pilots
-
మే ఆఖరుకి సాధారణ స్థితికి కార్యకలాపాలు
న్యూఢిల్లీ: పైలట్ల ఆందోళనలతో ఫ్లయిట్ సర్విసులకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మే నెలాఖరుకల్లా అంతా సద్దుమణుగుతుందని, పరిస్థితులు సాధారణ స్థితికి తిరిగొస్తాయని విమానయాన సంస్థ విస్తార సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. పైలట్లు లేవనెత్తిన సమస్యలపై దృష్టి పెట్టామని, వాటి పరిష్కార మార్గాలపై చర్చిస్తున్నామని ఆయన వివరించారు. ఫ్లయిట్ల సంఖ్య తగ్గవచ్చు గానీ ఈ వారాంతం నుంచి ఫ్లయిట్లను అప్పటికప్పుడు రద్దు చేసే పరిస్థితి ఉండబోదని కణ్ణన్ పేర్కొన్నారు. కార్యకలాపాలను కుదించుకునే క్రమంలో 20–25 రోజువారీ ఫ్లయిట్స్‌ను తగ్గించినట్లు ఆయన వివరించారు. విమానాలు రద్దు కావడం వల్ల ఇబ్బందిపడిన ప్రయాణికులకు తమ సిబ్బంది తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు కణ్ణన్ తెలిపారు. విస్తారాలో 6,500 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 1,000 మంది పైలట్లు, 2,500 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. -
పైలెట్ల కొరత.. ఎయిర్ విస్తారా కీలక నిర్ణయం
ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఎయిర్ విస్తారా కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది కొరత కారణంగా విమాన కార్యకలాపాల్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. విస్తారా రోజుకు దాదాపు 350 విమానాలను నడుపుతోంది. వాటిల్లో 25-30 విమానాల వరకు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. విస్తారా విమానాల రద్దు కారణంగా ముఖ్యంగా మెట్రో మార్గాల్లో ఛార్జీలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ-ముంబై రూట్లో విస్తారా రోజుకు దాదాపు 18 విమానాలను నడుపుతుండగా..ఇండిగో 19 విమానాలను నడుపుతోంది. ‘మేము మా కార్యకలాపాలను రోజుకు సుమారు 25-30 విమానాలు, అంటే 10శాతం సేవల్ని నిలిపివేస్తున్నాం. ఫిబ్రవరి 2024 చివరి వరకు ఎన్ని విమానాలు నడిపామో.. ఇక నుంచి అన్నే విమానాల్లో ప్రయాణికులకు సేవలందించాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో ఎయిర్ విస్తారా తెలిపింది. ఈ సందర్భంగా విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ మాట్లాడుతూ..మా సంస్థ పైలట్లను ఎక్కువగా వినియోగించుకుంటోందని, అంతరాయం కారణంగా సవాళ్లను ఎదుర్కొందని చెప్పారు. ఇకపై ఎక్కువ మంది పైలట్లను నియమించుకోవడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. -
పైలట్ల కొరత.. సమస్య పరిష్కారానికి చర్చలు!
పైలట్ల సమస్యల పరిష్కారానికి ఇటీవల విస్తారా ఉన్నతాధికారులు సమావేశమై కొత్త కాంట్రాక్టులు, రోస్టరింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సవరించిన వేతన విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కొంత మంది పైలట్లు రాజీనామాలకు తెరతీసిన సంగతి తెలిసిందే. తగినంత సంఖ్యలో పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గత 2-3 రోజుల్లోనే 100కి పైగా విమానాలను విస్తారా రద్దు చేసింది. బుధవారం సుమారు 26 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. తాజా పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై రోజువారీ నివేదికను సమర్పించాల్సిందిగా విస్తారాకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సూచించింది. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే.. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి పైలట్లతో విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ సహా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైనట్లు తెలిసింది. ఈ సమావేశంలో మానవ వనరుల విభాగం, ఇతర విభాగం అధికారులు పాల్గొన్నారని కంపెనీలు వర్గాలు తెలిపాయి. అయితే సమావేశ వివరాలకు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విమాన సర్వీసుల నిర్వహణ తిరిగి సాధారణ స్థితికి వస్తోందని కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
పైలట్ల కొరత.. సమస్య పరిష్కారానికి చర్చలు!
పైలట్ల సమస్యల పరిష్కారానికి ఇటీవల విస్తారా ఉన్నతాధికారులు సమావేశమై కొత్త కాంట్రాక్టులు, రోస్టరింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సవరించిన వేతన విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కొంత మంది పైలట్లు రాజీనామాలకు తెరతీసిన సంగతి తెలిసిందే.తగినంత సంఖ్యలో పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గత 2-3 రోజుల్లోనే 100కి పైగా విమానాలను విస్తారా రద్దు చేసింది. బుధవారం సుమారు 26 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. తాజా పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై రోజువారీ నివేదికను సమర్పించాల్సిందిగా విస్తారాకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సూచించింది.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే..ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి పైలట్లతో విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ సహా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైనట్లు తెలిసింది. ఈ సమావేశంలో మానవ వనరుల విభాగం, ఇతర విభాగం అధికారులు పాల్గొన్నారని కంపెనీలు వర్గాలు తెలిపాయి. అయితే సమావేశ వివరాలకు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విమాన సర్వీసుల నిర్వహణ తిరిగి సాధారణ స్థితికి వస్తోందని కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
బీహార్: పొలాల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్.. ఇద్దరు పైలట్లకు గాయాలు!
బీహార్‌లోని గయ జిల్లాలోని బుద్ధగయలో ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయింది. బాగ్దాహాలోని కంచన్‌పూర్ గ్రామంలో శిక్షణ సమయంలో ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు శిక్షణ పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన ఎయిర్‌క్రాఫ్ట్‌లో లేడీస్ పైలట్, జెంట్స్ ఆర్మీ పైలట్ ఉన్నట్లు సమాచారం. సాంకేతిక లోపం కారణంగా బాగ్దాహా, బోధ్ గయ సమీపంలోని కంచన్‌పూర్ పొలాల్లో ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో అది మైదాన ప్రాంతంలో పడిపోయింది. శిక్షణలో ఉన్న పైలట్లిద్దరూ సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందుకున్న ఆర్మీ సైనికులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఎయిర్‌క్రాఫ్ట్‌ను తమ వెంట తీసుకెళ్లారు. గయలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో ఆర్మీ సైనికులకు శిక్షణ అందిస్తుంటారు. శిక్షణ విమానం 200 నుంచి 400 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. అంతకుముందు 2022లో కూడా శిక్షణ సమయంలో సాంకేతిక లోపం కారణంగా ఒక ఎయిర్‌క్రాఫ్ట్ పొలంలో కూలిపోయింది. -
డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు ఇస్రో అనుబంధ ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)’తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (టీఎస్‌ఏఏ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్‌ల సమక్షంలో టీఎస్‌ఏఏ సీఈవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాశ్ చౌహాన్లు దీనిపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఎన్ఆర్ఎస్సీ శాస్త్రవేత్తలు డ్రోన్ పైలటింగ్, డ్రోన్ డేటా మేనేజ్మెంట్, డేటా అనాలసిస్, ప్రాసెసింగ్, మ్యాపింగ్‌లపై ఏవియేషన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న డ్రోన్ పైలట్లకు 15 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ అధికారులకు కూడా శిక్షణ: సీఎం అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిందని, పొలాల్లో ఎరువులు, పురుగుమందులు చల్లేందుకు రైతులు డ్రోన్లను వినియోగిస్తున్నారని ఈ భేటీలో అధికారులు వివరించారు. కొన్నిచోట్ల స్వయం సహాయక సంఘాలు డ్రోన్లను ఉపాధి మార్గంగా ఎంచుకున్నాయని తెలిపారు. దీంతో ఉన్నతస్థాయి నుంచి తహసీల్దార్ల వరకు ప్రభుత్వ అధికారులకు కూడా డ్రోన్లపై అవగాహన కలిగేలా శిక్షణను ఇవ్వాలని రేవంత్ సూచించారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. దేశంలోనే వినూత్నంగా తెలంగాణలో డ్రోన్లపై శిక్షణ కోర్సు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. శాటిలైట్, రిమోట్ సెన్సింగ్, అంతరిక్ష వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఎన్ఆర్ఎస్సీ.. డ్రోన్ టెక్నాలజీని సాంకేతికపరంగా మరింత పకడ్బందీగా వినియోగించుకునేందుకు శిక్షణలో భాగస్వామ్యం అవుతోందని వివరించారు. దేశంలో 12సార్లు బెస్ట్ ఏవియేషన్ అవార్డు అందుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సేవలను కొనియాడారు. శిక్షణకు స్థలం కేటాయించండి ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లోనే డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇస్తున్నామని, అక్కడ నెలకొన్న రద్దీ దృష్ట్యా హైదరాబాద్ పరిసరాల్లో ప్రత్యేకంగా డ్రోన్ పైలట్ల శిక్షణ కోసం స్థలం కేటాయించాలని ఏవియేషన్ అకాడమీ అధికారులు సీఎం రేవంత్‌ను కోరారు. దీనిపై స్పందించిన సీఎం.. డ్రోన్ పోర్టు ఏర్పాటుకు ఎంత స్థలం అవసరం? ఏమేం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే వివరాలు తెలుసుకున్నారు. పైలట్ల శిక్షణతోపాటు డ్రోన్ తయారీ కంపెనీలు ట్రయల్స్ నిర్వహించుకునేందుకు డ్రోన్ పోర్టు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. డ్రోన్ పోర్టుకు అవసరమైన 20 ఎకరాలను ఫార్మాసిటీ వైపు అన్వేíÙంచాలని అధికారులను ఆదేశించారు. ఏవియేషన్ నిబంధనల ప్రకారం అభ్యంతరం లేని ప్రాంతంలో ఈ స్థలం కేటాయించాలని సూచించారు. వరంగల్ ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ వరంగల్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని.. పాడైన పాత రన్‌వేలను కొత్తగా నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వరంగల్ ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని.. ఏవైనా అడ్డంకులు ఉంటే పరిష్కరించాలని సూచించారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసర ప్రాంతంలోనూ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని, అక్కడున్న అవకాశాలను పరిశీలించి ఎయిర్‌పోర్టు అథారిటీతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. సీఎంతో నెదర్లాండ్స్ రాయబారి భేటీ సాక్షి, హైదరాబాద్: భారత్‌లో నెదర్లాండ్స్ రాయబారి మెరిసా గెరార్డ్స్ బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై మాట్లాడుకున్న ఇద్దరూ తెలంగాణలో అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించారని సీఎంవో వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగాభివృద్ధికి అపార అవకాశాలు, అగ్రికల్చర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో నెదర్లాండ్స్ భాగస్వామ్యం తదితర అంశాలు వీరిద్దరి భేటీలో చర్చకు వచ్చాయి. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
పైలట్ రహిత ప్రయాణం
మానవ రహిత డ్రోన్ల వినియోగం ప్రపంచమంతటా విస్తృతమవుతోంది. రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో వీటిని ఆపరేట్ చేస్తుంటారు. ఇదే టెక్నాలజీ ఆధారంగా పైలట్ రహిత విమానాలపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా అమెరికాకు చెందిన రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సంస్థ సత్పలితాలు సాధించింది. సెమీ–అటోమేటెడ్ ఫ్లయింగ్ సిస్టమ్‌పై ఈ సంస్థ 2019 నుంచి పరిశోధనలు సాగిస్తోంది. పైలట్ లేకుండా కార్గో విమానాన్ని విజయవంతంగా నడిపించింది. అమెరికాలో ఉత్తర కాలిఫోరి్నయాలోని హోలిస్టర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఈ సెస్నా కేరవాన్ విమానం దాదాపు 12 నిమిషాల పాటు గాల్లో 50 మైళ్ల మేర ప్రయాణించింది. గత నెలలో ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టామని రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సీఈఓ రాబర్ట్ రోజ్ చెప్పారు. పైలట్ ప్రమేయం లేకుండా రిమోట్ కంట్రోలర్‌తోనే నడిపించినట్లు తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇలాంటి పైలట్ రహిత విమానాలతో కొన్ని సమస్యలు లేకపోలేదు. ఇవి గాల్లో తక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించలేవు. ఇలాంటి సమస్యలను పరిష్కరించి, మెరుగైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని రాబర్ట్ రోజ్ చెప్పారు. తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను వాణిజ్యపరంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి రిలయబుల్ రోబోటిక్స్ సంస్థ అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్తో కలిసి పని చేస్తోంది. మరో రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పైలట్ రహిత విమానాల రిమోట్ ఆపరేటర్‌కు ఒక పైలట్ ఉండే అర్హతలన్నీ ఉండాలి. అలాగే పైలట్ లైసెన్స్ కలిగి ఉండాలి. సెస్నా కంపెనీ తయారు చేసిన సరుకు రవాణా విమానాలను కేరవాన్ అని పిలుస్తున్నారు. ఇది సింగిల్–ఇంజన్ ఎయిర్‌క్రాఫ్ట్. ఫ్లైట్ ట్రైనింగ్, టూరిజం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సరుకు రవాణా కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంక్షోభంలో ఆకాశ ఎయిర్, మూసివేత? సీఈవో స్పందన ఇదీ
Akasa Air Crisis మరో బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సంక్షోభంలో చిక్కుకుంది. దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా ప్రధాన వాటాదారుగా గత ఏడాది సేవలను ప్రారంభించిన అకాశ ఎయిర్‌కు పైలట్ల సెగ తగిలింది. ఆకస్మాత్తుగా సంస్థకు గుడ్ బై చెప్పడంతో కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఆకాశ ఎయిర్ కూడా మూత పడనుందనే వదంతులు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి. పైలట్ రాజీనామా ఆందోళనల మధ్య ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. విశ్వసనీయతను నిర్ధారించడానికే విమానాలను తాత్కాలికంగా తగ్గిస్తుంది తప్ప మరేమీ కాదంటూ మూసివేత రూమరన్లు ఖండించారు. కొద్ది మంది పైలట్లు ఉన్నట్టుండి రిజైన్ చేయడంతో కొన్ని తమ విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించారు. పైలట్లు చట్టవిరుద్ధంగా తప్పనిసరి ఒప్పంద నోటీసు వ్యవధిని అందించకుండానే వెళ్లిపోయారంటూ దూబే తెలిపారు. దీనికి పైలట్లపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు ఉద్యోగులకు అందించిన ఇమెయిల్‌లో వెల్లడించారు. సంస్థ దీర్ఘకాల కార్యకలాపాలపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. (చంద్రయాన్-3 సక్సెస్: వాళ్ల ఏడుపు చూడలేకే, ఇడ్లీ బండి నడుపుకుంటున్నా!) దాదాపు 43 మంది పైలట్ల ఆకస్మిక నిష్క్రమణ కారణంగా స్వల్పకాలంలో తమ సేవలకు అంతరామమని దూబే ఉద్యోగులకు అందించిన ఇమెయిల్ సమాచారం తెలిపారు. కొంతమంది పైలట్ల నిర్ణయం కారణంగా జూలై, సెప్టెంబర్ మధ్య విమానాలకు అంతరాయం ఏర్పడిందనీ, చివరి నిమిషంలో రద్దు చేయవలసి ఇచ్చిందని పేర్కొన్నారు. అంతేకాదు కస్టమర్ల కోసం అత్యుత్తమ విమానయాన సంస్థను నిర్మించామనీ, తమ ప్లాన్ ప్రకారం ప్రతి మైలురాయిని అధిగమించాని చెప్పారు. దీర్ఘకాలం సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ దూబే వివరణ ఇచ్చారు. (మరో భారీ బ్యాంకు స్కాం: ఏకంగా రూ.3847 కోట్లకు ముంచేశారు) కాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజా డేటా ప్రకారం, Akasa మార్కెట్ వాటా ఆగస్టులో 5.2 శాతం నుండి 4.2 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఆగస్టులో దేశీయంగా తొలి విమానాన్ని నడిపిన ఆకాశ ఎయిర్ ఆ తరువాత అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు అర్హత సాధించింది. ఆగస్టు 1న బోయింగ్ 20వ B737 మ్యాక్స్ విమానాన్ని అందుకుంది. (జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?) -
రాకేష్ ఝున్‌ఝున్ వాలా.. ‘ఆకాశ ఎయిర్’లో ఏం జరుగుతోంది?
స్టాక్ మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌గా భావిస్తున్న ‘ఆకాశ ఎయిర్’ సంచలన నిర్ణయం తీసుకుంది. నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుండా సంస్థ నుంచి వైదొలగిన 43 మంది పైలెట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పైలెట్లు తీసుకున్న నిర్ణయం కారణంగా ఆయా ప్రాంతాలకు సర్వీసులు అందించే ఆకాశ ఎయిర విమానయాన సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా అధిక సంఖ్యలో విమానాల సేవల్ని రద్దు చేసింది. పైలెట్ల కొరతే విమానయాన సేవలపై ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బాంబే హైకోర్టుకు ఈ నేపథ్యంలో సంస్థకు రాజీనామా చేసిన ఉద్యోగులు తప్పనిసరిగా 6 నెలల పాటు నోటీస్ పిరియడ్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా మరో సంస్థలో చేరిన పైలెట్లపై మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకునేలా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తమ సంస్థతో పైలెట్లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. మరో సంస్థలో చేరే ముందు పైలెట్లు నోటీస్ సర్వ్ చేయాలి. కానీ అలా చేయకుండా నిబంధనల్ని ఉల్లంఘించారని కోర్టుకు విన్నవించింది. కాబట్టి సిబ్బంది తీసుకున్న నిర్ణయం వల్ల తామెంతో నష్టపోతున్నామని, న్యాయం చేయాలని కోరింది. పైలెట్లది అనైతిక, స్వార్థపూరిత చర్య ఈ సందర్భంగా విమానయాన చట్టం ప్రకారం.. ఉద్యోగులు తమ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా దేశ పౌర విమానయాన నిబంధనల్ని ఉల్లంఘించారని ఆకాశ ఎయిర్ ప్రతినిధి తెలిపారు.‘ఇది చట్టవిరుద్ధం మాత్రమే కాదు. పైలెట్ల అనైతిక, స్వార్థపూరిత చర్య కారణంగా ఈ ఆగస్టులో విమానాల సేవలకు అంతరాయం కలిగింది. పైలెట్ల కొరత కారణంగా చివరి నిమిషంలో విమానాల్ని రద్దు చేయాల్సి వచ్చింది. వేలాది మంది ప్రయాణికులు సైతం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని అన్నారు. కాగా, ప్రస్తుతం 20 విమానాల సేవల్ని అందిస్తున్న ఆకాశా ఎయిర్ గత ఏడాది ఆగస్టు నెలలో కార్యకలాపాల్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి👉 భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్ వేతనాలు.. కెప్టెన్ నెల శాలరీ ఎంతంటే? -
ఎయిర్ ఇండియాకు మరో షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ సంస్థ ఎయిర్ ఇండియాకు మరో షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని ఎయిర్ ఇండియా ఫెసిలిటీలో ఏ320 విమాన పైలట్లకు సిమ్యులేటర్ శిక్షణ కార్యకలాపాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిలిపివేసినట్టు సమాచారం. తనిఖీ సమయంలో కొన్ని లోపాలను గుర్తించడంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ముంబైలోని ఎయిర్ ఇండియా కేంద్రంలో బోయింగ్ పైలట్లకు శిక్షణ కార్యకలాపాలను డీజీసీఏ నిలిపివేసిన మూడు రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. డీజీసీఏ నిర్ణయంతో ఎయిర్ ఇండియాకు నిర్వహణ సవాళ్లు ఎదురు కానున్నాయి. న్యారో బాడీ, వైడ్ బాడీ విమాన పైలట్లకు సొంత కేంద్రాలలో శిక్షణ ఇవ్వలేకపోవడం ఇందుకు కారణం. ముంబై ఫెసిలిటీలో బోయింగ్ 777, బీ787 ఎయిర్క్రాఫ్టŠస్, హైదరాబాద్ కేంద్రంలో ఏ320 విమాన పైలట్లకు సిమ్యులేటర్ శిక్షణ ఇస్తున్నారు. -
పెరిగిన డ్రోన్ పైలెట్లు!
దేశంలో ఈ ఏడాది జూలై 1 నాటికి 5,072 మంది పైలెట్లు సాక్షి, అమరావతి: ఏడాది వ్యవధిలోనే దేశంలో డ్రోన్ పైలెట్లు 1,365 శాతం మేర పెరిగారని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్లో వెల్లడించింది. సాధారణ సేవల నుంచి అత్యవసర సేవల వరకు అంతటా డ్రోన్ల వినియోగం పెరుగుతోందని పేర్కొంది. గత ఏడాది జూలై 1 నాటికి దేశవ్యాప్తంగా కేవలం 346 మంది సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్లుండగా.. ఈ ఏడాది జూలై 1 నాటికి ఆ సంఖ్య 5,072కు పెరిగిందని ఆ శాఖ తెలిపింది. 427 మంది సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్లతో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉంది. అత్యధికంగా తమిళనాడులో ఉన్నారు. ఆ తరువాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. అనేక రంగాల్లో వినియోగం.. ఇక డ్రోన్స్ వినియోగం వ్యవసాయంతో పాటు వ్యాక్సిన్ డెలివరీ, నిఘా, శోధన, రక్షణ, రవాణా, మ్యాపింగ్ రంగాల్లో ఉందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా వీటిని ఉపయోగించనున్నట్లు పేర్కొంది. మరోవైపు.. డ్రోన్స్ రిమోట్ పైలెట్ శిక్షణ కోసం వివిధ రాష్ట్రాల్లో 60 సంస్థలకు అనుమతులు మంజూరు చేశారు. ఏపీ విషయానికొస్తే గుంటూరులో రెండు సంస్థలకు, హిందూపురంలో ఒక సంస్థకు కేంద్రం అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగంలో వీటి వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు చర్యలు చేపట్టింది. అలాగే, వచ్చే నెలలో 500 కిసాన్ డ్రోన్స్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. రైతుల ఖర్చులు తగ్గించేందుకు.. డ్రోన్ రిమోట్ పైలెట్ల శిక్షణకు రైతులతో పాటు గ్రామాల్లోని నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసి వారికి శిక్షణ ఇప్పిస్తోంది. మానవ శ్రమను తగ్గించడంతో పాటు, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి.. ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం పెంచడం ద్వారా పంటల అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, పురుగు మందులు, పోషకాలను పిచికారీ చేయడానికి ఉపయోగిస్తారు. తద్వారా రైతుల ఉత్పాదకత వ్యయం తగ్గి, ఆదాయం పెరుగుతుంది. -
మూడేళ్లలో లక్ష మంది డ్రోన్ పైలట్లు కావాలి
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయేతర, పారిశ్రామిక రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో లక్ష మంది డ్రోన్ పైలట్ల అవసరం ఉంటుందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. డ్రోన్ టెక్నాలజీ దేశానికి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించడంతో పాటు డ్రోన్స్ వినియోగ నిబంధనలను సరళీకృతం చేసినట్లు ఆ శాఖ పేర్కొంది. డ్రోన్స్ డిమాండ్‌కు తగినట్లు నైపుణ్య శిక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే 48 డ్రోన్ శిక్షణ పాఠశాలలకు అనుమతి ఇచ్చామని తెలిపింది. ఇంకా ఈ పాఠశాలల అనుమతికోసం పలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంది. 116 ఐటీఐల్లో స్వల్పకాలిక కోర్సులు డ్రోన్స్ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌తో సహా 12 రాష్ట్రాల్లో 116 ఐటీఐల్లో స్వల్పకాలిక కోర్సుల నిర్వహణకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఇప్పటికే అనుమతించింది. ఈ ఐటీఐలు డ్రోన్ సర్వీస్ టెక్నిíÙయన్, డ్రోన్ మాన్యుఫ్యాక్చరింగ్‌తో సహా ఆరు స్వల్పకాలిక నైపుణ్య కోర్సులను నిర్వహించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ అనుమతించింది. వ్యవసాయరంగంలో ప్రోత్సాహం ఖర్చును తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా డ్రోన్స్ వినియోగాన్ని పెంచేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. వ్యవసాయరంగంలో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా స్థానిక యువతకు డ్రోన్స్ వినియోగంలో అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఐటీఐల్లో డ్రోన్స్‌పై నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా రాష్ట్రంలో 10 ఐటీఐల్లో డ్రోన్స్ రంగంలో స్వల్పకాలిక నైపుణ్య శిక్షణకు అనుమతి మంజూరు చేసింది. మరో పక్క కిసాన్ డ్రోన్స్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు వ్యక్తిగతంగాను లేదా ఎఫ్‌పీవోకు బ్యాంకులు అవసరమైన రుణాలను మంజూరు చేయాల్సిందిగా నాబార్డు సూచించింది. పది లీటర్ల సామర్థ్యం గల కిసాన్ డ్రోన్ యూనిట్ వ్యయం ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలుగా ఖరారు చేసినట్లు నాబార్డు పేర్కొంది. ఆ మేరకు రైతులకు రుణాలను మంజూరు చేయాల్సిందిగా బ్యాంకులకు నాబార్డు సూచించింది. డ్రోన్ల తయారీకి ప్రోత్సాహం డ్రోన్స్ ప్రాముఖ్యత నేపథ్యంలో దేశంలోనే వాటి తయారీ, విడి భాగాలు తయారీని ప్రోత్సహించడానికి మూడేళ్లలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద రూ. 120 కోట్లు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. డ్రోన్లు, విడిభాగాలు తయారీలో దేశం స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు ప్రపంచంతో పోటీ పడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. -
కాక్‌పిట్‌లోకి గర్ల్‌ఫ్రెండ్.. వరుస వివాదాల్లో ఎయిరిండియా!
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా (airindia) వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. మధ్యం మత్తులో ప్రయాణంలో తోటి ప్రయాణికులపై తప్పతాగి మూత్రం పోయడం, ఒకరినొకరు కొట్టుకోవడం,కాక్‌పిట్‌లో స్నేహితురాలిని ఆహ్వానించడం వంటి ఘటనలతో తరచు వార్తల్లో కెక్కుతుంది. తాజాగా, గత వారం ఎయిరిండియా విమానానికి చెందిన ఇద్దరు పైలెట్లు తన స్నేహితురాలని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎయిరిండియాకు చెందిన ఏఐ-445 విమానం ఢిల్లీ నుంచి లేహ్‌కు (లద్దాఖ్) వెళ్లిన విమానంలో పైలెట్, కో-పైలెట్ తన స్నేహితురాల్ని కాక్‌పిట్(cockpit)లో కూర్చోబెట్టుకున్నారు. అయితే, ఎంత సేపు కాక్‌పిట్‌లో ఉన్నారనే అంశంపై స్పష్టత రాలేదు. ఈ ఘటనపై క్యాబిన్ క్రూ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఎయిరిండియా యాజమాన్యం ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు, దీనిపై డీజీసీఏ స్పందించింది. నియమ నింబంధనల్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎయిరిండియా విచారణ నిమిత్తం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై ఎయిరిండియా అధికారిక ప్రకటన చేయలేదు. దేశంలో అత్యంత సున్నిత ప్రాంతమైన లేహ్ వైమానిక మార్గం అత్యంత సున్నితమైంది. క్లిష్టమైనది. ఈ మార్గంలో ప్రయాణించే విమానంలో పైలట్లు నిబంధనలను ఉల్లంఘించడంపై వైమానిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ మార్గంలో ఎయిర్ ఇండియా విమానం ఏ1-915 కాక్‌పిట్‌లోకి తన మహిళా స్నేహితురాలిని స్వాగతించిన ఎయిర్ ఇండియా పైలట్ లైసెన్స్‌ను డీజీసీఏ సస్పెండ్ చేసింది. కాక్‌పిట్ ఉల్లంఘన ఘటనలో సత్వర, సమర్థవంతమైన చర్య తీసుకోలేదని ఆరోపించినందుకు డీజీసీఏ ఎయిరిండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఇదీ చదవండి : వాట్సాప్ చాట్ విడుదల, మూత్ర విసర్జన ఘటనలో శంకర్ మిశ్రాను ఇరికించారా? -
ఆ ఉద్యోగులకు నిజంగా పండగే! రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష రివార్డు..
దేశీ ఎయిర్‌లైన్స్ కంపెనీ స్పైస్‌జెట్ వార్షికోత్సవం సందర్భంగా తమ ఉద్యోగులకు పలు వరాలు ప్రకటించింది. విమాన పైలట్లకు నెలకు రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష నెలవారీ లాయల్టీ రివార్డు వంటివి ఇందులో ఉన్నాయి. గురుగ్రామ్‌కు కేంద్రంగా పనిచేసే స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ కెప్టెన్ల నెల జీతాన్ని రూ.7.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పైలట్లకు నెలలో 75 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఉంటాయి. ఈ పెంపుదల 2023 మే 16 నుంచి వర్తిస్తుందని స్పైస్ జెట్ తెలిపింది. అలాగే ట్రైనర్లు (డీఈ, టీఆర్ఐ), ఫస్ట్ ఆఫీసర్ల జీతాలను కూడా పెంచింది ఈ ఎయిర్‌లైన్స్ కంపెనీ. అంతకుముందు నవంబర్లోనూ స్పైస్‌జెట్ తమ పైలట్ల వేతనాలను పెంచిది. అప్పట్లో కెప్టెన్ల జీతం 80 గంటల ఫ్లయింగ్ అవర్స్‌కు గానూ నెలకు రూ. 7 లక్షలు ఉండేది. రూ.లక్ష లాయల్టీ రివార్డ్ అదనంగా ఈ ఎయిర్‌లైన్ సంస్థ తమ కెప్టెన్లకు నెలకు రూ.లక్ష వరకు నెలవారీ లాయల్టీ రివార్డ్‌ను ప్రకటించింది. వారి ఉద్యోగ కాలానికి అనుగుణంగా ఇచ్చే ఈ రివార్డ్ వారి నెలవారీ జీతం కంటే ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు స్పెస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ ఉద్యోగులతో మాట్లాడుతూ భవిష్యత్తు మరింత ఉత్తేజకరంగా ఉంటుందని, ప్రయాణికులకు అత్యున్నత ప్రమాణాలతో సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలని సూచించారు. స్పైస్‌జెట్ దేశ, విదేశాల్లో మొత్తం 48 గమ్యస్థానాలకు రోజూ దాదాపు 250 విమానాలను నడుపుతోంది. బోయింగ్ 737 మ్యాక్స్, బోయింగ్ 700, క్యూ400 వంటి అత్యాధునిక విమానాలు ఈ సంస్థకు ఉన్నాయి. ఇదీ చదవండి: Air India Salaries: జీతాలు పెంచిన ఎయిర్ ఇండియా.. పైలట్ జీతమెంతో తెలుసా? -
జమ్మూ కాశ్మీర్లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్..పైలట్లకు గాయాలు..
జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటన జమ్ము కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని అటవీ సమీపంలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఆర్మీ అధికారులు కిష్వార్ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో భారత ఆర్మీకి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ గురువారం కూలిపోయినట్లు తెలిపారు. ఈ హెలికాప్టర్లో పైలట్, కోపైలట్ తోసహా ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఐతే వారంతా సురక్షితంగానే ఉన్నారని అన్నారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలికి రెస్క్యూ బృందాలు చేరకున్నట్లు కిష్త్వార్ జిల్లా పోలీసు అధికారి ఖలీల్ పోస్వాల్ పేర్కొన్నారు. సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని, ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. (చదవండి: 'బీజేపీని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది'!: అరవింద్ కేజ్రీవాల్) -
భారతీయ వాయుసేన డేరింగ్ ఆపరేషన్
-
వేయ్యి మంది పైలట్లను నియమించుకోనున్న ఎయిరిండియా
-
ఎయిర్ ఇండియాలో కొత్త పంచాయతీ...
-
‘మమ్మల్ని ఆదుకోండి సార్’.. రతన్ టాటాకు చేరిన పైలెట్ల పంచాయితీ!
మానవ వనరుల విభాగం (hr) ఏకపక్షనిర్ణయాలతో తమకు అన్యాయం జరుగుతోందని, వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎయిరిండియా పైలెట్లు, క్యాబిన్ క్రూ సిబ్బంది 1500 సంతకాలతో కూడిన పిటిషన్‌ను ఎయిరిండియా మాతృసంస్థ, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాకు పంపారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న పైలెట్లు, క్యాబిన్ క్రూ సిబ్బందికి చెల్లించే జీతాలు, కాంట్రాక్ట్‌లను ఎయిండియా సవరించింది. ఈ నిర్ణయాన్ని పైలెట్ల యూనియన్లు ఇండియన్ కమర్షియల్ పైలెట్ అసోషియేషన్ (icpa), ఇండియన్ పైలెట్స్ గిల్డ్ (ipg) లు వ్యతిరేకించాయి. తమని సంప్రదించకుండా హెచ్ఆర్ విభాగం కాంట్రాక్ట్ సవరణ, జీతభత్యాలపై నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి.ఎట్టి పరిస్థితుల్లో ఈ కొత్త చెల్లింపుల్ని అంగీకరించబోమని స్పష్టం చేశాయి. రతన్ టాటాకు పంపిన పిటిషన్లో ఎయిరిండియా హెచ్ఆర్ విభాగం తీరుపై పైలెట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థలో తమకు విలువ లేదని, శ్రమకు తగ్గ గౌరవం లేదని వాపోయారు. ఆ కారణంతోనే విధులు నిర్వహించే సమయంలో శక్తి, సామర్ధ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పిటిషన్లో వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమానయాన సంస్థగా తీర్చిదిద్దుతున్న ఎయిరిండియా విజయంలో తాము భాగస్వాములమేనని, ప్రయాణికులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేలా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విమానయాన రంగం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్ని తాము అర్ధం చేసుకున్నామని చెప్పారు. సమస్యల్ని పరిష్కరించుకుంటూ సంస్థతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ‘కానీ మా సమస్యలను హెచ్ఆర్ విభాగం పట్టించుకోవడం లేదు. పరిష్కారం చూపించడం లేదని భావిస్తున్నాం. ఉత్పన్నమవుతున్న సమస్యల్ని పరిష్కరించాలని మిమ్మల్ని (రతన్ టాటాను) కోరుతున్నామని’ పైలెట్లు రతన్ టాటాకు ఇచ్చిన పిటిషన్లో తెలిపారని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
జీతాలు పెంచిన ఎయిర్ ఇండియా..
టాటా గ్రూప్ ఆధీనంలోని ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్ ఇండియా తమ పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ఏప్రిల్ 1 నుంచి జీతాలను సవరించింది. ఏ స్థాయి ఉద్యోగం ఎంత జీతం వస్తోందో తాజాగా వెల్లడైంది. సవరించిన జీతాల ప్రకారం.. ఎయిర్ ఇండియా పైలట్‌కు నెలకు కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.8.5 లక్షలు జీతం లభిస్తోంది. ఇక క్యాబిన్ సిబ్బందికి కనీసం రూ.25,000 నుంచి సీనియారిటీ, ఇతర అంశాల ఆధారంగా గరిష్టంగా రూ.78,000 జీతం వస్తున్నట్లు తెలుస్తోంది. పైలట్లు, ఇతర సిబ్బంది జీతాలు ఇలా.. కనిష్టంగా ట్రైనీ పైలట్‌కు నెలకు రూ.50,000 లభిస్తుంది. లైన్ రిలీజ్ తర్వాత జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు ఒక సంవత్సరం వరకూ నెలకు రూ.2.35 లక్షలు వస్తుంది. ఇక ఫస్ట్ ఆఫీసర్లు రూ. 3.45 లక్షలు, కెప్టెన్ రూ 4.75 లక్షలు జీతం అందుకుంటారు. కెప్టెన్ నుంచి అప్‌గ్రేడ్ అయిన కమాండర్‌కు రూ. 7.50 లక్షలు వస్తుంది. 4 సంవత్సరాల కంటే ఎక్కువ P1 రేటింగ్ ఉన్న సీనియర్ కమాండర్ నెలకు రూ.8.50 లక్షలు పొందుతారు. జీతంతో పాటు జూనియర్ పైలట్‌కు గంటకు రూ. 1,500 నుంచి రూ. 1,950 ఫ్లయింగ్ హవర్స్ అలవెన్సులు చెల్లిస్తారు. కమాండర్లు, సీనియర్ కమాండర్లకు నెలకు రూ.75,000, ఇతర వర్గాల పైలట్లకు రూ.25,000 బాడీ అలవెన్స్ ఉంటుంది. ఇదికాక కమాండర్లు, సీనియర్ కమాండర్లకు ఒక రాత్రికి రూ.2,200 చొప్పున డొమెస్టిక్ లేఓవర్ అలవెన్స్ లభిస్తుంది. ఇక ట్రైనీ క్యాబిన్ సిబ్బందికి ఫ్రెషర్‌కు రూ.25,000, అనుభవజ్ఞులైనవారికి రూ.30,000 స్టైఫండ్ లభిస్తుంది. రెగులర్ క్యాబిన్ సిబ్బందికి రూ.53,000, సీనియర్లకు రూ.64,000, ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ సిబ్బంది నెలకు రూ.78,000 అందుకుంటారు. ఫ్లయింగ్ అలవెన్స్ క్యాబిన్ సిబ్బందికి రూ.375 నుంచి రూ.750 వరకు చెల్లిస్తారు. ఇక సీనియర్ క్యాబిన్ సిబ్బందికి రూ.475 నుంచి రూ.950 వరకు, ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ సిబ్బంది రూ.525 నుంచి రూ.1,050 వరకు ఫ్లయింగ్ అలవెన్స్ అందుకుంటారు. కాగా శాశ్వత క్యాబిన్ సిబ్బందికి సాధారణ భత్యం 0-60 గంటల విమాన ప్రయాణానికి రూ.300, 65-70 గంటలకు రూ.375గా నిర్ణయించారు. సీనియర్ ఉద్యోగులు 0-65 గంటలు ప్రయాణం చేస్తే రూ.400 నుంచి రూ.650, అలాగే 65-70 గంటల వరకు రూ.525 నుంచి రూ.700 వరకు పొందుతారు. ఇదీ చదవండి: వీల్స్ ఆన్ వెబ్: కార్ ఆన్లైన్లో ఆర్డర్ చేయండి.. ఇంటికొచ్చేస్తుంది! -
31 వేల మంది పైలట్లు కావాలి..
ముంబై: వచ్చే 20 ఏళ్లలో భారత్‌లో 31,000 మంది పైలట్లు అలాగే 26,000 మంది మెకానిక్‌లు అవసరం కావచ్చని విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. దేశీ ఎయిర్‌లైన్స్ భారీ స్థాయిలో విమానాలకు ఆర్డర్లు ఇవ్వడం ఇందుకు దోహదపడనుందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిరిండియా గత నెల బోయింగ్, ఎయిర్‌బస్‌లకు 470 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. అంతర్జాతీయంగా చూస్తే రాబోయే 20 ఏళ్లలో దక్షిణాసియా ప్రాంతంలో విమానయాన రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందనుందని గుప్తే వివరించారు. భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతున్నందున మౌలిక సదుపాయాలు.. అలాగే పైలట్లు తదితర వనరులను సమకూర్చు కోవడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్ కరోనా మహమ్మారి తర్వాత విమాన ప్రయాణాలకు డిమాండ్ ఆశ్చర్యపర్చే విధంగా రికవరీ అయ్యిందని గుప్తే తెలిపారు. ఎయిర్ ట్రావెల్ వృద్ధిపై ఆర్థిక సంక్షోభ ప్రభావాలేమీ పడే అవకాశాలు కనిపించడం లేదన్నారు. బోయింగ్‌కి ఉన్న ఆర్డర్లపరంగా చూస్తే భారత్‌లో చిన్న విమానాలకు డిమాండ్ నెలకొందని గుప్తే చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు 90 శాతం మార్కెట్ వీటిదే ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: గేమింగ్ హబ్‌గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన -
కుప్పకూలిన చీతా.. విషాదాంతం
భారత ఆర్మీ ఛాపర్ చీతా ప్రమాదం.. విషాదంగా ముగిసింది. పైలట్ లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డితో పాటు కో పైలట్ మేజర్ జయంత్ కూడా మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది ఆర్మీ. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చీతా ఎయిర్‌క్రాఫ్ట్.. సంగే గ్రామం నుంచి అసోం సోనిట్‌పూర్ జిల్లా మిస్సమారి వైపు వెళ్లాల్సి ఉంది. అయితే పావు గంటకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కామెంగ్ జిల్లా మండాలా వద్ద అది ప్రమాదానికి గురైనట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి. అయితే.. ఆపై అందులో ఉన్న ఇద్దరు పైలట్ల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. భారత సైన్యంతో పాటు ఐటీబీపీ మరో రక్షణ విభాగ సాయంతో మొత్తం ఐదు బృందాలు కూలిపోయిన పైలట్ల ఆచూకీ కోసం గాలించాయి. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ దిరాంగ్ ప్రాంతం బంగ్లాజాప్ వద్ద గ్రామస్తులు కాలిపోతున్న ఛాపర్ శకలాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి చేరుకున్న బలగాలు.. ఆపై పైలట్, కోపైలట్లు దుర్మరణం పాలైనట్లు ప్రకటించారు. ఛాపర్ క్రాష్‌కు గురైన ప్రాంతంలో పొగమంచు దట్టంగా నిండిపోయి ఉండడం, కమ్యూనికేషన్ అండ్ సిగ్నలింగ్ వ్యవస్థకు ఆటంకం కలుగుతోందని గుర్తించారు. మరోవైపు ప్రమాదానికి కారణాల గుర్తించేందుకు దర్యాప్తునకు ఆదేశించింది భారత ఆర్మీ. చీతా ఐదుగురు ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న హెలికాఫ్టర్. అనేక రకాలుగా దీనిని ఉపయోగిస్తున్నారు. ప్రతికూల వాతావరణంలోనూ.. మిషన్ల సమయంలో అత్యంత ఎత్తులో(ప్రపంచ రికార్డు సైతం ఉంది దీనిపేరిట) అయినా ప్రయాణించగలిగే సత్తా ఉందన్న పేరుంది. హాల్(HAL) 1976-77 నడుమ తొలి ఛాపర్‌ను భారత సైన్యానికి అందించింది. ఇప్పటిదాకా 279 హెలికాఫ్టర్లను హాల్.. భారత్‌తో పాటు విదేశాల్లోనూ అందించింది. -
కుప్పకూలిన భారత ఆర్మీ హెలిక్టాపర్.. ఇద్దరు పైలట్స్ ఎక్కడ?
భారత సైన్యానికి చెందిన చిరుత హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో పైలట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఆర్మీ అధికారులు. ఇక, ఈ ప్రమాదం ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆర్మీకి చెందిన చిరుత హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని మండాలా హిల్స్ వద్ద కుప్పకూలిపోయింది. బొండిలా పట్టణం నుంచి వెళ్తుండగా గురువారం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు గువాహటి డిఫెన్స్ పీఆర్వో, కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు. Report: Army #Cheetah Helicopter Crash in West #Khameng district of the #Arunachal Pradesh. More details awaited.#IADN 📸 Representation pic.twitter.com/2ZL9P30yHM — Indian Aerospace Defence News (IADN) (@NewsIADN) March 16, 2023 -
ఎయిరిండియాకు 6,500 మంది పైలట్లు కావాలి
ముంబై: టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సంస్థ ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి 470 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ విమానాలు నడిపించడానికి 6,500 మందికిపైగా పైలట్లు అవసరమని విమానయాన పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 113 విమానాలు ఉన్నాయి. దాదాపు 1,600 మంది పైలట్లు పనిచేస్తున్నారు. పైలట్ల కొరత వల్ల ఇటీవల పలు సందర్భాల్లో అల్ట్రా–లాంగ్ హాల్ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాల ప్రయాణాల్లో ఆలస్యం చోటుచేసుకుంది. ఎయిరిండియా అనుబంధ సంస్థలైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియాలో 54 ఫ్లైట్లు ఉండగా, దాదాదాపు 850 మంది పైలట్లు సేవలందిస్తున్నారు. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో 53 విమానాలు, 600 మందికిపైగా విమాన చోదకులు ఉన్నారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియా, విస్తారా సంస్థల్లో కలిపి 220 విమానాలు ఉన్నాయి. 3,000 మందికిపైగా పైలట్లు పనిచేస్తున్నారు. -
ఎయిర్ ఏషియాకు డీజీసీఏ భారీ ఝలక్!
ఎయిర్ ఏషియాకు డీజీసీఏ భారీ షాక్ ఇచ్చింది. ఎయిర్ ఏషియా పైలెట్ల శిక్షణ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించడంతో డీజీసీఏ భారీగా జరిమానా విధించింది. ట్రైనింగ్ సమయంలో పైలట్ల నెపుణ్యతకు సంబంధించిన టెస్ట్(లేదా) ఇన్స్ట్రుమెంటేషన్ రేటింగ్ చెక్ తదితరాలను కచ్చితంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. వాటిని ఎయిర్ ఏషియా చేయడం లేదని తేలడంతో డీజీసీఏ రూ. 20 లక్షల జరిమానా విధించింది. తన విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైనందుకు సదరు ఎయిర్ ఏషియా హెడ్ ట్రైనీని కూడా మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేసింది డీజీసీఏ. ఎయిర్ ఏషియా నియమించిన ఎనిమిది మంది ఎగ్జామినర్లకూ కూడా ఒక్కొక్కరికి రూ. 3లక్షలు చొప్పున జరిమాన విధించింది. ఈ మేరకు డీజీసీఏ సంబంధిత మేనేజర్, శిక్షణ అధిపతి, ఎయిర్ ఏషియా నియమించిన ఎగ్జామినర్లు తమ విధులను సరిగా నిర్వర్తించనందుకు ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోలేకపోయిందో వివరణ ఇవ్వాల్సిందిగా సదరు ఎయిర్‌లైన్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారి రాత పూర్వక సమాధానాలను పరిశీలించాకే డీజసీఏ ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. (చదవండి: వివాహేతర సంబంధం వివాదం: విషం తాగి పోలీస్టేషన్‌కి వచ్చి..) -
ఆ విమానం కూలి మంటల్లో చిక్కుకుంది..కానీ ఆ ఇద్దరు పైలట్లు..
విమానం కూలి పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడ్డాయి. ఆ విమానం బూడిద అయ్యి చివరి తోక భాగం మాత్రమే కనిపిస్తుంది. వైమానికి చిత్రాల్లో నేలపై కనిపిస్తున్న దృశ్యం చాలా భయానకంగా ఉంది. కానీ ఆ ఇద్దరు పైలట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడటం అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో పెర్త్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఆగ్నేయంగా 420 కి.మీ దూరంలో ఫిట్జ్‌గెరాల్డ్ నేషనల్ పార్క్‌లో బోయింగ్ 737 వాటర్ బాంబింగ్ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. అది కూలడంతో భూమికి సమాంతరంగా.. బలంగా తాకడంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మొత్తం అక్కడ ఉన్న పచ్చని చెట్లు బూడిదయ్యి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ ఘటనలో విమానం పూర్తిగా ధ్వంసమై వెనుకభాగం మాత్రమే కనిపిస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే తీసిన ఎమర్జెన్సీ సర్వీసెస్ చిత్రాలు విమానం తోకభాగం వేరు చేయబడి ఉన్నట్లు కనిపించింది. ఈ ప్రమాదం బారి నుంచి విమానంలోని ఇద్దరు పెలెట్లు సురక్షితంగా బయటపడటం మిరాకిల్ అని ఆస్ట్రేలియా అత్యవసర సేవల మంత్రి స్టీఫెన్ డాసన్ అన్నారు. వాస్తవానికి అది ఎయిర్ ట్యాంకర్‌గా మార్చబడిన ప్రయాణికుల విమానం అని చెప్పారు. అయితే ఆయా ప్రాంతాల్లో నీటిని సరఫరా చేసేశాకే ఆ విమానం కూలినట్లు వెల్లడించారు. వీటిని అగ్నిమాపక విమానాలుగా వ్యవహరిస్తారన్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే అధికారుల సంఘటనస్థలి నుంచి ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పీట్ రికార్డర్ని స్వాధీనం చేసుకోన్నట్లు చెప్పారు. గత ఐదేళ్లో 64 అగ్నిమాపక విమాన ప్రమాదాలు జరిగాయని, ఆయా సంఘటనల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాల గురించి భద్రతా విభాగం పరిశీలిస్తోందన్నారు. ఇలింటి అనహ్య ఘటనల్లో సిబ్బందిని సురక్షితంగా రక్షించడంపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భద్రతా అధికారులు దృష్టి సారించనున్నట్లు మంత్రి స్టీఫెన్ పేర్కొన్నారు. (చదవండి: ముగ్గురు అమ్మాయిలను పెళ్లాడిన వ్యక్తి!) -
టాటా గ్రూప్ కి షాకిచ్చిన ఎయిర్ ఇండియా ఫైలట్స్
-
90 గంటల పని..ఎయిరిండియా పైలట్ల సంచలన ఆరోపణలు, ప్రయాణీకుల ప్రాణాలు!?
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ సొంతమైన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా పైలట్లు సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ పనిగంటలతో పాటు,హెల్త్ లీవ్‌లను నిరాకరిస్తోందని ఎయిరిండియా పైలట్ బాడీ, ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ ఆరోపించింది. తాజా పరిణామంతో ప్రయాణీకుల భద్రత ప్రశ్నలను లేవనెత్తుతోంది. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం పైలట్లు నెలకు 70 గంటలకు బదులుగా అన్ని విమానాలలో నెలకు 90 గంటలకు పైగా ప్రయాణించారని(ఫైయింగ్ అవర్స్) ఐపీజీ-ఐసీపీఏ వాదించింది. అలాగే ఎయిరిండియా యాజమాన్యం పైలట్లకు లీవ్‌లను నిరాకరిస్తోందని ఒక్కోసారి రద్దు చేస్తోందని తద్వారా చాలామంది పైలట్లు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించింది. అంతేకాదు సెలవులు పొందిన లేదా శిక్షణ పొందిన నెలల్లో వేతన కోతలతో వేధిస్తున్నారని పైలట్లు ఆరోపించారు. ఇకపై దీన్ని సహించలేమని, తమ జీవన నాణ్యత, పని-జీవిత సమతుల్యత, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని త్యాగం చేయలేమని పేర్కొన్నారు. (రిలయన్స్ మరో సంచలనం: గుజరాత్లో షురూ) కోవిడ్ తరువాత వేతనాల్లో కోత పెట్టిన సంస్థ ఇపుడు పూర్వ వేతనాలను చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్ 777 ఫ్లీట్ల కోసం ఎక్స్-ప్యాట్ పైలట్లను ప్రస్తుత దీర్ఘకాలిక పైలట్ల కంటే 80 శాతం ఎక్కువ వేతనంతో రిక్రూట్ చేస్తోందనీ భారతీయ పైలట్లపై చూపిస్తున్న ఈ వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఐపీజీ-ఐసీపీఏ తెలిపింది. కాగా సిబ్బంది కొరత నివేదికలను ఎయిరిండియా ఖండించిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటుసుకుంది. మరి తాజా ఆరోపణలపై ఎయిరిండియా సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి. (బర్సో రే మేఘా మేఘా అంటున్న ఇన్ఫోసిస్ సుధామూర్తి: వీడియో చూస్తే ఫిదా) -
స్పైస్‌జెట్ దీపావళి కానుక: వారికి నెలకు రూ.7 లక్షల జీతం
సాక్షి, ముంబై: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తన పైలట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. నవంబరు 1 నుంచి వర్తించేలా జీతాలపెంపును ప్రకటించింది. తద్వారా స్పైస్‌జెట్ వారికిదీపావళి కానుక అందించింది. స్పైస్‌జెట్ కెప్టెన్లకు 80 గంటల విమాన ప్రయాణానికి నెలవారీ వేతనం 7 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈపెంపు నవంబర్ 1, 2022 నుండి వర్తిస్తుందని తెలిపింది. ట్రైనర్స్, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ల వేతనాలను కూడా తగిన విధంగా పెంచినట్లు స్పైస్‌జెట్ పేర్కొంది. నెలవారీ ప్రాతిపదికన పైలట్ వేతనాలను సవరించినట్టు తెలిపింది. అక్టోబర్‌లో కెప్టెన్లు , ఫస్ట్ ఆఫీసర్ల జీతం 22 శాతం పెంచింది. ఆగస్టుతో పోలిస్తే, సెప్టెంబర్ జీతంలో శిక్షకులకు 10 శాతం, కెప్టెన్లు, ఫస్ట్ ఆఫీసర్ల వేతనం 8 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. -
చైనా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకు పైలట్ల కొరత
బీజింగ్: ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల (విమానవాహక నౌకల)పై నుంచి యుద్ధ విమానాలను నడపడంలో సుశిక్షితులైన పైలట్లు దొరక్క డ్రాగన్ దేశం తంటాలు పడుతోంది. విమానవాహక నౌకల కోసం తయారు చేసిన యుద్ధ విమానాలు ముఖ్యంగా జె–15 జెట్లు నడిపే అర్హులైన పైలట్ల డిమాండ్‌ను తీర్చేందుకు చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (పీఎల్ఏఎన్) శిక్షణ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. మొదటి విమాన వాహక నౌక లియోనింగ్‌ను ప్రారంభించిన దశాబ్దం తర్వాత చేపట్టిన ఈ శిక్షణ కార్యక్రమం అనేక అవరోధాలను ఎదుర్కొంటోందని చైనా మిలటరీ మేగజీన్ ఆర్డినెన్స్ ఇండస్ట్రీ సైన్స్ టెక్నాలజీ తాజా కథనంలో తెలిపింది. గత వారం సముద్రంలో ట్రయల్స్ ప్రారంభించిన అత్యాధునిక మూడో విమాన వాహక నౌక ఫుజియాన్పై ఉండే 130 యుద్ధ విమానాలను నడిపేందుకు కనీసం 200 మంది క్వాలిఫైడ్ పైలట్లు అవసరం ఏర్పడిందని అందులో తెలిపింది. అంతేకాదు, అమెరికాతో సరితూగగల ఇలాంటి మరికొన్ని ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లను తయారు చేసుకోవాలని చైనా ప్రణాళికలు వేస్తోంది. ‘అయితే, విమానాల డిజైనింగ్‌తోపాటు అందుకు తగ్గట్లుగా పైలట్లను తయారు చేసుకోవడం చాలా కష్టతరమైన అంశం. ఎందుకంటే ఇలాంటి కీలక సాంకేతిక అంశాలను మీతో ఎవరూ పంచుకోరు. ఎవరికి వారు వీటిని సొంతంగా సమకూర్చుకోవాల్సిందే’ అని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. చైనా కనీసం ప్రతి రెండు నెలలకో యుద్ధ నౌకను రంగంలోకి దించుతూ తన నావికాశక్తిని వేగంగా ఆధునీకరిస్తోంది. పైలట్ల కొరతను అధిగమించేందుకు నేవీ అధికారులు ఎయిర్‌ఫోర్స్‌లోని అర్హులైన సిబ్బందికి బదులు హైస్కూల్ విద్య పూర్తి చేసిన 19 ఏళ్ల వారిని ఎంపిక చేస్తూ శిక్షణను వేగవంతం చేసినట్లు అధికార చైనా సెంట్రల్ టెలివిజన్ తెలిపింది. పలు సాంకేతిక అంశాల్లో అమెరికాతో పోలిస్తే చైనా పైలట్లు శిక్షణలో వెనుకబడినట్లే భావించాల్సి ఉంటుందని ఆర్డ్‌నెన్స్ ఇండస్ట్రీ సైన్స్ టెక్నాలజీ పత్రిక పేర్కొంది. -
స్పైస్‌జెట్ సంచలనం: పైలట్లకు 20 శాతం జీతం పెంపు!
సాక్షి, ముంబై: కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ పైలట్ల జీతాల విషయంలో దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. బడ్జెట్ క్యారియర్ స్పైస్‌జెట్ అక్టోబర్ నుంచి పైలట్లకు 20శాతం జీతం పెంపును ప్రకటించిందని సీఎన్‌బీసీ గురువారం నివేదించింది. తమ వ్యాపారం మెరుగు పడుతున్న క్రమంలో కెప్టెన్లు , సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు జీతం దాదాపు 20 శాతం పెరుగుతుందని కెప్టెన్ గుర్చరణ్ అరోరా తెలిపారు. ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా తాత్కాలిక చర్యగా జీతాలివ్వకుండానే సెప్టెంబరు 21 నుండి మూడు నెలల పాటు లీవ్ వితౌట్ పే కింద 80 మంది పైలట్లను సెలవుపై ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే. స్పైస్‌జెట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) చెల్లింపులో మొదటి విడతగా సుమారు రూ. 125 కోట్లను గత వారం అందుకుంది. అయితే తాజా పెంపులో ఈ 80 మంది ఉన్నారా లేదా అనేది స్పష్టత లేదు. అయితే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు మరోవైపు ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పైస్‌జెట్‌కు బుధవారం మరో షాక్ ఇచ్చింది. గరిష్టంగా 50 శాతం విమానాలను మాత్రమే నడపాలన్న ఆంక్షలను మరో నెలపాటు పాడిగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి షెడ్యూల్ ముగిసే వరకు (అక్టోబర్ 29, 2022) ఈ ఆంక్షలు కొనసాగుతాయని తన ఆర్డర్లో పేర్కొంది. విమానాలకు సంబంధించిన వరుస సంఘటనల కారణంగా ఈ ఏడాది జూలై 27న స్పైస్‌జెట్‌కు గరిష్టంగా 50 శాతం విమానాలను మాత్రమే నడపాలని ఆదేశించింది. ఈ గడువు సెప్టెంబరు 30తో ముగియనుంది. కాగా గురువారం నాటి మార్కెట్లోస్పైస్జెట్ షేరు 4 శాతం కుప్పకూలింది. ఈ ఏడాది ఏకంగా 40శాతం నష్టపోయింది. -
SpiceJet: పైలట్స్‌కి 3 నెలలు సెలవు
-
అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా
These wouldn't affect of Russia's special military operation in Ukraine: అఫ్గనిస్తాన్‌లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కూలిపోయిన తదనంతరం తాలబన్లు అఫ్గాన్‌ని తమ నియంత్రణలోకి తెచ్చుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్ చేతుల్లోకి వెళ్లిన అఫ్గాన్ దేశంలో ఉండలేమంటూ చాలామంది అప్గనిస్తాన్ సైనిక, వైమానిక దళ సిబ్బంది ఉజ్బెకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా వంటి దేశాలకు పారిపోయారు. దీంతో అత్యాధునిక ఆయుధాలు తాలిబన్ల హస్తగతమైంది. ఇలా అమెరికాకు పారిపోయిన అఫ్గాన్ పైలెట్లకు పెంటగాన్(యూఎస్ డిపార్ట్మెంట్ ఆప్ డిఫెన్స్) సైనిక శిక్షణ ఇస్తుందని రష్యా చెబుతోంది. ఆ సైనిక శిక్షణలో అఫ్గాన్‌కి చెందిన మాజీ పైలెట్లు, ప్రత్యేక విభాగాల్లో పనిచేసిన అధికారులు కూడా ఉన్నారని తెలిపింది. వీరంతా శిక్షణ పొందిన తదనంతరం పోలాండ్ గుండా ఉక్రెయిన్‌లోకి ప్రవేశిస్తారని, యుద్ధంలో పాల్గొనేలా వారితో ఒప్పందం కూడా కుదుర్చుకుంటుందని రష్యా సైనిక దౌత్యవేత్తలు పేర్కొన్నట్లు రష్యా స్థానిక మీడియా వెల్లడించింది. ఐతే రష్యా మాత్రం తాము ఉక్రెయిన్‌లో జరుపుతున్న ప్రత్యేక సైనిక చర్యను ఇలాంటి ప్రయత్నాలు ఏ మాత్రం ప్రభావితం చేయలేదని తేల్చి చెప్పింది. రష్యాను నియంత్రించడం అసాధ్యం అని ధీమాగా చెబుతోంది. ఐతే యూఎస్ నుంచి ఈ విషయమై ఎలాంటి ప్రతిస్పందన లేదు. అలాగే పలు నివేదికల ప్రకారం... అఫ్గాన్‌లో స్పెషల్ వింగ్‌కు చెందిన పలువురు పైలెట్లు తమ విమానాలను ఇతర దేశాల సరిహద్దుల గుండా నడిపినట్లు పేర్కొంది. పైగా ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా పారిపోయిన అనేకమంది పైలెట్లును తజికిస్తాన్ అధికారులు మూడు నెలలకు పైగా నిర్బంధించారని కూడా తెలిపింది. అంతేకాదు ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం కూడా తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 100 మంది అఫ్గాన్ సైనిక సిబ్బంది మరణించారని, చాల సైనిక కుటుంబాలు దేశం విడిచి పారిపోయినట్లు యూఎన్ తన నివేదికలో వెల్లడించింది. మరోవైపు హ్యుమన్ రైట్స్ వాచ్ తన నివేదికలో డజన్ల కొద్ది అఫ్గాన్ భద్రతాదళాల సభ్యులను ఉరితీసినట్లు పేర్కొంది. అంతేకాదు అఫ్గాన్ మాజీ భద్రతా దళ సభ్యుల కుటుంబాలను సైతం తాలిబన్లు వదలలేదని తెలిపింది. (చదవండి: పారిపోండి.. చస్తారు! రష్యా బలగాలకు జెలెన్స్కీ సాలిడ్ వార్నింగ్.. ఖేర్సన్లో మిస్సైళ్ల వాన) -
విమానం గాల్లోకి ఎగిరాక పైలట్ల ఫైట్.. పాపం ప్రయాణికులు..!
పారిస్: విమానంలో ఏ చిన్న పొరపాటు జరిగినా పెను ప్రమాదానికి దారితీస్తుంది. విమానాలను నడిపే పైలట్లు ఎంతో నేర్పుతో, నైపుణ్యవంతులై ఉంటారు. సమన్వయంతో విమానాన్ని సురక్షితంగా తీసుకొస్తారు. అలాంటిది.. వారే విమానంలోని కాక్‌పుట్‌లో గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో హల్చల్ చేసి.. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. ఈ సంఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. పారిస్ నుంచి జెనీవాకు వెళ్తున్న ఎయిర్ ఫ్రాన్స్ విమానంలోని ఇద్దరు పైలట్లు గొడవకు దిగిన కారణంగా వారిని సస్పెండ్ చేశారు అధికారులు. పైలట్లు గత జూన్ నెలలో విమానం కాక్‌పిట్‌లో గొడవ పడినట్లు ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. అయితే, కొద్ది క్షణాల్లోనే గొడవ సద్దుమణిగిందని, ఆ తర్వాత విమాన ప్రయాణం సాఫీగా కొనసాగినట్లు చెప్పారు. తమ ప్రవర్తనపై మేనేజ్మెంట్ నిర్ణయం కోసం పైలట్లు ఇన్నాళ్లు వేచి ఉన్నారని చెప్పారు. ఫ్రాన్స్ పౌర విమానయాన సంస్థ భద్రతా దర్యాప్తు సంస్థ నివేదిక బయటకు రావటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జూన్‌లో జరిగిన సంఘటన నివేదిక ప్రకారం.. విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సమయానికే కాక్‌పిట్‌లో పైలట్, కోపైలట్‌ల మధ్య వివాదం మొదలైంది. దీంతో ఒకరు ఎదుటి వ్యక్తి కాలర్ పట్టుకున్నారు. దాంతో అతడిపై దాడి చేశారు మరొకరు. కాక్‌పిట్ నుంచి అరుపులు క్యాబిన్లోకి వినిపించినట్లు పలువురు తెలిపారు. దీంతో వారు వెళ్లి గొడవను ఆపారని, ఓ పైలట్ ఫ్లైట్ డెక్కు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఇదీ చదవండి: పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్ -
29 మంది పైలట్లు దుర్మరణం: ప్రధాన కారణం ఇదే!
సాక్షి:హైదరాబాద్: విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన పైలట్ల సమాచార సమాచారాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)డేటా ప్రకారం 2014 నుండి ఇప్పటివరకు విమాన ప్రమాదాల్లో 29 మంది పైలట్లు మరణించినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త రాబిన్ జాకీస్ దాఖలు చేసిన సమాచార హక్కు పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఈ సమాచారం అందించింది. గత ఎనిమిదేళ్లలో జరిగిన మొత్తం 19 ప్రమాదాల్లో ఆరు మహారాష్ట్రలోనే జరిగాయి. ఈ ఆరు ప్రమాదాల్లో 10 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర తర్వాత అత్యధిక ప్రమాదాలు మధ్యప్రదేశ్‌లో జరిగాయి. ఈ రాష్ట్రంలో రెండు ప్రమాదాల్లో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ప్రభుత్వ యాజమాన్యంలోని హెలికాప్టర్ సర్వీస్ ప్రొవైడర్ పవన్ హన్స్ మూడు విమాన ప్రమాదాలు జరగ్గా, ఇదే అత్యధికంగా ఆరు మరణాలకు దారితీసింది.ఈ 19 క్రాష్లలో చాలా వరకు ఐదు 2015లో, నాలుగు 2020లో, 2019, 2018 సంవత్సరాల్లో ఒక్కొక్కటి చోటుచేసుకున్నాయి. ఏఏఐబీ వెబ్సైట్లో ఉన్న నివేదికల ప్రకారం ప్రమాదాల వెనుక అత్యంత సాధారణ కారణం పైలట్ లోపం అని పేర్కొంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్లిద్దరూ మరణించిన సంగతి తెలిసిందే. -
ఒకే విమానంలో కో పైలెట్లుగా తల్లి కూతుళ్లు: వీడియో వైరల్
పిల్లలు పెద్దవాళ్లను ఆదర్శంగా తీసుకుని వాళ్లలా ఉన్నతోద్యోగం సంపాదించాలనుకుంటారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌ల పిల్లలు వాళ్లాలాగే సేమ్ ప్రోఫెషిన్ని ఎంచుకోవడం అత్యంత అరుదు. కానీ ఇక్కడొక కూతురు తన తల్లి చేసే వృత్తిని ఎంచుకోవడమే ఇద్దరు ఒకేచోట తమ వృత్తిని కొనసాగించడం కూడా అరుదే. వివరాల్లోకెళ్తే...ఇక్కడొక కూతురు తన తల్లిలా పైలెట్ అయ్యింది. పైగా తల్లికూతుళ్లు ఇద్దరు కో పైలెట్లుగా విమానాన్ని నడిపారు. ఇలా జరగడం అత్యంత అరుదు. ఈ మేరకు సౌత్వెస్ట ఎయిర్‌లైన్స్ తన ఇన్స్టాగ్రాం పేజీలో ఈ వీడియోని పోస్ట్ చేస్తూ తొలిసారిగా తల్లి కూతుళ్ల ద్వయం పైలెట్లుగా విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించారని పేర్కొంది. అంతేకాదు నీవు నీ సొంత కాళ్లపై నిలబడటమే కాకుండా తల్లితో కలిసి విమానాన్ని ప్రయాణాన్ని పూర్తి చేసినందుకు అబినందనలు అని సదరు మహిళకి తెలిపింది. ఈ మేరకు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Southwest Airlines (@southwestair) (చదవండి: నడిరోడ్డు పై అనూహ్య ఘటన....ఒక్కసారిగా ఆగిపోయిన వాహనాలు: వీడియో వైరల్) -
స్పైస్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే విమానాన్ని దారి మళ్లించి కరాచి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఐతే స్పైస్‌జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతోనే కరాచికి మళ్లించినట్లు ఎయిర్‌లైన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఎలాంటి ఎమర్జెన్సీ ప్రకటించలేదని విమానయాన సంస్థ పేర్కొంది. అంతేకాదు ప్రయాణీకులను దుబాయ్‌కి తీసుకువెళ్లే ప్రత్యామ్నాయ విమానాన్ని కరాచీకి పంపుతున్నామని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. ఐతే అసాధారణంగా ఇంధనం తగ్గుతున్నట్లుగా ఇండికేటర్‌ని చూపించడంతో, పైలట్లు ఇంధనం లీకేజ్ అవుతుందన్న అనుమానంతో విమానాన్ని దారి మళ్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఇంధనం లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఏవియేషన్ రెగ్యులేటర్ పేర్కొంది. (చదవండి: నైట్ క్లబ్లో కాల్పుల కలకలం...ప్రమాదవశాత్తు స్నేహితుడిని కాల్చిన వ్యక్తి) -
ఎయిర్ ఇండియా ఉద్యోగులకు టాటా గ్రూప్ శుభవార్త!
ముంబై: టాటా గ్రూపులో భాగమైన ఎయిర్ ఇండియా రిటైర్మెంట్ తర్వాల పైలట్లను మరో ఐదేళ్లపాటు తిరిగి విధుల్లో నియమించుకునేందుకు నిర్ణయం తీసుకుంది. కార్యకలాపాల్లో స్థిరత్వం కోసం ఈ విధానమని సంస్థ వర్గాలు తెలిపాయి. రిటైర్మెంట్ అయిన వెంటనే పైలట్లను కమాండర్లుగా ఐదేళ్ల కాలానికి లేదా 65 ఏళ్లు వచ్చే వరకు (ఏది ముందు అయితే అది) నియమించుకోనున్నట్టు ఎయిర్ ఇండియా డిప్యూటీ జీఎం వికాస్ గుప్తా అంతర్గత ఈ మెయిల్లో పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా తన సేవలను దేశీ, విదేశీ మార్గాల్లో పెద్ద ఎత్తున విస్తరించే ప్రణాళికలతో ఉంది. ఇందులో భాగంగా 300 విమానాలకు ఆర్డర్ చేసే సన్నాహాలతో ఉంది. దీంతో రిటైరైన పైలట్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ఎయిర్ ఇండియా తన ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విమరణ పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. -
ఇద్దరు పైలెట్ల లైసెన్స్ రద్దు చేసిన డీజీసీఏ
న్యూఢిల్లీ: జబల్పూర్ విమానాశ్రయంలోని రన్‌వే పై మార్చి 12న ల్యాండ్ అయిన ఒక విమానం విషయమై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ జరిపింది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన అలయన్స్ ఎయిర్ ఏటీఆర్-72 విమానం ఆ రోజు జబల్పూర్లో రన్‌వేని దాటి ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో దాదాపు 55 మంది ప్రయాణికులు ఉన్నారు. దర్యాప్తులో ఈ విమానం రన్‌వే సమీపంలో చాలా సేపు ల్యాండ్ అవ్వకుండా గాల్లోనే ఉందని, రన్‌వేకి దాదాపు 900 మీటర్లు దాటి ల్యాండ్ అయ్యిందని తేలింది. అలాంటి విపత్కర సమయంలో మంటలు రాజుకునే అవకాశం పొంచి ఉందని డీజీసీఏ పేర్కొంది. ల్యాండింగ్ సమయంలో విమానం సరిగా స్థిరికరించబడకపోతే వెంటనే గో అరౌండ్ కోసం అధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఆ పైలెట్లు ఇద్దరూ అవేమి చేయకుండా ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసి ఏవియేషన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఒక ఏడాది పాటు వేటు వేసింది. (చదవండి: చీర కట్టుకోవడం రాదని.. లెటర్ రాసి భర్త ఆత్మహత్య) -
చత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్ల మృతి
Chhattisgarh Helicopter Crash, రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది. రాయ్‌పూర్ విమానాశ్రయంలో ప్రభుత్వ హెలికాప్టర్ గురువారం రాత్రి 9.10 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలిన సమయంలో అందులో ఇద్దరు పైలట్లు ఉండగా.. ఇద్దరూ మృత్యువాతపడ్డారు మృతిచెందిన పైలట్లు కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ శ్రీ వాస్తవగా గుర్తించారు. రాయపూర్ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ రాకేష్ సహాయ్ ప్రమాద విషయాన్ని ధృవీకరించారు, మన పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో రాత్రి ఫ్లయింగ్ ప్రాక్టీస్ సందర్భంగా ఈ సంఘటన జరిగిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తరపున వివరణాత్మక సాంకేతిక విచారణ చేపట్టింది. సీఎం విచారం హెలికాప్టర్ ప్రమాద ఘటనపై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగెల్ విచారం వ్యక్తం చేశారు. మరణించిన ఇద్దరు పైలట్లకు నివాళులు అర్పించారు. మరణించిన పైలట్ల కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. -
Viral Video: గాల్లో ప్రాణాలు.. గగుర్పాటుకు గురిచేసిన వీడియో
Thousands tune in to watch pilots land in London: యూనిస్ తుపాను లండన్ నగరాన్ని వణికిస్తోంది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ భీకర గాలులు కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.. ప్రజలను బయటకు రావద్దని హెచ్చరికలు జారి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే లండన్ వీచిన గాలలుకి ఒక విమానం విమానశ్రయంలో ల్యాండింగ్ అయిన విధానం చూస్తే కచ్చితంగా భయమేస్తుంది. ఆ ఈదురుగాలులకి విమానం ఒక్కసారిగా రోడ్డు మీద వెళ్లుతున్న వాహనాలను ఢీ కొడుతుందేమో అనే సందేహం కలుగుతుంది. ఆ విమానంలో ప్రయాణికలు సైతం భయంతో ఊపిరి బిగబిట్టుకుని చూస్తున్నారు. అంత భయంకరంగా ఆ విమానం రన్ వే పై ల్యాండ్ అయ్యింది. అయితే పైలెట్ చాకచక్యంగా ఆ విమానాన్ని చివరికి సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వొళ్లు గగ్గుర్పాటుకు గురిచేసిన ఈ వీడియోనీ మీరు ఒకసారి వీక్షించండి. (చదవండి: బస్తా చిల్లర పైసలతో షోరూంకి వెళ్లాడు.. ఆ తర్వాత) -
భారత త్రివిధ దళాల్లో మరో చారిత్రక ఘట్టం
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో మహిళల ప్రాతినిధ్యంపై మరో చారిత్రక ఘట్టమిది. యుద్ధ హెలికాప్టర్ పైలట్లుగా శిక్షణ ఇవ్వడానికి ఇద్దరు మహిళా అధికారుల్ని ఆర్మీ ఎంపిక చేసింది. మహిళల్ని యుద్ధ విమానాలకు పైలట్లుగా నియమించాలన్న ప్రతిపాదనలకు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె ఆమోదముద్ర వేసిన ఆరు నెలల్లోనే మహిళా పైలెట్ల ఎంపిక జరిగింది. వైమానిక విభాగంలో యుద్ధ హెలికాప్టర్లను నడపడంలో శిక్షణ ఇవ్వడానికి ఇద్దరు మహిళల్ని ఎంపిక చేసినట్టుగా ఆర్మీ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూలులో వారిద్దరికీ శిక్షణ ఇవ్వనున్నట్టుగా చెప్పారు. 15 మంది మహిళా అధికారులు ఏవియేషన్ విభాగంలో చేరడానికి ముందుకు వస్తే కఠినమైన పరీక్షల అనంతరం ఇద్దరు మాత్రమే ఇందుకు అర్హత సంపాదించారని ఆ అధికారులు వివరించారు. శిక్షణ విజయవంతంగా పూర్తయితే వచ్చే ఏడాది జూలై నుంచి వారికి యుద్ధ విమానాల్ని నడిపే అవకాశం వస్తుంది. 2018లో ఫ్లయింగ్ ఆఫీసర్ అవని చతుర్వేది యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. చదవండి: వైరల్: చావు నుంచి తప్పించుకున్న మహిళలు గాలి కోసం 10 వేల మొక్కలు నాటాడు.. చివరికి గాలి అందక కన్నుమూశాడు -
పొలంలో కుప్పకూలిన విమానం
భోపాల్: పైలెట్లతో వెళ్తున్న విమానం ప్రమాదవశాత్తు వ్యవసాయ పొలంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పైలెట్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులో చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ సర్వేకు వెళ్తున్న ఈ విమానం వెళ్తున్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించిన వివరాలు గాంధీనగర్ పోలీస్ అధికారి అరుణ్ శర్మ తెలిపారు. ఆయన ప్రకారం.. భోపాల్ నుంచి గుణకు ముగ్గురు పైలెట్లతో కూడిన శిక్షణ విమానం శనివారం మధ్యాహ్నం రాజభోజ్ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. బయల్దేరిన కొద్దిసేపటికే భోపాల్ శివారులోని బిషన్‌కేడీ ప్రాంతంలో ఆ విమానం పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు పైలెట్లు గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళన చెందారు. అయితే వెంటనే విషయం గమనించి గాయపడిన వారిని పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలియలేదు. మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆర్పేశారు. చదవండి: ‘ఇటుక’ దొంగతనం చేశాడని హీరోపై బీజేపీ ఫిర్యాదు చదవండి: మమతా బెనర్జీ ఆడియో క్లిప్ వైరల్ -
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ట్రైనీ పైలట్ల పరేడ్
-
హైదరాబాద్ చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన ఉండనుంది. దుండిగల్ ఎయిర్‌పోర్స్ అకాడమీలో ట్రైనీలతో ఆయన ముఖాముఖి అయ్యారు. అలాగే శనివారం ఉదయం ట్రైనీ పైలట్ల పరేడ్‌లో రాజ్‌నాథ్ పాల్గొంటారు. మధ్యాహ్నం CASలో కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం అగ్ని మిసైల్ పరీక్షను స్వయంగా ఆయన పరిశీలించనున్నారు. రేపు సాయంత్రం పహాడీషరీఫ్‌లోని ఆర్సీఐలో డీఆర్డీవో రక్షణ పరికరాలను పరిశీలిస్తారు. Telangana: Defence Minister Rajnath Singh arrives at Indian Air Force Academy, Dundigal. The Defence Minister is on a two-day visit to Telangana.#DefenceMinster #AirForce #RajnathSingh #Telangana #Dundigal #MinisterOfDefence pic.twitter.com/bQsq8O2e28 — MD ANEES QAMAR (@MDANEESQAMAR) December 18, 2020 -
టేకాఫ్‌కి ఆల్వేస్ రెడీ అంటున్న హీరోయిన్లు
సినిమాను నడిపేది హీరో. కథలో డ్రైవింగ్ సీట్ ఎప్పుడూ తనదే. అయితే సినిమాలన్నీ ఆ దారిలోనే కాకుండా వేరే రూట్ కూడా తీసుకున్నాయి. స్టీరింగ్ సీట్‌ను హీరోయిన్‌కి ఇస్తున్నాయి. కథను గమ్యం వరకు సురక్షితంగా నడిపించగలం అని హీరోయిన్లు నిరూపిస్తున్నారు. ఇప్పుడు గమ్యం ఆకాశం వైపు మారింది. ఆకాశమే హద్దు అయింది. హీరోయిన్లు పైలట్లు అవుతున్నారు. టేకాఫ్‌కి ఆల్వేస్ రెడీ అంటున్నారు. ఆ హీరోయిన్ల విశేషాలు. తొలి లేడీ పైలట్ జాన్వీ కపూర్ టైటిల్ రోల్లో ఈ ఏడాది విడుదలైన సినిమా ‘గుంజన్ సక్సేనా’. ఫైటర్ పైలట్ నడిపిన తొలి మహిళ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గుంజన్ పాత్రలో జాన్వీ నటించారు. ఈ పాత్రలో ఒదిగిపోవడానికి హెలీకాప్టర్ నడపడం గురించి కొన్ని మెళకువలు తెలుసుకున్నారు జాన్వీ. ఒక పైలట్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కొన్ని శిక్షణా తరగతులకు హాజరయ్యారు. జాన్వీ శ్రమ వృథా కాలేదు. బాగా నటించింది అనే ప్రశంసలు దక్కాయి. డిసెంబర్లో టేకాఫ్ ‘తేజస్’ సినిమా కోసం పైలట్‌గా మారబోతున్నారు కంగనా రనౌత్. సర్వేష్ మేవార దర్శకత్వంలో కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘తేజస్’. ఇందులో ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నారామె. డిసెంబర్లో ప్రారంభం కానున్న సినిమాలోని పాత్ర కోసం కఠినమైన శిక్షణలో ఉన్నారు కంగనా. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ కోసం పెరిగిన బరువు తగ్గిస్తూ, పైలట్‌గా ఫిట్‌గా కనిపించడానికి శ్రమిస్తున్నారు. కంగనా కూడా హెలీకాప్టర్ నడిపే క్లాసులకు హాజరవుతున్నారు. ‘‘ధైర్యవంతుల పాత్రను స్క్రీన్ మీదకు తీసుకురావడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు కంగనా. కో పైలట్ అజయ్ దేవగన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ హీరోగా ‘మే డే’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతోపాటు ఓ కీలక పాత్రలో అజయ్ నటించనున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ నటిస్తున్నారని గురువారం ప్రకటించారు. అమితాబ్ బచ్చన్ పైలట్, రకుల్ కో పైలట్‌గా కనిపిస్తారు. ‘‘ఈ సినిమా చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది. త్వరలోనే శిక్షణ ప్రారంభించి టేకాఫ్‌కి రెడీ అవుతాను’’ అన్నారు రకుల్. పాత్ర ఏదైనా పర్ఫెక్ట్ అనిపించుకోవడానికి కథానాయికలు ఇష్టంగా కష్టపడుతున్నారు. హీరోయిన్ల ప్రతిభను ఛాలెంజ్ చేసే పాత్రలు మరిన్ని రావాలి. హీరోయిన్ల పాత్రల మీద గీసిన హద్దులన్నీ చెరిపేసేలా దూసుకెళ్లాలి. -
ఎయిరిండియాలో అర్థరాత్రి తొలగింపుల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 48 మంది పైలట్లను తొలగిస్తూ రాత్రికి రాత్రి ఆదేశాలు జారీ చేయడం కలకలం సృష్టించింది. కరోనా సంక్షోభం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. సకాలంలో జీత భత్యాలు చెల్లించలేదంటూ జూలై, 2019 న ఈ 48 మంది పైలట్లు రాజీనామా చేశారు. అయితే 6 నెలల నోటీసు పీరియడ్ లో ఈ రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. దీనికి అధికారిక ఆమోదం తరువాత ప్రస్తుతం వీరంతా ఎయిర్ బస్ విధుల్లో ఉన్నారు. అయితే గత రాత్రి హఠాత్తుగా తొలగింపు ఆదేశాలివ్వడం ఆందోళన రేపింది. ఇది తెలియని కొంతమంది పెలట్లు ప్రస్తుతం విధుల్లో ఉండటం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం కార్యకలాపాలు చాలా పరిమితంగా ఉన్నాయి. సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో భారీ నష్టాల్లో ఉన్నాం.. ఆర్థిక సామర్థ్యం లేదంటూ ఎయిరిండియా ఈ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. పైలట్ల తొలగింపు ఉత్తర్వులను రద్దు చేయాలనంటూ ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఐ) పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరికి, ఎయిరిండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్ కు ఒక లేఖ రాసింది. అక్రమ తొలగింపులపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. మరోవైపు కొందరు పైలట్లు న్యాయం కోరుతూ కోర్టు మెట్లు ఎక్కేందుకు సన్నద్ధమవుతున్నారు. -
వేతనాల కోతతో తీవ్ర పరిణామాలు
సాక్షి, న్యూఢిల్లీ : జీతాల కోత నిర్ణయంపై ఎయిరిండియా పైలట్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ జీతాలను భారీగా తగ్గించాలన్న ప్రభుత్వం నిర్ణయం తమ కుటుంబ సభ్యులపై వినాశకర ప్రభావాన్ని చూపించిందటూ సీనియర్ పైలట్లు ఆరోపించారు. ఈ మేరకు వారు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి హర్దీప్ పూరీకి ఒక లేఖ రాశారు. కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ‘వందే భారత్ మిషన్’ కార్యక్రమంలో ఫ్రంట్లైన్లో సేవలందిస్తున్న 60 మంది పైలట్లు వైరస్ బారిన పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైలట్ల జీతం 75శాతం వరకు వేతనాన్ని తగ్గించే ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమైందని పైలట్లు ఆగ్రహం వక్తం చేశారు. ఈ అసంబద్ధమైన, వివక్షాపూరిత నిర్ణయం తీవ్ర మానసిక ప్రభావాన్ని పడేస్తుందని, ఇది చాలాసార్లు నిరూపితమైందని ఆరోపించారు. అంతేకాదు ఇది విపరీత చర్యలకు దారితీసే అవకాశం ఉందని సీనియర్ పైలట్లు హెచ్చరించారు. మరోవైపు ఎయిరిండియా ఇటీవల లీవ్ వితౌట్ పే పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల వరకు వేతనం లేకుండా కొంతమంది ఉద్యోగులను సెలవుపై పంపించాలని నిర్ణయించింది. (కరోనా: ఎయిరిండియా ఉద్యోగులకు చేదువార్త) వందేభారత్ మిషన్ ద్వారా ఎయిరిండియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా 7,73,000 మంది భారతీయులను తీసుకొచ్చినట్టు హర్దీప్ స్వయంగా ప్రకటించారు. ఈ నెల(జూలై)16న ఆయన మాట్లాడుతూ ఎయిరిండియా మనుగడ కొనసాగాలంటే లీవ్ వితౌట్ పే నిర్ణయం తప్పదంటూ సమర్ధించారు. ఒకవేళ ఎయిరిండియా మొత్తానికే మూతపడితే ఎవరికీ ఉద్యోగాలుండవని పేర్కొన్నారు. మిగులు సిబ్బంది అధికంగా ఉన్నారనీ, దీనికి తోడు శిక్షణ పొందిన వ్యక్తులు కూడా అందుబాటులో ఉన్నారని వ్యాఖ్యానించారు. (ఆ కథనంపై చలించిన సోనూసూద్) కాగా కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ ఆంక్షలతో దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రదానంగా దేశీయ విమానయాన సంస్థలు వేతన కోతలు, సిబ్బంది కోత లాంటి ఖర్చు తగ్గించే చర్యలను చేపట్టాయి. సుమారు 70 వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ సంస్థ ఎయిరిండియాను విక్రయించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. -
విమాన ప్రమాదం.. పైలట్ల దుర్మరణం
భువనేశ్వర్: శిక్షణ విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒడిశాలోని ధెన్కనల్ జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మృతుల్ని ట్రైనీ పైలట్, అతని శిక్షకుడిగా గుర్తించారు. బిరసాలలోని ప్రభుత్వ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్‌స్టిట్యూట్ (గతి)లో ఈ ప్రమాదం చోటుచేసుకుందని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ బీకే నాయక్ తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఘటనపై విచారణ చేపట్టామని వెల్లడించారు. (చదవండి: పరీక్షల కోసం ప్రాణాలు రిస్కులో పెట్టలేం!) -
అవన్నీ తప్పుడు రిపోర్ట్స్; వారికి కరోనా సోకలేదు
ఢిల్లీ : ఎయిర్ ఇండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు కరోనా సోకిందన్న వార్తల్లో నిజం లేదని ఎయిర్ ఇండియా అధికారులు పేర్కొన్నారు. మొదట చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని,అయితే మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా నిర్థారణ అయిందని పేర్కొన్నారు. మొదట వచ్చినవి తప్పుడు రిపోర్టులని అధికారులు తేల్చి చెప్పడంతో సదరు పైలట్లు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. ఎయిర్ఇండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో వారందరిని క్వారంటైన్లో ఉంచారు. అయితే సోమవారం వారికి మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. ఒక్కరోజులోనే ఇంత తేడా ఎలా చూపింస్తుందని అధికారుల్లో అనుమానం వ్యక్తమయింది. (కరోనా : వైద్యుడి సాహసంపై ప్రశంసల జల్లు) దీంతో మొదట పరీక్షలు నిర్వహించిన కిట్‌ను పరిశీలించగా ఆ కిట్ పాడైపోయిందని తెలిసింది. ఇదే విషయమై అధికారులు స్పందిస్తూ.. ఆ ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్తల్లో నిజం లేదని. మొదట చేసిన పరీక్షల్లో పాజిటివ్ రావడం వెనుక తప్పుడు రిపోర్టులతో పాటు కిట్ సరిగా లేకపోవడం ఒక కారణమని వివరించారు. ఈ విషయం తెలుసుకున్న పైలట్లు తమకు కరోనా లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. 'ఇది నిజంగా అదృష్టమనే చెప్పాలి. మాకు కరోనా పాజిటివ్ వచ్చిందని మొదట తెలియగానే చాలా భయపడ్డాము. మా ద్వారా ఇంకా ఎంతమందికి సోకుతుందేమోనని చాలానే భయపడ్డాం. కానీ మాకు పరీక్షలు నిర్వహించింది పాల్టీ కిట్‌తో అని తెలుసుకున్నాం' అంటూ ఒక పైలట్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే వీరితో పాటు ఉన్న ఇంజనీర్, టెక్నిషియన్‌కు కూడా ఆదివారం కరోనా పాజిటివ్ అని తేలింది.సోమవారం వీరికి కూడా పరీక్షలు నిర్వహించగా, వారి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. -
కరోనా : ఎయిరిండియా పైలట్లకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభకాలంలో ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని మరిన్ని ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో సుమారు 200 పైలట్ల కాంట్రాక్టులను తాత్కాలికంగా రద్దు చేసింది. పదవీ విరమణ తర్వాత తిరిగి ఉద్యోగం పొందిన 200 మంది పైలట్ల కాంట్రాక్టులను తాత్కాలికంగా నిలిపివేశామని ఎయిరిండియా సీనియర్ అధికారి గురువారం తెలిపారు. గత కొన్ని వారాలలో దాదాపు అన్ని విమానాలు నిలిచిపోవడంతో ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని ఎయిరిండియా ప్రకటించింది. రానున్న మూడు నెలల కాలానికి క్యాబిన్ సిబ్బంది మినహా అన్ని ఇతర ఉద్యోగుల జీత భత్యాల్లో 10 శాతం కోతను ఇప్పటికే తగ్గించింది. తాజాగా పైలట్ల నెత్తిన మరో పిడుగు వేసింది. కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టడానికి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్త లాక్ డౌన్ పరిస్థితి కొనసాగనుంది. ఈ క్రమలో ఎయిరిండియా దేశంలో అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. అటు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాలో వాటాల విక్రయానికి కేంద్రం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
విమాన సిబ్బందికి డ్రగ్ పరీక్షలు!
న్యూఢిల్లీ: విమానాలు నడిపే పైలట్లకు, ఇతర సిబ్బందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రతిపాదించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. నియమ నిబంధలన్నీ అమల్లోకి వస్తే విమానంలో పనిచేసే సిబ్బందితోపాటు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకూ ఈ పరీక్షలు నిర్వహిస్తామని వారు చెప్పారు. తొలిదశలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో ఈ పరీక్షలను చేపడతారు. రెండు దశల్లో జరిగే ఈ పరీక్షలో ఒకటి విమానాశ్రయం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కాంప్లెక్స్‌లలో జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్‌ను వీడియోలో రికార్డు చేస్తారు. గంజాయి, ఓపియం తదితర మత్తుమందులు తీసుకున్నట్లు స్క్రీనింగ్ టెస్ట్‌లో బయటపడితే, మళ్లీ నిర్ధారణకు ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. డీజీసీఏ అధికారుల నేతృత్వంలో ఏటా ఒక్కో సంస్థ సిబ్బందిలో పదిశాతం మందికి ఈ పరీక్షలు చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో మత్తుమందులు తీసుకున్నట్లు తెలిస్తే ఆ ఉద్యోగిని భద్రత వంటి కొన్నిరకాల విధుల నుంచి తప్పిస్తారు. తదుపరి పరీక్షల్లోనూ మత్తుమందులు తీసుకున్నట్లు రూఢి అయితే తగిన రీహాబిలిటేషన్ సెంటర్లకు పంపుతారు. -
విమానం నుంచి బయటికి పంపాలని నానా రభస..
విమానం హఠాత్తుగా నిలిపివేయడంతో వెంటనే మమ్మల్ని బయటికి పంపాలంటూ సిబ్బందిపై ప్రయాణికులు దౌర్జన్యం చేసిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఢిల్లీ నుంచి ముంబయికి గురువారం సాయంత్రం ప్రయాణికులతో బయలుదేరింది. కానీ కొద్ది సేపటికే ఇంజిన్‌లో సాంకేతికత లోపించడంతో విమానంలోని పైలట్ తిరిగి రన్‌వే మీదకు తీసుకువచ్చాడు. ఈ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు అసలేం జరిగిందో తెలుసుకోకుండా క్యాబిన్ క్రూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఊరుకోకుండా కాక్‌పిట్ డోర్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించారు. 'ఒక ప్రయాణికుడు మేము ఎంత చెప్పినా వినకుండా ఇప్పుడు పైలట్ బయటికి రాకుంటే కాక్‌పిట్ డోరును బద్దలు కొడాతానంటూ నానా రభస చేశాడు. మరో మహిళ ఏకంగా మా సిబ్బందిలో ఒకరి చేయి పట్టుకొని వెంటనే మెయిన్ ఎగ్జిట్ గేట్‌ను తొందరగా ఓపెన్ చేయాలంటూ దురుసుగా ప్రవర్తించారు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా ప్రయాణికులు ఇలా దౌర్జన్యం చేయడం మాకు చాలా బాధగా అనిపించిందంటూ' సిబ్బంది వాపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎయిర్‌లైన్స్ అధికారులు ప్రయాణికుల దురుసు ప్రవర్తనపై ఒక రిపోర్టును అందజేయాలంటూ విమాన సిబ్బందిని కోరింది.(వైరల్: అమ్మాయిల వేషధారణలో అబ్బాయిలు) 'ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని నిలిపివేశాడు. అంతమాత్రానికే ప్రయాణికులు ఇలా దౌర్జన్యం చేయడం ఏం బాలేదు. దీనిపై సిబ్బంది రిపోర్టు అందజేయగానే విచారణ నిర్వహిస్తాము.దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికులపై చర్యలు తీసుకుంటామని' అధికారి పేర్కొన్నారు. అయితే ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. విమానం నిలిపివేయడానికి కారణం ఏంటో తెలుసుకోకుండా ప్రయాణికులు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. -
ఎయిరిండియా పైలెట్ల సంఘం అల్టిమేటం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయివేటీకరణకు రంగం సిద్ధమవుతున్న తరుణంలోఎయిరిండియా పైలట్ల యూనియన్ ఘాటుగా స్పందించింది. తమకు రావ్సాలిన బకాయిలపై ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఎలాంటి నోటీసు పీరియడ్ (నోటీసు పీరియడ్ ఆరు నెలలు) ఇవ్వకుండా తక్షణమే సంస్థనుంచి నిష్క్రమించడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి డిసెంబరు 23న ఒక లేఖ రాశారు. ఎయిరిండియా అమ్మకానికి ప్రభుత్వం సిద్ధమైనందున, సంస్థ భవిష్యత్తుపై అనిశ్చితి మధ్య పనిచేసే పరిస్థితిలో తాము లేమని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఎ) హెచ్చరించింది. 2020 మార్చి 31 నాటికి ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించకపోతే ఎయిరిండియా మూసివేయడమే అన్న మంత్రి ప్రకటన ఆందోళన కలిగించే విషయమని లేఖలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకుండా చట్టబద్ధమైన తమ బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని ఐసీపీఏ కోరింది. గత రెండు మూడేళ్లుగా అనిశ్చితితో జీవిస్తున్నాం. ఫలితంగా చాలామంది ఉద్యోగులు ఈఎంఐ సహా ఇతర చెల్లింపులను చేయలేకపోయారు. ఇది తమ కుటుంబాలను బాగా ప్రభావితం చేసింది. ఇక తమ సహనం నశించి పోతోందని లేఖలో పేర్కొంది. ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ పరిస్థితి తమకు రాకూడదని కోరుకుంటున్నామంది. మరోవైపు ఎయిరిండియా విక్రయంలో భాగంగా డైరెక్టర్ (ఆపరేషన్స్) డైరెక్టర్ (కమర్షియల్) డైరెక్టర్ (పర్సనల్) ముగ్గురు డైరెక్టర్లను పౌర విమానయాన మంత్రిత్వశాఖ నియమించు కోనుంది. వీరు సంస్థ ఎండీ అశ్వని లోహానీకి రిపోర్టు చేయాల్సి వుంటుంది. మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం జనవరి 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగా దాదాపు 800పైగా పైలట్లు పనిస్తున్న ఎయిరిండియా రుణ భారం రూ. 58,000 కోట్లకు పై మాటే. ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేసిన రెండవ ప్రయత్నం విఫలమైతే విమానయాన సంస్థను మూసివేయవలసి ఉంటుందని హర్దీప్ సింగ్ పూరి నవంబర్‌లో రాజ్యసభకు తెలియజేశారు. -
విమానం టాయిలెట్లో కెమెరా.. రెండేళ్లుగా పోరాటం
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఇద్దరు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ పైలట్లు విమానంలో కెమెరాను ఉంచారన్న అభియోగంతో ఫిబ్రవరి 2017 అరీదీనా కోర్టులో కేసు నమోదైంది. ఈ ఘటన గురించి ఫ్లైట్ అటెండెంట్ రెనీ స్టెయినాకర్ మాట్లాడుతూ తాను కాక్‌పీట్‌లోకి ప్రవేశించగానే పైలట్లు ఐపాడ్లో ప్రత్యక్షంగా వీడియోను చూస్తున్నారని ఆమె ఆరోపించింది. తనతో పాటు ఫ్లైట్ 1088 లో ఉన్న మరో ముగ్గురు ఫ్లైట్ అటెండెంట్లు, విమానంలో లేని స్టెయినాకర్ భర్తను సైతం తీవ్ర వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎయిర్‌లైన్స్ నియమాల ప్రకారం ఇద్దరు పైలట్లు కాక్‌పిట్‌లో ఉండాలన్న నిబంధనల నేపథ్యంలో కెప్టెన్ టెర్రీ గ్రాహం టాయిలెట్‌కు వెళ్లే క్రమంలో తనను కాక్‌పిట్‌లోకి వెళ్లాల్సిందిగా సూచించాడంది. అప్పుడే ఈ విషయం తన కంటపడిందని.. కో పైలెట్ రస్సెల్ తన ఐపాడ్లో కెమెరాలో సదరు వీడియోలు చూస్తున్నాడని తెలిపింది. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించగా భద్రతా చర్యలలో భాగంగా నైరుతి బోయింగ్ 737-800 విమానాలన్నింటిలోనూ ఈ వ్యవస్థ ఏర్పాటు చేయబడిందని రస్సెల్ తనను నమ్మించే ప్రయత్నం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ మాత్రం విమానంలో కెమెరాలు పెట్టారన్న వార్తలను ఖండించింది. తమ ఎయిర్‌లైన్స్ మీద వచ్చిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలో తమ ఉద్యోగులు, ప్రయాణికులకు రక్షణ కల్పించడంలో ఏమాత్రం రాజీ పడబోమని తెలిపారు. ఇక 2017లో పిట్స్బర్గ్ నుంచి ఫోనిక్స్‌కు విమానం వెళ్తున్న క్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన కేసు ప్రస్తుతం ఫోనిక్స్‌లోని ఫెడరల్ కోర్టుకు మార్చబడింది. ఇందుకు సంబంధించిన విచారణలో భాగంగా తన క్లైంట్ స్టెయినాకర్‌ను మాదకద్రవ్య పరీక్షల కంటే కూడా ఎక్కువగా వేధించారని ఆమె తరుపు న్యాయవాది చెప్పారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ పైలట్లు నేరం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె మాత్రం న్యాయ పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. -
అదిగో.. ఆకాశంలో సగం
మగవాళ్లు నడిపితే ఒకలాగా... ఆడవాళ్లు నడిపితే ఒకలాగా ఎగరవు విమానాలు. అయినప్పటికీ ఆడవాళ్లకు ఎప్పటికో గానీ విమానం నడిపే చాన్స్ రాలేదు! ఇప్పుడైతే ఉమన్ పైలట్లలో.. ఇండియానే నెంబర్ వన్. ఓసారి ఆకాశంలోకి చూడండి. అక్కడ కనిపించే ఆత్మవిశ్వాసపు రెక్కల్లో సగం భారతీయ మహిళలవే! ముంబయికో, చెన్నైకో వెళ్లడానికి హైదరాబాద్‌లో విమానం ఎక్కి సీటు బెల్టు పెట్టుకున్న తర్వాత ఓ వాయిస్ వినిపిస్తుంది. ఈ విమానాన్ని నడుపుతున్న తన పేరు ఫలానా అని, ఫలానా టైమ్‌కి గమ్యస్థానంలో దింపుతానని ప్రయాణికులకు ఆత్మవిశ్వాసంతో కూడిన వినమ్రతతో చెప్తుందా గొంతు. పైలట్ స్త్రీ అని తెలిస్తే ‘వావ్... ఈ విమానాన్ని నడుపుతున్నది లేడీనా’ అనుకుంటాం. అలా అనుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటాయి. అదే సమయంలో ముందు సీట్లోంచో వెనుక సీట్లోంచో ‘సేఫ్‌గా ల్యాండ్ అవుతామా’ అని పిల్లికూతలు వినిపించినా ఆశ్చర్యం లేదు. పైగా తమ జోక్‌కు తామే కిసుక్కుమంటుంటారు. ఈ కిసుక్కుమనేవాళ్లకు తెలియని సంగతి ఒకటుంది. అమ్మాయిలు ఎదిగారని, ఆ ఎదగడం అంతా ఇంతా కాదని, ఏకంగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగారని, నిన్నా నేడూ కాదు.. ఏనాడో ఎదిగారని! మన దగ్గరే ఎక్కువమంది! ఒకప్పుడు అమ్మాయిలు... ‘అదిగో నవలోకం... విరిసే మనకోసం’ అని ఆకాశంలోకి చూసి పాటపాడుకుని అంతటితో సంతోషపడేవాళ్లు. ఈ తరం అమ్మాయిలు... ‘ఇదిగో నవలోకం... మనమే నిర్మించాం’ అంటున్నారు. యూనిఫామ్ ధరించి ధీమాగా విమానం ఎక్కేసి కాక్‌పిట్‌లో కూర్చుని టోపీ సవరించుకుంటున్నారు. అష్టాచెమ్మాలో పావులు కదిపినంత సులువుగా విమానాలను కంట్రోల్ చేస్తున్నారు. ఆకాశంలో ఎగిరే విమానాలు అమ్మాయిల కంట్రోల్లోకి వచ్చేశాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల మహిళలు సాధించిన గొప్పతనానికి మనం మురిసిపోవడం కాదిది. అచ్చంగా మన భారతీయ మహిళలు సాధించిన గొప్పతనం. పురుషులతో పోలిస్తే మనదేశంలో మహిళా పైలట్లు ప్రస్తుతం 12.4 శాతం ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కలిపి చూసుకున్నా మహిళా పైలట్ల పర్సంటేజ్ 5. 18 మాత్రమే. అయితే ఇదేదో చిన్న పెద్దా దేశాలను కలుపుకుని మనం ముందున్నాం అని చెప్పుకునే ప్రయత్నం కూడా కాదు. ‘అభివృద్ధి చెందిన దేశం’ అనే ట్యాగ్‌లైన్ తగిలించుకున్న అమెరికాలో మహిళా పైలట్లు 5.1 శాతమే ఉన్నారు. ఫ్రాన్స్‌లో 7.6 శాతం ఉంటే జపాన్‌లో 5.6 శాతం పైలట్ మహిళలున్నారు. ఇండియాదే తొలి టేకాఫ్ మనదేశంలో తొలి పైలట్ మహిళ సరళాతక్రాల్. ఆమె 1936లో విమానం నడిపితే అప్పుడది ఒక సంచలనం అయింది. ఎనభై ఏళ్ల తర్వాత ఇప్పుడు అవనీ చతుర్వేది త్రయం (మోహనాసింగ్, భావనాకాంత్, అవని చతుర్వేది) యుద్ధ విమానాలు నడిపితే ‘ఆహా’ అంటూ దేశంలో మరొక దరహాసం. ప్రస్తుత తాజా సర్వే రిపోర్టు మనదేశానికి ఓ కిరీటం. అప్పట్లో సరళా తక్రాల్ జిప్సీ మోత్ విమానాన్ని ఎవరి సహాయం లేకుండా ఒక్కరే నడిపిన్పటికి ఆమె వయసు 21. అప్పటి సమాజం ఉన్న తీరుకు తగ్గట్లే సరళకు పదహారేళ్లకే పెళ్లయింది. ఆమె ఇంట్లో అప్పటికి తొమ్మిది మంది మగవాళ్లు పైలట్లుగా ఉన్నారు. ఆమె భర్త కూడా పైలటే. దాంతో అప్పట్లో పైలట్ కావాలనే సరళ ముచ్చట సంచలనం అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాలేదు. ఆమె వేసిన తొలి అడుగులు... ఇన్నేళ్లకి ఓ రహదారిని నిర్మించాయి. మనదేశాన్ని మహిళా పైలట్ల సంఖ్యలో ముందువరుసలో నిలిపాయి. ముగ్గురమ్మాయిలకంటే ముందు మన మహిళలు ఆల్ ఉమన్ క్రూతో విమానాన్ని నడిపి రికార్డు సృష్టించారు. ఉమెన్స్ డే సందర్భంగా 2017, మార్చి ఎనిమిదవ తేదీన ఎయిర్ ఇండియా ఈ ప్రయోగాన్ని చేసింది. క్షమతా బాజ్‌పేయి ఆధ్వర్యంలోని మహిళల బృందం ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి విమానాన్ని నడిపింది. మహిళలు ఏకబిగిన అంత ఎక్కువదూరం (12, 341 కిలోమీటర్లు) విమానం నడపడం ప్రపంచ రికార్డు. ఇలా అవనిలో సగం, ఆకాశంలో సగం అంటూ అవకాశాలను అందిపుచ్చుకుంటూనే ఉన్నారు. రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. – మంజీర అవకాశమే సోపానం విమానయాన రంగంలో మహిళల సేవలను చాలా కొద్ది దేశాలు మాత్రమే సమర్థంగా వినియోగించుకుంటున్నాయి. ఆ దేశాలు మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తూ దేశనిర్మాణంలో వారి భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తున్నాయి. మనదేశం మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 2017 ప్రకారం 26 వారాల జీతంతో కూడిన సెలవు ఇస్తోంది. అంతకు ముందు మెటర్నిటీ లీవ్ పన్నెండు వారాలు మాత్రమే ఉండేది. అలాగే విమానయాన కంపెనీలు పైలట్లకు సీనియారిటీని బట్టి నెలకు మూడు నుంచి ఎనిమిది లక్షల వేతనాన్ని ఇస్తున్నాయి. వేతనం విషయంలో మహిళలకు ఎటువంటి వివక్ష ఉండదు. మహిళలకు మగవాళ్లతో సమానంగా వేతనాలిస్తున్నాయి. రక్షణ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాయి. మహిళా పైలట్లను ఇంటి నుంచి పికప్ చేసుకుని, డ్యూటీ దిగిన తర్వాత ఇంట్లో డ్రాప్ చేయడంతోపాటు వారికి రక్షణగా సాయుధులైన గార్డును కూడా నియమిస్తోంది. -
సీనియర్ పైలట్ ఘనకార్యం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ఇద్దరు పైలట్ల మధ్య ఈగో సమస్య వివాదం రేపిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందులోనూ తన కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళా కో-పైలట్ సూచనలు వినడానికి ఓ సీనియర్ మగ పైలట్ ససేమిరా ఇష్టపడలేదు. ఆఫ్టర్ ఆల్ ఓ మహిళ చెబితే తాను వినాలా అనుకున్నాడో ఏమో కానీ.. మూర్ఖంగా ప్రవర్తించాడు..అత్యవసర సమయంలో మహిళా సహ పైలట్ హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా విమానాన్ని పెద్ద ప్రమాదంలోకి నెట్టాడు. అయితే దురదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ... తీవ్ర ఆందోళనకు దారి తీసింది. 2017లో జరిగిన ఈ ఘటనపై జరిపిన విచారణలో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. 102 మంది ప్రయాణికులతో అబుదాబి నుంచి కోచికి బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఐఎక్స్ 452 విమానం వాతావరణం అనుకూలించక పోవడంతో క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. భారీ వర్షం వల్ల పైలట్లకు రన్‌వే కనిపించలేదు. దీంతో విమానం రన్‌వే మీద నుంచి రైన్ వాటర్ డ్రైనేజీలోకి జారుకుంది. ఫలితంగా విమాన చక్రాలు డ్రైనేజీలో ఇరుక్కున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. దీంతో అధికారుల్లో, ప్రయాణీల్లో తీవ్ర ఆందోళనకుదారితీసిన ఈ ఘటనపై సీనియర్ అధికారులు విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ).. విమానం కమాండింగ్ బాధ్యతల్లో ఉన్న సీనియర్ పైలట్‌దే తప్పని తేల్చింది. తన కంటే 30 ఏళ్ల వయస్సు తక్కువున్న కో-పైలట్ హెచ్చరికలను పట్టించుకోకుండా విమానాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. భారీ వర్షం వల్ల విమానం రన్‌వే మార్క్స్ కనిపించడం లేదని, విమానాన్ని కాస్త నెమ్మదిగా నడపాలని కో-పైలట్.. సీనియర్ పైలట్‌ను కోరింది. అయితే, ఆమె మాటలు వినకుండా మొండిగా విమానాన్ని నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ నేపథ్యంలో డీజీసీఏ..ఈ మగ పైలట్ లైసెన్సును మూడు నెలలపాటు రద్దు చేసింది. -
గుడ్ న్యూస్ చెప్పిన విస్తారా
దేశీయ విమానయాన సంస్థ విస్తారా గుడ్ న్యూస్ చెప్పింది. వందమందికి పైగా పైలట్లను, 400 మందికి పైగా క్యాబిన్ ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించినట్టు సమాచారం. ఈనియామకాల్లో ముఖ్యంగా రోడ్డున పడ్డ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనుందట. తద్వారా అప్పుల సంక్షోభంలో చిక్కుకుని, కార్యకలాపాలను నిలిపివేసిన దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు భారీ ఊరటనివ్వనుంది. అలాగే విస్తారా నిబంధనలు, స్టాండర్డ్స్‌కు అనుగుణంగా వీరికి (జెట్ ఎయిర్వేస్కు చెందిన పైలట్లు, ఇంజనీర్లు, ఇతర సిబ్బందికి) సంబంధిత విక్షణను కూడా ఇవ్వనుందని ఇండస్ట్రీకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. అంతేకాదు జెట్ ఎయిర్వేస్కు చెందిన 737 బోయింగ్ విమానాలను కూడా విస్తారా తన ఖాతాలో చేర్చుకోనుంది. త్వరలోనే అంతర్జాతీయ సర్వీసులను కూడా ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ నియమకాలని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై విస్తారా అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
ఆ ఉద్యోగులను ఆదుకుంటాం..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సమస్యలతో మూసివేత అంచున నిలిచి ఉద్యోగాలు కోల్పోయిన జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు తమ సంస్థలో అవకాశం ఇస్తామని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు. తాము విస్తరణ ప్రణాళికలతో ముందుకెళుతున్న క్రమంలో జెట్ ఎయిర్వేస్ మూసివేత కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాము తొలుత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. తామిప్పటికే 100 మందికి పైగా పైలట్లు, 200 మంది క్యాబిన్ సిబ్బంది, 200 మందికి పైగా సాంకేతిక, విమాన సిబ్బందికి ఉద్యోగాలు ఇచ్చామని సింగ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాము తమ విమాన సేవలను మరింత విస్తరిస్తామని, మరింత మంది జెట్ ఉద్యోగులకు అవకాశం ఇస్తామని చెప్పారు. ప్రయాణీకులకు అసౌకర్యాన్ని నివారించేందుకు అన్ని చర్యలూ చేపడతామని తెలిపారు. మరోవైపు ఎయిర్ ఇండియా సైతం జెట్ ఎయిర్వేస్ రూట్లలో తమ సర్వీసులను నడిపేందుకు ప్రయత్నిస్తోంది. నగదు సమస్యలతో సతమతమవుతున్న జెట్ ఎయిర్వేస్కు ఎమర్జన్సీ ఫండ్స్‌ను సమకూర్చేందుకు బ్యాంకర్లుమ నిరాకరించడంతో సంస్థ తన విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్ను కొనేవారే లేరా?
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఒక వైపు తమ వేతన బకాయిలు చెల్లించకపోతే విధులను హాజరుకామని తేల్చి చెప్పిన పైలట్లు తాజాగా జెట్ ఎయిర్వేస్కు లీగల్ నోటీసులిచ్చారు. వేతన బకాయిలను ఈనెల 14 లోగా అందించాలని డిమాండ్ చేస్తూ, జెట్ ఎయిర్వేస్ నూతన యాజమాన్యానికి పైలట్ల సంఘం (నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్-నాగ్) లీగల్ నోటీస్ జారీ చేసింది. సంస్థ యాజమాన్యం బ్యాంకుల చేతికి వచ్చినా, పరిస్థితిలో మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేసిన నాగ్ సంస్థ సీఈవో వివేక్ దుబేకు ఈ నోటీసులు పంపించారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వేతన బకాయిలు ఈ నెల 14 నాటికి జీతాలుచెల్లించాలని, అలాగే ఇకపై ప్రతినెలా 1వ తేదీ కల్లా వేతనాలు అందించాలని కోరుతూ నూతన యాజమాన్యానికి నాగ్ నోటీసులిచ్చింది. మరోవైపు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐవోసీ) మరోసారి ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. బకాయిలు చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం ఈ వారంలో ఇది రెండవ సారి. అలాగే జెట్ఎయిర్వేస్లోని వాటాలను విక్రయించేందుకు ఎస్‌బ్యాంకు బిడ్లను ఆహ్వానించింది. ఇప్పటివరకు ఈ వాటాలను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ ఆసక్తిని కనబర్చక పోవడంతో గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించింది. జెట్ ఎయిర్‌వేస్‌లోని సుమారు 75శాతం వాటాల కొనుగోలుకు బిడ్లను స్వీకరించే గడువును ఏప్రిల్12వ తేదీ శుక్రవారం వరకు పొడిగించామని ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ప్రకటించింది. ఇది ఇలా వుంటే నెదర్ల్యాండ్స్ ఆమ్‌స్టర్‌డాంలోని చిపోల్ విమానాశ్రయంలో జెట్ ఎయిర్వేస్ విమానాన్ని నిలిపిశారు. బకాయిలు చెల్లించని కారణంగానే ముంబైకు చెందిన జెట్ విమానాన్ని దాదాపు ఆరు గంటలపాటు ఎయిర్‌పోర్టులో నిలిపివేశారు. ఈ ఘటనపై స్పందించిన జెట్ ఎయిర్వేస్ నిర్వహణా కారణాల వల్ల జెట్ విమానం 9డబ్ల్యు 231 ఆలస్యంమైందని, ప్రయాణీకుల సౌకర్యార్థం సంబంధిత చర్యలు తీసుకున్నామంటూ వివరణ ఇచ్చింది. -
వేతనాలపై జెట్ ఎయిర్వేస్ మెలిక
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ వేతన చెల్లింపులపై చేతులెత్తేసింది. డిసెంబర్ వరకూ ఉన్న వేతన బకాయిలే చెల్లిస్తామని స్పష్టం చేసింది. వేతన బకాయిలను పూర్తిగా పరిష్కరించకుంటే ఏప్రిల్ 1 నుంచి విమాన సేవలను నిలిపివేస్తామని పైలట్లు యాజమాన్యాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా ఇంజనీర్లు, సీనియర్ సిబ్బంది సహా పైలట్లకు నాలుగు నెలల నుంచి వేతన చెల్లింపు నిలిచిపోయింది. మార్చి 31 నాటికి బకాయిలు చెల్లించడంతో పాటు రానున్న మాసాల్లో వేతన చెల్లింపులపై రోడ్‌మ్యాప్ ప్రకటించని పక్షంలో విమానాలను ఎగరనీయమని సిబ్బంది అల్టిమేటం జారీ చేశారు. ఇక డిసెంబర్ వేతనంలోనే 87.50 శాతం బకాయిని చెల్లించేందుకు ముందుకు వచ్చిన సంస్థ ప్రస్తుతం ఇంతవరకే చెల్లిస్తామని, సంస్థను గాడిలో పెట్టే ప్రక్రియ కొనసాగుతున్నందున సిబ్బంది డిమాండ్‌ను నెరవేర్చేందుకు ఆశించిన సమయం కంటే మరికొంత సమయం పడుతుందని జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దూబే పేర్కొన్నారు. మరోవైపు జెట్ ఎయిర్వేస్లో ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు వాటా కల్పించేందుకు సంస్థ చైర్మన్ నరేష్ గోయల్, ఆయన భార్య అనిత బోర్డు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. -
పైలట్లకు ఎయిర్ ఇండియా షాక్
సాక్షి, న్యూఢిల్లీ : నిధుల లేమితో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ ఎయిర్‌లైనర్ ఎయిర్ ఇండియా పైలట్లకు షాక్ ఇచ్చింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కంపెనీ నిర్ధేశించిన ఆహార పదార్ధాలనే ఆర్డర్ చేయాలని, స్పెషల్ మీల్స్‌ను ఆర్డర్ చేయడం కుదరదని పైలట్లకు స్పష్టం చేసింది. సంస్థ నిర్దేశించిన మీల్స్ షెడ్యూల్‌కు భిన్నంగా విమాన సిబ్బంది స్పెషల్ మీల్స్ ఆర్డర్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని..ఇది సంస్థ నిబంధనలకు విరుద్ధమని పైలట్లకు పంపిన ఈమెయిల్ సందేశంలో ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ అమితాబ్ సింగ్ పేర్కొన్నారు. ఆరోగ్య కారణాలతో వైద్యుడి సిఫార్సుతో మాత్రమే సిబ్బంది స్పెషల్ మీల్స్‌ను ఆర్డర్ చేయవచ్చని వివరణ ఇచ్చారు. కాగా, పైలట్లు తమ కోసం బర్గర్లు, సూప్‌ల వంటి స్పెషల్ మీల్స్‌ను ఆర్డర్ చేసు్తన్నట్టు వెల్ల్లడైందని, ఇది సంస్థ ఆహార వ్యయాల్లో పెరుగుదలతో పాటు ఆహార నిర్వహణ వ్యవస్థను డిస్టబ్ చేస్తోందని ఎయిర్ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. -
ప్రధానికి జెట్ ఎయిర్వేస్ పైలట్ల లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్ది నెలలుగా పెండింగ్‌లో ఉన్న తమ వేతనాలను చెల్లించాలని యాజమాన్యానికి సూచించాలని కోరుతూ జెట్ ఎయిర్వేస్ పైలట్లు ప్రధాని నరేంద్ర మోదీ, పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభులకు గురువారం లేఖ రాశారు. జెట్ ఎయిర్వేస్ దివాళా అంచున ఉందని, ఈ సంస్థ ఉనికిని కోల్పోతే వేలాది మంది ఉద్యోగులు వీధినపడతారని తాము ఆందోళన చెందుతున్నామని జెట్ ఎయిర్వేస్ పైలట్లతో కూడిన ట్రేడ్ యూనియన్ సంస్థ నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ) పేర్కొంది. మార్చి 31లోగా తమ వేతనాలను పూర్తిగా చెల్లించకుంటే ఏప్రిల్ 1 నుంచి విధులకు దూరంగా ఉంటామని, విమాన సేవలను నిలిపివేస్తామని వారు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. మూడు నెలలుగా తమకు సంస్థ జీతాల చెల్లింపులను నిలిపివేసిందని, జీతాలు చెల్లించాలంటూ తాము పలుమార్లు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ప్రధానికి రాసిన లేఖలో పైలట్లు పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిలతో పాటు రోజువారీ చెల్లింపులనూ చేపట్టలేక చేతులెత్తేసింది. పలు విమాన సర్వీసులను జెట్ ఎయిర్వేస్ నిలిపివేయడంతో విమాన ప్రయాణీకలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జెట్ ఎయిర్వేస్ను ఆదుకునేందుకు బ్యాంకులు తమ రుణాలను వాటాలుగా మార్చుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనకు అనుగుణంగా బ్యాంకులు బెయిలవుట్ ప్యాకేజ్‌కు రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. -
‘ఏప్రిల్ 1 నుంచి ఆ విమానాలు బంద్’
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్కు మరో సవాల్ ముంచుకొచ్చింది. ఈ మాసాంతంలోగా జీతాలు చెల్లించకుంటే విమానాలు పైకి ఎగరవని, తమ సేవలు నిలిపివేస్తామని పైలట్లు జెట్ ఎయిర్వేస్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. కంపెనీ దేశీయ పైలట్లతో కూడిన నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్‌లో మంగళవారం విస్తృతంగా చర్చించిన అనంతరం వారు ఈ ప్రకటన చేశారు. సంస్థను చక్కదిద్దే ప్రణాళికపై స్పష్టత రాకున్నా, వేతన చెల్లింపులపై పరిష్కారం లభించకపోయినా ఏప్రిల్ 1 నుంచి తాము విధులకు హాజరుకాబోమని గిల్డ్ స్పష్టం చేసింది. వేతనాలపై యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఏవియేటర్స్ గిల్డ్ గతవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వర్కు లేఖ రాసింది. -
కుప్పకూలిన మిగ్ యుద్ధ విమానం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని బుద్గాంలో బుధవారం మిగ్ యుద్ధ విమానం కుప్పకూలింది. యుద్ద విమానం కుప్పకూలడంతో ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారని అధికారులు వెల్లడించారు. రొటీన్ సైనిక విన్యాసాల్లో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుందా, యుద్ధ సన్నాహక చర్యల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపై స్పష్టత లేదు. మిగ్ యుద్ధ విమానం కూలిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విమానం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. -
పలు విమానాలు రద్దు :కంపెనీ వివరణ
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశీయ రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరిన్ని కష్టాలు తప్పడంలేదు. అనూహ్యంగా విమానాలను రద్దు చేసిన విమర్శల పాలైన జెట్ ఎయిర్వేస్ మరోసాకి 14 విమానాలను రద్దు చేసింది. పైలట్ సెలవు కారణంగా దేశీయంగా వివిధ ప్రదేశాలకు ఈ విమానాలను రద్దు చేయడం కలకలం రేపింది. గత కొన్నినెలలుగా సిబ్బందికి ముఖ్యంగా పైలట్లకు వేతనాలను సక్రమంగా చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనారోగ్యంతో విధులకు హాజరు కాలేకపోతున్నామంటూ వారు యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో సుమారు 14 సర్వీసులను సంస్థ ఆదివారం రద్దు చేసింది. అనూహ్యంగా విమానాలను రద్దు చేయడంతో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. దీంతో వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. జీతం, ఇతర బకాయిలు చెల్లింపుల వ్యవహారంలో జెట్ ఎయిర్వేస్ వైఖరిపై జాతీయ ఏవియేటర్స్ గిల్డ్ (నాగ్)కు ఫైలట్లు ఫిర్యాదు చేశారు. అనారోగ్యం సాకుగా చూపిన పైలట్లు భారీ సంఖ్యలో విధులకు గైర్హాజయ్యారు. అలాగే ఈ పరిస్థితుల్లో పనిచేయలేమంటూ సంస్థ ఛైర్మన్ నరేష్‌గోయల్‌కు లేఖ రాసినట్టు కూడా తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ వివరణ మరోవైపు దీనిపై స్పందించిన జెట్ ఎయిర్వేస్ విమానాల రద్దుకు పైలట్ల నిరసన కారణం కాదని వివరణ ఇచ్చింది. ఊహించని కార్యాచరణ పరిస్థితి మూలంగా విమానాలను రద్దు చేశామని పేర్కొంది. ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతోపాటు, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. అయితే ఎన్ని సర్వీసులను రద్దు చేసిందీ స్పష్టత ఇవ్వలేదు. కాగా అక్టోబరు, నవంబరు నెలల్లో సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించకపోయినా, సెప్టెంబర్‌లో పాక్షికంగా చెల్లించింది జెట్. అంతర్జాతీయ సర్వీసుల్లో కోత ఇది ఇలా వుంటే ఖర్చులను తగ్గించునే క్రమంలో అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న సర్వీసుల్లో వారానికి కొన్నింటిపై కోత పెట్టనుంది. ముఖ్యంగా తొమ్మిది గల్ఫ్ మార్గాల్లో నడిపే విమాన సర్వీసులను తగ్గించనుంది. దేశీయంగా వివిధ నగరాలనుంచి మస్కట్, దోహా, అబుదాభి, దుబాయ్‌కి వెళ్లే విమానాల్లో వారానికి దాదాపు 40విమానాలను రద్దు చేయనుంది. అయితే వివిధ నగరాలనుంచి సింగపూర్, ఖట్మాండు, బ్యాంకాక్ సహా ఇతర గ్లోబల్ రూట్లలో డిసెంబరు 1నుంచి డైరెక్టు విమానాలను పరిచయం చేసినట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
ఒక్క రోజులో 14 ‘జెట్’ విమానాల రద్దు
ముంబై: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్కు పైలట్లు సహకరించకపోవడంతో ఆదివారం ఆ సంస్థకు చెందిన 14 విమానాలు రద్దయ్యాయి. పైలట్లు సహా పై స్థాయి ఉద్యోగులకు సెప్టెంబర్ నెల వేతనాలను పాక్షికంగా చెల్లించిన జెట్ ఎయిర్వేస్.. అక్టోబర్, నవంబర్ నెల జీతాలను మాత్రం ఇప్పటివరకు పూర్తిగా చెల్లించలేదు. దీంతో కొందరు పైలట్లు తమకు అనారోగ్యంగా ఉందనే సాకు చూపుతూ ఆదివారం అకస్మాత్తుగా విధులకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో 14 విమానాలను జెట్ ఎయిర్వేస్ రద్దు చేయాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ఎదురైన నిర్వహణ పరిస్థితుల కారణంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందనీ, పైలట్లు సహకరించకపోవడం వల్ల కాదని జెట్ ఎయిర్వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు విషయాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేశామనీ, వీలైనంత మందిని ఇతర విమానాల్లో పంపి, మిగతా వారికి పరిహారం చెల్లించామంది. -
ఆకాశమంత.. సాహసం!
ఆమె ఆకాశంలో సగం.. సాహసంతో సావాసం..అవకాశాలను అందిపుచ్చుకుంటూ పైలట్లుగా రాణిస్తున్న మహిళలు..మహిళా పైలట్లలో భారత్ నంబర్ వన్ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా మహిళా పైలట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఎక్కువ మంది మహిళా పైలట్లు ఉన్న దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. దేశంలోని మొత్తం 8,797 మంది పైలట్లలో మహిళల సంఖ్య 1,092 (12.4%) మందికి చేరింది. వీరిలో 355 మంది కెప్టెన్లు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ విమెన్ ఎయిర్‌లైన్ పైలట్స్ (ఇస్వాప్) ఇటీవల ఈ గణాంకాలు వెలువరించింది. వీటి ప్రకారం.. మహిళా పైలట్ల ప్రపంచ సగటు 5.4% మాత్రమే. ఇండిగోలోని మొత్తం 2,689 మంది పైలట్లలో 351 మంది (13.9%) మహిళలు. జెట్ ఎయిర్‌వేస్‌లోని 1,867 మందిలో 231 మంది మహిళా పైలట్లే (12.4%). 853 మంది పైలట్లు వున్న స్పైస్ జెట్ (113మంది – 13.2%), 1710 మంది పైలట్లు ఉన్న ఎయిర్ ఇండియాలో (217–12.7%) కూడా మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. ఢిల్లీకి చెందిన ‘జూమ్ ఎయిర్’అత్యధిక మహిళా పైలట్లకు ఉద్యోగాలిచ్చింది. ఇక్కడ పని చేసే మొత్తం 30 మంది పైలట్లలో 9 మంది మహిళ లు. అమెరికాలో మహిళా పైలట్ల సంఖ్య ప్రపంచ సగటు కంటే తక్కువే (4.4%). అమెరికాలోని యు నైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో అత్యధికంగా 7.5% మంది, డెల్టాలో 4.7% మంది మహిళా పైలట్లు పని చేస్తున్నారు. యూకేలో 4.77% మహిళా పైలట్లే ఉన్నారు. భారత్.. బిగ్ మార్కెట్ మధ్య తరగతి అంతకంతకు పెరుగుతున్న భారతదేశంలో విమాన ప్రయాణాలూ పెరుగుతాయని బోయింగ్ కంపెనీ వెలువరించిన కమర్షియల్ మార్కెట్ అవుట్ లుక్ రిపోర్ట్– (2018– 2037) చెబుతోంది. రానున్న 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 7,90,000 మంది పైలట్లు అవసరమని ఆ కంపెనీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పైలట్ల కొరత ఏర్పడే పరిస్థితి ఉన్నందున భారతీయ కంపెనీలు మహిళల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయని అంటోంది ఇస్వాప్. సమాన వేతనాలు స్త్రీ పురుషుల మధ్య వేతన వ్యత్యాసాలు లేని రంగాలు అరుదే. అలాంటి వాటిలో విమానయాన రంగమొకటి. ఇండిగో కంపెనీ పిల్లలున్న తల్లిదండ్రులకు డే కేర్ సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు గర్భిణులకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తోంది. మెటర్నిటీ లీవ్ విధానాన్ని తప్పనిసరి చేసింది. ‘నిర్భయ’ఘటన తర్వాత ఎయిర్‌లైన్ కంపెనీలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. రాత్రి ఆరు– తెల్లవారు జాము ఆరు గంటల మధ్య మహిళా పైలట్లను ఇళ్ల నుంచి స్వయంగా తీసుకెళ్లడం.. తిరిగి దిగబెట్టడంతో పాటు, బాడీ గార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఇది సురక్షిత ఉద్యోగమని, ఇతర చోట్ల కంటే మహిళలను ఇక్కడ మరింత భద్రంగా చూసుకుంటారని జెట్ ఎయిర్వేస్ సీనియర్ ట్రైనర్ శ్వేతా సింగ్ చెప్పారు. ప్రస్తుతం విమానయాన మార్కెట్ మంచి ఊపు మీద ఉందని, అక్కడ సులువుగా పని దొరుకుతుందని అంటున్నారు ఇండిగో పైలట్ రూపీందర్ కౌర్. సాహసమే శ్వాసగా.. అనుపమ కోహ్లీ.. ఎయిర్ ఇండియా కెప్టెన్. గత ఫిబ్రవరిలో ఆమె కనబరచిన సమయస్ఫూర్తి పెద్ద ప్రమాదాన్ని తప్పించగలిగింది. ఆమె నడుపుతున్న ఎయిర్ ఇండియా 631 విమానం.. విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానం అతి సమీపంలో ఎదురెదురుగా వచ్చాయి. పైలట్లను హెచ్చరిస్తూ ఆటోమేటిక్ వార్నింగ్‌లు వెలువడ్డాయి. అనుపమ రెజల్యూషన్ అడ్వయిజరీ సూచనల మేరకు క్షణాల్లో అప్రమత్తమై విమానాన్ని ఎత్తుకు తీసుకెళ్లడం ద్వారా భారీ ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. ‘ఎయిర్ ఇండియా’సహా పలువురి అభినందనలందుకున్నారు. ఆ సమయంలో విస్తారాలో 152 మంది, ఎయిర్ ఇండియా విమానంలో 109 మంది ప్రయాణిస్తున్నారు. -
జెట్ ఉద్యోగులకు జీతాల్లేవ్..!
న్యూఢిల్లీ: జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.1,300 కోట్ల నష్టాలను ప్రకటించి, వరుసగా రెండో త్రైమాసికంలోనూ నష్టాలను నమోదుచేసిన ఈ సంస్థ.. కనీసం ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి దిగజారింది. రూ.75వేలకు మించి జీతాలు ఉన్నటువంటి ఏ1–ఏ5, ఓ2, ఓ3 గ్రేడ్ ఉద్యోగులకు అక్టోబరు ఒకటిన జీతాలు అందగా.. ఎం1, ఎం2, ఈ1, ఇతర గ్రేడ్ల వారికి ఇంకా వేతనాలు అందలేదని వెల్లడైంది. ఈ అంశంపై సంస్థ ఉద్యోగి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘సాధారణంగా ప్రతినెలా 1వ తేదీన జీతాలు వస్తాయి. గతనెలలో మాత్రం సీనియర్ మేనేజ్మెంట్, పైలెట్లు, ఇంజనీర్లను మినహాయించి.. మిగిలిన ఉద్యోగులందరికీ వేతనాన్ని సరియైన సమయానికే చెల్లించారు. అయితే, ఈసారి సెప్టెంబర్ వేతనాన్ని మాకు ఇప్పటికీ చెల్లించలేదు.’ అని వ్యాఖ్యానించారు. -
పైలట్ల తప్పిదం.. విమానంలో నరకం
ముంబై: పైలట్ల తప్పిదం వల్ల దాదాపు 30 మంది విమాన ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం ముంబై నుంచి జైపూర్‌కు 166 మంది ప్రయాణికులతో వెళ్తున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో ఒక్కసారిగా పీడనం తగ్గడంతో పలువురు ప్రయాణికుల ముక్కుల్లోంచి, చెవుల్లోంచి రక్తం రావడంతో అంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానంలోని ఎయిర్ ప్రెషర్ బటన్స్ ఆన్ చేయకపోవడం వల్ల ఈ దారుణం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరైన ప్రయాణికులంతా ఆక్సిజన్ మాస్క్‌లు ధరించారు. కొద్దిసేపటికి తప్పు తెలుసుకున్న పైలట్లు టేకాఫ్ అయిన 23 నిమిషాల అనంతరం విమానాన్ని తిరిగి మళ్లీ ముంబై విమానాశ్రయంలో దించారు. చెవులు, ముక్కుల నుంచి రక్తం వచ్చిన ఐదుగురు ప్రయాణికులకు తాత్కాలికంగా వినికిడి సమస్య ఏర్పడిందని(బారోట్రామా), రెండు వారాల్లో కోలుకుంటారని ముంబైలోని బాలాభాయ్ నానావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉండడంతో వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశం ఈ ఘటనకు బాధ్యులైన పైలట్లను విధుల నుంచి తప్పించారు. విమాన ప్రమాద దర్యాప్తు విభాగం(ఏఏఐబీ)చే విచారణకు ఆదేశించింది. విమానం ఇంజిన్లు ఆన్ చేసే ముందు క్యాబిన్‌లోని ఒత్తిడి నియంత్రణను సరిచూసుకోవడం పైలట్ల బాధ్యతని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని ఏఏఐబీ అధికారి తెలిపారు. విమానం ఎగరడానికి ముందు ‘బ్లీడ్’ స్విచ్‌ను ఆన్ చేయడం సిబ్బంది మరిచిపోయారని, దాంతో క్యాబిన్లో ఒత్తిడి నియంత్రణ కాలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. బోయింగ్ 737 విమానం క్యాబిన్లో ప్రెషర్ లోపం వల్ల ముంబైకి తిరిగి వచ్చిందని, పైలట్లను విధుల నుంచి తప్పించామని, దర్యాప్తు కొనసాగుతోందని జెట్ ఎయిర్వేస్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘మొత్తం 166 మంది ప్రయాణికుల్లో 30 మంది ఇబ్బంది పడ్డారు. కొందరికి నోటి నుంచి, చెవుల నుంచి రక్తం వచ్చింది. కొందరు తలనొప్పితో ఇబ్బంది పడ్డారు’ అని చెప్పారు. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన జెట్ ఎయిర్వేస్.. ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ‘ఒక్కసారిగా గాలి ప్రెషర్ తగ్గింది. వెంటనే ఆక్సిజన్ మాస్క్‌లు ధరించాం. చెవుల్లో తీవ్రమైన నొప్పి ఉందని చాలా మంది ఫిర్యాదు చేశారు’ అని ఉద్యోగి ప్రశాంత్ శర్మ తెలిపారు. 30 లక్షల పరిహారం ఇవ్వాలి: బాధితుడు తనకు జరిగిన నష్టానికి రూ. 30లక్షల పరిహారంతో పాటు, ఎకానమీ క్లాస్ టికెట్‌పై బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించేందుకు 100 వోచర్లు ఇవ్వాలని వినికిడి లోపంతో ఇబ్బందిపడుతున్న ప్రయాణికుడు ఒకరు డిమాండ్ చేశారని ఎయిర్‌లైన్స్ సిబ్బంది వెల్లడించారు. -
దాని వల్లే పైలెట్ల సామర్థ్యం దెబ్బతింటోంది..
బెంగళూరు : సోషల్ మీడియాతో పైలెట్ల సామర్థ్యం దెబ్బతింటోందని భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సంచలన వ్యాఖ్యలు చేశారు. పైలెట్లు గంటలకొద్దీ సోషల్ మీడియాలో గడపడటంతో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎరోస్పేస్ మెడిసిన్ (ఐఏమ్) లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మద్యం తాగిన వారిని గుర్తించే బ్రీత్‌ఎన్‌లైజర్స్‌లా.. సరిగ్గా నిద్రపోని వారిని గుర్తించే వ్యవస్థను సిద్దం చేయాలన్నారు. సోషల్ మీడియా పైలెట్ల నిద్రను మింగేస్తుందని, చాలా మంది పైలెట్లు సోషల్ మీడియాలో గడుపుతూ అర్దరాత్రి వరకు నిద్రపోకుండా ఉంటున్నారని తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చాలా ఫ్లైట్స్ తెల్లవారుజామునే టెకాఫ్ చేయాల్సి ఉంటుందని, దీంతో పైలెట్లకు నిద్రసరిపోవడం లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని ఐఏమ్ వైద్య నిపుణులను కోరారు. నిద్రలేమి సమస్యతోనే 2013లో ఓ ప్రమాదం చోటుచేసుకుందని గుర్తుచేశారు. -
జెట్ ఎయిర్వేస్కు పైలట్ల వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ పైలట్లు, ఇంజనీర్లకు వరుసగా రెండో నెలలో కూడా జీతాల చెల్లింపులో జాప్యం చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న జెట్ ఎయిర్వేస్కు తాజాగా పైలట్లు గట్టి షాక్ ఇచ్చారు. తమకు జీతాల చెల్లింపులో జాప్యానికి నిరసనగా తాము సహాయ నిరాకరణ చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ముందస్తు నోటీసు లేకుండా జీతాలను నిలిపివేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, సంస్థలో జరిగే పరిణామాలకు యాజమాన్యమే బాధ్యత వహించాలని జెట్ ఎయిర్వేస్కు పంపిన నోటీసులో పేర్కొన్నారు. తమ సమస్యను పరిష్కరించడంతో పాటు సకాలంలో జీతాల చెల్లింపులో విఫలమైతే తాము సహాయ నిరాకరణ చేపడతామని యాజమాన్యాన్ని పైలట్లు హెచ్చరించారు. ఉద్యోగుల వేతనాల్లో 25 శాతం కోత విధించేందుకు కంపెనీ ప్రయత్నించగా పైలట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో వెనక్కితగ్గిందని నేషనల్ ఏవియేటరక్స్ గిల్డ్ అలండ్ ఇంజనీర్స్ వెల్లడించింది. కాగా, పైలట్ల వార్నింగ్‌పై జెట్ ఎయిర్వేస్ ఇంకా స్పందించలేదు. -
‘భార్య కెప్టెన్ అయితే గొడవే ఉండదు’
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ సతీమణి సాక్షి ధోని సోషల్ మీడియాలో చాల యాక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ధోని, జీవాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది. సరదాగా ఉన్న వీడియో, కింద రాసిన కామెంట్ ఆకట్టుకోవడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిమిషాల్లోనే వేల లైక్స్, వందల కామెంట్లు వచ్చాయి. అసలు విషయమేమిటంటే? సిమ్లా అందాలను వీక్షించిన అనంతరం భర్త ఎంఎస్ ధోనితో కలిసి సాక్షి విమానంలో తిరుగుపయనయ్యారు. ఆ విమానాన్ని నడిపే ఇద్దరు పైలెట్లు భార్యభర్తలు కావడంతో సాక్షి ఆశ్చర్యపోయారు. దీంతో వారు విమానాన్ని ఆపరేటింగ్ చేసే విధానాన్ని వీడియో తీసి ‘భార్యాభర్తలిద్దరూ ప్రయాణం మధ్యలో గొడవ పెట్టుకోకూడదని కోరుకుంటున్నా.. ఈ రోజు కెప్టెన్ భార్య అయితే గొడవ ఉండకపోవచ్చు’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. సాక్షి కామెంట్‌పై స్పందించిన ధోని‘భయపడకు నీ పక్కనే కూల్ హెలికాప్టర్ ఉంది’ అంటూ పేర్కొన్నాడు. ఇక సాక్షి వీడియో అండ్ కామెంట్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిచారు. దీనిపై కొందరు నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తే, మరికొందరు ముందు మహిళా ఫైలెట్‌ను గౌరవించండి అంటూ ఘాటుగా పేర్కొన్నారు. A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Aug 31, 2018 at 3:03am PDT -
అలవెన్సులు ఇవ్వకుంటే విమానాలు నడపం
ముంబై: ఫ్లయింగ్ అలవెన్స్ బాకీలు తక్షణమే చెల్లించని పక్షంలో విమానాలు నడిపే ప్రసక్తే లేదని ప్రభుత్వ రంగ ఎయిరిండియా యాజమాన్యాన్ని పైలట్లు హెచ్చరించారు. మిగతా ఉద్యోగులందరికీ ఎలాంటి జాప్యం చేయకుండా సకాలంలో జీతభత్యాలు చెల్లిస్తున్నప్పటికీ, తమనూ.. క్యాబిన్ సిబ్బందినీ పక్కన పెడుతున్నారని వారు ఆందోళ వ్యక్తం చేశారు. పైలట్ల జీతాల్లో ఎక్కువ భాగం వాటా ఫ్లయింగ్ అలవెన్సులదే ఉంటుందని తెలిసీ ఇలా చేయడం భావ్యం కాదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫ్లయింగ్ అలవెన్సులను తక్షణం చెల్లించని పక్షంలో ఫ్లయింగ్ విధులకు హాజరు కాలేమని ఎయిరిండియా డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్‌కి పంపిన లేఖలో ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ) పేర్కొంది. జీతం మాత్రమే చెల్లిస్తున్నందున ఆఫీసుకు వస్తామని, ఫ్లయింగ్ విధులు తప్ప మిగతావన్నీ నిర్వర్తిస్తామని తెలిపింది. పైలట్ల జీతభత్యాల్లో 30 శాతమే జీతం కాగా మిగతాది అలవెన్సుల రూపంలోనే ఉంటుంది. సాధారణంగా ఫ్లయింగ్ అలవెన్సులు రెండు నెలల తర్వాత చెల్లిస్తారు. దీని ప్రకారం జూన్ నెలవి ఆగస్టు 1న చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటిదాకా చెల్లించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
విలువైన విమానాలను మూలన పడేశారు..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా అధికారులకు భారత వాణిజ్య పైలట్ల సంఘం (ఐసీపీఏ) రాసిన లేఖ ఆలోచన రేకెత్తిస్తోంది. ఎయిర్‌లైన్స్ విమానాల నిర్వహణపై వారు ఆసక్తికర అంశాలను లేఖలో లేవనెత్తారు. సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఏ321 విమానాల్లో 40 శాతం విమానాలను గ్రౌండ్‌కే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. ఏ 319 ఎయిర్‌క్రాఫ్ట్ కీలక రూట్లలో అధిక సీటింగ్ సామర్ధ్యం ఉన్న క్రమంలో మెరుగైన ఆదాయ వనరుగా ఉన్నప్పటికీ వాటిలో చాలా వరకూ ఖాళీగా ఉంచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రూ 25,000 కోట్ల విలువైన విమానాలను వాడకుండా పడేయడంతో ప్రతిరోజూ సంస్థకు భారీ నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.సంస్థకు చెందిన 22 ఎయిర్‌బస్ ఏ 319 విమానాలకు గాను నాలుగు విమానాలు రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా లేవని పేర్కొంది. ఇక 15 బోయింగ్ 777-300 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు గాను 5 విమానాలు హ్యాంగర్‌కే పరిమితమయ్యాయని తెలిపింది. విడిభాగాల కొరతతో ఎయిర్ ఇండియా విమానాల్లో దాదాపు 23 శాతం విమానాలు ఆపరేషన్స్‌కు దూరంగా ఉన్నాయని పేర్కొంది. ఈ విమానాలు ఎందుకు ఇన్ని రోజులుగా గ్రౌండ్‌కే పరిమితమయ్యాయని మేనేజ్మెంట్ను పైలట్లు నిలదీశారు. ఖర్చును నియంత్రించుకోవడంలో యాజమాన్యం విఫలమైందా అని ప్రశ్నించారు. ఎయిర్ ఇండియా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తున్న క్రమంలో పైలట్లు రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఎయిర్ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకే ప్రభుత్వం దృష్టిసారించిందని, పూర్తిగా సంస్థను వదిలించుకోవాలనే ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి జయంత్ సిన్హా పునరుద్ఘాటించారు. -
కాక్‌పిట్‌లో గొడవ: ఆ పైలెట్లకు డీజీసీఏ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: విమానంలో కాక్‌పిట్‌లో గొడవపడి ప్రయాణికుల ప్రాణాలను నిర్లక్ష్యం చేసిన ఇద్దరు పైలెట్ల లైసెన్స్ లను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం ఈ నిర్ణయం వెలువడింది. నూతన సంవత్సరం రోజున లండన్- ముంబయి జెట్ ఎయిర్ వేస్ విమానం ప్రయాణిస్తుండగా.. ఏమైందో తెలియదు కానీ ఇద్దరు పైలెట్లు తమ బాధ్యతలను గాలికొదిలి కాక్‌పిట్‌లో గొడవకు దిగారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన డీజీసీఏ ఇద్దరు పైలెట్లను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించడంతో పాటు వారి లైసెన్స్ ను ఐదేళ్లపాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 14 మంది సిబ్బంది సహా 324 మందితో బయలుదేరిన 9డబ్ల్యూ 119 జెట్ ఎయిర్ వేస్ విమానంలో కో పైలెట్, మహిళా కమాండర్ పై చేయి చేసుకున్నాడు. ఆపై మహిళా ఉద్యోగిని ఏడుస్తూ క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కో పైలెట్ సైతం విధులు నిర్వహించకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశాడు. కాక్‌పిట్‌లో జరిగిన గొడవను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విమానంలో పైలట్ల ఫైటింగ్.. తలకిందులైన ఫేట్
సాక్షి, న్యూఢిల్లీ : విమానంలో తన్నుకున్న ఇద్దరు సీనియర్ పైలట్లపై వేటు పడింది. వారిని ఉన్నఫలంగా విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు జెట్ ఎయిర్వేస్ మంగళవారం ఓ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని తాము సీరియస్‌గా పరిగణిస్తున్నామని, మరోసారి ఇలాంటి సంఘటనలకు అవకాశం ఇవ్వొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది(2018) కొత్త సంవత్సరం ప్రారంభం రోజున (జనవరి 1) లండన్ నుంచి ముంబయికి బయలు దేరిన జెట్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ విమానం 777 (9డబ్ల్యూ 119)లో ఓ సీనియర్ పైలట్, మరో సీనియర్ కోపైలట్ ఘర్షణకు దిగారు. ఇద్దరు కాక్‌పీట్‌ను వదిలేసి తన్నుకుని ప్రయాణీకులను భయబ్రాంతులకు గురిచేశారు. చివరకు సిబ్బంది జోక్యంతో పైలట్లు శాంతించి విమానాన్ని ఎట్టకేలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే, ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన జెట్ ఎయిర్వేస్ ఆదేశించింది. అదే సమయంలో ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తీవ్రంగా స్పందించి ఆ ఇద్దరు పైలెట్ల లైసెన్స్‌లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక నుంచి వారు పైలట్లుగా కాకుండా ప్రయాణీకులుగా మాత్రమే విమానాల్లో వెళ్లేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. -
విమానం వదిలేసి చెంపలు వాయించుకున్నారు
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్ వేస్ విమానం ఒకటి పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. విమానం నడుపుతున్న ఇద్దరు సీనియర్ పైలట్లు విమానం గాల్లో ఉండగానే తన్నుకోవడం మొదలుపెట్టారు. కాక్‌పీట్‌లోనే వారు ఒకరితో ఒకరు గొడవపడి దెబ్బలాడుకున్నారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకుండానే చివరకు విమానాన్ని జాగ్రత్తగా కిందికి దించారు. ఈ సంఘటన జనవరి 1న లండన్ నుంచి ముంబయి మధ్య నడిచే జెట్ ఎయిర్ వేస్ విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోయింగ్ 777 విమానం 324మంది ప్రయాణీకులు, 14మంది సిబ్బందితో బ్రిటన్ కాలమానం ప్రకారం జనవరి 1న ఉదయం పదిగంటలకు నూతన సంవత్సరం రోజే ముంబయికి బయలు దేరింది. మొత్తం తొమ్మిదిగంటలపాటు సాగే ఈ ప్రయాణం మధ్యలో విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత ఇద్దరు పైలట్లకు గొడవ అయింది. కాక్‌పీట్ కెప్టెన్ కోపైలట్‌ను చెంపచెల్లుమనిపించాడు. దీంతో ఆమె ఏడుస్తూ కాక్‌పీట్ నుంచి బయటకొచ్చింది. కిచెన్‌లోకి వెళ్లి బోరుమని ఏడ్వడం ప్రారంభించింది. అయితే, ఇతర సిబ్బంది ఆమెను ఓదార్చి తిరిగి కాక్‌పీట్‌లోకి పంపించారు. అప్పటికే కెప్లెన్ కూడా ఆమెను కాక్‌పీట్‌లోకి పంపించాలని సిబ్బందిని పదేపదే కోరినట్లు సమాచారం. అనంతరం కూడా వారిద్దరు తీవ్రంగా మరోసారి గొడవపడటం అసలు కాక్‌పీట్‌ను ఇద్దరు వదిలేయడం జరిగింది. దీంతో కోపైలెట్ మరోసారి అందులోకి వెళ్లేందుకు నిరాకరించగా ప్రయాణీకులను సురక్షితంగా చేర్చాలన్న సిబ్బంది వేడుకోలు మేరకు ఆమె అంగీకరించింది. ఎట్టకేలకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ గొడవను జెట్ ఎయిర్ వేస్ అధికారులు కూడా ధ్రువీకరించారు. వారిద్దరి మధ్య సమాచార బదిలీ లోపం కారణంగా ఈ సమస్య ఏర్పడినట్లు ప్రాథమికంగా తెలిపారు. -
ఎమిరేట్స్ విమానం ఎందుకు కూలిందంటే?
న్యూఢిల్లీ: తిరువనంతపురం నుంచి బయలుదేరిన ఎమిరేట్స్ విమానం దుబాయ్ ఎయిర్‌పోర్టులో గతవారం కూలిన సంగతి తెలిసిందే. గాలి వీయడంలో ఒక్కసారిగా వచ్చిన మార్పు కారణంగానే ఈ విమానం క్రాష్‌ల్యాండ్ అయిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అదృష్టం బాగుండి ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ గాయాలూ కాలేదు. ప్రయాణికులు, విమాన సిబ్బంది దాదాపు 300మంది సురక్షితంగా బయటపడ్డారు. బోయింగ్ 777 విమానం ఒక్కసారిగా క్రాష్‌ల్యాండ్ అయి.. దాని రోల్స్ రాయిసీ ఇంజిన్స్ నిలువునా తగలబడిపోయి.. ఎట్టకేలకు అతికష్టం మీద కడుపుభాగం (కిందిభాగం) ఆధారంగా విమానం ఆగింది. ల్యాండింగ్ సందర్భంగా అత్యంత ఉత్కంఠరేపిన ఈ ప్రమాదం సమయంలో ఏం జరిగింది? ఎలా ప్రమాదం నుంచి బయటపడగలిగారు? అన్నదానిపై పైలట్లు 'ఈవెంట్ సమ్మరీ' పేరిట సమర్పించిన నివేదికను తాజాగా ఓ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. దీని ప్రకారం.. మొదటిసారి విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. కానీ భీకరమైన గాలులు వీయడంతో సురక్షితంగా విమానాని ల్యాండ్ చేయడం సాధ్యపడలేదు. రన్‌వేపై అనుకున్న ప్రదేశంలో ల్యాండ్ చేయలేకపోయారు. దీంతో ముందుకెళుతున్నకొద్దీ రన్‌వే అయిపోతుండటంతో ల్యాండ్ చేసే ఆలోచనను పైలట్లు మానుకున్నారు. ఈ సమయంలోనే పరిణామాలు తీవ్ర భయంకరంగా పరిణమించాయి. గాలిలో ఒక్కసారిగా అకస్మాత్తుగా మార్పులు రావడం వల్ల ఇలాంటి ముప్పు పొంచి ఉంటుంది. కానీ ఎంతటి మోడ్రన్ విమానమైనా గాలిలో ఉన్నఫలానా తలెత్తే మార్పుల్ని గుర్తించడం చాలావరకు అసాధ్యం. ఈ క్రమంలో చుట్టూ తిరిగివచ్చి మరోసారి విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో గాలిలో మార్పుల (విండ్‌షియర్) కారణంగా విమానం స్పీడ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. విండ్‌షియర్ ప్రాసెస్‌ను చేసినప్పటికీ రన్‌వేపై విమానం క్రాష్‌ల్యాండ్ అయి.. ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అవి విమానాన్ని చుట్టుముట్టాయి. పైలట్లు ఈ అత్యవసర పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా.. విమానం క్రాష్‌ల్యాండ్ అవ్వడంతో రన్‌వేపై స్కిడ్డయింది. త్రుటిలో ప్రయాణికులకు పెనుప్రమాదం తప్పినప్పటికీ ఎమిరేట్స్‌కు బోయింగ్ విమానం పూర్తిగా తగలబడింది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు తీసుకొనే కొన్ని నిర్ణయాలు తప్పు అయ్యే అవకాశముంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
తప్పతాగి వచ్చిన పైలట్లు.. ప్రయాణికులు షాక్!
345 మంది ప్రయాణికులు.. తొమ్మిది మంది సిబ్బంది.. అందరూ ఎయిర్ ట్రాన్స్‌శాట్ విమానంలో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గౌ విమానాశ్రయం నుంచి ఈ విమానం కెనడాకు వెళ్లాల్సి ఉంది. ఇంతలో పైలట్లు కూడా విమానం వద్దకు వచ్చారు. అయితే, వారు మద్యంలో మత్తులో తూలుతూ ఉండటంతో ముందుగానే పసిగట్టిన అధికారులు.. ఇద్దరు పైలట్లను అదుపులోకి తీసుకున్నారు. 345 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బందికి పెద్ద గండాన్ని తప్పించారు. ఈ ఘటన సోమవారం గ్లాస్ గౌ విమానాశ్రయంలో జరిగింది. తాగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కెప్టెన్ జీన్ ఫ్రాంకొయిస్ పెరియల్ట్ (39), జఫర్ సయ్యద్ (37) మంగళవారం కోర్టు ముందు హాజరుపరుచగా.. ఇద్దరికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ ఊహించని ఘటనతో ప్రయాణికులు షాక్ తిన్నారు. సోమవారం వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా మంగళవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరింది. ఈ ఘటనపై ఎయిర్ ట్రాన్స్‌శాట్ విమానాయాన సంస్థ ప్రయాణికులను క్షమాపణ కోరింది. జరిగిన దానికి చింతిస్తూ ప్రయాణికులకు 200 కెనడియన్ డాలర్లు పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో రాజీపడబోమని పేర్కొంది. పైలట్లు ఇద్దరు కెనడాకు చెందిన వారని, వారిపై విచారణ జరుగుతున్నదని తెలిపింది.