- దుర్వినియోగానికి కేరాఫ్ పిఠాపురం
- తవ్వే కొద్దీ బయటపడుతున్న భాగోతం
- పింఛన్ల అవకతవకలను బయటపెట్టిన ‘సాక్షి’
- క్షేత్రస్థాయిలో విచారణకు కలెక్టర్ ఆదేశం
- తమ్ముళ్లు గప్‌చుప్...
అంతా వి‘తంతే’
Published Fri, Feb 10 2017 12:16 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
∙పిఠాపురం మున్సిపాల్టీలోని 7వ వార్డుకు చెందిన జి.అనంతలక్షి్మకి వితంతు పింఛ¯ŒS ఈ నెల 6న పంపిణీ చేశారు. ఆమె పింఛ¯ŒS ఐడీ నంబరు (1048498163555). ఆమె భర్త ఆదినారాయణ బతికే ఉన్నాడు. 22 వార్డులో ఖండవల్లి లక్ష్మి భర్త అర్జునుడు (పింఛ¯ŒS ఐడీ నంబర్ 5697967), ఇందల అనంత లక్ష్మి భర్త సత్యనారాయణ (పింఛ¯ŒS ఐడీ నంబర్ 5721215), బుద్దాల వెంకయ్యమ్మ భర్త అప్పారావు (పింఛ¯ŒS ఐడీ నంబర్ 5691967) భర్తలు సజీవంగా ఉండగా వీరి పేరుతో వితంతు పింఛన్లు మంజూరై పంపిణీ కూడా పూర్తి చేశారు. వీరంతా పది రోజులు ముందు ఆ¯ŒSలై¯ŒSలో దరఖాస్తు చేసుకున్న వారే కావడం గమనార్హం.
l ఎస్.సీతకు (పింఛ¯ŒS ఐడీ నంబరు 104843555)తో ఈ నెల 3న వితంతు పింఛ¯ŒS పంపిణీ చేశారు. ఈమె ఈ వార్డుకు చెందిన లబ్ధిదారు కాదని స్థానికులు చెబుతున్నారు. ఎస్.వల్లీబీకి (పింఛ¯ŒS ఐడీ నంబరు 104848805)తో ఈ నెల 6న వితంతు పింఛ¯ŒS పంపిణీ చేశారు. ఈమెది కూడా ఈ వార్డు కాదు. ఇలా వేరే వార్డుల్లో లబ్ధిదారులను మరో వార్డుల్లో చూపించారు.
l 16వ వార్డులో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ భర్త చనిపోయి ప్రభుత్వ పింఛ¯ŒS పొందుతున్న కె.నూకరత్నం, పెదపాటి పుష్పరత్నం (పింఛ¯ŒS ఐడీ నంబర్ 104844711)కు నిబంధనలను బుట్టదాఖలు చేసి పింఛన్లు పంపిణీ చేశారు.
అర్హత లేకున్నా మీకు పింఛ¯ŒS కావాలా..ఎటువంటి సర్టిఫికెట్ అవసరం లేదు. పిఠాపురం వస్తే చాలు. అన్నీ మేం చూసుకుంటామంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అక్కడ నిబంధనలతో పనిలేదు. కావాల్సిన అర్హతల్లా అధికారపార్టీ నేతల అనుచరలై ఉంటే చాలు. మరణ ధ్రువీకరణ పత్రం జతచేసి ఆ¯ŒSలై¯ŒS చేసి కార్యాలయాల చుట్టూ పదేపదే తిరిగితే తప్ప మంజూరుకాని వితంతు పింఛ¯ŒS తమ్ముళ్లు తలుచుకుంటే ఇట్టే చేతిలో పెట్టేస్తారు. పింఛన్లు తీసుకోవాలంటే స్థానికులై ఉండాలనే నిబంధనను కూడా అక్కడ గాలిలో కలిపేశారు. స్థానికంగా పేరు, ఊరు తెలియని వారికి సైతం పింఛన్లు మంజూరైపోయాయి. భర్త నిశ్చింతగా ఉన్నా చనిపోయినట్టు చూపించి సంక్షేమ ఫలాలను అడ్డగోలుగా తెలుగు తమ్ముళ్లు అనుచరులకు దోచిపెట్టేశారు. ఈ పరిస్థితి దాదాపు జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లోను కనిపిస్తోంది. అయితే పిఠాపురంలో నియోజకవర్గ నేత దగ్గర నుంచి ద్వితీయ శ్రేణి నాయకుడి వరకూ అందరూ ఒక్కటై అడ్డగోలుగా అనర్హులకు కట్టబెట్టేశారు. అందుకే ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు.
భర్తలు బతికున్నా...
పిఠాపురంలో పింఛన్లలో మోసాలు తవ్వే కొద్దీæ బయటపడుతున్నాయి. ‘భర్తలుండగానే... వితంతు పింఛన్లు’ శీర్షికన ‘సాక్షి’ ఆధారాలతో సహా మెయి¯ŒS ఎడిషన్లో వెలుగులోకి తేవడంతో జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ స్పందించి విచారణకు ఆదేశించారు. పిఠాపురం మున్సిపాలిటీలో 30 వార్డులున్నాయి. తమ్ముళ్లకు మెచ్చి నచ్చిన వార్డులో 15 నుంచి 20 పింఛన్లు పందేరం చేశారు. నచ్చని వార్డుల్లో ఆరేడుకు మించి ఇవ్వలేదు. అవి కూడా అంతా బోగస్ పింఛ¯ŒSదారులేనని తేలుతున్నాయి. భర్తలు బతికుండగా సుమారు 30 మంది మహిళలకు వితంతువు పింఛన్లు మంజూరు చేశారన్న విమర్శలున్నాయి. మున్సిపాలిటీలో అన్ని రకాల పింఛన్లు కలిసి 3,800 ఉండేవి. ఇవికాకుండా తాజా జన్మభూమిలో 321 పింఛన్లు కొత్తగా పంపిణీ చేశారు. వీటిలో వితంతు, దివ్యాంగ, వృద్దాప్య, చేనేత, కల్లుగీత కార్మికుల పింఛన్లు న్నాయి. వీటిలో మూడొంతులు అనర్హులకు కట్టబెట్టేశారు. నియోజకవర్గ నేత అండదండలు, అధికారం చేతిలో ఉందని ఏమి చేసినా అడిగే వాడు లేడనే ధైర్యంతో అనర్హులకు పింఛన్లు అడ్డగోలుగా కట్టబెట్టేశారు.
500 దరఖాస్తుదారుల ఎదురు చూపులు...
అనర్హులకు అడ్డంగా కట్టబెట్టేసిన ఈ మున్సిపాల్టీలో గడచిన రెండేళ్లుగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని గంపెడాశతో నిరీక్షిస్తున్న 500 మంది వైపు కన్నెత్తి చూడలేదు. వీరంతా దరఖాస్తులు ఆ¯ŒSలై¯ŒSలో చేసుకున్నప్పటికీ వాటిని పట్టించుకోలేదు. మరణ ధ్రువీకరణ పత్రాలు లేకుండా వితంతు పింఛన్లు, వయస్సు నిర్థారణ లేకుండా వృద్ధాప్య పింఛన్లు ఇవ్వకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ఇవన్నీ ఉన్నా పింఛన్లు మంజూరుకావాలంటే తమ్ముళ్ల సిఫార్సు కావాలి. కానీ ఇక్కడ ఇటువంటి సర్టిఫికెట్‌లు లేకుండానే పింఛ¯ŒSలు పంపిణీ చేసేశారు.
విపక్ష నేతల వార్డుకు రిక్త హస్తాలే...
మున్సిపాల్టీలో వైఎస్సార్ సీపీ పక్ష నేత గండేపల్లి బాబి ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు 27. ఈ వార్డుకు ఏడు పింఛన్లు ఇచ్చారు. వాటిలో నలుగురు మాత్రమే ఆ వార్డుకు చెందిన వారు. మిగిలిన ముగ్గురు అసలు ఏ వార్డుకు చెందిన వారో తెలియదంటున్నారు. కానీ ఆ ముగ్గురు (మద్ది వీరవెంకట సత్యనారాయణ అచ్యుతాంబ, పెచ్చెట్టి సత్యవేణి, నక్కా గంగారత్నం)కి పింఛన్లు పంపిణీ అయిపోయాయి. సామాజిక వర్గాలను సైతం తప్పుగా చూపించి ఓసీలను బీసీలుగాను మార్చి మరీ పంపిణీ చేసినవి సుమారు 50 వరకూ ఉంటాయని లెక్క లేస్తున్నారు. అధికార పార్టీ నేతల అధికార దుర్వినియోగానికి ఇవి పరాకాష్టగా నిలుస్తున్నాయి. అధికారులు నిష్పక్షపాతంగా మరింత లోతైన విచారణ జరిపితే అక్రమాలు పుట్ట కదులుతుందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీతోపాటు ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులాపల్లి, ఇసుకపల్లి, ఎండపల్లి, ఉప్పాడ గ్రామాల్లో మరణ ధ్రువీకరణలు లేకుండానే పంపిణీ చేసిన పింఛన్లకు సర్టిఫికెట్ల సేకరణలో స్థానిక నేతలు తలమునకలవుతున్నారు.
Advertisement
Advertisement