grameena bank
-
గ్రామీణ బ్యాంకులో గోల్మాల్
సాక్షి, రంగారెడ్డి: అజీజ్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. తమ ఫిక్స్డ్ డిపాజిట్లలోని కోట్లాది రూపాయల డబ్బు ఖాతాదారులకు తెలియకుండానే మాయం అయింది. సమాచారం తెలిసిన ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పరిసర గ్రామాల ప్రజలు బ్యాంకుకు తరలివస్తున్నారు. గ్రామస్తుల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని బ్యాంకు సిబ్బంది ఫిక్స్డ్ డిపాజట్లలోని డబ్బును మాయం చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఎఫ్డీలో డబ్బు మాయం అయిందన్న సమాచారంతో నాగిరెడ్డిగూడెం వాసి అయిన ఓ ఖాతాదారు కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్సలందిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. -
బ్యాంకు లాకర్లలో 50 కిలోల బంగారం మాయం
-
ఒకే ప్రయత్నం... అందరూ గెలిచారు!
విజయం విజయం అందరూ కోరుకుంటారు. ప్రయత్నం చాలామంది చేస్తారు. కానీ ఆటంకాలు కొందరే దాటుతారు. ఆ దాటిన వారే విజయాలను శాసిస్తారు. అయితే, తాము విజయం సాధించడానికి కష్టాలు పడేవారు కొందరయితే, తమతో పాటు వ్యవస్థను విజయం వైపు నడిపించే వ్యవస్థ నిర్మాతలు కొందరు. చేతన కూడా అలాంటి వ్యక్తే. మహారాష్ర్టలోని సతారా జిల్లాలో మష్వాద్ అని ఒక ప్రాంతం. 1970 తర్వాత విపరీతమైన కరవు వల్ల అది నివాసానికి ప్రతికూల ప్రాంతమైపోయింది. ఉపాధి లేదు. అందుకే వలసలు భారీగా పెరిగాయి. అప్పుడే అక్కడ ఓ వ్యక్తి ప్రత్యక్షమయ్యారు. ఆమె పేరు చేతన విజయ సిన్హా. 1980లో చేతన ఆ ప్రాంతంలో ఏదో చేయాలనుకున్నపుడు సహజంగానే అక్కడ నిరాశాపూరితమైన ప్రతిస్పందన ఎదురైంది. ప్రతి ప్రయత్నంలోనూ అదే ఫలితం. ముందు అక్కడి పరిస్థితులను బాగా అధ్యయనం చేశాక ఆమె అన్ని ప్రభుత్వ పథకాలను ఆ ప్రాంతానికి రప్పించారు. కానీ అవి చాలలేదు. అందుకే ‘మన్’ సోషల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. ఇది సేవా సంస్థ కాదు, లాభాలు తీసుకునే పొదుపు సంస్థ. కానీ సంస్థ కంటే వినియోగదారులకే ఎక్కువగా ప్రయోజనం కలిగించేలా రూపొందించబడినది. దాని ద్వారా అక్కడి వారిలో పొదుపు అలవాటు పెరిగింది. అందులో కాస్త జాగ్రత్త ఉన్నవారికి చేతన చిన్నచిన్న రుణాలను ఇచ్చారు. అయితే, దీనిని పూర్తి స్థాయి ఆర్థిక వ్యవస్థగా నడపడానికి నిబంధనలు ఒప్పుకోవు. అందుకే ఒక సహకార బ్యాంకుగా చేయాలని రిజర్వు బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడే అసలు కష్టం మొదలైంది. సహకార బ్యాంకు నెలకొల్పడానికి రిజర్వు బ్యాంకు అనుమతి కావాలంటే మూలనిధి కావాలి. దాంతో పాటు సభ్యుల వివరాలు కూడా కొన్ని కావాలి... ఇంకా ఇలాంటివేవో ఉన్నాయి. దీనికి చేతన ఏ దొడ్డిదారులూ వెతకలేదు. రెండేళ్లు టైం తీసుకుని స్థానికులకు రాయడం, చదవడం, వడ్డీ లెక్కలు కట్టడం నేర్పించి మళ్లీ దరఖాస్తు పెట్టించారు. ఇందులో ఆమెకు సహకరించిన వారు కూడా అక్కడున్న ఇలాంటి వర్గంలోని చదువుకున్న పేద స్త్రీలే. వీరు పంపిన దరఖాస్తును చూసి రిజర్వు బ్యాంకు ముచ్చటపడి మరీ అనుమతి ఇచ్చింది. దేశంలో రిజర్వు బ్యాంకు అనుమతి పొందిన తొలి గ్రామీణ ఆర్థిక సంస్థ అదే. 1997లో ‘మన్’కు అనుమతి వచ్చింది. ఇపుడు మన్ దేశి మహిళా బ్యాంకుకు 1,85,000 మంది కస్టమర్లు ఉన్నారు. గ్రామీణ బ్యాంకు కాబట్టి ఇదేదో ఎదుగూ బొదుగూ లేని పేదల బ్యాంకు అనుకునేరు. దేశంలో టాప్ బ్యాంకుల్లో ఉన్న అన్ని రకాల టెక్నాలజీ ఈ బ్యాంకు వినియోగించుకుంటోంది! బ్యాంకు సమాచారాన్ని బ్యాంకు అధికారులకు ఇచ్చిన ఓ వైర్‌లైస్ మిషన్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. అంటే ఇది ఒక నిరంతర మొబైల్ బ్యాంకు. అధికారులు ఇల్లు, మార్కెట్, ఆన్ జర్నీ... ఇలా ఎక్కడైనా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఫీల్డ్ ఆఫీసర్ల ప్రమేయం ఎక్కువ. ఆన్ ది స్పాట్ లోన్స్ ఇవ్వడం ఈ బ్యాంకు ప్రత్యేకత. అంతేనా... ఈ బ్యాంకుకు అనుబంధంగా ఒక బిజినెస్ స్కూల్ ఉంది. కేవలం వారి డబ్బును దాచి వడ్డీలివ్వడం, రుణాలివ్వడమే కాదు... వ్యాపార నిర్వహణలో, వృత్తి కళల్లో మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి వారికి రుణాలు ఇచ్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది ఈ బ్యాంకు. ఈ వ్యహారాల్లో మన్ దేశీ గ్రూప్ వెంచర్స్ కూడా పాలుపంచుకుంటుంది. 2020 నాటికి పది లక్షల మంది మహిళా వ్యాపారవేత్తలను సృష్టించాలన్నది ఈ గ్రూపు సంస్థల లక్ష్యం. ఈ విజయాన్ని ఇక్కడి దాకా తీసుకురావడంలో ముఖ్యపాత్ర వహించిన వ్యక్తి చేతన విజయ సిన్హా. ఆమె విజయం అసామాన్యం. ఆమె ప్రయత్నం అరుదైన విశేషం. ఈ ప్రయత్నం ఏ స్థాయి అభినందనలు పొందిందంటే ప్రపంచ ఆర్థిక సంస్థ (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) విజయ సిన్హాకు ‘2013 ఇండియా సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ అవార్డును ప్రకటించింది. -ప్రకాష్ చిమ్మల -
భద్రత డొల్ల..
అధికారుల నిర్లక్ష్యం.. విధుల్లో నిర్లిప్తత విలువ.. అక్షరాల అరకోటి పైమాటే. రైతుల సొమ్మును భద్రంగా ఉంచాల్సిన ఉద్యోగులు గాలికొదిలేశారు. కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంతో దొంగలు వచ్చి తాపీగా ఉన్నదంతా ఊడ్చేశారు. వారు ఇంటి దొంగలా? బయట దొంగలా? అనేది విచారణలో తేలనుంది. కాటారం దక్కన్ గ్రామీణ బ్యాంకులో బంగారం మాయం ఘటన మరవకముందే ధర్మపురి ప్రాథమిక సహకార సంఘంలో చోరీ జిల్లావాసులను ఆందోళనకు గురిచేస్తోంది. - న్యూస్‌లైన్, ధర్మపురి ధర్మపురి న్యూస్‌లైన్ : ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో భద్రత ఏర్పాట్లు లేకనే దొంగలు చొరబడ్డారని తేలిపోయింది. పట్టణంలోని నం బరు 63 జాతీయ రహదారిపై నిత్యం వాహనా లు రాకపోకలు సాగుతుంటాయి. సంఘానికి కేవలం 50మీటర్ల దూరంలోనే తహశీల్దార్, మండల పరిషత్ తదితర ప్రభుత్వ కార్యాలయా లు ఉన్నాయి. జనసంచారం అధికంగా ఉంటుం ది. అయినా వీటి సమీపంలోని పీఏసీఎస్‌లో చోరీ జరగడం గమనార్హం. నగదుతోపాటు రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలు భద్రపర్చే సింగిల్ విండోలో భద్రతా పరమైన ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. కనీసం సీసీ కెమెరాలు బిగించలేదు. వాచ్‌మన్ సైతం లేడు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. షట్టర్లు పగులగొట్టి.. లాకర్లు తెరచి.. ముందుగా పీఏసీఎస్ షట్టర్ల తాళాలను వేటకొడవలితో కోసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. గదిలో ఓ మూలకు పడిఉన్న వేటకొడవలి ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. షట్టర్లు తెరిచిన దొంగలు.. నేరుగా లోనికి ప్రవేశించారు. ఆ తర్వాత తాళాలతో లాకర్లు తెరిచినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమయంలో దొంగలు మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. పీఏసీఎస్‌లో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. రెండు లాకర్లు, నాలుగు బీరువాలు ఉన్నాయి. ఒక లాకరులో ఆభరణాలు, మరోదానిలో నగదు భద్రపరుస్తున్నారు. వాటికి సంబంధించిన తాళం చెవులు మేనేజరు వద్ద ఉండాలి. మేనేజర్ బుచ్చన్న మంగళవారం ఆఫీస్ పనిపై కరీంనగర్ వెళ్లగా మిగతా వారు విధుల్లో ఉన్నారు. తాళం చెవులను బీరువాలోని రహస్య లాకర్లో పెట్టి విధులు ముగించుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. వీటిని చూసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాళాలతో నేరుగా బీరువా తెరిచి అందులోని లాకర్ తాళాలు తీసుకుని లాకర్ తెరిచి ఆభరణాలు ఎత్తుకెళ్లారంటే బాగా తెలిసిన వారి పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. రూ.50 లక్షల వరకు చోరీ పీఏసీఎస్‌లో రూ.50 లక్షల విలువైన బంగారం(1345.42 గ్రాములు), రూ.2.85 లక్షలు నగదు అపహరణకు గురైందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ధర్మపురి సింగిల్‌విండో పరిధిలో 16 గ్రామాలకు చెందిన 27మంది బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టారు. సుమారు రూ.25 లక్షల రుణాలు పొందారు. తాకట్టు పెట్టిన ఆభరణాలపై యాభై శాతం వరకు రుణం అందిస్తారు. ఈ లెక్కన ఆభరణాల అసలు విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అంచనా. విండోపై ఎంతో నమ్మకంతో విలువైన ఆభరణాలు కుదవపెట్టిన వారికి ఈ సంఘటనతో ఆందోళన మొదలైంది. దొంగలను పట్టుకుంటాం పీఏసీఎస్‌లో చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకుంటామని సీఐ మహేందర్ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పరిశీలించారు. ఎస్సై జగన్మోహన్ ఆధ్వర్యంలో విచారణ వేగవంతం చేశారు. కరీంనగర్ నుంచి క్లూస్ టీంను రప్పించారు. జాగిలాలతోనూ పరిశీలించారు. సంఘటనా స్థలం నుంచి స్థానిక ఆర్అండ్ బీ వసతి గృహం వరకు వెళ్లిన జాగిలం.. దర్గా వద్దకు వెళ్లే రహదారి వద్ద ఆగిపోయింది. కాగా, వేలిముద్ర నిపుణులు.. అనుమానితులతో పాటు సిబ్బంది వేలిముద్రల్ని సేకరించారు.