జశ్వంత్ సింగ్కి అస్వస్థత | Jaswant Singh hospitalised again | Sakshi
Sakshi News home page

జశ్వంత్ సింగ్కి అస్వస్థత

Published Thu, Apr 2 2015 8:59 AM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

జశ్వంత్ సింగ్కి  అస్వస్థత

జశ్వంత్ సింగ్కి అస్వస్థత

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.  తీవ్ర జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు నిన్న రాత్రి  ఆసుపత్రిలో చేర్చినట్లు ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి ప్రతినిధి వెల్లడించారు. గతేడాది ఆగస్టు 8వ తేదీన ఇంట్లో జారిపడిన జశ్వంత్ సింగ్ తలకు గాయమవడంతో కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. నాలుగు నెలలు పాటు  న్యూరో సర్జన్‌ల బృందం పర్యవేక్షణలో ఉన్న ఆయన కోలుకోవటంతో డిశ్చార్జ్ చేశారు. అయితే బుధవారం ఆయన మళ్లీ అస్వస్థతకు గురి అవటంతో ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement