Barmer
-
దేశ రాజకీయాల్లో సంచలనం.. ఈ 26 ఏళ్ల కుర్రాడు!
దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాడు రాజస్థాన్‌కు చెందిన ఓ 26 ఏళ్ల కుర్రాడు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ యువకుడు.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చక్కని వాగ్ధాటి, అగర్గళమైన, చురుకైన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నాడు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాలే కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను చుట్టేస్తున్నాడు. బార్మర్- పశ్చిమ రాజస్థాన్, ముఖ్యంగా బార్మర్-జైసల్మేర్-బలోత్రా నియోజకవర్గం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో కేంద్ర బిందువుగా మారింది. ఇది దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. 1.9 మిలియన్ ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 7 లక్షల మంది జాట్లు, 2.5 లక్షల రాజ్‌పుత్ ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఇక్కడ ఎన్నికల రణరంగం ముక్కోణపు పోటీని చూస్తోంది. వివిధ రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖ అభ్యర్థులు బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి కైలాష్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమేరామ్ బేనివాల్ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థి 26 ఏళ్ల రవీంద్ర సింగ్ భాటి పోటీలో ఉండటంతో అందిరి దృష్టి ఈ నియోజక వర్గంపై పడింది. ఆకట్టుకునే ప్రసంగాలు బార్మర్ జిల్లాలోని షియో అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయాన్ని రుచి చూసిన రవీంద్ర, ఇప్పుడు మరోసారి బరిలోకి దిగి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే సాంప్రదాయ ద్విముఖ భావాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా భాటి ప్రజాదరణ ఆయన సొంత నియోజకవర్గానికి మించి విస్తరించింది. ఈయన ఆకర్షణ, ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. సోషల్ మీడియాలో సంచలనాన్ని రేకెత్తించాయి. ప్రచారం ముమ్మరం కావడంతో భాటి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మక పర్యటనను ప్రారంభించారు. రవీంద్ర భాటి బెంగుళూరుకు వెళ్లినప్పుడు ఆయన ప్రసంగాన్ని వినడానికి అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. అదేవిధంగా హైదరాబాద్‌లోనూ ప్రజాదరణ లభించింది. ఆయన విమానాశ్రయానికి రాకముందే జనాలను ఆకర్షించింది. గుజరాత్‌లోని సూరత్‌కు చేరుకున్నప్పుడు అతని పేరు కొన్ని మైళ్ల వరకు ప్రతిధ్వనించింది. రవీంద్ర భాటి నేపథ్యం రవీంద్ర సింగ్ భాటి బార్మెర్లోని దుధోడా అనే గ్రామానికి చెందిన రాజపుత్ర కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యాయ విద్యను అభ్యసించిన రవీంద్ర భాటి తన పాఠశాల విద్యను ప్రభుత్వ స్కూల్లో పూర్తి చేశారు. జై నారాయణ్ వ్యాస్ యూనివర్శిటీలో 2019 విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రవీంద్ర భాటి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఏబీవీపీ నుంచి మొదట టికెట్‌ను కోరినప్పటికీ, చివరికి తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో అతని విజయం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. విశ్వవిద్యాలయం 57 సంవత్సరాల చరిత్రలో విద్యార్థి సంఘం అధ్యక్ష పదవిని గెలుచుకున్న మొదటి స్వతంత్ర అభ్యర్థిగా రవీంద్ర సింగ్ బాటీ నిలిచాడు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో భాటి రాజకీయ పథం మరో ముఖ్యమైన మలుపు తిరిగింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను ఎదుర్కొని భాటి విజయం సాధించారు. సుమారు 4 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో లోక్‌సభ బరిలో నిలిచారు. #संबोधन pic.twitter.com/4CU0fnZTwe — Ravindra Singh Bhati (@RavindraBhati__) April 9, 2024 -
ఏకంగా రూ. 1 కోటి వార్షిక వేతనం అందుకుంటున్న భారత విద్యార్థి!
అతను ఐఐఎం, ఐఐటీలు వంటవి ఏం చెయ్యలేదు. కానీ వేతనంగా ఏకంగా కోటి రూపాయల వార్షిక ప్యాకేజిని అందుకుంటున్నాడు. మరీ అంత వేతనం ఎలా? అని అనుకుంటున్నారా!.. పనిచేసే అంకితభావం, మంచి నైపుణ్యం ఉంటే పెద్ద పెద్ద డిగ్రీలు చేయాల్సిన పని లేదు అని నిరూపించాడు ఈ భారతీయ విద్యార్థి. వివరాల్లోకెళ్తే..భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండే బార్మర్ అనే చిన్న జిల్లాలో నివసించే మహిపాల్ సేజు అనే భారత విద్యార్థి ఓ జపాన్ కంపెనీ నుంచి కోటి రూపాయల వార్షిక ప్యాకేజీని అందుకుని రికార్డు సృష్టించాడు. అయితే అతను ఏమి ఐఐఎం, ఐఐటీ స్టూడెంట్ కాదు. అందరిలానే బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఇంత పెద్ద మొత్తంలో వేతనం అందుకుని ఆశ్చర్యపరిచాడు. కేవలం పట్టదల, అంకితభావం, మంచి నైపుణ్యం ఉంటే.. పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వారితో సమానంగా వేతనం తీసుకోవచ్చని ప్రూవ్ చేశాడు. మహిపాల్ జోథ్‌పూర్‌లోని బార్మర్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఢిల్లీలో బీటెక్ పూర్తిచేశాడు. అయితే బీటెక్ చదువుతుండగానే 2019లో ఓ ప్లేస్మెంట్ ఏజెన్సీ ద్వారా జపాన్‌లో నగోయాలోని ఒక కంపెనీలో రూ. 30 లక్షల ప్యాకేజీతో మొదటి ఉద్యోగాన్ని సంపాదించాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత జపాన్‌లోని టోక్యోలో మరో కంపెనీతో ఏకంగా రూ. 1 కోటి వార్షిక ప్యాకేజ్ ఆఫర్ అందుకుని రికార్డు సృష్టించాడు. మహిపాల్ ప్రస్తుతం జపాన్‌లోని టోక్యోలో మెకానికా కార్పొరేషన్ అనే కంపెనీకి ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పెద్ద పెద చదువులు చదవలేదని బాధపడాల్సిన పనిలేదు ప్రస్తుత పరిస్థితులకు అవసరమయ్యే స్కిల్స్ సంపాదించుకుంటే పెద్ద మొత్తంలో వేతనాలు అందుకోవచ్చని మహిపాల్ చేసి చూపించాడు. నిజం చెప్పాలంటే ఫోకస్ కరెక్ట్‌గా ఉండి, పనిపై అంకితా భావం ఉంటే ఏ నేపథ్యం నుంచి వచ్చినా కోట్లలో వేతనం అందుకోగలమని చాటి చెప్పాడు, పైగా అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు మహిపాల్ సేజు. (చదవండి: ఇందిరా గాంధీ బ్రేక్ ఫాస్ట్‌గా కోసం ఓ చెఫ్ పడ్డ పాట్లు! కానీ చివరికి..) -
స్వచ్ఛందం పేరిట వసూళ్ల దందా
ఉదయ్‌పూర్: కన్హయ్యాలాల్ హత్య కేసులో ప్రధాన నిందితులిద్దరికీ దావత్–ఇ–ఇస్లామ్ అనే సంస్థతో సంబంధాలున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ సరిహద్దు జైసల్మేర్, బర్మేర్ ప్రాంతాల్లో ఉగ్రవాద ప్రచార కార్యక్రమాల కోసం స్థానికుల నుంచి విరాళాలను సేకరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. నెల క్రితం సుమారు రూ.20 లక్షలను ఇస్లాం స్వచ్ఛంద సేవాకార్యక్రమాల కోసమంటూ విరాళాలను సేకరించిందని, ఒక రాజకీయ నేత కూడా రూ.2 లక్షలను అందించారని తేల్చాయి. వివరణ కోసం ప్రయత్నించగా ఆ నేత స్పందించడం లేదని తెలిపాయి. నిందితులు జ్యుడీషియల్ కస్టడీకి ఉదయ్‌పూర్‌లో దర్జీని పొట్టనబెట్టుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు ప్రధాన నిందితులైన రియాజ్ అఖ్తారీ, గౌస్ మొహమ్మద్‌ల ను భారీ బందోబస్తు మధ్య ఉదయ్‌పూర్ కోర్టుకు తీసుకువచ్చారు. ఐడెంటిఫికేషన్ కోసం కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. కన్హయ్యాలాల్ హత్యను నిరసిస్తూ ఉదయ్‌పూర్‌లో భారీ ర్యాలీ జరిగింది.ఉదయ్‌పూర్‌లోని కన్హయ్యాలాల్ ఇంటికి సీఎం సీఎం అశోక్ గహ్లోత్ వెళ్లారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, నిందితులకు సాధ్యమైనంత త్వరగా శిక్షలు పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.. -
శభాష్ అంజలి.. మంచి పని చేశావ్!
కట్నం డబ్బును మంచి పనికి వినియోగించి శభాష్ అనిపించుకుంది ఓ పెళ్లికూతురు. పెద్ద మొత్తంలో నగదును సమాజ సేవకు అందించి ఆదర్శంగా నిలిచింది. ఈ విషయం తెలిసిన వారందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసింది? రాజస్థాన్‌లోని బార్మర్ నగరానికి చెందిన కిషోర్ సింగ్ కనోడ్ కుమార్తె అంజలి కన్వర్ నవంబర్ 21న ప్రవీణ్ సింగ్‌ను వివాహం చేసుకుంది. తనకు కట్నంగా ఇవ్వాలనుకున్న 75 లక్షల రూపాయలను బాలికల హాస్టల్ నిర్మాణానికి వినియోగించాలని పెళ్లికి ముందే తండ్రితో చెప్పింది. కుమార్తె కోరినట్టుగానే ఈ మొత్తాన్ని బాలికల హాస్టల్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చేశాడు కిషోర్ సింగ్. (చదవండి: ‘సార్ వీడు నా పెన్సిల్ తీసుకున్నాడు.. కేసు పెట్టండి’) ఈ విషయాన్ని లేఖ ద్వారా పెళ్లికి వచ్చిన అతిథులకు తెలియజేయగా కరతాళ ధ్వనులతో వారందరూ స్వాగతించారు. అంజలి తండ్రి పెళ్లి పందిట్లోనే ఖాళీ చెక్కును కూతురికి అందించి.. ఆమె అభీష్టాన్ని నెరవేర్చారు. బాలికల విద్య కోసం కట్నం సొమ్మును త్యాగం చేసిన అంజలి మంచి మనసును అక్కడున్నవారంతా మెచ్చుకున్నారు. 68వ జాతీయ రహదారికి సమీపంలోని నిర్మితమవుతున్న బాలికల వసతి గృహానికి కిషోర్ సింగ్ ఇప్పటికే కోటి రూపాయాలు ప్రకటించారు. అయితే నిర్మాణం పూర్తికావడానికి 50 నుంచి 75 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి రావడంతో అంజలి ఈ నిర్ణయం తీసుకుంది. (చదవండి: నీలగిరి ‘తోడాలు’.. పాండిచ్చేరి చాపనేత.. ఎన్నెన్నో విశేషాలు!) #positivenews #barmer #girleducation pic.twitter.com/UPl9BqXKfE — Tribhuwan Singh Rathore 🇮🇳 (@FortBarmer) November 24, 2021 దీనికి సంబంధించిన కథనాన్ని ‘దైనిక్ భాస్కర్’ పత్రిక ప్రచురించింది. ఈ వార్తా కథనం క్లిప్పింగ్‌ను త్రిభువన్ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేశారు. దీంతో అంజలి కన్వర్‌పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్ఫూర్తిదాయకంగా నిలిచావంటూ పొగడుతున్నారు. (చదవండి: అనుపమ అలుపెరగని పోరాటం.. ఎట్టకేలకు చెంతకు చేరిన బిడ్డ!!) -
రాజస్థాన్‌లో కుప్పకూలిన సైనిక విమానం
జైపూర్: భారత వాయుసేన (ఎయిర్ ఫోర్స్-ఐఏఎఫ్)కు చెందిన మిగ్-21 బైసన్ విమానం రాజస్థాన్‌లో కుప్పకూలింది. అయితే అందులో పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాజస్థాన్‌లోని బర్మార్‌లో బుధవారం సాయంత్రం ఆకాశానికి ఎగిరిన విమానం 5.30 గంటల సమయంలో కూలిందని భారత వాయుసేన (ఐఏఎఫ్) ప్రకటించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. (చదవండి: ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేశారని విషం తాగిన టీచర్లు) కాగా మిగ్ విమానాలు కూలడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది మే 21వ తేదీన శిక్షణ విమానం పంజాబ్‌లోని మోగా జిల్లాలో కూలింది. ఆ ఘటనలో స్కా్వడ్రన్ లీడర్ అభినవచౌదరి మృతి చెందారు. ఇదే సంవత్సరం మార్చిలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మిగ్-21 బైసన్ జెట్ విమానం టేకాఫ్ అవుతుండగా కూలిపోగా ఒకరు మరణించారు. జనవరిలో రాజస్థాన్‌లోని సూరత్గడ్లో మిగ్-21 బైసన్ విమానం టేకాఫ్ అయ్యి శ్రీగంగానగర్ జిల్లాలో కూలింది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా జరిగిన ఘటన నాలుగోది. మిగ్-21 విమానాలు ప్రమాదానికి గురవడంపై వాయుసేన దర్యాప్తు చేస్తోంది. చదవండి: శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్ రిలీఫ్ At around 1730 hrs today, an IAF MiG-21 Bison aircraft airborne for a training sortie in the western sector, experienced a technical malfunction after take off. The pilot ejected safely. A Court of Inquiry has been ordered to ascertain the cause. — Indian Air Force (@IAF_MCC) August 25, 2021 -
రాజస్థాన్‌లో పాక్ గూఢచారి అరెస్ట్
జైపూర్ : గూఢచర్యం చేసేందుకు పాకిస్తాన్ నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడిన ఓ వ్యక్తిని బీఎస్ఎఫ్ సిబ్బంది రాజస్తాన్‌లోని బర్మేర్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అతని పేరు కిషోర్ అని, పాకిస్తాన్‌కు చెందిన వాడిగా గుర్తించామని తెలిపారు. బీఎస్ఎఫ్, భారత ఆర్మీ కార్యకలాపాలపై కీలక సమాచారం తెలుసుకునేందుకు తన మేనమామే తనను భారత్‌కు పంపినట్లు సదరు వ్యక్తి వెల్లడించినట్లు పేర్కొన్నారు. సరిహద్దులో ఏర్పాటు చేసిన బారికేడ్ల కింది నుంచి పాకుకుంటూ అతడు చొరబడినట్లు బీఎస్ఎఫ్ అనుమానం వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌లోని ఖోఖ్రాపర్ వరకు రైలులో వచ్చానని.. అక్కడి నుంచి తాను సరిహద్దు దాటేందుకు పాక్ ఆర్మీ తనకు సాయపడిందని విచారణలో తెలిపాడు. మూడు రోజుల పాటు అతడిని విచారించారు. దర్యాప్తు సమయంలో అతడు పదే పదే మాట మారుస్తుండడంతో తదుపరి విచారణ నిమిత్తం జైపూర్‌కు తరలిస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. కాగా సెస్టెంబర్ మొదటివారంలో కశ్మీర్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాక్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను భారత ఆర్మీ అదుపులోకి తీసుకొని విచారించగా లష్కరే-ఇ-తొయిబాకు చెందిన 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ(ఐఎస్ఐ)తో కలిసి పాక్ ఆర్మీ ఎల్వోసీ వద్ద దాడులకు తెగబడేందుకు 12కు పైగా లాంచింగ్ ప్యాడ్స్‌తో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందింది. -
కూలీ పనిచేస్తూనే ఎంబీబీఎస్ సీటు
ఏళ్ల తరబడి రాయి నీటిలో ఉన్నా మెత్తబడిపోదు. అలాగే దృఢ సంకల్పం ఉంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా చివరికి విజయం సొంతమవడం అనివార్యం. నాలుగు పర్యాయాలు ప్రయత్నించినా ఫలితం రాలేదని దిగులు చెందకుండా ఐదోసారికూడా నీట్ పరీక్షకు హాజరై ఉచిత సీటు సాధించుకున్న జోధారామ్ గురించి తెలుసుకుందాం.. జోధారాం స్వస్థలం రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లా గోలియా గ్రామం. వ్యవసాయ కుటుంబం. సకాలంలో వర్షాలు కురవకపోవడం, పంట పండకపోవడం కారణంగా ఆ కుటుంబం అనేక బాధలకు గురైంది. అయితే జోధారామ్కు చదువంటే చాలా ఇష్టం. డాక్టర్ కావాలనేది అతని లక్ష్యం. ఎంబీబీఎస్ చదివించడం కోసం తండ్రి ఒక షరతు విధించాడు. ఇంటర్ బోర్డు పరీక్షలో 70 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉచితం ప్రవేశం సాధించడం. అలా చేయలేకపోతే ముంబై వెళ్లి కూలీ పనిచేయడం. దీంతో జోధారామ్ కష్టపడి చదివి 65 శాతం మార్కులు సాధించాడు. రామ్ ప్రతిభను గుర్తించిన స్కూల్ ప్రిన్సిపల్ పోటీ పరీక్షలు రాస్తే మంచి భవిష్యత్తు ఉం టుందంటూ ప్రోత్సహించాడు. తొలిసారి నీట్ పరీక్షకు హాజరైన రామ్‌కు 1,50,000 ర్యాంకు వచ్చింది. అయినా లక్ష్యం నెరవేరలేదు. తండ్రికి ఇచ్చిన మాట మేరకు ముంబై వెళ్లి కూలీ పనిచేయడం ప్రారంభించాడు. అయితే రామ్ పట్టువదలని విక్రమార్కునిలా నీట్ పరీక్షలను మాత్రం విడిచిపెట్టలేదు. మళ్లీ మూడు పర్యాయాలు ఇవే పరీక్షలు రాశాడు. నాలుగోసారి ఆల్ ఇండియా లెవెల్లో 12,903 ర్యాంకు వచ్చింది. దీంతో రామ్ ప్రతిభను గుర్తించిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు నీట్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఐదోసారి నీట్లో ఆల్ ఇండియా 3886 ర్యాంకు సాధించి, జోధ్‌పూర్‌లోని సంపూర్ణాననంద్ వైద్యకళాశాలలో ఉచిత అడ్మిషన్ పొందాడు. చదివించలేరని తెలుసు.. ‘‘మా అన్నయ్య తప్ప ఇంకెవరూ నన్ను నమ్మలేదు. ముంబై వెళ్లి కూలీ పని చేసుకుని బతకమని అమ్మ చెప్పింది. అలా అన్నందుకు బాధ కలగలేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులకు ఎంబీబీఎస్ చదివించేంత స్తోమత లేదని తెలుసు. అం దుకే కష్టపడి చదువుకున్నా. ఆశించిన ఫలితం లభించినందుకు ఆనందంగా ఉంది’ అని తన మనసులో మాట చెప్పాడు జోధారామ్. -
రాజస్తాన్‌లో టెంట్‌కూలి 14 మంది మృతి
-
ఘోరం: టెంట్‌కూలి 14 మంది భక్తులు మృతి
జైపూర్: రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బార్మీర్ జిల్లాలో టెంట్ (గుడారాలు) కూలి 14 మంది మృతిచెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం తరలివచ్చిన భక్తుల కోసం అక్కడ పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో గాలి, భారీ వర్షం సంభవించడంతో అవి ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ఘటనలో అక్కడిక్కడే పలువురు భక్తులు మృతి చెందారు. అదే సమయంలో విద్యుత్ షాక్ కొట్టడంతో మరికొంతమంది మరణించినట్లు సమాచారం. ఘటన జరగిన సమయంలో దాదాపు వెయ్యి మంది భక్తులు ఉన్నట్లు తెలస్తోంది. గాయపడిన వారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. ప్రధాని మోడీ దిగ్ర్బాంతి బార్‌మీట్ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. మృతి చెందిన వారి కుటుంబాకు అండగా ఉంటామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. -
ముస్లింను ప్రేమించాడని కొట్టి చంపారు!
జైపూర్ : ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని ఓ ముస్లింను కొట్టి చంపిన ఘటన మరవక ముందే రాజస్తాన్‌లో మరో మూక హత్య చోటుచేసుకుంది. బార్మర్‌లో ఓ దళిత యువకుడు ముస్లిం యువతిని ప్రేమిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపారు. కేత్‌రామ్ బీమ్(22) అనే యువకుడు మెహబూబ్ ఖాన్ ఇంట్లో కొద్ది రోజులుగా పనిచేస్తున్నాడు. ఈ తరుణంలో ఆ కుటుంబంలో ఉన్న ఓ యువతితో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇది కాస్త ప్రేమకు దారితీయడంతో ఆ యువతి కుటుంబ సభ్యులు అతన్ని పలుమార్లు హెచ్చరించారు. అయినా వినకపోవడంతో దారుణంగా కొట్టి చంపారు. గత శుక్రవారం హయత్‌ఖాన్, సదామ్ ఖాన్లు వారి పోలానికి రావాలని తన సోదరున్ని పిలిచినట్లు కేత్‌రామ్ సోదరుడు హరిరామ్ మీడియాకు తెలిపారు. అప్పటికే అక్కడ ఉన్న మరికొందరు అతని చేతులు కట్టేసి చచ్చే వరకు తన తమ్ముడిని చితకబాదారని ఆరోపించారు. శవాన్ని కొంత దూరం తీసుకెళ్లి పడేయడంతో మూడు రోజులనంతరం అతని డెడ్‌బాడీ దొరికిందన్నారు. ఇక పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో సైతం కేత్‌రామ్ కొట్టడం వల్లనే చనిపోయాడని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఓ వైపు దేశవ్యాప్తంగా మూకదాడులపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేత్‌రామ్ మృతి ఈ ఆందోళనలకు అగ్గిరాజేసినట్లైంది. మరోవైపు అల్వార్ జిల్లాలో చోటు చేసుకున్న మూక దాడిలో పోలీసుల నిర్లక్ష్యమే వల్లే బాధితుడు రక్బర్ ఖాన్ మృతి చెందినట్లు తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగానే...
బార్మర్ : జీవితం.. నిజంగా ఎంత అనూహ్యమైనది. ఏ క్షణాన మృత్యువు కాటేస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారుతోంది. రాజస్తాన్‌లో జరిగిన ఈ సంఘటన మాత్రం హృదయాల్ని కలచివేస్తోంది. ఒక వ్యక్తి ఎంతో సంతోషంగా స్టేజీపై నవ్వుతూ డ్యాన్స్ చేస్తుండగానే.. అతన్ని మృత్యువు కాటేసింది. డ్యాన్స్ చేస్తూనే స్టేజీపై కుప్పకూలిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్తాన్‌లో బార్మర్‌లో ఓ యంగ్ కపుల్, దిల్ వాలే దుల్హనియా లేజాయింగేలో 'తుజే దేకా తో హే జానా సనం'' అనే పాటకు ఓ ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అలా నర్తిస్తుండగానే.. ఆమె జోడి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ సంఘటనను కూడా డ్యాన్స్‌లో భాగంగానే చూశారు ఆ అమ్మాయి, ఇతర ప్రేక్షకులు. కొద్దిసేపటి తర్వాత అతన్ని ఆ అమ్మాయి లేపడం ప్రయత్నించింది. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలియగానే ఒక్కసారిగా అక్కడున్న వారందరూ హతాశులయ్యారు. అతనికి కార్డియాక్ అరెస్ట్ రావడం వల్ల చనిపోయాడని ప్రాథమిక రిపోర్టులు చెబుతున్నాయి. -
స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగానే...
-
కుప్ప కూలిన వైమానిక విమానం
-
కుప్ప కూలిన వైమానిక విమానం
న్యూఢిల్లీ : భారత వైమానిక దళ విమానం మిగ్-21 కూలిపోయింది. రాజస్తాన్‌లోని బార్మర్ ప్రాంత సమీపంలో ఈ ఎయిర్‌క్రాప్ట్ కూలిపోయినట్టు డిఫెన్ అధికార ప్రతినిధి తెలిపారు. విమానంలోని ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయట పడ్డట్టు ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది.బార్మర్ సమీపంలోని ఉత్తర్లాయ్ ఎయిర్‌బేస్ నుంచి టేక్ ఆఫ్ తీసుకున్న ఈ ఎయిర్‌క్రాప్ట్ బార్మర్ సమీపంలోనే కూలిపోయింది. టీ-69 ట్రైనర్ ఈ ఎయిర్‌క్రాప్ట్‌ను టేక్ ఆఫ్ తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సివిల్ లేదా సర్వీసు ప్రాపర్టీకి ఎలాంటి నష్టం జరగలేదని అధికారి పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంక్వయిరీకి ఆదేశించినట్టు డిఫెన్స్ అధికారి వెల్లడించారు. -
జమాయీ రాజా చచ్చిపోయాడు
బార్మర్: అతను ఎపుడూ పెళ్లి చేసుకోలేదు...ఎవరితోనూ కలిసి ఉండలేదు.. కానీ 55 మంది పెళ్లికూతుళ్లతో కాపురం చేశాడు.. ఆనక చల్లగా అక్కడ నుంచి నగలతో ఉడాయించేవాడు. ఈ క్రమంలో 56వ అమ్మాయికి వలవేసి పోలీసులకు బుక్కయ్యాడు. చివరకు అనామకుడిగా రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో శవమై తేలాడు. నింబాల్ కోట్ గ్రామంలో శనివారం మరణించిన అతగాడికి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఎలా చనిపోయాడు .. పోలీసులు ఎందుకు దహన క్రియలు చేశారు అనేది స్పష్టత లేదు. వివరాల్లోకి వెళ్తే, జియారామ్ జాట్ (54)కు ఉన్న క్రిమినల్ రికార్డు సామాన్యమైంది కాదు. వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు18 కేసులు నమోదయ్యాయి. బాల్యవివాహం అయిన అమ్మాయిలే అతని టార్గెట్. చిన్నప్పుడే పెళ్లయ్యి... వయసు వచ్చి కాపురానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిలున్న మధ్య తరగతి కుటుంబాలను ఎంచుకొని దోచుకోవడం అతని మోడెస్ ఒపరాండీ. అలా ఇంట్లో ఆడవాళ్లు ఒంటరిగా ఉన్నపుడు వారితో పరిచయం పెంచుకుని..అల్లుడిగా నమ్మించి .. ఇంట్లోకి చొరబడేవాడు. అమ్మాయిని కాపురానికి తీసుకెళతానని అత్తమామల్ని నమ్మించి ఆ అమ్మాయిలతో కాపురం చేసేవాడు. అనంతరం వారి దగ్గరున్న నగలతో పరారయ్యేవాడు. 2004 లో వేధింపుల కేసులో పోలీసులు జియారామ్ ను అరెస్టు చేసినపుడు స్వయంగా ఈ వివరాలన్నీ విచారణలో అంగీకరించాడు. ఈ తర్వాత కొంత కాలం లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన జియా రామ్ 2013 లో మళ్లీ ఇదే కేసులో అరెస్ట్ అయ్యాడు. దీంతో పోలీసులు అతగాడిని 'జమాయీ రాజా' (అల్లుడుగారు) అని పోలీస్ ఫైల్స్ లో పేర్కొన్నారు. -
పెళ్లిలో ఎంపీతో గొడవపడి..
బార్మెర్: రాజస్థాన్‌లోని బార్మెర్లో ఓ యువకుడు స్థానిక బీజేపీ ఎంపీ సొనారామ్ చౌదరితో గొడవపడి చెంపదెబ్బ కొట్టాడు. ఓ వివాహ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో ఈ ఘటన జరిగింది. మంగళవారం ఎంపీ సొనారామ్, కలెక్టర్ ఇతర ప్రముఖులు ఓ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్తారామ్ అనే యువకుడు వచ్చి ఎంపీతో ఓ విషయం గురించి మాట్లాడుతూ వాగ్వాదానికి దిగాడు. ఆవేశంతో ఊగిపోయిన ఖర్తారామ్ ఎంపీని చెంపదెబ్బ కొట్టాడు. నిందితుడు వెంటనే అక్కడ నుంచి పారిపోయినట్టు జిల్లా ఎస్పీ పారిస్ దేశ్‌ముఖ్ చెప్పారు. ఎంపీ వ్యక్తిగత భద్రత సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఖర్తారామ్తో పాటు అతడితో ఉన్న ప్రేమరామ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఎంపీకి కొద్ది దూరంలో ఉన్నానని కలెక్టర్ సుధీర్ శర్మ చెప్పారు. -
స్కూల్లో 'ఆశారాం చాలిసా' పఠనం..!
జైపూర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపిన కేసులో ప్రస్తుతం ఆయన జోథ్‌పూర్ జైల్లో ఉన్నాడు. అయినా ఆయనను ఆరాధించడం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మానుకోలేదు. తనను తను 'దేవుడి ప్రతిరూపం'గా చెప్పుకొనే ఆశారాంను ఏకంగా పాఠశాలలో ఆరాధిస్తూ పూజలు చేస్తూ ఆ టీచర్ సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ధోలాదర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో మాఘరాం అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అతను ప్రతిరోజూ బడిలో ప్రార్థన సమయంలో ఆశారాం బాపు ఫొటోను పెట్టి, 'ఆశారాం చాలిసా'ను పఠించేవాడు. విద్యార్థులు కూడా ప్రార్థన చేయకుండా ఈ చాలిసాను పఠించాలని సూచించేవాడు. దీనిపై తోటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయుడు అభ్యంతరం పెట్టినా అతని తీరు మారలేదు. ఈ ఘటన తన దృష్టికి రావడంతో హెడ్మాస్టర్ ద్వారా ధ్రువీకరణ చేసుకొని ఆ టీచర్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్టు ప్రాథమిక విద్యాశాఖ సెక్రటరీ కేఎల్ మీనా తెలిపారు. -
మార్ఫింగ్ వీడియోతో బ్లాక్మెయిల్
బార్మర్: మార్ఫింగ్ చేసిన వీడియోతో మహిళను బ్లాక్మెయిల్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను లక్ష్మణ్‌రామ్, జంజారామ్ గా గుర్తించారు. బార్మర్ జిల్లాలోని ధోరిమన్నా ప్రాంతానికి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేశారు. అశ్లీల దృశ్యాలతో తమ చిత్రాలను మార్ఫింగ్ చేసి తనతో పలువురు మహిళలను బ్లాక్మెయిల్ చేశారని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మార్ఫింగ్ చేసిన వీడియోలను ఇతరులకు కూడా నిందితులు పంపిణీ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్న ఇతర వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తునట్టు చెప్పారు. -
వైదొలిగే ప్రసక్తే లేదు: బీజేపీ రెబెల్ జస్వంత్ సింగ్
జైసల్మెర్: నామినేషన్ ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి, సీనియర్ నేత జస్వంత్ సింగ్ స్పష్టం చేశారు. రాజస్థాన్‌లోని బర్మెర్ లోక్‌సభ నియోజవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్టు చెప్పారు. నామినేషన్ వెనక్కుతీసుకునేలా జస్వంత్ సింగ్‌ను ఒప్పించేందుకు బీజేపీ సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తననెవరూ సంప్రదించలేదని జస్వంత్ చెప్పారు. బర్మెర్ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని జస్వంత్ కోరినా బీజేపీ అగ్రనేతలు టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. బీజేపీ మరో స్థానం కేటాయించడంతో, జస్వంత్ నిరాకరించి బర్మెర్ నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగారు. -
ఇద్దరు సైనికుల యుద్ధభూమి బార్మేర్
బార్మేర్ నియోజకవర్గం.... భారత-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇసుక మేటల ఏడారి జిల్లా ఇది. మామూలుగా వార్తలకు ఆమడల దూరంలో ఉండే బార్మేర్ ఇప్పుడు హఠాత్తుగా పతాకశీర్షికలకెక్కింది. బిజెపి సీనియర్ నేత, మాజీ విదేశవ్యవహారాల మంత్రి జస్వంత్ సింగ్ కు బిజెపి టికెట్ నిరాకరించడం, ఆ 76 ఏళ్ల వృద్ధ నేత కన్నీరుమున్నీరవుతూ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడంతో ఇప్పుడు దేశమంతా బార్మేర్ గురించి చర్చిస్తోంది. రాజస్థాన్ రాజకీయాల ఉక్కుమహిళ వసుంధరారాజే తోటి క్షత్రియుడన్నది సైతం పట్టించుకోకుండా గెలుపుగుర్రం కల్నల్ సోనారామ్ చౌధురికి టికెట్ ఇప్పించింది. దీంతో మాజీ సైనికులు ఇద్దరూ ఎదురెదురుగా నిలిచి ఎన్నికల యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. గెలిచే అవకాశాలు ఎక్కువగా సోనారామ్ కే ఉన్నాయన్నది బిజెపి ఎన్నికల సమితి అభిప్రాయం. బార్మేర్ లో జాట్ వోటర్లు చాలా ఎక్కువ. జాట్ ఉద్యమానికి సోనారామ్ నాయకుడు. కాబట్టి ఆయన గెలుపు సుసాధ్యమనేది బిజెపి అంచనా. మంగళవారం ఆయన నామినేషన్ కి ముఖ్యమంత్రి వసుంధరా రాజే తాను హాజరుకావడమే కాదు, సకల సామంత దండనాథులతో కలిసి మరీ వచ్చారు. జాట్ ఓట్లే కీలకం రాజస్థాన్ లోని 25 ఎంపీ సీట్లలో బార్మేర్ ఒకటి. అంతే కాదు. రాష్ట్రంలోని అతిపెద్ద ఎంపీ నియోజకవర్గం ఇది. ఇందులో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గంలో రాజపుత్రులు, జాట్లు, షెడ్యూల్డు కులాలు, మైనారిటీలు ఎక్కువగా ఉంటారు. షెడ్యూల్డు కులాలు, మైనారిటీలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారు. రాజపుత్రులు బిజెపితో ఉంటారు. కాబట్టి జాట్ ఓట్లే కీలకం. కాంగ్రెస్ కంచుకోట మొదటినుంచీ బార్మేర్ కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటి వరకూ జరిగిన 15 లోకసభ ఎన్నికల్లో 9 సార్లు కాంగ్రెస్ గెలిచింది. బిజెపి కేవలం 2004 లో మాత్రమే గెలిచింది. రెండు సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. 2009 లో కాంగ్రెస్ జాట్ వర్గీయుడైన హరీశ్ చౌదరికి టికెట్ ఇచ్చింది. బిజెపి వసుంధర సన్నిహితుడు, రాచకుటుంబానికి చెందిన మానవేంద్ర సింగ్ కి టికెట్ ఇచ్చింది. చివరికి హరీశ్ దే పై చేయి అయింది. అందుకే ఈ సారి బిజెపి క్షత్రియుడికి కాక జాట్ కి టికెట్ ఇచ్చింది. బిజెపి వ్యూహం ఫలిస్తుందా? పైగా జస్వంత్ సింగ్ కి ఈ నియోజకవర్గంలో పెద్దగా పట్టు లేదు. ఆయన గత లోకసభ ఎన్నికల్లో డార్జీలింగ్ నుంచి, గూర్ఖా జనముక్తిమోర్చా సాయంతో లోకసభకి ఎన్నికయ్యారు. గత పదేళ్లుగా ఆయన బార్మేర్ ను పట్టించుకోలేదు. 10 జనపథ్ సన్నిహితుడు, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అయిన హరీశ్ చౌధరిని ఆయన తట్టుకోలేరన్న కారణంతోనే ఆయనను బిజెపి పక్కన బెట్టింది. పైగా బార్మేర్ లోకసభలోని ఎనిమిది అసెంబ్లీ సీట్లలో ఏడు బిజెపి చేతిలో ఉన్నాయి. స్థానిక కాంగ్రెస్ దిగ్గజాలు చాలా మంది రాజకీయాలనుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. కాబట్టి కులంబలం తోడైతే బార్మేర్ ని గెలుచుకోవడం సులభమని బిజెపి భావిస్తోంది. పాపం జస్వంత్ సింగ్! మొత్తం మీద జస్వంత్ సింగ్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఇండిపెండెంట్ గా మొదలై ఇండిపెండెంట్ గానే అంతమౌతుందా? ఆయన 47 ఏళ్ల క్రితం తొలిసారి రంగంలోకి దిగినప్పుడు ఇండిపెండెంట్ గా పోటీచేసి 17 వేల ఓట్లు సంపాదించుకున్నారు. ఓడిపోయారు. ఒక సారి జోధ్ పూర్, ఒక సారి చిత్తోడ్ గఢ్ ఇలా నియోజకవర్గాలు మారుస్తూ వచ్చారాయన. ఇప్పుడు ఈ సారి ఇండిపెండెంట్ గా మళ్లీ పోటీచేస్తున్నారు. ఒక వేళ గెలిచినా ఇదే ఆయనకు చివరి ఎన్నిక అవుతుంది. ఎందుకంటే 2019 నాటికి ఆయనకు 80 ఏళ్లు దాటిపోతాయి. -
జస్వంత్ ఆస్తుల్లో 3 అరబ్ గుర్రాలు, 51 ఆవులు!
బీజేపీ తిరుగుబాటు నేత జస్వంత్ సింగ్ ఆస్తుల జాబితాను ప్రకటించారు. బర్మర్ లోకసభ స్థానంలో సోమవారం నామినేషన్ సమర్పించిన జస్వంత్ మంగళవారం ఆస్తుల జాబితాను వెల్లడించారు. ఆయన ఆస్తుల విలువ 1,49,83,510. జస్వంత్ ఆస్టుల్లో మూడు అరబ్ గుర్రాలు, 51 థార్పర్కర్ ఆవులున్నాయి. 51 ఆవులు జైసల్మర్, బర్మర్ లో ఉన్నట్టు తెలిపారు. తన వద్ద ఉన్న మూడు ఆవుల్లో సౌదీ అరేబియా యువరాజు రెండు ఆవులను బహుకరించారని.. ఆతర్వాత మరో ఆవు జన్మించిందని తెలిపారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత జస్వంత్ మాట్లాడుతూ.. బీజేపీని వీడేది లేదు అని స్పష్టం చేశారు. ఒకే వ్యక్తిపై పార్టీ ఆధారపడటం చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకే వ్యక్తిపై ఆధారపడటం మంచిది కాదని జస్వంత్ సూచించారు.