భారత సైన్యానికి చెందిన చిరుత హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో పైలట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఆర్మీ అధికారులు. ఇక, ఈ ప్రమాదం ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. ఆర్మీకి చెందిన చిరుత హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని మండాలా హిల్స్ వద్ద కుప్పకూలిపోయింది. బొండిలా పట్టణం నుంచి వెళ్తుండగా గురువారం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు గువాహటి డిఫెన్స్ పీఆర్‌వో, కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు.
Report: Army #Cheetah Helicopter Crash in West #Khameng district of the #Arunachal Pradesh.
— Indian Aerospace Defence News (IADN) (@NewsIADN) March 16, 2023
More details awaited.#IADN
📸 Representation pic.twitter.com/2ZL9P30yHM
Comments
Please login to add a commentAdd a comment