Helicopter crash
-
మానవ తప్పిదమే.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణానికి కారణం
ఢిల్లీ : మానవ తప్పిదం వల్లే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ డిసెంబర్ 8, 2021న ఎంఐ-17 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్రువీకరించింది. ఈ మేరకు ప్రమాదానికి సంబంధించిన రిపోర్టును రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ మంగళవారం లోక్‌సభ ముందుంచింది. 2017 - 2022 వరకు 'పదమూడవ డిఫెన్స్ పీరియడ్ ప్లాన్' పేరిట రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో 2017-2022 వరకు మొత్తం భారత వైమానిక దళానికి సంబంధించి మొత్తం 34 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది.The Indian Air Force has officially attributed the tragic crash of the Mi-17 V5 helicopter, which resulted in the untimely demise of CDS General Bipin Rawat and other esteemed personnel, to human error by the flying crew. This conclusion raises critical questions about the… pic.twitter.com/lFNZs29uls— Aviator Amarnath Kumar (@aviatoramarnath) December 19, 2024 వాటిల్లో అప్పటి సీడీఎస్ బిపిన్ రావత్ తమిళనాడులోని కున్నూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం కూడా ఉందని వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు భార్య మధులిక, మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ సందర్భంగా బిపిన్ రావత్ ప్రమాదానికి కారణం మానవ తప్పిదేమేనని స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. డిసెంబరు 8, 2021న తమిళనాడులోని సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి బయల్దేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఆ రోజు ఉదయం రావత్ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు బయలుదేరారు.అయితే మార్గం మధ్యలో హెలికాప్టర్ లోయ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అయోమయంలో పడిన పైలట్ హెలికాప్టర్‌ను మేఘాల్లోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అది కూలిపోయింది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డులను విశ్లేషించిన తర్వాత ప్రమాదానికి గల కారణంపై ఓ అంచనాకు వచ్చాము’ అని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. -
రైసీ దుర్మరణం వెనుక కుట్ర లేదు: ఇరాన్ ఆర్మీ
టెహ్రాన్: హెలికాప్టర్ కుప్పకూలి ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలవ్వడానికి ప్రతికూల వాతావరణమే కారణమని తేలింది. ఈ మేరకు ఆ దేశ ఆర్మీ ఆధ్వర్యంలోని దర్యాప్తు కమిటీ ఇచ్చిన తుది నివేదికను ఉటంకిస్తూ ఇరాన్ అధికారిక టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దట్టమైన పొగమంచువల్లే రైసీ హెలికాప్టర్ కూలిపోయిందని తెలిపింది. దీంతో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రధాని రైసీ మరణించడం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉండొచ్చన్న అనుమానాలకు తెరపడింది. ఈ ఏడాది మేలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇరాన్‌లోని అజర్బైజాన్ పర్వతప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రధాని రైసీ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటన జరిగినప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు తారాస్థాయిలో ఉండటంతో ఇజ్రాయెల్ పాత్రపై అనుమానాలు రేకెత్తాయి. -
సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి.. హెలికాప్టర్ క్రాష్ పై పోలీసులు, ఇంటెలిజెన్స్ ఆరా
-
ముంబైలో కూలిన ప్రైవేటు హెలికాప్టర్..
ముంబై: మహారాష్ట్రలో ప్రమాదం చోటుచేసుకుంది. పుణెలోని పౌద్ సమీపంలో శనివారం ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్లో పైలట్, ముగ్గురు ప్రయాణికులున్నట్లు తేలింది. పైలట్‌తో సహా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.పుణెలో కురుస్తున్న భారీ వర్షాలతో వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలినట్ల పూణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేదని, అందరూ సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. -
హోటల్‌పై కుప్పకూలిన హెలికాప్టర్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని పర్యాటక పట్టణం కెయిన్స్లోని ఓ హోటల్‌పై హెలికాప్టర్ కుప్పకూలింది. సోమవారం(ఆగస్టు12) తెల్లవారుజామున ఈ ఘటనలో పైలట్ అక్కడికక్కడే మృతిచెందాడు. హెలికాప్టర్ కూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్లోని వందల మందిని అక్కడినుంచి తరలించినట్లు క్వీన్స్లాండ్ పోలీసులు తెలిపారు. హెలికాప్టర్ కూలడం కారణంగా హోటల్లో ఉన్న వారెవరూ గాయపడలేదని చెప్పారు. హోటల్‌పై రెండు హెలికాప్టర్లు ల్యాండవుతుండగా వాటిలో ఒకటి క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలిపారు. హెలికాప్టర్ ఎలా కూలిందనే విషయమై ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ రెగ్యులేటర్ విచారణ ప్రారంభించింది. -
Iran Presidential Election 2024: ఖమేనీ కనుసన్నల్లో... ఇరాన్లో ఎన్నికలకు వేళాయె
అగ్ర రాజ్యాల ఆంక్షలు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి. హక్కుల కోసం రోడ్డెక్కుతున్న మహిళలు. కరడుగట్టిన మతవాద పాలనపై యువతలోనే గాక సర్వత్రా తీవ్రతరమవుతున్న అసంతృప్తి. ఇన్ని గడ్డు సమస్యల నడుమ ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలకు వేళైంది. మూడున్నర దశాబ్దాలుగా ఇరాన్‌ను ఏకఛత్రంగా పాలిస్తున్న సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అభీష్టానుసారం ఎంపికైన ఆరుగురు అభ్యర్థులు రేసులో ఉన్నారు. వారిలో ఖమేనీ వీర విధేయుడే పీఠమెక్కడం లాంఛనమే కానుంది. జనాల్లో ఇప్పటికీ తిరుగులేని ఆదరణ ఉన్న మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ తదితరుల అభ్యరి్థత్వాన్ని తిరస్కరించడం ద్వారా జనాకర్షక నేతలెవరూ పోటీలో ఉండకుండా సలక జాగ్రత్తలూ తీసుకున్నారు. దాంతో ఎప్పట్లాగే ఈసారి కూడా ఇరానీలు అధ్యక్ష ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితిని ఊహించే ఆరుగురిలో డాక్టర్ మసూద్ పెజెష్కియాన్ రూపంలో ఒక సంస్కరణలవాదిని ఎంపిక చేశారు. ఆయన్ను చూసి జనాలు ఎంతో కొంత పోలింగ్ బూత్‌లకు వస్తారని ఆశిస్తున్నారు. అంతిమంగా విజేత మాత్రం మిగతా ఐదుగురు కరడుగట్టిన మతవాదుల్లోంచే ఒకరు కానున్నారు. అది ఎవరన్నది జూన్ 28న జరిగే పోలింగ్‌లో తేలనుంది. ప్రభుత్వంపై విమర్శలే ప్రచారా్రస్తాలు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ గత మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఇరాన్లో ఏడాది ముందుగానే ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రధాని పదవిని రద్దు చేస్తూ, అధ్యక్ష పదవి స్థాయిని పెంచుతూ 1998లో రాజ్యంగ సంస్కరణలు చేసిన అనంతరం దేశంలో ముందస్తు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులంతా ఈసారి ప్రభుత్వంపై నేరుగా విమర్శలు ఎక్కుపెడుతుండటం విశేషం. దేశ ఆర్థిక దుస్థితికి ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణమని వారంతా బాహాటంగా తప్పుబడుతున్నారు. ఇదంతా ప్రజలను పోలింగ్ బూత్‌కు రప్పించేందుకు ఖమేనీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని చెబుతున్నారు. ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛ గా, పారదర్శకంగా జరిగిన దాఖలాలు లేవని అంతర్జాతీయ నిపుణులతో పాటు ఇరాన్ మేధావులు కూడా అంటుంటారు. ఎన్నికల ఫలితాలను ఖమేనీ పూర్తిగా నిర్దేశించడమే గాక తనకు అనుకూలంగా మార్చేస్తారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఎన్నిక ఇలా... ఇరాన్ అధ్యక్షున్ని ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతిన ఎన్నుకుంటారు. పదవీకాలం నాలుగేళ్లు. పూర్తి అధికారాలు సుప్రీం లీడర్ ఖమేనీవే అయినా అధ్యక్షునికి కూడా పలు కీలక దేశీయ విధాన నిర్ణయాలతో పాటు కొంతమేరకు విదేశాంగ విధానంపై కూడా చెప్పుకోదగ్గ అధికారాలుంటాయి. 12 మంది మత పెద్దలు తదితరులతో కూడిన గవరి్నంగ్ కౌన్సిల్ ఖమేనీ నిర్దేశాలకు లోబడి అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈసారి 80 దరఖాస్తులను వడపోసి ఆరుగురిని మాత్రం పోటీకి అనుమతించింది. తన ఆధిపత్యానికి సవాలుగా మారతారనుకున్న వారెవరికీ అవకాశం దక్కకుండా ఖమేనీ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఆ క్రమంలోనే బాగా జనాకర్షణ ఉన్న మాజీ అధ్యక్షుడు నెజాద్తో పాటు మూడుసార్లు పార్లమెంట్ స్పీకర్‌గా చేసిన అలీ లారిజానీ అభ్యర్థిత్వం కూడా తిరస్కరణకు గురైంది. తిరస్కృత జాబితాలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు! జూన్ 28న ఓటింగ్ జరగనుంది. 30కల్లా ఫలితాలు వెలువడే అవకాశముంది. ఎవరికీ 50 శాతానికి మించి ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచే అభ్యర్థుల మధ్య తిరిగి ఎన్నిక జరుగుతుంది. ఆ ఆరుగురుమసూద్ పెజెష్కియాన్ గట్టి సంస్కరణలవాది. దేశ ఆరోగ్య మంత్రిగా చేశారు. విద్యావంతునిగా మంచి పేరే ఉంది. మితిమీరుతున్న మతవాదంపై ప్రజల్లో ప్రబలుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకే ఈయనను అభ్యర్థుల జాబితాలో చేర్చినట్టు చెబుతున్నారు. 2008 నుంచీ పార్లమెంటు సభ్యుడు. అందరికీ ఆయోదమోగ్యమైన కొత్త ముఖం మేలని ఖమేనీ భావిస్తే తప్ప మసూద్‌కు అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు అంటున్నారు.అలీ రజా జకానీ టెహ్రాన్ మేయర్. గతంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. పబ్లిక్ పార్కుల్లో మసీదు నిర్మాణాన్ని మద్దతిచ్చి విమర్శలకు గురయ్యారు. 2021లో కూడా అధ్యక్ష పదవికి పోటీ పడ్డా పెద్దగా ఓట్లు సాధించలేదు. ఈసారి కూడా జకానీ పేరు గట్టి పోటీదారుగా పెద్దగా పరిగణనలో లేదు. కాకపోతే ఖమేనీకి వీర విధేయుడు.జనరల్ మహమ్మద్ బఖర్ గలీబాఫ్ పార్లమెంట్ స్పీకర్. రాజధాని టెహ్రాన్ మేయర్‌గా, సైనిక విభాగమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కుమాండర్గా, దేశ పోలీస్ చీఫ్‌గా చేసిన అనుభవముంది. పైగా ఖమేనీకి అత్యంత సన్నిహితుడు కూడా. ఆయనతో బంధుత్వమూ ఉందంటారు. దాంతో గలీబాఫ్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. సైన్యంలోని కీలక అధికారుల మద్దతు అదనపు బలం కానుంది. కాకపోతే ఆయనపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలున్నాయి. పైగా గతంలో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ పడి ఓడారు. సయీద్ జలిలీ మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోíÙయేటర్. ఇరాన్–ఇరాక్ యుద్ధంలో కాళ్లు పోగొట్టుకున్నా రు. యుద్ధవీరునిగా దేశమంతటా కాస్తో కూస్తో పేరున్న నేతే. ఈయనకూ ఖమేనీ ఆశీర్వాదముందని చెబుతారు. దాంతో జలిలీ అవకాశాలకు గండి కొట్టేందుకు గలీబాఫ్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు జనాదరణ విషయంలో మరో అహ్మదీనెజాద్లా ఎదిగే సత్తా ఉండటం కూడా జలిలీ అవకాశాలకు గండి కొట్టవచ్చని పరిశీలకుల అభిప్రాయం. ముస్తాఫా పోర్ మొహమ్మదీ రేసులో ఉన్న ఆరుగురిలో ఏకైక మతాధికారి కావడం ఈయనకు కలిసొచ్చే అంశం. పైగా 85 ఏళ్ల ఖమేనీ తన వారసుని ఎంపికపై గట్టిగా దృష్టి సారించారు. కుమారుడు కుమారుడు ముజ్తబాకు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. ఈ సమయంలో అధ్యక్ష పదవిలో మత పెద్ద ఉండటం మేలని ఖమేనీ భావించే పక్షంలో మొహమ్మదీకి చాన్సుంటుందని చెబుతున్నారు. కాకపోతే సుప్రీం లీడర్ పదవి కోసం ముజ్తబాతో పోటీ పడే సత్తా ఉండటం మొహమ్మదీకి ప్రతికూలంగా మారవచ్చు. ఆమిర్ హొసేన్ గజీజాదే హషేమీ ప్రస్తుతం 12 మంది దేశ ఉపాధ్యక్షుల్లో ఒకరు. రిటైరైన సైనికులు, యుద్ధాల్లో మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమ బాధ్యతలు చూస్తున్నారు. దాంతో ఆయా వర్గాల్లో మంచి ఆదరణే ఉంది. కాకపోతే ఈయనకు కూడా ఈసారి అవకాశం ఉండకపోవచ్చని చెబుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రైసీ హెలికాఫ్టర్ క్రాష్: ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లో ఏముందంటే..
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని బలిగొన్న హెలికాఫ్టర్ ప్రమాదంపై తొలి నివేదిక బయటకు వచ్చింది. రైసీ మృతిపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. ఈ నివేదిక ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. హెలికాఫ్టర్‌పై దాడి జరిగినట్లు ఆనవాళ్లు లేవని ఆ నివేదిక స్పష్టం చేసింది. కానీ, దర్యాప్తు ఇంకా జరగాల్సి ఉందని, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాల్ని గుర్తించాల్సి ఉందని, తుది నివేదికలోనే ఆ వివరాల్ని ప్రస్తావిస్తామని ప్రాథమిక నివేదిక స్పష్టం చేసింది.ఇరాన్ విడుదల చేసిన ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును పరిశీలిస్తే.. హెలికాప్టర్ ముందు నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించింది. ఎక్కడా దారి తప్పలేదు. ప్రమాదం సంభవించడానికి నిమిషం కంటే ముందు కూడా.. హెలికాఫ్టర్ పైలట్, రైసీ కాన్వాయ్‌లోని మిగిలిన రెండు హెలికాప్టర్లను కూడా సంప్రదించారు. బుల్లెట్లు, ఇతర పేలుడుకు సంబంధించిన వస్తువుల జాడ శకలాల్లో కనిపించలేదు. కొండను ఢీకొట్టిన తర్వాత హెలికాప్టర్లో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.... ప్రతికూల వాతావరణం వల్లే ఘటనా స్థలానికి చేరుకోవడం ఆలస్యమైంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. రాత్రంతా గాలింపు కొనసాగింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటలకు డ్రోన్ల సహాయంతో ఘటన జరిగిన కచ్చితమైన ప్రదేశం తెలిసింది. హెలికాప్టర్ సిబ్బంది, వాచ్‌టవర్ మధ్య జరిగిన సంప్రదింపుల్లో ఎలాంటి అనుమానాస్పద సంభాషణలను గుర్తించలేదు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత మిగిలిన విషయాలు వెల్లడిస్తాం.. అని ప్రాథమిక నివేదికలో ప్రస్తావించారు.ఇదిలా ఉంటే.. ఆదివారం(మే 19) జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దొల్లాహియన్ సహా మరో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటికే ఇరాన్ సంతాప దినాలు పాటిస్తోంది. భారత కాలమానం ప్రకారం రైసీ అంత్యక్రియలు గురువారం షియా మతస్థులకు అత్యంత పవిత్రమైన మషహద్ నగరంలో జరిగాయి. విశేషం ఏంటంటే.. మషహద్ రైసీ స్వస్థలం కూడా. -
ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
టెహ్రాన్: హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి దేశ రాజధాని టెహ్రాన్ ప్రజలు ఘన తుది వీడ్కోలు పలికారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లాహ్ అలీ ఖమేనీ సైతం నివాళులరి్పంచారు. బుధవారం సంతాప ర్యాలీలో టెహ్రాన్ సిటీ వీధుల గుండా భారీ వాహనం మీద రైసీ పారి్థవదేహాన్ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఇరానీయన్లు పాల్గొని తమ నేతకు తుది వీడ్కోలు పలికారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం టెహ్రాన్ వెళ్లి రైసీకి నివాళులర్పించారు. మహిళా, మానవ హక్కుల హననానికి పాల్పడి ‘టెహ్రాన్ కసాయి’గా పేరుబడినందుకే రైసీ సంతాప ర్యాలీలో తక్కువ మంది పాల్గొన్నారని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. సంతాప ర్యాలీలో ఖమేనీ పక్కనే తాత్కాలిక దేశాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్ ఏడుస్తూ కనిపించారు. బుధవారం ఖమేనీ మినహా మాజీ దేశాధ్యక్షులెవరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనకపోవడం గమనార్హం. రైసీ మృతికి సంతాపంగా భారత్‌లోనూ ఒక రోజు సంతాపదినం పాటించారు. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం
దుబాయ్: ఇరాన్ తూర్పు అజర్బైజాన్ పర్వతసానువుల్లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) ప్రాణాలు కోల్పోయా రు. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీప్రాంతంలో కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరబ్దుల్లాహియాన్ (60), ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలిక్ రహ్మతీ, అధికారులు, పైలట్లు, అంగరక్షకులు చనిపోయారని ఇరాన్ అధికారిక మీడియా సోమవారం ప్రకటించింది. ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లాహ్ అలీ ఖమేనీ మార్గదర్శకంలో ఇజ్రాయెల్‌పై గత నెలలో ఇరాన్ జరిపిన భీకర డ్రోన్లు, క్షిపణి దాడుల ఘటన మరువకముందే రైసీ హఠాన్మరణంపై ప్రపంచవ్యాప్తంగా భిన్న కథనాలు వినవస్తున్నాయి. అయితే రైసీ మరణోదంతంలో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదని ఇజ్రాయెల్ సోమవారం స్పష్టంచేసింది. హెలికాప్టర్ ప్రమాదంపై అత్యున్నతస్థాయి దర్యాప్తునకు సాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షొయిగు మాట ఇచ్చారు. రైసీ మరణం నేపథ్యంలో ప్రస్తుత ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొఖ్బర్ను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఖమేనీ ప్రకటించారు. ఉపవిదేశాంగ మంత్రి బఘేరీ కనీని నూతన విదేశాంగ మంత్రిగా నియమించారు. హెలికాప్టర్ కూలడానికి గల కారణాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అధ్యక్షుడి మరణవార్త తెలిసి ఇరాన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు మొదల య్యాయి. ఐదు రోజులు సంతాపదినాలుగా పాటించనున్నారు. లెబనాన్, సిరియా సైతం మూ డ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించాయి. భార త్ సైతం ఒక రోజు(మంగళవారం)ను సంతాప దినంగా ప్రకటించింది. రైసీ, ఇతర నేతల మృతదేహాలను తబ్రిజ్ పట్టణానికి తీసుకొస్తున్నారు. రైసీ ఖనన క్రతువును మష్హాద్ నగరంలో చేసే అవకాశం ఉంది.జాడ చెప్పిన తుర్కియే అత్యాధునిక డ్రోన్భారీ వర్షం, దట్టంగా కమ్ముకున్న మంచు, దారిలేని పర్వతమయ అటవీప్రాంతం కావడంతో త్రివిధ దళాలు రంగప్రవేశం చేసినా గాలింపు చర్యల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో తుర్కియే తమ అత్యాధునిక నిఘా డ్రోన్‌ను రంగంలోకి దింపింది. అది అడవిలో ఉష్ణాగ్రతల్లో మార్పుల ఆధారంగా సరిహద్దుకు 20 కి.మీ.ల దూరంలోని పచ్చని అటవీప్రాంతంలో హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని కనిపెట్టి సహాయక బృందాలకు సమాచారం చేరవేసింది. దీంతో దళాలు నేరుగా ఘటనాస్థలికి చేరుకోగలిగాయి. ఆ తర్వాతే రైసీ మరణవార్తను ధ్రువీకరించారు. సంతాపాల వెల్లువరైసీ మరణవార్త తెల్సి చాలా ప్రపంచదేశాలు తమ సంతాప సందేశాలను పంపించాయి. ప్రధాని మోదీ సైతం తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ‘‘ రైసీ మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత్–ఇరాన్ సంబంధాల బలోపేతానికి రైసీ చేసిన కృషి చిరస్మరణీయం. రైసీ కుటుంబ సభ్యులకు, ఇరాన్ దేశ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ విచారకర సమయంలో ఇరాన్‌కు అండగా ఉంటాం’’ అని మోదీ సోమవారం ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. లెబనాన్, సిరియా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, చైనా, టర్కీ, రష్యా, మలేసియా, హౌతీ, ఖతార్, ఇరాక్, పాకిస్తాన్, అజర్బైజాన్, పోలండ్, యూఏఈ, వెనిజులా దేశాలు, యూరోపియన్ యూనియన్, ఐక్యరా జ్యసమితి, నాటో, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సంతాపం తెలిపాయి. గొప్ప సోదరుడిని కోల్పోయామని లెబనాన్ ఉగ్రసంస్థ హెజ్బొల్లా, హమాస్‌తో పాటు హౌతీ తిరుగుబాటుదారులు సంతాపం ప్రకటించారు.నూతన అధ్యక్షుడి ఎంపిక ఎప్పుడు?తాత్కాలిక అధ్యక్షుడిగా మొఖ్బర్ కేవలం 50 రోజులు కొనసాగనున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని తాత్కాలికంగా చేపడతారు. ఈ నియామకానికి సుప్రీం లీడర్ ఖమేనీ ఆమోద ముద్ర వేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ స్పీకర్, న్యాయ విభాగాధిపతులతో ఒక మండలిని ఏర్పాటుచేస్తారు. ఇది గరిష్ఠంగా 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.ఖైదీల సామూహిక ఉరి ఉదంతంలో ప్రమేయంమతబోధకుల కుటుంబంలో మస్హద్ నగరంలో 1960 డిసెంబర్ 14న రైసీ జన్మించారు. మోతాహరీ యూనివర్సిటీలో న్యాయవిద్యను చదివారు. 15 ఏళ్ల వయసులోనే ‘ఖ్వామ్’లో మతవిద్యను నేర్చుకున్నారు. 1979లో ఇస్లామిక్ విప్లవకాలంలో పశ్చిమదేశాల మద్దతున్న ఇరాన్ పాలకుడు షాకు వ్యతిరేకంగా ఆయాతొల్లా రుహొల్లా ఖొమేనీ చేసిన ఉద్యమంలో రైసీ పాల్గొన్నారు. 21 ఏళ్లకే కరాజ్ నగర ప్రాసిక్యూటర్‌గా, పాతికేళ్లకే టెహ్రాన్ డెప్యూటీ ప్రాసిక్యూటర్‌గా పనిచే శారు. అటార్నీ జనరల్ స్థాయికి ఎది గారు. తదనంతరకాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేశారు. అయితే 1988 ఏడాది జూలై–సెప్టెంబర్ కాలంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన వేలాదిమంది రాజకీయ ఖైదీలను దేశవ్యాప్తంగా సామూహికంగా ఉరితీసిన ఉదంతంలో రైసీ ముఖ్యపాత్ర పోషించారని అమెరికా, ఇతర దేశాలు ఆరోపించాయి. రైసీ 2017లో హసన్ రౌహానీతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2021లో మరోసారి అధ్యక్ష ఎన్నికలు పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ముఖ్యమైన ప్రత్యర్థి నేతలందర్నీ అనర్హులు గా ప్రకటించడంతో రైసీ గెలుపు సులువైంది. ఛాందసవాద మత సంప్రదాయాల పేరిట భావ ప్రకటన స్వేచ్ఛ, మహిళా, మానవ హక్కులను కాలరాశారని ఆయనపై మాయని మచ్చ పడింది. ఈయన మార్గదర్శకత్వంలో అమల్లోకి వచ్చిన కఠిన హిజాబ్ చట్టాన్ని అమలుచేస్తూ నైతిక పోలీసులు 2022లో మహ్సా అమిని అనే మహిళను కొట్టిచంపడంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. 85 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ భవిష్యత్ రాజకీయ వారసునిగా రైసీ పేరు చాన్నాళ్లుగా వినిపిస్తోంది. హసన్ రౌహానీ కాలంలో కుదిరిన అణుఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్నాక అణ్వస్త్ర స్థాయి యురేనియం శుద్ధిని రైసీ మరింత పెంచి అంతర్జాతీయ ఆంక్షలకు గురయ్యారు. పాత, కొత్త ఆంక్షల కారణంగానే కొత్త హెలికాప్టర్లు కొనలేక పాత హెలికాప్టర్ల విడిభాగాలు దొరక్క, మరమ్మతులు చేయలేక చివరకు అదే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. రైసీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.మరోవైపు సంబరాలు!అతివాద రైసీ మరణవార్త తెల్సి ఇరాన్లో ఓవైపు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు జరుగుతుంటే మరోవైపు ‘టెహ్రాన్ నరహంతకుడు’ అంతమయ్యాడని వేలాది మంది బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు. దేశ, విదేశాల్లో ఇరానీయన్లు వేడుకలు చేసుకుంటున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు పేల్చుతున్న మీమ్స్, జోక్స్‌కు కొదవే లేదు. ‘హెలికాప్టర్ ప్రమాదంలో ఒకరు బతకడం కంటే చనిపోతేనే బాగుణ్ణు అని లక్షలాది మంది కోరుకోవడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా’’ అని అమెరికాలో ఉన్న ఇరాన్ పాత్రికేయుడు మసీహ్ అలీనెజాద్ వ్యాఖ్యానించారు. వేలాది మంది రాజకీయ ఖైదీలను ఉరితీయించడం, కఠిన హిజాబ్ చట్టాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు రైసీ మరణ సంబరాలకు కారణమని తెలుస్తోంది. -
హెలికాప్టర్ ప్రమాదం.. ఇరాన్ అధ్యక్షుడి చివరి వీడియో వైరల్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్( బెల్-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. జోల్ఫా ప్రాంతం సమీపంలోని పర్వతప్రాంతాలను దాటుతుండగా ప్రతికూల వాతావరణం కారణంగా దట్టమైన అడవిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో రైసీతోపాటు విదేశాంగ మంత్రి, మరో ఎనిమిది అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడిచింది. అధ్యక్షుడి కాన్వాయ్‌లోని మరో రెండు హెలికాప్టర్లు గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకున్నాయని తెలిపింది. ఇరాన్- అజర్బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది.కాగా తాజాగా హెలికాప్టర్ ప్రమాదానికి ముందు రైసీకి చెందిన చివరి ఫోటో, వీడియోను ఇరాన్ మీడియా షేర్ చేసింది. ఇందులో రైసీ హెలికాప్టర్ కిటికీ నుంచి రైసీ బయటకు చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి, ఇతర ఉన్నత అధికారులు కూడా ఉన్నారు. చాపర్‌లో వెళ్లడానికి ముందు అధికారులతో అధ్యక్షుడు మీటింగ్ ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా ఆ క్లిప్‌లో ఉన్నాయి. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రైసీ బయల్దేరిన 30 నిమిషాలకే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. దాదాపు 16 గంటల తర్వాత కొండ ప్రాంతంలో హెలికాప్టర్ శిథిలాలు గుర్తించారు. ఈ ఘటనలో రైసీతో పాటు హెలికాప్టర్లో ఉన్నవారంతా దుర్మరణం చెందారు.#Iranian President #Ibrahim #Raisai's last trip, the video of the aerial tour of the dam before the helicopter Crashh!!#Iran pic.twitter.com/fUTlBqpKW7— Imran Pazir (@imranpazir1) May 20, 2024తరువాతి అధ్యక్షుడు ఆయనే..కాగా ఇబ్రహీం రైసీ మృతిచెందడంతో.. తదుపరి ఇరాన్ అధ్యక్షుడు ఎవరవుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్(69) తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే తొలుత వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని చేపడతారు. దీనికి దేశ సుప్రీం లీడర్ ఖమేనీ ఆమోదించాలి. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు మొఖ్బర్, పార్లమెంటరీ స్పీకర్, న్యాయ వ్యవస్థ చీఫ్ ఘోల్లమ్‌హోస్సేన్ మొహసేని ఎజీతో కూడిన కౌన్సిల్ 50 రోజుల్లోగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో సంతాపం ప్రకటించారు.‘ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ మరణవార్త విని దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. భారత్-ఇరాన్ దైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. అతని కుటుంబ సభ్యులకు, ఇరాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోంది’ అని పేర్కొన్నారు.Deeply saddened and shocked by the tragic demise of Dr. Seyed Ebrahim Raisi, President of the Islamic Republic of Iran. His contribution to strengthening India-Iran bilateral relationship will always be remembered. My heartfelt condolences to his family and the people of Iran.…— Narendra Modi (@narendramodi) May 20, 2024 ‘ఈ మరణవార్త షాక్‌కు గురిచేసింది. ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రితో పలుమార్లు సమావేశమయ్యాను. ఈ జనవరిలో మా మధ్య భేటీ జరిగింది. ఈ విషాద సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా ఉంటాం.-భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్Deeply shocked to hear of the passing away of Iran’s President Dr Ebrahim Raisi and Foreign Minister H. Amir-Abdollahian in the helicopter crash. Recall my many meetings with them, most recently in January 2024. Our condolences to their families. We stand with the people of…— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) May 20, 2024 కాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌ను బెల్-212 ఆదివారం సాయంత్రం దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్ఏ ధ్రువీకరించింది.రైసీతోపాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియాన్ (60), తూర్పు అజర్బైజాన్ ప్రావిన్సు గవర్నర్ మలేక్ రహ్మతీ తదితరులు కన్నుమూసినట్లు ప్రకటించింది. ఇరాన్- అజర్‌బైజా ప్రావిన్స్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. విమానం బయలుదేరిన దాదాపు 30 నిమిషాలకే అడవుల్లో కుప్పకూలింది.మరోవైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి మరణవార్త పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఇరాన్ హమాస్‌కు మద్దతుగా ఉంది. గత నెలలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుపడిన విషయం తెలిసిందే. -
కుప్పకూలిన హెలికాఫ్టర్ ఇరాన్ అధ్యక్షుడు మృతి
-
హెలికాఫ్టర్ క్రాష్.. ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం
టెహ్రాన్: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అకాల మరణం చెందారు. రైసీతో పాటు ఆ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియన్, ఇతర ఉన్నతాధికారులు సైతం మృతి చెందారు. అజర్బైజాన్-ఇరాన్ సరిహద్దులోని జోల్ఫా పట్టణం దగ్గరగా ఉన్న పర్వత ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో హెలికాఫ్టర్‌ను గుర్తించిన ఇరాన్ బలగాలు.. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని ప్రకటించాయి.భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం అతి కష్టం మీద హెలికాఫ్టర్ కూలిన ప్రాంతానికి చేరుకున్న సహాయక బృందాలు.. హెలికాఫ్టర్ పూర్తిగా కాలి ధ్వంసం అయినట్లు ప్రకటించాయి. క్రాష్ సైట్లో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని.. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఇరాన్ రెడ్ క్రెసెంట్ చీఫ్ పిర్హోస్సేన్ కూలివండ్ ప్రకటించారు.Imagens adicionais de drone mostrando uma imagem mais nítida do local da queda do falecido presidente do Irã, o helicóptero de Ebrahim Raisi, que caiu ontem no noroeste do Irã, resultando na morte de todos os passageiros. #EbrahimRaisí pic.twitter.com/TPUrzL2oGz— 💢 𝑨𝒏𝒕𝒐𝒏𝒆𝒍𝒍𝒊 𝑹𝒐𝒅𝒓𝒊𝒈𝒖𝒆𝒔 💢 (@antonellibjj) May 20, 2024అంతకు ముందు టర్కీకి చెందిన డ్రోన్లు.. హెలికాఫ్టర్ కూలిన ప్రాంతానికి చేరుకున్నాయి. డ్రోన్ విజువల్స్ ద్వారా ఇరాన్ బలగాలకు సాయం అందించాయి.ఆదివారం అజర్బైజాన్ సరిహద్దులో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించిన రెండు డ్యామ్‌లను ఆ దేశ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్‌తో కలిసి రైసీ ప్రారంభించారు. మూడు హెలికాఫ్టర్ల కాన్వాయ్‌తో తిరిగి ప్రారంభమైన ఆయన కాన్వాయ్‌లో కాసేపటికే ఇబ్బంది తలెత్తింది. ప్రతికూల వాతావరణం కారణంగా.. ప్రయాణం మొదలైన అరగంట తర్వాత రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. అయితే మిగతా రెండు మాత్రం సురక్షితంగా గమ్యానికి చేరుకున్నాయి.ప్రమాదం జరిగిన వెంటనే హెలికాఫ్టర్ కూలిన స్థలాన్ని గుర్తించేందుకు ఇరాన్ బలగాలు తీవ్రంగా యత్నించాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయినప్పటికీ విశ్వయత్నాలు చేసి చివరకు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. మరోవైపు రైసీ క్షేమంగా తిరిగి రావాలని ఇరాన్ ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. -
రైసీ క్షేమమేనా?.. ప్రమాద స్థలానికి రెస్క్యూ టీమ్స్.. క్షణక్షణం ఉత్కంఠ
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీని రక్షణ బలగాలు గుర్తించాయి. ట్రాఫిజ్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన స్థలాన్ని డ్రోన్ ద్వారా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం 73 రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కొండ ప్రాంతం కావడం, భారీ వర్షాలు పడుతుండడం, దట్టమైన పొగమంచుతో ఆ ప్రాంతానికి చేరుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు. టర్కిష్ టెక్నాలజీ ఆధారిత డ్రోన్‌తో సెర్చ్ ఆపరేషన్‌ను ఇరాన్ లైవ్ టెలికాస్ట్ చేసింది. కొండ ప్రాంతంలో హెలికాఫ్టర్ కూలి.. పేలిపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి ఇరాన్ త్రివిధ దళాలు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. రాత్రి సైతం నైట్ విజన్ హెలికాఫ్టర్లతో సోదాలు జరిగాయి. వాతావరణం వర్షం కారణంగా సహకరించకపోవడంతో గగన తల సెర్చ్ ఆపరేషన్ నిలిపివేశారు. దీంతో బలగాలు గ్రౌండ్ లెవల్లో సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. AKINCI İHA, İran semalarında İran Cumhurbaşkanı Reisi ve heyetini arama kurtarma çalışmalarına destek veriyor https://t.co/ovXnx13UcY— AA Canlı (@AACanli) May 19, 2024ఇంకోవైపు.. రైసీ క్షేమంగా తిరిగొస్తారని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడి క్షేమ సమాచారం కోసం ప్రపంచదేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రైసీ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రమాద తీవ్రతపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు రైసీ క్షేమంగా తిరిగిరావాలని యావద్దేశం చేస్తున్న ప్రార్థనలు ఫలించేలా కనిపించడం లేదు.ఆదివారం ఓ అధికారిక కార్యక్రమంలో ఇబ్రహీం రైసీ పాల్గొన్నారు. ఇరాన్-అజర్బైజాన్ దేశాల సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే రెండు డ్యాంలను.. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్‌తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. అనంతరం ఇరాన్ ఆర్థిక మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్సు గవర్నర్, తబ్రిజ్ ప్రావిన్సు ఇమామ్లతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్లో ప్రయాణమయ్యారు. మరో రెండు హెలికాప్టర్లూ వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే.. రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ కూలిపోయిందని ఎక్కువ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్ ప్రభుత్వరంగ మీడియా మాత్రం ప్రమాదాన్ని ధృవీకరించకుండా వస్తోంది. ఆయన వెంట బయలుదేరిన మిగతా రెండు హెలికాఫ్టర్లు మాత్రం సురక్షితంగా ల్యాండయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగిందనే ప్రాథమిక అంచనాలు ఉన్నప్పటికీ.. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
సైనిక హెలికాప్టర్లు ఢీకొని 10 మంది మృతి
కౌలాలంపూర్: మలేసియా ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని 10 మంది చనిపోయారు. ఉత్తర పెరాక్ రాష్ట్రంలోని నేవీ కేంద్రం సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వచ్చే నెలలో జరిగే నేవీ వార్షికోత్సవాల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా పదుల సంఖ్యలో హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ప్రయాణం చేస్తున్నాయి. ఆ సమయంలో ఒక హెలికాప్టర్ పక్కకు జరగడంతో దాని రెక్క పక్కనే వస్తున్న మరో హెలికాప్టర్ రోటార్‌ను తాకింది. దీంతో, రెండు హెలికాప్టర్లు ఢీకొని కుప్పకూలాయి. వాటిలో ఉన్న ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు సహా మొత్తం పది మంది వైమానిక దళ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. -
Texas: యూఎస్, మెక్సికో సరిహద్దులో హెలికాప్టర్ క్రాష్
టెక్సాస్: అమెరికా, మెక్సికో సరిహద్దులో యూఎస్ నేషనల్ గార్డ్‌కు చెందిన ఒక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. టెక్సాస్‌లోని లా గ్రుల్లా పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కూలిన సమయంలో హెలికాప్టర్లో నలుగురు ప్రయాణిస్తున్నారు. హెలికాప్టర్ క్రాష్ ఘటనపై స్టార్ కౌంటీ షరీఫ్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లకోటా యూహెచ్-72 రకానికి చెందినదని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి.. గాజాలో దారుణం.. తిండి కోసం ఎదరు చూస్తున్న వారిపై పడ్డ పారాచూట్ -
అమెరికాలో హెలికాప్టర్ కూలి... ఆరుగురి దుర్మరణం
కాలిఫోర్నియా: అమెరికాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నైజీరియాకు ప్రముఖ ఏక్సెస్ బ్యాంకు సీఈవో, ఆయన భార్య, కొడుకు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పామ్ స్ప్రింగ్స్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం రాత్రి 8.45 గంటలకు బయలుదేరిన యూరోకాప్టర్ ఈసీ 120 రకం హెలికాప్టర్ నెవడాలోని బౌల్డర్ సిటీకి వెళుతుండగా మొజావ్ ఎడారిలోని ఇంటర్‌స్టేట్ 15 రహదారి సమీపంలో 10.30 గంటల సమయంలో కూలిపోయింది. ఘటనలో అందులో ఉన్న యాక్సెస్ బ్యాంక్ సీఈవో హెర్బర్ట్ వింగ్వే(57), ఆయన భార్య, కొడుకుతోపాటు మొత్తం ఆరుగురూ మృత్యువాతపడ్డారు. నైజీరియాలోని రెండు అతిపెద్ద బ్యాంకుల్లో ఏక్సెస్ బ్యాంకు ఒకటి. -
చిలీ మాజీ అధ్యక్షుడి మృతి
-
అభివృద్ధికి దిక్సూచి.. వైఎస్ రాజశేఖరరెడ్డి
వైఎస్ రాజశేఖరరెడ్డి.. వైఎస్సార్.. ఈ పేరు రాష్ట్ర ప్రజలకు ఓ భరోసా. అన్నదాతలకు అండ. సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్తస్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యా దాత. ఆరోగ్య శ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత. పంట ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహా నేత. పారదర్శకమైన పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వరదెత్తేలా చేసి.. ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించిన వైఎస్సార్.. మూడు పోర్టులు నిర్మించి ఎగుమతులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చారు. ఐటీ ఎగుమతుల్లో 566 శాతం వృద్ధి సాధించారు. ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పి, అభివృద్ధికి సరైన నిర్వచనం చెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత వైఎస్సార్ అమలు చేసిన పథకాలనే కేంద్రం, అనేక రాష్ట్రాలు చేపట్టాయి. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న వైఎస్ రాజారెడ్డి, జయమ్మ దంపతులకు జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటు చేసి.. రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల మన్ననలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. 1978లో రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందే వరకు తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి పాలించింది ఐదేళ్ల మూడు నెలలే ఆ కొద్ది కాలంలోనే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చూపించారు. సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల మూడు నెలలే పని చేశారు. మంచి చేయాలన్న మనసుంటే.. ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో ఆ కొద్ది కాలంలోనే చేసి చూపించారు. సమగ్రాభివృద్ధి వైపు రాష్ట్రాన్ని ఎలా పరుగులెత్తించవచ్చో దేశానికే చాటి చెప్పారు. అందుకే ఆ మహానేత భౌతికంగా దూరమై 14 ఏళ్లు దాటిపోయినా, ఇప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పేద బిడ్డల చదువులకు పెన్నిధి.. పేదరికానికి విద్యతో విరుగుడు పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూపకల్పన చేశారు. మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరికం నిర్మూలన సాధ్యమని ఆయన బలంగా నమ్మారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా లక్షలాది మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఓసీ విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసించి.. దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల లక్షలాది కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. ఉన్నత చదువులను అందరికీ అందుబాటులోకి తేవడం కోసం జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్శిటీని.. తిరుపతిలో పశు వైద్య కళాశాలను నెలకొల్పారు. ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉన్నత చదవులు దక్కేలా చేశారు. నిరుపేదలను విద్యావంతులుగా తీర్చిదిద్దే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆ తర్వాత అనేక రాష్ట్రాలు అమల్లోకి తెచ్చాయి. పారిశ్రామికాభివృద్ధితో పుష్కలంగా ఉపాధి అవకాశాలు ఉమ్మడి రాష్ట్రంలో 1995 నుంచి 2004 వరకు పరిపాలించిన చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతికి కేంద్రంగా మార్చారు. దాంతో సుదీర్ఘమైన తీర ప్రాంతం, సమృద్ధిగా సహజవనరులు, పుష్కలంగా మానవ వనరులు అందుబాటులో ఉన్నా పెట్టుబడుల ఆకర్షణలో ఏడో స్థానానికి పరిమితమైంది. వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక పారదర్శకమైన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. దాంతో రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. పెట్టుబడుల ఆకర్షణలో 2004 నుంచి 2009 వరకు రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవడంతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచించిన వైఎస్సార్.. యుద్ధప్రాతిపదికన గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు నిర్మించారు. దాంతో ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు. తద్వారా హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకునేలా చేశారు. దాంతో ఐటీ ఎగుమతులు 566 శాతం పెరిగాయి. జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌కు పాదయాత్రతో జీవం అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్ పార్టీ జీవచ్ఛవంలా మారింది. ఆ దశలో రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వైఎస్ రాజశేఖరరెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. 2003 జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. మండుటెండలో 1,475 కిలోమీటర్ల వైఎస్సార్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోను, అటు కేంద్రంలోనూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, జలయజ్ఞం ప్రాజెక్టులతో, రైతు పథకాలతో వ్యవసాయాన్ని పండగల మార్చి ప్రజారంజక పాలన అంటే ఏమిటో దేశానికి చూపించారు. పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన నేత పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. పంటలు పండక విద్యుత్ ఛార్జీలు కట్టలేని రైతులపై టీడీపీ సర్కారు రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తేయడం ద్వారా పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షలకు పైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ను అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాతి ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్ హామీ అమలుపై వెనక్కు తగ్గలేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన నేతలు కూడా అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిని కల్పించారు. వైఎస్సార్ స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. పంట ఎండినా రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీని అందించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. 2004 నుంచి 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1000 వరకు పెరగడమే అందుకు తార్కాణం. మాంద్యం ముప్పును తప్పించిన ఆర్థికవేత్త 2007–08, 2008–09 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ మాంద్యం ప్రభావం దేశంపైనా పడింది. కానీ.. వైఎస్సార్ దాని ముప్పు ప్రభావం రాష్ట్రంపై పడకుండా చేయగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారులు వంటి అభివృద్ధి పనులు చేపట్టి మార్కెట్లోకి ధనప్రవాహం కొనసాగేలా చేశారు. వాటి ద్వారా రాష్ట్రానికి పన్నులు వచ్చేలా చేసి.. మాంద్యం ముప్పు నుంచి రాష్ట్రాన్ని కాపాడారు. వైఎస్సార్ ఆర్థిక ప్రణాళికను చూసి అప్పట్లో ఆర్థిక నిపుణులు ప్రశంసించారు. ఇది కూడా చదవండి: ఒకటో తేదీనే 52.70 లక్షల మందికి రూ.1,451.41 కోట్ల పింఛన్ -
కుప్పకూలిన భారత ఆర్మీ హెలిక్టాపర్.. ఇద్దరు పైలట్స్ ఎక్కడ?
భారత సైన్యానికి చెందిన చిరుత హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో పైలట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఆర్మీ అధికారులు. ఇక, ఈ ప్రమాదం ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆర్మీకి చెందిన చిరుత హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని మండాలా హిల్స్ వద్ద కుప్పకూలిపోయింది. బొండిలా పట్టణం నుంచి వెళ్తుండగా గురువారం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు గువాహటి డిఫెన్స్ పీఆర్వో, కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు. Report: Army #Cheetah Helicopter Crash in West #Khameng district of the #Arunachal Pradesh. More details awaited.#IADN 📸 Representation pic.twitter.com/2ZL9P30yHM — Indian Aerospace Defence News (IADN) (@NewsIADN) March 16, 2023 -
ప్రాణాలు తోడేస్తున్న నిర్లక్ష్యం
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో మంగళవారం పైలెట్‌తో సహా ఏడుగురి మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదం ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ను దించాల్సిన ప్రాంతంలో దట్టమైన మంచు అలుముకుని ఉన్నదని పైలెట్ గ్రహించి, వెనక్కి మళ్లించేందుకు ప్రయత్నించినప్పుడు దాని వెనుక భాగం నేలను తాకడంతో ప్రమాదం జరిగిందంటున్నారు. కేదార్నాథ్ గగనంలో హెలికాప్టర్ల సందడి మొదలై పదిహేనేళ్లు దాటుతోంది. ఏటా మే నెల మధ్యనుంచి అక్టోబర్ నెలాఖరు వరకూ సాగే చార్ధామ్ యాత్ర సీజన్లో హెలికాప్టర్లు ముమ్మరంగా తిరుగుతాయి. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలలోని క్షేత్రాలను భక్తులు సందర్శిస్తారు. ఇతర ప్రయాణ సాధనాల విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. హెలికాప్టర్ల వినియోగమే వద్దని ఆదినుంచీ పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రశాంతతకు మారుపేరైన హిమవన్నగాలతో నిండిన సున్నితమైన పర్యావరణ ప్రాంతం కేదార్నాథ్. ఇక్కడ హెలికాప్టర్ల రొద వన్య ప్రాణులకు ముప్పు కలిగిస్తుందనీ, వాతావరణంలో కాలుష్యం పెరుగుతుందనీ పర్యావరణవేత్తల అభియోగం. తక్కువ ఎత్తులో ఎగురుతూ చెవులు చిల్లులుపడేలా రొద చేస్తూ పోయే హెలికాప్టర్ల తీరుపై స్థానికులు సైతం తరచు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వాటి చప్పుడు తీవ్ర భయాందోళనలు కలిగిస్తోందనీ, పిల్లల చదువులకు కూడా వాటి రాకపోకలు ఆటంకంగా మారాయనీ చెబుతున్నారు. అయినా వినే దిక్కూ మొక్కూ లేదు. హెలికాప్టర్లు నడిపే సంస్థలకు లాభార్జనే తప్ప మరేమీ పట్టదు. అందుకే లెక్కకుమించిన సర్వీసులతో హడావిడి పెరిగింది. పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని అధికారులు కనీసం హెలికాప్టర్ల భద్రతనైనా సక్రమంగా పర్యవేక్షిస్తున్న దాఖలాలు లేవు. తాజా దుర్ఘటనలో మరణించిన పైలెట్ అనిల్ సింగ్‌కు ఆర్మీలో 15 ఏళ్ల అనుభవం ఉంది. అయితే మొదట్లో హెలికాప్టర్లు నడిపినా మిగిలిన సర్వీసంతా విమానాలకు సంబంధించిందే. అలాంటివారు కొండకోనల్లో హెలికాప్టర్లు నడపాలంటే అందుకు మళ్లీ ప్రత్యేక శిక్షణ పొందటం తప్పనిసరి. పైగా వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకునే కేదార్నాథ్ వంటిచోట్ల సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లు నడపాలంటే ఎంతో చాకచక్యత, ఏకాగ్రత అవసరమవుతాయి. ఆ ప్రాంతంలో అంతా బాగుందనుకునేలోగానే హఠాత్తుగా మంచుతెర కమ్ముకుంటుంది. హెలికాప్టర్ నడిపేవారికి ఏమీ కనబడదు. అదృష్టాన్ని నమ్ముకుని, దైవంపై భారం వేసి ముందుకు కదిలినా, వెనక్కిరావడానికి ప్రయత్నించినా ముప్పు పొంచివుంటుంది. ఆ ప్రాంతం గురించి, అక్కడ హెలికాప్టర్ నడిపేటపుడు ప్రత్యేకించి పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి క్షుణ్ణంగా తెలిసినవారైతేనే ఈ అవరోధాలను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా 600 మీటర్ల (దాదాపు 2,000 అడుగులు) కన్నా తక్కువ ఎత్తులో హెలికాప్టర్లు నడపరాదన్న నిబంధన ఉంది. కానీ చాలా హెలికాప్టర్లు 250 మీటర్ల (820 అడుగులు)లోపు ఎత్తులోనే దూసుకుపోతున్నాయని స్థానికులు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన హెలికాప్టర్ సైతం తక్కువ ఎత్తులో ఎగురుతున్నందునే వెనక్కు మళ్లుతున్న క్రమంలో దాని వెనుక భాగం అక్కడున్న ఎత్తయిన ప్రదేశాన్ని తాకి మంటల్లో చిక్కుకుంది. ఈ సీజన్లో ఇంతవరకూ 14 లక్షలమందికిపైగా యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించగా అందులో దాదాపు లక్షన్నరమంది తమ ప్రయాణానికి హెలికాప్టర్లను ఎంచుకున్నారు. ఈ ప్రాంతంలో హెలికాప్టర్ల వినియోగాన్ని నిషేధించాలని కొందరు పర్యావరణవేత్తలు అయిదేళ్ల క్రితం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినప్పుడు దాన్ని తోసిపుచ్చిన ట్రిబ్యునల్... వాటి నియంత్ర ణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అవి నిర్దేశిత ఎత్తులో ఎగిరేలా చూడాలనీ, సర్వీసుల సంఖ్యపై కూడా పరిమితులు విధించాలనీ ఆదేశించింది. కానీ ఎవరికి పట్టింది? మన దేశంలో పారిశ్రామిక ప్రాంతాల్లో, వాణిజ్య ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం ఏయే స్థాయిల్లో ఉండాలో నిర్దేశించారు. ఈ శబ్దకాలుష్యానికి సంబంధించిన నిబంధనల్లో పగలు, రాత్రి వ్యత్యాసాలున్నాయి. కానీ విషాదమేమంటే దేశానికే ప్రాణప్రదమైన హిమశిఖర ప్రాంతాల్లో శబ్దకాలుష్యం పరిమితులు ఏమేరకుండాలో నిబంధనలు లేవు. అక్కడ తిరిగే హెలికాప్టర్ల వల్ల ధ్వని కాలుష్యం సగటున 70 డెసిబుల్స్ స్థాయిలో, గరిష్ఠంగా 120 డెసిబుల్స్ స్థాయిలో ఉంటున్నదని పర్యావరణవేత్తల ఆరోపణ. దీనిపై నిర్దిష్టమైన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం లేదా? పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవాలనుకునేవారినీ, ఆ ప్రాంత ప్రకృతిని కళ్లారా చూడాలని తహతహలాడే పర్యాటకులనూ ప్రోత్సహించాల్సిందే. ఇందువల్ల ప్రభుత్వ ఆదాయం పెరగటంతోపాటు స్థానికులకు ఆర్థికంగా ఆసరా లభిస్తుంది. అయితే అంతమాత్రంచేత పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ధోరణి మంచిది కాదు. పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్లు నడపటంలో అనుభవజ్ఞులైనవారిని మాత్రమే పైలెట్లుగా అనుమతించటం, తగిన ఎత్తులో హెలి కాప్టర్లు రాకపోకలు సాగించేలా చూడటం, అపరిమిత శబ్దకాలుష్యానికి కారణమయ్యే హెలికాప్టర్ల వినియోగాన్ని అడ్డుకోవటం తక్షణావసరం. ఈ విషయంలో సమగ్రమైన నిబంధనలు రూపొందిం చటం, అవి సక్రమంగా అమలయ్యేలా చూడటం ఉత్తరాఖండ్ ప్రభుత్వ బాధ్యత. -
కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు దుర్మరణం
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, ఐదుగురు యాత్రికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఐదుగురు యాత్రికులతో గుప్తకాశీలోని ఫటా హెలిప్యాడ్ నుంచి కేదార్నాథ్ వెళ్లేందుకు బయలుదేరిన హెలికాప్టర్ కొద్దిసేపటికే కుప్పకూలింది. వెంటనే మంటలు అంటుకోవటంతో ఇద్దరు పైలట్లు, ఐదుగురు యాత్రికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కేదార్‌నాథ్‌కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని గరుడ ఛట్టీ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సిందియా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నామని, పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఆర్యాన్ విమానయాన సంస్థ బెల్ 407 హెలికాప్టర్ వీటీ-ఆర్పీఎన్ ప్రమాదానికి గురైనట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. ఇదీ చదవండి: కశ్మీర్లో మళ్లీ పౌరులపై దాడులు.. నాలుగు రోజుల్లో ముగ్గురి హత్య -
కన్నీళ్లు తెప్పించిన సజీవదహనం ఫోటోలు.. '31 మిలియన్ డాలర్లు చెల్లించండి'
అమెరికన్ బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ 2020లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అతని మరణవార్త అప్పట్లో క్రీడాలోకాన్ని తీవ్ర దిగ్ర్బాంతికి గురి చేసింది. సబర్బన్ లాస్ ఏంజిల్స్‌లో పొగమంచు కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగాయి. దీంతో బ్రియంట్తో సహా ఆయన 13 ఏళ్ల కూతురు జియానా దుర్మరణం చెందింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో హెలికాప్టర్లో ఉన్న మరో ఎనిమిది మంది కూడా సజీవదహనమయ్యారు.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. PC: కోబ్ బ్రియాంట్ భార్య వెనెస్సా బ్రియాంట్ అప్పట్లో కోబ్ బ్రియాంట్ మృతిపై సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా లాస్ ఏంజిల్స్ కౌంటీ డిప్యూటీస్ సహా అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫోటోలు తీశారు. అంతటితో ఊరుకోకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో బ్రియాన్ సజీవదహనం ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు బ్రయంట్ భార్య వెనెస్సాను ఎమోషన్‌కు గురిచేయడంతో పాటు మానసిక సంఘర్షణకు గురయ్యేలా చేశాయి. తన అనుమతి లేకుండా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంపై లాస్ ఏంజిల్స్ కౌంటీపై కోర్టులో దావా వేసింది. తాజాగా బుధవారం దావాను పరిశీలించిన తొమ్మిది మందితో కూడిన ధర్మాసనం.. తీర్పును వెనెస్సాకు అనుకూలంగా ఇచ్చింది. కోబ్ బ్రయంట్ భార్య సహా మిగతావాళ్లకు కలిపి లాస్ ఏంజెల్స్ కౌంటీ 31 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. వెనెస్సా బ్రయంట్ కుటుంబంతో పాటు క్రిస్ చెస్టర్, అతని భార్య సారా, కుమార్తె పేటన్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. దీంతో 31 మిలియన్ డాలర్స్‌లో వెనెస్సా బ్రియంట్కు 16 మిలియన్ డాలర్లు.. చెస్టర్ ఫ్యామిలీకి 15 మిలియన్ డాలర్లు చెల్లించాలని కౌంటీకి పేర్కొంది. PC: కోబ్ బ్రియాంట్ కుటుంబం(ఫైల్ ఫోటో) ధర్మాసనం తీర్పును చదవగానే భావోద్వేగానికి గురైన వెనెస్సా బ్రియాంట్ విలేకరులతో మాట్లాడకుండానే కన్నీళ్లు పెట్టుకుంటూ కోర్టు ఆవరణ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ వేదికగా తన భర్త బ్రియాంట్, కూతురు జియానా ఫోటోను షేర్ చేస్తూ "ఆల్ ఫర్ యు! ఐ లవ్ యు! జస్టిస్ ఫర్ కోబ్ అండ్ జిగి!" అని క్యాప్షన్ జత చేసింది. PC: కోబ్ బ్రియాంట్(ఫైల్ ఫోటో) కొబ్ బ్రయంట్ తన 20 ఏళ్ల కెరీర్లో పలు రికార్డులు సాధించారు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఆడి ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచారు. 18సార్లు ఆల్ టైమ్ స్టార్ గా నిలిచారు. 2016లో ఎన్ బీఎ నుంచి మూడోసారి ఆల్ టైమ్ స్కోరర్ గా రిటైర్ అయ్యారు. కొబ్ బ్రయంట్ 2012 ఒలింపిక్స్ లో యూఎస్ టీమ్ తరపున ఆడి రెండు స్వర్ణ పతకాలు అందుకున్నారు. -
చత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్ల మృతి
Chhattisgarh Helicopter Crash, రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది. రాయ్‌పూర్ విమానాశ్రయంలో ప్రభుత్వ హెలికాప్టర్ గురువారం రాత్రి 9.10 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలిన సమయంలో అందులో ఇద్దరు పైలట్లు ఉండగా.. ఇద్దరూ మృత్యువాతపడ్డారు మృతిచెందిన పైలట్లు కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ శ్రీ వాస్తవగా గుర్తించారు. రాయపూర్ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ రాకేష్ సహాయ్ ప్రమాద విషయాన్ని ధృవీకరించారు, మన పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో రాత్రి ఫ్లయింగ్ ప్రాక్టీస్ సందర్భంగా ఈ సంఘటన జరిగిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తరపున వివరణాత్మక సాంకేతిక విచారణ చేపట్టింది. సీఎం విచారం హెలికాప్టర్ ప్రమాద ఘటనపై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగెల్ విచారం వ్యక్తం చేశారు. మరణించిన ఇద్దరు పైలట్లకు నివాళులు అర్పించారు. మరణించిన పైలట్ల కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. -
రష్యా హెలికాప్టర్‌ను కూల్చి.. పైలట్‌ను పట్టుకున్నాం: ఉక్రెయిన్ రక్షణశాఖ
Russia-Ukraine crisis: తమ వైమానిక రక్షణ దళ నిపుణులు రష్యా హెలికాప్టర్‌ను శనివారం కూల్చేశారని ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్విట్టర్లో వెల్లడించింది. చెర్నిహివ్ నగర శివారులో ఈ సంఘటన జరిగిందని పేర్కొంది. రష్యా హెలికాప్టర్లో ఒక పైలట్ మరణించాడని, అతడిని మేజర్ క్రివోలాపోవ్‌గా గుర్తించినట్లు తెలిపింది. మరో పైలట్ క్రస్నోయర్టెసెవ్ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించింది. ఈ మేరకు సంబంధిత వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసింది. ఇదిలా ఉండగా, చెర్నిహివ్ ప్రాంతం లో రష్యా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడి శిథిలాల నుంచి 22 మృతదేహాలను వెలికి తీసినట్లు ఉక్రెయిన్ అధికార యంత్రాంగం తెలిపింది. రెండు పాఠశాలలు, ప్రైవేట్ ఇళ్లపై జరిగిన రష్యా దాడుల్లో కనీసం 9 మంది చనిపోయారని చెర్నిహివ్ స్థానిక గవర్నర్ చెప్పారు. #stoprussia ⚔️ Так гинуть російські окупанти. Цього разу у вертольоті! Слава Україні та її захисникам! Разом до перемоги! 🇺🇦@GeneralStaffUA pic.twitter.com/raFOepF06P — Defence of Ukraine (@DefenceU) March 5, 2022 -
అమెరికా జాబ్ వదిలి స్వదేశానికి.. అంతలోనే...
పైలట్ కావాలన్నది ఆమె చిన్ననాటి కల. తన స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అమెరికాలో ఉద్యోగాన్ని సైతం వదులుకుని స్వదేశానికి తిరిగివచ్చారు. తన కల నేరవేరే సమయంలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు మహిళా శిక్షణ పైలట్ మహిమా గజరాజ్ (29). మరి కొన్ని నెలల్లోనే పైలట్ శిక్షణ ముగుస్తుందనగా ఆమె అనూహ్యంగా దుర్మరణం చెందడం విషాదం. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ సమీపంలో శనివారం జరిగిన ప్రమాదంలో మహిమ మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆమెకు.. బాల్యం నుంచే పైలట్ కావాలని కోరిక. పీజీ పూర్తైన తర్వాత అమెరికా ఉద్యోగంలో చేరారు. పైలట్ కావాలన్న సంకల్పంతో అమెరికాను వదిలి స్వదేశానికి తిరిగివచ్చారు. భర్త పరంథామన్, కుటుంబ సభ్యులను ఒప్పించి పైలట్ శిక్షణలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రైట్ బ్యాంక్ సమీపంలో ఉన్న ఫ్లైటైక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలో గత ఐదారు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నారు. ట్రైనింగ్‌లో చేరిన నెల రోజుల్లోనే చాలా వరకు మెలకువలు నేర్చుకుని.. బెస్ట్ ట్రైనీగా నిలిచారు. మహిమకు తోడుగా ఆమె తల్లి, భర్త.. రైట్ బ్యాంక్ సమీపంలోనే నివసిస్తున్నారు. విషాదం వెంట విషాదం కొద్ది రోజుల క్రితమే మహిమ తండ్రి గజరాజ్.. కరోనా బారిన పడి కన్నుమూశారు. ఇంతలోనే మరో విషాదం చోటు చేసుకోవడంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే శిక్షణలో చురుకైన అభ్యర్థిగా ఉన్న మహిమ.. ప్రమాదానికి గురికావడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు 85 గంటలు విమానంను నడిపారని, ఇందులో 25 గంటలు సింగిల్‌గా నడిపిన అనుభవం ఉందని ఫ్లైటైక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీ సీఈవో మమత తెలిపారు. ఊహాగానాలు వద్దు.. వాస్తవాలు కావాలి ప్రమాదం ఎలా జరిగిందన్న వానిపై వాస్తవాలు వెల్లడించాలని మహిళ గజరాజన్ భర్త పరంథామన్ కోరారు. భర్తను, ఒక్కగానొక్క కూతురిని పోగొట్టుకుని తన అత్తగారు కుప్పకూలిపోయారని చెప్పారు. ప్రమాదం జరిగిన రూట్లో ఇంతకుముందు కూడా తన భార్య విమానం నడిపారని, కానీ ఇప్పుడు ఏమైందనేది తమకు తెలియాలని అన్నారు. తమ ప్రశ్నలకు సమాధానాలు కావాలన్నారు. అక్టోబర్ చివరినాటికి ట్రైనింగ్‌లో చేరే నాటికే థియరీ పూర్తైందని, 185 ఫైయింగ్ అవర్స్ కోసం శిక్షణకు వచ్చినట్టు చెప్పారు. ఏప్రిల్/మే నాటికి ట్రైనింగ్ పూర్తి చేయాలని మహిమ అనుకుందని వెల్లడించారు. అదంతా అబద్దం ఆన్లైన్ ట్రేడర్‌గా పనిచేస్తున్న పరంథామన్ కూడా గతంలో పైలట్‌గా శిక్షణ తీసుకున్నారు. అయితే ఆయన పైలట్ శిక్షణ పూర్తిచేయలేకపోయారు. మహిమ నాలుగు నెలల గర్భిణి అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. ‘ఇదంతా అవాస్తవం. నా భార్య గర్భంతో ఉంటే విమానం నడిపే సాహసం ఎందుకు చేయనిస్తాం?’అని ప్రశ్నించారు. కాగా, శిక్షణ విమానం కుప్పకూలిన దుర్ఘటనపై డీజీసీఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో వెల్లడవుతాయని భావిస్తున్నారు. -
నల్లగొండ జిల్లాలో కూలిన ట్రైనింగ్ విమానం
-
కుప్పకూలిన ట్రైనీ విమానం
పెద్దవూర/విజయపురిసౌత్: నల్లగొండ జిల్లాలో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. విమానంలోని మహిళా శిక్షణ పైలట్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. టూ సీటర్ సెస్నా 152 విమానంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా రైట్ బ్యాంక్ సమీ పంలో ఫ్లైటైక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహిమా గజరాజ్ (29) శిక్షణ పొందుతున్నారు. టూ సీటర్ సెస్నా–152 ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్తో శనివారం ఉదయం 10.30 గంటలకు శిక్షణ కేంద్రం నుంచి సింగిల్‌గా బయలుదేరారు. టేకాఫ్ అయిన 30 నిమిషాల్లోనే కూలిపోయింది. విమానం శకలాలు వంద మీటర్ల దూరంలో పడిపో యాయి. పైలట్ అక్కడికక్కడే మృతిచెందారు. చెట్లను తాకే ఎత్తులో చక్కర్లు కొట్టి.. రామన్నగూడెం, ముత్యాలమ్మగుడి స్టేజీ మీదుగా 10 నిమిషాలకు పైగా చెట్లను తాకే ఎత్తులో నాలుగైదు సార్లు విమానం చక్కర్లు కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తర్వాత వ్యవసాయ బావి పక్కనున్న సుబాబుల్ చెట్టు పైభాగంలో ఉన్న ఆకులను తాకుతూ పైకి లేచిందని, తర్వాత 30 సెకన్లలోనే రెండు హై టెన్షన్ విద్యుత్ స్తంభాల మధ్య విద్యుత్ తీగల కిందుగా వెళ్లి కూలిపోయిందని వివరించారు. దగ్గర్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న గ్రామ వీఆర్ఏ ప్రమాదం విషయాన్ని స్థానిక తహసీల్దార్, పోలీసులకు తెలిపారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ఘటన స్థలాన్ని పరిశీలించారు. గాలిలో చక్కర్లు కొడుతూ భూమిని వేగంగా తాకి పెద్ద శబ్దంతో విమానం కూలిందని ఎస్పీ తెలిపారు. విమానం సాంకేతిక లోపంతో కూలిందా, మరేదైనా కారణమా డీజీసీఏ విచారణలో తేలుతుందన్నారు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారని తెలిపారు. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం: విమానం శిథిలాల కింద పైలట్ మృతదేహం మాంసం ముద్దగా మారింది. సాయంత్రం 4 గంటలకు ట్రాక్టర్‌తో శిథిలాలను పక్కకు తొలగించి మృతదేహాన్ని బయటికి తీశారు. సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం చేశారు. తర్వాత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలికి భర్త, తల్లి ఉన్నారు. వారితో కలిసి రైట్బ్యాంకులోనే ఉంటున్నారు. మహిమ మరణ వార్త తెలుసుకొని భర్త పరందామ కన్నీరుమున్నీరుగా విలపించారు. వీరికి 2017లో వివాహం అయినట్లు తెలిసింది. డీజీసీఏ బృందం పరిశీలన: ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయిన ప్రదేశాన్ని హైదరాబాద్ నుంచి వచ్చిన డీజీసీఏ ప్రత్యేక బృందం అధికారులు పరిశీలించారు. కూలిపోయిన విధానాన్ని ప్రత్యక్ష సాక్షులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి డీజీసీఏ ప్రత్యేక బృందం రానున్నట్లు తెలిసింది. మరోవైపు విజయపురి సౌత్‌లోని ఫ్లైటెక్ ఏవియేషన్ ఆకాడమీని గురజాల డీఎస్పీ జయరాంప్రసాద్, ఆర్డీవో పార్థసారథి తనిఖీ చేశారు. ఫ్లైటెక్లోని రికార్డులు, విమానలకు సంబంధించి అనుమతి పత్రాలను పరిశీలించి విచారణ చేపట్టారు. విమానంతో సిగ్నల్స్ తెగిపోయాయి: ఫ్లైటెక్ సీఈవో ఫ్లైటెక్ శిక్షణ కేంద్రంలో 6 నెలల క్రితం ట్రైనీ మహిళా పైలట్‌గా మహిమా గజరాజ్ చేరారు. ఆమె ఇప్పటివరకు 85 గంటలు విమానంను నడిపారని, ఇందులో 25 గంటలు సింగిల్‌గా నడిపిన అనుభవం ఉందని సంస్థ సీఈవో మమత తెలిపారు. టేకాఫ్ అయిన 15 నిమిషాల తర్వాత ఎయిర్ క్రాఫ్ట్తో సిగ్నల్స్ తెగిపోయా యన్నారు. ఫ్లైటెక్ 2009లో ప్రారంభం నాగార్జునసాగర్‌లోని విజయపురి సౌత్‌లో 2009లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం పైలట్ శిక్షణ తరగతులను నిర్వహిం చేందుకు అనుమతిచ్చింది. దీంతో ఫ్లైటైక్ ఏవి యేషన్ అకాడమీకి సంబంధించిన ప్రహరీ, రన్‌వే, హ్యం గర్లు నిర్మించారు. 2010లో అధికారులు క్రాస్ కంట్రీకి అనుమతులు ఇవ్వటంతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. హైదరాబా ద్‌లోని నాదర్గుల్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి నాగార్జునసాగర్‌కు ట్రైనీ పైలట్ ఎయిర్‌క్రాప్ట్‌లో వచ్చి తిరిగి హైదరాబాద్‌కు చేరుకునేవారు. అలాగే ఉదయం నాగార్జునసాగర్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరుకు క్రాస్ కంట్రీ నిమిత్తం ఎయిర్‌క్రాఫ్ట్‌లో బయలుదేరిన మహిమ.. ప్రమాదానికి గురై మృతి చెందారు. సంస్థలో పైలట్లు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెన్స్ ఇంజనీరింగ్, బీఎస్సీ ఏవియేషన్‌కు సంబంధించి సుమారు 60 మందికి పైగా శిక్షణ పొందుతున్నారు. -
మంత్రికి సంతాపం.. కొన్ని గంటలకే చిరంజీవిగా అదే మంత్రి!!
మడగాస్కర్: హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో మడగాస్కర్ దేశ మంత్రి సెర్జ్ గెలె ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన సాహసంతో సుమారు 12గంటల పాటు పోరాడి సముద్రంలో ఈదుకుంటూ బయటపడ్డారు. తాను మరణించలేదని బతికే ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం ఐలాండ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. పడవ మునక ప్రమాదంలో 39మంది చనిపోయిట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో పడవ మునిగిపోవడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి మంత్రి బృందం అక్కడికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్లో ఉన్న మంత్రితో పాటు మరో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన పట్ల దేశ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో మంత్రితో పాటు మిగతా ఇద్దరు అధికారులు మరణించారని ఆయన నివాళులు అర్పించారు. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు ఈదుకుంటూ విడివిడిగా సముద్ర తీర ప్రాంతమైన మహాంబోకు చేరుకున్నారు. హెలికాప్టర్ కూలిపోవడానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన తర్వాత తాను రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు సముద్రంలో ఈదుకుంటూ వచ్చినట్లు మంత్రి గెలె తెలిపారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు. తనకు ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా బతికే ఉన్నానని మహాంబో గ్రామస్తులకు చెప్పారు. ఆయన హెలికాప్టర్‌లోని ఒక సీటును సుముద్రం నీటిపై తేలడానికి ఉపయోగించుకున్నారని పోలీస్ చీఫ్ జఫిసంబత్రా రావోవీ పేర్కొన్నారు. ఆయన క్రీడల్లో ఎల్లప్పుడూ గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించేవారని, 30 ఏళ్ల వ్యక్తిలా బతకడానికి పోరాడారని రావోవీ ప్రశంసించారు. -
ఏ చిన్న ఆధారాన్నీ వదలం
సాక్షి, హైదరాబాద్: భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనలో ఏ చిన్న ఆధారాన్నీ వదలబోమని ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి స్పష్టం చేశారు. ప్రమాదానికి వాతావరణ పరిస్థితులు కారణమా, మానవ తప్పిదమా, సాంకేతిక లోపమా అని తెలుసుకునేందుకు త్రివిధ దళాల ఎంక్వైరీ టీమ్ నేతృత్వంలో ‘కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ’ కొనసాగుతోందని తెలిపారు. వైమానిక దళంలో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాలకు చెందిన 175 మంది ఫ్లైట్ క్యాడెట్ల శిక్షణ ముగిసిన సందర్భంగా శనివారం దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ముఖ్య అతిథిగా వివేక్ రామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘సీడీఎస్ హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో దొరికిన అన్ని ఆధారాలను పరిశీలించి ప్రతి సాక్షిని విచారించాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది’ అని చెప్పారు. హెలికాప్టర్ దుర్ఘటన నేపథ్యంలో వీవీఐపీ ప్రొటోకాల్స్‌ను పునః పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రోటోకాల్స్‌ను సమీక్షించనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే తూర్పు లద్దాఖ్‌కు అదనపు బలగాలు తూర్పు లద్దాఖ్‌లో అదనపు బలగాల అవసరమైతే తక్షణం తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని చౌదరి చెప్పారు. ‘అక్కడ కొన్ని ప్రాంతాల్లో భారత్, చైనా తమ బలగాలను వెనక్కి రప్పించాయి. కొన్ని చోట్ల ఉద్రిక్తత అలాగే ఉంది. గల్వాన్ ఘటన తర్వాత ఏప్రిల్ నుంచీ పరిస్థితిలో మార్పు లేదు’ అని అన్నారు. రాఫెల్, అపాచీ, చినూక్ మొదలైన వాటితో ఎయిర్ ఫోర్స్ అత్యంత బలమైన వైమానిక దళంగా మారబోతోందని చెప్పారు. క్యాడెట్లలో 28 మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్న 175 మంది క్యాడెట్లలో 28 మంది మహిళలున్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్యాడెట్లకు అవార్డులను చౌదరి ప్రదానం చేశారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన సీడీఎస్ రావత్, ఆయన సతీమణి, సాయుధ దళాలకు చెందిన 12 మం ది సిబ్బందికి గౌరవ సూచకంగా హవాక్, చేత క్, కిరణ్ విమాన విన్యాసాలు నిర్వహించలేదు. -
కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల ఏపీ గవర్నర్ ఆవేదన
సాక్షి, అమరావతి: భారత వాయు సేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ్ సింగ్ భరతమాత సేవలో అసువులు బాసారని, దేశ ప్రజలు వారిని ఎప్పటికీ మరువరన్నారు. వరుణ్ సేవలు చిరస్మరణీయమన్న గవర్నర్ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. డిసెంబరు 8న తమిళనాడులోని కూనూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరుణ్ సింగ్ చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా 13 మంది అమరులయ్యారు. ఈ హెలికాప్టర్లో ప్రయాణించిన వారిలో కేవలం వరుణ్ సింగ్ మాత్రమే కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడారు. ధైర్యసాహసాలతో దేశానికి సేవ చేసిన వరుణ్ సింగ్ కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో మృతి చెందటం అత్యంత బాధాకరమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చదవండి: బస్సు ప్రమాదం: సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా -
ఈ ప్రమాదాలు యక్షప్రశ్నలేనా!
భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు, వారి సిబ్బందితో సహా ప్రయాణిస్తున్న ప్రత్యేక సైనిక రవాణా రష్యన్ హెలికాప్టర్ తమిళ నాడులోని నీలగిరి కొండల్లో ఆకస్మిక ప్రమాదానికి గురై కూలిపోయింది. విమానం కెప్టెన్ మినహా అందరినీ బలిగొన్న ఆ ప్రమాదం రష్యన్ సైనిక వాహనాల వినియోగం, వాటి సాంకేతిక నాణ్యతపై పలు సందేహాలను రేకెత్తిస్తోంది. పౌరవిమానయాన దుర్ఘటనలకు, సైనిక రవాణా సంబంధిత హెలికాప్టర్ల పతనానికి కారణాలను శోధించే విచారణ సంస్థలు వెలువరించే ఏ నివేదికలూ ఒక పట్టాన వాస్తవాలను బహిర్గతం కానివ్వవు. ఆ నివేదికల్లో దాగి ఉన్న పలు వాస్తవాలను ప్రజలు ఎప్పటికి తెలుసుకోగల్గుతారన్నది మరొక యక్షప్రశ్నగానే మిగిలిపోతోంది. ఈ నెల 8వ తేదీన కూలిపోయిన ప్రత్యేక సైనిక రవాణా రష్యన్ హెలికాప్టర్ ‘ఎంఐ– 17వీ5’ తమిళనాడులోని నీలగిరి కొండల్లో అకస్మాత్తుగా అంత ర్థానమైన విషయం తెలిసిందే, ఈ దుర్ఘటనలో 13 మంది సైనిక సిబ్బందిని (భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా) దేశం కోల్పోయింది. ఈ సందర్భంగా భారత రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ప్రకటన చేశారు. ఈ ప్రమాద నేపథ్యంలో, రష్యన్ హెలికాప్టర్ల కోసం భారత ప్రభుత్వం గతంలో కుదుర్చుకున్న ఒప్పందం గురించి గానీ, వాటి సామర్థ్యం గురించి కానీ ఎవరూ ఎలాంటి ఊహాగానాలు చేయరాదని ఆయన కట్టడి చేశారు. కాని గత పదేళ్ళుగా ఈ రష్యన్ సైనిక రవాణా హెలికాప్టర్ల వల్ల సంభవించిన వరసవారీ ఘటనలు వాటి సామర్థ్యాన్ని అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తూ వస్తున్నాయి. ఈ సందర్భంగా 1966–2021 మధ్యకాలంలో రష్యాకి చెందిన పౌర, సైనిక రవాణా హెలికాప్టర్ల వల్ల ఎన్ని దుర్ఘటనలు సంభవించాయో వివరిస్తూ సుప్రసిద్ధ ఐటీ, మీడియా సంస్థలు గూగుల్, వికీపీడియాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కొన్ని సివిలియన్ హెలికాప్టర్లు, కొన్ని సైనిక రవాణా హెలి కాప్టర్ల పతనానికి సంబంధించి కొందరు రాజకీయ పాలకులు, సైనికా ధికారులు చెప్పే కథనాలు తీవ్రమైన గందరగోళం కలిగిస్తున్నాయని వైమానిక నిపుణులు పేర్కొంటున్నారు. పరస్పర విరుద్ధమైన ఈ కథనాలవల్ల ఎవరి తొందరపాటు నిర్ణయాలు ఈ దుర్ఘటనలకు కార ణమో చెప్పలేని దుస్థితిని ఎదుర్కొనవలసి వస్తుందని ప్రముఖ రిటైర్డ్ ఎయిర్‌లైన్ ఇన్స్ట్రక్టర్ పైలట్, వైమానిక భద్రతా సలహాదారు కెప్టెన్ ఎ. మోహన్ రంగనాథన్ వివరించారు. ప్రమాదాల బారిన అధునాతన హెలికాప్టర్లు ఎందుకంటే రష్యన్ ప్రత్యేక హెలికాప్టర్లు ‘మనకెంత ముద్దయినా’, గత పదేళ్ళకు పైగా ఆ ప్రత్యేక హెలికాప్టర్లు అనేక ప్రమాదాలకు కారణమయ్యాయని చెప్పక తప్పదు. రష్యాతో 2008లో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 2011లో భారత వైమానిక దళానికి ఈ ప్రత్యేక హెలికాప్టర్లను అందజేయడం మొదలైంది. 2012 నుంచి వాటి సేవల్ని మనం పొందుతున్నాం. అది మొదలు అధునాతనమైన ‘ఎంఐ–17 వి5’ రష్యన్ హెలికాప్టర్లు అనేక దుర్ఘటనలకు కారణమయ్యాయన్నది నిపుణుల అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఈ రష్యన్ సైనిక, రవాణా హెలికాప్టర్లను ఎన్నిదేశాలు వినియోగిస్తున్నాయన్నది ఇక్కడ ప్రధానం కాదు, అవి ఆయా దేశాల్లో ఎన్ని ప్రమాదాలకు కారణమయ్యాయ న్నదే ఇక్కడ కీలకం. ముఖ్యంగా కెప్టెన్ మోహన్ రంగనాథన్ అంచనా ప్రకారం, సైనిక రక్షణ హెలికాప్టర్ ప్రమాద కారణాల విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఎన్నటికీ లేదు! అలాగే అధికారంలో ఉన్న రాజకీయ పాల కులు తమ ప్రత్యేక విమాన ప్రయాణాలకు సంబంధించిన ప్రమాద కారణాలను తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఎందు కంటే తమ కార్యక్రమాల్ని ముగించుకుని రావడంలో ఎవరి తొందర వారిది! పైలట్ల మానసిక స్థితిపై తీవ్ర ఒత్తిడి తమ ప్రయాణాలు, కార్యక్రమాలపై రాజకీయ నాయకుల తొందర, దాంతో తీసుకుంటున్న ఆకస్మిక నిర్ణయాలు హెలికాప్టర్లను నడిపే పైలట్ల మానసిక స్థితిపైన తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే హెలికాప్టర్ని నడిపి తీరాల్సిందే అని ఒత్తిడి చేసే రాజకీయ పాలకుడిని ఆ సమయంలో ఏ పైలట్ కూడా శాసిం చలేడు. ఇందుకు గతంలోనూ ఎన్నో ఉదాహరణలున్నాయి. 2001లో మాజీ కేంద్ర పౌర విమానయాన మంత్రి మాధవరావు సింథియా తన అవసరం కొద్దీ కాన్పూరు వెళ్లవలసి వచ్చింది. కానీ, వాతావరణం ఏమాత్రం సహకరించని ఘడియల్లో పైలట్‌ను ఆయన బలవంతాన ఒత్తిడిచేసి బయలుదేరడంతో విమానం కూలి అందు లోని వారంతా ప్రాణాలు విడిచారు. అలాగే 2002లో లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి భారీవర్షంలో పైలట్‌ను ఒత్తిడికి గురిచేసి బయలుదేరి నప్పుడు ఆ హెలికాప్టర్ కాస్తా కుప్పకూలింది. గగనతల ప్రమాదాలకు అసలు కారణాల గురించి ఇన్ని అనుభవాలు చెప్తున్న గుణపాఠం ఏమిటో కూడా కెప్టెన్ మోహన్ రంగనాథన్ ఈ సందర్భంగా వివ రించారు. ‘పైలట్‌ను ఎన్నడూ మేం ఒత్తిడి చేయలేదు అని పాలకులు పైకి చెప్పడం అయితే చెబుతారు. కానీ విచారణ నివేదికలు మాత్రం ఆ ప్రమాద కారణాల్ని బహిరంగంగా వెల్లడించకుండా చడీ చప్పుడూ లేకుండా వాటిని తొక్కి పడతాయి’. అలాగే ఈ నెల 8వ తేదీన భారత సర్వసేనాధిపతి బిపిన్ రావత్ వినియోగించిన రష్యన్ సైనిక రవాణా వాహనం అననుకూల వాతా వరణ పరిస్థితుల్లో ప్రయాణించవలసి రావడానికి కారణం కూడా అలాంటిదే అయిఉండాలి! ఏది ఏమైనప్పటికీ, ఇటీవల తూర్పు అరు ణాచల్ప్రదేశ్లో, ఉత్తరాఖండ్‌లోని కేదారనాథ్‌లో, గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ దగ్గర్లో ఇవే రష్యన్ సైనికరవాణా హెలి కాప్టర్లు పరస్పరం ఢీకొని వైమానికదళ సభ్యులు ప్రాణాలు విడవ వలసి వచ్చింది! ఇందువల్ల రష్యన్ సైనిక రవాణా హెలికాప్టర్ల విని యోగ సాంకేతికతలోనే తీవ్రమైన లోపం ఉండి ఉండాలన్న నిపుణుల అంచనాను విశ్వసించవలసి వస్తోంది! అంతేకాదు... చివరికి పాకిస్తాన్ సైన్యం వాడుతున్న ‘మిగ్–17’ రష్యన్ సైనిక రవాణా హెలికాప్టర్ కూడా గిల్గిత్–బల్తిస్తాన్లోని ‘నల్తార్’ ప్రాంతంలో ఆకస్మికంగా కుప్పకూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నార్వే, ఫిలిప్పైన్, మలేషియన్, ఇండోనేషియా రాయ బారులు, వారి భార్యలతోపాటు, పాకిస్తాన్ సైన్యం పైలట్లు ఇద్దరు కూడా చనిపోయారు! బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన రష్యన్ ‘మిగ్– 17’ హెలికాప్టర్ కూడా ఇలాగే కూలిపోయిందని సాధికార వార్తా సంస్థలు ప్రకటించాయి. బ్లాక్‌బాక్స్ వివరాలు వెల్లడించరెందుకు? ఇలా 1955 నుంచి 2021వ సంవత్సరం దాకా ప్రపంచ దేశాలలో సైనిక వైమానిక రవాణా హెలికాప్టర్ల ద్వారా జరిగిన దుర్ఘటనలపై ప్రపంచ మీడియా వ్యవస్థలు సాధికార నివేదికలను ప్రచురించాయి! చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలు సమీపం లోని కొండల్లో వాతావరణ పరిస్థితులు వికటించిన ఫలితంగా చెట్లను ఢీకొని కూలిపోయింది. వై.ఎస్. అర్ధంతరంగా దివంగతులయ్యారు. అయితే, ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌లోని ‘బ్లాక్‌బాక్స్’లో నిక్షిప్తమై ఉన్న వివరాల్ని మాత్రం వెల్లడించకుండా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ శాఖ జాయింట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన అధికారి ‘చాలా జాగ్రత్త’ పడ్డారు! ఆమాట కొస్తే ఆ బాక్స్‌లోని వివరాల్ని ‘తూ.తూ’ మంత్రంగా తేల్చారు! అందువల్ల ఆ బ్లాక్‌బాక్స్ వివరాల్ని మభ్యపర్చడం ద్వారా ఆరోజుకీ, ఈ రోజుకీ వాస్తవాలను బయటపడనీయకుండా కనుమరుగుచేశారు. ఆ పరిస్థితుల్లో ఆ ప్రమాదానికి సంబంధించిన అనేక వాస్తవాలు కనుమరుగయ్యాయన్నది ‘బ్లాక్ బాక్స్’ వివరాల్ని తొక్కిపెట్టిన ఆఫీ సర్కి మాత్రమే తెలియాలి. అందుకే కెప్టెన్ మోహన్ రంగనాథన్ అన్నట్టు అటు పౌరవిమానయాన దుర్ఘటనలకు, సైనిక రవాణా సంబంధిత హెలికాప్టర్ల పతనానికీ కారణాలను విచారించే విచారణ సంస్థలు వెలువరించే ఏ నివేదికలు కూడా ఒకపట్టాన వాస్తవాలను బహిర్గతం కానివ్వవు. ఆ నివేదికల్లో దాగిఉన్న పలు వాస్తవాలను ప్రేక్ష కులైన ప్రజలు ఎప్పటికి తెలుసుకోగల్గుతారన్నది మరొక యక్షప్రశ్న గానే మిగిలిపోతోంది. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘మేరా ఫౌజీ అమర్ రహే’.. పెళ్లినాటి దుస్తుల్లో భర్తకు తుది వీడ్కోలు
సిమ్లా: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్లో 13 మంది వీర మరణం పొందిన విషయం తెలిసిందే. సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతోపాటు 11 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉండగా.. వీరిలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనకు బెంగళూరులోని ఆర్మీ కమాండ్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతిచెందిన లాన్స్ నాయక్ వివేక్ కుమార్ అంత్యక్రియలు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. అతని తమ్ముడు సుమిత్ కుమార్ చితికి నిప్పంటించాడు. ఈ కార్యక్రమంలో వివేక్ కుమా ర్‌భార్య ప్రియాంక పెళ్లి నాటి చీరను కట్టుకొని తన భర్తకు తుది వీడ్కోలు పలికారు. శ్మశాన వాటిక వద్ద ‘మేరా ఫౌజీ అమర్ రహే’ అంటూ మూడు సార్లు నినాదం చేసింది. అందరి ముందే కన్నీళ్లతో భర్తకు వీడ్కోలు పలకడం పలువురిని కలచివేసింది. చదవండి: ఆ కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియా.. ప్రభుత్వ ఉద్యోగం: సీఎం అనంతరం వివేక్‌కుమార్ భార్య ప్రియాంక మాట్లాడుతూ.. తన భర్తను చూసి చాలా గర్వపడుతున్నానని తెలిపింది. తమ ఆరునెలల బిడ్డ భవిష్కత్తు కోసం వివేక్ ఎన్నో కలలు కన్నాడని. ఆ కోరికలన్నీ నెరవేరుస్తాను ధీమా వ్యక్తం చేసింది. అయితే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి కల్పించాలని వివేక్ తల్లి ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇక అంతకముందు ముఖ్యమంత్రి జైరామ్ ఠాగూర్ గగ్గల్ విమానాశ్రయంలో మృతదేహానికి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు అందించినట్లు ఠాకూర్ తెలిపారు. చదవండి: విషాదం: గతంలో కోవిడ్.. తాజాగా డెంగ్యూ.. బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి -
AP: సాయంత్రం స్వగ్రామానికి సాయితేజ భౌతికకాయం
సాక్షి, చిత్తూరు: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడపల్లెకు చెందిన లాన్స్‌నాయక్ బి.సాయితేజ అంత్యక్రియలు రేపు(ఆదివారం) నిర్వస్తామని ఆయన సోదరుడు మహేశ్‌బాబు తెలిపారు. శనివారం మధ్యాహ్నం సాయతేజ భౌతికకాయం బెంగళూరుకు చేరుతుందని, అనంతరం బెంగళూరు నుంచి తమ స్వగ్రామానికి రావడానికి సాయంత్రమవుతందని పేర్కొన్నారు. దీంతో సాయితేజ అంత్యక్రియలు రేపు ఉదయం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చదవండి: Sai Teja: సాయితేజ కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం నేడు సాయి తేజ భౌతికకాయాన్ని ఆర్మీ బేస్ హాస్పిటల్లో ఉంచాలని అధికారులను కోరామని, దానికి అధికారులు అంగీకరించారని చెప్పారు. ఆదివారం ఉదయం 5 గంటలకు బయలుదేరి తమ స్వగ్రామనికి ఉదయం 10గంటల లోపు సాయ తేజ భౌతికకాయం చేరుతుందని తెలిపారు. శనివారం ఉదయం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయి తేజ భౌతికకాయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలాలకు భౌతికకాయాన్ని తరలించిన విషయం తెలిసిందే. -
శ్యామలను బిడ్డలా చూసుకుంటా!
బి.కొత్తకోట: లాన్స్‌నాయక్ బి.సాయితేజ భార్య శ్యా మలను నా బిడ్డలా చూసుకుంటానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాటిచ్చారు. కురబలకోట మండలం రేగడివారిపల్లెలో సాయితేజ కుటుంబసభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. సా యితేజ భార్య శ్యామల, తల్లి భువనేశ్వరి, తండ్రి మోహన్‌ను ఓదార్చారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా విధుల్లోనే వీరమరణం పొంది సాయి తేజ తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు. ఇంకా ఎంతోస్థాయికి ఎదగాల్సిన సాయి తేజ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం అ న్నారు. నియోజకవర్గానికి చెందిన ఇద్దరు సైనికు లను కోల్పోయామని, మనకే ఎందుకు ఇలా జరు గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గం తమ కుటుంబమని, ఎవరికీ ఏ కష్టం కలిగినా అండగా ఉంటామన్నారు. శ్యామలను ప్రభుత్వపరంగా వందశాతం ఆదుకుంటామని, వ్య క్తిగతంగా ఎవరూ ఊహించని స్థాయిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. చిన్నారుల భవిష్యత్ కోసం చర్యలు తీసుకుంటా మ ని స్పష్టం చేశారు. సాయితేజను తిరిగి తెచ్చివ్వలేమని చెప్పారు. జ్వరంతోనే పరామర్శ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి జ్వరంతో బాధపడుతున్నా, సాయితేజ మృతి విషయం తెలుసుకుని అంత్యక్రియలకు సంబంధించిన చర్యలకు అధికా రులను ఆదేశించారు. శుక్రవారం జ్వరం ఉన్నప్పటి కీ రేగడివారిపల్లెకు వచ్చి సాయితేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం
బి.కొత్తకోట/బెంగళూరు/చిత్తూరు కలెక్టరేట్: తమిళనాడులోని కూనూరు వద్ద సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్‌నాయక్ బి.సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.50 లక్షల పరిహారాన్ని చెక్కు రూపంలో శనివారం అందించారు. కలెక్టర్ హరినారాయణన్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో కలిసి చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడవారిపల్లె వచ్చారు. సాయితేజ భార్య శ్యామల, తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహనలను పరామర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. లాన్స్‌నాయక్ సాయితేజ విధి నిర్వహణలో మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. దేశానికి సాయితేజ చేసిన సేవ గొప్పదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు. శ్యామల విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున మదనపల్లెలో ఇంటిస్థలాన్ని కేటాయిస్తామన్నారు. పిల్లల చదువుకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. అనంతరం సాయితేజ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. నేడు ఎగువరేగడలో అంత్యక్రియలు కాగా, సాయితేజ భౌతికకాయం శనివారం బెంగళూరు చేరుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌కు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని తరలించగా.. అక్కడ ఆర్మీ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఉదయం వరకు సాయితేజ పార్థివదేహం బెంగళూరులోనే ఉండనుంది. అనంతరం బెంగళూరు నుంచి స్వగ్రామమైన ఎగువరేగడ గ్రామానికి పార్థివదేహాన్ని తరలిస్తారు. అక్కడ సైనిక, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. మదనపల్లె, అంగళ్లు, కంటేవారిపల్లె మీదుగా రేగడవారిపల్లెకు మృతదేహాన్ని తీసుకువచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్గం వెంబడి సాయితేజకు ఘన నివాళి అర్పించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. సరిహద్దున గల చీకలబైలు నుంచి అభిమానులు, ప్రజలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐలు సుకుమార్, రామమోహన్ పరిశీలించారు. కడవరకు దేశ సేవలోనే ఉంటా: మహేష్‌బాబు తన అన్న సాయితేజ దేశ సేవలో తుది శ్వాస విడిచినా.. తాను దేశ సేవ నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని సాయితేజ సోదరుడు బి.మహేష్‌బాబు చెప్పారు. సిక్కింలో జవానుగా విధులు నిర్వర్తిస్తున్న మహేష్‌బాబు కురబలకోట మండలం రేగడవారిపల్లెలో శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘డిసెంబర్ 8న మేం పనిచేస్తున్న రెజిమెంట్ ఏఎస్పీ క్రోర్ డే వేడుకలు జరుపుకుంటుండగా మధ్యాహ్నం సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైందనే సమాచారం వచ్చింది. ఆ వెంటనే వేడుకల్ని నిలిపివేశారు. టీవీల్లో చూస్తుండగా సాయితేజ కూడా ప్రమాదంలో మృతి చెందినట్టు వార్తల్లో వచ్చింది. సాయితేజ అంటే ఎంతోమంది ఉండవచ్చు, అన్నపేరు బి.సాయితేజ కదా అని సర్దిచెప్పుకొన్నా. తర్వాత వదిన శ్యామలకు ఫోన్‌చేసి అన్న ఎక్కడికైనా వెళ్తున్నట్టు చెప్పాడా అని అడిగితే.. లేదని సమాధానం వచ్చింది. అన్న మిత్రులైన జవాన్లకు ఫోన్‌చేస్తే సెలవుల్లో ఉన్నామన్నారు. అన్న మొబైల్ స్విచ్చాఫ్ వస్తోంది. టెన్షన్ భరించలేకపోయా. చివరికి ఏదైతే జరగకూడదనుకున్నానో అదే నిజమైంది. ప్రమాదంలో మరణించిన సాయితేజ నా సోదరుడేనని తెలిసింది. మా అన్న దేశ సేవలోనే ప్రాణాలర్పించారు. అన్న మరణం తీరని లోటే అయినా, నేను జవానుగానే కొనసాగుతాను. తల్లిదండ్రుల బాధ్యతను కూడా నెరవేరుస్తా. సాయితేజ మృతి నాకే కాదు.. ఎందరో యువకులకు తీరని లోటు’ అన్నారు. -
స్వస్థలానికి సాయితేజ భౌతికకాయం.. పచ్చబొట్టు ఆధారంగా గుర్తింపు
బి.కొత్తకోట: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడపల్లెకు చెందిన బి.సాయితేజ అమరుడై శుక్రవారానికి మూడు రోజులైంది. శనివారం ఉదయం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయి తేజ భౌతికకాయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలాలకు భౌతికకాయాన్ని తరలించారు. ఆయన మరణ వార్త తెలిసిన బుధవారం సాయంత్రం నుంచి రేగడపల్లెలో విషాదం అలుముకుంది. సాయితేజ కుటుంబాన్ని ఓదార్చేందుకు, పరామర్శించేందుకు ప్రజలు, పార్టీలకు అతీతంగా నాయకులు తరలివస్తున్నారు. కడసారి చూపు కోసం అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పరామర్శకు ఎవరు వచ్చినా ‘అయ్యా.. నా బిడ్డ ఇంకా రాలేదు’ అంటూ విలపిస్తున్న తల్లి భువనేశ్వరిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సాయితేజ మృతదేహం రాక కోసం రేగడపల్లె, కురబలకోట, బి.కొత్తకోట మండలాల్లోని పలు గ్రామాలు ఎదురు చూస్తున్నాయి. సాయితేజ గురించి తెలిసిన వాళ్లు, ముఖ్యంగా సైనిక ఎంపిక కోసం శిక్షణ పొందిన వారు విలపిస్తున్నారు. సాయితేజ ఇచ్చిన శిక్షణతో ఎంతోమంది సైనికులుగా ఎంపికయ్యారు. వారంతా అతడికి నివాళులర్పించేందుకు మృతదేహం కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో రేగడపల్లెలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది డీఎన్ఏ పరీక్షల్లో జాప్యం లాన్స్‌నాయక్ సాయితేజ భౌతికకాయాన్ని గుర్తించేందుకు గరువారం రాత్రి అతడి తల్లిదండ్రులు భువనేశ్వరి, తండ్రి మోహన్, తమ్ముడు మహేష్‌బాబు, కుమారుడు మోక్షజ్ఞల నుంచి సేకరించిన రక్త నమూనాలను ఢిల్లీ తీసుకెళ్లారు. అందరి శ్యాంపిల్స్ సేకరణ పూర్తయ్యాక జెనెటిక్ ల్యాబ్స్‌లో డీఎన్ఏ పరీక్షలు జరిపి మృతదేహాన్ని అప్పగిస్తామని అధికారులు సాయితేజ కుటుంబ సభ్యులకు తెలిపారు. శనివారం ఉదయానికి ఈ ప్రక్రియ పూర్తి అయింది. సాయితేజ శరీరంపై ఉన్న పచ్చబొట్టు గుర్తుల ఆధారంగా అతడి భౌతిక కాయాన్ని గుర్తించారు. పచ్చబొట్ల వివరాలను, ఫొటోలను ఢిల్లీ సైనిక అధికారులకు వివరాలను సాయితేజ తండ్రి మోహన్ తెలిపారు. సాయితేజ ఎడమ వైపు గుండె భాగంపై భార్య పేరు ఆంగ్లంలో శ్యామ అని, కుడిచేతి మీద త్రిశూలం ఆకారంలో శివుడిబొమ్మతో కూడిన పచ్చబొట్లు ఉన్నాయి. సాయితేజ ఇంట్లో విషణ్ణవదనాలతో కుటుంబసభ్యులు, బంధువులు -
వీరుడికి వీడ్కోలు....
-
కన్నీరు పెట్టిస్తోన్న సైనిక వీరుడి వీడ్కోలు దృశ్యాలు..
-
బిపిన్ రావత్ అంత్యక్రియలు: 17 తుపాకీ వందనాలే ఎందుకు..
సాక్షి, వెబ్‌డెస్క్: తమిళనాడు కూనూర్ సమీపంలో డిసెంబర్ 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో రావత్‌తో పాటు ఆయన భార్య కూడా మరణించారు. రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నారు. ప్రోటోకాల్ ప్రకారం వారికి తుపాకీ వందనం (గన్ సెల్యూట్) సమర్పిస్తారు. అంత్యక్రియల సందర్భంగా బిపిన్ రావత్‌కు 17 గన్ సెల్యూట్ సమర్పిస్తారు. ఈ క్రమంలో మన మదిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు ఈ గన్ సెల్యూట్ ఎందుకు, ఎవరికి సమర్పిస్తారు. వేర్వేరు సందర్భాలలో ఈ తుపాకీ గౌరవ వందనం వేర్వేరుగా ఉండటానికి కారణం ఏంటి అనే ప్రశ్నలు మనలో చాలా మందికి వస్తాయి. వాటన్నింటికి సమాధానాలు.. ఇక్కడ లభిస్తాయి. అంత్యక్రియలో సమయంలో తుపాకీ వందనం సమర్పించడం అంటే.. ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అర్థం. అయితే ఎవరికి ఈ గౌరవం లభిస్తుంది అంటే.. రాజకీయం, సాహిత్యం, న్యాయ, విజ్ఞాన, కళా రంగాల్లో విశిష్ట సేవ చేసిన వారికి తుపాకీ వందనం సమర్పిస్తారు. అలానే స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున కూడా గన్ సెల్యూట్ ఉంటుంది. దీంతో పాటు భారత సైన్యం.. యుద్ధ, శాంతి సమయాల్లో విశేష కృషి చేసిన వారికి సైనిక వందనం సమర్పిస్తోంది. ఫిరంగి వందనం కూడా సమర్పిస్తారు. ఎవరికి, ఎన్ని తుపాకీ వందనాలు సమర్పిస్తారంటే.. భారత రాష్ట్రపతి, మిలిటరీ, సీనియర్ అధికారులు చనిపోయినప్పుడు.. 21 తుపాకీ వందనాలు (గాల్లోకి 21 సార్లు కాల్పులు జరుపుతారు) సమర్పిస్తారు. త్రివిధ దళాలలో పని చేసిన ఉన్నతాధికారులు మరణిస్తే.. 17 తుపాకీ వందనాలు సమర్పిస్తారు. గతంలో మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు.. ఆయన గౌరవార్ధం.. ఢాకాలో 19 తుపాకీ వందనాలు సమర్పించారు. మాజీ రాష్ట్రపతులు, ప్రధాని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎంలు మరణించినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి.. తుపాకీ వందనం సమర్పిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తే.. దేశవ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించడం, జాతీయ జెండాను అవనతం చేయడం, దేశం అంతటా సెలవు ప్రకటించడం వంటివి చేస్తారు. తొలిసారి మహత్మ గాంధీకి ఇటీవలి కాలంలో మరణించిన వ్యక్తికి సమాజంలో ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలో.. లేదో నిర్ణయించే విధంగా నిబంధనలు మార్చబడ్డాయి. భారతదేశంలో తొలిసారిగా మహాత్మా గాంధీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకు దీనికి సంబందించి ఎలాంటి నియమ నింబధనలు రూపొందించలేదు. తుపాకీ వందనం వెనక ఉన్న చరిత్ర... బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి భారతదేశం 21 తుపాకీ వందన సంప్రదాయాన్ని వారసత్వంగా పొందింది. స్వాతంత్య్రానికి ముందు అత్యధికంగా 101 తుపాకీ వందనం ఉండేది. దీనిని రాయల్ సెల్యూట్ అని పిలుస్తారు. దీనిని భారత చక్రవర్తికి (బ్రిటీష్ క్రౌన్) మాత్రమే అందించారు. దీని తర్వాత 31-గన్ సెల్యూట్, రాయల్ సెల్యూట్ ఉంటుంది. ఇది రాణి, రాజ కుటుంబ సభ్యులకు సమర్పిస్తారు. ఇదే పద్దతిని వైస్రాయ్, భారత గవర్నర్ జనరల్‌కు కూడా పాటిస్తారు. దేశాధినేత, విదేశీ సార్వభౌమాధికారులు, వారి కుటుంబ సభ్యులకు 21 గన్ సెల్యూట్ సమర్పించారు. ఇక భారత రాష్ట్రపతికి పలు సందర్భాల్లో.. 21 తుపాకీ వందనం సమర్పిస్తారు. నూతనంగా ఎన్నుకోబడిన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రోజున తుపాకీ వందనం స్వీకరిస్తారు. ఇక స్వాంతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు.. 21 తుపాకీ వందనం స్వీకరిస్తారు. చదవండి: మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. వైరలవుతోన్న లేఖ సాయితేజ మృతి: కన్నీటి సుడులు.. సంద్రమైన ఓదార్పులు -
పప్పా నా హీరో, బిగ్గెస్ట్ మోటివేటర్: బ్రిగేడియర్ లిడ్డర్ కుమార్తె కన్నీరు
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడులోని ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బాసిన బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ క్రిమటోరియంలో శనివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా లిడ్డర్ సతీమణి గీతిక, కుమార్తె అస్నా భావోద్వేగానికి లోనుకావడం అక్కడున్న వాందరి కళ్ళల్లో కన్నీరు నింపింది. (రావత్ మంచి నీళ్లు అడిగారు.. కాపాడుకోలేకపోయా: ప్రత్యక్ష సాక్షి కంటతడి) ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి అమరుడయ్యారన్న దుఃఖాన్ని గుండెల్లో దాచుకుంటూ కుమార్తె అస్నా తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తండ్రి పార్థివ దేహాన్ని ముద్దు పెట్టుకుని కడసారి వీడ్కోలు పలికిన ఘటన ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. ఈ సందర్భంగా ఆస్రా మాట్లాడుతూ ఆయన అకాల మరణం జాతికి తీరని నష్టం. నన్ను చాలా గారాబం చేసేవారు.. ఇపుడు భయంగా ఉంది. నాకిపుడు 17 ఏళ్లు. ఈ 17 ఏళ్లు నాన్న నాతో ఉన్నారు. ఆ సంతోషకరమైన జ్ఞాపకాలతో ముందుకు వెళ్తా. మా పప్పా నా హీరో, నా బెస్ట్ ఫ్రెండ్. ఆయనే నా బిగ్గెస్ట్ మోటివేటర్ అంటూ కంటతడి పెట్టారు. #WATCH | Daughter of Brig LS Lidder, Aashna Lidder speaks on her father's demise. She says, "...My father was a hero, my best friend. Maybe it was destined & better things will come our way. He was my biggest motivator..." He lost his life in #TamilNaduChopperCrash on Dec 8th. pic.twitter.com/j2auYohtmU — ANI (@ANI) December 10, 2021 బ్రిగేడియర్ లిడ్డర్ పార్థివదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అప్పగించారు ఆర్మీ అధికారులు. ఆ పతాకాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు గీతిక. అనంతరం సతీమణి గీతిక మాట్లాడుతూ ‘‘ఆయన చాలా మంచి మనిషి, స్నేహ శీలి..అందుకే నవ్వుతూ సాగనంపుతామని వచ్చా ఆయన మంచి తండ్రి. నా బిడ్డ ఆయనను చాలా మిస్ అవుతుంది. ఆయన లేకుండా జీవించాల్సిన జీవితం ఇంకా చాలా ఉంది. చాలా నష్టం. కానీ విధి అలా ఉంది..గర్వంగా కంటే చాలా బాధగా ఉంది’’ అని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో లిడ్డర్తోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, మరో 11మంది అసువులు బాసిన సంగతి తెలిసిందే. లిడ్డర్ జనరల్ రావత్‌కు రక్షణ సలహాదారుగా ఉన్నారు. లిడ్డర్ మేజర్ జనరల్ ర్యాంక్‌కి పదోన్నతి పొందాల్సి ఉంది. లిడ్డర్‌కు 2020లో సేన మెడల్, విశిష్ట సేన పతకం లభించింది. గతంలో కశ్మీర్లో ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్స్‌కు నేతృత్వం వహించారు. #WATCH | "...We must give him a good farewell, a smiling send-off, I am a soldier's wife. It's a big loss...," says wife of Brig LS Lidder, Geetika pic.twitter.com/unLv6sA7e7 — ANI (@ANI) December 10, 2021 -
మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. వైరలవుతోన్న లేఖ
న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ వద్ద డిసెంబర్ 8న చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో సహా 13 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉండగా.. వీరిలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వరుణ్ సింగ్ ప్రస్తుతం బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వరుణ్ సింగ్ రెండు నెలల క్రితం అనగా సెప్టెంబర్ 21, 2021న తాను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపల్‌కు రాసిన ఓ లేఖ తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. చండి టెంపుల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్లో వరుణ్ సింగ్ చదువుకున్నారు. చదవులో సామాన్య ప్రతిభ కనబరిచే విద్యార్థులనుద్దేశించి ఈ లేఖ రాశారు వరుణ్ సింగ్. (చదవండి: బెంగళూరు ఆస్పత్రికి వరుణ్ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం) ‘‘మీరు చదువులో యావరేజ్ స్టూడెంట్స్ అని ఎప్పుడు బాధపడకండి. చదువులో సామాన్యమైన విద్యార్థిగా ఉండటం తప్పేం కాదు. ప్రతి ఒక్కరు 90 శాతం మార్కులు తెచ్చుకోలేరు. ఒకవేళ మీరు మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులు అయితే మీకు నా అభినందనలు. ఒకవేళ మీరు ర్యాంకర్ కాకపోయినా బాధపడకండి. చదువులో సామాన్య విద్యార్థి అయినందున మీ జీవితం కూడా అలానే ఉంటుంది అని భావించకండి’’ అని వరుణ్ సింగ్ సూచించారు. ‘‘మీకు దేని మీద ఆసక్తో దాన్ని గుర్తించండి. సంగీతం, నటన, రచన ఏది అయినా కావచ్చు. దానిలో రాణించేందుకు శ్రమించండి. చదువులో నేనూ యావరేజ్ స్టూడెంట్‌నే. ఎప్పుడు టాప్ మార్కులు రాలేదు. ఇక తొలిసారి నన్ను స్క్వాడ్రన్‌లో యువ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా నియమించిన్పుడు చాలా కంగారు పడ్డాను. ఆ తర్వాత నాకు ఓ విషయం అర్థం అయ్యింది. నేను కనుక నా మనసు, బుద్ధిని దీని మీదే కేంద్రీకరిస్తే.. చాలా అద్భుతంగా పని చేయగలనని తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి నేను అత్యుత్తమంగా పని చేయడం ప్రారంభించాను’’ అని వరుణ్ సింగ్ రాసుకొచ్చారు. (చదవండి: ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు) ‘‘నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నప్పుడు నేను చదువలో, క్రీడల్లో రాణించలేదు. కానీ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా నియమించినప్పుడు నేను దాని మీద మనసు పెట్టాను. ఆ తర్వాత నాకు విమానాల పట్ల మక్కువ పెరిగింది. అలా నేను మెరుగ్గా పని చేస్తూ.. జీవితంలో ఎదిగాను. తొలుత నేను నా వాస్తవ సామర్థ్యాలను విశ్వసించలేదు. ఈ విషయం నాకు అర్థం అయిన తర్వాత నేను వెనుతిరిగి చూడలేదు. మీరు కూడా మీ మీద నమ్మకం పెట్టుకొండి. మీకు నచ్చిన రంగంలో రాణించేందుకు కృషి చేయండి. మార్కులు మన జీవితానికి కొలమానం కాదు’’ అన్నారు వరుణ్ సింగ్. అంతేకాక తాను శౌర్య చక్ర అవార్డు అందుకోవడానికి ఆర్మీ స్కూలే కారణమని వరుణ్ సింగ్ తన లేఖలో తెలిపారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా ఉన్న ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 'It's ok to be mediocre' Inspiring letter of Group Captain Varun Singh, lone survivor in helicopter crash, to principal of his school with request to share it with teenaged students to motivate them. Sharing the wonderful journey & beautiful thoughts of the braveheart with u. pic.twitter.com/vSpymhMg0p — Arun Bothra 🇮🇳 (@arunbothra) December 9, 2021 చదవండి: ఊరే అతడింటికి కదిలొచ్చింది -
పూర్తయిన బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు
05:18PM బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంతిమ సంస్కారాలు సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. సీడీఎస్ రావత్‌కు 17 గన్ సెల్యూట్‌తో ఘనంగా నివాళులు అర్పించింది భారత సైన్యం. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99మంది సైనికాధికారులు.. 33 మందితో కూడిన ట్రై సర్వీస్ బ్యాండ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. త్రివిధ దళాలకు చెందిన మొత్తం 800మంది సేవా సిబ్బంది అంత్యక్రియాల్లో పాలుపంచుకున్నారు. శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన సీనియర్ మిలటరీ కమాండర్లు జనరల్ రావత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. 03:30PM ►దారిపొడవునా జనరల్ రావత్‌కు జననీరాజనం 03:15PM కన్నీటి వీడ్కోలు ►సైనిక వీరుడికి తుది వీడ్కోలు పలుకుతున్న ఢిల్లీ ప్రజలు ►కొనసాగుతున్న జనరల్ బిపిన్ రావత్ అంతిమయాత్ర ►భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తుతున్న ఢిల్లీ 02:10PM ►మధ్యాహ్నం 2 గంటలకు రావత్ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో రావత్ దంపతులు అంత్యక్రియలు జరుగుతాయి. సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల మృత దేహాలను శుక్రవారం ఢిల్లీలోని వారి నివాసానికి తరలించారు. ప్రజల సందర్శన కోసం రావత్ దంపతుల పార్థివదేహాలను ఢిల్లీలోని కామరాజ్ మార్గ్ నివాసంలో ఉంచారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బజాల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తదితరలు శుక్రవారం రావత్ ఇంటికి చేరుకుని.. దంపతులకు నివాళులర్పించారు. (చదవండి: హెలికాప్టర్ ప్రమాదం: ఢిల్లీకి పార్థివ దేహాలు) చదవండి: ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు -
సాయితేజ మృతి: కన్నీటి సుడులు.. సంద్రమైన ఓదార్పులు
నీరాక కోసం పురిటిగడ్డ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. భరత మాత ఒడిలో ఒదిగిపోయిన తన బిడ్డను చూడాలని ఆ తల్లి కళ్లల్లో ఒత్తులేసుకుని నిరీక్షిస్తోంది. నేనున్నా నాన్నా.. అంటూ ధైర్యం చెప్పిన కుమారుడి రాకకోసం ఆ తండ్రి కంటి రెప్పవాల్చకపోవడం అందరి హృదయాలను బరువెక్కిస్తోంది. తన పెనిమిటిని చూడాలని వీరనారి కన్నీటిపర్యంతమవుతున్న తీరుకు ఊరంతా శోకసంద్రమవుతోంది. అందరితో కలివిడిగా ఉంటూ.. దేశసేవకు ప్రాణాలర్పించిన వీరజవాన్ ఎక్కడొస్తున్నాడోనని ఆ ఊరి జనం పరితపిస్తున్న తీరు చలింపజేస్తోంది. ఇప్పుడు కురబలకోట మండలం, ఎగువరేగడవారిపల్లెలో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరినోట విన్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. వీధులన్నీ వీరజవాన్‌ను తలుచుకుని కన్నీళ్లు పెడుతున్నాయి. దేశసేవకు అంకితమైన ఆ యువ ‘తేజ’ం ధైర్యసాహసాలకు ఉప్పొంగిపోతున్నాయి. జైజవాన్.. అమర్ రహే అంటూ కీర్తిస్తున్నాయి. సాక్షి, చిత్తూరు: కురబలకోట మండలం, ఎగువరేగడవారిపల్లెలో ఎవరిని కదిలించినా కన్నీళ్లే సమాధానం అవుతున్నాయి. తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో సీఎస్డీ బిపిన్‌రావత్‌తో పాటు మరణించిన లాన్స్‌నాయక్ సాయి తేజ మృతదేహం కోసం జనం ఎదురు చూస్తున్నారు. భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు గురువారం ఎగువరేగడవారిపల్లెకు చేరుకున్నారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఇన్చార్జ్ తహసీల్దార్ సయ్యద్ అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. (చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’) అనంతపురం–కృష్ణగిరి జాతీయరహదారి నుంచి ఎగువరేగడకు వెళ్లే దారిని వాహనాల రాకపోకలకు వీలుగా జేసీబీతో జంగిల్‌క్లియరెన్స్ చేయించారు. లాన్స్‌నాయక్ సాయితేజకు సైనికలాంఛనాలతో అంత్యక్రియలు జరపాల్సి ఉన్నందున అందుకు తగ్గట్టుగా అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసి కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేశారు. సాయితేజ పార్థివదేహాన్ని తల్లిదండ్రులు ఇంటికి సమీపంలోని వ్యవసాయ పొలంలో ఖననం చేస్తామని చెప్పడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. (చదవండి: సాయితేజ బిడ్డల చదువు బాధ్యత తీసుకుంటా: మంచు విష్ణు) అందరికీ ఆదర్శప్రాయుడు సాయితేజ 8వ తరగతిలోనే సైన్యం చేరాలని నిర్ణయించుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. గొర్రెల పెంపకం జీవనవృత్తి కలిగిన తమ కుటుంబాల్లో చదువు ప్రాముఖ్యతను వివరించేవాడని గుర్తుచేసుకున్నారు. ఆర్మీలో చేరితే దేశ సేవ చేయవచ్చంటూ గ్రామస్తులను ప్రోత్సహించేవాడని చెబుతున్నారు. అతని తమ్ముడు సైన్యంలో చేరేందుకు ప్రేరణగా నిలిచాడని, మరెందరో సైన్యంలో చేరడానికి కారకుడయ్యాడని కీర్తించారు. ఎప్పుడు ఇంటికి వచ్చినా తమతోపాటుగా పొలంలో వ్యవసాయ పనులు చేస్తూ సరదాగా గడిపేవారన్నారు. ఆర్మీలో చేరి దేశసేవ చేస్తే ఆ తృప్తే వేరంటూ చెప్పేవాడని స్నేహితులు తెలిపారు. చదవండి: ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు -
ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు
న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్‌కు సహాయక సిబ్బందిగా ఏడాదికాలంగా విధుల్లో ఉన్న సెకండ్ జనరేషన్ ఆర్మీ అధికారి, బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ పదోన్నతి అర్ధంతరంగా ఆగింది. బుధవారం హెలికాప్టర్లో రావత్‌తో పాటు ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిలో లఖ్వీందర్ ఉన్నారు. హరియాణాలోని పంచకులకు చెందిన లఖ్వీందర్ గతంలో కశ్మీర్లో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలో, చైనాతో సరిహద్దు వెంట ఆర్మీ బ్రిగేడ్‌కు నేతృత్వం వహించారు. కజక్‌స్తాన్‌లో భారత సైనిక బృందంలో పనిచేశారు. సేనా మెడల్, విశిష్ట్ సేవా మెడల్ ఆయనను వరించాయి. త్రివిధ దళాల విధుల్లో విశేష అనుభవముంది. దాంతో రావత్‌కు సహాయక సిబ్బందిలో డిఫెన్స్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. సెకండ్ జనరేషన్ ఆర్మీ ఆఫీసర్‌గా ఉన్న ఆయనకు త్వరలోనే మేజర్ జనరల్ పదవిని కట్టబెట్టనున్నారు. ప్రమోషన్ జాబితాలో ఉన్న ఆయన ఆ పదోన్నతి పొందకుండానే వీరమరణం పొందారు. లఖ్వీందర్‌కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. (చదవండి: బెంగళూరు ఆస్పత్రికి వరుణ్ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం) విహార యాత్రకు తీసుకెళ్తామన్నారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన హవాల్దార్ సత్పాల్ రాయ్ సొంతూరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా తక్దాలో విషాదం అలుముకుంది. రాయ్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సైన్యంలో పనిచేస్తున్నారు. ‘చివరిసారిగా దీపావళికి వచ్చారు. ఏప్రిల్‌లో వస్తానని మాట ఇచ్చారు. అందర్నీ విహారయాత్రకు తీసుకెళ్తానన్నారు. ఇంతలో ఘోరం జరిగింది’ అని రాయ్ భార్య కన్నీటిపర్యంతమయ్యారు. మరోవైపు, ప్రమాదంలో మరణించిన కో–పైలట్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్ అంత్యక్రియల ఏర్పాట్లు రాజస్తాన్‌లోని సొంతూరు ఘర్దానా ఖుర్ద్‌లో మొదలయ్యాయి. కాగా, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనున్నాయి. (చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’) 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టారు ఒక సోదరి ముంబైలో ఉండటంతో ఇన్నాళ్లూ కుదరక, ఎట్టకేలకు ముగ్గురు అక్కలతో కలసి 31 ఏళ్ల తర్వాత ఇటీవల రాఖీ పండుగ జరుపుకున్న తన కుమారుడు ఇప్పుడు లేడని, హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్ తండ్రి వాపోయారు. ఐదుగురు సంతానంలో ఇతనే చిన్నవాడని పృథ్వీ జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పృథ్వీ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. పృథ్వీ 2000లో హైదరాబాద్‌లో భారత వాయుసేనలో చేరారు. -
బెంగళూరు ఆస్పత్రికి వరుణ్ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం
కోయంబత్తూర్: హెలికాప్టర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్‌ను మరింత మెరుగైన చికిత్స కోసం గురువారం బెంగళూరుకు తరలించారు. ఊటీ వెల్లింగ్టన్ మిలిటరీ ఆస్పత్రి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా సాయంత్రం బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కమాండ్ ఆస్పత్రికి తరలించారు. కాగా, వరుణ్ ఆరోగ్య పరిస్థితిపై కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్, సీఎం బసవరాజ్ బొమ్మైలు వివరాలు అడిగి తెల్సుకున్నారు. అంతకుముందు వరుణ్ తండ్రి రిటైర్డ్ కల్నల్ కేపీ సింగ్ మాట్లాడారు. తానిప్పుడే వెల్లింగ్టన్కు వచ్చానని చెప్పారు. వరుణ్‌ను బెంగళూరుకు తీసుకువెళ్తున్నారని ధృవీకరించారు. వరుణ్ పరిస్థితిపై ఇప్పుడేమీ చెప్పలేనన్నారు. వరుణ్ ప్రమాద వార్త తెలిసినప్పుడు ఆయన తల్లిదండ్రులు ముంబైలోని తమ చిన్న కుమారుడు లెఫ్టినెంట్ కమాండర్ తనూజ్ వద్ద ఉన్నారు. గతంలో వరుణ్ తృటిలో మృత్యువాత నుంచి బయటపడిన సంగతిని గుర్తు చేసుకున్నారు. ఎలా ఉన్నారు? వరుణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వెల్లింగ్టన్లో ఆయనకు వైద్యం చేస్తున్న వైద్యుల బృందం తెలిపింది. కొందరు అధికారులు ఆయనకు 45 శాతం కాలిన గాయాలయ్యాయని చెబుతుండగా, తమిళనాడు ప్రభుత్వ అధికారి ఒకరు మాత్రం ఆయనకు 80–85 శాతం కాలిన గాయాలు అయ్యాయని చెప్పారు. ఆయన పరిస్థితి ఇప్పటికీ సీరియస్‌గానే ఉందన్నది నిర్విదాంశం. ఆయన్ను లైఫ్ సపోర్టు వ్యవస్థపై ఉంచి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు తెలిసింది. మరోవైపు వరుణ్ కోలుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రార్ధించారు. చదవండి: చివరి కోరిక తీరకుండానే మృతి చెందిన బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్ -
ఎంఐ–17వీ5 ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు
న్యూఢిల్లీ: ఎంఐ–17వీ5 హెలికాప్టర్ ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు ప్రారంభమైనట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు సాగుతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడి, సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లైఫ్ సపోర్టు సిస్టమ్‌పై ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రాజ్‌నాథ్ గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడారు. హెలికాప్టర్ దుర్ఘటన గురించి తెలియజేశారు. ఐఏఎఫ్ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందం బుధవారమే తమిళనాడులోని వెల్లింగ్టన్కు చేరుకుందని, వెంటనే రంగంలోకి దిగి, దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తోపాటు ఇతర సైనికుల అంత్యక్రియలను పూర్తి సైనిక లాంఛనాలతో నిర్వహిస్తామన్నారు. ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి ‘జనరల్ రావత్ షెడ్యూల్ ప్రకారం వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో విద్యార్థులు, అధికారులతో భేటీ కావాల్సి ఉంది. ఇందుకోసం సూలూరు ఎయిర్‌బేస్ నుంచి బుధవారం ఉదయం 11.48 గంటలకు వాయుసేనకు చెందిన ఎంఐ–17వీ5 హెలికాప్టర్లో బయలుదేరారు. 12.15 గంటలకు వెల్లింగ్టన్లో దిగాల్సి ఉండగా, సూలూరులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో హెలికాప్టర్‌కు మధ్యాహ్నం 12.08 గంటలకు సంబంధాలు తెగిపోయాయి. కూనూరు వద్ద అడవిలో మంటలు చెలరేగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న హెలికాప్టర్ శిథిలాలు వారికి కనిపించాయి. స్థానిక అధికారులు, సహాయక సిబ్బంది చేరుకున్నారు. క్షతగాత్రులను బయటకు తీసి, వెల్లింగ్టన్లోని మిలిటరీ హాస్పిటల్‌కు తరలించారు. మాకు అందిన సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్లో మొత్తం 14 మంది ఉన్నారు. వీరిలో 13 మంది మరణించారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరిని సంఘటనా స్థలానికి పంపించాం’’ అని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఉభయ సభల్లో నివాళులు తమిళనాడు నీలగిరి కొండల్లో చోటుచేసుకున్న దుర్ఘటనలో మరణించిన వారికి లోక్‌సభ, రాజ్యసభలో ఎంపీలు నివాళులర్పించారు. మృతుల ఆత్మశాంతి కోసం కొద్దిసేపు మౌనం పాటించారు. జనరల్ బిపిన్ రావత్ మృతిపట్ల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సంతాపం తెలిపారు. దేశం ఒక గొప్ప యోధుడు, వ్యూహకర్త, అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిపిన్ రావత్ అసాధారణమైన, ఎనలేని పేరు ప్రఖ్యాతలు కలిగిన సైనికాధిపతి అని రాజ్యసభలో డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ కొనియాడారు. రావత్ సంతాప సందేశాన్ని సభలో చదివి వినిపించారు. ఆయన అందించిన సేవలను దేశ ప్రజలు, సైనికులు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతిచెందడం బాధాకరం, దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజ్యసభలో ఎంపీలు మౌనం పాటించారు. బ్లాక్ బాక్స్ లభ్యం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్ దంపతులతోపాటు మరో 11 మందిని బలిగొన్న ఎంఐ–17వీ5 హెలికాప్టర్ ప్రమాదంపై ఆర్మీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కీలకమైన ఫ్లైట్ డేటా రికార్డర్(బ్లాక్ బాక్స్)ను గురువారం వెలికితీశారు. ఘటనా స్థలంలో గాలింపు చేపడుతుండగా 300 మీటర్ల దూరంలో ఇది లభ్యమైందని చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్‌లోని సమాచారం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ బాక్స్‌ను ఢిల్లీ లేదా బెంగళూరుకు తరలించి, సమాచారాన్ని విశ్లేషించాలని యోచిస్తున్నారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధినేత ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి గురువారం ఘటనా స్థలాన్ని సందర్శించారు. సీనియర్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. హెలికాప్టర్ ప్రమాదంపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో హెలికాప్టర్ వీడియో తమిళనాడులోని నీలగిరి కొండల్లో నేలకూలిన ఎంఐ–17వీ5 హెలికాప్టర్ పేరిట ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీన్ని నెటిజన్లు విస్తృతంగా షేర్ చేశారు. కొండపై దట్టమైన పొగమంచులో వెళ్తున్న హెలికాప్టర్ కొన్ని క్షణాల తర్వాత అదృశ్యమైనట్లు ఈ వీడియోలో రికార్డరయ్యింది. ఈ దృశ్యాన్ని ఓ పర్యాటకుడు చిత్రీకరించినట్లు చెబుతున్నారు. అయితే, ఈ వీడియోపై వైమానిక దళం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. -
ఊరే అతడింటికి కదిలొచ్చింది
మదనపల్లె: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారిగా పని చేస్తూ.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన లాన్స్‌నాయక్ బి.సాయితేజ మృతదేహం కోసం అతని కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు ఆ గ్రామమంతా కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తోంది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువ రేగడవారిపల్లెకు చెందిన సాయితేజ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడని తెలియగానే ఊరికి ఊరే అతడి ఇంటి వద్దకు చేరింది. అప్పటికే విషయం తెలిసి కుప్పకూలిన లాన్స్‌నాయక్ తల్లిదండ్రులు మోహన్, భువనేశ్వరిని ఆ ఊరంతా ఓదారుస్తోంది. తమ ఊరి ముద్దుబిడ్డ ఇక లేడంటే ఇప్పటికీ గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు. ఎప్పుడూ లేనిది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు.. తల్లి శ్యామల, తాత మోహన్, నాయనమ్మ భువనేశ్వరి గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు. ఏం జరిగిందో తెలియని చిన్నారులు మోక్షజ్ఞ, దర్శిని వారందరి ముఖాల్లోకి దీనంగా చూస్తుండటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో.. సాయితేజ మృతదేహాన్ని గుర్తించేందుకు వీలుగా ఆర్మీ ప్రత్యేక బృందం అతడి తల్లిదండ్రుల నుంచి రక్త నమూనాలు సేకరించి తీసుకెళ్లింది. వీరి డీఎన్ఏల ఆధారంగా లాన్స్ నాయక్ మృతదేహాన్ని గుర్తించి.. శుక్రవారం సాయంత్రానికి స్వగ్రామానికి తరలించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు సాయితేజ మరణవార్త అధికారికంగా ధ్రువీకరించాక ఆయన భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు మదనపల్లె నుంచి ఎగువరేగడ వారిపల్లె గ్రామానికి చేరుకున్నారు. డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఇన్చార్జ్ తహసీల్దార్ సయ్యద్ ఎగువరేగడకు వెళ్లి అంతిమ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సాయితేజ పార్థివదేహాన్ని ఇంటికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. వీరజవాన్ అంత్యక్రియలకు పెద్దసంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సైనికాధికారులు, ప్రజలు హాజరవుతారన్న సమాచారంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న మరణవార్త తెలిసిన వెంటనే సాయితేజ సోదరుడు మహేష్ (బీఎస్ఎఫ్ జవాన్) సిక్కిం నుంచి గురువారం సాయంత్రం స్వగ్రామం చేరుకున్నాడు. తల్లి, తండ్రి, వదినను ఎలా ఓదార్చాలో తెలియక దుఃఖాన్ని దిగమింగుకుంటూ అందరిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. తన సోదరుడి స్ఫూర్తితోనే దేశ సేవలో చేరానన్నాడు. ‘నన్ను రమ్మని చెప్పి నువ్వెళ్లిపోయావా’ తన బిడ్డ సాయితేజకు ఎప్పుడు ఫోన్ చేసినా ‘మదనపల్లెకు వచ్చేయమ్మా. నా భార్యాబిడ్డలకు తోడుగా ఉండు. నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా’ అనే వాడని తల్లి భువనేశ్వరి వాపోయింది. ‘వ్యవసాయ పనులు పూర్తయ్యాక వస్తాలే బిడ్డా్డ అంటే.. కూలీలు చూసుకుంటార్లేమ్మా. నీవు వచ్చేయని ప్రాధేయపడేవాడు. ఇప్పుడు నా బిడ్డ లేడు. నన్నెవరు చూసుకుంటారు తండ్రీ’ అని రోదిస్తోంది. ‘అందరూ వద్దంటే నేనే పంపిస్తిని’ ‘ఆర్మీలోకి పంపొద్దని ఊళ్లో అందరూ చెబుతున్నా నేనే పంపిస్తినే. ఆడు వెళతానని పట్టుపడితే బిడ్డ కోరిక కాదనక పోతినే. ఇప్పుడు ఇట్టా జరిగితే నాకు దిక్కెవరు రామా. నీకు నేనున్నా నాన్నా అనే వాడివే బిడ్డా. మోసం చేసి వెళ్లిపోతివే సామీ. నాకు దిక్కెవరు రామా..’ అంటూ తండ్రి మోహన్ రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. -
హెలికాప్టర్ సడన్‌గా పడిపోయి ఉండొచ్చు..బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై
సాక్షి, హైదరాబాద్/కంటోన్మెంట్: ప్రతికూల వాతావరణానికి సాంకేతికలోపం తోడై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణించిన ఎంఐ–17 హెలికాఫ్టర్ సడన్‌గా డ్రాప్ అయి కిందికి వచ్చి ఉంటుందని, దీని వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని రిటైర్డ్ వింగ్ కమాండర్ టీజే రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ కమోడోర్ ఎన్ఎన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎంఐ–17 హెలికాప్టర్ గంట ప్రయాణానికి 800 లీటర్ల ఇంధనం అవసరం అవుతుందని, ప్రమాద సమయంలో హెలికాప్టర్లో కనీసం 1,200 లీటర్ల ఇంధనం ఉండే అవకాశముందని, ఎత్తు నుంచి కిందకు పడిపోయిన వెంటనే ఇంధనం వల్ల మంటలు చెలరేగి ఉంటాయన్నారు. హెలికాప్టర్‌లోని ఫ్లైట్ డేటా రికార్డర్ (బ్లాక్ బాక్స్), కాక్ పిట్ వాయిస్ రికార్డర్ విశ్లేషణ తర్వతే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. ఈ విశ్లేషణకు 10 నుంచి 15 రోజుల సమయం పట్టొచ్చన్నారు. టీజే రెడ్డి, ఎన్ఎన్ రెడ్డి గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలపై వీరేమన్నారంటే.. చలికాలం.. పొగ మంచు.. వీఐపీలు ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లను అత్యంత అనువభమున్న పైలెట్లే నడుపుతారు. టేకాఫ్ అవడానికి ముందే వాటిని అనేక రకాలుగా పరీక్షిస్తారు. సీడీఎస్ రావత్ ప్రయాణించిన ఎంఐ–17 హెలికాఫ్టర్లోని వెదర్ రాడార్‌లో ప్రయాణ మార్గంలో వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. అయితే మేఘాలు స్పష్టంగా కనిపించినా పొగమంచు ఆ స్థాయిలో కనిపించదు. రావత్ ప్రయాణించిన మార్గంలో కొండలు, అడవులు ఉన్నాయి. చలికాలంలో కొండలపై భాగంలో పొగమంచు ఎక్కువుంటుంది. ఒక్కోసారి ఊహించిన దానికంటే ఎక్కువగానూ ఉండొచ్చు. అనుకోకుండా పెరిగిపోవచ్చు. గమ్యానికి మరో 10–15 కి.మీ. దూరంలోనే ఉండటంతో పైలెట్ హెలికాఫ్టర్‌ను కిందికి తీసుకువచ్చి ఉంటాడు. ఆ సమయంలో మంచు వల్ల కింద ఏముందో కనిపించకపోవచ్చు. అయినా అనుభవజ్ఞుడైన పైలెట్ కావడంతో ధైర్యంగా కిందికి వచ్చి ఉంటాడు. ఆ సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చి హెలికాప్టర్ సడన్‌గా డ్రాప్ అయి ఉంటుంది. ఒకేసారి 100 నుంచి 150 అడుగులు కిందికి పడిపోయి ఉంటుంది. దీని వల్ల హెలికాప్టర్‌లోని ఇంధనం నుంచి మంటలు అంటుకొని ఉండొచ్చు. వాతావరణం బాగోలేనప్పుడు.. వాతావరణం బాలేనప్పుడు పైలట్లు సురక్షితమైన ఎత్తును పాటిస్తూ ఉంటారు. గమ్యానికి చేరాక దిగాల్సిన చోట నాలుగైదు రౌండ్లు వేసి హైట్ తగ్గించుకుని ల్యాండ్ చేస్తారు. రావత్ హెలికాప్టర్ విషయంలో ఇలా ఎందుకు జరగలేదో తేలాల్సి ఉంది. హెలికాప్టర్ బయలుదేరినప్పటి నుంచి కూలే వరకు ఎంత ఎత్తులో ప్రయాణించింది, సాంకేతిక సమస్యలు వచ్చాయా లాంటివి ఫ్లైట్ డేటా రికార్డర్లో ఉంటాయి. పైలట్, కోపైలట్ ఏటీసీతో జరిపిన సంభాషణ అందులో ఉంటుంది. వాటిని విశ్లేషిస్తే ప్రమాద కారణాలు తెలుస్తాయి. -
దేశవ్యాప్తంగా బిపిన్ రావత్‌కు నివాళులు
-
హెలికాప్టర్ ప్రమాదం: ఢిల్లీకి పార్థివ దేహాలు
న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ రావత్ దంపతులతోపాటు ఇతరుల పార్థివ దేహాలను సైనిక విమానంలో గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్‌కు తీసుకొచ్చారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆర్మీ చీఫ్ నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏవీఆర్ చౌదరి నివాళులర్పించారు. మృతుల కుటుంబీకులు హాజరయ్యారు. ఇక్కడ భావోద్వేగ వాతావరణం కనిపించింది. రావత్ ఇద్దరు కుమార్తెలను ప్రధాని మోదీ ఓదార్చారు. అంతకు ముందు తమిళనాడులోని వెల్లింగ్టన్లోని మద్రాస్ రెజిమెంట్ సెంటర్లో పార్థివ దేహాలకు తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై, తమిళనాడు సీఎం స్టాలిన్ నివాళులర్పించారు. మృతదేహాలను కోయంబత్తూరుకు, తర్వాత ఢిల్లీకి తరలించారు. 3 మృతదేహాల గుర్తింపు హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మరణించగా, ఇప్పటివరకు 3 మృతదేహాలను గుర్తించారు. రావత్, ఆయన భార్య మధులిక, బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ మృతదేహాలను గుర్తించామని, వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. మిగిలిన పార్థివ దేహాలను ఆర్మీ బేస్ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరుస్తామని చెప్పారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. మృతదేహాలకు చాలావరకు కాలిపోయాయని, అందుకే గుర్తింపు ప్రక్రియ కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. రావత్ దంపతుల మృతదేహాలను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఢిల్లీలోని 3 కామరాజ్ మార్గ్ నివాసంలో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుంది. సాయంత్రం 4 గంటలకు బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. రాష్ట్రపతి కోవింద్‌కు రాజ్‌నాథ్ వివరణ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలియజేశారు. ఈ దుర్ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. ఈ ప్రమాదంపై త్రివిధ దళాల విచారణకు భారత వైమానిక దళం ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. చదవండి: Tamil Nadu: 30 మంది ప్రాణాలు కాపాడి మృత్యు ఒడిలోకి ఆర్టీసీ డ్రైవర్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హెలికాప్టర్ ప్రమాదం: పార్థివ దేహాలను తరలిస్తున్న అంబులెన్స్‌కు యాక్సిడెంట్
చెన్నై: తమిళనాడులోని కున్నూరులో బుధవారం జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో 13 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటన పార్థివ దేహాలను తరలిస్తుండగా అంబులెన్సుకు ప్రమాదం జరిగింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను ఢిల్లీకి తరలించేందుకు గురువారం కున్నూర్ నుంచి సూలూరు ఎయిర్‌బేస్‌కు అంబులెన్సుల్లో తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు వద్ద ఓ అంబులెన్సు ముందుగా వెళ్తున్న మరో అంబులెన్సును అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో కొందరు పోలీసులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే ప్రమాదానికి గురైన అంబులెన్సులోని పార్థివ దేహాలను మరో అంబులెన్సులోకి ఎక్కించారు. శుక్రవారం ఢిల్లీలో బిపిన్ రావత్ అంత్యక్రియలు జరగనున్నాయి. -
సైనికుడు సాయితేజ కుటుంబానికి అండగా మంచు కుటుంబం
సాక్షి, చిత్తూరు: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరుకు చెందిన సైనికుడు సాయి తేజ్ కుటుంబానికి మంచు మోహన్ బాబు కుటుంబం అండగా నిలిచింది. లాన్స్ నాయక్ సాయి తేజ ఇద్దరు పిల్లలను ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని హీరో మంచు విష్ణు వెల్లడించారు. త్వరలోనే చిత్తూరుకు వచ్చి సాయి తేజ కుటుంబాన్ని కలుస్తానని పేర్కొన్నారు. కాగా సాయితేజ అంత్యక్రియలు శుక్రవారం చిత్తూరు జిల్లా రేగడిపల్లిలో నిర్వహించనున్నారు. కాగా తమిళనాడు కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో ప్రయాణిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కూడా మరణించారు. ఊహించిన ఈ ఘటనతో సాయితేజ స్వస్థలం కురబలకోట మండలం ఎగువరేడ గ్రామం షాక్‌కు గురైంది. సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్జా(5) పాప దర్శిని (2) సంతానం. సాయితేజ కుటుంబానికి మంచు విష్ణుపరామర్శ విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను ' మా ' అధ్యక్షుడు శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ మంచు విష్ణు పరామర్శించారు. మదనపల్లిలోని ఎస్బీఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు . యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సీడీఎస్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న సాయితేజ అకాల మరణం పొందడం పట్ల ఆయన విచారకరం వ్యక్తం చేశారు 10 రోజుల్లో మదనపల్లికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని ఆయన శ్యామలకు తెలిపారు. -
రావత్ మంచి నీళ్లు అడిగారు.. కాపాడుకోలేకపోయా: ప్రత్యక్ష సాక్షి కంటతడి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో బుధవారం చోటుచేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముఖ్యంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దంపతులు ఈ ప్రమాదంలో అసువులు బాశారు. కోయంబత్తూరులోని సూలూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి వెల్లింగ్టన్కు వెళ్తుండగా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో మరో 11 మంది దుర్మరణం పాలవ్వడం విషాదాన్ని నింపింది. (పప్పా నా హీరో, బెస్ట్ ఫ్రెండ్..బిగ్గెస్ట్ మోటివేటర్: బ్రిగేడియర్ లిడ్డర్ కుమార్తె కన్నీరు) ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక హెలికాప్టర్లలో ఒకటి, రష్యాకుచెందిన Mi-17V-5 హెలికాప్టర్ నీలగిరిలోని కూనూర్ సమీపంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రదేశంలో జనరల్ బిపిన్ రావత్‌ను సజీవంగా చూశానని ప్రత్యక్ష సాక్షి శివ కుమార్ తెలిపారు. టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న శివ మంటలు చెలరేగి హెలికాప్టర్ పడిపోవడం తాను స్వయంగా చూశానని పేర్కొన్నాడు. దీంతో తనతోపాటు కొంతమంది సంఘటనా స్థలానికి చేరుకుని శిధిలాలలో జనరల్‌ను సజీవంగా చూశానని వెల్లడించినట్టు ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. అక్కడ మూడు మృతదేహాలు పడి పోయి ఉన్నాయి. ఇంతలో ప్రాణాలతో ఉన్న ఒకతను మంచినీళ్లు కావాలని అడిగారని శివ కుమార్ చెప్పారు. వెంటనే ఆయనను బెడ్‌షీట్‌లో చుట్టి కిందికి తీసుకొచ్చి, రక్షణ దళాలకు అప్పగించాం. మూడు గంటల తరువాత ఆయనే బిపిన్ రావత్ అని ఎవరో చెప్పారని శివకుమార్ తెలిపారు. అయితే ఆ తరువాత ఆయన చనిపోయారని తెలిసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ఇంత చేసిన వ్యక్తికి నీళ్లు కూడా ఇవ్వలేకపోయాను. నీళ్లు ఇచ్చి ఉంటే బతికే వారేమో.. ఆయనను కాపాడుకోలేక పోయినందుకు రాత్రంతా నిద్ర పట్టలేదంటూ శివ కుమార్ కంటతడి పెట్టారు. కాగా ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయపటడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ వెల్లింగ్టన్లోని మిలిటరీ ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మెరుగైన చికిత్సకోసం ఆయనకు బెంగళూరుకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రమాదస్థలినుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు హెలికాప్టర్ ఎందుకు కూలి పోయింది అనే అంశాలను పరిశోధించనున్నారు. -
తదుపరి సీడీఎస్ రేసులో నరవాణె..?!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ భద్రతా రంగంలో అత్యున్నత పోస్టు చీఫ్ ఆఫ్ డిఫెన్స్. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. దానిలో భాగంగా దేశ భద్రతకు కీలకమైన ఆర్మీ, వాయు, నావిక దళాల మధ్య సమన్వయం కుదిర్చేందుకు.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టును రూపొందించింది. వయసు, అనుభవం పరంగా సీనియర్ అయిన బిపిన్ రావత్‌ను తొలి సీడీఎస్‌గా 2019లో నియమించింది మోదీ ప్రభుత్వం. అయితే దురదృష్టం కొద్ది ఆయన పదవి చేపట్టిన రెండున్నరళ్లేకే అకాల మరణం పొందారు. తమిళనాడు, కూనూరు సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. సైనిక బలగాలకు కొత్త రూపు తెచ్చిన రావత్ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదంతో పాటు.. మోదీ సర్కార్‌కు పలు సవాళ్లను కూడా తీసుకొచ్చింది. తదుపరి సీడీఎస్‌గా ఎవరిని నియమించాలన్నది.. ప్రభుత్వం, ముఖ్యంగా రక్షణ శాఖ ముందున్న తక్షణ సవాలు. (చదవండి: చివరి కోరిక తీరకుండానే మృతి చెందిన బిపిన్ రావత్) అనుభవం ఆధారంగానే రావత్‌కు అవకాశం... ప్రస్తుతం రక్షణ శాఖలో సీడీఎస్ పదవికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక మొదటి సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన బిపిన్ రావత్ సాయుధ దళాల కోసం ఎన్నో సంస్కర్ణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. రావత్ ఇండియన్ ఆర్మీ చీఫ్ పదవి కాలం ముగియడానికి అనగా పదవీ విరమణకు ఒక్క రోజు ముందుగా ఆయనను సీడీఎస్‌గా నియమిస్తూ.. మోదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశ తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం ఆధారంగానే 2019లో రావత్‌ని సీడీఎస్‌గా నియమించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన రెండున్నరేళ్ల కాలంలోనే ఆయన మృత్యువాత పడ్డారు వారాల వ్యవధిలో ప్రభుత్వం తదుపరి సీడీఎస్ ఎవరనేది ప్రకటించనున్నట్లు సమాచారం. సీడీఎస్ ఎంపికకు ఎలాంటి నిర్దేశిత నియమాలు లేవు. సరిహద్దు భద్రతా సవాళ్లను దృష్టిలో పెట్టుకుని.. కేంద్ర ప్రభుత్వం సీడీఎస్ నియామకంపై నిర్ణయం తీసుకుంటుంది. (చదవండి: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్) సీడీఎస్ నియామక ప్రక్రియ ఎలా ఉంటుందంటే.. సీడీఎస్ నియామక ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. భారత ఆర్మీ, వాయుసేన, నావిక దళాలకు చెందిన ఏ కమాండింగ్ అధికారిని అయినా సీడీఎస్‌గా నియమించవచ్చు. ప్రతిభ, సీనియారిటీ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాకపోతే సీడీఎస్‌గా నియమితుడయ్యే వ్యక్తి వయసు 65 ఏళ్లకు మించకూడదు. రావత్ తర్వాత సీనియర్ నరవాణెనే... ప్రస్తుత విషయానికి వస్తే.. సైనిక దళాలకు పని చేస్తున్న చీఫ్‌లలో.. బిపిన్ రావత్ తర్వాత సీనియర్.. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె. తదుపరి సీడీఎస్‌గా నరవాణెని నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత ఆర్మీ చీఫ్‌గా నరవాణె పదవీ కాలం 2022, ఏప్రిల్ వరకు ఉంది. అంతేకాక ఆర్మీ చీఫ్‌గా జనరల్ రావత్ నుంచే నరవాణె.. 2019, డిసెంబర్ 31న బాధ్యతలు చేపట్టారు. అయితే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్న ప్రస్తుత ఉన్నతాధికారులతో పోలిస్తే.. నరవాణెనే సీనియర్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరీ ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఆ ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలను స్వీకరించారు. ఆర్ హరి కుమార్ నేవీ చీఫ్ అడ్మైర్గా గత నెల 30న నియమితులయ్యారు. దీనితో నరవాణెనే తదుపరి సీడీఎస్‌గా ప్రభుత్వం ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదవండి: Bipin Rawat: భయమంటే తెలియని.. అలుపెరగని సైనికుడు -
CDS Bipin Rawat: సెలవిక దళపతి... వెల్లింగ్టన్లో మృతులకు నివాళి
సాక్షి, చెన్నై: భారతీయ సైనిక బలగాల చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన వీర యోధుడిని హెలికాప్టర్ ప్రమాదం కబళించింది. దేశ తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) బిపిన్ రావత్ బుధవారం ఛాపర్ ప్రమాదంలో అసువులు బాశారు. గతంలో ఒకసారి ఇలాంటి ప్రమాదం నుంచే రావత్ తృటిలో బయటపడ్డారు. కానీ ఈసారి దురదృష్టం వెన్నాడింది. దేశ సైనిక బలగాలకు కొత్త రూపుతెచ్చిన రావత్ మరణంతో దేశం దిగ్భ్రాంతి చెందింది. పలువురు ప్రముఖులు ఆయన మరణంపై తీవ్ర సంతాపం ప్రకటించారు. సూలూరు ఎయిర్ బేస్నుండి వెల్లింగ్టన్ వెళ్తూ ఛాపర్ ప్రమాదంలో రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11మంది సైనికాధికారులు సైతం దుర్మరణం చెందారు. ఒక్కరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ రావత్ దుర్మరణం) మరణించినవారిలో ఏపీ లోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్‌నాయక్ సాయితేజ కూడా ఉన్నారు. ప్రమాద స్థలంలో భారీగా మంటలు చెలరేగడంతో బాధితులను రక్షించేందుకు స్థానికులు చేసిన యత్నాలు ఫలించలేదు. ఘటనా స్థలిలో దేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. దుర్ఘటనపై భారత వాయుసేన విచారణకు ఆదేశించింది. రావత్ మరణవార్త వినగానే సీసీఎస్(కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) సమావేశమైంది. గురువారం ఉదయం వెల్లింగ్టన్లో మృతులకు నివాళి అర్పించిన అనంతరం వారి పార్థివ దేహాలను కోయంబత్తూర్ నుంచి ఢిల్లీకి వాయుమార్గంలో తీసుకువెళ్తారు. (చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్) శుక్రవారం ఢిల్లీ కంటోన్మెంట్లో అధికారలాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతారు. 1978లో సెకండ్ లెఫ్టినెంట్‌గా చేరి 2019లో దేశ భద్రతాదళాల ఉమ్మడి అధిపతిగా ఎదిగే క్రమంలో ఆయన పలు పురస్కారాలు అందుకున్నారు. భారత్‌లో అత్యంత శక్తివంతమైన సైనికాధికారైన ఈ ఫోర్స్టార్ జనరల్ సేవలను, తెచ్చినన రక్షణ సంస్కరణలను త్రివిధ దళాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాయి. శుక్రవారం రాజ్‌నాధ్ సింగ్ పార్లమెంట్లో ప్రమాదంపై ప్రకటన చేశారు. 1.ఉదయం 9గంటలకు ఢిల్లీ నుంచి రావత్ బయలుదేరారు. ఉదయం 11.34 గంటలకు సూలూర్ ఎయిర్‌బేస్‌కు చేరారు. 2.11.45 గంటలకు రావత్ తదితరులు ప్రయాణిస్తున్న ఛాపర్ సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయింది. 3.మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో కూనూర్ వద్ద ప్రమాదం జరిగింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: చివరి కోరిక తీరకుండానే మృతి చెందిన బిపిన్ రావత్ -
హెలికాప్టర్ ప్రమాదం.. లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో దేశ ప్రథమ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్‌తో పాటు మరో 11 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం లోక్‌సభలో ప్రకటన చేశారు. (చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్) ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ►బుధవారం వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది ►సూలూరు ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం 11:48 గంటలకు హెలికాప్టర్ టేకాఫ్ అయ్యింది. ►మధ్యాహ్నం 12:08 గంటలకుహెలికాప్టర్కు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ►కాసేపటికి హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారు. భారీ శబ్దం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లారు. ►అప్పటికే హెలికాప్టర్ మంటల్లో ఉంది. ►గాయపడ్డవారిఇన సహాయక బృందాలు వెల్లింగ్టన్ ఆస్పత్రికి తరలించాయి. ►హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. రావత్‌తో పాటు ఆయన భార్య మృతి చెందడం బాధాకరం. ►భౌతికకాయాలు గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరతాయి. ►హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది అని తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన అనంతరం లోక్‌సభ స్పీకర్ హోం బిర్లా, సభ్యులు బిపిన్ రావత్ సహా మిగతా వారి మృతికి సంతాపం తెలిపారు. చదవండి: బిపిన్ రావత్.. మాటలు కూడా తూటాలే -
బిపిన్ రావత్.. మాటలు కూడా తూటాలే
సాక్షి, న్యూఢిల్లీ: రావత్ శత్రుదేశాలపై నిర్మొహమాటంగా మాటలు సంధించేవారు. ఈటెల్లాంటి మాటలతో విరుచుకుపడేవారు. ఆ వాగ్భాణాల్లో మచ్చుకు కొన్ని... ‘చైనా, పాకిస్తాన్ల దురాక్రమణ కాంక్ష భారత సైన్యం అనుక్షణం అప్రమత్తంగా ఉండేటట్లు చేస్తోంది. సరిహద్దులతో పాటు... తీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా గట్టి నిఘా అవసరం. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నపుడు... ఎటువైపు నుంచి యుద్ధం మొదలవుతుందో ... అది ఎక్కడి దారితీస్తుందో తెలియదు. కాబట్టి ఇరువైపులా సర్వసన్నద్ధంగా ఉండాల్సిందే.’ ‘పాక్‌తో చైనా స్నేహం, జమ్మూకశ్మీర్‌పై డ్రాగన్ వైఖరిని బట్టి చూస్తే వారిది భారత్ వ్యతిరేక అనుబంధంగా అభివర్ణించొచ్చు.’ ‘చైనా ధనబలాన్ని, వాణిజ్యాన్ని అడ్డుపెట్టుకొని ఇరుగుపోరుగు దేశాల్లో ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.’ ‘పాక్‌ను నియంత్రించాల్సిన అవసరం లేదు. అదే క్రమేపీ తమ దేశంపై పట్టు కోల్పోతోంది. దానికోసం మనం ప్రత్యేకంగా కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం లేదు. వారే కొంపను అంటించుకునే క్రమంలో ఉన్నారు.’ ‘మిత్రులను సంపాదించుకోవడం తేలికే. కాని శత్రువులే మనను నిరంతరం అప్రమత్తంగా ఉండేలా చేస్తారు’. చదవండి: హెలికాఫ్టర్ దుర్ఘటన: మృత్యువుతో పోరాడుతున్నకెప్టెన్ వరుణ్! ప్రముఖులను కబళించిన హెలికాప్టర్ ప్రమాదాలు -
ప్రముఖులను కబళించిన హెలికాప్టర్ ప్రమాదాలు
List Of Famous Persons Died In Helicopter Crash: దూరాభారాలను ఆఘమేఘాల మీద చేరుకునేందుకు ఉపయోగపడే హెలికాప్టర్లు ఒక్కోమారు మృత్యువాహనాలుగా మారుతున్నాయి. తెలుగురాష్ట్రాలకు సంబంధించి హెలికాప్టర్ ప్రమాదం అనగానే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకువస్తారు. జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన హెలికాప్టర్ 2009లో నల్లమల అడవుల ప్రాంతంలో కూలిపోయింది. గతంలో పలువురు మిలటరీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు ఛాపర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. రక్షణ, మిలటరీ ప్రముఖులు.. ►1963 జమ్ముకాశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో లెఫ్టినెంట్ జనరల్ దౌలత్సింగ్ సహా ఆరుగురు మిలటరీ అధికారులు మృతి చెందారు. ►1997లో రక్షణ శాఖ సహాయమంత్రి ఎన్వీఎన్ సోము, మేజర్ జనరల్ రమేశ్ చంద్ర నాగ్‌పాల్ పయనిస్తున్న హెలికాప్టర్ అరుణాచల్‌ప్రదేశ్‌లో తవాంగ్ సమీపంలో కుప్పకూలింది. మొత్తం నలుగురు మరణించారు. ►1993లో ఒక మిలటరీ హెలికాప్టర్ భూటాన్‌లో కూలిపోయింది. ఇందులో భారతీయ తూర్పు ప్రాంత ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ జమీల్ మొహ్మద్‌తో సహా 8మంది మిలటరీ అధికారులు మరణించారు. అధికారిక పర్యటనలో భాగంగా వారు భూటాన్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు.. ►2009 సెప్టెంబర్ 2న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ►2011 ఏప్రిల్ 30న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీఖాండూ పయనిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురై ఆయనతో పాటు నలుగురు దుర్మరణం పాలయ్యారు. ►2005లో హరియాణా విద్యుత్‌శాఖ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఓపీ జిందాల్, వ్యవసాయశాఖ మంత్రి సురేందర్ సింగ్ యూపీలోని షహరాన్‌పూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ►2002 మార్చి 3న అప్పటి లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కృష్ణా జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేటు హెలికాప్టర్ కైకలూరులోని ఒక చెరువులో కూలిపోయింది. గతంలో త్రుటిలో బయటపడ్డారు.. 2015లో రావత్ ప్రయాణిస్తున్న ఛాపర్ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆయన నాగాలాండ్‌లోని దీమాపూర్ ఆర్మీక్యాంపునకు వెళ్తున్నారు. రంగపహర్ హెలిపాడ్ నుంచి చీతా హెలిక్యాప్టర్ టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కూలిపోయింది. ముక్కుభాగం నేరుగా నేలను ఢీ కొట్టింది. అయితే ఆ సమయంలో రావత్‌తో పాటు అందులో పయనిస్తున్న ఒక కల్నల్, ఇద్దరు పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆరేళ్ల తర్వాత అలాంటి ఛాపర్ ప్రమాదమే రావత్‌ను బలితీసుకుంది. -
అనూహ్య దుర్ఘటన
ఇది హృదయాన్ని కలచివేసే అనూహ్య దుర్ఘటన. దేశంలో త్రివిధ సైనిక దళాలకు పెద్ద తలకాయ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ సైనిక హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం తమిళనాడులో ప్రమాదానికి గురికావడం, రావత్ – ఆయన సతీమణి సహా 13 మంది దుర్మరణం దిగ్భ్రాంతికరం. దట్టమైన చెట్లు, తేయాకు తోటలు నిండిన నీలగిరుల్లో, కూనూరుకు సమీపంలో 5 నిమిషాల్లో గమ్యానికి చేరతారనగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోనే అత్యంత కీలక సైనికాధికారి మరణానికి కారణమైన ఈ ప్రమాదం అనేక భావోద్వేగాలకూ, తొలి దశలో రక్షణపరమైన అనుమానాలకూ దారి తీస్తోంది. గత ప్రమాదాల కథ గిర్రున రీలులా తిరుగుతోంది. తొందరపడి ఒక నిర్ధారణకు రావడం సరైనది కాదు కానీ, అసలు ఇలాంటి వీఐపీల ప్రయాణాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారా అని సామాన్యుల్లో సందేహం రేపుతోంది. 2015లో నాగాలాండ్‌లో ఓ సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ టేకాఫ్ అయ్యీ అవగానే 20 అడుగుల ఎత్తున ప్రమాదానికి గురైనప్పుడు రావత్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కానీ, ఈసారి అదృష్టం ఆయనకు ముఖం చాటేసింది. అయితే, భారత తొలి సీడీఎస్‌గా నియుక్తులైన అదృష్టం రావత్‌కే దక్కింది. హోదా రీత్యా భారత సర్వసైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి కాగా, ఆ తర్వాతి స్థానం ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ది. దేశరక్షణ వ్యవహారాల్లో ప్రధానికీ, రక్షణ మంత్రికీ సీడీఎస్ కీలక సలహాదారు. అలాంటి అత్యున్నత స్థాయి వ్యక్తి దుర్మరణం దేశానికి భారీ నష్టం. తదుపరి చర్యల కోసం ‘రక్షణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ’ (సీసీఎస్) హుటాహుటిన సమావేశమవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ప్రతిసారీ రావత్ హాజరయ్యే ఆ భేటీ ఈసారి ఆయన లేకనే జరగాల్సి రావడం విషాదం. నాలుగు స్టార్లు ధరించిన అరుదైన జనరల్‌గా ఎదిగిన 63 ఏళ్ళ రావత్ 1978 నుంచి ఇప్పటికి 43 ఏళ్ళుగా భారత సైన్యంలో విశేష సేవలందిస్తూ వచ్చారు. గతంలో ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించారు. కీలక ఘట్టాల్లో వీరోచిత సైనికుడిగా తన సత్తా చాటి, ఎన్నో గౌరవ పతకాలు అందుకున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో శాంతి పరిరక్షణ బాధ్యతలు, ఈశాన్యంలో తీవ్రవాద నిరోధక చర్యలు, సరిహద్దు ఆవల మయన్మార్ ఆపరేషన్లు, ఆ మధ్య సర్జికల్ దాడుల్లో రావత్ కీలక పాత్రధారి. రిటైరయ్యే లోగా నెరవేర్చాల్సిన బృహత్తర బాధ్యత చాలా ఉందని సీడీఎస్‌గా చెబుతూ వచ్చారు. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత, త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం కోసం, సైన్యంలో అవసరమైన సంస్కరణల కోసం సీడీఎస్ అనే ప్రత్యేక హోదా ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. రెండు దశాబ్దాల తాత్సారం తర్వాత, రెండేళ్ళ క్రితం అది కార్యరూపం దాల్చింది. ఆ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా రావత్ దూరదృష్టితో, చురుకుగా ముందుకు సాగారు. అప్పటి దాకా ఆలోచనలకే పరిమితమైన సైనిక సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. సౌత్ బ్లాక్‌లోని కార్యాలయంలో బల్ల నిండా ఫైళ్ళు, నిరంతర సమావేశాలతో తీరిక లేకుండా గడుపుతూ వచ్చారు. అనుకున్నది సాధించే దాకా విశ్రమించని వ్యక్తిగా పేరున్న రావత్ విమర్శలు, వివాదాలు వచ్చిపడ్డా వెనక్కి తగ్గలేదు. అదేమంటే, ‘నేనేమీ అందరినీ మెప్పించి, ఎన్నికల్లో గెలవనక్కర్లేదుగా’ అని నవ్వేయడం ఆయన విలక్షణ శైలి. దేశ రక్షణకు కీలకమైన ఇంతటి వ్యక్తి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇలా కూలిపోవడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది. మునుపు సంజయ్ గాంధీ (1980 జూన్), కాంగ్రెస్ నేత మాధవరావ్ సింధియా (2001 సెప్టెంబర్) విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. తెలుగువారైన లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి (2002 మార్చి), సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి (2009 సెప్టెంబర్), అలాగే అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండూ (2011 మే) తదితరులు వివిధ హెలికాప్టర్ ప్రమాదాల్లో అకాల మరణం పాలయ్యారు. ఆ ప్రమాదాలపై అనేక అనుమానాలు, తేలని విచారణలు తెలిసిందే. ఇప్పటి ఈ తాజా ప్రమాదానికి కారణం – అననుకూల వాతావరణమా? వాహనంలో వచ్చిపడ్డ సాంకేతిక సమస్యా? పైలట్ల అనుభవ రాహిత్యమా? ఇలా ఎన్నో బేతాళ ప్రశ్నలు. విచారణలో నిజాలు నిగ్గు తేలతాయి. ఎయిర్ మార్షల్ స్థాయి ఉన్నతాధికారి సారథ్యంలో త్రివిధ దళాధికారులతో లోతైన విచారణ జరపనున్నట్టు సమాచారం. రష్యా నుంచి భారత సైన్యంలోకి వచ్చిన జవనాశ్వంగా ‘మీ–17వీ5’ హెలికాప్టర్లకు పేరు. ప్రముఖుల ప్రయాణాలకూ, కీలక రవాణాకూ చాలాకాలంగా నమ్మకమైన ఈ ఛాపర్లు ప్రమాదం పాలవడం ఆశ్చర్యమే. సీనియర్లు, అనుభవజ్ఞులైన పైలట్లే ఇలాంటి వీవీఐపీల హెలికాప్టర్లను నడుపుతారు. ప్రముఖుల ప్రయాణాలకు ముందు వాటిని క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఆయిల్ మార్చడం మొదలు అనేక చిన్న విడిభాగాలను మార్చడం దాకా అనేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. బుధవారం ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నారట. కానీ, ఊహించని రీతిలో తక్కువ ఎత్తులో ఛాపర్ ప్రయాణిస్తోందనీ, ఓ భారీ వృక్షానికి గుద్దుకుందనీ, ఇంధన ట్యాంకు పేలి, కాలిపోయిందనీ కథనం. అంతా పైకి కనిపిస్తున్నట్టనిపించినా, బ్లాక్‌బాక్స్ విశ్లేషణ సహా లోతైన విచారణ తర్వాతే కనిపించని కారణాలు తెలియరావచ్చు. ఏమైనా జరగకూడని నష్టం జరిగేపోయింది. వర్తమానానికి అవసరమైన కీలక సైనిక సంస్కరణలు చేయడానికి రావత్ సిద్ధమవుతున్న వేళ, దేశానికి పశ్చిమ, ఉత్తరాల నుంచి పాక్, చైనాలతో ముప్పున్న వేళ ఆయనను పోగొట్టుకోవడం ఓ అశనిపాతం. ఈ భారత వీరపుత్రుడు అర్ధంతరంగా వదిలేసివెళ్ళిన సంస్కరణల సత్కార్యాన్ని పూర్తి చేయడమే ఆయనకు నిజమైన నివాళి. -
Bipin Rawat: ఎంఐ హెలికాప్టర్.. మృత్యువుకి మరో పేరు.. 42 మందికి పైగా దుర్మరణం
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ చివరి సారిగా ఎంఐ 17 వీ 5 హెలికాప్టర్లో ప్రయాణం చేశారు. ఎయిర్‌ఫోర్స్‌లో ఈ హెలికాప్టర్లు కీలకంగా ఉన్నాయి. ఒకేసారి 30 మంది ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ హెలికాప్టర్లు క్యారియర్లుగా ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే గత పదేళ్లుగా ఈ హెలికాప్టర్లు వరుసగా ప్రమాదాలు గురవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ హెలికాప్టర్ క్రాష్లలో 42 మందికి పైగా సైనికులను దేశం కోల్పోయింది. - 2021 డిసెంబరు 8న తమిళనాడులో జరిగిన క్రాష్‌లో సీడీఎస్ బిపిన్ రావత్ ఆయన భార్య మధుళికతో కలిపి మొత్తం 14 మంది దుర్మరణం పాలయ్యారు. సీడీఎస్ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. - 2019 ఫిబ్రవరి 27న శ్రీనగర్ ఎయిర్ బేస్ స్టేషన్ నుంచి రోటీన్ వర్క్‌లో భాగంగా టేకాఫ్ అయిన విమానం పది నిమిషాలకే శ్రీనగర్ సమీపంలోని బుడ్గామ్ దగ్గర కూలింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు త్రీవంగా గాయపడ్డారు. - 2018 ఏప్రిల్ 18న ఉత్తర్ఖండ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు గుప్తకాశి నుంచి కేదార్నాథ్ బయల్దేరిన చాపర్ ల్యాండింగ్ సమయంలో సమస్యలు ఎదురయ్యాయి. పైలెట్లు ఏంతో నేర్పుగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఆరుగురు క్రూ క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు. - 2017 అక్టోబరు 6న అరుణాచల్ ప్రదేశ్‌లో వివాస్పద తవాంగ్ ఏరియాలో ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్యలతో అడవుల్లో కూలిపోయింది. సమయానికి సహాయ కార్యక్రమాలు కూడా అందలేదు. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు సిబ్బంది మరణించారు. - 2013 జూన్ 25 వదర సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్ కేథార్నాథ్ నుంచి గుప్తకాశికి వస్తుండగా గౌరీకుండ్ దగ్గర క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. - 2012 ఆగస్టు 30న గుజరాత్‌లోని ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన హెలికాప్టర్ కొద్ది సేపటికే ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ఘటనలో మొత్తం 9 మంది చనిపోయారు. - 2010 నవంబరు 19న తవాంగ్ నుంచి గువహాటికి బయల్దేరిన ఐదు నిమిషాలకే బొందిర్ అనే కొండల నడుమ హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. చదవండి:హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత -
Bipin Rawat : హెలికాప్టర్ ప్రమాదం.. వైరల్ అవుతున్న ఫేక్ వీడియో
చెన్నై: తమిళనాడు కూనురు నీలగిరికొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందినట్లు వాయుసేన ధృవీకరించింది. అయితే బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాద దృశ్యాలు ఇవే అంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత ఇలా సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలో.. ఆకాశంలో ఉన్నప్పుడే హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. మంటల మధ్యనే దాదాపు రెండు నిమిషాల పాటు హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో అందులో ఉన్న కొందరు హెలికాప్టర్ నుంచి బయటకు దూకే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత హెలికాప్టర్ పూర్తిగా అదుపు కోల్పోయి నిటారుగా వేగంగా నేలను ఢీ కొట్టింది. ఈ ఘటన ప్రత్యక్ష సాక్షులు సైతం మీడియాలో ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. ఆకాశంలోనే మంటలు చెలరేగాయని.. కొందరు బయటకు దూకారని చెపుతున్న మాటలు టీవీల్లో ప్రసారం అవుతున్నాయి. దీంతో ఈ వీడియో బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్దే అని అంతా భావించారు. చదవండి: కుప్పకూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్, 13 మంది మృతి అయితే వాస్తవానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఫేక్. ఇది ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి సంంబంధించినది కాదు. 2020 ఫిబ్రవరిలో సిరియాలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో. అక్కడ ఆకాశంలో మంటల్లో చిక్కుకున్నప్పుడు వీడియో తీశారు. తాజాగా కొందరు ఈ ఫేక్ వీడియోను ప్రచారంలోకి తెచ్చారు. Bipin Rawat Helicopter Crashed In Tamil Nadu live Video #bipinrawat #helicopter #IndianArmy #BIGBREAKING pic.twitter.com/CgwCqZ0bSr — Marwadi Club (@MarwadiClub) December 8, 2021 -
హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత
కూనూర్: బుధవారం తమిళనాడు కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందారు. 2019లో ఆయన సీడీఎస్‌గా నియమితులయ్యారు. డిఫెన్స్ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్(డీడబ్ల్యూడబ్లూయే) అధ్యక్షురాలిగా మధులిక సేవలనందిస్తున్నారు. రావత్ మరణాన్ని భారత వైమానిక శాఖ(ఐఏఎఫ్) నిర్ధారించింది. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో పయనిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది. ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే బతికి బయటపడ్డారని, ప్రస్తుతం వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని తెలిపింది. మరణించినవారిలో ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారు. గురువారం ఉదయం వెల్లింగ్టన్లో మృతులకు నివాళి అర్పించిన అనంతరం వారి అవశేషాలను కోయంబత్తూర్ నుంచి ఢిల్లీకి వాయుమార్గంలో తీసుకుపోనున్నట్లు పోలీసు, రక్షణవర్గాలు తెలిపాయి. శుక్రవారం వీరికి ఢిల్లీ కంటోన్మెంట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ‘‘ దుర్ఘటనలో రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ సహా 11 మంది మరణించారని తెలిపేందుకు విచారిస్తున్నాం’’ అని వైమానిక శాఖ ట్వీట్ చేసింది. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో ప్రసంగించేందుకు రావత్ రావాల్సిఉంది. ఇదే కాలేజీలో రావత్ గతంలో విద్యాభ్యాసం చేశారు. చదువుకున్న చోటికి వెళ్తూ మృత్యు ఒడిలోకి రావత్ చేరటం విధివైపరీత్యం. ప్రమాదంలో బతికిబయటపడ్డ వరుణ్ సింగ్ ఈ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. మృతుల్లో రావత్, మధులికతో పాటు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కే సింగ్, నాయక్ గురుసేవక్‌సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్‌నాయక్ వివేక్, లాన్స్ నాయక్ బీ సాయితేజ, హవల్దార్ సత్పాల్, జేడబ్ల్యయో దాస్, ప్రదీప్ ఉన్నారని అధికారులు చెప్పారు. (రావత్ మంచి నీళ్లు అడిగారు.. కాపాడుకోలేకపోయా: ప్రత్యక్ష సాక్షి కంటతడి) వీరిలో సాయితేజ ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందినవారు. బిపిన్‌కు భద్రతాధికారిగా పనిచేస్తున్నారు. బిపిన్ మరణంతో సైనిక దళాలు తీవ్ర విచారంలో మునిగిపోయాయి. ఆయన వ్యూహాలను, సామర్థ్యాన్ని గుర్తు చేసుకున్నాయి. 2016–2019 కాలంలో ఆయన ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. అనంతరం రక్షణబలగాల ఉమ్మడి అధిపతిగా నియమితులయ్యారు. రావత్ మరణంపై ఆర్మీ చీఫ్ నరవణె, తదితర ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. రావత్ నాయకత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆర్మీ ట్వీట్ చేసింది. సీసీఎస్ అత్యవసర సమావేశం రావత్ ప్రయాణిస్తున్న ఛాపర్ క్రాష్ అయిందన్న వార్త నేపథ్యంలో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) సమావేశమైంది. ఇందులో ప్రధాని, రక్షణ; హోం, ఆర్థిక, విదేశాంగ మంత్రులతో పాటు కేబినెట్ సెక్రటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. సీసీఎస్ సభ్యులతో పాటు కేబినెట్ సభ్యులు రావత్ మరణంపై సంతాపాన్ని తెలియజేశారు. కొత్త సీడీఎస్‌గా ఎవరినైనా నియమిస్తారా? లేదా? అన్న విషయమై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రమాద వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, ప్రధాని మోదీకి వివరించారు. ఐఏఎఫ్ చీఫ్‌ను సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. తదనంతరం రాజ్‌నాధ్ ఢిల్లీలోని రావత్ నివాసానికి వెళ్లి రావత్ కుమార్తెను పరామర్శించారు. రావత్ గొప్ప సైనికుడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రావత్ మరణంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాద సంఘటనపై శుక్రవారం రాజ్‌నాధ్ పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు. చదవండి: Bipin Rawat: పది నిమిషాల్లో ల్యాండింగ్.. ఆ ఐదు నిమిషాల్లోనే ఘోరం! ఇలా జరిగింది... ఢిల్లీ పాలం విమానాశ్రయం నుంచి రావత్ తదితరులు బుధవారం ఉదయం 9గంటలకు బయలుదేరారు. ఉదయం 11.34 గంటలకు కోయంబత్తూర్ సమీపంలోని సూలూర్ ఎయిర్‌బేస్‌కు చేరారు. 11.45 గంటలకు రావత్ తదితరులు ప్రయాణిస్తున్న ఛాపర్ సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయింది. 45 నిమిషాల్లో వెల్లింగ్టన్లోని స్టాఫ్‌కాలేజీకి చేరాల్సిఉంది. మధ్యాహ్నం సుమారు 12.20 గంటలప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలియగానే ప్రమాదస్థలానికి 8 అంబులెన్సులు, వైద్య బృందాలు చేరుకున్నాయి. నీలగిరి జిల్లాలోని కట్టెరి– నాన్చపంచత్రం ప్రాంతంలో ఛాపర్ కూలిపోయింది. స్థానికులు తొలుత ఈ ప్రమాదాన్ని గుర్తించారు. పొగమంచు వాతావరణంలో ఛాపర్ బాగా కిందకు వచ్చిందని, కూనూర్ సమీపంలోని ఒక లోయలో కూలిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఘటనా స్థలికి చేరేటప్పటికే మంటలు ఛాపర్‌ను ఆక్రమించాయని తెలిపారు. కూలిపోయే సమయంలో ఒక ఇంటిని హెలికాప్టర్ గుద్దుకుంది. కానీ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఛాపర్ నుంచి ఇద్దరు వ్యక్తులు పడిపోయారని ప్రత్యక్ష సాక్షి పెరుమాళ్ చెప్పారు. ప్రమాద ప్రాంతంలోని చెట్లు ధ్వంసం అయ్యాయి. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు స్థానికులు యత్నించినా ఉపయోగం లేకపోయింది. ప్రమాద స్థలంలో భారీగా మంటలు చెలరేగాయి, పరిసరాల్లోని చెట్లుచేమా తగలబడ్డాయి. వీటిని ఆర్పేందుకు అక్కడివారు యత్నించారు. మంటలు అదుపులోకి వచ్చాక చూస్తే ప్రయాణీకులు మరణించినట్లు తెలిసింది. గుర్తు తెలియని విధంగా దేహాలు కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టులు నిర్వహించి మృతులను నిర్ధారించారు. మధ్యాహ్నం 1.53 గంటలకు రావత్ మరణాన్ని ఐఏఎఫ్ అధికారికంగా ధృవీకరించింది. సాయంత్రం 6.03 గంటలకు మరణవార్తను ఐఏఎఫ్ ప్రకటించింది. ఉలిక్కిపడ్డ పశ్చిమ కనుమలు ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రావత్ పయనిస్తున్న హెలికాప్టర్ కూలిన దుర్ఘటనతో పశ్చిమ కనుమలు ఉలిక్కిపడ్డాయి. నీలగిరి జిల్లాలోని తేయాకు తోటల్లోని కార్మికులు తొలిసారి ఈ దుర్ఘటనను గుర్తించారు. ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద ధ్వని వినిపించడాన్ని గమనించారు. చప్పుళ్లు ఏదో ప్రమాదానికి సంకేతమని గుర్తించి వెంటనే సంఘటనా స్థలాన్ని వెతుకుతూ వెళ్లారు. అప్పటికింకా ఆ ప్రాంతంలో కొంత పొగమంచు ఉంది. అక్కడకు వెళ్లాక భగభగలాడే మంటలు, లోహవస్తువులు విరిగిపోతున్న ధ్వనులను గుర్తించి నివ్వెరపోయారు. ప్రమాదం జరిగిందని స్థానికులు సాయం చేసేందుకు తయారయ్యారు. పెద్ద మంటల కారణంగా సంఘటన స్థలం దగ్గరకు పోలేకపోయారు. దాదాపు అరగంట పాటు మంటలు చెలరేగుతూనే ఉన్నాయని సాక్షులు చెప్పారు. -
Bipin Rawat: పది నిమిషాల్లో ల్యాండింగ్.. ఆ ఐదు నిమిషాల్లోనే ఘోరం!
చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయణిస్తున్న హెలికాప్టర్ మరో పది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనకు గల కారణాలు ఏమిటనే అంశంపై ఇప్పటికే ఎయిర్‌ఫోర్స్ విచారణకు ఆదేశించింది. అయితే గమ్యస్థానానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. ఢిల్లీ నుంచి సూలూరు మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ప్యానెక్స్ కర్టెన్ రైజర్ సమావేశంలో బిపిన్ రావత్ పాల్గొన్నారు. బుధవారం తమిళనాడులోని వెల్లింగ్టన్లో ఉన్న డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దీంతో భార్యతో పాటు కలిసి ఆయన తమిళనాడు పర్యటనకు వచ్చారు. 11:48కి టేకాఫ్ సూలూరు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి అత్యదిక సౌకర్యాలు ఉన్న క్యారియర్ హెలికాప్టర్ ఎంఐ 17లో భార్యతో కలిసి మరో పన్నెండు మంది ఆర్మీ అధికారులతో ఆయన వెల్లింగ్టన్కి బయలు దేరారు. ఉదయం 11:48 నిమిషాలకు హెలికాప్టర్ సూలూరు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి టేకాఫ్ అయ్యింది. నీలగిరి కొండల్లో విస్తరించిన దట్టమైన అడవుల గుండా ప్రయాణించి ఈ హెలికాప్టర్ వెల్లింగ్టన్ చేరుకోవాల్సి ఉంది. సూలూరు నుంచి వెల్లింగ్టన్ల మధ్య 94 కిలోమీటర్ల దూరం ఉంది. 12:22కి మిస్సింగ్ సూలూరు నుంచి హెలికాప్టర్ బయల్దేరిన తర్వాత దాదాపు గమ్యస్థానం దరిదాపులకు చేరే వరకు ప్రయాణం సజావుగానే సాగింది.దాదాపు అరగంట తర్వాత ప్రయాణ మార్గంలో ఇబ్బందులు తలెత్తడంతో బేస్‌స్టేషన్‌తో సంప్రదింపులు చేశారు. చివరగా మధ్యాహ్నం 12.22 గంటల సమయంలో బేస్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయి. స్థానికులు మధ్యాహ్నం 12:27 గంటల సమయంలో హెలికాప్టర్ క్రాష్ అయినట్టుగా చెబుతున్నారు. ఆ ఐదు నిమిషాల్లో వెల్లింగ్టన్ సమీపంలో కూనూరు అటవీ ప్రాంతం సమీపంలో ప్రమాదం జరిగింది. ఇక్కడి నుంచి వెల్లింగ్టన్లో డిఫెన్స్ స్టాప్ కాలేజీకి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో పది నిమిషాలు ప్రయాణం చేస్తే హెలికాప్టర్ క్షేమంగా ల్యాండ్ అయ్యేది. కానీ మధ్యాహ్నం 12:22 గంటల నుంచి 12:27 గంటల వ్యవధిలో జరిగిన వరుస ఘటనలో హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. శిథిలాలను నాంచప్ప చత్తరాం కట్టేరీ ప్రాంతంలో లభించాయి. క్షణాల్లోనే మరో ఐదు పది నిమిషాల్లో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. జనావాస ప్రాంతాలకు సమీపంలో ప్రమాదం జరగడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ మంటల తీవ్రత, క్రాష్ కారణంగా అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. హెలికాప్టర్‌లోని ప్రయాణిస్తున్న 14 మంది చనిపోయారు. ప్రమాదస్థలిలో తీవ్రంగా గాయపడిన బిపిన్ రావత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చదవండి: ఘోర ప్రమాదం.. ఆర్మీ హెలికాప్టర్లో ప్రయాణించిన వారి వివరాలు.. -
గతంలోనూ బిపిన్ రావత్ ప్రయాణిస్తుండగా హెలికాప్టర్ ప్రమాదం.. ఎక్కడంటే?
భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కొయంబత్తూర్, కూనూరు మధ్యలో బుధవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక, ఏడుగురు ఆర్మీ అధికారులు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. డిసెంబరు 31 2019న భారతదేశపు మొదటి చీఫ్ ఢిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ రావత్ గతంలోనూ చాపర్ ప్రమాదానికి గురయ్యారు. కాగా, ఫిబ్రవరి 3, 2015న నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో హెలికాప్టర్ ప్రమాదం నుంచి బిపిన్ రావత్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో ఆయన లెఫ్టినెంట్ జనరల్‌గా పని చేస్తున్నారు. దిమాపూర్ పర్యటనకు ఆర్మీ హెలికాప్టర్లో బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఆయన ప్రయాణిస్తున్న చాపర్ కూలిపోయింది. ఇంజిన్ వైఫల్యం కారణంగా ప్రమాదం చోటు చేసుకోగా, రావత్‌తో పాటు ఇద్దరు పైలట్లు, ఒక కల్నల్ సురక్షితంగా బయటపడ్డారు. ఆ ప్రమాదంలో జనరల్ రావత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. చదవండి: Tamilnadu Army Helicopter Crash: తునాతునకలైన హెలికాప్టర్.. ఫోటోలు, వీడియో దృశ్యాలు -
Bipin Rawat Wife Madhulika Dies: భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే
CDS Bipin Rawat Wife Madhulika All Need To Know Died In Helicopter Crash: ఓ వ్యక్తి తను ఎంచుకున్న రంగం.. విధి నిర్వహణలో విజయవంతంగా కొనసాగుతున్నారంటే అందులో జీవిత భాగస్వామి పాత్ర కచ్చితంగా ఉండే ఉంటుంది. భర్తకు భార్య.. భార్యకు భర్త చేదోడువాదోడుగా ఉంటే కుటుంబ జీవనం సాఫీగా సాగిపోతుంది. ఇటు వ్యక్తిగత.. అటు వృత్తిగత జీవితం సమతుల్యం చేసుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగితే చిక్కులు ఉండవు. భారత సీడీఎస్ బిపిన్ రావత్- ఆయన భార్య మధులిక రావత్ గురించి వింటే ఈ మాటలు అక్షరాలా నిజమనిపిస్తాయి. భారత దేశపు మొట్టమొదటి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్) బిపిన్ రావత్. ఈశాన్య రాష్ట్రాలతోపాటు పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగి ఆర్మీ చీఫ్ అయ్యారు. ఆ తర్వాత సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. సైన్యం, నావికా, వైమానిక దళాలను సమన్వయపరుస్తూ సైనిక సంబంధిత విషయాల్లో రక్షణమంత్రికి సలహాదారుగా వ్యవహరించడం సీడీఎస్ ప్రధాన బాధ్యత. మరి ఇంతటి కీలక హోదాలో ఉన్న వ్యక్తి తన కర్తవ్యాన్ని సజావుగా నిర్వహించాలంటే... కుటుంబం నుంచి సహకారం అవసరం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భార్య మధులిక రూపంలో ఆయనకు చక్కని తోడు ఉంది. ఈ జంట అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు రత్నాల్లాంటి కుమార్తెలు. తాను సైతం... భర్తకు తగ్గ భార్య ఆమె. రావత్ సీడీఎస్‌గా ఉంటే.. ఆయన సతీమణి మధులిక సైతం అమరవీర సైనికుల భార్యలకు అండగా నిలబడ్డారు. దేశంలోని అతిపెద్ద ఎన్జీవో ఏడబ్ల్యూడబ్ల్యూఏ(ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్) అధ్యక్షురాలు ఆమె. వీర నారీల(అమర సైనికుల భార్యలు), వారి పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. అంతేగాక విధి నిర్వహణలో వీర మరణం పొందిన సైనికులపై ఆధారపడిన ఇతర కుటుంబ సభ్యుల బాగోగులను కూడా ఈ ఎన్జీవో పర్యవేక్షిస్తుంది. సాధికారికతకై కృషి చేస్తూ.. వీర నారీల సాధికారికతకై మధులిక కృషి చేస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారికి ప్రోత్సాహం అందిస్తున్నారు. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులు, చాక్లెట్లు, కేకుల తయారీలో శిక్షణ ఇప్పిస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడేలా అండగా నిలుస్తున్నారు. అంతేగాక ఆరోగ్య అవగాహనా కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతున్నారు. ఆఖరి శ్వాస వరకు.. భర్త వెంటే.. సీడీఎస్‌గా ఎల్లప్పుడు బిజీగా ఉంటే బిపిన్ రావత్ తమిళనాడు పర్యటనకు వచ్చారు. వెల్లింగ్టన్లో జరిగే ఆర్మీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్( Mi-17V-5)లో బుధవారం బయల్దేరారు. అయితే, ఈ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన విషయం విదితమే. ఆ సమయంలో భర్తతో పాటు మధులిక కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తూ వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విషాదమేమిటంటే.. చివరి శ్వాస వరకు భర్త వెన్నంటే ఉండి.. ఆఖరి మజిలీలోనూ మధులిక ఆయన తోడు పంచుకున్నారు. మధులిక మరణం ఆమె కుటుంబ సభ్యులు, ఏడబ్ల్యూడబ్ల్యూఏకు మాత్రమే కాదు.. ఇతరులకు సాయం చేయాలనుకునే గొప్ప గుణాన్ని ఆరాధించగల ప్రతి ఒక్కరికి తీరని లోటు. చదవండి: Gen Bipin Rawat Chopper Crash: ‘హఠాత్తుగా పెద్ద శబ్దం.. వెళ్లి చూస్తే మంటలు చెలరేగుతూ..’ -
తునాతునకలైన హెలికాప్టర్.. ఫోటోలు, వీడియో దృశ్యాలు
చెన్నై: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో తమిళనాడులోని కోయంబత్తూరు ,కూనూరు మధ్య చోటు చేసుకుంది. హెలికాప్టర్ చెట్టుని ఢీకొట్టి మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సైన్యం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పాటు సహాయక చర్యలను ప్రారంభించింది. ( చదవండి: Gen Bipin Rawat Chopper Crash: ‘హఠాత్తుగా పెద్ద శబ్దం.. వెళ్లి చూస్తే ఆ ప్రాంతమంతా మృతదేహాలతో’.. ) -
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్: ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు
తమిళనాడు: భారత వైమానిక చర్రితలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ ఉన్నతాధికారి, సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంపై ఆర్మీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. హెలికాప్టర్ ప్రమాదంలో సిడిఎస్ బిపిన్ రావత్ మృతి చెందినట్లు ఇండియన్ ఎయిర్ పోర్స్ అధికారికంగా ప్రకటించింది. ఆయనతో పాటు మధులిక రావత్‌తో సహా 11 మంది మరణించినట్లు ప్రకటించింది.ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: బిపిన్ రావత్.. వాటితో ముప్పు అని చెప్పిన మరుసటి రోజే! కారణాలు ఏమై ఉండొచ్చు? సీడీఎస్ జనరల్ బీపీఎస్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయనే దానిపై నిపుణులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలిలా ఉన్నాయి. 1. వాతావరణం: ఎంఐ–17వి5 కూలిపోవడానికి అననుకూల వాతావరణమే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా వార్తలొచ్చాయి. ‘అన్నివేళలా ఇలాంటి దుర్ఘటనలకు వాతావరణమే ప్రధాన కారణంగా ఉంటుంది. పశ్చిమకనుమల్లో వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో ఊహించలేం’ అని ఈ హెలికాప్టర్ మాజీ పైలెట్ అమితాబ్ రంజన్ అన్నారు 2. విద్యుత్ తీగలు: మానవ ఆవాసాలకు సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది కాబట్టి విద్యుత్ తీగల్లో చిక్కుకుపోయి ఉండొచ్చనే ఊహాగానాలూ ఉన్నాయి. 3. సాంకేతిక లోపం: ‘ఈ ఛాపర్లు కొత్తవి కావు. పైలట్లు బాగా సుశిక్షితులు. బాగా అనుభవజ్ఞులు. వీవీఐపీలకు వీరిని కేటాయిస్తారు. అయితే పైలెట్ల తప్పిదమైనా అయ్యుండాలి లేదా సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగుండొచ్చు. ఈ దశలో ఇంతకన్నా ఏమీ చెప్పలేం. దర్యాప్తులో తేలాలి’ 4. ఏ ఎత్తులో దిగడం మొదలైందనేది ముఖ్యం ల్యాండింగ్‌కు సిద్ధమవుతూ ఎన్ని ఫీట్ల ఎత్తు నుంచి క్రమేపీ కిందకు దిగుతూ వచ్చిందనేది తెలియాలి. కొండప్రాంతం కాబట్టి ఎత్తు తగ్గింపులో ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బందే. దర్యాప్తులోనే ఇది తేలాలి. కాగా, ప్రమాదానికి వాతావరణం కానీ, సాంకేతిక లోపం కానీ కారణమై ఉండొచ్చని మాజీ ఎమ్ఐ-17 పైలెట్ అమితాబ్ రంజన్ అభిప్రాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం జరగడానికి కారణాలపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. -
బిపిన్ రావత్.. వాటితో ముప్పు అని చెప్పిన మరుసటి రోజే!
భారత దేశపు మొట్టమొదటి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారి బిపిన్ రావత్ బయో వార్ ముప్పు గురించి ప్రకటించిన మరుసటి రోజే హెలికాప్టర్ క్రాష్ ప్రమాదంలో చిక్కుకున్నారు. డిసెంబరు 20 నుంచి 22 వరకు పూనేలో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, ఇండియా) దేశాల కూటమి బిమ్స్టెక్ ఆధ్వర్యంలో విపత్తు నిర్వాహాణకు సంబంధించి పానెక్స్ 21 సదస్సు జరగనుంది. దీనికి కర్టెన్ రైజర్ కార్యక్రమం మంగళవారం న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో సీడీఎస్ బిపిన్ రావత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడిందన్నారు. కరోనా విపత్తు సమయంలో సాయుధ బలగాలు శ్రమించి పని చేశాయన్నారు. అయితే రాబోయే రోజుల్లో ప్రపంచానికి బయోవార్ ముప్పు ఉందనింటూ రావత్ హెచ్చరించారు. బయోవార్ ఇప్పుడిప్పుడే ఓ రూపు తీసుకుంటోందన్నారు. ఈ బయోవార్‌ని కలిసికట్టుగా ఎదుర్కొవాలంటూ బిమ్స్టెక్ దేశాలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం పరస్పర సహాకారం అందించుకోవాలని సూచించారు. ప్రమాదం పానెక్స్ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన తమిళనాడు పర్యటనకు వచ్చారు. భార్య, ఇతర ఆర్మీ అధికారులతో కలిసి హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా కూనురు దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు చనిపోయినట్టు అధికారులు ప్రకటించగా.. ఆర్మీ విచారణకు ఆదేశించింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత బిపిన్ రావత్, ఆయన భార్య ఆచూకీ లభించలేదు. అధికారులు ఈ విషయంపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో దేశవ్యాప్తంగా బిపిన్ రావత్ తాజా పరిస్థితిపై ఆందోళన నెలకొంది. చివరకు సాయంత్రం 6 గంటల సమయంలో బిపిన్ రావత్ చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరఖండ్ నుంచి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఉన్న బిపిన్ రావత్ ఉత్తర్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారు. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ ఆర్మీలో పని చేసి లెఫ్టినెంట్ జనరల్ హోదాలో రిటైర్ అయ్యారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా ఆయన ఆర్మీలోకి వచ్చారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియన్ ఆర్మీ చీఫ్ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా త్రివిధ దళలాకు అధిపతిగా 2020 జనవరి 1న పదవీ బాధ్యలు స్వీకరించారు. చదవండి: కుప్పకూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్, 11 మంది మృతి -
IAF Helicopter Crash: ‘హఠాత్తుగా పెద్ద శబ్దం.. వెళ్లి చూస్తే మంటలు చెలరేగుతూ..’
భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ బుధవారం కుప్పకూలింది. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన హెలికాఫ్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఉన్నట్టు భారతీయ వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ప్రమాద స్థలాన్ని మొదట చూసిన ప్రత్యక్ష సాక్షి కృష్ణస్వామి కథనం ప్రకారం.. ఆ పరిసరాల్లో తాను ఉండగా హఠాత్తుగా పెద్ద శబ్దం వచ్చిందని, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి శబ్దం విన్న ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపాడు. అక్కడ చూడగా.. ఓ చాపర్ చెట్టును ఢీ కొట్టి, మంటలు చెలరేగాయని తెలిపాడు. అదే క్రమంలో హెలికాప్టర్ మరో చెట్టును ఢీ కొట్టడం కళ్లారా చూశానని తెలిపాడు. ఈ ఘటనలో హెలికాప్టర్ నుంచి అనేక మృతదేహాలు పడిపోవడం తాను చూశానని అతను చెప్పాడు. ఏం జరుగుతుందో అర్థంకాక తాను ఇరుగుపొరుగు వారితో పాటు అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపాడు. కాగా, ప్రమాదం జరిగిన హెలీకాప్టర్‌లో మొత్తం 14మంది ప్రయాణిస్తున్నారని తెలిసింది. Krishnaswamy was the first eyewitness at the crash site. 'Heard a loud noise & that's when I saw the copter approaching. As it was descending, it caught on fire. It crashed into a big tree & was immediately engulfed in smoke. Then the entire chopper caught on fire.'@TheQuint pic.twitter.com/HMP4LEH396 — Smitha T K (@smitha_tk) December 8, 2021 చదవండి: TN Army Helicopter Crash: బ్రేకింగ్ న్యూస్: కుప్పకూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్, 11 మంది మృతి -
హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి
Live Updates: 06:10 PM హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి చెందినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. With deep regret, it has now been ascertained that Gen Bipin Rawat, Mrs Madhulika Rawat and 11 other persons on board have died in the unfortunate accident. — Indian Air Force (@IAF_MCC) December 8, 2021 05:45 PM రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్ని పర్యటనలు రద్దు చేసుకున్నారు. మహారాష్ట్రలోని కొత్త దర్బార్ హాల్‌ను ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి హాజరుకావాల్సి ఉంది. ప్రస్థుత పరిస్థితుల దృష్ట్యా పర్యటనను రద్ధు చేసుకున్నట్లు సమాచారం. 05:18 PM ►సాయంత్రం 6.30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహరాల కేబినెట్ కమిటీ భేటీ జరగనుంది. ప్రధాని మోడీ నివాసంలో సిసిఎస్ సమావేశం జరగనుంది. 05:03 PM హెలికాప్టర్లో 14 మంది ప్రయాణం చేస్తుండగా, 13 మంది మృతిచెందారు. ప్రమాదంలో రావత్ భార్య మధులిక కన్నుమూశారు. సీడీఎస్ బీపీన్ రావత్ గాయాలతో బయటపడ్డారు. హుటాహుటిన రావత్‌ను ఆసుపత్రికి తరలించారు. వెల్లింగ్టన్ ఆర్మీ ఆసుపత్రిలో రావత్‌కు చికిత్స అందిస్తున్నారు. 04:50 PM ►బిపిన్ రావత్‌కు అత్యవసర చికిత్స 04:20 PM ►సూలూరు ఎయిర్‌బేస్‌కు బయల్దేరిన ఎయిర్ చీఫ్ మార్షల్ ►కాసేపట్లో సూలూరు ఎయిర్‌బేస్‌కు ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి 04:10PM ►హెలికాప్టర్ ప్రమాదంపై గురువారం పార్లమెంట్లో ప్రకటన ►ప్రమాద ఘటనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న రక్షణ శాఖ మంత్రి 03:50PM సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలడంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. తనకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం బిపిన్‌రావత్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనపై మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 03:44PM ►బిపిన్‌రావత్ ఇంటికి కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ 03:34PM ►ప్రమాదానికి వాతావరణం కానీ, సాంకేతిక లోపం కానీ కారణమై ఉండొచ్చని ఎక్స్ ఎమ్ఐ-17 పైలెట్ అమితాబ్ రంజన్ అన్నారు. 03:25PM హెలికాప్టర్ ప్రమాదంపై సందేహాలు.. 1. ప్రతికూల వాతావరణమా? 2. సాంకేతిక లోపలా..? 3. హెలికాప్టర్ విద్యుత్ తీగలకు తాకిందా..? 4. తక్కువ ఎత్తులో ప్రయాణించిందా..? 5. విజిబులిటీ లేకపోవడమా..? 03:20PM ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. పెద్ద శబ్దాలు వినిపించడంతో ఏం జరిగిందో చూడటానికి ఇంటి నుంచి బయటకు రాగా ఛాపర్ చెట్టును ఢీ కొంటూ, మంటలు చెలరేగడం, మరో ముగ్గురుని ఢీ కొట్టడం కళ్లారా చూశాను. వెంటనే ఇరుగుపొరుగువారికి, అధికారులకు సమాచారం అందించాను. ప్రమాద సమయంలో హెలికాప్టర్ నుంచి అనేక మృతదేహాలు పడటం చూశాను. 03:15PM ►కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సమావేశం అనంతరం ఘటనాస్థలికి వెళ్లనున్న రాజ్‌నాథ్ 03:05PM వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలిపోయింది. ప్రమాదానికి గురైన హెలీకాప్టర్‌లో సీడీఎస్ బిపిన్‌రావత్‌తో సహా ఆయన భార్య మధులిక, మరికొందరు కుటుంబసభ్యులు, సీడీఎస్ సిబ్బంది ఉన్నట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన సహాయ సిబ్బంది ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. మిగతా 11 మంది దుర్మరణం పాలైనట్టు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. హెలికాప్టర్ సామర్థ్యం 24 మంది. 02:53PM తమిళనాడు సీఎం ఆరా.. హెలికాప్టర్ ప్రమాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరా తీశారు. సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 02:23PM కేబినెట్ భేటీ.. బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైందన్న విషయం తెలిసిన వెంటనే కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ అయ్యింది. 02:04PM ప్రధాని సమీక్ష.. హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రమాద వివరాలను మోదీకి వివరించారు. స్పందించారు. రాజ్‌నాథ్ సింగ్ ప్రమాదం గురించి పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు. Tamil Nadu Army Helicopter Crash Telugu Live Updates: తమిళనాడులో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఐఏఎఫ్ ఎంఐ-17 హెలికాప్టర్ కూనూరు వద్ద అటవీ ప్రాంతంలో కుప్ప కూలింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సైన్యం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో మొత్తం 14 మంది ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో బిపిన్ రావత్, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. కాగా, భారత వాయుసేన ప్రమాదాన్ని అధికారంగా ధ్రువీకరించింది. విచారణకు ఆదేశించింది. -
కుప్పకూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్, 13 మంది మృతి
Tamil Nadu Army Helicopter Crash Video: బుధవారం తమిళనాడు కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందారు. 2019లో ఆయన సీడీఎస్‌గా నియమితులయ్యారు. డిఫెన్స్ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్(డీడబ్లు్యడబ్ల్యయే) అధ్యక్షురాలిగా మధులిక సేవలనందిస్తున్నారు. రావత్ మరణాన్ని భారత వైమానిక శాఖ(ఐఏఎఫ్) నిర్ధారించింది. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో పయనిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది. ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే బతికి బయటపడ్డారని, ప్రస్తుతం వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని తెలిపింది. మరణించినవారిలో ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారు. గురువారం ఉదయం వెల్లింగ్టన్లో మృతులకు నివాళి అర్పించిన అనంతరం వారి అవశేషాలను కోయంబత్తూర్ నుంచి ఢిల్లీకి వాయుమార్గంలో తీసుకుపోనున్నట్లు పోలీసు, రక్షణవర్గాలు తెలిపాయి. శుక్రవారం వీరికి ఢిల్లీ కంటోన్మెంట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ‘‘ దుర్ఘటనలో రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ సహా 11 మంది మరణించారని తెలిపేందుకు విచారిస్తున్నాం’’ అని వైమానిక శాఖ ట్వీట్ చేసింది. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో ప్రసంగించేందుకు రావత్ రావాల్సిఉంది. ఇదే కాలేజీలో రావత్ గతంలో విద్యాభ్యాసం చేశారు. చదువుకున్న చోటికి వెళ్తూ మృత్యు ఒడిలోకి రావత్ చేరటం విధివైపరీత్యం. ప్రమాదంలో బతికిబయటపడ్డ వరుణ్ సింగ్ ఈ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. (చదవండి: త్రివిధ దళాలకు డీఆర్డీఓ వ్యవస్థలు) మృతుల్లో రావత్, మధులికతో పాటు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కే సింగ్, నాయక్ గురుసేవక్‌సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్‌నాయక్ వివేక్, లాన్స్ నాయక్ బీ సాయితేజ, హవల్దార్ సత్పాల్, జేడబ్ల్యయో దాస్, ప్రదీప్ ఉన్నారని అధికారులు చెప్పారు. వీరిలో సాయితేజ ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందినవారు. బిపిన్‌కు భద్రతాధికారిగా పనిచేస్తున్నారు. బిపిన్ మరణంతో సైనిక దళాలు తీవ్ర విచారంలో మునిగిపోయాయి. ఆయన వ్యూహాలను, సామర్థ్యాన్ని గుర్తు చేసుకున్నాయి. 2016–2019 కాలంలో ఆయన ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. అనంతరం రక్షణబలగాల ఉమ్మడి అధిపతిగా నియమితులయ్యారు. రావత్ మరణంపై ఆర్మీ చీఫ్ నరవణె, తదితర ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. రావత్ నాయకత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆర్మీ ట్వీట్ చేసింది. సీసీఎస్ అత్యవసర సమావేశం రావత్ ప్రయాణిస్తున్న ఛాపర్ క్రాష్ అయిందన్న వార్త నేపథ్యంలో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) సమావేశమైంది. ఇందులో ప్రధాని, రక్షణ; హోం, ఆర్థిక, విదేశాంగ మంత్రులతో పాటు కేబినెట్ సెక్రటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. సీసీఎస్ సభ్యులతో పాటు కేబినెట్ సభ్యులు రావత్ మరణంపై సంతాపాన్ని తెలియజేశారు. కొత్త సీడీఎస్‌గా ఎవరినైనా నియమిస్తారా? లేదా? అన్న విషయమై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రమాద వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, ప్రధాని మోదీకి వివరించారు. ఐఏఎఫ్ చీఫ్‌ను సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. తదనంతరం రాజ్‌నాధ్ ఢిల్లీలోని రావత్ నివాసానికి వెళ్లి రావత్ కుమార్తెను పరామర్శించారు. రావత్ గొప్ప సైనికుడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రావత్ మరణంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాద సంఘటనపై శుక్రవారం రాజ్‌నాధ్ పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు. (చదవండి: కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం) ఇలా జరిగింది... ►ఢిల్లీ పాలం విమానాశ్రయం నుంచి రావత్ తదితరులు బుధవారం ఉదయం 9గంటలకు బయలుదేరారు. ►ఉదయం 11.34 గంటలకు కోయంబత్తూర్ సమీపంలోని సూలూర్ ఎయిర్‌బేస్‌కు చేరారు. ►11.45 గంటలకు రావత్ తదితరులు ప్రయాణిస్తున్న ఛాపర్ సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయింది. 45 నిమిషాల్లో వెల్లింగ్టన్లోని స్టాఫ్‌కాలేజీకి చేరాల్సిఉంది. ►మధ్యాహ్నం సుమారు 12.20 గంటలప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలియగానే ప్రమాదస్థలానికి 8 అంబులెన్సులు, వైద్య బృందాలు చేరుకున్నాయి. ►నీలగిరి జిల్లాలోని కట్టెరి– నాన్చపంచత్రం ప్రాంతంలో ఛాపర్ కూలిపోయింది. స్థానికులు తొలుత ఈ ప్రమాదాన్ని గుర్తించారు. ►పొగమంచు వాతావరణంలో ఛాపర్ బాగా కిందకు వచ్చిందని, కూనూర్ సమీపంలోని ఒక లోయలో కూలిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ►ఘటనా స్థలికి చేరేటప్పటికే మంటలు ఛాపర్‌ను ఆక్రమించాయని తెలిపారు. ►కూలిపోయే సమయంలో ఒక ఇంటిని హెలికాప్టర్ గుద్దుకుంది. కానీ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ►ఛాపర్ నుంచి ఇద్దరు వ్యక్తులు పడిపోయారని ప్రత్యక్ష సాక్షి పెరుమాళ్ చెప్పారు. ప్రమాద ప్రాంతంలోని చెట్లు ధ్వంసం అయ్యాయి. ►ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు స్థానికులు యత్నించినా ఉపయోగం లేకపోయింది. ►ప్రమాద స్థలంలో భారీగా మంటలు చెలరేగాయి, పరిసరాల్లోని చెట్లుచేమా తగలబడ్డాయి. వీటిని ఆర్పేందుకు అక్కడివారు యత్నించారు. ►మంటలు అదుపులోకి వచ్చాక చూస్తే ప్రయాణీకులు మరణించినట్లు తెలిసింది. ►గుర్తు తెలియని విధంగా దేహాలు కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టులు నిర్వహించి మృతులను నిర్ధారించారు. ►మధ్యాహ్నం 1.53 గంటలకు రావత్ మరణాన్ని ఐఏఎఫ్ అధికారికంగా ధృవీకరించింది. ►సాయంత్రం 6.03 గంటలకు మరణవార్తను ఐఏఎఫ్ ప్రకటించింది. ఉలిక్కిపడ్డ పశ్చిమ కనుమలు ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రావత్ పయనిస్తున్న హెలికాప్టర్ కూలిన దుర్ఘటనతో పశ్చిమ కనుమలు ఉలిక్కిపడ్డాయి. నీలగిరి జిల్లాలోని తేయాకు తోటల్లోని కార్మికులు తొలిసారి ఈ దుర్ఘటనను గుర్తించారు. ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద ధ్వని వినిపించడాన్ని గమనించారు. చప్పుళ్లు ఏదో ప్రమాదానికి సంకేతమని గుర్తించి వెంటనే సంఘటనా స్థలాన్ని వెతుకుతూ వెళ్లారు. అప్పటికింకా ఆ ప్రాంతంలో కొంత పొగమంచు ఉంది. అక్కడకు వెళ్లాక భగభగలాడే మంటలు, లోహవస్తువులు విరిగిపోతున్న ధ్వనులను గుర్తించి నివ్వెరపోయారు. ప్రమాదం జరిగిందని స్థానికులు సాయం చేసేందుకు తయారయ్యారు. పెద్ద మంటల కారణంగా సంఘటన స్థలం దగ్గరకు పోలేకపోయారు. దాదాపు అరగంట పాటు మంటలు చెలరేగుతూనే ఉన్నాయని సాక్షులు చెప్పారు. -
Army Helicopter Crash: హెలికాప్టర్ ప్రమాదం.. ఇద్దరు పైలెట్లు మృతి
-
కుప్పకూలిన హెలికాప్టర్: ఏడుగురు గల్లంతు
మాస్కో: రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఎంఐ-8 హెలికాప్టర్ గురువారం తెల్లవారుజామున కూలిపోయింది. ఇందులో 13 మంది ప్రయాణీకులతోపాటు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. తొమ్మిది మందిని రక్షించినట్టుఅ ధికారులు ప్రకటించారు. గల్లంతైన వారి కోసం రక్షక దళాలు గాలిస్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. తూర్పు ప్రాంతంలోని కమ్చట్కాలో ద్వీపకల్పంలోని కురిల్ సరస్సులో హెలికాప్టర్ కూలినట్లు అధికారులు వెల్లడించారు. ఇది సెయింట్ పీటర్స్బర్గ్ నుండి పర్యాటకులను తీసుకువెళుతోందని స్టేట్ న్యూస్ ఏజెన్సీ ఆర్ఐఏ నివేదించింది. ముగ్గురు సిబ్బందితోపాటు స్థానిక పర్యాటకులు ఇందులో ప్రయాణిస్తున్నారన్నారు. రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు కొనసాగుతోందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా కమ్చట్కా చాలా తక్కువ మంది జనాభా నివసించే పెద్ద భూభాగం. కానీ అగ్నిపర్వతాలు, రమణీయమైన ప్రకృతి దృశ్యాలతో నిండిన ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కడతారు. -
కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలో హెలికాప్టర్ కూలిపోయిన ఘటన విషాదాన్నినింపింది. మారుమూల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేఎస్టీవీ స్టేషన్ డిపార్ట్మెంట్ ధ్రువీకరించింది. ది రాబిన్సన్ ఆర్66 అనే హెలికాప్టర్ ఆదివారం మధ్యాహ్నం 1.15 సమయంలో శాక్రమెంటోకు ఉత్తరాన కొలూసా కౌంటీలో ప్రాంతంలో కుప్పకూలింది. ఈ మేరకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించిన విషయాన్ని ధృవీకరించినప్పటికీ, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు వ్యక్తులు చనిపోయినట్టుగా తెలుస్తోందని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డులు ప్రకటించాయి. -
క్యూబాలో కూలిన హెలికాప్టర్.. ఐదుగురి దుర్మరణం
హవానా: గగనతలంలో ఇటీవల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న ఇండినేషియాలో భారీ విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా క్యూబా దేశంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారని ఆ దేశ మీడియా ప్రకటించింది. అయితే మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. క్యూబాలోని ఉత్తర దిశలో హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి శుక్రవారం తెల్లవారుజామున (జనవరి 29) హెలికాప్టర్ బయల్దేరింది. అయితే మార్గమధ్యలో ఒక కొండపై అకస్మాత్తుగా హెలికాప్టర్ కూలిపోయిందని ఆ దేశ సాయుధ దళాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు కన్నుమూశారని తెలిపింది. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. వివరాలు సేకరించి దర్యాప్తుకు ఆదేశించారు. ఈ దేశంలో 2018లో భారీ విమాన ప్రమాదం జరిగింది. దేశ రాజధాని హవానా విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘటనలో ఏకంగా 112 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
సముద్రంలో కుప్పకూలిన మిలిటరీ విమానం
టొరంటో : కెనడాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్ సముద్రంలో కుప్పకూలింది. నాటో టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా ప్రయాణించిన హెలికాప్టరు గ్రీస్ లోని లోనియన్ సముద్రతీరంలో కుప్పకూలిందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడీ వెల్లడించారు. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురు గల్లంతు ఆయ్యారని తెలిపారు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, వారంతా క్షేమంగా భయటపడాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని మెరైన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ ఆఫీసర్ సబ్ లెఫ్టినెంట్ అబ్బిగైల్ కోబ్రౌగా గుర్తించినట్లు పేర్కొన్నారు. (కెనడాలో కాల్పులు.. 16 మంది మృతి) ఘటనపై కోబ్రౌ తల్లి మాట్లాడుతూ..నా అందమైన గారాలపట్టి నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అంటూ వాపోయింది. హెలికాప్టరులో రాయల్ కెనడియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన నలుగురు సభ్యులతో పాటు మరో ఇద్దరు సెన్సార్ ఆపరేటర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరి కుటుంబాలకు ప్రాథమికంగా సమాచారం అందించామని, అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. (కెనడా ప్రధాని.. వర్క్ ఫ్రమ్ హోమ్ ) -
విషాదం.. మాటలు రావడం లేదు: కోబీ భార్య
లాస్ ఏంజెల్స్: తన భర్త, కూతురి దుర్మరణం తమ కుటుంబాన్ని అగాథంలోకి నెట్టివేసిందని బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రియాంట్ భార్య వెనెస్సా బ్రియాంట్ భావోద్వేగానికి గురయ్యారు. వాళ్లిద్దరూ లేని లోటు ఎవరూ పూడ్చలేరని.. ఈ విషాదం గురించి వర్ణించడానికి మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషాదకర సమయంలో తమకు తోడుగా ఉన్న లక్షలాది మందికి ధన్యవాదాలు తెలిపారు. ‘బ్లాక్ మాంబా’గా సుపరిచితమైన బాస్కెట్ బాల్ లెజెండ్ కోబీ బ్రయాంట్, కూతురు జియానా(13) సహా మరో ఏడుగురు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం విదితమే. ఆదివారం కాలిఫోర్నియా సమీపంలోని క్యాలాబసస్ వద్ద జరిగిన ఈ దుర్ఘటన యావత్ క్రీడా ప్రపంచాన్ని దుఃఖ సాగరంలో ముంచివేసింది. ఈ నేపథ్యంలో కోబీ మరణం తర్వాత తొలిసారిగా ఆయన భార్య వెనెస్సా గురువారం సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకున్నారు. ‘‘నా ప్రియమైన భర్త కోబీ... అద్భుతమైన తండ్రి... నా అందమైన, అద్భుతమైన, చలాకీదైన చిన్నారి జియానా- నా కూతురు, నటాలియా, బియాంక, కాప్రీల సోదరి.. వాళ్లిద్దరినీ కోల్పోవడంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కోబీ, గిగీ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాం అయినా వాళ్లు ఎల్లప్పుడూ మాతోనే ఉన్నట్లుగా భావిస్తాం.(దిగ్గజం విషాదాంతం) నేను వాళ్లిద్దరినీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవాలి.. వారి తలపై ప్రేమగా ముద్దు పెట్టాలి అని ఆకాంక్షిస్తున్నాను. వాళ్లు మాతోనే ఉంటారు. ఈ ప్రమాదంలో నా భర్త, కూతురితో పాటు చనిపోయిన మిగతా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి ముంబా స్పోర్ట్స్ ఫౌండేషన్ తరఫున సహాయం అందజేస్తాం’’ అంటూ భావోద్వేగ పోస్టు పెట్టారు. కాగా కోబీ- వెనెస్సా(డ్యాన్సర్)లు 2001లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు నలుగురు ఆడ పిల్లలు.. నటాలియా (17 ఏళ్లు), జియానా (13 ఏళ్లు), బియాంకా (3 ఏళ్లు), క్యాప్రి (7 నెలలు) ఉన్నారు. ఇక సుమారు రెండు దశాబ్దాల పాటు (1996-2016) తన మెరుపు విన్యాసంతో మైదానంలో పాదరసంలా కదిలిన బ్రయాంట్.. తన కూతురు జియానాను సైతం అద్భుతమైన క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని భావించాడు. మాంబా స్పోర్ట్స్ అకాడమీలో జియానాకు బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఉండటంతో అందులో పాల్గొనడానికి హెలికాప్టర్లో వెళ్తుండగా ఇద్దరూ మృత్యువాత పడ్డారు.(కనుమరుగైన ‘బ్లాక్ మాంబా’) View this post on Instagram My girls and I want to thank the millions of people who’ve shown support and love during this horrific time. Thank you for all the prayers. We definitely need them. We are completely devastated by the sudden loss of my adoring husband, Kobe — the amazing father of our children; and my beautiful, sweet Gianna — a loving, thoughtful, and wonderful daughter, and amazing sister to Natalia, Bianka, and Capri. We are also devastated for the families who lost their loved ones on Sunday, and we share in their grief intimately. There aren’t enough words to describe our pain right now. I take comfort in knowing that Kobe and Gigi both knew that they were so deeply loved. We were so incredibly blessed to have them in our lives. I wish they were here with us forever. They were our beautiful blessings taken from us too soon. I’m not sure what our lives hold beyond today, and it’s impossible to imagine life without them. But we wake up each day, trying to keep pushing because Kobe, and our baby girl, Gigi, are shining on us to light the way. Our love for them is endless — and that’s to say, immeasurable. I just wish I could hug them, kiss them and bless them. Have them here with us, forever. Thank you for sharing your joy, your grief and your support with us. We ask that you grant us the respect and privacy we will need to navigate this new reality. To honor our Team Mamba family, the Mamba Sports Foundation has set up the MambaOnThree Fund to help support the other families affected by this tragedy. To donate, please go to MambaOnThree.org. To further Kobe and Gianna’s legacy in youth sports, please visit MambaSportsFoundation.org. Thank you so much for lifting us up in your prayers, and for loving Kobe, Gigi, Natalia, Bianka, Capri and me. #Mamba #Mambacita #GirlsDad #DaddysGirls #Family ❤️ A post shared by Vanessa Bryant 🦋 (@vanessabryant) on Jan 29, 2020 at 4:59pm PST -
దిగ్గజం విషాదాంతం
చాంపియన్ ప్లేయర్... ఒలింపిక్స్ గోల్డెన్ స్టార్... ఆస్కార్ అవార్డ్ విన్నర్... బాస్కెట్ బాల్ లెజెండ్ కోబీ బ్రయాంట్ జీవన ప్రయాణం విషాదాంతమైంది. హెలికాప్టర్ ప్రమాదంలో ఈ అమెరికన్ సూపర్‌స్టార్ దుర్మరణం పాలయ్యాడు. అతనితో పాటు 13 ఏళ్ల కుమార్తె జియానా కూడా మరణించడం అభిమానుల్ని తీవ్రంగా కలచివేసింది. క్రీడాలోకాన్ని కన్నీట ముంచిన ఈ పిడుగులాంటి వార్తపై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్ఏంజిల్స్: అమెరికాను... ఎన్బీఏనే కాదు... యావత్ క్రీడా ప్రపంచాన్నే దుఃఖ సాగరంలో ముంచేసే వార్త ఇది. 41 ఏళ్ల బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్ భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. పైలట్, బ్రయాంట్ సహా 9 మందితో లాస్ ఏంజిల్స్ నుంచి బయలుదేరిన సికోర్‌స్కై ఎస్–76 హెలికాప్టర్ కాలిఫోర్నియా సమీపంలోని క్యాలాబసస్ కొండను ఢీకొట్టింది. వెంటనే అది పేలడంతో ప్రయాణిస్తున్న వారంతా దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో బ్రయాంట్ టీనేజ్ కుమార్తె 13 ఏళ్ల జియానా కూడా ఉంది. మాంబా స్పోర్ట్స్ అకాడమీలో తన కూతురు జియానా బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఉండటంతో అందులో పాల్గొనడానికి కోబీ హెలికాప్టర్లో బయలుదేరాడు. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మారుమూల కొండప్రాంతంలో పెను ప్రమాదానికి గురైంది. ఈ విషాదవార్త అమెరికాను శోకసంద్రంలో ముంచేసింది. అక్కడి ఆకాశహర్మ్యాలు బ్రయాంట్ జెర్సీ రంగు లైట్లతో సంతాపసూచకంగా వెలిగాయి. కోబీ బ్రయాంట్ మ్యాచ్‌లు ఆడే సమయంలో 8 లేదంటే 24 నంబర్లతో కూడిన పర్పుల్, గోల్డ్, వైట్ కలర్ జెర్సీలను ధరించేవాడు. ఎత్తయిన టవర్స్ ఈ రంగు లైట్లతో నివాళి ప్రకటించగా... చాలా మంది అమెరికన్లు, బాస్కెట్‌బాల్ అభిమానులు వీధుల్లో గుమిగూడి పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు. ఓ దిగ్గజం విషాదాంతంపై అందరూ శోకతప్త హృదయంతో స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) దాకా... క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్, టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అందరూ బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్ మరణాన్ని జీర్ణించుకోలేక బరువెక్కిన గుండెలతో సంతాపం ప్రకటించారు. ఎవరీ బ్రయాంట్... ఏమిటీ ఫాలోయింగ్ క్రికెట్ కిక్‌లోనే ఉండే మనకు బ్రయాంట్ ఎవరో తెలియకపోవచ్చు. కానీ ఎన్బీఏ వైపు ఏ కాస్తో కూస్తో కన్నేసిన వారందరికీ బ్రయాంట్ సుపరిచితుడు. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) పోటీలను అమెరికాలో ఇష్టపడని వారుండరు. అందరూ మనసు పడే ఆ ఆటలో రెండు దశాబ్దాల పాటు (1996–2016) తన మెరుపు విన్యాసంతో ఆకట్టుకున్నాడు బ్రయాంట్. కోర్టులో అతని పాదరసంలాంటి కదలికలు గమనించినా... బాస్కెట్లో అలవోకగా బంతిని పడేయడం చూసినా... ఎవరికైనా అనిపించేదొక్కటే... ఈ ఆజానుబాహుడు బాస్కెట్‌బాల్ కోసమే పుట్టాడా అని! నిజమే ప్రతిష్టాత్మక ఎన్బీఏలో ఆ దిగ్గజ స్టార్ ప్రదర్శన అలా ఉంటుంది మరి! అన్నట్లు అతనేమీ పైచదువులు చదవనేలేదు. పాఠశాల విద్యతోనే పుస్తకాలతో కుస్తీ ముగిసింది. కానీ బాస్కెట్‌బాల్‌తో దోస్తీ మొదలయ్యాక పైపైకి... ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. స్కూల్ చదువు ముగిసిన వెంటనే 1996లో ఎన్బీఏలో చేరాడు. కూతురు జియానాతో... 8, 24 జెర్సీల విలాపం అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో 1978, ఆగస్టు 23న జన్మించిన బ్రయాంట్ హైస్కూల్ చదువు ముగియగానే 18 ఏళ్ల వయసులో నేరుగా ఎన్బీఏలో చేరాడు. అలా 1996లో ‘లాస్ఏంజిల్స్ లేకర్స్’ జట్టుకు ఆడటం మొదలుపెట్టిన ఈ ‘బ్లాక్ మాంబా’ (కోబీ ముద్దుపేరు) ఆఖరిదాకా ఆ ఫ్రాంచైజీని వీడలేదు. ఎవరెన్ని మిలియన్ డాలర్లతో ఆఫర్లు ఇచ్చినా... లేకర్స్ తరఫునే తన కెరీర్ ఆసాంతం ఆడటం విశేషం. కోబీ ‘షూటింగ్ గార్డ్’ స్థానంలో 8 లేదంటే 24వ జెర్సీ నంబర్లతో బరిలోకి దిగేవాడు. తన విజయవంతమైన 20 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘన తలు, రికార్డులు సాధించాక 2016లో గుడ్‌బై చెప్పాడు. ►సుదీర్ఘ కెరీర్లో కోబీ 33,643 పాయింట్లు చేయడం విశేషం. ఎన్బీఏలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్లలో టాప్–5 (నాలుగో)లో నిలిచాడు. ఒక్క మ్యాచ్‌లోనే 81 పాయింట్లు సాధించిన రికార్డు బ్రయాంట్ది. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తుండే ఈ ఆజానుబాహుడు కోర్టులో బంతినందుకుంటే మాత్రం స్కోర్ చేయకుండా ఉండడు. ఎన్బీఏలో తన లేకర్స్ జట్టును ఐదుసార్లు (2000, 2001, 2002, 2009, 2010) చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. 2008లో ‘అత్యంత విలువైన ఆటగాడు’గా అవార్డు అందుకున్న బ్రయాంట్ 18 సార్లు ఎన్బీఏ ఆల్‌స్టార్స్ జట్టు సభ్యుడిగా ఎంపికయ్యాడు. 2000 నుంచి 2016 వరకు వరుసగా 17 సార్లు ఈ ఘనతకెక్కాడు. ►తన దేశం ‘టీమ్ అమెరికా’కు 2007 నుంచి 2012 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలోనే బీజింగ్ (2008), లండన్ (2012) ఒలింపిక్స్ల్లో అమెరికా జట్టు బంగారు పతకం గెలుపొందడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంతటి ఘనచరిత్రను లిఖించుకున్న బ్రయాంట్‌కు గౌరవసూచకంగా లాస్ఏంజిల్స్ లేకర్స్ జట్టు 8, 24 నంబర్ జెర్సీలకు 2017లో రిటైర్మెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు ఆ రెండు జెర్సీలకు ప్రాణముంటే గనక తమ ప్రియమైన ఆటగాడి మరణాన్ని జీర్ణించుకోలేక విలపించేవేమో! ►కోబీ బ్రయాంట్ది ప్రేమ వివాహం. 2001లో డ్యాన్సర్ వానెస్సా లైన్‌ను కోబీ వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు ఆడ పిల్లలు. నటాలియా (17 ఏళ్లు), జియానా (13 ఏళ్లు), బియాంకా (3 ఏళ్లు), క్యాప్రి (7 నెలలు). హెలికాప్టర్ ప్రమాదంలో రెండో అమ్మాయి జియానా మృతి చెందింది. ►2016లో బాస్కెట్‌బాల్‌కు వీడ్కోలు పలికాక కోబీ బ్రయాంట్ పలు వ్యాపారాలు మొదలుపెట్టాడు. 2018లో ‘డియర్ బాస్కెట్‌బాల్’ పేరుతో కోబీ బ్రయాంట్ నిర్మించిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌కు ఆస్కార్ అవార్డు కూడా లభించడం విశేషం. కోబీ గ్రేటెస్ట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్. అతనితో పాటు టీనేజ్ కుమార్తె మృతి చెందారనే భయంకరమైన వార్త నన్ను విషాదంలో ముంచింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, తన కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని ప్రార్థిస్తున్నా. –అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాస్కెట్‌బాల్ కోర్టులో బ్రయాంట్ ఓ లెజెండ్. ప్రమాదంలో అతని కూతురు కూడా మరణించడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. –అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా బ్రయాంట్ నాకు సోదరుడితో సమానం. అలాంటివాడు ఇలా ఆకస్మికంగా మృతిచెందాడనే వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. –బాస్కెట్‌బాల్ లెజెండ్ జోర్డాన్ నేను లేకర్స్‌కు వీరాభిమానిని. బ్రయాంట్ వల్లే ఎన్బీఏలో లేకర్స్ చారిత్రక విజయాలెన్నో సాధించింది. శారీరకంగా, మానసికంగా ఎంతో బలమైన ఆటగాడు కోబీ. అలాంటి ప్లేయర్ ఇలా మనకు ఆకస్మికంగా దూరమవడం బాధాకరం. –విఖ్యాత గోల్ఫర్ టైగర్ వుడ్స్ కోబీ, అతని కుమార్తె జియానా మరణించారనే విషాద వార్త నన్ను తీవ్రంగా బాధించింది. అతని కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. –సచిన్ నేను ఉదయాన్నే లేచి ఎన్నోసార్లు కోబీ బ్రయాంట్ మ్యాచ్‌లను చూశాను. అతని మరణవార్తతో దిగ్భ్రాంతికి గురయ్యా. ఆ ప్రమాదంలో అతని కుమార్తె కూడా మృతి చెందడంతో నా గుండె పగిలింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలి. దేవుడు వారి కుటుంబానికి ధైర్యమివ్వాలి. –విరాట్ కోహ్లి బ్రయాంట్ నా ఫేవరెట్. కుమార్తెతో సహా అతను మరణించాడనే వార్తతో నేను షాక్‌కు గురయ్యాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. –తెలంగాణ మంత్రి కేటీఆర్ -
బ్రియాంట్ చివరి ట్వీట్ ఇదే..
కాలిఫోర్నియా: అమెరికన్ నేషనల్ బాస్కెట్ బాల్ చరిత్రలో టాప్ స్కోరర్లలో ఒకడిగా ఉన్న కోబ్ బ్రియాంట్ హెలికాప్టర్ ప్రమాదంలో అకాలమరణం చెందడం ప్రతీ ఒక్కర్నీ తీవ్రంగా కలచివేసింది. 2008, 2012 ఒలింపిక్స్ల్లో అమెరికాకు స్వర్ణ పతకాలు సాధించడంలో బ్రియాంట్‌ది కీలకపాత్ర. 2016లో బాస్కెట్‌బాల్ నుంచి వీడ్కోలు తీసుకున్న బ్రియాంట్.. అమెరికా నేషనల్ బాల్ అసోసియేషన్(ఎన్బీఏ) ప్రొఫెషనల్ లీగ్‌లో తన కెరీర్ మొత్తం లాస్ ఏంజెల్స్ లేకర్స్ కే ఆడాడు. (ఇక్కడ చదవండి: ఆ వార్త వినడం దురదృష్టకరం: కోహ్లి) ఈ లీగ్‌లో అత్యధిక స్కోర్ చేసిన జాబితాలో బ్రియాంట్ మూడో స్థానంలో ఉండగా అతన్ని తాజాగా లీబ్రాన్ జేమ్స్ అధిగమించాడు. దీనిపై జేమ్స్‌కు బ్రియాంట్ అభినందలు తెలియజేస్తూ.. ‘నన్ను అధిగమించిన నా బ్రదర్‌కు ఇవే నా విషెస్. గేమ్‌ను మరింత ముందుకు తీసుకెళతావని ఆశిస్తున్నా కింగ్ జేమ్స్’ అని ట్వీట్ చేశాడు. ఇదే అతని చివరి ట్వీట్ అయ్యింది. మృతిచెందడానికి కొన్ని గంటల ముందు జేమ్స్‌ను కొనియాడుతూ బ్రియాంట్ చేసిన ట్వీట్ ఇది. (ఇక్కడ చదవండి: బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ దుర్మరణం) Continuing to move the game forward @KingJames. Much respect my brother 💪🏾 #33644 — Kobe Bryant (@kobebryant) January 26, 2020