- ఇంటి, కుళాయి పన్నుల్లో గోల్‌మాల్
- ప్రత్యేక సిబ్బందిని పెట్టి మరీ గుంజుడు
- మూడేళ్లలో రూ.3.6 కోట్ల వసూలు
- ఈ కాలంలో గ్రామంలో కానరాని అభివృద్ధి
- ప్రస్తుతం జనరల్ ఖాతాలో మిగిలింది రూ.3.2 లక్షలే..
- మిగిలిన సొమ్ముకు రెక్కలు!
కాతేరులో దొంగలుపడ్డారు
Published Sun, Jan 22 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM
రాజమహేంద్రవరం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కాతేరు పంచాయతీలో దొంగలు పడ్డారు. అదీ అందరూ చూస్తూండగానే మూడేళ్ల నుంచి ప్రజల సొమ్మును అప్పనంగా దోచేసుకుంటున్నారు. ఇంత జరుగుతుంటే ప్రజలు ఫిర్యాదు చేయలేదా? పోలీసులు, ఉన్నతాధికారులు పట్టించుకోలేదా? అనే సందేహం రావచ్చు. కానీ ఆ ఛా¯Œ్స ఇవ్వకుండా పంచాయతీ అధికారులు అధికారికంగా ‘అధికార’ బలంతో గుట్టు చప్పుడు కాకుండా మూడేళ్లుగా తమ పని కానిచ్చేస్తున్నారు. ఎంతగా అంటే పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్రీ్టషియ¯ŒSల జీతాలకు కూడా డబ్బులు లేకుండా అందిన కాడికి మాయం చేస్తున్నారు. జీతాలివ్వండి మహాప్రభో అంటూ కార్మికులు మొత్తుకున్నా ‘డబ్బుల్లేవు, బిల్లులు రావడంలేదు’ అని చెబుతూ పంచాయతీ నిధులు అప్పనంగా బొక్కేశారు.
సాక్షి, రాజమహేంద్రవరం :
ఇటీవల నిర్వహించిన ప్రజా సాధికార సర్వే ప్రకారం కాతేరు పంచాయతీలో 6,900 ఇళ్లు, దాదాపు 5 వేల కుళాయిలు ఉన్నాయి. ప్రతి ఇంటి యజమాని నుంచీ ఏటా క్రమం తప్పకుండా ఇంటిపన్ను, కుళాయి పన్ను వసూలు చేస్తున్నారు. కుళాయి పన్నుగా ఏడాదికి రూ.600 చొప్పున వసూలు చేశారు. 50 గజాల స్థలంలో ఉన్న ఇంటికి కుళాయి, ఇంటి పన్ను కలపి రూ.1500 చొప్పున వసూలు చేశారు. ఇక పెద్ద ఇళ్లకు దాదాపు రూ.4 వేల వరకూ పన్ను వేశారు. కనీసం 50 గజాల ఇంటిని పరిగణనలోకి తీసుకుని 6,900 ఇళ్లకు కలిపి పన్ను, కుళాయిల పన్ను వేసినా.. పంచాయతీకి ఏడాదికి రూ.1,03,50,000 ఆదాయం వచ్చింది. ఇలా ఇంటి, కుళాయి పన్నుల రూపంలో 2014 నుంచి మూడేళ్లకు రూ.3,10,50,000 ఆదాయం పంచాయతీకి వచ్చింది. ఇంత ఆదాయం ఉన్నందుకు గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరగాలి. కానీ, అభివృద్ధి మాట దేవుడెరుగు! పంచాయతీలో పారిశుద్ధ్యం సహితం పరమ అధ్వానంగా ఉంది. 18 వార్డులకుగానూ నిన్న మొన్నటివరకూ రెండు అద్దె ట్రాక్టర్లు తీసుకున్నారు. కానీ వాటికి అద్దె చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్ కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం 13వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్‌తో పంచాయతీలోని 18 వార్డుల్లో చెత్తను తరలిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్, 17 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తూండగా వారికి ఐదు నెలలుగా జీతాలివ్వడంలేదు. మరో ఎనిమిది మంది తాగునీటి, విద్యుత్, కార్యాలయం సిబ్బంది ఉన్నారు. వీరికి కూడా ఐదు నెలలుగా జీతాలు లేవు. 2014 నుంచి ఇప్పటివరకూ పంచాయతీ పరిధిలో అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవు. మూడు నెలలుగా పంచాయతీలో వీధి దీపాలు కూడా వెలగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ బాదుడు ప్రత్యేకం
పంచాయతీలో అధికారికంగాకంటే అనధికారికంగా వేసుకున్న నీటి కుళాయిలే అధికం. కొత్త కుళాయి కనెక్ష¯ŒS ఇవ్వడం కోసం రూ.2400 వసూలు చేసేవారు. కానీ ప్రస్తుతం సస్పెండైన కార్యదర్శి ఈ మొత్తాన్ని రూ.4,500కు పెంచి, అనధికారికంగా కుళాయిలు ఏర్పాటు చేసుకున్న వారందరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. సాధారణంగా పంచాయతీకి కట్టిన ఫీజులోనే కుళాయి ఏర్పాటుకు అవసరమైన మెటీరియల్ సమకూర్చుతారు. అయితే ఇక్కడ ముందుగానే ఇంటి యజమానులు ఎవరికి వారు కుళాయిలు ఏర్పాటు చేసుకున్నాక, వారి నుంచి రూ.4500 వసూలు చేశారు. పంచాయతీకి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. పంచాయతీలో గుమాస్తా, బిల్ కలెక్టర్ లేకపోవడంతో ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు ప్రత్యేకంగా ఇద్దరిని నియమించారు. వసూలు చేసిన దాంట్లో రూ.లక్షకు రూ.10 వేలు కమీష¯ŒS ఇచ్చేవిధంగా ఒప్పందం కుదుర్చుకుని పని కానిచ్చేశారు. ఇలా దాదాపు మూడు వేల కుళాయిల నుంచి రూ.4500 చొప్పున సుమారు రూ.1.35 కోట్లు వసూలు చేశారు. వసూళ్ల సిబ్బందికి సహాయంగా తాము కూడా వెళ్లేవారమని పారిశుద్ధ్య కార్మికులు చెబుతున్నారు. ఈ లెక్కన మూడేళ్లలో ఇంటి, కుళాయి పన్నుల ద్వారా రూ.3.10 కోట్లు, కుళాయి ఫీజుల ద్వారా రూ.1.35 కోట్లు వెరసి రూ.4.45 కోట్ల పంచాయతీ నిధులు ఉండాలి. 2014 నుంచి ఇప్పటివరకు గ్రామంలో ఒక్క సిమెంట్ రోడ్డుకాని, డ్రైనేజీకాని నిర్మించ లేదు. కానీ ప్రస్తుతం పంచాయతీ జనరల్ ఫండ్‌లో రూ.3.20 లక్షలు మాత్రమే ఉన్నాయని ఇ¯ŒSచార్జ్ కార్యదర్శి సునీత తెలిపారు. దీనినిబట్టి మిగిలిన కోట్లాది రూపాయల సొమ్ము స్వాహా అయినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Advertisement