సాక్షి, అమరావతి: ముంబై నుంచి బయల్దేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ పుణేలోని పౌద్ సమీపంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబై నుంచి విజయవాడ వస్తుండగా హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. అయితే, హెలికాప్టర్ కూలిన అనంతరం కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసమే హెలికాప్టర్‌ను ముంబై నుంచి విజయవాడకు రప్పిస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల రోజుల నుంచి మెయింటెన్స్‌లో ఉన్న హెలికాప్టర్‌ను ఆగమేఘాల మీద విజయవాడకు రప్పించే యత్నం చేశారు అధికారులు.
ఏవియేషన్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడితోనే హెలికాప్టర్ విజయవాడకు బయలుదేరినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి హెలికాప్టర్‌ను రప్పించే యత్నాలు చేసినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ క్రాష్ కావడంతో ఏపీ అధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. హెలికాప్టర్ క్రాష్‌పై పోలీసులు, ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment