Widow Pensions
-
ఓటర్లను ‘చంపేస్తున్న’ టీడీపీ
పిఠాపురం: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కాకినాడ జిల్లాలో తమ అనుచరులకు భర్తలు బతికుండగానే వితంతు పింఛన్లు ఇప్పించారు ఇక్కడి టీడీపీ నేతలు కొందరు. ఇప్పుడు బతికున్న ఓటర్లను చనిపోయినట్లుగా చిత్రీకరిస్తున్నారు. టీడీపీ ఫిర్యాదుతో అధికారులు విచారణ చేపట్టగా, దాదాపు అందరూ జీవించే ఉన్నట్టు వెల్లడైంది. టీడీపీ తీరుపై జిల్లా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జిల్లాలోని కొందరి పేర్లు, వారి ఓటరు నంబరు ఇతర వివరాలు ఇచ్చి, వారు చనిపోయారని, ఓట్లను తొలగించాలని టీడీపీ ఎలక్టోరల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ వేలాది నకిలీ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు ఉన్నట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ ఎలక్టోరల్ సెల్ సభ్యులు ఇంటింటికీ వెళ్లి విచారణ చేసి వీటిని గుర్తించినట్లు అందులో తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. బూత్ లెవల్ అధికారులు నాలుగు రోజులుగా గ్రామాల్లో విచారణ చేపట్టారు. టీడీపీ నేతలు చనిపోయారని చెబుతున్న వారిలో 90 శాతానికి పైగా ఓటర్లు బతికే ఉన్నారని గుర్తించారు. విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థుల ఓట్లను డబుల్ ఎంట్రీలని, ఫేక్ ఓట్లని టీడీపీ ఫిర్యాదు చేయడం గమనార్హం. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.. టీడీపీ ఫిర్యాదు తప్పుడుది అనడానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఇవి. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లి బూత్ నంబరు 206లో ఓటరు కార్డు నంబరు వైఓయూ 1794924 మామిడాల వెంకటరమణ, వైఓయూ 0130591 వి.బుల్లి అప్పారావు, వైఓయూ 1791920 చోడిశెట్టి మాణిక్యం, వైఓయూ 1791805 సానా సీతారాముడు చనిపోయినట్లుగా టీడీపీ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవానికి వారంతా జీవించే ఉన్నారు. అధికారులు వారి ఇంటికి వెళ్లగా... వారే సమాధానాలిచ్చారు. ఈ విచారణకు అధికారులు రోజుల తరబడి సమయాన్ని కేటాయిస్తున్నారు. దీనివల్ల అధికారుల విలువైన సమయంతోపాటు ప్రజా ధనమూ వృథా అవుతోంది. విచారణ జరుపుతున్నాం చనిపోయిన వారివి, నకిలీ ఓట్లు ఉన్నట్లు టీడీపీ ఎలక్టోరల్ సెల్ నుంచి ఎన్నికల కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదు మాకు పంపించారు. దానిపై గ్రామాల్లో విచారణ చేయిస్తున్నాం. నకిలీలు, చనిపోయిన వారు ఉంటే వాటిని తొలగిస్తాం. లేకపోతే యథావిధిగా ఉంటాయి. ఎవరో ఫిర్యాదు ఇచ్చినంత మాత్రాన ఎవరి ఓటు హక్కు పోదు. పూర్తిగా విచారణ చేసే ఎన్నికల కమిషన్‌కు పంపుతాం. – కె.సుబ్బారావు, ఎన్నికల ఓటరు జాబితా నమోదు అధికారి, పిఠాపురం నియోజకవర్గం నేను చనిపోవడం ఏమిటి? కొత్తపల్లి బూత్ నంబరు 206లో నాకు ఓటు ఉంది. 40 ఏళ్లుగా ఓటు వేస్తున్నా. నేను చనిపోయానని, ఓటు తొలగించాలంటూ ఎవరో ఫిర్యాదు చేశారని అధికారులు వచ్చి అడిగారు. అసలు నేను చనిపోవడమేమిటో నాకు అర్థం కాలేదు. ఇలాంటి ఫిర్యాదులు ఇచ్చే వారిపై చర్యలు తీసుకోవాలి. – మామిడాల వెంకట రమణ క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కొత్తపల్లి బూత్ నంబరు 206లో నాకు ఓటు ఉంది. 50 ఏళ్లుగా ఓటు వేస్తున్నా. ఇంతకు ముందు టీడీపీ వారెవరూ మా ఇంటికి వచ్చి విచారణ చేయలేదు. ఇప్పుడు అధికారులు వచ్చి మీరు ఉన్నారా.. అని అడుగుతున్నారు. నేను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సి వచ్చింది. తప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – సానా సీతారాముడు నేను ఆరోగ్యంగానే ఉన్నా నాకు 86 సంవత్సరాలు. ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నాను. కొత్తపల్లి బూత్ నంబరు 206లో 60 ఏళ్లుగా ఓటు వేస్తున్నా. అసలు నేను ఎక్కడ ఉంటానో ఎలా ఉంటానో కూడా తెలియకుండా ఎవరో ఫిర్యాదు చేయడం ఏమిటి? ఆరోగ్యంగా ఉన్న వారిని చంపేస్తారా? అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. – చోడిశెట్టి మాణిక్యం -
ఇంటి పన్నులకు..పింఛన్ డబ్బు
చీమకుర్తి రూరల్: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు చెల్లించాల్సిన పింఛన్ల డబ్బును గ్రామ కార్యదర్శులు ఇంటి పన్నులకు జమ చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చండ్రపాడు గ్రామంలో సోమవారం పింఛన్ల పంపిణీ సందర్భంగా బకాయిలున్న ఇంటి పన్నుల కింద పింఛన్ సొమ్ము ను జమ చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తన తండ్రి వల్లంరెడ్డి సుబ్బారెడ్డికి వచ్చిన వెయ్యి రూపాయల పింఛ న్లో ఇంటి పన్ను కింద రూ.250 జమ చేసుకున్నారని అంజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామంలో మరో వృద్ధురాలికి ఇల్లు కూడా లేదు. బంధువుల ఇళ్ల వద్ద కాలం వెళ్లదీస్తోంది. ఆ వృద్ధురాలికి వచ్చిన పింఛను డబ్బును బంధువులు చెల్లించాల్సిన ఇంటిపన్ను కింద కార్యదర్శి జమ చేసుకున్నారు. అదేమని అడిగితే ఇంటిపన్ను చెల్లించాల్సిన వాళ్లు మీకు బంధువులే కాబట్టి వారి దగ్గర వసూలు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇలా ఒక్క సోమవారం 80 మందికి పింఛన్లు పంపిణీ చేస్తే వారిలో 50 మంది వద్ద నుంచి ఇంటి పన్నుల కింద ఇచ్చిన పింఛన్లను జమ చేసుకున్నారని పింఛనుదారులు వాపోతున్నారు. ఆసరగా ఉంటుందనుకుంటే పన్ను కింద జమ ప్రభుత్వం పంపిణీ చేసే పింఛన్లు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరాగా ఉంటుందనుకుంటే వారి అవసరాలను గుర్తించకుండా వచ్చిన పింఛన్లను ఇంటి యజమాని చెల్లించాల్సిన ఇంటి పన్నుల కింద జమ చేసుకోవడాన్ని పింఛనుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. పింఛన్లతో నెలంతా కాస్త ఉపశమనం పొందే వృద్ధులకు పన్నుల పేరుతో అది కూడా లేకుండా అధికారులు ముక్కుపిండి వసూలు చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్లు వస్తున్నాయి కాబట్టే తమను కాస్త గౌరవంగా ఇంట్లో చూస్తున్నారని, వచ్చిన పింఛన్లను ఇలా జమ చేసుకోవడం ఏంటని వృద్ధులు వాపోతున్నారు. మార్చి నెలాఖరు దాటిపోయినా పింఛన్లు వసూలు చేసేందుకు ఏప్రిల్ 15వ తేదీ వరకు ప్రభుత్వం ఇంటి పన్ను జమ చేసేందుకు గడువు ఇచ్చింది. దానిలో భాగంగా గ్రామాల్లో ఇంటి పన్ను టార్గెట్ వంద శాతం చేసేందుకు గాను కార్యదర్శులు గ్రామాల్లో పింఛన్లు జమ చేసుకుంటున్నారు. నచ్చజెప్పే తీసుకుంటున్నాం ఇంటి పన్నుల బకాయిలున్నాయని, పింఛన్ల డబ్బును జమ చేయమని నచ్చజెప్పిన తర్వాతే పింఛన్ల డబ్బును ఇంటిపన్ను కింద వసూలు చేసుకుంటున్నాం. ఇంటి పన్నులను నూరు శాతం వసూలు చేయాలని అధికారుల ఆదేశాలున్నాయి. పింఛనుదారులకు వివరించి వారిని ఒప్పించిన తర్వాతే తీసుకుంటున్నాం. – షేక్.జాన్ బాషా, కార్యదర్శి, చండ్రపాడు -
అంతా వి‘తంతే’
దుర్వినియోగానికి కేరాఫ్ పిఠాపురం తవ్వే కొద్దీ బయటపడుతున్న భాగోతం పింఛన్ల అవకతవకలను బయటపెట్టిన ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో విచారణకు కలెక్టర్ ఆదేశం తమ్ముళ్లు గప్‌చుప్... సాక్షి ప్రతినిధి, కాకినాడ : ∙పిఠాపురం మున్సిపాల్టీలోని 7వ వార్డుకు చెందిన జి.అనంతలక్షి్మకి వితంతు పింఛ¯ŒS ఈ నెల 6న పంపిణీ చేశారు. ఆమె పింఛ¯ŒS ఐడీ నంబరు (1048498163555). ఆమె భర్త ఆదినారాయణ బతికే ఉన్నాడు. 22 వార్డులో ఖండవల్లి లక్ష్మి భర్త అర్జునుడు (పింఛ¯ŒS ఐడీ నంబర్ 5697967), ఇందల అనంత లక్ష్మి భర్త సత్యనారాయణ (పింఛ¯ŒS ఐడీ నంబర్ 5721215), బుద్దాల వెంకయ్యమ్మ భర్త అప్పారావు (పింఛ¯ŒS ఐడీ నంబర్ 5691967) భర్తలు సజీవంగా ఉండగా వీరి పేరుతో వితంతు పింఛన్లు మంజూరై పంపిణీ కూడా పూర్తి చేశారు. వీరంతా పది రోజులు ముందు ఆ¯ŒSలై¯ŒSలో దరఖాస్తు చేసుకున్న వారే కావడం గమనార్హం. l ఎస్.సీతకు (పింఛ¯ŒS ఐడీ నంబరు 104843555)తో ఈ నెల 3న వితంతు పింఛ¯ŒS పంపిణీ చేశారు. ఈమె ఈ వార్డుకు చెందిన లబ్ధిదారు కాదని స్థానికులు చెబుతున్నారు. ఎస్.వల్లీబీకి (పింఛ¯ŒS ఐడీ నంబరు 104848805)తో ఈ నెల 6న వితంతు పింఛ¯ŒS పంపిణీ చేశారు. ఈమెది కూడా ఈ వార్డు కాదు. ఇలా వేరే వార్డుల్లో లబ్ధిదారులను మరో వార్డుల్లో చూపించారు. l 16వ వార్డులో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ భర్త చనిపోయి ప్రభుత్వ పింఛ¯ŒS పొందుతున్న కె.నూకరత్నం, పెదపాటి పుష్పరత్నం (పింఛ¯ŒS ఐడీ నంబర్ 104844711)కు నిబంధనలను బుట్టదాఖలు చేసి పింఛన్లు పంపిణీ చేశారు. అర్హత లేకున్నా మీకు పింఛ¯ŒS కావాలా..ఎటువంటి సర్టిఫికెట్ అవసరం లేదు. పిఠాపురం వస్తే చాలు. అన్నీ మేం చూసుకుంటామంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అక్కడ నిబంధనలతో పనిలేదు. కావాల్సిన అర్హతల్లా అధికారపార్టీ నేతల అనుచరలై ఉంటే చాలు. మరణ ధ్రువీకరణ పత్రం జతచేసి ఆ¯ŒSలై¯ŒS చేసి కార్యాలయాల చుట్టూ పదేపదే తిరిగితే తప్ప మంజూరుకాని వితంతు పింఛ¯ŒS తమ్ముళ్లు తలుచుకుంటే ఇట్టే చేతిలో పెట్టేస్తారు. పింఛన్లు తీసుకోవాలంటే స్థానికులై ఉండాలనే నిబంధనను కూడా అక్కడ గాలిలో కలిపేశారు. స్థానికంగా పేరు, ఊరు తెలియని వారికి సైతం పింఛన్లు మంజూరైపోయాయి. భర్త నిశ్చింతగా ఉన్నా చనిపోయినట్టు చూపించి సంక్షేమ ఫలాలను అడ్డగోలుగా తెలుగు తమ్ముళ్లు అనుచరులకు దోచిపెట్టేశారు. ఈ పరిస్థితి దాదాపు జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లోను కనిపిస్తోంది. అయితే పిఠాపురంలో నియోజకవర్గ నేత దగ్గర నుంచి ద్వితీయ శ్రేణి నాయకుడి వరకూ అందరూ ఒక్కటై అడ్డగోలుగా అనర్హులకు కట్టబెట్టేశారు. అందుకే ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. భర్తలు బతికున్నా... పిఠాపురంలో పింఛన్లలో మోసాలు తవ్వే కొద్దీæ బయటపడుతున్నాయి. ‘భర్తలుండగానే... వితంతు పింఛన్లు’ శీర్షికన ‘సాక్షి’ ఆధారాలతో సహా మెయి¯ŒS ఎడిషన్‌లో వెలుగులోకి తేవడంతో జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ స్పందించి విచారణకు ఆదేశించారు. పిఠాపురం మున్సిపాలిటీలో 30 వార్డులున్నాయి. తమ్ముళ్లకు మెచ్చి నచ్చిన వార్డులో 15 నుంచి 20 పింఛన్లు పందేరం చేశారు. నచ్చని వార్డుల్లో ఆరేడుకు మించి ఇవ్వలేదు. అవి కూడా అంతా బోగస్ పింఛ¯ŒSదారులేనని తేలుతున్నాయి. భర్తలు బతికుండగా సుమారు 30 మంది మహిళలకు వితంతువు పింఛన్లు మంజూరు చేశారన్న విమర్శలున్నాయి. మున్సిపాలిటీలో అన్ని రకాల పింఛన్లు కలిసి 3,800 ఉండేవి. ఇవికాకుండా తాజా జన్మభూమిలో 321 పింఛన్లు కొత్తగా పంపిణీ చేశారు. వీటిలో వితంతు, దివ్యాంగ, వృద్దాప్య, చేనేత, కల్లుగీత కార్మికుల పింఛన్లు న్నాయి. వీటిలో మూడొంతులు అనర్హులకు కట్టబెట్టేశారు. నియోజకవర్గ నేత అండదండలు, అధికారం చేతిలో ఉందని ఏమి చేసినా అడిగే వాడు లేడనే ధైర్యంతో అనర్హులకు పింఛన్లు అడ్డగోలుగా కట్టబెట్టేశారు. 500 దరఖాస్తుదారుల ఎదురు చూపులు... అనర్హులకు అడ్డంగా కట్టబెట్టేసిన ఈ మున్సిపాల్టీలో గడచిన రెండేళ్లుగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని గంపెడాశతో నిరీక్షిస్తున్న 500 మంది వైపు కన్నెత్తి చూడలేదు. వీరంతా దరఖాస్తులు ఆ¯ŒSలై¯ŒSలో చేసుకున్నప్పటికీ వాటిని పట్టించుకోలేదు. మరణ ధ్రువీకరణ పత్రాలు లేకుండా వితంతు పింఛన్లు, వయస్సు నిర్థారణ లేకుండా వృద్ధాప్య పింఛన్లు ఇవ్వకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ఇవన్నీ ఉన్నా పింఛన్లు మంజూరుకావాలంటే తమ్ముళ్ల సిఫార్సు కావాలి. కానీ ఇక్కడ ఇటువంటి సర్టిఫికెట్లు లేకుండానే పింఛ¯ŒSలు పంపిణీ చేసేశారు. విపక్ష నేతల వార్డుకు రిక్త హస్తాలే... మున్సిపాల్టీలో వైఎస్సార్ సీపీ పక్ష నేత గండేపల్లి బాబి ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు 27. ఈ వార్డుకు ఏడు పింఛన్లు ఇచ్చారు. వాటిలో నలుగురు మాత్రమే ఆ వార్డుకు చెందిన వారు. మిగిలిన ముగ్గురు అసలు ఏ వార్డుకు చెందిన వారో తెలియదంటున్నారు. కానీ ఆ ముగ్గురు (మద్ది వీరవెంకట సత్యనారాయణ అచ్యుతాంబ, పెచ్చెట్టి సత్యవేణి, నక్కా గంగారత్నం)కి పింఛన్లు పంపిణీ అయిపోయాయి. సామాజిక వర్గాలను సైతం తప్పుగా చూపించి ఓసీలను బీసీలుగాను మార్చి మరీ పంపిణీ చేసినవి సుమారు 50 వరకూ ఉంటాయని లెక్క లేస్తున్నారు. అధికార పార్టీ నేతల అధికార దుర్వినియోగానికి ఇవి పరాకాష్టగా నిలుస్తున్నాయి. అధికారులు నిష్పక్షపాతంగా మరింత లోతైన విచారణ జరిపితే అక్రమాలు పుట్ట కదులుతుందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీతోపాటు ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులాపల్లి, ఇసుకపల్లి, ఎండపల్లి, ఉప్పాడ గ్రామాల్లో మరణ ధ్రువీకరణలు లేకుండానే పంపిణీ చేసిన పింఛన్లకు సర్టిఫికెట్ల సేకరణలో స్థానిక నేతలు తలమునకలవుతున్నారు. -
భర్తలు బతికున్నా.. వితంతు పింఛన్లు!
► పిఠాపురంలో జన్మభూమి కమిటీల నిర్వాకం ► జీవించే ఉన్న 22 మందికి డెత్ సర్టిఫికెట్లు ► వారి భార్యలకు వితంతు పింఛన్లు మంజూరు ► కళ్లు మూసుకుని పంపిణీ చేసేస్తున్న అధికారులు పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మభూమి కమిటీ సభ్యుల విచ్చలవిడితనానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. బతికున్న పురుషులను మృతులుగా, వారి భార్యలను వితంతువులుగా మార్చేసి పింఛన్లు మంజూరు చేయిస్తున్నారు. పట్టణంలోని వెలంపేట 20వ వార్డుకు చెందిన గొర్రెల సత్యవతికి పింఛన్ ఐడీ నం: 104849039తో ఈనెల 6న వితంతు పింఛన్ పంపిణీ చేశారు. ఆమె భర్త వెంకటరమణ పట్టణంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన పాదగయ ట్రస్టుబోర్డు సభ్యుడు. రానున్న మహాశివరాత్రి ఏర్పాట్లలో భాగంగా ఆయన బుధవారం కూడా పనులు పర్యవేక్షించినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. అదే వార్డుకు చెందిన డి.వీరలక్ష్మికి ఐడీ నం:104842867తో ఈనెల 3న వితంతు పింఛన్ పంపిణీ చేశారు. ఆమె భర్త సత్యనారాయణ బుధవారం కూడా వ్యవసాయ పనులకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అదే వార్డుకు చెందిన కె.అమ్మాజీకి ఐడీ నం:104842971తో ఈనెల 6న వితంతు పింఛన్ పంపిణీ చేశారు. ఆమె భర్త నాగేశ్వరరావు బుధవారం వ్యవసాయ పనులకు వెళ్లినట్టు స్థానికులు చెప్పారు. వీరంతా కొన్ని నెలల కిందటే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు ఇచ్చి, మున్సిపల్ అధికారులు వారి భార్యలను వితంతువులుగా పరిగణించి, పింఛన్లు పంపిణీ చేయడం గమనార్హం. ఇలా పిఠాపురం మున్సిపాలిటీలో జన్మభూమి కమిటీల ఆదేశాలతో అధికారులు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 22 మందిని బతికుండగానే చనిపోయినట్టు చూపి, వారి భార్యలకు వితంతు పింఛన్లు ఇచ్చేస్తున్నారని సమాచారం. టీడీపీ కార్యాలయంలోనే లబ్ధిదారుల ఎంపిక మున్సిపాలిటీలో 3,800 మంది వితంతు, దివ్యాంగ, వృద్ధాప్య, చేనేత, కల్లుగీత కార్మికుల పింఛన్లు ఉండగా ఇటీవల కొత్తగా 321 పింఛన్లు మంజూరు చేశారు. స్థానిక ముఖ్యనేత ఆదేశాల మేరకు జన్మభూమి కమిటీల పేరుతో ఇద్దరు తెలుగుదేశం నేతలు కొత్త పింఛన్ల లబ్ధిదారులను ఎంపిక చేసేశారు. గత రెండేళ్లుగా తమకు పింఛన్లు ఇవ్వాలని సుమారు 500 మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వాటిని పట్టించుకోని రాజ్యాంగేతర శక్తులు టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులను ఎంపిక చేసేశారు. నిబంధనలు, అర్హతలను పట్టించుకోకుండా తమ పార్టీ కార్యకర్త, ముఖ్యనేత అనుచరుడు అయితే చాలు పింఛన్ ఇచ్చేయాలన్న ఆదేశాలను మున్సిపల్ అధికారులు పాటించినట్టుగా కనిపిస్తోంది. పింఛన్ లబ్ధిదారుల ఎంపికలో జన్మభూమి కమిటీల పెత్తనం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోందని, అనర్హులు లబ్ధిపొందుతున్నారని ‘సాక్షి’ గతంలోనే కథనాలు ప్రచురించింది. అప్పుడు ‘సాక్షి’పై అక్కసు వ్యక్తం చేస్తూ ‘దమ్ముంటే నిరూపించా’లని చిందులు తొక్కిన అధికార పార్టీ నాయకులు ఇప్పుడేమంటారో! జన్మభూమి కమిటీ జాబితా ప్రకారమే.. ఈ విషయంపై పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.రామ్మోహన్‌ను వివరణ కోరగా మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చిన వారికే వితంతు పింఛన్లు మంజూరు చేశామన్నారు. అయితే కొందరు బతికుండగా మరణ ధ్రువీకరణ పత్రం ఎలా ఇచ్చారని ప్రశ్నించగా జన్మభూమి కమిటీల ద్వారా వచ్చిన జాబితాలను బట్టి మంజూరు చేశామని, విచారణ జరిపిస్తామని చెప్పారు. -
ఫిల్మ్‌సిటీతో ఆత్మహత్యలు ఆగుతాయా?
* రైతు ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్‌కు అగ్నివేశ్ సూటి ప్రశ్న * తెలంగాణ విద్యావంతుల వేదిక మహాసభలో ప్రారంభోపన్యాసం * మంత్రుల పిల్లలు ప్రభుత్వస్కూళ్లలో చదివితేనే సామాజిక క్రాంతి * వితంతు పింఛన్లను వెయ్యికి పెంచడాన్ని స్వాగతిస్తున్నాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై ప్రముఖ సామాజిక ఉద్యమకర్త, మానవహక్కుల నేత స్వామి అగ్నివేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. భారీ స్థాయిలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఫిల్మ్‌సిటీ వల్ల రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయా? అని సూటిగా ప్రశ్నించారు. ఒకవైపు ఆత్మహత్యలు కొనసాగుతుంటే వేల ఎకరాల్లో ఫిల్మ్‌సిటీని నిర్మించాల్సిన అవసరం ఏముందన్నారు. శని వారం ఇక్కడ జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ రాష్ట్ర మహాసభలో అగ్నివేశ్ ప్రారంభోపన్యాసం చేస్తూ వివిధ అంశాలపై మాట్లాడారు. సీఎం, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, టీచర్ల పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివించడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటేనే విద్య, వైద్య రంగాల్లో మార్పు, సామాజిక క్రాంతి వస్తుందని అగ్నివేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న పింఛనును రూ. వెయ్యికి పెంచడాన్ని స్వాగతిస్తున్నామని, భవిష్యత్తులో ఆ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆయన అభినందించారు. నవ భారతావని కలలను మోసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్‌లో దేశానికే ఆదర్శం కాగల సత్తా ఉందన్నారు. తెలంగాణ సాధనలో పాత్ర పోషించినా అధికారం కోరుకోకుండా వేదిక నాయకులు ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా వ్యవహరించాలనుకోవడం గొప్ప విషయమన్నారు. అంధ విశ్వాసాల నుంచి బయటపడాలనే సందేశంతో రూపొందిన ‘పీకే’ వంటి చిత్రాలు తెలుగు, ఇతర భాషల్లోనూ రావాలని అగ్నివేశ్ ఆకాంక్షించారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రసంగిస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వా త తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు, ప్రజాసంఘంగా లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు వేదిక సమావేశమైందన్నారు. తెలంగాణ ఏర్పడితే బతుకులు బాగవుతాయన్న ప్రజల ఆకాంక్షలను సాధించేందుకు కృషి జరగాలని విద్యావేత్త చుక్కారామయ్య పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రసంగిస్తూ రాష్ట్ర సాధన తర్వాత ‘ప్రజాస్వామ్యం కోసం-పాలనలో, పైసాలో భాగం’ అనే నినాదంతో వేదిక ముందుకు వెళ్తోందన్నారు. ఈ సభలో ప్రొఫెసర్లు కేశవరావు జాదవ్, రమా మెల్కోటే, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీడీఎఫ్ నేత డీపీరెడ్డి, జేఏసీ నేతలు రాజేందర్‌రెడ్డి, ప్రహ్లాద్, రఘు, మామిడి నారాయణ, భిక్షపతి, కె.గోవర్ధన్, సంధ్య, గులిజాల రవీందర్రావు, వెంకటేశం పాల్గొన్నారు. పునర్విభజన చట్టంలో మార్పులు కావాలి: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాష్ట్ర పునర్విభజన చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ చట్టంలోని లొసుగులను తొల గించాలని కోరుతూ మహాసభ తీర్మానం చేయాలని కోరారు. హైదరాబాద్ శాంతిభద్రతల అజమాయిషీపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉండటం సరికాదన్నారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి నిబంధన లేదన్నారు. విద్యావంతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి: కె. రామచంద్రమూర్తి ప్రభుత్వంతో కరచాలనం చేయడంతోపాటు అవసరమైతే కరవాలచలనం చేసేందుకు కూడా విద్యావంతులు సిద్ధంగా ఉండాలని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి పేర్కొన్నారు. ప్రజలకు మంచి జరిగేందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, మంచిచేస్తే అభినందించాలన్నారు. తెలంగాణ ‘తెహజీబ్’ అయిన గంగా జమున సంస్కృతిని (సర్వమత సామరస్యం) పరిరక్షించేందుకు, అసమానతలు, పేదరికం, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా రూపుదిద్దేందుకు కృషిచేయాలన్నారు. -
వితంతు పింఛన్లు పునరుద్ధరించండి
కాకినాడ సిటీ : జిల్లాలో ఎక్కడైనా వితంతు పింఛన్లు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయి ఉంటే వాటిని వెంటనే పునరుద్ధరించాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ డ్వామా హాలులో ఆమె ప్రజావాణి క్యాక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 350 మంది ప్రజలు పాల్గొని తమ సమస్యలపై వినతులు అందజేశారు. తమ పింఛన్లు ఆగిపోయాయని కొంత మంది వితంతువులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిపై స్పందించారు. ఒక మహిళ తమ చిన్నారికి గుండె ఆపరేషన్ అవసరం ఉందని చెప్పగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ను చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రజావాణిలో రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు, పింఛన్లు, రుణమాఫీ సమస్యలపై అర్జీలు ఎక్కువగా వచ్చాయి. డయల్ యువర్ కలెక్టర్‌కు 26 ఫోన్‌కాల్స్ కలెక్టరేట్ కోర్టుహాలు నుంచి ఉదయం కలెక్టర్ నీతూ ప్రసాద్ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించగా సుమారు 26 మంది జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ చేసి సమస్యలు వివరించారు. కిర్లంపూడి మండలం నుంచి ఒక వ్యక్తి కలెక్టర్‌కు ఫోన్ చేసి మండలంలో గడచిన 10 రోజుల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు రవాణా జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ మెట్ట ప్రాంతంలోని 10 మండలాల్లో ఇసుక లభ్యం అవుతున్నందున ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులతో ప్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి అక్రమ తవ్వకాలు రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తాను గతంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నానని దానికి పట్టా ఇవ్వాలని డయల్ యువర్ కలెక్టర్‌లో కలెక్టర్‌ను కోరాడు. దీనిపై కలెక్టర్ స్పందించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు ఎలా నిర్మించుకుంటారని ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే అల్లవరం తహశీల్దార్‌కు ఫోన్ చేసి ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని, తక్షణం ఆక్రమణను తొలగించి వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, అదనపు జాయింట్ కలెక్టర్ మార్కెండేయులు, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి జన్‌ధన్‌పై డివిజన్‌స్థాయిలో క్యాంపులు కాకినాడ సిటీ : బహుళ ప్రయోజనాలు ఉన్న ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద అన్ని కుటుంబాలకు బ్యాంక్ అకౌంట్లు తెరిచేలా డివిజన్ స్థాయిలో మెగా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. సోమవారం రాత్రి కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ పథకంలో ప్రతి కుటుంబానికి రెండు బ్యాంక్ అకౌంట్లు ఉండాలన్నారు. జిల్లాలో 44 లక్షల మంది బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారని, ఇంకా లక్ష కుటుంబాలకు అకౌంట్లు లేవన్నారు. మంగళవారం నుంచి మెగా క్యాంపులు డివిజన్ స్థాయిలో చేపడుతున్నామని, రంపచోడవరం ఆంధ్రా బ్యాంక్ ప్రాంగణంలోను, అమలాపురంలోని అంబేద్కర్ భవన్లో మంగళవారం నిర్వహిస్తారన్నారు. 24న పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం, రామచంద్రపురంలోని వీఎస్ఎం కళాశాల ఆడిటోరియం, 26న కాకినాడ అంబేద్కర్ భవన్, రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో క్యాంపులు జరుగుతాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ఆంధ్రాబ్యాంక్డీజీఎం శేషగిరిరావు, ఎల్డీఎం జగన్నాథస్వామి, వ్యవసాయశాఖ జేడీ విజయ్‌కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నందారావు పాల్గొన్నారు. -
అవ్వతాతలకు బువ్వేది ?
* బాబు జమానాలో ఒకరు మరణిస్తేనే మరొకరికి పెన్షన్.. * రోశయ్య, కిరణ్ హయాంలోనూ అంతే * వైఎస్ తరువాత పెరగని పింఛన్లు పెద్ద కొడుకు కోసం ‘కోటి’ కళ్లేసుకొని... కోటి మంది... వీళ్లంతా పింఛన్ల కోసం ఎదురుచూసే అభాగ్యులు. పిడికెడు మెతుకుల కోసం పరితపిస్తున్నవారు. ఇందులో పండుటాకులే సగానికి పైగా ఉన్నారు. జీవిత చరమాంకంలో బతుకు పోరు సాగిస్తున్న ఇలాంటివారిని ఆదుకోవాలని చంద్రబాబుకు ఏనాడూ అన్పించలేదు. కేవలం 75 రూపాయలు విదిల్చి అదే భారమని భావించారు. అది కూడా మూణ్ణెల్లకోసారే! ఎవరైనా లబ్ధిదారుడు చస్తేనే కొత్త పింఛన్‌దారుడిని ఎంపిక చేస్తామన్నారు. అలాంటివారి కోసం నేనున్నానంటూ ముందుకొచ్చి భరోసా ఇచ్చారు వైఎస్ రాజశేఖరరెడ్డి. తల్లడిల్లే ముసలి తల్లిదండ్రులకు పెద్ద కొడుకయ్యాడు. అధికారంలోకి రాగానే పింఛన్‌ను రూ.200లకు పెంచడమేగాక నెలనెలా ఠంచనుగా అందించి వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపారు. వైఎస్ హఠాన్మరణంతో ప్రభుత్వానికి అవ్వాతాతలు భారమయ్యారు. ఉన్న సంఖ్యలో కోతపెట్టి ‘ఖర్చు’ తగ్గించుకుంటున్నారు. ‘పెద్దకొడుకు’ రూపంలో వచ్చి తమ బతుకులు మార్చేవారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముదిమి వయసులోనూ తమ ఓటును ఆయుధంగా మలిచేందుకు సిద్ధమవుతున్నారు. పెన్షన్.. బలహీనులకు ఆర్థిక భరోసానిచ్చే ఆయుధం. వృద్ధాప్యం వల్లనో, వైకల్యం వల్లనో సొంతంగా సంపాదించుకోలేని, వారికి ప్రభుత్వం కచ్చితంగా అందించాల్సిన చేయూత. కానీ వైఎస్ హయాం వరకు ప్రభుత్వాలు పింఛను అంశాన్ని ఆర్థికాంశంగా, ఖజానాపై భారంగా, అనవసర వ్యయంగానే చూశాయి. పెన్షన్ల పథకం 1995-96లో ప్రారంభమైంది. అంతకుముందు వితంతు పెన్షన్లు ఉన్నా అతి తక్కువ మందికి లబ్ధి చేకూరేది. 1995-96లో వృద్ధాప్య, 2000లో వికలాంగ, 2001లో చేనేత పెన్షన్ల ప్రక్రియ ప్రారంభ మైంది. 1995లో వితంతు, వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వారి సంఖ్య 9.68 లక్షలు ఉంటే.. అందులో వృద్ధులకు రూ. 75, వితంతువులకు రూ. 50 మాత్రమే చెల్లించేవారు. - కె. శ్రీకాంత్ రావు పొన్ను కర్ర పోటేసుకుంటూ వచ్చిందా అవ్వ. వైఎస్ ఆ ఊరొచ్చాడని ఎవరో చెప్పారట. జన ప్రవాహంలోనే రాజన్న దగ్గరకొచ్చింది. ‘ఏంటమ్మా?’ అని ప్రశ్నిస్తే ఆ అవ్వ కన్నీటి పర్యంతమైంది. ‘అయ్యా! ఆరేళ్లుగా పెన్షన్ కోసం తిరుగుతున్నాను. కన్పించిన ప్రతి నాయకుడిని వేడుకున్నా. ఎన్నికలప్పుడైతే ఇస్తామంటున్నారు. ఆ తర్వాత ఎవరైనా చస్తేనే పెన్షన్ వస్తుందని చెప్పారు. మా ఊరు వచ్చినచంద్రబాబును కలవాలనుకున్నా. కానీ ఆయన చుట్టూ ఉన్నోళ్లు ఎవరూ పోనివ్వలేదు. అయ్యా! ఆ పెన్షన్ ఇస్తే కాస్త ఆసరాగా ఉంటుంది కదా..’ ఆ అవ్వ కొంగుతో కళ్లు అద్దుకుంటూ వైఎస్ చేతులను తడిమింది. ‘వచ్చేది మన ప్రభుత్వమే, నీకు పెన్షన్ వస్తుంది’ అని రాజన్న మాట ఇచ్చారు. ఆ తర్వాత ఆ అవ్వకు పెన్షన్ వచ్చింది. ఆ ఊరి అధికారే ఆమె దగ్గరకొచ్చి ఆ విషయం చెప్పారు. ఆ సమయంలో అవ్వ ఆనందంతో కన్నీళ్లు పెట్టింది. ఇదో యదార్థ గాథ. వైఎస్ పాదయాత్ర సందర్భంగా సంచలనం కలిగించిన వార్త. ‘బాబు’ కాలంలో ఓటు కోసమే పోలింగ్ బూతుకొచ్చిన ఆ అవ్వ... ఆ తర్వాత వైఎస్ కోసమే ఓటెయ్యాలని వస్తున్నా... అని చెప్పింది. మన రాష్ట్రంలో వయోవృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఓటు శాతం తక్కువేమీ కాదు. దాదాపు కోటి మంది ప్రతిసారి ఓటేయడానికి వస్తున్నారు.. ఆ క్షణంలో వాళ్లు కోరుకునేది ఒకే ఒక్కటి. గెలిచిన ప్రభుత్వం తమకు ఎంతోకొంత మేలు చేయాలని వేడుకుంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సామాజిక పెన్షన్ల తీరు తెన్నులే మార్చిన తర్వాత వయోవృద్ధుల ఓటింగ్ శాతం పెరిగింది. వికలాంగుల్లోనే తమ ఓటుతో మనోగతాన్ని చాటుకోవాలనే ఆలోచన రెట్టింపయింది. ఈ పరిస్థితిని గుర్తించిన పార్టీలు సామాజిక పెన్షనర్ల ఓటింగ్‌ను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెన్షన్ల కోసం ఏళ్ల తరబడి తిప్పించుకున్న పార్టీలు సైతం, వాగ్దానాల మొసలి కన్నీరు కారుస్తున్నాయి. సామాజిక పెన్షన్ల వ్యవస్థే భారమన్న చంద్రబాబు సైతం తన మేనిఫెస్టోలో దీన్నో ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. అయితే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నిర్దిష్టమైన హామీల వైపే దృష్టి పెట్టారు. కచ్చితమైన భరోసానే కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక పెన్షన్లపై స్పష్టమైన విధానాన్ని వెల్లడించడం వారిలో ఆశలు రేపుతోంది. అధికారంలోకి వస్తే ఏకంగా కోటి మందికి పెన్షన్లు ఇస్తామని ప్రకటించడం వారికి ఊరట కల్గిస్తోంది. ఏలికలు పేలికలైన చేనేతలూ పెన్షన్ల భద్రత కోసం రాజన్న తరహా వ్యూహం కావాలని, అలాంటి ఆశయాలతో ముందుకెళ్లే పార్టీలకే పట్టంకట్టాలనే ఆలోచనలో ఉన్నారు. పిసరంత సాయం కోసం పోటెత్తే పెన్షనర్ల ఓట్లు అన్ని స్థానాలను ప్రభావితం చేస్తాయనేది సుస్పష్టం. చంద్రబాబు - చంద్రబాబు 2004లో పదవి నుంచి దిగిపోయేనాటికి.. రాష్ట్రంలో మొత్తం వృద్ధాప్య, వితంతు, చేనేత, వికలాంగ పెన్షన్ల సంఖ్య 18.97 లక్షలు. - పెన్షన్ల కోసం ఏడాదికి చేసిన వ్యయం రూ.163.90 కోట్లు. - అర్హులైన అందరికీ కాకుండా, ‘ఒకరు మరణిస్తేనే.. మరొకరికి’ పింఛన్ ఇచ్చేవారు. అదీ మూడు నెలలకోసారి గ్రామ సభల్లో అందించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి - 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే.. 50 రూపాయలు, 75 రూపాయలున్న పెన్షన్లను వంద రూపాయలకు పెంచారు. - 2005-06 ఆర్థిక సంవత్సరంలోనే పెన్షన్ మొత్తాన్ని రూ.వంద నుంచి రూ. 200కు పెంచారు. - 2006 సంవత్సరం నుంచి అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచనలో.. సంతృప్తస్థాయి విధానాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుల సంఖ్య ఒక్కసారిగా 21 లక్షల నుంచి 71 లక్షలకు చేరింది. - దరఖాస్తు చేసుకున్న, తెల్లరేషన్‌కార్డు ఉన్న, అర్హులైన వారందరికీ.. ఎలాంటి మధ్యవర్తులు, సిఫారసులు లేకుండానే పెన్షన్లు మంజూరు చేశారు. - ప్రతినెలా పెన్షన్లు ఇచ్చేవారు. రెండో సంతకం చేస్తా.. పింఛన్ రూ.700 చేస్తా పనులకు పోతున్న అవ్వతాతల కోసం రెండో సంతకం చేస్తాను. ఇవాళ ఈ అవ్వతాతలకు ఇస్తున్న రూ. 200 ఫించన్‌ను మనవడిలా రూ. 700లకు పెంచుతూ రెండో సంతకం చేస్తాను. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నేను చేసే ఐదు సంతకాలు రాష్ట్ర దశాదిశను మార్చేవిగా ఉంటాయి. పైనున్న రాజశేఖరరెడ్డి గర్వపడే విధంగా ఉంటాయి.. - వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదీ ప్రస్తుతం ఉన్న లెక్క (2014 మార్చి వరకు) కేటగిరి లక్ష్యం మంజూరు పంపిణీ వృద్ధాప్య 42,89,616 37,50,325 33,10,111 వైకల్యం 8,84,246 9,12,807 8,20,024 వితంతు 17,77,658 22,83,351 19,52,955 చేనేత 1,44,514 1,33,067 1,17,942 గీతపని 1,00.000 37,841 33.927 రోశయ్య, కిరణ్ - వైఎస్ మరణం తరువాత అధికారం చేపట్టిన రోశయ్య, ఆ తరువాత అనూహ్యంగా సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి పెన్షన్లను ఖజానాపై భారంగా భావించారు. - పెన్షనర్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకరు మరణిస్తేనే మరొకరికి పెన్షన్ అనే పాత పద్ధతికి మళ్లీ తెరతీశారు. బినామీలని, వలసలు వెళ్లారని, స్మార్ట్కార్డులంటూ చేతిముద్రలతో సరిపోలితేనే పెన్షన్ ఇవ్వాలని.. ఇలా రకరకాల పద్ధతుల్లో పెన్షన్ల సంఖ్యకు కత్తెరేశారు. - ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉన్నా.. ఇద్దరు వితంతువులు ఉన్నా.. ఒక్కరికి మాత్రమే పెన్షన్ మంజూరు చేసే పద్ధతిని రోశయ్య ప్రభుత్వం ప్రారంభించింది. - ఒకవైపు ధరలు ఆకాశానికి చేరుతున్నా.. పెన్షన్ మొత్తాన్ని మాత్రం పెంచలేదు. దీనిని కనీసం రూ.400 చేయాలని కేంద్రం పలుమార్లు రాష్ట్రానికి సూచించినా ఏనాడు పట్టించుకోలేదు. - 80 సంవత్సరాల వయస్సు దాటిన వారికి కేంద్రం రూ.500 చెల్లిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వాటినీ తన ఖాతాలోనే వేసుకుంది. పెన్షన్‌దారుల అర్హత వయసును కేంద్రం 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. - వైఎస్ హయాంలో 71 లక్షలుగా ఉన్న పెన్షన్ల సంఖ్య ఇప్పుడూ అలాగే ఉంది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు వైఎస్ తరువాత వచ్చిన ప్రభుత్వాల పనితీరు ఎలా ఉందో.. ఓదార్పు ఇచ్చేదెవరు? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మనదేశంలో 60 ఏళ్లు పైబడిన వారు 27 కోట్ల మంది ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2001లో దేశ జనాభాలో 7.6 శాతమే ఉన్న వృద్ధులు... తాజా సర్వేలో 20 శాతానికి చేరినట్టు తేలింది. గడచిన దశాబ్దకాలంగా వీరు హక్కుల కోసం సమైక్య పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధుల సంక్షేమం దిశగా తొలి అడుగు వేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రిగా ఆయన ఆకాంక్షించారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వృద్ధులను చేర్చే అంశంపై అధికారులతో సమీక్షించి విధివిధానాల రూపకల్పనకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాతి ప్రభుత్వాలు ఆ ఫైళ్లను ముట్టుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో రాష్ట్రంలోని 100 జిల్లాల్లో అమలు చేస్తున్న ఎన్‌పీహెచ్‌సీఈ పథకాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. సర్కారీ నిర్లక్ష్యంపై వయో వృద్ధుల సంఘాలు అనేకసార్లు ప్రభుత్వానికి నివేదించినా ఫలితంలేదు.