భోపాల్: పైలెట్లతో వెళ్తున్న విమానం ప్రమాదవశాత్తు వ్యవసాయ పొలంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పైలెట్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులో చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ సర్వేకు వెళ్తున్న ఈ విమానం వెళ్తున్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించిన వివరాలు గాంధీనగర్ పోలీస్ అధికారి అరుణ్ శర్మ తెలిపారు.
ఆయన ప్రకారం.. భోపాల్ నుంచి గుణకు ముగ్గురు పైలెట్లతో కూడిన శిక్షణ విమానం శనివారం మధ్యాహ్నం రాజభోజ్ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. బయల్దేరిన కొద్దిసేపటికే భోపాల్ శివారులోని బిషన్‌కేడీ ప్రాంతంలో ఆ విమానం పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు పైలెట్లు గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళన చెందారు. అయితే వెంటనే విషయం గమనించి గాయపడిన వారిని పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలియలేదు. మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆర్పేశారు.
చదవండి: ‘ఇటుక’ దొంగతనం చేశాడని హీరోపై బీజేపీ ఫిర్యాదు
చదవండి: మమతా బెనర్జీ ఆడియో క్లిప్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment