విమానం కూలడంతో చెలరేగిన మంటలు
జైపూర్: భారత వాయుసేన (ఎయిర్ ఫోర్స్-ఐఏఎఫ్)కు చెందిన మిగ్-21 బైసన్ విమానం రాజస్థాన్‌లో కుప్పకూలింది. అయితే అందులో పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాజస్థాన్‌లోని బర్మార్‌లో బుధవారం సాయంత్రం ఆకాశానికి ఎగిరిన విమానం 5.30 గంటల సమయంలో కూలిందని భారత వాయుసేన (ఐఏఎఫ్) ప్రకటించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. (చదవండి: ఉద్యోగాలు ట్రాన్స్‌ఫర్ చేశారని విషం తాగిన టీచర్లు)
కాగా మిగ్ విమానాలు కూలడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది మే 21వ తేదీన శిక్షణ విమానం పంజాబ్‌లోని మోగా జిల్లాలో కూలింది. ఆ ఘటనలో స్కా‍్వడ్రన్ లీడర్ అభినవచౌదరి మృతి చెందారు. ఇదే సంవత్సరం మార్చిలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మిగ్-21 బైసన్ జెట్ విమానం టేకాఫ్ అవుతుండగా కూలిపోగా ఒకరు మరణించారు. జనవరిలో రాజస్థాన్‌లోని సూరత్‌గడ్‌లో మిగ్-21 బైసన్ విమానం టేకాఫ్ అయ్యి శ్రీగంగానగర్ జిల్లాలో కూలింది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా జరిగిన ఘటన నాలుగోది. మిగ్-21 విమానాలు ప్రమాదానికి గురవడంపై వాయుసేన దర్యాప్తు చేస్తోంది.
చదవండి: శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్ రిలీఫ్
At around 1730 hrs today, an IAF MiG-21 Bison aircraft airborne for a training sortie in the western sector, experienced a technical malfunction after take off. The pilot ejected safely.
— Indian Air Force (@IAF_MCC) August 25, 2021
A Court of Inquiry has been ordered to ascertain the cause.
Comments
Please login to add a commentAdd a comment