kateru
-
అడ్డుకునేవారెవరు?
కాతేరులో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా l పట్టించుకోని అధికారులు సాక్షి, రాజమహేంద్రవరం : కాతేరులో ఇసుక అక్రమ రవాణా ఏమాత్రం ఆగలేదు. కాతేరు అనధికార ర్యాంపు నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తరలించి లారీల్లో నింపి విశాఖ జిల్లా, ఇతర దూర ప్రాంతాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్న విషయం పలు మార్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యవహారం కలెక్టర్ దృష్టికి వెళ్లినా మండల స్థాయిలో అధికారులు మిలాఖాత్ అవ్వడం వల్ల ఇసుక అక్రమ దందాకు అడ్డుపడడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇందుకు మంగళవారం జరిగిన çఘటన ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అధికారులకు కనిపించలేదా! కాతేరు పంచాయతీలో రికార్డులను ప్రస్తుత ఇ¯ŒSచార్జి కార్యదర్శికి అప్పగించేందుకు, సిబ్బం దికి జీతాలు ఎన్ని నెలలకు ఇవ్వాలి? లెక్కా పత్రం తేల్చేందుకు రాజమహేంద్రవరం రూరల్ మండల తహసీల్దార్ జి.భీమారావు, మండల అభివృద్ధి అధికారి రమణారెడ్డి మంగళవారం మధ్యాహ్నం కాతేరు పంచాయతీ కార్యాలయం లో పంచాయతీ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. అయితే ఓ పక్క వీరి సమావేశం కొనసాగుతుండగానే మరో పక్క ఇసుక అక్రమ రవాణాదారులు తమ పని తాము నిమ్మలంగా చేసుకుంటున్నారు. కాతేరు అనధికార ఇసుక ర్యాంపునకు వెళ్లే దారిలో గ్రామం చివరన ఉన్న ఖాళీ స్థలంలో భారీ స్థాయిలో ఇసుక డంపు చేశారు. అక్కడ నుంచి లారీల్లో మినీ ప్రొక్లెయి¯ŒS ద్వారా నింపుతున్నారు. తహసీల్దార్, ఎంపీడీవో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నా తమ పని తాము కానిచ్చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి కేవలం 200 అడుగుల దూరంలోని డంపు నుంచి ఇసుకను లారీల్లో నింపుతున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేదు. వేకువజామునే.. కాతేరు అనాధికార ర్యాంపు నుంచి గ్రామంలో పెద్ద మనుషులుగా, రాజకీయ పార్టీ నేతలుగా చెలామణి అవుతున్నా వారు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. వేకువజామున కూలీల సహాయంతో ఇసుకను ట్రాక్టర్లలో నింపిస్తున్నారు. కూలీలకు ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 250లు ఇస్తున్నారు. గ్రామంలో తమ, తమ బంధువుల ఖాళీ స్థలాల్లో డంపులు ఏర్పాటు చేసి ఇసుక నిల్వ చేస్తున్నారు. ఇసుక డంపులు గ్రామంలో పలు చోట్ల ఉన్నాయి. ప్రధాన రహదారి వెంట వెళుతున్నా స్పష్టంగా కనిపిస్తాయి. అధికారులపై ఆరోపణలు కాతేరు అనాధికార ఇసుక ర్యాంపు నుంచి ఇసుక తరలించడం, గ్రామంలో డంపు చేయడం వరకూ రెవెన్యూ అధికారులకు తెలియందేమీ కాదు. అయితే ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు ఒక్క ట్రాక్టరును పట్టుకోలేదు. ఏ ఒక్కరిపై కేసు నమోదు చేయలేదు. గ్రామానికి వస్తున్న దారిలోనే ఇసుక నిల్వలు కనిపిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాటవేత ధోరణి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న విషయం ‘సాక్షి’ కంటపడిన వెంటనే వీఆర్వో ముని దృష్టికి తీసుకెళ్లగా ‘ఇక్కడ అలా జరగదండీ’ అంటూ దాటవేశారు. మరో 15 నిమిషాల తర్వాత కార్యాలయానికి వచ్చిన తహసీల్దార్ జి.భీమారావు దృష్టికి తీసుకెళ్లగా ‘ విచారిస్తాం. ఇసుక డంపు చేసే ప్రాంతం మా పరిధిలోకి వస్తుందో రాదో, వీఆర్వోను పంపిస్తా’ అంటూ ముక్తసరిగా జవాబిచ్చారు. దూర ప్రాంతాలకు తరలింపు రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నంలో భనవ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఇసుక అక్రమంగా రవాణా చేసేందుకు మంచి అనువైన ప్రదేశంగా కాతేరు ఉంది. ఈ గ్రామ సరిహద్దును అనుకుని జాతీయ రహదారి వెళుతోంది. ఇసుకను లారీలల్లో నింపిన జాతీయ రహదారిపైకి వెళితే మధ్యలో ఎక్కడా ఆగే అవసరం ఉండదు. నేరుగా విశాఖ, ఇతర ప్రాంతాలకు తరలించొచ్చు. దీనిని అవకాశం తీసుకున్న అసాములు ఉచిత ఇసుకను పెట్టుబడిలేని వ్యాపారంగా మలుచుకున్నారు. 10 టైర్ల లారీలో 5 యూనిట్లు, 12 టైర్ల లారీలో 7 యూనిట్ల చొప్పున ఇసుక నింపుతున్నారు. 5 యూనిట్ల లారీ ఇసుకను దూరాన్ని బట్టి రూ. 30 నుంచి 40 వేలకు విక్రయిస్తున్నారు. అదే 7 యూనిట్ల లారీ ఇసుకను దూరాన్ని బట్టి రూ. 40 నుంచి రూ. 50 వేల లెక్కన భవన నిర్మాణదారులు కోరుకున్న చోటుకు తరలిస్తున్నారు. తహసీల్దార్ అక్కడే ఉన్నారు.. విచారణ చేయిస్తా.. కాతేరు ఇసుక ర్యాంపునకు అనుమతి ఇవ్వలేదు. అక్కడ తవ్వకాలు జరపడం చట్టవిరుద్ధం. అక్కడ అర్ధరాత్రి తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో గత వారం మేము దాడి చేశాం. కానీ ఎవ్వరూ దొరకలేదు. ఇంటి నిర్మాణం జరుగుతుంటే దాని పక్కనే 10 యూనిట్ల వరకు ఇసుకను నిల్వ చేసుకోవచ్చు. కానీ డంపులు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించడం చట్ట విరుద్ధం. ప్రస్తుతం రూరల్ తహసీల్దార్ అక్కడే ఉన్నారు. విచారణ చేయిస్తా. – విజయకృష్ణ¯ŒS, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ -
కాతేరును కొల్లగొట్టిందెవరు?
సాక్షి, రాజమహేంద్రవరం : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పంచాయతీలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసింది. పంచాయతీలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక నుంచి అభివృద్ధి పనుల వరకు జన్మభూమి కమిటీల అనుమతిలేనిదే ఏ పనీ కాదు. ఓ అర్హుడైన వృద్ధుడికి వ్యద్ధాప్య పింఛ¯ŒS ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భావించినా జన్మభూమి కమిటీల అనుమతి లేనిదే ఆ పని చేయలేని స్థితి. ఆ స్థాయిలో జన్మభూమి కమిటీలకు సీఎం చంద్రబాబు అనధికారిక పెత్తనం కట్టబెట్టారు. పంచాయతీలో చీమ చిటిక్కుమనాలాన్నా జన్మభూమి కమిటీల అనుమతి తప్పనిసరి. అలాంటిది కాతేరు పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారిగా ఉన్న ఈవో పీఆర్అండ్ఆర్డీ జన్మభూమి కమిటీకి తెలియకుండా వివిధ గ్రాంట్ల కింద 2015–16, 2016–17 ఆర్థిక ఏడాదుల్లో పంచాయతీకి వచ్చిన రూ.1.10 కోట్లు నిధులు పక్కదారి పట్టించారా? అనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో ప్రతి నెలా వృద్ధులు, వికాలంగులు, వితంతువులకు పంపిణీ చేసే పింఛన్లు కూడా జన్మభూమి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పంచయతీ కార్యదర్శి ఇస్తున్నారు. పంచాయతీలో ఇలా ప్రతి పని తమ కనుసన్నల్లో నిర్వహించేలా పెత్తనం చెలాయిస్తున్న జన్మభూమి కమిటీకి తెలియకుండా పంచాయతీ కార్యదర్శి రూ.1.10 కోట్లు నిధులు వినియోగించారా? అంటే ఖచ్చితంగా కాదనే అంటున్నాయి అధికార వర్గాలు. 2014 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కాతేరు పంచాయతీలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. అలాంటిది వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి రూ.1.10 కోట్ల నిధులు ఖాజానా నుంచి ఉపసంహరింస్తుంటే జన్మభూమి కమిటీ సభ్యులకు తెలియకుండా ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది కొసరే... అసలు కొండను మింగిందెవరు? పంచాయతీకి వచ్చిన గ్రాంట్లు రూ.1.10 కోట్ల నిధులు కాజేశారని ఉన్నతాధికారులు వాటిపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కార్యదర్శి, ప్రత్యేక అధికారిని సస్పెండ్ చేశారు. ఈ నిధులకన్నా నాలుగు రెట్లు అధికంగా పంచాయతీ నిధులు జేబుల్లో వేసుకున్నారు. ఇంటి, కుళాయి పన్నుల రూపంలో గ్రామంలో ఉన్న 6,900 గృహ యజమానుల నుంచి 2014–15, 2015–16, 2016–17 ఏడాదుల్లో రూ.3 కోట్ల 10 లక్షల 50 వేలు వసూలు చేశారు. పేపర్ మిల్లు గృహ సముదాయం నుంచి ఇంటి పన్ను రూపంలో ఏడాదికి రూ.7 లక్షలు, మంచినీటి పథకం పన్ను రూ.3 లక్షలు వెరసి రూ.10 లక్షలు ఫిక్స్‌డ్‌గా ఆదాయం వస్తుంది. మూడేళ్లలో ఈ రెండు అంశాల నుంచే పంచాయతీకి రూ. 30 లక్షల ఆదాయం వచ్చింది. ఈ నిధులు పంచాయతీ జనరల్ ఖాతాలో డిపాజిట్ చేయాల్సి ఉన్నా చేయలేదు. వీటితోపాటు పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సస్పెండైన గన్ని సత్య ప్రసాద్ కుళాయి మంజూరు ఫీజును రూ.2,400 నుంచి రూ. 4,500లకు పెంచారు. అప్పటికే కుళాయిలు వేసుకున్న దాదాపు 3000 మంది నుంచి రూ.4,500 లెక్కన రూ.కోటి .35 లక్షలు వసూలు చేశారు. వీటితోపాటు ఈ మూడేళ్లలో కాతేరులో బహుళ అంతస్తుల భవనాలు నిర్మాంచారు. నూతన ఇళ్లు వెలిశాయి. వీటికి అనుమతులు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయం కూడా జనరల్ ఖాతాకు జమ చేయలేదు. ఇక కాతేరు గ్రామ పరిధిలో అనేక రియల్ వెంచర్లు వేశారు. వీటి అనుమతుల ద్వారా వచ్చిన సొమ్మును కూడా కాజేశారు. వీటన్నింటిపై ఉన్నతాధికారులు విచారణ చేస్తే కాగేసిన పంచాయతీ సొమ్ము కోట్ల రూపాయలు ఉంటుంది. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి తెలియకుండా ఉంటుందా? పంచాయతీలో రూపాయి ఖర్చు చేయాలన్నా జన్మభూమి కమిటీ అనుమతి తప్పనిసరన్నది నగ్నసత్యం. అలాంటిది కోట్ల రూపాయల ప్రజాధనం గోల్‌మాల్‌లో జన్మభూమి కమిటీ సభ్యులు, అ«ధికార పార్టీకి చెందిన గ్రామ పెద్దల హస్తం లేకుండా ఉంటుందా? అసలు పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి కేవలం పాత్రధారులేనని, సూత్రధారులు వేరని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రూ. కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంటే నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి తెలియకుండా ఉంటుందా?. ప్రతి విషయం ముఖ్యనేతకు చెప్పే కిందిస్థాయిలో తమ్ముళ్లు అవినీతికి తెరలేపుతారన్నది జగమెరిగిన సత్యం. దీనికి నిదర్శనమే పంచాయతీ నిధుల దుర్వినియోగంపై డివిజ¯ŒS పంచాయతీ అధికారి జిల్లా అధికారికి పంపిన నివేదికను తొక్కిపెట్టడం. నాలుగు నెలల కిందట ఈ నివేదిక జిల్లా అధికారికి పంపినా ఇప్పటి వరకు బహిర్గతం కాకపోవడంలో మర్మమేమిటన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అనుమతులపై విచారణ చేస్తాం... కుళాయిల అనుమతులపై విచారణ చేయిస్తాం. ఎవరైనా నగదు చెల్లించి ఉంటే రసీదు చూపించాలి. అలా లేని కుళాయిలన్నింటినీ తొలగిస్తాం. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయి. కుళాయి కొనసాగించాలంటే ఫీజుతోపాటు, సూపర్ పెనాల్టీ కూడా వసూలు చేస్తాం. బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతులపై విచారణ చేస్తాం. నిబంధలకు విరుద్ధంగా ఉన్న భవనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. – ఎం.వరప్రసాద్, డీఎల్పీవో,రాజమహేంద్రవరం ప్రజల సొమ్ము రికవరీ జరుగుతుందా? ప్రభుత్వాల నుంచి వచ్చిన రూ.1.10 కోట్లు, పంచాయతీలో ఇంటి పన్నులు, కుళాయి పన్నులు రూ.3.40 కోట్లు, కొత్త కుళాయిల మంజూరుకు వసూలు చేసిన రూ. 1.35 కోట్లు, ఇళ్ల నిర్మాణాల అనుమతులు, రియల్ వెంచర్ల అనుమతుల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం కాజేశారు. పంచాయతీలో ప్రస్తుతం రూ.3 లక్షల 25 వేలు మాత్రమే ఉన్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం కాజేసిన వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి అసలు దొంగలకు శిక్ష వేస్తారా?. ప్రజా ధనాన్ని రికవరీ చేస్తారా? లేదంటే విచారణ పేరుతో సాగదీస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఐదు నెలలుగా పంచాయతీ సిబ్బంది 26 మందికి జీతాలు లేవు. రెండు నెలలుగా వీధి దీపాలు వెలగడంలేదు. కోట్ల రూపాయల ఆదాయం వచ్చే తమ పంచాయతీలో కనీస సౌకర్యాలు లేవని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం కొల్ల గొట్టిన వారి నుంచి తిరిగి వసూలు చేసి గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాలని గ్రామ ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు. -
కాతేరులో దొంగలుపడ్డారు
ఇంటి, కుళాయి పన్నుల్లో గోల్మాల్ ప్రత్యేక సిబ్బందిని పెట్టి మరీ గుంజుడు మూడేళ్లలో రూ.3.6 కోట్ల వసూలు ఈ కాలంలో గ్రామంలో కానరాని అభివృద్ధి ప్రస్తుతం జనరల్ ఖాతాలో మిగిలింది రూ.3.2 లక్షలే.. మిగిలిన సొమ్ముకు రెక్కలు! రాజమహేంద్రవరం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కాతేరు పంచాయతీలో దొంగలు పడ్డారు. అదీ అందరూ చూస్తూండగానే మూడేళ్ల నుంచి ప్రజల సొమ్మును అప్పనంగా దోచేసుకుంటున్నారు. ఇంత జరుగుతుంటే ప్రజలు ఫిర్యాదు చేయలేదా? పోలీసులు, ఉన్నతాధికారులు పట్టించుకోలేదా? అనే సందేహం రావచ్చు. కానీ ఆ ఛా¯Œ్స ఇవ్వకుండా పంచాయతీ అధికారులు అధికారికంగా ‘అధికార’ బలంతో గుట్టు చప్పుడు కాకుండా మూడేళ్లుగా తమ పని కానిచ్చేస్తున్నారు. ఎంతగా అంటే పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్రీ్టషియ¯ŒSల జీతాలకు కూడా డబ్బులు లేకుండా అందిన కాడికి మాయం చేస్తున్నారు. జీతాలివ్వండి మహాప్రభో అంటూ కార్మికులు మొత్తుకున్నా ‘డబ్బుల్లేవు, బిల్లులు రావడంలేదు’ అని చెబుతూ పంచాయతీ నిధులు అప్పనంగా బొక్కేశారు. సాక్షి, రాజమహేంద్రవరం : ఇటీవల నిర్వహించిన ప్రజా సాధికార సర్వే ప్రకారం కాతేరు పంచాయతీలో 6,900 ఇళ్లు, దాదాపు 5 వేల కుళాయిలు ఉన్నాయి. ప్రతి ఇంటి యజమాని నుంచీ ఏటా క్రమం తప్పకుండా ఇంటిపన్ను, కుళాయి పన్ను వసూలు చేస్తున్నారు. కుళాయి పన్నుగా ఏడాదికి రూ.600 చొప్పున వసూలు చేశారు. 50 గజాల స్థలంలో ఉన్న ఇంటికి కుళాయి, ఇంటి పన్ను కలపి రూ.1500 చొప్పున వసూలు చేశారు. ఇక పెద్ద ఇళ్లకు దాదాపు రూ.4 వేల వరకూ పన్ను వేశారు. కనీసం 50 గజాల ఇంటిని పరిగణనలోకి తీసుకుని 6,900 ఇళ్లకు కలిపి పన్ను, కుళాయిల పన్ను వేసినా.. పంచాయతీకి ఏడాదికి రూ.1,03,50,000 ఆదాయం వచ్చింది. ఇలా ఇంటి, కుళాయి పన్నుల రూపంలో 2014 నుంచి మూడేళ్లకు రూ.3,10,50,000 ఆదాయం పంచాయతీకి వచ్చింది. ఇంత ఆదాయం ఉన్నందుకు గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరగాలి. కానీ, అభివృద్ధి మాట దేవుడెరుగు! పంచాయతీలో పారిశుద్ధ్యం సహితం పరమ అధ్వానంగా ఉంది. 18 వార్డులకుగానూ నిన్న మొన్నటివరకూ రెండు అద్దె ట్రాక్టర్లు తీసుకున్నారు. కానీ వాటికి అద్దె చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్ కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం 13వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్‌తో పంచాయతీలోని 18 వార్డుల్లో చెత్తను తరలిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్, 17 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తూండగా వారికి ఐదు నెలలుగా జీతాలివ్వడంలేదు. మరో ఎనిమిది మంది తాగునీటి, విద్యుత్, కార్యాలయం సిబ్బంది ఉన్నారు. వీరికి కూడా ఐదు నెలలుగా జీతాలు లేవు. 2014 నుంచి ఇప్పటివరకూ పంచాయతీ పరిధిలో అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవు. మూడు నెలలుగా పంచాయతీలో వీధి దీపాలు కూడా వెలగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బాదుడు ప్రత్యేకం పంచాయతీలో అధికారికంగాకంటే అనధికారికంగా వేసుకున్న నీటి కుళాయిలే అధికం. కొత్త కుళాయి కనెక్ష¯ŒS ఇవ్వడం కోసం రూ.2400 వసూలు చేసేవారు. కానీ ప్రస్తుతం సస్పెండైన కార్యదర్శి ఈ మొత్తాన్ని రూ.4,500కు పెంచి, అనధికారికంగా కుళాయిలు ఏర్పాటు చేసుకున్న వారందరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. సాధారణంగా పంచాయతీకి కట్టిన ఫీజులోనే కుళాయి ఏర్పాటుకు అవసరమైన మెటీరియల్ సమకూర్చుతారు. అయితే ఇక్కడ ముందుగానే ఇంటి యజమానులు ఎవరికి వారు కుళాయిలు ఏర్పాటు చేసుకున్నాక, వారి నుంచి రూ.4500 వసూలు చేశారు. పంచాయతీకి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. పంచాయతీలో గుమాస్తా, బిల్ కలెక్టర్ లేకపోవడంతో ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు ప్రత్యేకంగా ఇద్దరిని నియమించారు. వసూలు చేసిన దాంట్లో రూ.లక్షకు రూ.10 వేలు కమీష¯ŒS ఇచ్చేవిధంగా ఒప్పందం కుదుర్చుకుని పని కానిచ్చేశారు. ఇలా దాదాపు మూడు వేల కుళాయిల నుంచి రూ.4500 చొప్పున సుమారు రూ.1.35 కోట్లు వసూలు చేశారు. వసూళ్ల సిబ్బందికి సహాయంగా తాము కూడా వెళ్లేవారమని పారిశుద్ధ్య కార్మికులు చెబుతున్నారు. ఈ లెక్కన మూడేళ్లలో ఇంటి, కుళాయి పన్నుల ద్వారా రూ.3.10 కోట్లు, కుళాయి ఫీజుల ద్వారా రూ.1.35 కోట్లు వెరసి రూ.4.45 కోట్ల పంచాయతీ నిధులు ఉండాలి. 2014 నుంచి ఇప్పటివరకు గ్రామంలో ఒక్క సిమెంట్ రోడ్డుకాని, డ్రైనేజీకాని నిర్మించ లేదు. కానీ ప్రస్తుతం పంచాయతీ జనరల్ ఫండ్‌లో రూ.3.20 లక్షలు మాత్రమే ఉన్నాయని ఇ¯ŒSచార్జ్ కార్యదర్శి సునీత తెలిపారు. దీనినిబట్టి మిగిలిన కోట్లాది రూపాయల సొమ్ము స్వాహా అయినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
మూడేళ్లలో పూర్తి ఆయకట్టుకు ‘చాగల్నాడు’ నీరు
కాతేరు (రాజమహేంద్రవరం రూరల్): చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా మూడేళ్లలో పూర్తి ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అనపర్తి, రాజమహేంద్రవరంరూరల్, రాజానగరం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, పెందుర్తి వెంకటేష్ పేర్కొన్నారు. వారు ముగ్గురూ సోమవారం కాతేరు గ్రామంలోని చాగల్నాడు ఎత్తిపోతల పథకం స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ పథకంలో 35వేల ఎకరాలకు నీరు అందించాల్సి ఉండగా ప్రస్తుతం 15 వేల ఎకరాలకు నీరు అందిస్తున్నట్టు ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పైపులైన్లు అన్నీ దెబ్బతిన్నాయన్నారు. సుమారు రూ.ఏడు కోట్లతో పంపులను బాగు చేయిస్తామన్నారు. ఈ ఎత్తిపోతల పథకం నిర్వహణ కోసం రూ.1.8 కోట్ల ప్రతిపాదనలు పంపించినట్టు వారు తెలిపారు. గోదావరిలో కొవ్వూరు వైపు వాలు ఎక్కువగా ఉండడం వలన ఇక్కడ నాలుగుఎత్తిపోతల పథకాలకు నీరందే పరిస్థితి లేదని తెలిపారు. గోదావరిలో డ్రెడ్జింగ్ పనులు చేపడితే నీటి సమస్య ఉండదన్నారు. మేం ముగ్గురం కలసి ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి డ్రెడ్జింగ్ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలు నల్లమిల్లి, గోరంట్ల, పెందుర్తి తెలిపారు. జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సరిసపల్లి నాగేశ్వరరావు, రంగంపేట ఎంపీపీ నీలపాల త్రిమూర్తులు, జగ్గంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అడబాల వెంకట్రావు, సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకరరావు, డీఈ యు.రమేష్, డీఈ(వైఆర్సీ,పెద్దాపురం) కె.శ్రీనివాస్, ఏఈ జగదీష్ పాల్గొన్నారు. -
కెమికల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ..
రాజమండ్రి (తూర్పు గోదావరి జిల్లా) : వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న కెమికల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎగిసిపడ్డ అగ్నికీలలు కెమికల్‌కు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో కెమికల్ లారీ పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కాటేరు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. గోదావరి పై నూతనంగా నిర్మించిన గామన్ వంతెనపై వెళ్తున్న కెమికల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు.