఉన్నాయి. బినామీలు, బంధువులు అనేది మా పరిశీలనలో లేదు. ఆధార్ అనుసంధానం చేసి పరిహారం చెల్లిస్తున్నాం. – కె. శ్రీరాములు, తహసీల్దార్ -
గ్రామీణ బ్యాంకులో గోల్మాల్
సాక్షి, రంగారెడ్డి: అజీజ్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. తమ ఫిక్స్డ్ డిపాజిట్లలోని కోట్లాది రూపాయల డబ్బు ఖాతాదారులకు తెలియకుండానే మాయం అయింది. సమాచారం తెలిసిన ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పరిసర గ్రామాల ప్రజలు బ్యాంకుకు తరలివస్తున్నారు. గ్రామస్తుల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని బ్యాంకు సిబ్బంది ఫిక్స్డ్ డిపాజట్లలోని డబ్బును మాయం చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఎఫ్డీలో డబ్బు మాయం అయిందన్న సమాచారంతో నాగిరెడ్డిగూడెం వాసి అయిన ఓ ఖాతాదారు కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్సలందిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. -
తడిసి మోపెడు!
గన్‌జాటం! తెరపైకి మళ్లీ రెయిన్గన్లు! వేరుశనగకు రక్షకతడులు అందించే యత్నం నిర్వహణకు ఏఓల వెనుకడుగు మైక్రో ఇరిగేషన్‌కు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఈ నెల 14న నిర్వహణపై వర్క్‌షాపు.. ఆపై పంపిణీ గత ఏడాది భారీగా గోల్మాల్ కర్ణాటక రైతులకు అమ్ముకున్న టీడీపీ నేతలు ఉన్నవి ఇళ్లలో దాచుకుని అధికారులపై రుబాబు ప్రభుత్వం మరోసారి రెయిన్గన్లతో హడావుడి చేసేందుకు సిద్ధమవుతోంది. గతేడాది 15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగైంది. జూలై ఆఖరు, ఆగస్టులో వర్షాభావంతో పంట ఎండిపోయింది. జూలైలోనే రేయిన్గన్లు జిల్లాకు చేరినా.. సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని భావించడం, కృష్ణా పుష్కరాల హడావుడిలో ఆయన రాకపోవడంతో పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఆగస్టు 15న సీఎం జిల్లాకు వచ్చినా పర్యటన హడావుడిగాముగిసింది. చివరకు పత్తిపాటి పుల్లారావుతో ఆగస్టు 22న రేయిన్గన్లను పంపిణీ చేశారు. అప్పటి పంటలు పూర్తిగా ఎండిపోయాయి. ఆగస్టు 28న సీఎం ‘అనంత’ పర్యటనకు వచ్చి పంట ఎండిన సంగతి తనకు తెలీదని, లేదంటే పంటను కాపాడే వాళ్లమని చెప్పారు. ‘మిషన్–1’ పేరుతో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జిల్లాలోనే మకాం వేయడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఓ ప్రణాళిక లేకుండా పంటసంజీవని పరికరాలను ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు. పంటలను కాపాడిన లెక్కలు కూడా ఇష్టారీతిన నమోదు చేశారు. గతేడాది ‘అనంత’లో మాత్రమే 5,887 రెయిన్గన్లు, 5,495 స్ప్రింక్లర్లు, 4,17,000 పైపులు, 4478 ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేశారు. వీటికి రూ.67 కోట్లు ఖర్చు చేశారు. రికవరీకీ ఆపసోపాలు రెయిన్గన్ల పంపకం పూర్తిగా టీడీపీ నేతల కనుసన్నల్లో సాగింది. వారివద్దకు వెళ్లిన వారికే రేయిన్గన్లు ఇచ్చారు. మిషన్–1, మిషన్–2 పూర్తయిన తర్వాత రేయిన్గన్ల రికవరీని అధికారులు గాలికొదిలేశారు. అధికారపార్టీ నేతలు కర్ణాటకలోని రైతులకు విక్రయించారు. ఈ విషయం పత్రికల ద్వారా వెలుగులోకి రావడంతో అధికారులు రికవరీకి నడుం బిగించారు. మెజార్టీ పరికరాలు రైతుల వద్ద లేవని, అధికారపార్టీ నేతల ఇళ్లలోనే ఉన్నాయని గ్రహించారు. కొందరు పరికరాలు ఇచ్చేశారు.. ఇంకొందరు అతిబలవంతంగా పగిలిపోయిన పైపులు, ప్రభుత్వం పంపిణీ చేసిన పైపులు కాకుండా వేరే పైపులు, పనిచేయకుండా తుక్కుగా మారిన ఆయిల్ ఇంజన్లు ఇచ్చారు. రివకరీకి వెళ్లిన ఏఓలు, ఎంపీఈఓలను అధికార పార్టీ నేతలు దుర్భాషలాడారు. కొందరు మహిళలు ఏడ్చుకుంటూÐð వెనుదిరిగిన వారూ ఉన్నారు. అధికారులు రికవరీ చేసినవి కాకుండా ఇంకా 800 రెయిన్గన్లు, 1473 స్ప్రింక్లర్లు.. 91,880 పైపులు, 414 ఇంజన్లు రికవరీ కావాలి. వీటికి రికవరీకీ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. కేసులు నమోదు చేస్తే బదిలీ తప్పదని ఏఓలను ఎమ్మెల్యేలు హెచ్చరించారు. దీంతో అధికారులంతా రైతులపై పోలీసు స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది నిర్వహణకు ఏఓలు ససేమిరా: ఈ ఏడాది రేయిన్గన్ల ద్వారా రక్షకతడులు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనిపై ఈనెల 14న అనంతపురంలో వర్క్‌షాపు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 80వేల హెక్టార్లలో వేరుశనగ సాగయింది. గతేడాది ఈ సమయానికి 2.50–3లక్షల హెక్టార్లలో సాగు చేశారు. వర్షాభావంతో విత్తుపడటం లేదు. సాగైన పంటకు నీళ్లివ్వాలంటే బోర్లలోనూ నీళ్లు లేవు. బోర్లలో నీరున్న రైతుల నుంచి పక్క రైతుకు ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఈ అంశంలో రైతుల మధ్య గతేడాది ఘర్షణ వాతావరణం తలెత్తింది. ట్యాంకర్ల నుంచి సరఫరా చేయాలనుకున్నా ఎక్కడా నీళ్లు అందుబాటులో లేవు. దీనికి తోడు రెయిన్గన్లు ఇవ్వడం, పంటలను కాపాడటం, కాపాడినా, లేకపోయినా, తప్పుడులెక్కలు రాయడం ఏఓలు తమ వల్ల కాదని తేల్చిచెబుతున్నారు. రెయిన్గన్లకు జియో ట్యాగింగ్ ఇచ్చామని, కర్నూలు నుంచి మరో 3088 రేయిన్గన్లు, 1223 ఆయిల్ ఇంజిన్లు, 4995 స్ప్రింక్లర్లు, 2,01,568 పైపులను తీసుకొస్తున్నామని వ్యవసాయాధికారులు చెబుతున్నా.. ససేమిరా అంటున్నారు. దీంతో వీటి నిర్వహణను మైక్రోఇరిగేషన్ కంపెనీలకు ఇవ్వాలని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. దీనిపై 14 నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాలో పంట సంజీవని పరికరాల పరిస్థితి ఇదీ: రెయిన్గన్లు స్ప్రింక్లర్లు పైపులు ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేసినవి 5887 5495 417000 4478 రికవరీ అయినవి 5087 4022 325120 4064 రికవరీ కావల్సినవి 800 1473 91,880 414 పంటసంజీవని ప్రారంభిస్తాం: శ్రీరామ్మూర్తి, జేడీఏ పంట సంజీవనిపై ఈ నెల 14న వర్క్‌షాపు నిర్వహిస్తున్నాం. రివకరీ, కర్నూలు నుంచి వచ్చే పరికరాలపై చర్చిస్తాం. ఈ ఏడాది జియో ట్యాగింగ్ పెట్టాం. వీటి నిర్వహణను మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. దీనిపై 14 నిర్ణయం వస్తుంది. ఆ వెంటనే రక్షకతడులు ప్రారంభిస్తాం. -
గురుకుల పాఠశాల ఇంటర్ సీట్లలో పైరవీలు
-
అంతా వి‘తంతే’
దుర్వినియోగానికి కేరాఫ్ పిఠాపురం తవ్వే కొద్దీ బయటపడుతున్న భాగోతం పింఛన్ల అవకతవకలను బయటపెట్టిన ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో విచారణకు కలెక్టర్ ఆదేశం తమ్ముళ్లు గప్‌చుప్... సాక్షి ప్రతినిధి, కాకినాడ : ∙పిఠాపురం మున్సిపాల్టీలోని 7వ వార్డుకు చెందిన జి.అనంతలక్షి్మకి వితంతు పింఛ¯ŒS ఈ నెల 6న పంపిణీ చేశారు. ఆమె పింఛ¯ŒS ఐడీ నంబరు (1048498163555). ఆమె భర్త ఆదినారాయణ బతికే ఉన్నాడు. 22 వార్డులో ఖండవల్లి లక్ష్మి భర్త అర్జునుడు (పింఛ¯ŒS ఐడీ నంబర్ 5697967), ఇందల అనంత లక్ష్మి భర్త సత్యనారాయణ (పింఛ¯ŒS ఐడీ నంబర్ 5721215), బుద్దాల వెంకయ్యమ్మ భర్త అప్పారావు (పింఛ¯ŒS ఐడీ నంబర్ 5691967) భర్తలు సజీవంగా ఉండగా వీరి పేరుతో వితంతు పింఛన్లు మంజూరై పంపిణీ కూడా పూర్తి చేశారు. వీరంతా పది రోజులు ముందు ఆ¯ŒSలై¯ŒSలో దరఖాస్తు చేసుకున్న వారే కావడం గమనార్హం. l ఎస్.సీతకు (పింఛ¯ŒS ఐడీ నంబరు 104843555)తో ఈ నెల 3న వితంతు పింఛ¯ŒS పంపిణీ చేశారు. ఈమె ఈ వార్డుకు చెందిన లబ్ధిదారు కాదని స్థానికులు చెబుతున్నారు. ఎస్.వల్లీబీకి (పింఛ¯ŒS ఐడీ నంబరు 104848805)తో ఈ నెల 6న వితంతు పింఛ¯ŒS పంపిణీ చేశారు. ఈమెది కూడా ఈ వార్డు కాదు. ఇలా వేరే వార్డుల్లో లబ్ధిదారులను మరో వార్డుల్లో చూపించారు. l 16వ వార్డులో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ భర్త చనిపోయి ప్రభుత్వ పింఛ¯ŒS పొందుతున్న కె.నూకరత్నం, పెదపాటి పుష్పరత్నం (పింఛ¯ŒS ఐడీ నంబర్ 104844711)కు నిబంధనలను బుట్టదాఖలు చేసి పింఛన్లు పంపిణీ చేశారు. అర్హత లేకున్నా మీకు పింఛ¯ŒS కావాలా..ఎటువంటి సర్టిఫికెట్ అవసరం లేదు. పిఠాపురం వస్తే చాలు. అన్నీ మేం చూసుకుంటామంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అక్కడ నిబంధనలతో పనిలేదు. కావాల్సిన అర్హతల్లా అధికారపార్టీ నేతల అనుచరలై ఉంటే చాలు. మరణ ధ్రువీకరణ పత్రం జతచేసి ఆ¯ŒSలై¯ŒS చేసి కార్యాలయాల చుట్టూ పదేపదే తిరిగితే తప్ప మంజూరుకాని వితంతు పింఛ¯ŒS తమ్ముళ్లు తలుచుకుంటే ఇట్టే చేతిలో పెట్టేస్తారు. పింఛన్లు తీసుకోవాలంటే స్థానికులై ఉండాలనే నిబంధనను కూడా అక్కడ గాలిలో కలిపేశారు. స్థానికంగా పేరు, ఊరు తెలియని వారికి సైతం పింఛన్లు మంజూరైపోయాయి. భర్త నిశ్చింతగా ఉన్నా చనిపోయినట్టు చూపించి సంక్షేమ ఫలాలను అడ్డగోలుగా తెలుగు తమ్ముళ్లు అనుచరులకు దోచిపెట్టేశారు. ఈ పరిస్థితి దాదాపు జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లోను కనిపిస్తోంది. అయితే పిఠాపురంలో నియోజకవర్గ నేత దగ్గర నుంచి ద్వితీయ శ్రేణి నాయకుడి వరకూ అందరూ ఒక్కటై అడ్డగోలుగా అనర్హులకు కట్టబెట్టేశారు. అందుకే ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. భర్తలు బతికున్నా... పిఠాపురంలో పింఛన్లలో మోసాలు తవ్వే కొద్దీæ బయటపడుతున్నాయి. ‘భర్తలుండగానే... వితంతు పింఛన్లు’ శీర్షికన ‘సాక్షి’ ఆధారాలతో సహా మెయి¯ŒS ఎడిషన్‌లో వెలుగులోకి తేవడంతో జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ స్పందించి విచారణకు ఆదేశించారు. పిఠాపురం మున్సిపాలిటీలో 30 వార్డులున్నాయి. తమ్ముళ్లకు మెచ్చి నచ్చిన వార్డులో 15 నుంచి 20 పింఛన్లు పందేరం చేశారు. నచ్చని వార్డుల్లో ఆరేడుకు మించి ఇవ్వలేదు. అవి కూడా అంతా బోగస్ పింఛ¯ŒSదారులేనని తేలుతున్నాయి. భర్తలు బతికుండగా సుమారు 30 మంది మహిళలకు వితంతువు పింఛన్లు మంజూరు చేశారన్న విమర్శలున్నాయి. మున్సిపాలిటీలో అన్ని రకాల పింఛన్లు కలిసి 3,800 ఉండేవి. ఇవికాకుండా తాజా జన్మభూమిలో 321 పింఛన్లు కొత్తగా పంపిణీ చేశారు. వీటిలో వితంతు, దివ్యాంగ, వృద్దాప్య, చేనేత, కల్లుగీత కార్మికుల పింఛన్లు న్నాయి. వీటిలో మూడొంతులు అనర్హులకు కట్టబెట్టేశారు. నియోజకవర్గ నేత అండదండలు, అధికారం చేతిలో ఉందని ఏమి చేసినా అడిగే వాడు లేడనే ధైర్యంతో అనర్హులకు పింఛన్లు అడ్డగోలుగా కట్టబెట్టేశారు. 500 దరఖాస్తుదారుల ఎదురు చూపులు... అనర్హులకు అడ్డంగా కట్టబెట్టేసిన ఈ మున్సిపాల్టీలో గడచిన రెండేళ్లుగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని గంపెడాశతో నిరీక్షిస్తున్న 500 మంది వైపు కన్నెత్తి చూడలేదు. వీరంతా దరఖాస్తులు ఆ¯ŒSలై¯ŒSలో చేసుకున్నప్పటికీ వాటిని పట్టించుకోలేదు. మరణ ధ్రువీకరణ పత్రాలు లేకుండా వితంతు పింఛన్లు, వయస్సు నిర్థారణ లేకుండా వృద్ధాప్య పింఛన్లు ఇవ్వకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ఇవన్నీ ఉన్నా పింఛన్లు మంజూరుకావాలంటే తమ్ముళ్ల సిఫార్సు కావాలి. కానీ ఇక్కడ ఇటువంటి సర్టిఫికెట్లు లేకుండానే పింఛ¯ŒSలు పంపిణీ చేసేశారు. విపక్ష నేతల వార్డుకు రిక్త హస్తాలే... మున్సిపాల్టీలో వైఎస్సార్ సీపీ పక్ష నేత గండేపల్లి బాబి ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు 27. ఈ వార్డుకు ఏడు పింఛన్లు ఇచ్చారు. వాటిలో నలుగురు మాత్రమే ఆ వార్డుకు చెందిన వారు. మిగిలిన ముగ్గురు అసలు ఏ వార్డుకు చెందిన వారో తెలియదంటున్నారు. కానీ ఆ ముగ్గురు (మద్ది వీరవెంకట సత్యనారాయణ అచ్యుతాంబ, పెచ్చెట్టి సత్యవేణి, నక్కా గంగారత్నం)కి పింఛన్లు పంపిణీ అయిపోయాయి. సామాజిక వర్గాలను సైతం తప్పుగా చూపించి ఓసీలను బీసీలుగాను మార్చి మరీ పంపిణీ చేసినవి సుమారు 50 వరకూ ఉంటాయని లెక్క లేస్తున్నారు. అధికార పార్టీ నేతల అధికార దుర్వినియోగానికి ఇవి పరాకాష్టగా నిలుస్తున్నాయి. అధికారులు నిష్పక్షపాతంగా మరింత లోతైన విచారణ జరిపితే అక్రమాలు పుట్ట కదులుతుందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీతోపాటు ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులాపల్లి, ఇసుకపల్లి, ఎండపల్లి, ఉప్పాడ గ్రామాల్లో మరణ ధ్రువీకరణలు లేకుండానే పంపిణీ చేసిన పింఛన్లకు సర్టిఫికెట్ల సేకరణలో స్థానిక నేతలు తలమునకలవుతున్నారు. -
కాతేరులో దొంగలుపడ్డారు
ఇంటి, కుళాయి పన్నుల్లో గోల్మాల్ ప్రత్యేక సిబ్బందిని పెట్టి మరీ గుంజుడు మూడేళ్లలో రూ.3.6 కోట్ల వసూలు ఈ కాలంలో గ్రామంలో కానరాని అభివృద్ధి ప్రస్తుతం జనరల్ ఖాతాలో మిగిలింది రూ.3.2 లక్షలే.. మిగిలిన సొమ్ముకు రెక్కలు! రాజమహేంద్రవరం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కాతేరు పంచాయతీలో దొంగలు పడ్డారు. అదీ అందరూ చూస్తూండగానే మూడేళ్ల నుంచి ప్రజల సొమ్మును అప్పనంగా దోచేసుకుంటున్నారు. ఇంత జరుగుతుంటే ప్రజలు ఫిర్యాదు చేయలేదా? పోలీసులు, ఉన్నతాధికారులు పట్టించుకోలేదా? అనే సందేహం రావచ్చు. కానీ ఆ ఛా¯Œ్స ఇవ్వకుండా పంచాయతీ అధికారులు అధికారికంగా ‘అధికార’ బలంతో గుట్టు చప్పుడు కాకుండా మూడేళ్లుగా తమ పని కానిచ్చేస్తున్నారు. ఎంతగా అంటే పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్రీ్టషియ¯ŒSల జీతాలకు కూడా డబ్బులు లేకుండా అందిన కాడికి మాయం చేస్తున్నారు. జీతాలివ్వండి మహాప్రభో అంటూ కార్మికులు మొత్తుకున్నా ‘డబ్బుల్లేవు, బిల్లులు రావడంలేదు’ అని చెబుతూ పంచాయతీ నిధులు అప్పనంగా బొక్కేశారు. సాక్షి, రాజమహేంద్రవరం : ఇటీవల నిర్వహించిన ప్రజా సాధికార సర్వే ప్రకారం కాతేరు పంచాయతీలో 6,900 ఇళ్లు, దాదాపు 5 వేల కుళాయిలు ఉన్నాయి. ప్రతి ఇంటి యజమాని నుంచీ ఏటా క్రమం తప్పకుండా ఇంటిపన్ను, కుళాయి పన్ను వసూలు చేస్తున్నారు. కుళాయి పన్నుగా ఏడాదికి రూ.600 చొప్పున వసూలు చేశారు. 50 గజాల స్థలంలో ఉన్న ఇంటికి కుళాయి, ఇంటి పన్ను కలపి రూ.1500 చొప్పున వసూలు చేశారు. ఇక పెద్ద ఇళ్లకు దాదాపు రూ.4 వేల వరకూ పన్ను వేశారు. కనీసం 50 గజాల ఇంటిని పరిగణనలోకి తీసుకుని 6,900 ఇళ్లకు కలిపి పన్ను, కుళాయిల పన్ను వేసినా.. పంచాయతీకి ఏడాదికి రూ.1,03,50,000 ఆదాయం వచ్చింది. ఇలా ఇంటి, కుళాయి పన్నుల రూపంలో 2014 నుంచి మూడేళ్లకు రూ.3,10,50,000 ఆదాయం పంచాయతీకి వచ్చింది. ఇంత ఆదాయం ఉన్నందుకు గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరగాలి. కానీ, అభివృద్ధి మాట దేవుడెరుగు! పంచాయతీలో పారిశుద్ధ్యం సహితం పరమ అధ్వానంగా ఉంది. 18 వార్డులకుగానూ నిన్న మొన్నటివరకూ రెండు అద్దె ట్రాక్టర్లు తీసుకున్నారు. కానీ వాటికి అద్దె చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్ కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం 13వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్‌తో పంచాయతీలోని 18 వార్డుల్లో చెత్తను తరలిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్, 17 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తూండగా వారికి ఐదు నెలలుగా జీతాలివ్వడంలేదు. మరో ఎనిమిది మంది తాగునీటి, విద్యుత్, కార్యాలయం సిబ్బంది ఉన్నారు. వీరికి కూడా ఐదు నెలలుగా జీతాలు లేవు. 2014 నుంచి ఇప్పటివరకూ పంచాయతీ పరిధిలో అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవు. మూడు నెలలుగా పంచాయతీలో వీధి దీపాలు కూడా వెలగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బాదుడు ప్రత్యేకం పంచాయతీలో అధికారికంగాకంటే అనధికారికంగా వేసుకున్న నీటి కుళాయిలే అధికం. కొత్త కుళాయి కనెక్ష¯ŒS ఇవ్వడం కోసం రూ.2400 వసూలు చేసేవారు. కానీ ప్రస్తుతం సస్పెండైన కార్యదర్శి ఈ మొత్తాన్ని రూ.4,500కు పెంచి, అనధికారికంగా కుళాయిలు ఏర్పాటు చేసుకున్న వారందరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. సాధారణంగా పంచాయతీకి కట్టిన ఫీజులోనే కుళాయి ఏర్పాటుకు అవసరమైన మెటీరియల్ సమకూర్చుతారు. అయితే ఇక్కడ ముందుగానే ఇంటి యజమానులు ఎవరికి వారు కుళాయిలు ఏర్పాటు చేసుకున్నాక, వారి నుంచి రూ.4500 వసూలు చేశారు. పంచాయతీకి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. పంచాయతీలో గుమాస్తా, బిల్ కలెక్టర్ లేకపోవడంతో ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు ప్రత్యేకంగా ఇద్దరిని నియమించారు. వసూలు చేసిన దాంట్లో రూ.లక్షకు రూ.10 వేలు కమీష¯ŒS ఇచ్చేవిధంగా ఒప్పందం కుదుర్చుకుని పని కానిచ్చేశారు. ఇలా దాదాపు మూడు వేల కుళాయిల నుంచి రూ.4500 చొప్పున సుమారు రూ.1.35 కోట్లు వసూలు చేశారు. వసూళ్ల సిబ్బందికి సహాయంగా తాము కూడా వెళ్లేవారమని పారిశుద్ధ్య కార్మికులు చెబుతున్నారు. ఈ లెక్కన మూడేళ్లలో ఇంటి, కుళాయి పన్నుల ద్వారా రూ.3.10 కోట్లు, కుళాయి ఫీజుల ద్వారా రూ.1.35 కోట్లు వెరసి రూ.4.45 కోట్ల పంచాయతీ నిధులు ఉండాలి. 2014 నుంచి ఇప్పటివరకు గ్రామంలో ఒక్క సిమెంట్ రోడ్డుకాని, డ్రైనేజీకాని నిర్మించ లేదు. కానీ ప్రస్తుతం పంచాయతీ జనరల్ ఫండ్‌లో రూ.3.20 లక్షలు మాత్రమే ఉన్నాయని ఇ¯ŒSచార్జ్ కార్యదర్శి సునీత తెలిపారు. దీనినిబట్టి మిగిలిన కోట్లాది రూపాయల సొమ్ము స్వాహా అయినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
టెండర్ల రద్దులో సీఎం బంధువు కీలకపాత్ర!
-
తిరుపతి స్విమ్స్ టెండర్లలో గోల్మాల్
-
హాం ఫట్
ఉపాధి కూలీల పేరిట సొమ్ము స్వాహా రూ.25 లక్షలు కాజేసినట్టు గుర్తించిన అధికారులు జగ్గంపేట సబ్ పోస్టాఫీసు పరిధిలోని రాజపూడిలో బాగోతం బీపీఎంపై సస్పెన్షన్ వేటు పోస్టల్ శాఖకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఆన్ లైన్ లో పెట్టినప్పటికీ.. అక్రమాలకు మాత్రం కళ్లెం పడడం లేదు. తాజాగా రాజపూడి గ్రామంలోని బ్రాంచ్ పోస్టాఫీసులో జరిగిన బాగోతం వెలుగులోకి వచ్చింది. – రాజపూడి(జగ్గంపేట) జగ్గంపేట సబ్ పోస్టాఫీసు పరిధిలో ఉన్న రాజపూడి బ్రాంచ్ పోస్టాఫీసు ద్వారా ఐదు గ్రామాల ప్రజలకు తపాలా సేవలందుతున్నాయి. ఉపాధి హామీ, ఉద్యానవన పనులకు సంబంధించి కూలీలకు వారానికి దాదాపు వెయ్యి మందికి వేతనాలు చెల్లిస్తున్నారు. రాజపూడితో పాటు సమీపంలోని గోవిందపురం, కృష్ణాపురం, సీతారాంపురం, మన్యంవారిపాలెం గ్రామాల కూలీలు ఉపాధి, ఉద్యానవన పనుల వేతనాలు తీసుకుంటున్నారు. కూలీలకు ఇచ్చే సొమ్మును ముందుగానే జగ్గంపేట సబ్ సోస్టాఫీసు ద్వారా నగదు రూపంలో తీసుకుని పే స్లిప్‌ల ఆధారంగా చెల్లించాల్సి ఉంది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం! ఏడాదిగా కూలీలకు చెల్లించే దానికి అదనంగా సొమ్మును చూపి గ్రామంలోని బీపీఎం ఎస్.లక్ష్మి సూర్యకాంతం డ్రా చేశారు. ఎప్పటి కప్పుడు సరిచూసుకోవాల్సిన పోస్టల్ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా సుమారు రూ.25 లక్షల వరకూ స్వాహా అయినట్టు ఇప్పటివరకూ నిర్ధారించారు. ఇంకా పోస్టల్ లావాదేవీలను తనిఖీ చేయాల్సి ఉంది. మరిన్ని అవకతవకలు బయటపడే అవకాశం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కొనసాగుతున్న విచారణ ఆలస్యంగా మేల్కొన్న పోస్టల్ ఉన్నతాధికారులు.. ఈ బాగోతంపై విచారణ చేపట్టి, తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో పెద్దాపురం పోస్టల్ ఇన్ స్పెక్టర్ ప్రకాశరావు రాజపూడి బ్రాంచ్ పోస్టాఫీసులో రికార్డులను స్వాధీనం చేసుకుని, విచారణ చేపట్టారు. బీపీఎం నిధులను అదనంగా డ్రా చేసినట్టు ఈ విచారణలో నిర్ధారించారు. దీనిపై పోస్టల్ ఇన్స్పెక్టర్ ప్రకాశరావును వివరణ కోరగా, ఇప్పటికి సుమారు రూ.25 లక్షలు దుర్వినియోగం అయినట్టు గుర్తించామని చెప్పారు. ఇంకా విచారణ కొనసాగుతుందని తెలిపారు. బీపీఎంపై సస్పెన్షన్ వేటు వేసి, మల్లిశాల బీపీఎంకు తాత్కలికంగా బాధ్యతలు అప్పగించామన్నారు. ఇలాఉండగా రాజపూడి బీపీఎం నుంచి రూ.3 లక్షలు రికవరీ చేసినట్టు జగ్గంపేట పోస్టల్ అధికారి సత్యనారాయణ తెలిపారు. -
ట్రాన్స్ఫార్మర్ల కొను‘గోల్మాల్’
టెండర్లు లేకుండా కొనుగోలు పాత సంస్థకే మళ్లీ ఆర్డర్ ఇచ్చిన సెస్ మెజారిటీ డైరెక్టర్లు వద్దన్నా అటువైపే మొగ్గు రూ.92.50 లక్షలతో 70 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు వివాదాస్పదమైంది. పర్చేస్ కమిటీ టెండర్లు పిలువకుండానే 70 ట్రాన్స్ఫార్మర్లను రూ.92.50 లక్షలతో కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం టెండర్లు పిలువాల్సి ఉండగా.. అదేం లేకుండా పాత కంపెనీకే కొత్త ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ‘సెస్’లోని కీలక వ్యక్తులు కమీషన్లు(ముడుపులు) పొందారనే ఆరోపణలున్నాయి. కొత్త ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుపై సెస్ పాలకవర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ డైరెక్టర్లు వద్దన్నా.. కొత్త ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుపై మెజారిటీ డైరెక్టర్లు ఇటీవల సమావేశమై టెండర్లు పిలువాలని.. పాత సంస్థకు ఇచ్చే ఆర్డర్లను రద్దు చేయాలని సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డికి లేఖ అందించారు. దీనిపై పాలకవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ హామీ ఇచ్చారు. కానీ మళ్లీ పాత సంస్థకే ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు ఆర్డర్ ఇవ్వడంపై డైరెక్టర్లే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ఐరన్, కాపర్, ఇతర సామగ్రి ధరలు తగ్గిన నేపథ్యంలో పాత ధరలకే ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేయడంపై డైరెక్టర్లు అభ్యంతరం తెలిపారు. 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ధర రూ.1.60 లక్షలు ఉండగా, 60 కేవీ ట్రాన్స్ఫార్మర్ ధర రూ.95 వేలు ఉంది. ఇంత కన్నా తక్కువ ధరకు ఇతర కంపెనీలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. పాత కంపెనీకే ఆర్డర్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. సదరు కంపెనీతో చేసుకున్న కమీషన్ల ఒప్పందం మేరకే మళ్లీ ఆర్డర్ ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. పునరావాస కాలనీలకు.. మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురవుతున్న గ్రామాలకు ప్రభుత్వం కొదురుపాక, నాంపల్లి, తిప్పాపూర్, చంద్రగిరి గ్రామాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తోంది. ఈ కాలనీల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ కలెక్టర్ నీతూప్రసాద్ సెస్ సంస్థకు డబ్బులు డిపాజిట్ చేసింది. వీటితో సెస్ ట్రాన్స్పార్మర్లు కొనుగోలు చేస్తుంది. 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లను 40, 60 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 30 కొనుగోలు చేసేందుకు పాత కంపెనీకే ఆర్డర్లు ఇచ్చారు. పాత కంపెనీ ప్రతినిధులతో సెస్లోని కీలక వ్యక్తులకు సత్సంబంధాలు ఉండడంతో మళ్లీ ఆ కంపెనీకే ఆర్డర్లు ఇచ్చారనే వాదన ఉంది. సెస్ బాస్ మెతక వైఖరితో అన్నింటికీ తలూపడం, నిబంధనల విషయంలో ముక్కు సూటిగా వ్యవహరించకపోవడంతో కొను‘గోల్మాల్’కు అవకాశంగా మారిందని పాలకవర్గ సభ్యుడొకరు చెప్పారు. తప్పుడు ఆరోపణలు.. దోర్నాల లక్ష్మారెడ్డి, సెస్ చైర్మన్ పునరావాస కాలనీలో విద్యుత్ సౌకర్యం యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. ఈ ఏడాదే 3 టీఎంసీల నీటిని మధ్యమానేరులో నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఊరు మునిగిపోతే జనం పునరావాస కాలనీకి వస్తారు. అక్కడ కరెంట్ లేక పోతే సెస్‌ను నిందిస్తారు. టెండర్ ప్రాసెస్ పూర్తి కావడానికి 45రోజులు పడుతుంది. అందుకే పాత కంపెనీకే ఆర్డర్లు ఇచ్చాం. అవసరాన్ని బట్టి రిపీట్ ఆర్డర్లు ఇవ్వొచ్చు. పాలకవర్గ సభ్యులకు ఈ విషయంలో స్పష్టత ఇచ్చాను. సమావేశానికి రానివారు, సంస్థను పాలకవర్గాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. వారివన్నీ తప్పుడు ఆరోపణలు. సంస్థ రూల్స్‌పై నాకు పూర్తి అవగాహన ఉంది. వ్యవసాయ సీజన్ మొదలైంది. ‘సెస్’కు ట్రాన్స్ఫార్మర్లు వెంటనే అవసరం ఉన్నాయి. అందుకే కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం. -
ఆప్కోలో గోల్మాల్ రూ.600 కోట్లు?
చేనేత సొసైటీలకు బదులు తమిళనాడు నుంచి వస్త్రాల కొనుగోళ్లు * తక్కువ ధరకు నాసిరకం వస్త్రాలు తెచ్చి ఎక్కువ ధరకు అంటగట్టిన వైనం * ఉత్పత్తే చేయని స్థానిక సొసైటీల పేరిట దొంగ బిల్లులు * పాలకమండలి సభ్యులు, అధికారుల పాత్రపై అనుమానాలు * ఆర్వీఎంకు వస్త్రాల సరఫరాలోనూ భారీగా అవకతవకలు * నెల రోజులుగా ముందుకు సాగని త్రిసభ్య కమిటీ విచారణ * విచారణలో కమిటీకి సహకరించని టెస్కో పాలక మండలి, అధికారులు సాక్షి, హైదరాబాద్: చేనేత సహకార సంఘాల ముసుగులో ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో)లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయి. పాలకమండలి సభ్యులు, అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో నెలకొన్న పాలనా సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని రూ. 600 కోట్ల మేర సొమ్మును పక్కదారి పట్టించారు. తమిళనాడులో పవర్‌లూమ్‌లపై తయారైన నాసిరకం వస్త్రాన్ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసుకువచ్చి... ఇక్కడి చేనేత సహకార సంస్థల పేరిట ఎక్కువ ధరకు అంటగట్టారు. ఇందుకోసం తప్పుడు రికార్డులు సృష్టించారు. ప్రస్తుతం వస్త్రోత్పత్తి చేయడం లేని చేనేత సహకార సొసైటీల నుంచి కూడా వస్త్రాన్ని సేకరించినట్లు, ఆ సొసైటీలు లావాదేవీలు జరిపినట్లు రికార్డులు తయారు చేశారు. ఇలా సేకరించిన నాణ్యత లేని వస్త్రాన్ని రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం) కింద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సరఫరా చేయడంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలకు కూడా అంటగట్టారు. ఇందులో విద్యార్థులకే కోట్లాది మీటర్ల వస్త్రాన్ని సరఫరా చేశారు. ఒక్కో మీటర్ వస్త్రంపై మూడు నుంచి నాలుగు రూపాయల చొప్పున కమిషన్ రూపంలో జేబులో వేసుకున్నారు. వాస్తవానికి రాష్ట్ర విభజన నేపథ్యంలో గతేడాది జూలైలో ఆప్కోను విభజించి తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో)ను ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్ర విభజన (అపాయింటెడ్ డే) తర్వాత కూడా ఉమ్మడిగానే వస్త్రాల కొనుగోలు, ఇతర లావాదేవీలు జరగడంపై మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్పత్తే లేని సొసైటీల నుంచి కొనుగోళ్లు! తెలంగాణలో 545 చేనేత సహకార సంఘాలు ఉండగా.. వాటిలో కేవలం 60 సొసైటీలు మాత్రమే చురుగ్గా వస్త్రోత్పత్తి చేస్తున్నాయి. ఈ సొసైటీల ద్వారా తయారయ్యే వస్త్రాల విలువ రూ.50 కోట్లకు మించి ఉండదని అంచనా. కానీ రాష్ట్రంలోని సొసైటీల నుంచే సుమారు రూ.300 కోట్ల విలువ చేసే వస్త్రాలను కొనుగోలు చేసినట్లు ఆప్కో అధికారులు రికార్డులు సృష్టించారు. తమిళనాడు నుంచి ఏమాత్రం నాణ్యత లేని వస్త్రాలను తెచ్చి ఇక్కడి సొసైటీల్లో ఉత్పత్తి చేసినట్లు దొంగ రసీదులు చూపారు. ఉదాహరణకు ప్రస్తుతం టెస్కో పాలక మండలి సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న సొసైటీ కొన్నేళ్లుగా అంగుళం వస్త్రాన్ని కూడా ఉత్పత్తి చేయడం లేదు. కానీ ఆ నేత తమ సొసైటీ ఏటా వస్త్రోత్పత్తి ద్వారా రూ.50 లక్షల మేర లావాదేవీలు జరిపినట్లు రికార్డులు సృష్టించాడు. ఇదే తరహాలో కొందరు పాలక మండలి సభ్యులు, అధికారులు కుమ్మక్కై బినామీ లావాదేవీలు చూపారు. కేవలం రాజీవ్ విద్యా మిషన్‌కు సరఫరా చేసిన వస్త్రాల ద్వారానే రూ.400 కోట్లు పక్కదారి పట్టినట్లు అంచనా. ఇక చేనేత సహకార సంఘాలకు ఆప్కో నుంచి రూ.133 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉండగా... ప్రస్తుతం ఆప్కో గోదాముల్లో కోటి రూపాయల విలువ చేసే వస్త్రాలు కూడా నిల్వ లేవు. దీనిపైనా లెక్కలు తేలాల్సి ఉంది. మరోవైపు బకాయిలను సాకుగా చూపుతూ సంఘాల నుంచి కొనుగోళ్లు నిలిపివేయడంతో చేనేత కార్మికుల వద్ద రూ.5 కోట్ల విలువ చేసే ఉత్పత్తులు పేరుకుపోయాయి. ఆరు నెలలుగా వేతనాలు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్రిసభ్య కమిటీతో విచారణ అపాయింటెడ్‌డే నుంచి జరిగిన లావాదేవీలపై ప్రాథమిక విచారణ జరపాల్సిందిగా చేనేత విభాగం డిప్యూటీ డెరైక్టర్ రామగోపాల్, ఏడీలు వెంకటేశ్వర్లు, రత్నమాలలతో కూడిన కమిటీని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఏర్పాటు చేశారు. సహకార సంఘాల వారీగా సేకరించిన వస్త్రం, ఏ ప్రభుత్వ విభాగానికి ఎంత సరఫరా చేశారు వంటి అంశాలపై ఈ కమిటీ ఆప్కో నుంచి వివరాలు కోరింది. అయితే ఈ వ్యవహారంలో కొందరు పాలక మండలి సభ్యులతో పాటు ఓ కీలక అధికారి పాత్ర ఉండటంతో.. కమిటీకి సమాచారం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలిసింది. ఆప్కో అక్రమాలపై లోతుగా విచారణ జరిగితే తప్ప పూర్తి వివరాలు వెలుగు చూసే అవకాశం కనిపించడం లేదు. -
చంద్రన్నకానుకలో అవినీతి
-
సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో గోల్ మాల్
అనంతపురం: అనంతపురం జిల్లా సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో భారీ మొత్తంలో డబ్బును స్వాహా చేయడానికి యత్నించారు. కలెక్టర్ కోనా శశిధర్ అనుమతి లేకుండానే రూ.6.38 కోట్లు డ్రా చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఈ వ్యవహారంలో నిబంధనలు పాటించని పీఓ జయకుమార్ పై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. -
వైద్య-ఆరోగ్యశాఖలో టెండర్ల గోల్మాల్
-
అప్పనంగా.. అప్పగించేశారు..!
సీసీఎస్‌లో రూ. 5 కోట్లు విలువ చేసే 54 కార్ల గోల్మాల్ ఇవన్నీ ఐదు నెలల క్రితం నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్నవే ఇందులో ఒక్క వాహనం కూడా ప్రస్తుతం సీసీఎస్‌లో లేదు నచ్చినవాళ్ల నుంచి ఇష్టం వచ్చినంత తీసుకుని కట్టబెట్టేశారు ‘సాక్షి’ పరిశోధనలో బయటపడ్డ మరిన్ని నిజాలు సాక్షి, హైదరాబాద్: మొత్తం 54 కార్లు.. అన్నీ ఖరీదైనవే... వాటి విలువ సుమారు రూ. 5 కోట్ల పైమాటే.. నకిలీ ఎన్వోసీలు సృష్టించి ఐదారుగురికి విక్రయించడంతో పాటు ఫైనాన్స్ కంపెనీల నుంచి సైతం డబ్బులు దండుకున్న కేసులకు సంబంధించిన కార్లే. ఇవన్నీ ఐదు నెలల క్రితం నగర క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు పలువురు నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్నవే. ప్రస్తుతం ఇందులో ఒక్క వాహనం కూడా సీసీఎస్ పోలీసుల వద్దగానీ, కోర్టు ఆధీనంలోగానీ లేవు. నచ్చినవారి నుంచి ఇష్టం వచ్చినంత డబ్బులు దండుకుని గుట్టుచప్పుడు కాకుండా కార్లను కట్టబెట్టేశారు. ఇలా రూ.5 కోట్ల విలువ చేసే 54 ఖరీదైన కార్లు గోల్మాల్ చేసేశారు. కానీ ఈ వాహనాలన్నీ కోర్టుకు అప్పగించినట్లు పోలీసు రికార్డుల్లో ఉండటం గమనార్హం. ‘సాక్షి’ పరిశోధనలో వెలుగు చూసిన సీసీఎస్ ఖాకీల మరో బాగోతం ఇదీ. ఎవరు ఎక్కువ ఇస్తే వారికే.. నకిలీ ఎన్వోసీలు సృష్టించి ఒకే కారును ఐదారుగురికి విక్రయించడమే కాక వాటికి ఫైనాన్స్ కంపెనీల నుంచి డబ్బులు సైతం దండుకుని మోసగించిన క్రైమ్ నంబర్ 218/2014 కేసులో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని సీసీఎస్ ఆటోమొబైల్ టీం పోలీసులు గత ఏడాది సెప్టెంబర్‌లో అరెస్ట్ చేశారు. అతని నుంచి 10 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఎన్వోసీల కారణంగా ఒక్కో వాహనానికి ఐదారుగురు యజమానులు ఉన్నారు. శ్రీనివాస్‌రెడ్డి బాగోతం బయటపడటంతో అతని వద్ద కార్లు కొన్నవారు, ఆ కార్లకు ఫైనాన్స్ చేసిన కంపెనీలు ఆందోళనలో పడ్డాయి. నిజానికి కారు మొదటి యజమాని ఎవరైతే వారికే ఈ వాహనాలు చెందాల్సి ఉంటుంది. అయితే యాజమాన్య హక్కుల సంగతి పక్కనబెట్టిన ఆటోమొబైల్ టీం పోలీసులు ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి కార్లను అప్పగించారు. ఈ పది వాహనాలను సంబంధిత యజమానులకు అప్పగించాలని కోర్టు ఆదేశించి నెలలు గడుస్తున్నా.. ఇంత వరకు వాటికి సంబంధించిన షూరిటీలు కోర్టుకు సమర్పించలేదు. దీంతో ఈ వాహనాలు యజమానులకు చేరలేదు. ఈ వాహనాలు రికార్డుల పరంగా కోర్టు ఆధీనంలో ఉన్నట్లు చూపినా.. ప్రస్తుతం ఒక్క వాహనం కూడా లేదు. కోర్టు అనుమతి లేకుండానే.. బేగంపేటకు చెందిన సోహిల్ఖాన్ కూడా నకిలీ ఎన్వోసీల ద్వారా ఒక్కో కారును ఐదారుగురికి విక్రయించడంతో పాటు పలు ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణం పొంది మోసగించాడు. డిసెంబర్ 13న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోహిల్ఖాన్ను అరెస్ట్ చేసి.. ఐదు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వారం రోజులకే సీసీఎస్‌కు బదిలీ అయ్యింది. దీంతో ఐదు కార్లను కూడా సీసీఎస్ పోలీసులకు జనవరిలో క్రైమ్ నంబర్ 19/2015 కింద అప్పగించారు. అయితే వీటిలో ఒక్క కారు కూడా ఇప్పుడు సీసీఎస్ పోలీసుల వద్ద లేదు. ఈ కార్లను కూడా డబ్బులు తీసుకుని కోర్టుకు తెలియకుండానే అసలైన యజమానులకు ఇవ్వకుండా నకిలీ ఓనర్లకు ఇచ్చినట్లు సమాచారం. సీసీఎస్ క్రైమ్ నంబర్ 12/2013 కేసులో అరెస్ట్ అయిన నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నాలుగు కార్లలో రెండు కూడా కనిపించడం లేదు. 34 కార్లలో ఒక్కటీ లేదు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ముచ్చర్లవారి తోటకు చెందిన షేక్ ఉమర్ అలీషా (30) మదీనాగూడలో నివాసముంటున్నాడు. ఐబీఎంలో హెచ్ఆర్ విభాగంలో కొద్దికాలం పనిచేసిన అతను ఆ సమయంలో సంస్థకు వచ్చే అద్దె కార్ల యజమానులతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత మదీనాగూడలోనే ‘7 క్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించాడు. అద్దె కార్లు కావాలని ప్రకటనలివ్వడంతో పలువురు ఇతనికి వాహనాలను అందజేశారు. అయితే లీజుకు తీసుకున్న కార్ల డాక్యుమెంట్లను తారుమారు చేయడం, దానిపై ఉన్న ఫైనాన్స్ డబ్బులు పూర్తిగా కట్టినట్లు నకిలీ ఎన్వోసీలు సృష్టించాడు. అలీషాకు కర్నూలుకు చెందిన శ్రీనివాసరెడ్డి, కడపకు చెందిన రాకేష్కుమార్రెడ్డితోపాటు మరో 13 మంది సహకరించారు. వీరు ఇలా సుమారు 50కిపైగా కార్లను గోల్మాల్ చేశారు. ఒకే కారును ఇద్దరు ముగ్గురికి విక్రయించడం, అదే కారును అద్దెకు తీసుకుని వడ్డీ వ్యాపారుల వద్ద కుదువపెట్టడం చేశారు. నకిలీ ఎన్వోసీల ద్వారా ఒకే వాహనంపై పలు ఫైనాన్స్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో రుణం పొందారు. గత ఏడాది డిసెంబర్ 16న క్రైమ్ నంబర్ 289/2014 కేసులో అలీషాను అరెస్ట్ చేసి నకిలీ ఎన్వోసీలతో పలువురికి విక్రయించిన 34 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులో ఒక్క వాహనం కూడా ప్రస్తుతం పోలీసుల వద్ద లేదు. వీటిలో ఐదు కార్లు మాత్రం వారం క్రితం కోర్టు ద్వారా విడుదలయ్యాయి. పోలీసుల దొంగ షి‘కార్ల’పై విచారణ నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను పంచుకున్న సీసీఎస్ ఖాకీల బాగోతంపై నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. సీసీఎస్ పోలీసుల తీరుపై ‘‘పోలీసుల దొంగ షి‘కార్లు’!’’ కథనం గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన సంగతి తెలిసిందే. కాగా, సీపీ ఆదేశాల మేరకు విచారణాధికారులు గురువారం నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో సదరు అవినీతి అధికారుల నుంచి ఆయా కేసు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎల్బీనగర్లోని ఏసీపీ ఇంట్లో కారు, బైక్, నిజాంపేటలోని ఏఎస్ఐ ఇంటి నుంచి ఇన్నోవా కారు, హోండా యాక్టివా, ప్రగతినగర్‌లోని ఇన్స్పెక్టర్ ఇంటి నుంచి రెండు బైక్‌లు, చిలకలగూడలోని ఎస్ఐ నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాకుండా సీసీఎస్‌లో ఇప్పటివరకూ రికవరీ చేసిన సొత్తుపై విచారణాధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే కత్తిపూడిలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. -
ఉపాధి హామీ పథకంలో గోల్మాల్
ఖమ్మం : ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పట్టాయి. ఖమ్మం జిల్లా చండ్రుగొండలో ఉపాధి హామీ పథకంలోగోల్మాల్ జరిగింది. చెక్కు ఫోర్జరీ చేసి కొత్తగూడెం ఎస్బీహెచ్లో రూ.4.50 లక్షలు డ్రా చేశారు. ఉపాధి హామీ ఉద్యోగుల ఫిర్యాదుతో బ్యాంక్ అధికారులు విచారణ చేపట్టారు. కాగా ఈ కుంభకోణంలో బ్యాంక్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.