
సాయితేజ భార్య శ్యామల, తల్లి భువనేశ్వరిని ఓదార్చుతున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
బి.కొత్తకోట: లాన్స్‌నాయక్ బి.సాయితేజ భార్య శ్యా మలను నా బిడ్డలా చూసుకుంటానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాటిచ్చారు. కురబలకోట మండలం రేగడివారిపల్లెలో సాయితేజ కుటుంబసభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. సా యితేజ భార్య శ్యామల, తల్లి భువనేశ్వరి, తండ్రి మోహన్‌ను ఓదార్చారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా విధుల్లోనే వీరమరణం పొంది సాయి తేజ తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు.
ఇంకా ఎంతోస్థాయికి ఎదగాల్సిన సాయి తేజ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం అ న్నారు. నియోజకవర్గానికి చెందిన ఇద్దరు సైనికు లను కోల్పోయామని, మనకే ఎందుకు ఇలా జరు గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గం తమ కుటుంబమని, ఎవరికీ ఏ కష్టం కలిగినా అండగా ఉంటామన్నారు. శ్యామలను ప్రభుత్వపరంగా వందశాతం ఆదుకుంటామని, వ్య క్తిగతంగా ఎవరూ ఊహించని స్థాయిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. చిన్నారుల భవిష్యత్ కోసం చర్యలు తీసుకుంటా మ ని స్పష్టం చేశారు. సాయితేజను తిరిగి తెచ్చివ్వలేమని చెప్పారు.
జ్వరంతోనే పరామర్శ
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి జ్వరంతో బాధపడుతున్నా, సాయితేజ మృతి విషయం తెలుసుకుని అంత్యక్రియలకు సంబంధించిన చర్యలకు అధికా రులను ఆదేశించారు. శుక్రవారం జ్వరం ఉన్నప్పటి కీ రేగడివారిపల్లెకు వచ్చి సాయితేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment