మధ్యప్రదేశ్‌లోని మహ్లార్‌గంజ్‌లో గల యుగపురుష్ ధామ్(ఆశ్రమం)లో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా వీరు మృతి చెందారని తెలుస్తోంది. ఆశ్రమానికి చెందిన మరో 10 మంది చిన్నారులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని సమాచారం. యుగపురుష్ ధామ్ ఆశ్రమంలో ఉంటున్న కరణ్, ఆకాశ్ మృతి చెందారు.
12 ఏళ్ల కరణ్ దేవాస్ జిల్లా సోన్‌కచ్చా నివాసి. 15 నెలల క్రితం అతనిని అధికారులు ఆశ్రమంలో చేర్పించారు. అలాగే ఏడేళ్ల ఆకాశ్‌ను మూడు నెలల క్రితం ఆశ్రమంలో చేర్పించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం కరణ్ అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఇదేవిధంగా మంగళవారం ఉదయం ఆకాశ్ మృతి చెందాడు.
ఆశ్రమ పర్యవేక్షకులు తెలిపిన వివరాల ప్రకారం ఆశ్రమంలోని కృష్ణ అనే బాలుడు తొలుత ఇన్ఫెక్షన్‌కు గురయ్యాడు. ఆ తరువాత ఆ బాలుడు అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. అయితే ఆ తరువాత ఆశ్రమంలోని మిగిలిన చిన్నారులు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు చిన్నారులు ఈ ఆశ్రమానికి వచ్చి చదువులు సాగిస్తుంటారు. 2006లో 78 దివ్యాంగ చిన్నారులతో ఈ ఆశ్రమం ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఆశ్రమంలో 2017 మంది చిన్నారులు ఉన్నారు.
కలెక్టర్ ఆశీష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఆశ్రమానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వీరిలో ఒక బాలుడు డయారేయాతో, మరో బాలుడు ఫిట్స్‌తో మృతి చెందాడు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment