
దక్షిణాఫ్రికా దేశమైన జాంబియా కలరా వ్యాధితో పోరాడుతోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కలరా కారణంగా జాంబియాలో 400 మందికి పైగా బాధితులు మృతిచెందారు. 10 వేలమందికి మందికి పైగా జనం ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని లుసాకాలోని అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియంను కలరా చికిత్స కేంద్రంగా మార్చారు.
జాంబియన్ ప్రభుత్వం సామూహిక టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. అలాగే దేశంలోని పలు కలరా పీడిత ప్రాంతాలలో రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం అందజేస్తోంది. ‘జాంబియా పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్’ తెలిపిన వివరాల ప్రకారం జాంబియాలో కలరా వ్యాప్తి గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఆ నెలలో కలరా కారణంగా 412 మంది మృతిచెందారు. అలాగే 10,413 కలరా కేసులు నమోదయ్యాయి.
దేశంలోని 10 పది రాష్ట్రాలలో తొమ్మిది రాష్ట్రాలు కలరా బారిన పడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు రెండు కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో రోజుకు 400కు పైగా కలరా కేసులు నమోదవుతున్నాయి.
కలరా అనేది నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది అపరిశుభ్రత కారణంగా వ్యాపిస్తుంది. కలుషిత నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల కలరా సోకుతుంది. గత ఏడాది ఆఫ్రికాలోని మరో దేశమైన జింబాబ్వేలో కూడా కలరా వ్యాపించింది. ఇక్కడ కూడా స్వచ్ఛమైన తాగునీటి కొరత ఉంది. కలరా వ్యాపిస్తున్న మణికాలాండ్, మాస్వింగో రాష్ట్రాల్లో అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్య 50కి పరిమితం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment