
కన్నడ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మాళవిక అవినాష్. శాండల్‌వుడ్‌లో సినిమాలతో పాటు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాలో సీనియర్ ఉమెన్ జర్నలిస్ట్ పాత్రలో నటించి పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు పొందింది.
ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బిజీబిజీగా గడిపేస్తుంది. అయితే తాజాగా మాళవిక అవినాష్ అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలికగా తీసుకోవద్దు. లేదంటూ నాలాగే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది.
పనాడోల్, నెప్రోసిమ్ వంటి సాంప్రదాయ ఔషధం తీసుకోవడంతో పాటు నిర్లక్ష్యం చేయకుండా త్వరగా డాక్టర్‌ని సంప్రదించండి అంటూ నెటిజన్లను కోరింది. ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్‌పై ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment