crashes
-
ఆగ్రాలో కుప్పకూలిన MiG-29 విమానం..
ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-29 ఫైటర్ జెట్ విమానం సోమవారం కుప్పకూలిపోయింది. విమానం నెల కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదం నుంచి పైలట్, కో పైలట్ సురక్షింతంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే విమానం నుంచి కిందకు దూకి ఇద్దరు పైలెట్లు తమ ప్రాణాలను కాపాడుకున్నారు.పంజాబ్ అదంపూర్ నుంచి ఆగ్రా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే విమానం ల్యాండింగ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని రక్షణశాఖ అధికారులు తెలిపారు. కాగరౌల్‌లోని సోనిగా గ్రామ సమీపంలోని ఖాళీ పొలాల్లో పైలట్ విమానం కూలిపోయిందని, జనావాస ప్రాంతంలో కూలి ఉంటే భారీ నష్టం జరిగేదని పేర్కొన్నారు. ప్రమాదంపై కోర్టు విచారణకు ఆదేశించనున్నట్లు తెలిపారుఅయితే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిగ్-29 విమానం కూలడానికి కారణాలు తెలియరాలేదు. విమానం కూలిన ప్రదేశంలో జెట్ నుంచి పొగలు వెలువడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిగ్-29 యుద్ధ విమానం కూలిపోయి మంటలు చెలరేగడం ఇదేం మొదటిసారి కాదు. సెప్టెంబర్ 2న రాజస్థాన్‌లోని బార్మర్‌లో సాంకేతిక లోపంతో మిగ్-29 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘటనలోనూ ప్రమాదానికి ముందు పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. -
Rajasthan: కూలిన మిగ్ 29 యుద్ధ విమానం.. పైలట్లకు తప్పిన ప్రమాదం
బార్మర్: రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఓ యుద్ధ విమానం కూలిపోయింది. ఓలానియోక్లోని ధాని సమీపంలో యుద్ధ విమానం మిగ్ 29కు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నాగనా పోలీస్‌స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం నుంచి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.మిగ్ 29 యుద్ధ విమానం భారతదేశంలోని ముఖ్యమైన విమానాలలో ఒకటి. ఈ జెట్ విమానం బార్మర్‌లో రాత్రిపూట సాధారణ శిక్షణ మిషన్‌లో సాంకేతిక లోపానికి గురైందని వైమానిక దళం తెలిపింది. ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. మిగ్ 29 విమానంలో మంటలు చెలరేగిన వీడియోను డిఫెన్స్ కోర్ అనే ఖాతా నుంచి షేర్ చేశారు. During a routine night training mission in Barmer sector, an IAF MiG-29 encountered a critical technical snag, forcing the pilot to eject. The pilot is safe and no loss of life or property was reported. A Court of Inquiry has been ordered.— Indian Air Force (@IAF_MCC) September 2, 2024మిగ్ 29 విమానం 1987 నుండి అంటే దాదాపు 36 సంవత్సరాలుగా భారత వైమానిక దళం సేవలో ఉంది. సోవియట్ యూనియన్ నుంచి భారత్ ఈ విమానాన్ని కొనుగోలు చేసింది. ఈ విమానాన్ని పలుమార్లు నవీకరించారు. విమానంలోని ప్రాథమిక నిర్మాణం మినహా దాదాపు ప్రతిదీ మార్చారు. ఇందులో కొత్త కాక్‌పిట్, నూతన రాడార్, కొత్త ఇంధన ట్యాంక్ ఉన్నాయి. కొత్త ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ కూడా అమర్చారు. కొత్త క్షిపణులను అమర్చడం ద్వారా దీనికి పూర్తిగా ఆధునిక రూపాన్నిచ్చారు.మిగ్ 29 వేగంగా దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఆరు నిమిషాల్లో లక్ష్యన్ని ఛేదించగలదు. కార్గిల్ యుద్ధ సమయంలో ఈ విమానం కీలక పాత్ర పోషించింది. బాలాకోట్ ఘటన సమయంలో కూడా తీవ్రవాద శిబిరంపై వైమానిక దాడిలో మిగ్ 29 పాల్గొంది. ఈ విమానంలో రెండు ఇంజన్లు ఉంటాయి. పరిమాణంలో చిన్నదిగా ఉన్నా చాలా చురుకైనది. ఇది నాల్గవ తరం యుద్ధ విమానం. గంటకు దాదాపు 2,500 కిలోమీటర్ల వేగంతో ఎగిరే సామర్థ్యం దీని సొంతం.Another crash this time IAF's MIG-29 in Barmer, Rajasthan. Pilot is safe, and no damage reported on the ground. More details to follow. pic.twitter.com/5hkXpUt9lY— Defence Core (@Defencecore) September 2, 2024 -
సీఎం చంద్రబాబు కోసం రప్పిస్తున్న హెలికాప్టర్ క్రాష్
సాక్షి, అమరావతి: ముంబై నుంచి బయల్దేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ పుణేలోని పౌద్ సమీపంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబై నుంచి విజయవాడ వస్తుండగా హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. అయితే, హెలికాప్టర్ కూలిన అనంతరం కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసమే హెలికాప్టర్‌ను ముంబై నుంచి విజయవాడకు రప్పిస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల రోజుల నుంచి మెయింటెన్స్‌లో ఉన్న హెలికాప్టర్‌ను ఆగమేఘాల మీద విజయవాడకు రప్పించే యత్నం చేశారు అధికారులు.ఏవియేషన్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడితోనే హెలికాప్టర్ విజయవాడకు బయలుదేరినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి హెలికాప్టర్‌ను రప్పించే యత్నాలు చేసినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ క్రాష్ కావడంతో ఏపీ అధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. హెలికాప్టర్ క్రాష్‌పై పోలీసులు, ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నాయి. -
అప్పుడు వై2కే బగ్‌తో అతలాకుతలం .. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్
20 ఏళ్ల క్రితం వై2కే బగ్ (దానికి మరో పేరు మిలీనియం బగ్) కంప్యూటర్లను గడగడలాడించింది. ఈ బగ్ వల్ల అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏ తరహా ఇబ్బందులు తలెత్తాయో ఇవాళ (జులై 19) మైక్రోసాఫ్ట్ సర్వర్లలో అలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ వై2కే బగ్ కథాకమామిషు ఏంటి? వై2కే బగ్‌కి క్రౌడ్ స్ట్రైక్‌కి ఏదైనా సంబంధం ఉందా?ప్రపంచంలోని అన్నీ దేశాల మైక్రోసాఫ్ట్ సర్వర్లలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పర్సనల్ కంప్యూటర్లలోని విండోస్-11, 10లో ఆపరేటింగ్ సిస్టమ్‌లో సమస్య తలెత్తింది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్‌తో నడుస్తున్న పీసీలు, ల్యాప్‌టాప్‌లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ప్రత్యక్షమవుతుంది. పలుమార్లు పీసీలు, ల్యాప్‌టాప్‌లు రీస్టార్ట్ అవుతున్నాయి. విండోస్‌లోని సాంకేతిక సమస్యలతో భారత్, అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. బోర్డింగ్ పాస్‌లను సైతం చేతి రాత ఉపయోగించాల్సి వచ్చింది. అయితే విండోస్‌లోని తలెత్తిన సమస్యల్ని పరిష్కరించాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మైక్రోసాఫ్ట్‌ను విజ్ఞప్తి చేస్తుండగా ..ఈ ప్రస్తుత పరిస్థితి 2000 ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పెట్టిన వై2కే బగ్ లాగా తీవ్ర ఆందోళనను రేకెత్తిచ్చింది. సర్వర్లలో తలెత్తిన సాంకేతిక సమస్యలకు మైక్రోసాఫ్ట్ పరిష్కారం చూపింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సమస్యలు అదుపులోకి వచ్చాయి. ఏంటి ఈ వై2కే బగ్?1960-1980లలో కంప్యూటర్ల ఆపరేటింగ్ సిస్టమ్ తయారుచేసే సమయంలో డేటా స్టోరేజీని ఆదా చేసేందుకు కంప్యూటర్ ఇంజనీర్లు సంవత్సరానికి రెండు అంకెల ‘19’ కోడ్‌ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 31,1999 తర్వాత కొత్త ఏడాది అంటే 2000 సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత పోగ్రామర్లు వినియోగించిన కోడ్‌ను 00గా భావించి 2000 ఏడాదిగా కాకుండా 1900గా కంప్యూటర్లు అర్థం చేసుకున్నాయి.ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే 100 సంవత్సరాలుగా తీసుకుని ప్రోగ్రామర్లు తేది పరిమాణాన్ని 100 సంవత్సరాలుగా తీసుకుని (1900 నుండి 1999 వరకు) ప్రోగ్రాం రాసారు. 1999 వరకు ఏ సమస్యా లేకుండా సాగిపోయింది. అయితే 2000వ సంవత్సరం రాగానే కంప్యూటర్లు దాన్ని 00గా పరిగణించాయి. ఏడాది 2000 అయితే ప్రోగ్రామర్లు ఫిక్స్ చేసిన 19 కోడ్ కారణంగా 1900 తీసుకున్నాయి. ఫలితంగా ఆ ఏడాది టెక్నాలజీ రంగం అతలాకుతలమైంది. ఇతర రంగాలు సైతం తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కున్నాయి. బగ్‌ను పరిష్కరించేందుకు ప్రోగ్రాం అందుబాటులోకి రావడంతో తాత్కాలిక ఉపశమనం లభించింది. కానీ పాత సంవత్సరం ముగిసి.. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత వై2కే కారణంగా కొత్త సమస్యలు ఉత్పన్నమవ్వడం సాధారణమేనని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. క్రౌడ్ స్ట్రైక్ వర్సెస్ వై2కే బగ్ఆ వై2కే బగ్‌కి తాజా మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో ఇబ్బందులకు ఏదైనా సంబంధం ఉందా అంటే లేదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ ప్రముఖ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇతర టెక్నాలజీ కంపెనీలకు, పలు ప్రభుత్వ విభాగాలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. తాజాగా నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్‌కు క్రౌడ్‌స్ట్రైక్ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. దాని ఫలితంగానే మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్‌లోని ఇబ్బందులు తలెత్తి సిస్టమ్‌లు షట్‌డౌన్ , రీస్టార్ట్ అవుతున్నాయని టెక్నాలజీ రంగ నిపుణులు చెబుతున్నారు. -
విషాదం: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్‌లో బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో చెట్టును ఢీకొట్టిన బస్సు రెండుగా విడిపోయింది. ఈ ఘటనలో బస్సు శిథిలాల్లో చిక్కుకుని ప్రయాణికులు మృతి చెందారు. శిథిలాల్లో చిక్కుకున్న భాధితులను బయటకు తీశారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఇదీ చదవండి: రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత? -
మెదక్ జిల్లా తూప్రాన్ లో కుప్ప కూలిన ట్రైనింగ్ జెట్ విమానం
-
230 కిలోమీటర్ల వేగంతో రోల్స్ రాయిస్ బీభత్సం
చంఢీగడ్: హర్యానాలోని నూహ్‌లో దారుణం జరిగింది. జాతీయ రహదారిపై రోల్స్ రాయిస్ కారు ఓ ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ట్యాంకర్ యూటర్న్ తీసుకునే క్రమంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని వెల్లడించారు. కారు, ట్యాంకర్ రెండు కూడా ఒకే దారిలో వస్తున్నాయి. ఈ క్రమంలో ట్యాంకర్ యూటర్న్ కోసం నిలిచి ఉంది. వెనకే ఉన్న రోల్స్ రాయిస్ దాదాపు గంటకు 230 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. అదుపుతప్పి నిలిచి ఉన్న ట్యాంకర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు, ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెనకే మరో కారులో వస్తున్న బాధిత కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ ఇక ఆ బంగ్లాకు వెళ్లలేరు.. ఎందుకంటే..? -
పొలాల్లో కుప్పకూలిన డీఆర్డీఓ డ్రోన్.. దృశ్యాలు వైరల్..
బెంగళూరు: రక్షణ శాఖ(డీఆర్డీఓ)కు చెందిన డ్రోన్ కుప్పకూలింది. కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో పంట పొలాల్లో ఈ మానవ రహిత డ్రోన్ కూలిపోయింది. ప్రమాద ఘటనకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాద ప్రదేశానికి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు గుమిగూడారు. #WATCH | A Tapas drone being developed by the DRDO crashed today during a trial flight in a village of Chitradurga district, Karnataka. DRDO is briefing the Defence Ministry about the mishap and an inquiry is being carried out into the specific reasons behind the crash: Defence… pic.twitter.com/5YSfJHPxTw — ANI (@ANI) August 20, 2023 డీఆర్డీఓ మానవ రహిత డ్రోన్లపై పరిశోధనలో భాగంగా.. ఆదివారం తాపస్ అనే డ్రోన్‌ను ట్రయల్ రన్ చేశారు. ఈ క్రమంలో అది కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దీనిపై రక్షణ శాఖ దర్యాప్తు చేపడుతోంది. ప్రమాద స్థలంలో డ్రోన్ ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: చంద్రయాన్-3: చంద్రుడికి అడుగు దూరంలో ఇస్రో ‘విక్రమ్’.. ఇక చివరి ఘట్టం అదే -
రైలు టిక్కెట్ బుకింగ్ సర్వీసులో సాంకేతిక లోపం
-
మోదీ వెనకచూపు!
న్యూయార్క్: ‘‘ప్రధాని మోదీ భారతీయ కారును రియర్‌వ్యూ అద్దంలో చూస్తూ నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి’’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీకి గానీ, ఆర్ఎస్ఎస్కి గానీ భవిష్యత్తులోకి చూడగలిగే సామర్థ్యం లేదని విమర్శించారు. ఆయన ఆదివారం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్–అమెరికా విభాగం ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని జవిట్స్ సెంటర్లో భారతీయ అమెరికన్లనుద్దేశించి మాట్లాడారు. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు అసమర్థులు. ఏదడిగినా గతం తవ్వుతారు. ఒడిశా రైలు ప్రమాదం లాంటివి ఎందుకు జరుగుతున్నాయని అడిగితే ‘50 ఏళ్లనాడు కాంగ్రెస్ అలా చేసినందుకే...’ అంటారు. పీరియాడిక్ టేబుల్‌ను పాఠ్య పుస్తకాల్లోంచి ఎందుకు తీసేశారంటే 60 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఇలా చేసిందని చెబుతారు’’ అని చెణుకులు విసిరారు. ‘‘రియర్ మిర్రర్లో చూస్తూ కారు నడిపితే వరుస ప్రమాదాలు ఖాయం. మోదీ అలవాటు అదే. భారతీయ కారును సైడ్ మిర్రర్లో మాత్రమే చూసుకుంటూ నడుపుతున్నారు. అది ముందుకు పోకుండా ప్రమాదాలెందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకోవడం లేదు’’ అన్నారు. -
షాకింగ్ ఘటన.. ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం
జార్ఖండ్: ధన్బాద్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్లైడర్ విమానం ఇంట్లోకి దూసుకెళ్లింది. బార్వాడా ఎయిర్‌స్ట్రిప్ నుంచి టేకాప్ అయిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ సహా పద్నాలుగేళ్ల బాలుడు గాయపడ్డారు. ధన్‌బాద్‌లోని బర్వాడ్డ ఏర్స్ట్రిప్ నుంచి చిన్న విమానం బయలుదేరింది. టేక్ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఎయిర్‌పోర్టుకు ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టగా, అందులో ఉన్న పైలట్, బాలుడు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇంటి యజమాని తెలిపారు. చదవండి: అమృత్‌పాల్ కేసులో ఊహించని ట్విస్ట్.. ఆమె అరెస్ట్ -
షాకింగ్ ప్రమాదం: జనాల మీదకు దూసుకొచ్చిన టెంపో, ఆపై..
-
షాకింగ్ ఘటన:రెస్టారెంట్లోకి దూసుకొచ్చిన టెంపో..ముగ్గురికి గాయాలు
గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఒక టెంపో హైవేకి సమీపంలో ఉన్న ధాబా (రోడ్డు సైడ్ రెస్టారెంట్)లోకి దూసుకొచ్చింది. సరిగ్గా ఆ సమయంలో రెస్టారెంట్లో సుమారు 8 నుంచి 10 మంది దాక కస్టమర్లు ఉన్నారు. ఈ అనుహ్య ఘటనలో ముగ్గరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ టెంపో అదుపు తప్పి వేగంగా ధాభాలోకి దూసుకురావడంతో రెస్టారెంట్‌లోని గోడను ఢీకొట్టి ఫర్నీచర్‌ని ధ్వంసం చేస్తూ..పలువురు పైకి దూసుకుపోయింది. ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అవ్వడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే ఆ సమయంలో టెంపో ఖాళీగానే ఉందని డ్రైవర్ మాత్రం తప్పించుకున్నాడని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. સરોલીમાં વિચિત્ર અકસ્માત સર્જાયો છે. સરોલીમાં આવેલ બાપા ના બગીચા નામના ઢાભામાં બુલેરો પિકઅપ વાન ઘુસી જતા 3 લોકો કચડાયા@CP_SuratCity @TrPoliceSurat #ACCIDENT #suratcity #Surat pic.twitter.com/dumHqOW9OW — journalist Sharif Shaikh (@PatrkarShaikh) December 19, 2022 (చదవండి: గుంజీలు తీయండి..ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందండి) -
కొంపముంచిన ఫెడ్: దలాల్ స్ట్రీట్ ఢమాల్!
సాక్షి,ముంబై: అమెరికా ఫెడ్ వ్యాఖ్యలు, అంతర్జాతీయ, భారతీయ మార్కెట్ల కొంప ముంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 879 పాయింట్లు పతనమై 61,799 వద్ద నిఫ్టీ 1.32 శాతం పతనమై 18,415 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు కొనసాగాయి. తద్వారా సెన్సెక్స్ 62 వేలు, నిఫ్టీ 18500 కిందికి చేరాయి. బ్యాంకింగ్, ఐటీ, మెటల్, రియాల్టీ షేర్లు భారీగా నష్టపోగా ముఖ్యంగా రిలయన్స్ టాప్ లూజర్‌గా ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును మరోసారి పెంచింది. అంతేకాదు ద్రవ్యోల్బణం అధికంగానే ఉందనీ, ఈ నేపథ్యంలో భవిష్యత్తులోనూ వడ్డీ రేట్ల పెంపు ఉండే అవకాశం ఉందన్న ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో గుబులు రేపాయి. ఫలితంగా అమ్మకాలు వెల్లువెతాయి. బ్రిటానియా, హీరో మోటో, ఎస్బీఐలైఫ్, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎండ్ , సన్‌ఫార్మా లాభ పడగా, టెక్ మహీంద్ర, టైటన్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐఫర్ మోటార్స్ హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 34 పైసలు పతనమై 82.76 వద్దకు చేరింది. -
భారీ పతనం, 62వేల దిగువకు సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 737 పాయింట్లు కుప్ప కూలగా నిఫ్టీ 200 పాయింట్లు క్షీణించింది. తద్వారా సెన్సెక్స్ 62 వేలు, నిఫ్టీ 18500 కిందికి చేరాయి. దాదాపు అన్నిరంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ టాప్ లూజర్‌గా ఉంది. బ్రిటానియా, హీరో మోటో, ఎస్బీఐలైఫ్, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎండ్ లాభపడుతుండగా, టెక్ మహీంద్ర, టైటన్, ఇన్ఫోసిస్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 34 పైసలు పతనమై 82.7 4 వద్దకు ఉంది. -
మరో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్: ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని మిగ్గింగ్ సమీపంలో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) కూలిపోయింది. శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని గౌహతి డిఫెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విషాదాన్ని నింపిన ఇటీవలి ప్రమాదం నేపథ్యంలో మరింత ఆందోళన నెలకొంది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలోని గానం గ్రామం సమీపంలో మిలిటరీ చిరుత హెలికాప్టర్ కూలి పోయిందని తెలిపారు. కాగా అక్టోబరు 5న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సమీపంలో ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. Received very disturbing news about Indian Army’s Advanced Light Helicopter crash in Upper Siang District in Arunachal Pradesh. My deepest prayers 🙏 pic.twitter.com/MNdxtI7ZRq — Kiren Rijiju (@KirenRijiju) October 21, 2022 -
కొత్త కారుతో గ్రాండ్ ఎంట్రీ .... పల్టీ కొట్టిందిగా!
ఒక వ్యక్తి కొత్త కారుతో గ్రాండ్‌గా ఎంటీ ఇస్తున్నాడు. కానీ అతనికి కొత్త కారుతో వచ్చిన ఆనందం కాస్త చేదు అనుభవాన్ని మిగిల్చింది. బ్రాండెడ్ టాటా నెక్సాన్ కారుతో చక్కటి పూల దండతో అలకరింపబడి ఉన్న కారుతో ఇంటికి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఐతే సెక్యూరిటీ గార్డు కూడా గేట్ తీసి చక్కగా దారి ఇచ్చాడు కూడా. కానీ సదరు వ్యక్తి కారుని లోపలి పోనిచ్చి పక్కనే పార్క్ చేసిన బైక్‌లపైకి పోనిచ్చాడు. దీంతో కారు ఆ బైక్లన్నింటిని ఢీ కొడుతూ ఒక పక్కకు పల్టీ కొట్టబోయింది. ఇంతలో సెక్యూరిటీ గార్డు పరిగెత్తుకుంటూ వచ్చి సదరు కారు నడుపుతున్న వ్యక్తికి సాయం అందిస్తాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని వినోద్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. What a grand arrival home ? pic.twitter.com/ilSeNcKexD — Sqn Ldr Vinod Kumar (Retd) (@veekay122002) October 7, 2022 (చదవండి: విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు) -
బ్లాక్ ఫ్రైడే: మార్కెట్లు ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో బాగా నష్టపోయిన సూచీలు మిడ్‌సెషన్‌లో మరింత కుదేలయ్యాయి. సెన్సెక్స్ 1116 పాయింట్లు కుప్ప కూలింది. నిఫ్టీ 329 పాయింట్లు పతనమైంది. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల వెల్లువెత్తాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో సెన్సెక్స్ 59000 దిగువకు పడిపోయింది. టాటా స్టీల్, సన్ ఫార్మా, హిందుస్తాన్ హెచ్‌సీఎల్ టెక్, టైటన్, మారుతీ సుజుకీ స్టాక్స్ లాభాల్లో ఉండగా, ఇండస్ఇండ్ బ్యాంక్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. టాటా స్టీల్ బోర్డు తన గ్రూప్ కామ్‌లోని ఏడుకంపెనీల విలీన పథకానికి శుక్రవారం ఆమోదం తెలిపింది. -
బ్లాక్ ఫ్రైడే, మార్కెట్లో బ్లడ్ బాత్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. అంతర్జాతీయప్రతికూల సంకేతాల నేపథ్యంలో కీలక సూచీసెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లకు పైగా కుప్పకూలింది. వారాంతంలో దాదాపు రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 1098 పాయింట్లు కుప్పకూలి 58840వద్ద, నిఫ్టీ 346 పాయింట్లు పతనంతో 17530 వద్ద ముగిసాయి. వరుసగా మూడో సెషన్లో వచ్చిన నష్టాలతో సెన్సెక్స్ చివరికి 59వేల స్థాయిని కోల్పోయింది. నిఫ్టీ 18వేల స్థాయి దిగువకు చేరింది. ఇండస్ ఇండ్ బ్యాంకు, సిప్లా తప్ప మిగిలిన షేర్లన్నీ నష్టపోయాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అటు డాలరు మారకంలో రూపాయి 5 పైసల నష్టంతో 79.74 వద్ద ముగిసింది. -
శిక్షణ విన్యాసాల్లో అపశ్రుతి.... హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
కాబూల్: అప్గనిస్తాన్‌లో కాబూల్ శిక్షణా విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమెరికా తయారు చేసిన బ్లాక్‌హాక్ ఛాపర్ కూలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఒక అనుభవం లేని తాలిబన్ పైలెట్ ఆ అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన సంభవించింది. తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగనట్లు ధృవీకరించింది. ఈ ఛాపర్‌ని శిక్షణా విమానంగా పేర్కొంది. అయితే మంత్రిత్వశాఖ అదనంగా ఐదుగురు చనిపోయారని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి యునైటెడ్ స్టేట్స్ 2002 నుంచి 2017 మధ్య సుమారు రూ. 2 లక్షల కోట్లు విలువైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నైట్ విజన్ పరికరాలు, విమానాలు, నిఘా వ్యవస్థలతో సహా అఫ్గాన్ ప్రభుత్వానికి రక్షణాయుధాలను పంపింది. (చదవండి: ప్రపంచంలో అత్యంత వృద్ధ రైల్వే యూనియన్ నాయకుడిగా రికార్డు) -
ఐపీవోల్లో పెట్టుబడులు పెడుతున్నారా? ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
లిస్టింగ్‌లోనే 100 శాతం లాభం. మరొకటి లిస్టింగ్ రోజే 150 శాతం లాభం ఇచ్చింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో) గురించి ఈ తరహా వార్తలు వింటుంటే రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఐపీవోలో షేర్లు అలాట్ అయితే లాభాల పంట పండినట్టే! అన్న వేలంవెర్రి కొన్ని సందర్భాల్లో మార్కెట్లో కనిపిస్తుంటుంది. కానీ, ఇది అన్ని వేళలా ఉండే ధోరణి కాదు. బుల్ మార్కెట్ యూటర్న్ తీసుకుంటే, అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటే అంచనాలు తప్పుతాయి. నష్టాలు పలకరిస్తాయి. గతేడాది మార్కెట్ల ర్యాలీ సమయంలో ఐపీవోల పట్ల ఇన్వెస్టర్లలో విపరీతమైన యూఫోరియా నెలకొంది. 2022 వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది. స్టాక్స్ భారీ పతనంతో ఆ యూఫోరియా ఆవిరైపోయింది. మార్కెట్లో ఈ రకమైన అస్థిరతలు ఎప్పుడూ ఉంటాయి. అందుకే మార్కెట్లో నిలిచి గెలవాలంటే, పెట్టుబడులన్నవి లక్ష్యాలకు అనుగుణంగానే ఉండాలనేది నిపుణుల మాట. ఐపీవోల్లో పెట్టుబడి విషయంలో ఇన్వెస్టర్లు పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయాలను తెలియజేసే కథనమిది... జొమాటో షేరు ఐపీవో ఇష్యూ ధర రూ.76. లిస్టింగ్ ధర రూ.115. అక్కడి నుంచి రూ.169 వరకు వెళ్లింది. రూ.140 ధరలో ఉన్నప్పుడు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ రూ.175 వరకు పెరుగుతుందని లక్ష్యాన్ని ఇచ్చింది. కానీ, ఒక జొమాటో షేరుకు రూ.41 మించి పెట్టడం దండగని వ్యాల్యూషన్ గురువుగా ప్రసిద్ధి చెందిన అశ్వత్ దామోదరన్ ఐపీవో సమయంలోనే సూచించారు. సరిగ్గా ఆయన చెప్పినట్టు జొమాటో ఇటీవలే రూ.40.55కు పడిపోయి అక్కడి నుంచి కోలుకుంది. ఆ సందర్భంలో జొమాటో సహేతుక విలువ రూ.35 అంటూ దామోదరన్ సవరించారనుకోండి. ఒక్క జొమాటోనే అని కాదు. న్యూఏజ్ వ్యాపారాల్లో ఉన్న అన్ని ఐపీవోలు లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చినవే. అందుకే లాభాల వెర్రితనం కాకుండా.. విలువలకు ప్రాధాన్యం ఇచ్చి ఇన్వెస్ట్ చేయడం ద్వారానే విలువైన క్యాపిటల్‌ను కాపాడుకోవచ్చని మార్కెట్ పండితుల సూచన. 2021 జూలైలో జొమాటో ఐపీవోకు వచ్చింది. బ్లాక్‌బస్టర్‌గా 38 రెట్లు అధిక స్పందన అందుకుంది. రూ.9,000 కోట్ల ఐపీవోకు ఈ స్థాయి స్పందన అంటే చిన్నదేమీ కాదు. లిస్టింగ్‌లోనే 64 శాతం లాభాన్ని పంచింది. నైకా అయితే లిస్టింగ్ రోజే 96 శాతం లాభాలను ఇచ్చింది. ‘‘ఐపీవోలో ఒక కంపెనీ జారీ చేసే షేరు ధరను నిర్ణయించే విధానం ఈ ఏడాది మార్చి 31వరకు వేరుగా ఉంది. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు సైతం నిధుల లభ్యత దండిగా ఉంది. దీంతో వారు రుణం తీసుకుని మరీ ఐపీవోలకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో రెట్ల అధిక స్పందనతో రిస్క్ తీసుకునే ధోరణి పెరిగి ఆయా షేర్ల ధరల వృద్ధికి దారితీసింది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఐపీవో నిబంధనల్లో మార్పు చోటు చేసుకుంది. దీంతో ఆ తర్వాత నుంచి వచ్చిన ఐపీవోల్లో కేవలం ఒక్క ఇష్యూలోనే అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్ల కోటా (హెచ్ఎన్ఐలు) డబుల్ డిజిట్లో సబ్స్క్రయిబ్ కావడం గమనించాలి’’అని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థ ‘క్రిస్’ డైరెక్టర్ అర్జున్ కేజ్రీవాల్ తెలిపారు. గతేడాది ఐపీవోకు వచ్చిన, కొత్తగా లిస్ట్ అయిన వాటిల్లో అధిక శాతం గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా పడిపోవడాన్ని గమనించొచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో ముఖ్యంగా గడిచిన ఆరు నెలల్లో ఇవి ఎక్కువ నష్టాలను చవిచూశాయి. ఎన్నో ఉదాహరణలు... ప్రస్తుతం జొమాటో ధర (రూ.60)ను చూస్తే గరిష్ట స్థాయి (రూ.169) నుంచి 60 శాతానికి పైగా తగ్గినట్టు తెలుస్తుంది. పాలసీబజార్ (పీబీ ఫిన్‌టెక్) గరిష్ట ధర (రూ.1,470) నుంచి చూస్తే 65 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. నైకా (ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్) గరిష్ట ధర రూ.2,574 కాగా, 47 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. ఇక పేటీఎం అయితే ఇష్యూ ధర రూ.2,150 కాగా, 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,961 మాత్రమే. ఈ ధర నుంచి చూస్తే 60 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. భారీ నష్టాల్లో ఉన్న న్యూఏజ్ కంపెనీలు, టెక్నాలజీ సంస్థలు ఐపీవోలకు వచ్చి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించడాన్ని చూశాం. ఆన్లైన్ ఫార్మసీ సంస్థ ఫార్మ్ఈజీని ప్రమోట్ చేస్తున్న ఏపీఐ హోల్డింగ్స్ కూడా నష్టాల్లో నడుస్తున్నదే. ఈ సంస్థ కూడా ఐపీవోకు దరఖాస్తు పెట్టుకుంది. కానీ, న్యూఏజ్ వ్యాపార కంపెనీల షేర్లు పేకమేడల్లా కూలిపోతున్న తరుణంలో, ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో ఐపీవోకు రావడం తగదని భావించి ఇటీవలే తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఈ తరహా షేర్ల వ్యాల్యూషన్ నిర్ణయ విధానం సంప్రదాయానికి భిన్నమైనది. వ్యాపారంలో భారీ వృద్ధి, భవిష్యత్తులో వచ్చే లాభాల అంచనాల ఆధారంగా వీటి షేర్ల ధర నిర్ణయమవుతుంటుంది. సుదీర్ఘకాలం పాటు (5–10–15–20 ఏళ్లు) వేచి చూస్తేనే.. ఇవి నిలిచి గెలుస్తాయా? లాభాలు కురిపిస్తాయా? అన్నది తేలుతుంది. కానీ, వీటిపై పెద్దగా అవగాహన లేని, ప్రణాళిక లేని ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాల కోసం, స్వల్పకాల లాభాల కోసం వీటికి దరఖాస్తు చేసుకుని నష్టపోయారు. అంతెందుకు ఎల్ఐసీ ఐపీవోనే తీసుకుందాం. దేశవ్యాప్తంగా అధిక శాతం ఇన్వెస్టర్లలో మంచి అంచనాలే ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు, పాలసీదారులకు ఇష్యూ ధరలో డిస్కౌంట్ కూడా లభించింది. కానీ, లిస్టింగ్‌లో నిరాశపరించింది. అంతేకాదు, ఆ తర్వాత నుంచి అది నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. ఒక్కో షేరు జారీ ధర రూ.949 కాగా, బీఎస్ఈలో నమోదైన గరిష్ట ధర రూ.920. అక్కడి నుంచి 30 శాతం నష్టపోయి రూ.700కు దిగువన ట్రేడ్ అవుతోంది. ఎల్ఐసీ బీమా రంగంలో గొప్ప కంపెనీ. భారీ లాభాల్లో ఉన్న బ్లూచిప్ సంస్థ. ఆ రంగంలో లీడర్. అయినా కానీ లిస్టింగ్‌లో లాభాలు పంచలేకపోయింది. దీనికి కారణం ప్రతికూల మార్కెట్ పరిస్థితులకుతోడు, ఎల్ఐసీ అధిక వ్యాల్యూషన్పై ఐపీవో రావడాన్ని కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం కోసం ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఈ నష్టాల బెడద ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ మన దేశంలో బీమా వ్యాప్తి 5 శాతం మించలేదు. కనుక భవిష్యత్తులో వ్యాపార వృద్ధి అవకావాలు దండిగా ఉన్నాయి. అయినా కానీ, స్వల్పకాలంలో లాభాలకు ఇక్కడ హామీ ఉండదు. ఎందుకంటే..? ఇటీవలి ఐపీవోల్లో ఇన్వెస్టర్ల చేతులు కాలడం వెనుక నిపుణులు ప్రధానంగా.. ఆయా కంపెనీల ఫండమెంటల్స్‌కు తోడు, స్థూల ఆర్థిక వాతావరణం అనుకూలంగా లేకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘‘గతేడాది వ్యవస్థలో నగదు లభ్యత పుష్కలంగా ఉంది. దీంతో కొత్త టెక్నాలజీ కంపెనీల ధరలను పరుగుపెట్టించింది. ఇప్పుడు నగదు లభ్యత కఠినతరంగా మారింది. వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ షేర్లపై ప్రభావం పడింది’’అని హేమ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ఆస్తాజైన్ పేర్కొన్నారు. వీటి వైపు చూడొచ్చా..? కంపెనీల ఆర్థిక మూలాల ఆధారంగా పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోవడం రిటైల్ ఇన్వెస్టర్లకు రక్షణాత్మకం అని భావించొచ్చు. ‘‘జొమాటో షేరును గతేడాది ఇష్టపడని వారు లేరు. కానీ, ఇప్పుడు దీనికి అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే నికరంగా నష్టాలనే ఇచ్చింది. బ్లింకిట్ కొనుగోలుతో లాభాల్లోకి రావడానికి మరింత సమయం పడుతుంది. యాజమాన్యం ఫుడ్ డెలివరీ వ్యాపారంలో బ్రేక్ ఈవెన్‌కు సంబంధించి అంచనాలను ప్రకటించింది. ఈ విషయంలో ఇన్వెస్టర్లకు కూడా సందేహం లేదు. దీర్ఘకాల ఇన్వెస్టర్లు కొనుగోలుకు ఇదొక మంచి ఉదాహరణ అవుతుంది’’అని జెఫరీస్ తన నివేదికలో ప్రస్తావించింది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ గత నెలలో నైకా షేరుకు బై రేటింగ్ ఇచ్చింది. మార్కెటింగ్‌పై అధిక వ్యయాలతో మార్జిన్లు తగ్గుతున్నందున ఇదే నైకా స్టాక్‌కు రెడ్యూస్ (తగ్గించుకోవడం) రేటింగ్‌ను ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ప్రకటించింది. పేటీఎం, ఎల్ఐసీకి మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బై రేటింగ్ ఇచ్చింది. పాలజీబజార్కు కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ బై రేటింగ్ ఇచ్చింది. తిరిగి ఈ కంపెనీలు పూర్వపు ఆదరణ సంపాదించుకోవడానికి కొంత సమయం పడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ‘‘ఈ కంపెనీల మూలాలు మెరుగుపడాల్సి ఉంది. స్థూల ఆర్థిక వాతావరణం కూడా అనుకూలించాలి’’అని ఆస్తాజైన్ పేర్కొన్నారు. మిస్ అయిపోతామన్న భయం వద్దు ఒక స్టాక్‌ను మిస్ అయిపోతామన్న ధోరణి (ఫోమో)కి దూరంగా ఉండాలన్నది స్టాక్ మార్కెట్ల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠంగా సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ‘టీబీఎంజీ క్యాపిటల్’ వ్యవస్థాపకుడు తరుణ్ బిరానీ తెలిపారు. ఈ విధమైన ధోరణిని అనుసరించకుండా, ఆర్థిక లక్ష్యాలకు కట్టుబడి ఉంటే అది ప్రయోజనాన్ని ఇస్తుందని చెప్పారు. ఇన్వెస్టర్లకు స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి, కావాల్సిన క్యాపిటల్ ఉంటే లాభాలను ఇవ్వదు. లక్ష్యాలు, కాల వ్యవధి పట్ల స్పష్టత ఉండాలి. అప్పుడు తమ కాలవ్యవధి, రాబడుల అంచనాలకు అనుకూలమైన స్టాక్స్‌లో పెట్టుబడి చేసుకోవచ్చు. ఐదేళ్లు లేదా పదేళ్ల కోసం, భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తుందన్న అంచనాలతో ఐపీవోలో ఇన్వెస్ట్ చేస్తే, లిస్టింగ్ తర్వాత నష్టాల్లోకి వెళ్లిందని విక్రయించాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు లాభాల్లోకి వస్తామన్నది తమకు తెలియదని జొమాటో ఫౌండర్ గోయల్ ఐపీవో ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. దీర్ఘకాలం కోసమే తాము వ్యాపారాన్ని నిర్మిస్తున్నామనే అంటున్నారు. కనుక దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసిన వారు ఇప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. ∙ కొందరు లిస్టింగ్ రోజు లాభం వస్తే విక్రయించుకోవచ్చన్న ఒకే ఆలోచనతో డిమాండ్ ఉన్న ఐపీవోల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుంటారు. అటువంటి వారు లిస్టింగ్ రోజు లాభం వచ్చినా, నష్టం వచ్చినా సరే విక్రయించుకోవాల్సిందే. జొమాటో ఐదేళ్లలో లాభాల్లోకి వస్తుందని అంచనా వేసుకుని ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పటి వరకు వేచి చూసి, కంపెనీ ఫండమెంటల్స్, భవిష్యత్తు ఆధారంగా నిర్ణయానికి రావాలి. స్టాక్స్ ఎప్పుడూ పడి లేచే కెరటాలే. కాకపోతే మంచి యాజమాన్యం, బలమైన వ్యాపార మూలాలు ఉన్న కంపెనీలకే ఇది అమలవుతుంది. ఇక అసలు నష్టాల్లో ఉన్న కంపెనీల జోలికి వెళ్లకపోవడం రిస్క్ వద్దనుకునే వారికి మెరుగైన మార్గం. వివిధ రంగాల్లో లీడర్లుగా ఉన్న బ్లూచిప్ కంపెనీల్లో రిస్క్ దాదాపుగా ఉండదు. రాబడులు మోస్తరుగా ఉంటాయి. అధిక రాబడి ఆశించే వారు, అధిక రిస్క్ తీసుకుంటున్నట్టే. అది కూడా తగినంత అధ్యయనం, నిపుణుల సూచనల ఆధారంగా కాలిక్యులేటెడ్ రిస్క్‌కే పరిమితం కావాలి. -
బెంబేలెత్తిస్తున్న కరోనా, అక్షరాల రూ.14 లక్షల కోట్లు బూడిద పాలు
గత కొద్ది రోజులుగా దేశీయ మార్కెట్లు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం స్టాక్మార్కెట్లో లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. ఒకానొక దశలో ఎన్ఎస్ఇ నిఫ్టీ 18,604 పాయింట్లతో రికార్డు సృష్టించింది. దీంతో ఇన్వెస్టర్లకు కొంత ఊరట లభిస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ సౌతాఫ్రికా కొత్త వేరియంట్ భయం దేశీయ మార్కెట్లపై చూపించడంతో సూచీలు 8% క్షీణించి దాదాపు రూ.14 లక్షల కోట్లు బూడిపాలయ్యాయి. ఒకానొక సమయంలో మార్కెట్లో ట్రేడింగ్ కొనసాగే సమయంలో టాటా మోటార్స్, ఓఎన్జీసీ, హిందాల్కో, బీపీసీఎల్ స్టాక్స్ భారీఎత్తున నష్టపోయాయి. ఎన్ఎస్ఈ అధికారిక లెక్కల ప్రకారం..మార్కెట్ ప్రారంభంలో టాటా మోటార్స్ 4శాతం, ఓఎన్జీసీ 3.9శాతం నష్టపోయాయి. నిఫ్టీ 50లో ఫార్మా షేర్లు సిప్లా, డాక్టర్ రెడ్డిస్ షేర్లు నష్టాల్ని చవి చూశాయి. దీంతో దేశీయ మార్కెట్‌కు రూ.6.5లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. కొత్త వేరియంట్‌తో భయం భయం దక్షిణాఫ్రికా కొత్త కరోనా వేరియంట్ ఆ దేశ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మింట్ నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అందుకు ఈ కరోనా కొత్త వేరియంట్ B.1.1.529 కారణమని తెలుస్తోంది. హాంకాంగ్‌లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడంతో..సైంటిస్ట్‌లు ఈ కొత్త వేరియంట్‌ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త వేరియంట్ వేగంగా విజృంభించే అవకాశం ఉందని,జాగ్రత్తగా ఉండాలని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఇదే భయం ఇతర దేశాలలోని మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. దీంతో సౌతాఫ్రికా కొత్త వేరియంట్ ప్రభావం ప్రపంచ దేశాల మార్కెట్లలో మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఐపీవో ఎఫెక్ట్.. ఏకంగా బిలియనీర్ అయ్యాడు -
అదుపు తప్పి వాగులో పడిన లారీ
అనంతపురం జిల్లా: ముదిగుబ్బ మండలం దొరిగిల్లు వద్ద ఓ లారీ అదుపు తప్పి వాగులోకి పడింది. జిల్లెడువాగులో ఈ ఘటన చోటుచేసుకుంది. కదిరి ప్రాంతంలో భారీ వర్షం నమోదు కావటంతో గొల్లపల్లి వద్ద నిన్న కారు వాగులో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పులివెందుల-కదిరి మధ్య వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దొరిగిల్లు మీదుగా పులివెందులకు వాహనాలు వెళ్తున్నాయి. ఇదే నేపథ్యంలో జిల్లెడువాగు దాటుతూ టెన్ టైర్ లారీ ఒకటి అదుపు తప్పి కిందకు పడిపోయింది. డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. ఇవీ చదవండి: 6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు సాక్షి ఎఫెక్ట్: సబ్ రిజిస్ట్రార్ సురేష్ ఆచారి సస్పెన్షన్ -
రాజస్థాన్‌లో కుప్పకూలిన సైనిక విమానం
జైపూర్: భారత వాయుసేన (ఎయిర్ ఫోర్స్-ఐఏఎఫ్)కు చెందిన మిగ్-21 బైసన్ విమానం రాజస్థాన్‌లో కుప్పకూలింది. అయితే అందులో పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాజస్థాన్‌లోని బర్మార్‌లో బుధవారం సాయంత్రం ఆకాశానికి ఎగిరిన విమానం 5.30 గంటల సమయంలో కూలిందని భారత వాయుసేన (ఐఏఎఫ్) ప్రకటించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. (చదవండి: ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేశారని విషం తాగిన టీచర్లు) కాగా మిగ్ విమానాలు కూలడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది మే 21వ తేదీన శిక్షణ విమానం పంజాబ్‌లోని మోగా జిల్లాలో కూలింది. ఆ ఘటనలో స్కా్వడ్రన్ లీడర్ అభినవచౌదరి మృతి చెందారు. ఇదే సంవత్సరం మార్చిలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మిగ్-21 బైసన్ జెట్ విమానం టేకాఫ్ అవుతుండగా కూలిపోగా ఒకరు మరణించారు. జనవరిలో రాజస్థాన్‌లోని సూరత్గడ్లో మిగ్-21 బైసన్ విమానం టేకాఫ్ అయ్యి శ్రీగంగానగర్ జిల్లాలో కూలింది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా జరిగిన ఘటన నాలుగోది. మిగ్-21 విమానాలు ప్రమాదానికి గురవడంపై వాయుసేన దర్యాప్తు చేస్తోంది. చదవండి: శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్ రిలీఫ్ At around 1730 hrs today, an IAF MiG-21 Bison aircraft airborne for a training sortie in the western sector, experienced a technical malfunction after take off. The pilot ejected safely. A Court of Inquiry has been ordered to ascertain the cause. — Indian Air Force (@IAF_MCC) August 25, 2021 -
ఆ నిండు ప్రాణాలు పోవడానికి కారణం అదే!
తిరుత్తణి: బైకును, కారు ఢీకొన్న ప్రమాదంలో తండ్రీ కొడుకు ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుత్తణి శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. తిరుత్తణి సమీపంలోని మురుక్కంపట్టు గ్రామానికి చెందిన లోకనాథన్(42) ప్రభుత్వ బస్సు కండెక్టర్. మంగళవారం రాత్రి తిరుత్తణి నుంచి గ్రామానికి బైకులో తండ్రి దేశప్పరెడ్డితో కలిసి వెళ్తుండగా చెన్నై – తిరుపతి జాతీయ రహదారి మురుక్కంపట్టు వద్ద తిరుపతి నుంచి తిరుత్తణి వైపు వేగంగా వెళ్తున్న కారు బైకును ఢీకొంది. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న తండ్రీ కొడుకులిద్దరూ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్ పరారయ్యాడు. అయితే తమ గ్రామం వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోక పోవడంతోనే రెండు ప్రాణాలు పోయాయని, వెంటనే కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. దీంతో చెన్నై–తిరుపతి జాతీయ రహదారిలో దాదాపు రెండు గంటల పాటు వాహన రాకపోకలు స్తంభించాయి. పోలీసుల హామీతో గ్రామస్తులు ధర్నా విరమించారు. -
కరోనా సెకండ్ వేవ్: కుప్పకూలిన మార్కెట్
సాక్షి,ముంబై: రెండో దశలో దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్ ఆరంభంలోనే భారీ పతనాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ 916, నిఫ్టీ 276 పాయింట్ల మేర నష్టపోయాయి. అనంతరం మరింత క్షీణించిన సెన్సెక్స్ 1160 పాయింట్ల నష్టంతో 48430 వద్ద, నిఫ్టీ 354 పాయింట్లు పతనమై 14482 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల దెబ్బతో కుప్పకూలాయి. నిఫ్టీ బ్యాంకు కూడా దాదాపు 1200 పాయింట్లు క్షీణించింది. సెన్సెక్స్ 1353పాయింట్ల నష్టంతో 484237వద్ద, నిఫ్టీ 411 పాయింట్లు పతనమై 14423 వద్ద కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ 48300, నిఫ్టీ 14500 స్థాయిని కూడా కోల్పోయి మరింత బలహీన సంకేతాలనందించాయి. దేశంలో కరోనా ఉధృతి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితంగా చేస్తోంది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలోనూ భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. (ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా...అయితే మీకో శుభవార్త!) కేసుల నమోదులో సరికొత్త రికార్డు: కాగా తాజా గణాంకాల ప్రకారం దేశంలో 168012 కొత్త పాజిటివ్ కేసులో నమోదయ్యాయి. కరోనా కేసుల నమోదుకు సంబంధించి సరికొత్త రికార్డుతో మరింత బెంబేలెత్తిస్తున్నాయి. -
పొలంలో కుప్పకూలిన విమానం
భోపాల్: పైలెట్లతో వెళ్తున్న విమానం ప్రమాదవశాత్తు వ్యవసాయ పొలంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పైలెట్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులో చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ సర్వేకు వెళ్తున్న ఈ విమానం వెళ్తున్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించిన వివరాలు గాంధీనగర్ పోలీస్ అధికారి అరుణ్ శర్మ తెలిపారు. ఆయన ప్రకారం.. భోపాల్ నుంచి గుణకు ముగ్గురు పైలెట్లతో కూడిన శిక్షణ విమానం శనివారం మధ్యాహ్నం రాజభోజ్ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. బయల్దేరిన కొద్దిసేపటికే భోపాల్ శివారులోని బిషన్‌కేడీ ప్రాంతంలో ఆ విమానం పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు పైలెట్లు గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళన చెందారు. అయితే వెంటనే విషయం గమనించి గాయపడిన వారిని పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలియలేదు. మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆర్పేశారు. చదవండి: ‘ఇటుక’ దొంగతనం చేశాడని హీరోపై బీజేపీ ఫిర్యాదు చదవండి: మమతా బెనర్జీ ఆడియో క్లిప్ వైరల్ -
కూలిన ఆర్మీ హెలికాప్టర్.. 11మంది మృతి
అంకారా : ప్రమాదవశాత్తు మిలిటరీ హెలికాప్టర్ కూలిన ఘటనలో 11 మంది మృత్యువాత పడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన టర్కీలోని టట్వాన్లో గురువారం చోటుచేసుకుంది. హెలికాప్టర్ టట్వాన్నుంచి బింగోల్ వెళుతున్న నేపథ్యంలో స్థానిక కాలమానం ప్రకారం 2.25 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో లెఫ్టినెంట్ జెనర్ ఒస్మానా ఎర్బాస్, ఆర్మీకాప్ కమాండర్లు ఉన్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుంది అన్న వివరాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై యురోపియన్ యూనియన్, అమెరికాలు తమ సంతాపం తెలియజేశాయి. -
కరోనా విజృంభణ: మార్కెట్ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా ఐదవ రోజు బలహీనంగా ఉన్న మార్కెట్లకు కరోనా సెగ తగిలింది. దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోందన్నఅంచనాల మధ్య కీలక సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్ 780, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా కుప్ప కూలింది. దాదాపు అన్ని రంగాల షేర్లులో అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ షేర్లలో ఒత్తిడి కనిపిస్తోంది. (అమ్మకాల సెగ : నష్టాల్లో సెన్సెక్స్ ) మరోవైపు కరోనా కేసులు పెరుగుతూ పోతుండటంతో మహారాష్ట్ర కఠిన చర్యలకు దిగుతోంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట లాక్డౌన్ విధించారు. కరోనా పట్ల నిర్లక్క్ష్యం పెరుగుతోందని, ముఖ్యంగా ముంబై నగరంలో ఫేస్‌మాస్క్ నిబంధనను పాటించని సుమారు 16వేలకు పైగా జనంపై జరిమానా వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు. సంబంధిత ప్రామాణికాలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్ ముంబై నగర వాసులను హెచ్చరించారు. ముఖ్యంగా వివాహాలు లాంటి వేడుకల్లో వేలాదిమంది కనీస నిబంధనలు పాటించకుండా తిరగడం బాధిస్తోందన్నారు. కరోనా ఇంకా నశించ లేదు.... ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రానున్న రెండు వారాలు చాలా కీలకమన్నారు. (ఇలానే ఉంటే మరో 15 రోజుల్లో లాక్డౌన్: సీఎం) -
ఒకదానికొకటి వంద కార్లు ఢీ
-
ఒకదానికొకటి వంద కార్లు ఢీ
టెక్సాస్: ఒకటీరెండూ కాదు..ఏకంగా 100 వాహనాలు.. ఒకదానినొకటి ఢీకొని మైలున్నర మేర చిందరవందరగా పడిపోయాయి. దీంతో మైళ్ల కొద్దీ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన మంచు తుపానుతో రహదారిపై వాహనాల టైర్లు పట్టు కోల్పోయి కనీవినీ ఎరగని రీతిలో ఈ ప్రమాదానికి దారితీసింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్త్‌విత్ సమీపంలో 35వ అంతర్రాష్ట్రీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది ఒక్కో వాహనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అందులోని వారిని బయటకు తీసి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు. దెబ్బతిన్న వాహనాలను పక్కకు తరలిస్తున్నారు. చాలా వరకు వాహనాలు నుజ్జునుజ్జయి పోయాయి. జారుడుగా ఉన్న ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు సహాయక సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుందని యంత్రాంగం తెలిపింది. ఫెడ్ఎక్స్కు చెందిన ట్రక్కు ఒకటి అదుపుతప్పి బారియర్‌ను ఢీకొని ఆగిపోయింది. వెనుకే వచ్చిన మరికొన్ని కార్లు ఆ ట్రక్కును ఢీకొని నిలిచిపోవడంతో ఈ ప్రమాదాల పరంపర మొదలైనట్లు భావిస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంలో షిర్లీ మంచు తుపాను కారణంగా∙జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. తుపాను ప్రభావంతో కెంటకీ, వెస్ట్ వర్జీనియాల్లోని సుమారు 1.25 లక్షల నివాసాలు, వాణిజ్యప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
పారిస్‌లో భారీ పేలుడు
పారిస్: ఫ్రాన్స్‌లో భారీ పేలుడు సంభవించింది. దేశ రాజధానిలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పారిస్, దాని చుట్టు పక్కల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. నగరం అంతటా ఈ శబ్దం వినిపించింది అంటే ప్రమాద తీవ్రత ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే పేలుడు మూలం మాత్రం ప్రస్తుతానికి స్పష్టంగా తెలియ లేదు. ఓ టీవీ న్యూస్ చానెల్ రిపోర్టు ప్రకారం యుద్ధ విమానం కూలి పోయి ఉండవచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జెఎంజె కాలేజ్ వద్ద లారీ బీభత్సం
సాక్షి, వైఎస్సార్ : వైఎస్సార్ జిల్లా నగర శివార్లలో శుక్రవారం అర్థరాత్రి పెను ప్రమాదం తప్పింది. జెఎంజె కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టు టెంట్‌లోకి ఒక లారీ దూసుకెళ్లింది. అయితే ఆ సయయంలో టెంట్లో ఎవరూ లేపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే టెంట్‌లోకి లారీ దూసుకెళ్లడంతో చెక్‌పోస్ట్ మొత్తం నేలమట్టమయింది. కాగా లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నపోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి దాటాకా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. కాగా మరో ఘటనలో జిల్లాలోని పోరుమామిళ్ల మండలం నాగల కుంట్ల గ్రామంలో పొలానికి నీళ్లు పెట్టే క్రమంలో ఒక్కసారి కరెంట్ షాక్ కావడంతో ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. -
కరోనా దెబ్బకు క్రూడాయిల్ క్రాష్
-
ఆయిల్ దెబ్బ, మార్కెట్ల పతనం
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్ ఆరంభించాయి. అంతర్జాతీ ప్రతికూల సంకేతాలు, అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పతనం కావడంతో మన ఈక్విటీ మార్కెట్లు గత రెండు సెషన్ల లాభాలను కోల్పోయాయి దీంతో సెన్సెక్స్ 31 వేల స్థాయిని, నిఫ్టీ 91 వందల స్థాయిని కోల్పోయి నెగెటివ్ జోన్ లోకి జారుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. దీంతో సెన్సెక్స్ 31 వేల స్థాయిని, నిఫ్టీ 9 వేల స్థాయిని కోల్పోయి నెగెటివ్ జోన్ లోకి జారుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 903 పాయింట్లు కోల్పోయి 30742 వద్ద, నిఫ్టీ 262 పాయింట్లు నష్టంతో 8999 వద్ద కొనసాగుతోంది. గెయిల్, హిందాల్కో, వేదాంతా, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్ జీసీ,టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజుకి, టాటా మోటార్స్, జెఎస్ డబ్ల్యూ స్టీల్ భారీగా నష్టపోతున్నాయి. నిఫ్టీ బ్యాంకు 3.5 శాతం క్షీణించి 20 వేల దిగువకు చేరగా, ఫార్మ, ఎఫ్ ఎంసీజీ భారీ నష్టాలనుంచి స్వల్పంగా పుంజుకుంటున్నాయి. యూఎస్ ఎఫ్ డీఏ అనుమతులతో అరబిందో ఫార్మా దాదాపు 10 శాతం లాభపడుతోంది. అలాగే డాక్టర్ రెడ్డీస్ ఐటీసీలు ఒకశాతానికి పైగా లాభంతో ఉన్నాయి. (ఆల్ టైం కనిష్టానికి రూపాయి) -
పర్యాటకం ఢమాల్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో దేశీ పర్యాటక రంగం కుదేలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెలరోజులపాటు వీసాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ట్రావెల్, టూరిజం, ఏవియేషన్ రంగాలు దాదాపు రూ. 8,500 కోట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కంపెనీలు.. రిక్రూట్మెంట్ నిలిపివేయడం, అంతగా అవసరం ఉండని సిబ్బందిని తొలగించడం వంటి చర్యలు తీసుకోనుండటంతో ఆయా రంగాల్లో భారీగా ఉద్యోగాల కోతలు కూడా ఉండొచ్చని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఏఐటీవో), అసోచాం వంటి పరిశ్రమల సమాఖ్యలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో వీసాలపై నెల రోజుల నిషేధాన్ని పది రోజుల తర్వాతైనా పునఃసమీక్షించాలని, కొన్ని నగరాల నుంచైనా భారత్‌కి ప్రయాణాలను అనుమతించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. కరోనా వైరస్ బైటపడినప్పటికీ ఇప్పటిదాకా ఎంతో కొంతైనా పర్యాటకం కొనసాగుతుండటం వల్ల సిబ్బందిని, ఖర్చులను కాస్తయినా నిర్వహించుకోగలుగుతున్నామని.. వీసాల రద్దుతో గట్టి దెబ్బే తగలనుందని అసోచాం టూరిజం, హాస్పిటాలిటీ కౌన్సిల్ చైర్మన్ సుభాష్ గోయల్ చెప్పారు. దేశీ ఏవియేషన్ క్రాష్: అత్యవసరంగా వెళ్లాల్సిన పనుల మీద తప్పించి.. సాధారణ ప్రయాణాలను ప్రజలు వాయిదా వేసుకుంటున్న నేపథ్యంలో దేశీ విమానయానం ఈ మధ్యకాలంలో 15% వరకు తగ్గిపోయిందని అంచనా. ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల నుంచి రాకపోకలు గణనీయం గా తగ్గిపోయాయి. టికెట్లు బుక్ చేసుకున్న కస్టమర్లు కూడా ఆఖరి నిమిషంలో రద్దు చేసుకుంటున్నారని ఎయిర్‌లైన్స్ చెబుతున్నాయి. ఆక్యుపెన్సీ రేటు తగ్గిపోతున్న కారణంగా విమాన సేవలు నడిపేందుకయ్యే కనీస ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని, ఫలితంగా ఎయిర్‌లైన్స్ ఆదాయాలు పడిపోతున్నాయని జేఎం ఫైనాన్షియల్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే.. కరోనా వైరస్ మహమ్మారి ధాటికి బ్రిటన్‌కు చెందిన విమానయాన సంస్థ ఫ్లైబీ మాదిరిగానే ఇక్కడి సంస్థలు కూడా కుప్పకూలొచ్చని తెలిపింది. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో తగ్గిన ట్రాఫిక్.. బెంగళూరు విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య 50 శాతం తగ్గిపోయింది. కరోనావైరస్ భయాలతో పలు దేశాలు ట్రావెల్పరమైన ఆంక్షలు విధించడం, పలు ఫ్లయిట్లు రద్దు కావడం తదితర అంశాలు దీనికి కారణం. ఇటు దేశీయంగా ప్రయాణించే వారి సంఖ్య కూడా 2–4 శాతం తగ్గిందని, కరోనా కేసులు పెరిగిన పక్షంలో ఇది ఇంకా పెరగవచ్చని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (బీఐఏఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. దేశీ విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్యాసింజర్ల సంఖ్య గతంలో రోజుకు 70,000 స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం 62,000కు తగ్గిపోయినట్లు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. ఇది 40,000కు కూడా పడిపోవచ్చన్నారు. వోల్వో బస్సు టికెట్ రేటుకే.. ఆఖరి నిమిషంలో టికెట్ల రద్దుతో నిర్వహణ ఖర్చులైనా రాబట్టుకునేందుకు ఎయిర్‌లైన్స్ ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు.. చెన్నై నుంచి బెంగళూరుకు వోల్వో బస్సు టికెట్ ధర రూ.1,100 ఉండగా.. ఇదే ధరకు పలు కంపెనీల విమాన టికెట్ లభిస్తోంది. ఇంకా చాలా రూట్లలో ఇదే తరహాలో విమాన టికెట్ల రేట్లు పడిపోయాయి. ‘బేర్’ గుప్పిట్లోకి.. ఈ ఏడాది జనవరిలో సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. ఈ ఏడాది జనవరి 20న నిఫ్టీ జీవిత కాల గరిష్ట స్థాయి, 12,431 పాయింట్లకు చేరింది. ఈ గరిష్ట స్థాయిల నుంచి చూస్తే గురువారం నాడు నిఫ్టీ 22 శాతం మేర నష్టపోయింది. ఈ దృష్ట్యా చూస్తే, మన స్టాక్ మార్కెట్ బేర్ దశలోకి జారిపోయిందని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా షేర్ గానీ, సూచీ గాని ఇటీవలి గరిష్ట స్థాయి నుంచి 20 శాతం పతనమైతే, బేర్ దశ ప్రారంభమైనట్లుగా పరిగణిస్తారు. మన మార్కెట్ బేర్ దశలోకి జారిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2015లో, 2010లో కూడా బేర్ దశలోకి జారిపోయింది. ఈ బేర్ దశ చాలా కాలం కొనసాగవచ్చు. సాధారణంగా బేర్ మార్కెట్ రెండేళ్ల పాటు ఉంటుంది. 2015 బేర్ మార్కెట్ నుంచి 2017లో మన స్టాక్ మార్కెట్ కోలుకుంది. ఇక తాజా బేర్ మార్కెట్ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్–19 వైరస్ కల్లోలం సద్దుమణగగానే మార్కెట్ మళ్లీ పుంజుకోగలదని వారంటున్నారు. -
మూడు రోజుల నష్టాలకు బ్రేక్
ప్రపంచ మార్కెట్లు పతనమైనా, మన మార్కెట్ మాత్రం గురువారం లాభపడింది. దీంతో మూడు రోజుల సెన్సెక్స్, నాలుగు రోజుల నిఫ్టీ నష్టాలకు బ్రేక్ పడింది. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు లాభపడటం కలసివచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసల (ఇంట్రాడేలో)మేర పతనమైనా, ముడి చమురు ధరలు 1 శాతం మేర(ఏడు వారాల కనిష్ట స్థాయికి) పతనం కావడం, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్‌ల క్యూ3 ఫలితాలు బాగా ఉండటం.... సానుకూల ప్రభావం చూపించాయి. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కారణంగా స్టాక్ సూచీల్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో 299 పాయింట్ల మేర లాభపడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 271 పాయింట్లు పెరిగి 41,386 పాయింట్ల వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 12,180 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆసియా మార్కెట్లకు ‘కరోనా’ దెబ్బ.. కరోనా వైరస్ చైనాలో మరింత ప్రబలడం, ఇతర దేశాల్లో కూడా ఈ వైరస్ సంబంధిత కేసులు వెలుగులోకి రావడంతో ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ స్టాక్ సూచీలు 2.75% నష్టపోయాయి. నేటి నుంచి ఐటీఐ ఎఫ్‌పీఓ ►ప్రభుత్వ రంగ ఐటీఐ కంపెనీ ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 28న పూర్తయ్యే ఈ ఎఫ్‌పీఓ ద్వారా రూ.1,400 కోట్లు సమీకరించనున్నది. ఈ ఇష్యూకు ప్రైస్‌బాండ్‌గా రూ.72–77ను కంపెనీ నిర్ణయించింది. ►ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్లలో (డెట్) విదేశీ పోర్టిఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ)ల పెట్టుబడుల పరిమితిని పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి మరిన్ని విదేశీ నిధులు రాబట్టడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం. -
ఇరాన్లో కూలిన ఉక్రైన్ విమానం
-
ఇరాన్లో కుప్పకూలిన విమానం
ఒకవైపు ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదురుతున్న తరుణంలో ప్యాసింజర్ విమానం కుప్పకూలిపోవడం మరింత ఆందోళన రేపింది. బోయింగ్ 737 విమానం టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక కారణాలతోనే ఈ విమానం కూలిపోయినట్టు తెలుస్తోంది. 170 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఉక్రేనియన్ విమానం బుధవారం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాజధాని టెహ్రాన్ శివారు పరాంద్ సమీపంలో బోయింగ్ 737 జెట్ కూలిపోయిందని ఇరాన్ మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో సిబ్బంది సహా మొత్తం 180 ప్రాణాలు కోల్పోయారు. -
దలాల్ స్ట్రీట్‌లో యుద్ధ మేఘాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు మరింత ముదరడంతో దలాల్ స్ట్రీట్‌కు పెద్ద దెబ్బ తగిలింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంనుంచి కుదేలైన కీలక సూచీలు ఆ తరువాత ఏమాత్రం కోలుకోలేదు. మిడ్ సెషన్ తరువాత మరింత నీరసపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా, నిఫ్టీ 240 పాయింట్లకు మించి కుదేలయ్యాయి. దీంతో సెన్సెక్స్ 41వేలు, నిఫ్టీ 12వేల కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల వెల్లువకొనసాగుతోంది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ క్షీణించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, మెటల్ రంగ షేర్లు భారీగా పతమవుతున్నాయి. మరోవైపు బంగారం ధరలు పుంజుకోవడంతో టైటన్ లాంటి జ్యువెల్లరీ షేర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. రూపాయి బలహీనత నేపథ్యంలో ఐటీరంగంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ షేర్లపై ట్రేడర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. అటు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 9నెలల గరిష్టానికి చేరుకోవడంతో దేశీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 72స్థాయికి పడిపోయింది. 28 పైసలు నష్టపోయి 72.08 వద్ద చేరుకుంది. -
కుప్పకూలిన డీఆర్డీఓ డ్రోన్
బెంగళూర్ : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా జోదిచిక్కెనహళ్లి వద్ద పంట పొలాల్లో మంగళవారం ఉదయం డీఆర్డీఓ డ్రోన్ కుప్పకూలింది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో డ్రోన్ కూలిందని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఘటనా స్ధలానికి డీఆర్డీఓ అధికారులు చేరుకుంటున్నారు. చిత్రదుర్గ జిల్లా కేంద్రానికి సమీపంలో డీఆర్డీఓ చల్లకెరె ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్)ను ఏర్పాటు చేస్తోంది. కూలిన డ్రోన్ డీఆర్డీఓకు చెందిన రుస్తోం-2 డ్రోన్ అని చిత్రదుర్గ ఎస్పీ తెలిపారు. ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో విఫలమవడంతో డ్రోన్ వ్యవసాయ క్షేత్రంలో కూలిందని, డ్రోన్ కూలడంతో పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడగా, వారిని అక్కడి నుంచి పంపి తాము ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. -
530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో 100 పాయింట్లుకు పైగా ఎగిసిన మార్కెట్లకు అనంతరం అమ్మకాల సెగ భారీగా తాకింది. ఆరంభ లాభలనుంచి వెనక్కి మళ్లిన సూచీలు ఎక్కడా కోలుకున్న దాఖలు కనిపించలేదు. దీంతో సెన్సెక్స్ ఏకంగా 530 మేర క్షీణించి 38370స్థాయిని నమోదు చేసింది. నిఫ్టీ 169 పాయింట్లు పతనమైన 11427స్థాయికి చేరింది. ఆరంభంలో 11660కి పైన స్థిరంగా ఉన్న నిఫ్టీ చివరికి 11500 స్థాయిని కోల్పోవడం గమనార్హం. బ్యాంక్ నిఫ్టీ 600పాయింట్లు కోల్పోయింది. అన్ని రంగాల్లోనూ అమ్మకాల జోరు కొనసాగుతోంది. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, రియల్టీ, టెలికాం రంగాల్లో సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తోంది. ఆటో కౌంటర్లలో ఎంఅండ్ఎం, అశోక్ లేలాండ్, టీవీఎస్, హీరో మోటో, బజాజ్ ఆటో, మారుతీ, టాటా మోటార్స్, ఐషర్, రియల్టీ కౌంటర్లలో ఒబెరాయ్, సన్‌టెక్, ప్రెస్టేజ్, ఫీనిక్స్, మహీంద్రా లైఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, శోభా డెవలపర్స్ నష్టపోతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, గెయిల్, బజాజ్ ఫిన్, ఇన్ఫ్రాటెల్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. ఆర్బీఎల్ ఫలితాలు, యాజమాన్య వ్యాఖ్యల నేపథ్యంలో భారీగా (9శాతం) నష్ట పోతోంది. అలాగే మార్కెట్ ముగిసిన అనతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ1 ఫలితాలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఆర్ఐఎల్ కూడా బలహీనంగా ట్రేడ్ అవుతోంది. టైటన్, అల్ట్రాటెక్, ఎన్టీపీసీ, టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్, వేదాంతా, పవర్‌గ్రిడ్ స్వల్పంగా లాభపడుతున్నాయి. -
కుప్పకూలిన మిగ్ యుద్ధ విమానం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని బుద్గాంలో బుధవారం మిగ్ యుద్ధ విమానం కుప్పకూలింది. యుద్ద విమానం కుప్పకూలడంతో ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారని అధికారులు వెల్లడించారు. రొటీన్ సైనిక విన్యాసాల్లో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుందా, యుద్ధ సన్నాహక చర్యల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపై స్పష్టత లేదు. మిగ్ యుద్ధ విమానం కూలిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విమానం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. -
న్యూజిలాండ్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం
-
మెక్సికోలో కూలిన విమానం
-
కూలిన కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్
సాక్షి, ముంబయి: ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మురుద్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. అయితే హెలికాప్టర్‌లోని వారంతా క్షేమంగా ఉన్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో నలుగురు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో ముగ్గురు సురక్షితంగా బయట పడ్డారని, ఓ మహిళకు మాత్రం గాయాలైనట్లు తెలిపారు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా ప్రమాదం జరినట్లు తెలుస్తోంది. అది గాల్లో ఉన్నప్పుడే సాంకేతిక లోపం ప్రమాదం సంబవించినట్లు సమాచారం. సంఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది. -
బజాజ్ షోరూంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
-
చేతికొచ్చిన గంటకే కాలి బూడిదైన ఫెరారీ
లండన్: ఖరీదైన ఫెరారీ కారు చేతికి వచ్చిన గంటలో కాలి బూడిదై పోయింది. సెంట్రల్ ఇంగ్లండ్‌లో గురువారం మధ్నాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అనూహ్య ప్రమాదంలో సుమారు 260,000 డాలర్ల విలువైన (రూ. కోటి 67లక్షలు) కొత్త ఫెరారీ కారు మంటలకు ఆహుతి కావడం కలకలం రేపింది. సౌత్ యార్క్ షైర్ పోలీసులు శుక్రవారం ప్రచురించిన ఒక ఫేస్బుక్ పోస్ట్ ప్రకారం యార్క్ షైర్ సమీపంలో ఎం 1 మోటార్ వే లో ఫెరారీ 430 స్క్యూడెరియా మంటల్లో కాలి బూడిదిగా మారిపోయింది. అయితే ఈ ప్రమాదంనుంచి డ్రైవర్ స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాడు. ఇది ఫెరారీ కారు అనీ, ఒక గంట క్రితమే తాను తీసుకున్నట్టు పోలీసులకు చెప్పారు. అయితే అతి వేగమే కారణం కాకపోయి వుండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. కానీ డ్రైవర్ "చాలా లక్కీ" అని తెలిపారు. గత రెండు వారాలుగా ఇలాంటి ప్రమాదాలుఅనేకం జరిగాయని అప్రమత్తంగా ఉండాలని వాహనదారులను హెచ్చరించారు. -
జీఎస్టీ సెగ: ఐటీసీ క్రాష్
ముంబై: జీఎస్టీ ఎఫెక్ట్‌తో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ భారీగా పతనమైంది. సిగరెట్లపై సెస్ పెంపు కారణంగా ఐటీసీ తదితర సిగరెట్ తయారీ కంపెనీల షేర్లు నేడు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ అంచనాలకనుగుణంగానే ఇన్వెస్టర్లలో ఆందోళన అమ్మకాల ఒత్తిడిని పెంచింది. సోమవారం జీఎస్టీ కౌన్సిల్ ఇచ్చిన షాక్‌తో దాదాపు సిగరెట షేర్లన్నీ నీరసించాయి. ముఖ్యంగా ఇటీవల భారీగా లాభపడిన ఐటీసీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో 14శాతం పతనాన్ని నమోదు చేసింది. 15ఏళ్ల కనిష్టానికి చేరింది. దీంతో బ్రోకరేజ్ సంస్థలు కూడా నెగిటివ్ ట్రేడ్కాల్ ఇస్తుండటం గమనార్హం. గాడ్ఫ్రే ఫిలిప్స్ 4.5 శాతం, వీఎస్టీ ఇండస్ట్రీస్ 4.5 శాతం నష్టపోయాయి. ఈ ప్రభావంతో ఎఫ్ఎంసీజీ రంగం ఏకంగా 7.5 శాతం పతనమైంది. ఇది మార్కెట్లను ప్రభావితం చేస్తోందని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. ఇక మిగతా షేర్ల విషయానికి వస్తే గెయిల్ (1.45 శాతం), అరబిందో ఫార్మా (1.37 శాతం), రిల్ (0.70 శాతం), టాటా పవర్ (0.12 శాతం) నష్టపోయాయి. గెయిల్ (1.45 శాతం), అరబిందో ఫార్మా (1.37 శాతం), రిల్ (0.70 శాతం), టాటా పవర్ (0.12 శాతం) నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా, ఫలితాల జోష్‌తో ఏసీసీ 3.16 శాతం లాభాల్లో కొనసాగుతోంది. ఇంకా భారతీ ఎయిర్టెల్ 2.71 శాతం, విప్రో 1.57 శాతం, అంబుజా సిమెంట్స్ 1.47 శాతం, టీసీఎస్ (1.47 శాతం) లాభపడుతున్నాయి. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లో భాగంగా సిగరెట్లపై సెస్ పెంపును జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. సిగరెట్లపై వాలోరెమ్ సెస్ విధించాలని జిఎస్టి కౌన్సిల్ సోమవారం నిర్ణయం తీసుకుంది. సోమవారం అర్థరాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. తద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ. 5వేల కోట్లమేర అదనపు ఆదాయం లభించనుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. కాగా సిగరెట్లపై ఇప్పటికే జిఎస్టిలో భాగంగా 28 శాతం పన్నురేటు వుందని, దీనికి అదనంగా 5 శాతం వాలోరెమ్ సెస్‌ను అమలు చేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కుప్పకూలిన హెలికాప్టర్: సైనిక అధికారులు మృతి
-
కుప్పకూలిన హెలికాప్టర్: సైనిక అధికారులు మృతి
కోలకత్తా: పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు సైనిక అధికారులు అక్కడికక్కడే మరణించారు. మరో జూనియర్ కమిషన్డ్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం 10.30 గంటల ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ సుక్నా లో అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అధికారులు పైలట్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
భారీగా పతనమైన ఆయిల్ ధరలు
న్యూయార్క్ : అంతర్జాతీయ మార్కెట్లలో శుక్రవారం ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. కీలకమైన ఒపెక్ సమావేశం ప్రారంభానికి ముందే క్రూడ్ ధరలు ఢమాల్ అన్నాయి. చమురు సరఫరాల నియంత్రణపై ఈ నెల 28న అల్జీరియాలో రష్యా వంటి ఒపెక్‌యేతర దేశాలతో ఒపెక్ దేశాలు సమావేశంకానున్న నేపథ్యంలో ధరలు 4 శాతం పతనం కావడం ఆందోళన రేపింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 3.7 శాతం(1.76 డాలర్లు) దిగజారి 45.89 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు కూడా బ్యారల్ మరింత అధికంగా 4 శాతం(1.84 డాలర్లు) పడిపోయి 44.48 డాలర్ల వద్ద నిలిచింది. గత రెండేళ్లుగా నష్టాలను మూడగట్టుకుంటున్న ముడిచమురు ధరలను నిలబెట్టేందుకు సరఫరాలపై నియంత్రణలు తీసుకురావాలని సౌదీ అరేబియా ఇటీవల పేర్కొంది. అయితే సెప్టెంబర్ 26-28 మధ్య నిర్వహించనున్న సమావేశంపై ప్రతికూల అంచనాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన సమావేశం విఫలంకావడం ఈ అంచనాలకు ఆధారమని ఎనలిస్టులు చెబుతున్నారు. ఒపెక్ సమావేశాల్లో 'నో డీల్' ఫలితం రానుందని మాక్క్వారీ కాపిటల్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. అల్జీరియా మీట్ మరో మీట్ చారిత్రక వైఫల్యం కానుందని పేర్కొంది. ఇది డిసిసేషన్ మేకింగ్ సమావేశం కాదని, కేవలం సంప్రదింపులు మాత్రమేనని సౌదీ ఆయిల్ అధికారులు సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానించాయి. అలాగే ఫిజికల్ కమెడిటీస్ లో బ్యాంకుల జోక్యం పై ఆంక్షలు విధించాలన్న యోచనలోఉన్న ఫెడరల్ రిజర్వ్ విధానం, బలపడుతున్న డాలర్ విలువ, విద్యుత్ ధరలు, పెరిగిన చైనా ఎగుమతులు, ఒపెక్, నాన్ ఒపెక్ దేశాల మధ్య నెలొకొన్న విబేధాలు బ్రిటన్ కంపెనీల కష్టాలు ముఖ్యమైన అంశాలుగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే నాన్ ఒపెక్ దేశం, ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దారు అయిన రష్యా ఈవారంలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడం కూడా ఒక కారణమని తెలిపాయి. కాగా నాన్‌ఒపెక్ దేశమైన రష్యా ఈ ప్రతిపాదనకు మద్దతు పలకడంతో చమురు దేశాలకు ఆశలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అల్జీర్స్ లో వచ్చే వారం ఒపెక్ సమావేశానికి నిర్ణయించింది. -
కుప్ప కూలిన వైమానిక విమానం
-
కుప్ప కూలిన వైమానిక విమానం
న్యూఢిల్లీ : భారత వైమానిక దళ విమానం మిగ్-21 కూలిపోయింది. రాజస్తాన్‌లోని బార్మర్ ప్రాంత సమీపంలో ఈ ఎయిర్‌క్రాప్ట్ కూలిపోయినట్టు డిఫెన్ అధికార ప్రతినిధి తెలిపారు. విమానంలోని ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయట పడ్డట్టు ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది.బార్మర్ సమీపంలోని ఉత్తర్లాయ్ ఎయిర్‌బేస్ నుంచి టేక్ ఆఫ్ తీసుకున్న ఈ ఎయిర్‌క్రాప్ట్ బార్మర్ సమీపంలోనే కూలిపోయింది. టీ-69 ట్రైనర్ ఈ ఎయిర్‌క్రాప్ట్‌ను టేక్ ఆఫ్ తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సివిల్ లేదా సర్వీసు ప్రాపర్టీకి ఎలాంటి నష్టం జరగలేదని అధికారి పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంక్వయిరీకి ఆదేశించినట్టు డిఫెన్స్ అధికారి వెల్లడించారు. -
గతి తప్పిన విమానాలు.. ఘోరప్రమాదాలు
- ఇండోనేసియాలో ఇంట్లోకి దూసుకెళ్లిన సైనిక విమానం.. ముగ్గురి మృతి - సైనిక విమానం కూలి నలుగురు సైనికుల దుర్మరణం మలాంగ్/ నైపిడా: ఆగ్నేయ ఆసియా దేశాలైనా ఇండోనేసియా, మయన్మార్ లలో బుధవారం చోటుచేసుకున్న విమాన ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇరు దేశాల్లోనూ కుప్పకూలినవి సైనిక విమానాలే కావడం గమనార్హం. రెండు దేశాల్లో కలిపి ఐదుగురు సైనికులు, ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. ఇండోనేసియా జావా దీవిలోని అబ్దుల్ రాచ్మన్ సలేహ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బుధవారం ఉదయం ఓ శిక్షణ విమానం గాలిలోకి ఎగిరింది. దాదాపు 40 నిమిషాల ప్రాక్టీస్ అనంతరం విమానానికి ఎయిర్ బేస్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం ఎక్కడున్నదీ గుర్తించలేకపోయామని, అర గంట తర్వాత నగరంలో అత్యంత రద్దీగా ఉండే నివాస ప్రాంతంలో అది కూలిపోయినట్లు గుర్తించామని వైమానిక అధికారులు చెప్పారు. అదుపు తప్పిన విమానం నేరుగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఆ ఇంటి యజమాని, యజమానురాలు సహా పైలట్ కూడా మృత్యువాతపడ్డాడు. మయన్మార్ ప్రమాదం: సాధారణ పరీక్షల నిమిత్తం ఐదుగురు సైనికులు ఒక చిన్న తరహా విమానంలో రాజధాని నైపిడాలోని ఎయిర్ బేస్ నుంచి గాలిలోకి ఎగిరారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానంలో మంటలు చెలరేగి ఎయిర్ బేస్ కు సమీపంలోని పంటపొలాల్లో కూలిపోయింది. విమానంలో ఉన్న ఐదుగురు సైనికుల్లో నలుగురు మంటలల్లో కాలిపోగా, ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డట్టు అధికారులు చెప్పారు. మయన్మార్ పూర్తిగా కొండప్రాంతం కావడంతో భూతర రవాణా సౌకర్యాలు తక్కువ. దీంతో సాధారణ ప్రయాణికులు కూడా విమాన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. ఈ కారణంగా అక్కడ తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి. -
అమెరికాలో కారు బీభత్సం
లాస్ వెగాస్: ఒకవైపు ప్రపంచసుందరి పోటీలు, కిరీటం సంబరాలతో సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నట్టుండి అలజడి రేగింది. అకస్మాత్తుగా జనాల మీదికి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. అసలే ఉగ్రదాడులతో ప్రపంచమంతా బెంబేలెత్తిపోతున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. అమెరికాలోని లాస్ వెగాస్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడిక్కడే చనిపోయాడు. డ్రైవర్ కారును పాదచారుల మీద నుంచి వేగంగా తీసుకెళ్లడంతో సుమారు 37 మంది గాయపడ్డారు. మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్న లాస్ వెగాస్‌లోని పారిస్ హోటల్ ముందు ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో పిల్లలు, వృద్ధులు, మహిళలు ఉన్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని స్థానిక పోలీసులు ట్వీట్ చేశారు. బాధితుల్లో చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలిపారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక ప్రమాదమా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
సైనా నిష్ర్కమణ
వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ముగిసిన భారత్ పోరు దుబాయ్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ల పోరాటం లీగ్ దశలోనే ముగిసింది. సెమీఫైనల్ దశకు అర్హత సాధించాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో సైనా ఓడిపోగా... శ్రీకాంత్ వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసి విజయం రుచి చూడకుండానే వెనుదిరిగాడు. గతేడాది ఇదే టోర్నీలో వీరిద్దరూ సెమీఫైనల్‌కు చేరుకోగా... ఈసారి మాత్రం నిరాశపరిచారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)పై అద్భుత విజయం సాధించిన సైనా అదే జోరును చివరి మ్యాచ్‌లో కొనసాగించడంలో విఫలమైంది. తాయ్ జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో సైనా 21-16, 18-21, 14-21తో ఓటమి చవిచూసింది. సైనాపై గెలిచినప్పటికీ తాయ్ జు యింగ్ సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది. గ్రూప్ ‘ఎ’లో నొజోమి ఒకుహారా (జపాన్) ఆడిన మూడు లీగ్ మ్యాచ్‌ల్లో నెగ్గగా... సైనా, మారిన్, తాయ్ జు యింగ్ ఒక్కో మ్యాచ్ గెలిచారు. అయితే మెరుగైన గేమ్‌ల సగటు ఆధారంగా మారిన్ సెమీఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. తాయ్ జు యింగ్‌తో మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌ను నెగ్గినప్పటికీ... ఆ తర్వాత ఏకాగ్రత కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. పలుమార్లు తాయ్ జు యింగ్ షాట్లను సరిగ్గా అంచనా వేయలేకపోయిన సైనా అనవసర తప్పిదాలు కూడా చేసింది. గ్రూప్ ‘బి’ నుంచి యిహాన్ వాంగ్ (చైనా), రత్చనోక్ (థాయ్‌లాండ్) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో వరుసగా రెండు పరాజయాలు చవిచూసి గురువారమే నాకౌట్ ఆశలను వదులుకున్న శ్రీకాంత్ శుక్రవారం చివరి లీగ్ మ్యాచ్‌లోనూ తడబడ్డాడు. చూ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 17-21, 13-21తో ఓడిపోయాడు. ఈ టోర్నీలో శ్రీకాంత్ ఒక్క గేమ్ కూడా నెగ్గకపోవడం గమనార్హం. పురుషుల సింగిల్స్ విభాగంలో గ్రూప్ ‘ఎ’ నుంచి చెన్ లాంగ్ (చైనా), జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)... గ్రూప్ ‘బి’ నుంచి కెంటో మొమొటా (జపాన్), అక్సెల్సన్ (డెన్మార్క్) సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. -
బస్సు-బైక్ ఢీ, ఇద్దరి పరిస్థితి విషమం
నల్లగొండ: వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొన్న ప్రమాదం నల్లగొండ జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పెన్‌పహాడ్ మండలం అనంతరాం క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. సూర్యాపేట నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న లాల్సాబ్(45), మన్సూర్బీ(40)కి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
224 ప్రాణాలు గాలిలోకి...
-
అనుకోని అతిథి... ఒబామా!
అనుకోని అతిథి వస్తే ఆ నందమే వేరు... ఆ వచ్చింది ఏకంగా ఓ దేశానికి ప్రెసిడెంట్ అయితే.. ఇక చెప్పాల్పిందేముంటుందీ? శాన్ ఫ్రాన్సిస్కో లోని గోల్ఫ్ కోర్స్ వెడ్డింగ్ లో అదే జరిగింది. స్టెఫానీ, బ్రియాన్ టోబ్స్ పెళ్ళికి... అనుకోకుండా వచ్చి.. ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ఒబామా సందడి చేయడం అక్కడి వారందరినీ ఆనందంలో ముంచెత్తింది. కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న ప్రెసిడెంట్ బారాక్ ఒబామా పుణ్యం, పురుషార్థం కలసి వస్తుందనుకున్నారో ఏమో... లాజొల్లాలోని టొర్రే పైన్స్ గోల్ఫ్ కోర్స్ లో ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యారు. మరి కాసేపట్లో పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతుండగా... అమెరికా అధ్యక్షుడి రక్షణ సిబ్బంది హడావుడి మొదలు పెట్టారు. జరుగుతున్న కార్యక్రమం త్వరగా ముగించండి... లేదా కాసేపాగి జరుపుకోండి అంటూ హంగామా చేశారు. ఇంతట్లో అక్కడకు చేరిన ప్రెసిడెంట్ గారు వధూ వరులకు బ్లెస్సింగ్స్ చెప్పి, మంచి బహుమతిని అందజేశారు. అదే చేత్తో ఓ రౌండ్ గోల్ఫ్ ఆడి.. పెళ్ళివారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముందుగా ఆ హడావుడి అంతా ఎందుకు జరుగుతోందో అర్థంకాని ఫొటో గ్రాఫర్లు.. సీక్రెట్ సర్వీసెస్ కు చెందిన రెండు ఎస్ యు వీలను చూసిన తరువాత వస్తున్నది ఎవరూ అన్న విషయం తెలిసిందని చెప్తున్నారు. మొత్తానికి అక్కడికి వచ్చిన ఆ అనుకోని అతిథి ఒబామా అందరితో ఫొటోలు దిగి, వధూవరులను ఆశీర్వదించారు. వివాహం ప్రతి దంపతులకు గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం. అయితే స్టెఫానీ, బ్రియాన్ టోబ్స్ మాత్రం ఒబామా రాకను ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అంటూ ఆనందంతో చెప్తున్నారు. అయితే గత సంవత్సరం గోల్ఫ్ కోర్స్ లో ఒబామాకోసం భద్రతా సిబ్బంది ఓ పెళ్ళిని బలవంతంగా ఆపడం... అప్పట్లో విమర్శలకు కూడ దారి తీసింది. ఆ తర్వాత వారి ఆనందానికి అడ్డొచ్చినందుకు సదరు అమెరికా అధ్యక్షుడు క్షమాపణలు కూడ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఘటన గుర్తుండిపోయిందో ఏమో.. ఒబామా ఈసారి పెళ్ళికి ఆటంకం కలగకుండా కాస్త జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది. -
రష్యాలో కూలిన హెలికాఫ్టర్!
-
అలహాబాద్ లో కూలిన జాగ్వార్ విమానం
అలహాబాద్: ఉత్తర్ ప్రదేశ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు కూలిపోయింది. అలహాబాద్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానం కూలి పోవడానికి ముందే ప్రమాదాన్ని గుర్తించిన ఇద్దరు ఫైలట్లు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు అదేశించింది. -
కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం
-
కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం
ఒడిశా: ఒడిశాలోని మయూర్ బంజ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన విమానం బుధవారం కూలిపోయింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని డీజీపీ తెలిపారు. మరోవైపు జార్ఖండ్ లోని బహరాగొరా ప్రాంతంలోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన మరో అత్యాధునిక నిఘూ యాద్ధవిమానం కూలిపోయింది. ఈసంఘటనలోనూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బుధవారం జరిగిన రెండుప్రమాదాల్లోనూ పైలెట్ లు సురక్షితంగా బయటపడ్డారు. -
కూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. పైలట్లు క్షేమం
గువహటి: భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం అసోంలో కూలిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నాగవోన్ జిల్లాలో సుఖోయ్-30ఎంకేఐ జెట్ కూలింది. ఇందులో ఉన్న ఇద్దరు పైలట్లు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. -
పట్టాలు తప్పిన గూడ్సు రైలు
-
ఇరాన్ టెహ్రాన్‌లో కూలిన విమానం
-
యూపీలో కూలిన ఐఏఎఫ్ చాపర్
-
కూలిన మలేషియా బోయింగ్ 777 విమానం