వైదొలిగే ప్రసక్తే లేదు: బీజేపీ రెబెల్ జస్వంత్ సింగ్
జైసల్మెర్: నామినేషన్ ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి, సీనియర్ నేత జస్వంత్ సింగ్ స్పష్టం చేశారు. రాజస్థాన్లోని బర్మెర్ లోక్సభ నియోజవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్టు చెప్పారు.
నామినేషన్ వెనక్కుతీసుకునేలా జస్వంత్ సింగ్ను ఒప్పించేందుకు బీజేపీ సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తననెవరూ సంప్రదించలేదని జస్వంత్ చెప్పారు. బర్మెర్ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని జస్వంత్ కోరినా బీజేపీ అగ్రనేతలు టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. బీజేపీ మరో స్థానం కేటాయించడంతో, జస్వంత్ నిరాకరించి బర్మెర్ నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగారు.