dwarakanath reddy
-
ఆసక్తికర విషయాలు చెప్పిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే...!
-
శ్యామలను బిడ్డలా చూసుకుంటా!
బి.కొత్తకోట: లాన్స్‌నాయక్ బి.సాయితేజ భార్య శ్యా మలను నా బిడ్డలా చూసుకుంటానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాటిచ్చారు. కురబలకోట మండలం రేగడివారిపల్లెలో సాయితేజ కుటుంబసభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. సా యితేజ భార్య శ్యామల, తల్లి భువనేశ్వరి, తండ్రి మోహన్‌ను ఓదార్చారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా విధుల్లోనే వీరమరణం పొంది సాయి తేజ తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు. ఇంకా ఎంతోస్థాయికి ఎదగాల్సిన సాయి తేజ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం అ న్నారు. నియోజకవర్గానికి చెందిన ఇద్దరు సైనికు లను కోల్పోయామని, మనకే ఎందుకు ఇలా జరు గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గం తమ కుటుంబమని, ఎవరికీ ఏ కష్టం కలిగినా అండగా ఉంటామన్నారు. శ్యామలను ప్రభుత్వపరంగా వందశాతం ఆదుకుంటామని, వ్య క్తిగతంగా ఎవరూ ఊహించని స్థాయిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. చిన్నారుల భవిష్యత్ కోసం చర్యలు తీసుకుంటా మ ని స్పష్టం చేశారు. సాయితేజను తిరిగి తెచ్చివ్వలేమని చెప్పారు. జ్వరంతోనే పరామర్శ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి జ్వరంతో బాధపడుతున్నా, సాయితేజ మృతి విషయం తెలుసుకుని అంత్యక్రియలకు సంబంధించిన చర్యలకు అధికా రులను ఆదేశించారు. శుక్రవారం జ్వరం ఉన్నప్పటి కీ రేగడివారిపల్లెకు వచ్చి సాయితేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
రహదారులకు ‘పచ్చ తోరణం’
సాక్షి,చిత్తూరు: జిల్లాలోని రహదారులు పచ్చ తోరణంతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుడుతోంది. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించేందుకు నిర్ణయించింది. మొక్కను నాటినప్పటి నుంచి చెట్టయ్యే వరకు సంరక్షించేలా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. తిరుపతి మినహా మిగిలిన 13 నియోజకవర్గాల్లో జగనన్న పచ్చతోరణం పక్షోత్సవాలను నిర్వహించనున్నారు. జిల్లాలో 6,10,510 మొక్కలను 15 రోజుల్లో నాటేలా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. రహదారులకు ఇరువైపులా 1,526.28 కిలోమీటర్ల వరకు మొక్కలను నాటుతారు. ఆగస్టు ఒకటి నుంచి 15లోపు మొక్కలు నాటడం పూర్తికాకుంటే మరోవారం రోజుల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యం. మొక్కకు రూ.385 ఖర్చు ఉపాధి హామీ పథకం నిధులతో ‘జగనన్న పచ్చతోరణం’ పథకాన్ని అమలు చేస్తున్నారు. నాటే మొత్తం మొక్కలకు రూ.23,50,46,350 ఖర్చు చేయనున్నారు. ఒక్కో మొక్కకు ఏడాదికి రూ.385 ఖర్చు చేస్తారు. చిన్న మొక్కలను నాటితే త్వరగా ఎదిగే అవకాశం లేదని గుర్తించిన ప్రభుత్వం ఒక్కో మొక్క 6 నుంచి 10 అడుగుల ఎత్తు, రెండేళ్ల వయసు కలిగినవి నాటేందుకు నిర్ణయించింది. ఒక మొక్క కొనుగోలుకు రూ.95, నాటడానికి రూ.110, క్రిమిసంహారక మందు పిచికారీకి రూ.10, నెలకు నిర్వహణ రూ.10, నీటికి రూ.20, ఫెన్సింగ్‌కు రూ.140 చొప్పున మొత్తం రూ.385 ఖర్చు చేస్తారు. లక్ష మొక్కలు సిద్ధం పచ్చతోరణం పక్షోత్సవాలకు జిల్లాలో లక్ష మొక్కలను సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అవసరమైన మొక్కలను దశలవారీగా తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాజమండ్రితో పాటు తమిళనాడులోని పుదుకోట్టై నుంచి మొక్కలను కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ప్రస్తుతానికి నిర్దేశించిన ప్రణాళిక మేరకే కాకుండా అదనంగా మరో లక్ష మొక్కలు నాటేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా తంబళ్లపల్లెలో ప్రారంభం తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి ఈ పచ్చతోరణాన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. ఇప్పటికే పలు చోట్ల రోడ్డుపక్కన మొక్కలు నాటే ప్రక్రియను చేపట్టారు. రాజమండ్రి నుంచి తెప్పించిన మొక్కలను రహదారులకు ఇరువైపులా నాటి సంరక్షించే పనులపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు. -
తంబాళపల్లిలో పెద్దిరెడ్డి ధ్వారకానాథ్రెడ్డి ప్రచారం
-
హంద్రీ–నీవాకు ఇంకెన్ని ఆగస్టులు కావాలి
► మంత్రి దేవినేనికి ప్రకటనపై కట్టుబడే ధైర్యం ఉందా ? ► వైఎస్సార్సీపీ తంబళ్లపల్లె సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి బి.కొత్తకోట: హంద్రీ–నీవా కాలువల ద్వారా జిల్లాకు కృష్ణా నీరు అందించేందుకు జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇంకెన్ని ఆగస్టులు కావాలని వైఎస్సార్సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రశ్నించారు. రానున్న ఆగస్టులో నీటిని రప్పిస్తామని మంత్రి బుధవా రం రాత్రి బి.కొత్తకోట మండల పర్యటన సందర్భంగా చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. గురువారం నంద్యాల నుంచి ఆయన ఫోన్లో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ ఆగస్టుకు నీరిస్తామన్న ప్రకటనకు కట్టుబడే ధైర్యం మంత్రికి ఉందా ? అని ప్రశ్నించారు. సీఎం, మంత్రి నోటివెంట ఎన్ని ఆగస్టులు, ఎన్ని మార్చి లు, ఎన్ని డిసెంబర్లు గడచిపోయాయో ప్రజలకు తెలుసన్నా రు. జిల్లాలో ఇంకా రూ.900 కోట్లకుపైబడిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో బి.కొత్తకోట శివారులో నిర్మిస్తున్న బ్రిడ్జి ఉందని, ఆగస్టుకు ఈ ఒక బ్రిడ్జి పూర్తిచేయించే సామర్థ్యం ఉందా ? ఉంటే సవాలు స్వీకరించాలని మంత్రిని డిమాండ్ చేశారు. రైతులకు పంటనష్ట పరిహారం ఇప్పించేందుకు మంత్రి దృష్టిపెట్టాలని కోరారు.