Jaswant Singh
-
Lok Sabha Election 2024: పొలిటికల్ టాప్ గన్స్.. రాజకీయాల్లో రాణించిన సైనికాధికారులు
వారు కదన రంగంలో శత్రువుల భరతం పట్టిన వీర సైనికులు. రెండో ఇన్సింగ్స్‌లో రాజకీయ రణరంగంలోనూ అంతే గొప్పగా రాణించారు. త్రివిధ దళాల్లో పలు హోదాల్లో దేశానికి సేవలందించిన సైనిక ఉన్నతాధికారులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పారు. జశ్వంత్‌సింగ్, రాజేశ్ పైలట్ మొదలుకుని తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) బదౌరియా దాకా ఈ జాబితా పెద్దదే...జశ్వంత్ సింగ్ బహుముఖ ప్రజ్ఞాశీలి సైనికాధికారిగా శత్రువులతో పోరాడిన జశ్వంత్ రాజకీయాల్లో చేరి రక్షణ మంత్రిగా త్రివిధ దళాలకు బాస్ అయ్యారు. 1965లో ఇండో–పాక్ యుద్ధంలో పాల్గొన్న జశ్వంత్ మేజర్ హోదాలో 1966లో పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భారతీయ జన సంఘ్, ఆర్ఎస్ఎస్ సభ్యుడు. బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1980లో బీజేపీ తరఫున తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 దాకా ఐదుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1989లో సొంత రాష్ట్రం రాజస్తాన్‌లోని జో«ద్‌పూర్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో 1998 నుంచి 2004 దాకా కీలకమైన ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి శాఖలు చూశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అత్యధిక కాలం పార్లమెంటు సభ్యునిగా కొనసాగిన కొద్దిమందిలో జశ్వంత్ ఒకరు. రాజేశ్ ‘పైలట్’ అసలు పేరు రాజేశ్వర్ ప్రసాద్ బిధూరి. పైలట్ వృత్తినే పేరులోనే చేర్చుకుని రాజకీయాల్లో వెలుగు వెలిగారు. భారత వైమానిక దళంలో బాంబర్ పైలట్‌గా 1971 భారత్–పాక్ యుద్ధంలో పోరాడారు. స్క్వాడ్రన్ లీడర్ హోదాలో రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజీవ్‌కు సన్నిహితుడు. 1980లో కాంగ్రెస్ తరఫున భరత్పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి 1999 దాకా ఎంపీగా గెలిచారు. కేంద్రంలో పలు కీలక శాఖలకు మంత్రిగా చేశారు. 2000 జూన్‌లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన తనయుడు సచిన్ పైలట్ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతున్నారు.అమరీందర్ కెప్టెన్ టు సీఎం కెపె్టన్ అమరీందర్ సింగ్ జవాన్ల కుటుంబం నుంచి వచ్చారు. 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుకు చుక్కలు చూపించారు. కెపె్టన్ హోదాలో రిటైరైన ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది రాజీవ్. అమరీందర్ 1980లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2017 దాకా మూడుసార్లు పంజాబ్ పీసీసీ చీఫ్‌గా, 2002 నుంచి 2007 దాకా సీఎంగా చేశారు. 2017లో మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి రెండోసారి సీఎం అయ్యారు. కాంగ్రెస్ వర్గ విభేదాలతో పార్టీకి, సీఎం పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టారు. తర్వాత దాన్ని బీజేపీలో విలీనం చేశారు. బి.సి.ఖండూరీ స్వర్ణ చతుర్భుజి సారథి మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించిన భువన్ చంద్ర ఖండూరీ 1954 నుంచి 1990 దాకా భారత సైన్యంలో సేవలందించారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఆర్మీ ఇంజనీర్ ఇన్ చీఫ్ విభాగంలో అదనపు డైరెక్టర్ జనరల్ దాకా కీలక హోదాల్లో పని చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో రెజిమెంట్ కమాండర్‌గా పోరాడారు. మేజర్ జనరల్ హోదాలో రిటైరయ్యారు. 1991లో తొలిసారి ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. ఐదుసార్లు ఎంపీ అయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో రహదారులు, హైవేల మంత్రిగా చేశారు. దేశ నలు దిక్కులను కలిపిన స్వర్ణ చతుర్భుజి హైవేల ప్రాజెక్టును దిగ్విజయంగా అమలు చేసిన ఘనత ఖండూరీదే. నిజాయితీకి మారుపేరైన ఆయన ఉత్తరాఖండ్ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజేతగా నిలిపి సీఎం అయ్యారు.అయూబ్ ఖాన్ వార్ హీరో సైనికుల కుటుంబం నుంచి వచ్చిన అయూబ్ ఖాన్ 1965 ఇండో పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. భారత సైన్యంలోని 18వ సాయుధ అశి్వక దళంలో రిసాల్దార్గా పని చేస్తున్న అయూబ్‌ను యుద్ధంలో జమ్మూకశీ్మర్ సియాల్కోట్ సెక్టార్లో నియమించారు. పాకిస్తాన్ సైన్యం యుద్ధ ట్యాంకులతో మన జవానులను చుట్టుముడుతున్న తరుణంలో నాలుగు పాక్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడంతో పాటు ఒక ట్యాంకును స్వా«దీనం చేసుకుని శత్రువుకు చుక్కలు చూపించారు. ఆ యుద్ధంలో పరాక్రమానికి వీర్ చక్ర పురస్కారం అందుకున్నారు. గౌరవ కెపె్టన్ హోదా కూడా దక్కింది. ‘నేను పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్‌ను కలుసుకోలేదు గానీ భారతీయ అయూబ్‌ను కలిసినందుకు గర్వంగా ఉంది’ అంటూ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఈ వీర సైనికున్ని హత్తుకోవడం విశేషం. 1983లో రిటైరయ్యాక అయూబ్ రాజకీయాల్లోనూ సత్తా చాటారు. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అయూబ్‌ను ఒప్పించి మరీ ఎన్నికల్లో నిలబెట్టారు. రాజస్తాన్‌లోని ఝుంఝును నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఆ రాష్ట్రం నుంచి తొలి ముస్లిం ఎంపీగా కూడా చరిత్ర సృష్టించారు. 1991లో రెండోసారి విజయం సాధించి, పీవీ కేబినెట్లో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.కాండెత్ గోవా విముక్తి వీరుడు దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా గోవాలో మాత్రం 1961 దాకా పోర్చుగీసు వలస పాలనే సాగింది. 1961లో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాను విలీనం చేసుకుంది. ఈ కీలక సైనిక చర్యకు సారథ్యం వహించిన ధీరుడు కేరళకు చెందిన మేజర్ జనరల్ కున్హిరామన్ పాలట్ కాండెత్. తర్వాత కొంతకాలం గోవా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో పశి్చమ కమాండ్ సైనిక బలగాన్ని నడిపించారు. పరమ విశిష్ట సేవా మెడల్‌తో పాటు పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 1972లో లెఫ్టినెంట్ జనరల్‌గా రిటైరయ్యారు. 1990ల్లో బీజేపీలో చేరారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా చేశారు. జనరల్ వీకే సింగ్... రాజకీయాల్లో సక్సెస్ భారత సైన్యంలో కమాండో స్థాయి నుంచి ఆర్మీ ఛీఫ్ అయిన తొలి వ్యక్తి జనరల్ విజయ్ కుమార్ సింగ్. 1971 ఇండో–పాక్ యుద్ధంతో సహా అనేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి 2012 దాకా సైనిక దళాధిపతిగా చేశారు. రిటైరయ్యాక 2014లో బీజేపీలో చేరారు. స్వరాష్ట్రం యూపీలోని ఘాజియాబాద్ నుంచి ఎంపీ అయ్యారు. 2019లో రెండోసారి విజయం సాధించారు. మోదీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా చేశారు.విష్ణు భగవత్... గురి తప్పిన టార్పెడో భారత నావికాదళంలో అత్యంత ప్రతిభాపాటవాలతో అత్యున్నత పదవికి చేరుకున్న అడ్మిరల్ విష్ణు భగవత్... వివాదాస్పద వ్యవహార శైలితో అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో, పోర్చుగీస్ చెర నుంచి గోవాకు విముక్తి కలి్పంచిన ఆపరేషన్ విజయ్‌లో కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ ప్రభుత్వంతో విభేదాల కారణంగా 1998లో ఉద్వాసనకు గురయ్యారు. నేవీ చీఫ్‌గా ఉంటూ వేటుకు గురైన తొలి వ్యక్తి ఆయనే. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అడ్మిరల్ హోదానూ కోల్పోయారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్ రాజకీయాల్లో కొంతకాలం చురుగ్గా వ్యవహరించారు. ‘ఉత్తమ’ ఫైటర్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైమానిక దళంలో మిగ్ 21, మిగ్ 23 వంటి ఫైటర్ జెట్లు నడిపి శత్రువులపై పోరాడారు. రాజకీయాల్లోనూ రియల్ ఫైటర్‌గా కొనసాగుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ 1982 నుంచి 1991 దాకా ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ పైలట్‌గా చేశారు. 1994లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ఎన్నికల్లో కోదాడ నుంచి ఓడినా 1999లో అక్కడి నుంచే విజయఢంకా మోగించారు. మూడు దశాబ్డాల రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి నల్లగొండ ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా చేశారు. తాజాగా హుజారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఉత్తమ్ భార్య పద్మావతి కూడా రెండుసార్లు కోదాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో వచి్చన టెర్రర్ అనే తెలుగు సినిమాలో ఆయన సీఎం పాత్ర పోషించడం విశేషం!జేజే సింగ్... తొలి సిక్కు ఆర్మీ చీఫ్ జోగిందర్ జస్వంత్ సింగ్. తొలి సిక్కు ఆర్మీ జనరల్. 2005 నుంచి 2007 దాకా దేశ 21వ ఆర్మీ చీఫ్‌గా సేవలందించారు. రిటైరయ్యాక 2008లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా అయ్యారు. 2017లో అకాలీదళ్‌లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కెపె్టన్ అమరీందర్ సింగ్ చేతిలో ఓడారు. 2019లో అకాలీదళ్ (తక్సలీ)లో నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2022లో బీజేపీలో చేరారు. వీకే సింగ్ తర్వాత కాషాయం తీర్థం పుచ్చుకున్న రెండో జనరల్‌గా నిలిచారు.బదౌరియా... పొలిటికల్ టేకాఫ్ రాజకీయాల్లోకి వచి్చన తొలి వైమానిక దళపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బదౌరియా చరిత్ర సృష్టించారు. ఎయిర్‌ఫోర్స్ ఫైటర్‌గా విధుల్లో చేరిన ఆయన 41 ఏళ్ల కెరీర్లో 26 రకాల ఫైటర్ జెట్స్, రవాణా విమానాలు నడిపిన విశేష ప్రతిభావంతుడు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ చీఫ్ టెస్ట్ పైలట్‌గా, ప్రాజెక్ట్ టెస్టింగ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. 2019 నుంచి 2021 దాకా ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా చేసి రిటైరయ్యారు. ఇటీవలే బీజేపీలో చేరారు. రాథోడ్ గురి పెడితే... టార్గెట్ తలొంచాల్సిందే! యుద్ధభూమి అయినా, క్రీడా మైదానమైనా ఆయన గురి పెడితే టార్గెట్ తలొంచాల్సిందే! ఆయనే కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. విశ్వ క్రీడా ప్రపంచంలో భారత్‌కు ఘన కీర్తి సాధించి పెట్టిన అభినవ అర్జునుడు. చదువులోనూ, ఆటలోనూ ‘గోల్డెన్’ బాయ్‌గా నిలిచిన రాథోడ్ కార్గిల్ యుద్ధంలో పోరాడారు. 2002 కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ కొట్టారు. ఆ ఈవెంట్లో ఆయన నెలకొలి్పన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 2004 గ్రీస్ ఒలింపిక్స్ డబుల్ ట్రాప్ ఈవెంట్లో వెండి పతకం కొట్టడంతో రాథోడ్ పేరు మారుమోగింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు అదే తొలి వ్యక్తిగత వెండి పతకం! కెరీర్లో ఏకంగా 25 అంతర్జాతీయ పతకాలను సొంతం చేసుకున్నారు. 2013లో ఆర్మీ నుంచి రిటైరై బీజేపీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. మోదీ ప్రభుత్వంలో సమాచార, క్రీడా మంత్రిగా చేశారు. 2019లోనూ ఎంపీగా గెలిచారు. 2023లో రాజస్తాన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జశ్వంత్ సింగ్ మృతికి సీఎం వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీమంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తొలుత సైనికుడిగా దేశానికి వివిధ హోదాల్లో సేవలందించిన ఆయన తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా జశ్వంత్‌సింగ్ ఎన్నికయ్యారని తెలిపారు.దేశ రాజకీయాలలో జశ్వంత్ సింగ్ కీలక పాత్ర పోషించారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ నేత సీ. రామచంద్రయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జశ్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జశ్వంత్ సింగ్ గొప్ప దేశభక్తుడని, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. -
బీజేపీకి బిగ్ షాక్..!
జైపూర్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాజస్తాన్‌లో అధికార బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి జశ్వంత్‌సింగ్ కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే మన్వేంద్ర సింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బర్మేర్ జిల్లాల్లో శనివారం తన అభిమానులతో ‘స్వాభిమాన్ ర్యాలీ’ని నిర్వహించిన మన్వేంద్ర.. బీజేపీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తన తండ్రికి బీజేపీ ఎంపీ సీటు ఇవ్వకుండా తీవ్రంగా అవమానించిందని, ఇన్ని రోజులు ఒపిక పట్టామని ఇక సహించేదిలేదని ఆయన పేర్కొన్నారు. గతకొంత కాలంగా బీజేపీ నాయకత్వంతో అంటీముట్టనట్లు ఉంటున్న మన్వేంద్ర తన రాజీనామాతో పార్టీకి షాకిచ్చాడు. సీఎం వసుంధర రాజే ఇటీవల బర్మేర్ పర్యటనకు వచ్చిన సమయంలో కూడా ఆయన పార్టీకి దూరంగానే ఉన్నారు. వసుంధర రాజే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన గౌరవ్‌యాత్రపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆమె పర్యటిస్తూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కాగా బీజేపీకి రాజీనామా చేసిన మన్వేంద్ర తరువాత ఏ పార్టీలో చేరబోయేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. తన ప్రాంత ప్రజల అభివృద్ధికోసం వారితో చర్చించిన అనంతరం తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు. కాగా మాజీ కేంద్రమంత్రి అయిన జశ్వంత్ సింగ్‌కు 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. కాగా మన్వేంద్ర రాజీనామాతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమళదళానికి ఊహించని షాక్ తగిలింది. -
జశ్వంత్ సింగ్‌కి అస్వస్థత
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు నిన్న రాత్రి ఆసుపత్రిలో చేర్చినట్లు ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి ప్రతినిధి వెల్లడించారు. గతేడాది ఆగస్టు 8వ తేదీన ఇంట్లో జారిపడిన జశ్వంత్ సింగ్ తలకు గాయమవడంతో కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. నాలుగు నెలలు పాటు న్యూరో సర్జన్ల బృందం పర్యవేక్షణలో ఉన్న ఆయన కోలుకోవటంతో డిశ్చార్జ్ చేశారు. అయితే బుధవారం ఆయన మళ్లీ అస్వస్థతకు గురి అవటంతో ఆస్పత్రికి తరలించారు. -
నాలుగు నెలలుగా కోమాలోనే కేంద్ర మాజీమంత్రి
తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్.. నాలుగు నెలలుగా కోమాలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని వైద్యులు చెబుతున్నారు. జస్వంత్ ఆరోగ్యం అలాగే ఉందని, ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనను ప్రతిరోజూ వైద్యుల బృందం ప్రతిరోజూ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. న్యూరోసర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణులు ఆయనను చూస్తున్నారని, జస్వంత్ సింగ్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఆయన ప్రస్తుతం టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ మీద ఆధారపడ్డారు. 76 ఏళ్ల జస్వంత్ సింగ్.. ఆగస్టు 8వ తేదీన తమ ఇంట్లో స్పృహలేని పరిస్థితిలో నేలమీద పడి ఉండగా కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. -
జస్వంత్ కోసం మృత్యుంజయ యాగం
జైసల్మేర్: కోమాలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి బీజేపీ నాయకుడు జస్వంత్ సింగ్ కోలువాలని ప్రార్థిస్తూ రాజస్థాన్ లోని జైసల్మేలో మహా మృత్యుంజయ యాగం నిర్వహించారు. స్థానిక ముక్తేశ్వర్ మహదేవ్ ఆలయంలో ఈ యాగం చేశారు. జస్వంత్ సింగ్ దీర్ఘష్షు కోసం ఆయన మద్దతుదారులు, సన్నిహితులు ఈ యాగం చేశారని జైసల్మేర్ అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు పూరన్ సింగ్ బట్టి తెలిపారు. బైసాకి గ్రామంలో జస్వంత్ అభిమానులు శనివారం ఇలాంటి యాగం చేశారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న జస్వంత్ కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని తన ఇంట్లో కాలుజారిపడిన జస్వంత్ సింగ్ తలకు తీవ్రమైన గాయంకావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. -
కోమాలో జశ్వంత్
కోమాలో జశ్వంత్ కాలుజారి పడటంతో తలకు తీవ్రగాయం న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి బీజేపీ నాయకుడు జస్వంత్ సింగ్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని తన ఇంట్లో కాలుజారిపడిన జస్వంత్ సింగ్ తలకు తీవ్రమైన గాయంకావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, కృత్రిమ శ్వాసను అందిస్తున్నారని రక్ష ణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సమాచారం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ జస్వంత్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు -
కోమాలోకి వెళ్లిపోయిన జశ్వంత్ సింగ్
-
కోమాలోకి వెళ్లిపోయిన జశ్వంత్ సింగ్
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం గాయపడిన జశ్వంత్ సింగ్‌ను చికిత్స నిమిత్తం ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈరోజు ఉదయం ఆయన తన నివాసంలో కళ్లు తిరిగి పడిపోయారు. జశ్వంత్ తలకు తీవ్ర గాయం అయింది. ఆయన కోమాలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. బీజేపీ అగ్రనేత అద్వానీ ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రికి వెళ్లి జస్వంత్‌సింగ్‌ను పరామర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జశ్వంత్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. -
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్‌కు అస్వస్థత
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ని చికిత్స నిమిత్తం ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈరోజు ఉదయం ఆయన తన నివాసంలో కళ్లు తిరిగి పడిపోయినట్లు సమాచారం. జశ్వంత్ తలకు గాయం అయినట్లు తెలుస్తోంది. కాగా ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు... బీజేపీ అగ్రనేత అద్వానీ ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రికి వెళ్లి జస్వంత్‌సింగ్‌ను పరామర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జశ్వంత్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
అద్వానీతో జస్వంత్ భేటీ
న్యూఢిల్లీ: బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత జస్వంత్ సింగ్.. ఆ పార్టీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీతో శుక్రవారం సమావేశమయ్యారు. జస్వంత్ మళ్లీ బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. కాగా జస్వంత్‌ను పార్టీలోకి చేర్చుకునే అంశంపై భావి ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించినందుకు అద్వానీని జస్వంత్ అభినందించినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజస్థాన్‌లో బార్మర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసినందుకు జస్వంత్‌ను బహిష్కరించిన సంగతి తెలిసిందే. జస్వంత్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. -
36 అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ గురువారం ముగిసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసశ్రీనరేష్, పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు జస్వంత్‌సింగ్, జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పార్లమెంటు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి మొత్తం 27 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదు. నామినేషన్ పత్రాలను పరిశీలించిన కలెక్టర్ అన్నీ సక్రమంగా ఉన్నాయని, ఆమోదించినట్లు ప్రకటించారు. కాగా, పది అసెంబ్లీ స్థానాలకు మొత్తం 232 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 36 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 196 మంది నామినేషన్లు ఆమోదించారు. ఉపసంహరణల అనంతరం చివరకు ఎంతమంది బరిలో ఉంటారో తేలనుంది. ఓటరు జాబితాలో క్రమ సంఖ్య తప్పుగా ఉండడం, ప్రతిపాదించే వారు లేకపోవడం, పార్టీల తరఫున బీ-ఫాంలు లేక, అసలు అభ్యర్థికి డమ్మీగా వేయడం, అఫిడెవిట్లు లేక, వయస్సు నిండకపోవడం, బలపరిచే వారు లేక...ఇలా పలుకారణాలతో పరిశీలన అనంతరం అధికారులు నా మినేషన్లు తిరస్కరించారు. ఎక్కువగా కొత్తగూడెంలో 8మంది, పాలేరు నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యా యి. నియోజకవర్గాల వారీగా తి రస్కరణకు గురైన అభ్యర్థుల వివరాలు.... పినపాక : బాణోతు శోభ (టీఆర్ఎల్డీ), తెల్లం నర్సింహారావు (స్వతంత్ర), బండారు రాజీవ్‌గాంధీ (స్వతంత్ర). ఇల్లెందు : చుంచు నాగేశ్వరరావు (టీఆర్ఎస్), బాణోతు హరిసింగ్ (టీడీపీ), ఊకే ప్రభాకర్ (టీడీపీ), లావుడ్యా నాగేశ్వర్రావు (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), శ్రీకాంత్ కొమరం (స్వతంత్ర), నునావత్ హనుమంతు (స్వతంత్ర). పాలేరు : రాంరెడ్డి గోపాల్‌రెడ్డి (కాంగ్రెస్), బత్తుల లెనిన్ (సీపీఎం), బాణోతు వెంకన్ననాయక్ (స్వతంత్ర), నునావత్ బాణ్యానాయక్ (స్వతంత్ర), గట్టుమల్ల శంకర్ (స్వతంత్ర), బెరైడ్డిభువన(స్వతంత్ర), తేజావత్ బాబు( స్వతంత్ర), వైరా:భూక్యా వీరప్రసాద్ (స్వతంత్ర), ధరావత్ కాన్షిరాం (స్వతంత్ర),మూడు రవి(సీపీఐ),ఎ.నాగునాయక్( స్వతంత్ర), బాణోత్ దేవులా (టీడీపీ). ఖమ్మం: షేక్ మదార్సాహేబ్ (టీడీపీ), షేక్ పాషా (జై సమైకాంధ్ర),బండారు అంజన్‌రాజు( స్వతంత్ర) ,నల్లమోతు శ్రావణ్‌కుమార్( స్వతంత్ర). కొత్తగూడెం: మహ్మద్ అబ్దుల్ మజీద్(బీజేపీ), మళోత్ రాందాస్(టీడీపీ), కోనేరు పూర్ణచందర్రావు(టీడీపీ),తాండ్ర రవీందర్(బీఎస్పీ) ,షేక్ సాబీర్‌పాషా( సీపీఐ), గుగులోత్ రాజేష్ ( స్వతంత్ర ), వనమా వెంకటేశ్వరరావు(స్వతంత్ర) ,ఊదరా పూర్ణచందర్రావు(స్వతంత్ర). మధిర : దారేల్లి అశోక్ (వైఎస్ఆర్సీపీ) భద్రాచలం: సరియం కోటేశ్వరరావు(సీపీఎం). అశ్వారరావుపేట: వగ్గెల హేమంత్‌కుమార్ (కాంగ్రెస్) సత్తుపల్లి: తుమ్మలరాజేష్కుమార్ (జై సమైక్యాంధ్ర) -
జశ్వంత్‌పై బీజేపీ వేటు
ఆరేళ్లపాటు బహిష్కారం సొంత పార్టీ అభ్యర్థిపై పోటీకి దిగడంతో చర్య మరో రెబల్ నేత మహారియాపైనా వేటు న్యూఢిల్లీ: తిరుగుబాటు బావుటా ఎగరేసిన పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్(76)పై బీజేపీ శనివారం రాత్రి వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. రాజస్థాన్‌లోని బార్మర్ నుంచి లోక్‌సభకు స్వతంత్ర అభ్యర్థిగా సొంత పార్టీ అభ్యర్థిపై పోటీ చేస్తున్న జశ్వంత్ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శనివారం నామినేషన్ ఉపసంహరణకు తిరస్కరించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. చీఫ్ రాజ్‌నాథ్ సింగ్.. జశ్వంత్‌ను ఆరేళ్లపాటు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారని బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. బార్మర్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో జశ్వంత్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం తెలిసిందే. కాగా, పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రాజస్థాన్ నుంచే సికార్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా స్వపక్ష అభ్యర్థిపై పోటీకి దిగిన మరో రెబల్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహారియాను కూడా బీజేపీ శనివారం బహిష్కరించింది. సింగ్, మహారియాల బహిష్కరణ గురించి బీజేపీ ప్రధాన కార్యదర్శి జేపీ నందా.. పార్టీ రాజస్థాన్ కమిటీ చీఫ్ అశోక్ పర్నామీకి తెలియజేశారు. జశ్వంత్ విషయంలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఆయన పోటీ నుంచి తప్పుకోకపోవడంతో గత్యంతరం లేక వేటు వేశామని పార్టీ సీనియర్ నేత ఒకరన్నారు. రెబల్ అభ్యర్థులందర్నీ ఆరేళ్లపాటు బహిష్కరించనున్నట్లు అంతకుముందు పర్నానీ జైపూర్‌లో చెప్పారు. బీజేపీ నిబంధనావళి ప్రకారం.. పార్టీ అధికారిక అభ్యర్థిపై పోటీచేసే పార్టీ సభ్యుడిని బహిష్కరిస్తారు కనుక జశ్వంత్, మహారియాలపై వేటు వేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. బార్మర్ నుంచి మాజీ కాంగ్రెస్ నేత సోనారాం చౌధురికి బీజేపీ టికెట్ ఇవ్వడం తెలిసిందే. తప్పుకునే ప్రసక్తే లేదు: జశ్వంత్ అంతకుముందు, ఎన్నికల బరి నుంచి తాను తప్పుకునేది లేదని జశ్వంత్ సింగ్ స్పష్టం చేశారు. కాగా జశ్వంత్‌ను పోటీ నుంచి విరమింపజేసేందుకు బీజేపీ నేతలు శనివారం శాయశక్తులా ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. పార్టీ నేతలు పలువురు ఆయన్ను సంప్రదించారని పోటీ నుంచి తప్పుకునేలా గట్టిగా కృషి చేశారని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జశ్వంత్‌సింగ్ శనివారం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఎన్నికల బరి నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. -
వైదొలిగే ప్రసక్తే లేదు: బీజేపీ రెబెల్ జస్వంత్ సింగ్
జైసల్మెర్: నామినేషన్ ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి, సీనియర్ నేత జస్వంత్ సింగ్ స్పష్టం చేశారు. రాజస్థాన్‌లోని బర్మెర్ లోక్‌సభ నియోజవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్టు చెప్పారు. నామినేషన్ వెనక్కుతీసుకునేలా జస్వంత్ సింగ్‌ను ఒప్పించేందుకు బీజేపీ సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తననెవరూ సంప్రదించలేదని జస్వంత్ చెప్పారు. బర్మెర్ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని జస్వంత్ కోరినా బీజేపీ అగ్రనేతలు టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. బీజేపీ మరో స్థానం కేటాయించడంతో, జస్వంత్ నిరాకరించి బర్మెర్ నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగారు. -
సీనియర్లను గౌరవించాలి
షోలాపూర్ : హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తన ప్రత్యర్థి పార్టీ నాయకులైన ఎల్కే అద్వానీ, జస్వంత్సింగ్లపై ప్రశంసలు కురిపించారు. సీనియర్లను కించపరచకూడదన్నారు. వారు సీనియర్లని, అందువల్ల వారిని గౌరవించాలని హితవు పలికారు. పార్టీలో వారిని అవమానపరచకూడదని అన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జస్వంత్ సింగ్ చాలా అద్భుతంగా పని చేశారని కొనియాడారు. దేశం మొత్తం ఆయనను గౌరవిస్తుందని చెప్పారు. బీజేపీ అధినాయకత్వం తనకు టికెట్ కేటాయించకపోవడంతో రాజస్థాన్‌లోని బార్మర్ లోక్‌సభ స్థానం నుంచి జస్వంత్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెల్సిందే. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో దేశం సురక్షితంగా మారిందని చెప్పుకున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం సమస్యగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నక్సల్స్‌ను అదుపు చేశామని అన్నారు. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో రెండు దట్టమైన అడవులున్నాయని, అక్కడే రెండు విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఓ ఆంగ్ల టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షిండే మాట్లాడుతూ, నక్సల్స్‌ను అదుపు చేసేందుకు రెండంచల వ్యూహాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన కేసులో అఫ్జల్ గురూ, ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌లను ఉరి తీసే విషయంలో తాను ఎటువంటి ఒత్తిడినీ ఎదుర్కోలేదని చెప్పారు. మరోసారి తాను హోం మంత్రిని అవుతానో లేదో తెలియదన్నారు. -
ఇద్దరు సైనికుల యుద్ధభూమి బార్మేర్
బార్మేర్ నియోజకవర్గం.... భారత-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇసుక మేటల ఏడారి జిల్లా ఇది. మామూలుగా వార్తలకు ఆమడల దూరంలో ఉండే బార్మేర్ ఇప్పుడు హఠాత్తుగా పతాకశీర్షికలకెక్కింది. బిజెపి సీనియర్ నేత, మాజీ విదేశవ్యవహారాల మంత్రి జస్వంత్ సింగ్ కు బిజెపి టికెట్ నిరాకరించడం, ఆ 76 ఏళ్ల వృద్ధ నేత కన్నీరుమున్నీరవుతూ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడంతో ఇప్పుడు దేశమంతా బార్మేర్ గురించి చర్చిస్తోంది. రాజస్థాన్ రాజకీయాల ఉక్కుమహిళ వసుంధరారాజే తోటి క్షత్రియుడన్నది సైతం పట్టించుకోకుండా గెలుపుగుర్రం కల్నల్ సోనారామ్ చౌధురికి టికెట్ ఇప్పించింది. దీంతో మాజీ సైనికులు ఇద్దరూ ఎదురెదురుగా నిలిచి ఎన్నికల యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. గెలిచే అవకాశాలు ఎక్కువగా సోనారామ్ కే ఉన్నాయన్నది బిజెపి ఎన్నికల సమితి అభిప్రాయం. బార్మేర్ లో జాట్ వోటర్లు చాలా ఎక్కువ. జాట్ ఉద్యమానికి సోనారామ్ నాయకుడు. కాబట్టి ఆయన గెలుపు సుసాధ్యమనేది బిజెపి అంచనా. మంగళవారం ఆయన నామినేషన్ కి ముఖ్యమంత్రి వసుంధరా రాజే తాను హాజరుకావడమే కాదు, సకల సామంత దండనాథులతో కలిసి మరీ వచ్చారు. జాట్ ఓట్లే కీలకం రాజస్థాన్ లోని 25 ఎంపీ సీట్లలో బార్మేర్ ఒకటి. అంతే కాదు. రాష్ట్రంలోని అతిపెద్ద ఎంపీ నియోజకవర్గం ఇది. ఇందులో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గంలో రాజపుత్రులు, జాట్లు, షెడ్యూల్డు కులాలు, మైనారిటీలు ఎక్కువగా ఉంటారు. షెడ్యూల్డు కులాలు, మైనారిటీలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారు. రాజపుత్రులు బిజెపితో ఉంటారు. కాబట్టి జాట్ ఓట్లే కీలకం. కాంగ్రెస్ కంచుకోట మొదటినుంచీ బార్మేర్ కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటి వరకూ జరిగిన 15 లోకసభ ఎన్నికల్లో 9 సార్లు కాంగ్రెస్ గెలిచింది. బిజెపి కేవలం 2004 లో మాత్రమే గెలిచింది. రెండు సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. 2009 లో కాంగ్రెస్ జాట్ వర్గీయుడైన హరీశ్ చౌదరికి టికెట్ ఇచ్చింది. బిజెపి వసుంధర సన్నిహితుడు, రాచకుటుంబానికి చెందిన మానవేంద్ర సింగ్ కి టికెట్ ఇచ్చింది. చివరికి హరీశ్ దే పై చేయి అయింది. అందుకే ఈ సారి బిజెపి క్షత్రియుడికి కాక జాట్ కి టికెట్ ఇచ్చింది. బిజెపి వ్యూహం ఫలిస్తుందా? పైగా జస్వంత్ సింగ్ కి ఈ నియోజకవర్గంలో పెద్దగా పట్టు లేదు. ఆయన గత లోకసభ ఎన్నికల్లో డార్జీలింగ్ నుంచి, గూర్ఖా జనముక్తిమోర్చా సాయంతో లోకసభకి ఎన్నికయ్యారు. గత పదేళ్లుగా ఆయన బార్మేర్ ను పట్టించుకోలేదు. 10 జనపథ్ సన్నిహితుడు, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అయిన హరీశ్ చౌధరిని ఆయన తట్టుకోలేరన్న కారణంతోనే ఆయనను బిజెపి పక్కన బెట్టింది. పైగా బార్మేర్ లోకసభలోని ఎనిమిది అసెంబ్లీ సీట్లలో ఏడు బిజెపి చేతిలో ఉన్నాయి. స్థానిక కాంగ్రెస్ దిగ్గజాలు చాలా మంది రాజకీయాలనుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. కాబట్టి కులంబలం తోడైతే బార్మేర్ ని గెలుచుకోవడం సులభమని బిజెపి భావిస్తోంది. పాపం జస్వంత్ సింగ్! మొత్తం మీద జస్వంత్ సింగ్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఇండిపెండెంట్ గా మొదలై ఇండిపెండెంట్ గానే అంతమౌతుందా? ఆయన 47 ఏళ్ల క్రితం తొలిసారి రంగంలోకి దిగినప్పుడు ఇండిపెండెంట్ గా పోటీచేసి 17 వేల ఓట్లు సంపాదించుకున్నారు. ఓడిపోయారు. ఒక సారి జోధ్ పూర్, ఒక సారి చిత్తోడ్ గఢ్ ఇలా నియోజకవర్గాలు మారుస్తూ వచ్చారాయన. ఇప్పుడు ఈ సారి ఇండిపెండెంట్ గా మళ్లీ పోటీచేస్తున్నారు. ఒక వేళ గెలిచినా ఇదే ఆయనకు చివరి ఎన్నిక అవుతుంది. ఎందుకంటే 2019 నాటికి ఆయనకు 80 ఏళ్లు దాటిపోతాయి. -
జస్వంత్ ఆస్తుల్లో 3 అరబ్ గుర్రాలు, 51 ఆవులు!
బీజేపీ తిరుగుబాటు నేత జస్వంత్ సింగ్ ఆస్తుల జాబితాను ప్రకటించారు. బర్మర్ లోకసభ స్థానంలో సోమవారం నామినేషన్ సమర్పించిన జస్వంత్ మంగళవారం ఆస్తుల జాబితాను వెల్లడించారు. ఆయన ఆస్తుల విలువ 1,49,83,510. జస్వంత్ ఆస్టుల్లో మూడు అరబ్ గుర్రాలు, 51 థార్పర్కర్ ఆవులున్నాయి. 51 ఆవులు జైసల్మర్, బర్మర్ లో ఉన్నట్టు తెలిపారు. తన వద్ద ఉన్న మూడు ఆవుల్లో సౌదీ అరేబియా యువరాజు రెండు ఆవులను బహుకరించారని.. ఆతర్వాత మరో ఆవు జన్మించిందని తెలిపారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత జస్వంత్ మాట్లాడుతూ.. బీజేపీని వీడేది లేదు అని స్పష్టం చేశారు. ఒకే వ్యక్తిపై పార్టీ ఆధారపడటం చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకే వ్యక్తిపై ఆధారపడటం మంచిది కాదని జస్వంత్ సూచించారు. -
'జస్వంత్ ను కాదని.. గుండాలకు బీజేపీ రెడ్ కార్పెట్'
జమ్మూ: బీజేపీ, జస్వంత్ సింగ్ వివాదంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తలదూర్చారు. సీనియర్ నేత జస్వంత్ సింగ్ కు టికెట్ నిరాకరించడంపై ఓమర్ అబ్దుల్లా తీవ్ర ధ్వజమెత్తారు. జస్వంత్ తోపాటు మరికొంత మంది జంటిల్మన్ నేతలకు టికెట్లు నిరాకరించి పార్టీలో గుండాలకు పెద్ద పీట వేస్తున్నారని ఓమర్ ఆరోపించారు. రాజీకీయాల్లో సంభవిస్తున్న ఇలాంటి సంఘటనల పట్ల భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని.. లేకపోతే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. జంటిల్మన్ లాంటి జస్వంత్ కు టికెట్ నిరాకరించి.. గుండాలాంటి ప్రమోద్ ముతాలిక్ కు రెడ్ కార్పెట్ వేశారు. బీజేపీ నిర్ణయాలు ప్రమాదకరంగా ఉన్నాయి అని ఓమర్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. పార్టీలోకి చేరిన వెంటనే శ్రీరామ్ సేన చీఫ్ ముతాలిక్ సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. జస్వంత్ సింగ్ కు బీజేపీ టికెట్ నిరాకరించడంపై సొంత పార్టీ నుంచే అనేక విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. బర్మార్ లోకసభ నియోజకవర్గం నుంచి జస్వంత్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
కమలంతో జశ్వంత్ సింగ్ అమీతుమీ
-
కమలంతో జశ్వంత్ సింగ్ అమీతుమీ
జోధ్‌పూర్: బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్ సింగ్ అధిష్టానంతో అమీతుమీకి సిద్ధమయ్యారు. తన సొంత నియోజకవర్గం బార్మర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంపై బహిరంగంగా తన అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బార్మర్ బరిలో నిలిచేందుకే మొగ్గుచూపారు. తానిచ్చిన 48 గంటల గడువుకు బీజేపీ అధిష్టానం స్పందించకపోవడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తనకు తానుగా బీజేపీని వదిలిపెట్టడం లేదని జశ్వంత్ సింగ్ తెలిపారు. తన మద్దతుదారులు చెప్పినట్టే నడుచుకుంటున్నానని వెల్లడించారు. కాగా, జశ్వంత్ సింగ్ కుమారుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే మన్వీంద్ర సింగ్.. తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచే అవకాశముందని సంకేతాలిచ్చారు. జశ్వంత్‌కు టికెట్ ఇవ్వకపోవడానికి నిరసనగా పలువురు బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు ఆదివారం పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చారు. సమావేశం నిర్వహించి.. జశ్వంత్‌కు బార్మర్ టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ఇండిపెండెంట్‌గా జశ్వంత్ పోటీ
నేడు బార్మర్ నుంచి నామినేషన్ పార్టీ అభ్యర్థిగానా కాదా అన్నది వారే తేల్చాలి పార్టీలో విభేదాలున్నాయి... అవి తిరుగుబాట్లుగా మారొచ్చు జోధ్‌పూర్: బీజేపీ తనకు టికెట్ ఇవ్వకపోవడంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తంచేసిన ఆ పార్టీ ప్రముఖుడు జశ్వంత్ సింగ్(76) తన సొంత నియోజకవర్గం బార్మర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగనున్నట్లు ఆదివారమిక్కడ ప్రకటించారు. ‘‘అవును, నేను రేపు బార్మర్ నుంచి నామినేషన్ వేస్తున్నాను. స్వతంత్ర అభ్యర్థా కాదా అన్నది పార్టీ వైఖరిపై ఆధారపడి ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం డార్జిలింగ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జశ్వంత్.. బార్మర్ సీటు టికెట్‌ను తనకు కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన సోనారామ్ చౌదరికి ఇవ్వడంపై శనివారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్టీకి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా.. ‘‘నేను పార్టీకి 48 గంటల గడువిచ్చాను. అయితే ఇంతవరకు నన్నెవరూ పార్టీ తరఫున సంప్రదించలేదు. నా సహచరులు, సన్నిహితులతో మాట్లాడి పార్టీలో ఉండాలా లేదా అన్నది నిర్ణయించుకుంటాను’’ అని అన్నారు. తన సొంత నియోజకవర్గంపై, తన సొంత ప్రజలపై తాను సెంటిమెంటల్‌గా లేకపోతే, ఇక ఏ విషయంలో ఉండాలని ఆయన ప్రశ్నించారు. మీ సేవలను తదనుగుణంగా వినియోగించుకుంటామని రాజ్‌నాథ్ సింగ్ అంటున్నారని అనగా.. తానేమీ ఫర్నీచర్‌ను కాదన్నారు. పార్టీ గెలిచాక ప్రభుత్వంలో ఏదైనా పదవి ఇస్తారన్న వార్తలపై ప్రశ్నించగా.. అలాంటిదేమీ తనకు అవసరం లేదని, వాళ్ల దగ్గరే ఉంచుకోమని అన్నారు. రాజస్థాన్‌లో జశ్వంత్ మద్దతుదారులు నరేంద్ర మోడీ పోస్టర్లను చించేయడంపై ప్రశ్నించగా.. దీన్ని బట్టి ఏం జరుగుతోందన్నది పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సర్దుబాటు రాజకీయాలు తనకు పడవన్నారు. అంతర్గత కుమ్ములాటల వల్ల బీజేపీ నష్టపోతుందని చెప్పారు. పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయని, ఇవి తిరుగుబాట్లుగా మారే అవకాశముందని, పార్టీ ముందే మేలుకుంటే మంచిదని అన్నారు. తండ్రి వెంటే తనయుడు! జశ్వంత్ సింగ్ కుమారుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే మన్వీంద్ర సింగ్.. తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచే అవకాశముందని సంకేతాలిచ్చారు. రాజస్థాన్ సీఎం వసుంధర రాజే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తలపెట్టిన సమావేశానికి ఆయన ఉద్దేశపూర్వకంగా గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం రీత్యా ఆయన నెలపాటు సెలవు తీసుకున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అశోక్ పర్ణమి తెలిపారు. జశ్వంత్‌కు మద్దతుగా బీజేపీ కార్యకర్తల ఆందోళన జశ్వంత్‌కు టికెట్ ఇవ్వకపోవడానికి నిరసనగా పలువురు బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు ఆదివారం పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చారు. సమావేశం నిర్వహించి.. జశ్వంత్‌కు బార్మర్ టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాదు’ అన్న దాన్నీ నవ్వుతూ స్వీకరించాలి: జైట్లీ జశ్వంత్ ఇప్పటికే పార్టీలో పలు పదవులు అనుభవించారని, పార్టీ పట్ల ఆయన విధేయతకు ప్రస్తుత పరిస్థితులు పరీక్షలాంటివని బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ అన్నారు. పార్టీ ‘కాదు’ అని చెప్పినప్పుడు దాన్ని కూడా ఆయన నవ్వుతూ స్వీకరించాలన్నారు. స్వతంత్ర బరిలో మరో నేత!: రాజస్థాన్‌లోని సికార్ లోక్‌సభ టికెట్‌ను నిరాకరించినందుకు మరో సీనియర్ బీజేపీ నేత సుభాష్ మహారియా సైతం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ఆదివారం ప్రకటించారు. 26న ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. -
నకిలీల గుప్పెట్లో కమలం
బీజేపీ నాయకత్వంపై జశ్వంత్ నిప్పులు పార్టీని బయటివాళ్లు ఆక్రమించారు సిద్ధాంతాన్ని గౌరవించని వారి చేతుల్లో పార్టీ నాకు టికెట్ నిరాకరించడం ఇది రెండోసారి బీజేపీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ (రాజస్థాన్): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యవస్థాపకుల్లో ఒకరైన జశ్వంత్‌సింగ్ (76) పార్టీ నాయకత్వంపై శనివారం నిప్పులు చెరిగారు. పార్టీ నకిలీల గుప్పెట్లోకి వెళ్లిపోయిందని, పార్టీని బయటివాళ్లు ఆక్రమించుకున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో చివరిసారిగా తన స్వరాష్ట్రమైన రాజస్థాన్‌లోని బార్మర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్న తనకు పార్టీ అధిష్టానం టికెట్ నిరాకరించడంపై జశ్వంత్ ఒకింత ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. ‘‘బీజేపీపై దురాక్రమణ జరిగింది. పార్టీ సిద్ధాంతాలపై ఎన్నడూ ఎలాంటి గౌరవమూ లేని బయటివాళ్లు పార్టీని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇది దురదృష్టకరం. పార్టీ స్వభావం, నైజం మారిపోయింది’’ అని జోధ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. అసలైన బీజేపీకి, నకిలీ బీజేపీకి మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ సిద్ధాంతాలను విశ్వసించే వారు.. పార్టీని దురాక్రమించినది ఎవరో, వారికి లభించిన ప్రయోజనాలు ఏమిటనేది ఆలోచించాలన్నారు. పార్టీని నిర్మించటానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కె.అద్వానీలు చేసిన కృషిని గుర్తుచేస్తూ.. ఇప్పుడు పార్టీ ఎక్కడికి పోతోందో ప్రశ్నించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం డార్జిలింగ్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జశ్వంత్ పార్టీ అగ్రనేతలు వాజపేయి, అద్వానీలకు సన్నిహితుడిగా పేరుగాంచారు. తనను పక్కనపెట్టి.. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సోనారామ్చౌదరికి బార్మర్ లోక్‌సభ స్థానం నుంచి టికెట్ కేటాయించటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. బార్మర్ టికెట్ కేటాయింపు అంశంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజె వైఖరికి పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘‘పార్టీ నాకు ఇలా చేయటం ఇది రెండోసారి. ఇప్పుడు ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదననూ అంగీకరించే అవకాశమే లేదు’’ అని జశ్వంత్ స్పష్టం చేశారు. ఆయన బీజేపీకి రాజీనామా చేసి, బార్మర్ సీటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఈ విషయమై సోమవారం బార్మర్‌లో తన నిర్ణయాన్ని ప్రకటించే అవశకాశముంది. మరోవైపు అద్వానీ అనుచరుడు, తూర్పు అహ్మదాబాద్ సిట్టింగ్ ఎంపీ హరిన్ పాఠక్‌కు పార్టీ మొండిచేయి చూపింది. ఈ స్థానంలో ఆయనకు బదులు ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్‌ను బరిలోకి దింపింది. సేవలను వినియోగించుకుంటాం: రాజ్‌నాథ్ జశ్వంత్‌సింగ్‌ను బుజ్జగించేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఆయన సీనియర్ నాయకుడని, పార్టీ కోసం ఆయన సేవలను తగినవిధంగా వినియోగించుకుంటామని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఢిల్లీలో మీడియాతో వ్యాఖ్యానించారు. టికెట్ నిరాకరణ బాధించింది: సుష్మ భోపాల్: జశ్వంత్సింగ్కు అధిష్టానం లోక్‌సభ టికెట్ నిరాకరించడం వ్యక్తిగతంగా తనను బాధించిందని బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. అయితే కారణం లేకుండానే పార్టీ అటువంటి అసాధారణ నిర్ణయం తీసుకోదని శనివారం భోపాల్‌లో వ్యాఖ్యానించారు. -
స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నజశ్వంత్ సింగ్!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో చివరిసారి తన స్వరాష్ట్రమైన రాజస్థాన్‌లోని బార్మర్ నుంచి బరిలోకి దిగాలనుకున్న బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌సింగ్ ఆశలపై ఆ పార్టీ అధిష్టానం నీళ్లుచల్లింది. ఆయనకు శుక్రవారం టికెట్ నిరాకరించింది. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కల్నల్ సోనారామ్ చౌధరిని బార్మర్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీచేసేలా గురువారం బలవంతంగా ఒప్పించిన అధిష్టానం ఆయనకు సన్నిహితుడిగా ముద్రపడిన జశ్వంత్‌కు ఆ మర్నాడే టికెట్ నిరాకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో జశ్వంత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్డీఏ హయాంలో మంత్రిగా పనిచేసిన జశ్వంత్ తన పాకిస్థాన్ సందర్శనపై రాసిన పుస్తకంలో ఆ దేశ పితామహుడు మొహమ్మద్ అలీ జిన్నాను పొగడటం ఆయనకు కష్టాలు తెచ్చిపెట్టింది. గుజరాత్లో అయితే ఈ పుస్తకాన్ని నిషేధించారు. ఈ వివాదం కారణంగా కొంతకాలంపాటు ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది. -
లోక్‌సభ సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ: విపక్షాల ఆరోపణల నడుమ బుధవారం ఆరంభమైన లోక్‌సభలో చర్చలు గందరగోళానికి తావివ్వడంతో సభను సోమవారానికి వాయిదా వేయక తప్పలేదు. లోక్‌సభలో విపక్షాలు తిరిగి గందరగోళ సృష్టించడంతో సభ వాయిదా వేశారు. ఈ రోజు గుర్ఱాలాండ్ అంశం ప్రధానంగా చర్చకు దారి తీసింది. కొందరు ఎంపీలు పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయాన్ని జరగనివ్వలేదు. బీజేపీ సభ్యుడు జశ్వంత్ సింగ్ మాత్రం గుర్ఱాలాండ్ ప్రత్యేక రాష్ర్ట అంశానికి తొందరగా పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 2 గం.లకు తిరిగి ఆరంభమైన లోక్ సభ తిరగి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. వరుసుగా నాలుగు రోజులు పార్లమెంట్ కు సెలవు దినాలు కావడంతో సభ తిరిగి సోమవారం ఆరంభమవుతుంది.