Sai Teja
-
ఆటోను ఢీకొన్న మోటార్ బైక్.. ఇద్దరు విద్యార్థులు మృత్యువాత
తవణంపల్లె: చిత్తూరు, కాణిపాకం రోడ్డు సత్తారు బావి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు.. మండలంలోని ముత్తరపల్లె గ్రామానికి చెందిన గోవిందు కుమారుడు సాయితేజ (19), మైనగుండ్లపల్లెకు చెందిన ప్రసాద్‌రెడ్డి కుమారుడు హర్ష (19) ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం సాయితేజ తన మోటార్ సైకిల్లో తన స్నేహితుడు హర్షను వెనుక కూర్చోబెట్టుకుని పరీక్ష రాయడానికి కాలేజ్‌కు బయలుదేరారు. ఈ తరుణంలో సత్తారు బావి సమీపంలో ముందు వెళ్తున్న బస్సును అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొన్నారు. ప్రమాదంలో సాయితేజ, హర్షకు బలమైన గాయాలు కావడంతో తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దీంతో క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు నిర్థారించారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
‘పైలం పిలగా’ మూవీ రివ్యూ
‘పిల్ల పిలగాడు' వెబ్ సిరీస్ ఫేమ్ సాయి తేజ హీరోగా నటించిన చిత్రం ‘పైలం పిలగా’. పుష్ప , పరేషాన్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పావని కరణం హీరోయిన్గా నటించింది. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..తెలంగాణలోని కోతులగుట్ట గ్రామానికి చెందిన శివ(సాయి తేజ) డిగ్రీ చదివి ఎలాంటి ఉద్యోగం లేకుండా ఖాలీగా ఉంటాడు. ఊర్లో ఏ పని చేసినా గుర్తుంపు ఉండదని, దుబాయ్‌కి వెళ్లి బాగా సెటిల్ అవ్వాలనుకుంటాడు. పాస్‌పోర్ట్, ఉద్యోగం కోసం రూ. 2 లక్షలు కావాల్సి వస్తుంది. దాని కోసం శివ తన నానమ్మ పేరుపై ఉన్న స్థలాన్ని అమ్మాలనుకుంటాడు. తన స్నేహితుడు శ్రీను(ప్రణవ్ సోను)తో కలిసి స్థలం అమ్మేందుకు వెళ్తాడు. అయితే ఆ స్థలం లిటికేషన్లో ఉంటుంది. పంచాయితీ తర్వాత గుట్టగా మారిన రెండెకరాల స్థలం అతనికి వస్తుంది. అది అమ్మకానికి పెడితే ఎవరూ కొనేందుకు ముందుకు రారు. కానీ మరుసటి రోజు 10 లక్షలు ఇస్తానని ఒకరు.. 30 లక్షలు ఇస్తానని మరొకరు.. రూ. కోటి ఇస్తా ఆ స్థలం నాకే అమ్ము అని ఇంకొకరు శివ దగ్గరకు వచ్చి బ్రతిమిలాడుతుంటారు. పనికి రాని ఆ గుట్టను కొనేందుకు వాళ్లంతా ఎందుకు ఆసక్తి చూపారు? దుబాయ్ వెళ్లాలనుకున్న శివ కోరిక నెరవేరిందా? దేవి(పావని కరణం)తో శివ ప్రేమయాణం ఎలా సాగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. హాస్యం ప్రధానంగా సాగే వ్యంగ్య చిత్రమిది. కథంతా తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. తెలంగాణలో పైలం అంటే జాగ్రత్త అని అర్థం. ఆ టైటిల్‌కి తగ్గటే హీరో వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు. దుబాయ్‌కి వెళ్తే భారీగా డబ్బు సంపాదించొచ్చనే ఆశతో సొంత భూమిని అమ్మాలనుకుంటాడు. అయితే ఆ భూమికి విలువ రావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఆసక్తికరమైన అంశం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలనే కథగా మలచుకొని దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. కథనాన్ని కామెడీగా సాగిస్తూనే ఓ మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రతి రోజు టీ షాపు దగ్గర ఎదురు చూడడం.. తన ప్రేమ విషయం తెలియజేయడానికి హీరో పడే పాట్లు నవ్విస్తాయి. అలాగే దుబాయ్ వెళ్లేందుకు హీరో చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. స్థలం అమ్మకానికి పెట్టేవరకు కథంతా సోసోగా సాగుతుంది. అయితే స్థలం కొనడానికి చాలా మంది ఆసక్తి చూపడం.. కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా ముందుకు రావడంతో కథపై ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం కొంత సాగదీతగా ఉంటుంది. క్లైమాక్స్ పర్వాలేదు. ఎలాంటి వల్గారిటీ లేకుండా హాస్యభరితంగా కథనం సాగడం ప్లస్ పాయింట్. నిడివి కూడా తక్కువే ఉండడం సినిమాకు కలిసొచ్చే అంశం. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినప్పటికీ తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. పల్లెటూరి యువకుడు శివగా సాయితేజ తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రకృతిని ప్రేమించే పల్లెటూరి అమ్మాయి దేవి పాత్రకి పావని న్యాయం చేసింది. హీరో స్నేహితుడి నటించిన వ్యక్తి కామెడీ పంచులు నవ్వులు పూయించాయి. హీరో నానామ్మగా డబ్బింగ్ జానకి ఓ డిఫరెంట్ పాత్రలో మెరిసింది. చిత్రం శీను, మిర్చి కిరణ్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘పైలం పిలగా’ రిలీజ్ డేట్ ఫిక్స్
'పిల్ల పిలగాడు' వెబ్ సిరీస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి తేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పైలం పిలగా’. పుష్ప , పరేషాన్ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన పావని కరణం హీరోయిన్గా నటించింది. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి పాటలు, ఎంటర్టైనింగ్ టీజర్, ఎంగేజింగ్ ట్రైలర్ ప్రేక్షుకుల దృష్టిలో పడి, సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల బాలయ్య ఈ 'పైలం పిలగా' చిత్ర టీజర్, ట్రైలర్ ను చూసి మూవీ టీంని ప్రశంసించాడు.(చదవండి: నా ఫోటోలు చూసి హేళన.. కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో కనిపించాక..)పైసాను ప్రేమించే పిలగాడు, ప్రకృతిని ప్రేమించే పిల్ల. మేఘాల్లో మేడలు కట్టుకోవాలని కలలు కనే మొనగాడు, చెట్టు కింద చిన్న గూడు చాలు అనుకునే అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమ ఒకవైపు, ఎక్కడికైనా సరే, ఎంత దూరమైనా సరే వెళ్లి కోట్లు సంపాదించి తన ఊళ్ళో కింగ్ అనిపించుకోవాలనే ఆరాటం ఇంకోవైపు, ఈ ఈస్ట్ వెస్ట్ సంఘర్షణని వినోదాత్మకంగా తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రం 'పైలం పిలగా'అని మేకర్స్ తెలిపారు.హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ లో మొదటి చిత్రం 'పైలం పిలగా' ను రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు. -
ఫన్నీగా 'పైలం పిలగా'.. ట్రైలర్ చూశారా?
సాయి తేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించిన చిత్రం పైలం పిలగా. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ వెంకటేష్ మహా లాంచ్ చేశారు. పల్లె నుంచి పట్నం దాకా ఈ గ్లోబలైజేషన్ యుగంలో యువత ఉద్యోగాల కన్నా సొంత స్టార్ట్ అప్లు, వ్యాపారాల వైపే పరుగులు పెడుతున్నారు. కోట్లు సంపాదించాలని కలలు కంటున్నారు. ఇలాగే ఓ యువకుడు తన ఊళ్లోనే, తన భూమిలోనే సొంత వ్యాపారం ప్రారంభించి జీవితంలో ఎదగాలనుకుంటాడు. కానీ పంచాయితీ ఆఫీస్ నుంచి సెక్రటేరియట్ ఆఫీస్ వరకు సవాళ్లు, అవినీతి, అలసత్వం నిండిన బ్యూరోక్రసీ సిస్టంలో ఇరుక్కొని ఎన్ని బాధలు పడ్డాడో తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రమే పైలం పిలగా. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ వంటి టాలీవుడ్, బాలీవుడ్ అగ్రనటులతో వందకి పైగా యాడ్ ఫిలిమ్స్ కి డైరెక్షన్ చేసిన ఆనంద్ గుర్రం ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం కానున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ సందర్బంగా డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు ఆనందం గుర్రం రాసిన 'ఊరెళ్ళిపోతా మావ', 'కంచె లేని దేశం' పాటలకు పెద్ద అభిమానిని, ఇప్పుడు ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగున్నాయి. సినిమా ట్రైలర్ మంచి డైలాగ్స్ తో చాలా ఇంట్రెస్టింగా ఉంది అన్నారు.హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే.శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం లో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు నటించారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించగా సందీప్ బద్దుల సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. -
మెకానిక్ రెడీ
మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. నాగ మునెయ్య (మున్నా) నిర్మించారు. ఈ సినిమాని తెలుగు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన పోస్టర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసి, సినిమా హిట్టవ్వాలన్నారు. -
ప్రేమ.. వినోదం
‘చైతన్య రావ్, హృతికా శ్రీనివాస్ జంటగా కొత్త సినిమా షురూ అయింది. సాయి తేజ దర్శకత్వంలో గౌతమ్స్ ఈగల్ ఎంటర్టైన్మెంట్పై ఎం.గౌతమ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది.ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ కూర్మాచలం కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాతలు సి.కల్యాణ్ క్లాప్ కొట్టగా, బెక్కం వేణుగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కామెడీ, లవ్, ఎమోషన్స్ .. వంటి ఆకట్టుకునే అంశాలు ఈ మూవీలో ఉంటాయి’’ అన్నారు ఎం.గౌతమ్. నిర్మాత రాచాల యుగంధర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మోహన్ పున్న,లైన్ ప్రొడ్యూసర్: వంశీ కృష్ణ, కెమెరా: పీసీ మౌళి, సంగీతం: గ్యాని. -
వెర్టైస్ రూ.100 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షేవింగ్ బ్లేడ్స్, రేజర్స్, క్రీమ్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ వెర్టైస్ గ్లోబల్ వచ్చే రెండేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. తద్వారా మరో 400–500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ డైరెక్టర్ సాయితేజ బొడ్డుపల్లి తెలిపారు. 30 దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తున్న ఈ కంపెనీ ఇప్పటికే రూ.40 కోట్లు వెచ్చించింది. 200 మంది ఉద్యోగులు ఉన్నారని మరో డైరెక్టర్ పురుషోత్తం పబ్బ చెప్పారు. -
Lance Naik Sai Teja Final Rites : సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు ఫొటోలు
-
‘లవ్యూ డాడీ’ అంటూ.. సాయితేజ ఫోటోను ముద్దాడిన కొడుకు
చిత్తూరు: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన సైనికుడు లాన్స్ నాయక్ సాయితేజ పార్థివదేహానికి ఎగువరేగడిలో సైనిక లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మదనపల్లి నుంచి ఎగువరేగడ వరకూ దాదాపు 30 కిలోమీటర్ల అంతిమయాత్ర కొనసాగింది. ఎగువరేగడకు చేరుకున్న సాయితేజ భౌతిక కాయాన్ని చూడగానే ఆయన భార్య సొమ్మసిల్లి పడిపోయారు. కన్నీరుమున్నీరుగా సాయితేజ కుటుంబ సభ్యులు విలపించారు. ఆయన కొడుకు తండ్రి ఫోటోకు ‘లవ్ యూ డాడీ.. లవ్ యూ డాడీ..’ అంటూ బాధగా ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం కదిలించింది. -
సెలవిక.. సైనికా!
బి.కొత్తకోట: ‘సాయితేజ అమర్ రహే.. జై జవాన్.. భారత్ మాతాకీ జై’ అంటూ వేలాదిగా తరలివచ్చిన ప్రజల నినాదాలతో ఎగువరేగడి గ్రామం ప్రతిధ్వనించింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన లాన్స్‌నాయక్ బి.సాయితేజ అంత్యక్రియలు అతడి కుటుంబీకులు, సన్నిహితులు, బంధువుల అశ్రునయనాల నడుమ సైనిక, పోలీసు లాంఛనాలతో పూర్తయ్యాయి. బెంగళూరులోని ఆర్మీ బేస్ ఆస్పత్రి నుంచి సాయిజేజ మృతదేహం ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కురబలకోట మండలం ఎగువరేగడి గ్రామానికి చేరుకుంది. అప్పటికే వేలాదిగా తరలివచ్చిన ప్రజలు సాయితేజ భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. పార్థివదేహాన్ని తొలుత సాయితేజ ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే మైదానానికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం గంటకుపైగా ఉంచారు. అనంతరం ఇంటి సమీపంలో సిద్ధం చేసిన సమాధి వద్దకు శవ పేటికను ప్రజలు మోసుకొచ్చారు. అక్కడ సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ చేత తమ్ముడు మహేష్‌బాబు అంతిమ సంస్కారాలు చేయించారు. తర్వాత శవపేటికతో సహా సమాధి చేశారు. మధ్యాహ్నం 3:20 గంటలకు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. నినాదాలు, ఆర్తనాదాల నడుమ.. సాయితేజ మృతదేహం ఉన్న శవపేటికను మైదానంలోకి తీసుకురావడంతో జనం ఒక్కసారిగా జై జవాన్ నినాదాలతో హోరెత్తించారు. దర్శనార్థం జనం దూసుకొచ్చారు. పోలీసులు, ఆర్మీ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లకు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అరగంట వరకు ఇదేపరిస్థితి నెలకొనగా పోలీసులు జనాన్ని అదుపు చేశాక శవపేటిక వద్దకు భార్య శ్యామల, తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహన్, తమ్ముడు జవాన్ మహేష్‌బాబు, బంధువులు చేరుకోగా ఒక్కసారిగా ఆర్తనాదాలతో వాతావరణం ఆవేదనాభరితంగా మారింది. కొంతసేపు భార్య శ్యామల భర్త శవపేటిక వద్ద మౌనంగా ఉండిపోయింది. అర్తనాదాలు, జనం నినాదాలు, తోపులాటలు ఇవేమీ అర్థంకాని సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ జాతీయ పతాకం చేతపట్టి తండ్రి శవపేటిక వద్ద కూర్చున్న దృశ్యం కలచివేసింది. ఇక తండ్రి లేడన్న విషయం తెలియని మోక్షజ్ఞ తల్లి ఒడిలో కూర్చోని అటుఇటూ చూస్తూ జెండా ఊపుతూ కనిపించాడు. జనం జై జవాన్ నినాదాలు చేస్తుంటే సాయితేజ తమ్ముడు జవాన్ మహేష్‌బాబు వారితో గొంతు కలిపి జై జవాన్ అంటూ చేతులెత్తి నినాదాలు చేశాడు. అంత్యక్రియల సందర్భంగా రెండుచోట్ల అధికారిక లాంఛనాలు జరిపారు. తొలుత మైదానంలో శవపేటిక ఎదుట బెంగళూరు నుంచి వచ్చిన 11వ పారా సైనికులు గౌరవ వందనం చేశారు. అనంతరం గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. ఆర్మ్డ్ పోలీసులు కూడా గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమానికి బెంగళూరు సైనిక విభాగం నుంచి నలుగురు అధికారులు, ఐదుగురు జాయింట్ కమెండో ఆఫీసర్లు, 30 మంది సైనికులు హాజరయ్యారు. సమాధి చేసేముందు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకా లతో జనం నినాదాలు చేశారు. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు సెంథిల్‌కుమార్, వెంకట అప్పలనాయుడు సాయితేజ శవపేటికపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) వెంకటేశ్వర, బెంగళూరు నుంచి వచ్చిన 11వ పారా సైనిక విభాగం అధికారులు, మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, స్థానిక అధికారులు, ప్రముఖులు నివాళులర్పించారు. మదనపల్లె జెడ్పీ, హోప్, సీటీఎం, తంబళ్లపల్లె, చెంబకూరు హైస్కూళ్లు, మిట్స్, బీటీ కళాశాలకు చెందిన 200 మంది ఎన్సీసీ క్యాడెట్లు హాజరై నివాళులర్పించారు. అనంతరం సమాధి వద్దకు ప్రజలు శవపేటికను మోసుకొచ్చారు. శ్యామలకు జాతీయ పతాకం అందజేత సాయితేజ మృతదేహం ఉంచిన శవపేటికకు చుట్టిన జాతీయ పతాకాన్ని సైనిక అధికారులు అతడి భార్య శ్యామలకు అందజేశారు. దేశం కోసం సాయితేజ అమరుడైనాడని, మీకు దేశం అండగా ఉంటుందని దైర్యం చెప్పారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మాటిచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
AP: సాయంత్రం స్వగ్రామానికి సాయితేజ భౌతికకాయం
సాక్షి, చిత్తూరు: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడపల్లెకు చెందిన లాన్స్‌నాయక్ బి.సాయితేజ అంత్యక్రియలు రేపు(ఆదివారం) నిర్వస్తామని ఆయన సోదరుడు మహేశ్‌బాబు తెలిపారు. శనివారం మధ్యాహ్నం సాయతేజ భౌతికకాయం బెంగళూరుకు చేరుతుందని, అనంతరం బెంగళూరు నుంచి తమ స్వగ్రామానికి రావడానికి సాయంత్రమవుతందని పేర్కొన్నారు. దీంతో సాయితేజ అంత్యక్రియలు రేపు ఉదయం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చదవండి: Sai Teja: సాయితేజ కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం నేడు సాయి తేజ భౌతికకాయాన్ని ఆర్మీ బేస్ హాస్పిటల్లో ఉంచాలని అధికారులను కోరామని, దానికి అధికారులు అంగీకరించారని చెప్పారు. ఆదివారం ఉదయం 5 గంటలకు బయలుదేరి తమ స్వగ్రామనికి ఉదయం 10గంటల లోపు సాయ తేజ భౌతికకాయం చేరుతుందని తెలిపారు. శనివారం ఉదయం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయి తేజ భౌతికకాయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలాలకు భౌతికకాయాన్ని తరలించిన విషయం తెలిసిందే. -
శ్యామలను బిడ్డలా చూసుకుంటా!
బి.కొత్తకోట: లాన్స్‌నాయక్ బి.సాయితేజ భార్య శ్యా మలను నా బిడ్డలా చూసుకుంటానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాటిచ్చారు. కురబలకోట మండలం రేగడివారిపల్లెలో సాయితేజ కుటుంబసభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. సా యితేజ భార్య శ్యామల, తల్లి భువనేశ్వరి, తండ్రి మోహన్‌ను ఓదార్చారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా విధుల్లోనే వీరమరణం పొంది సాయి తేజ తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు. ఇంకా ఎంతోస్థాయికి ఎదగాల్సిన సాయి తేజ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం అ న్నారు. నియోజకవర్గానికి చెందిన ఇద్దరు సైనికు లను కోల్పోయామని, మనకే ఎందుకు ఇలా జరు గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గం తమ కుటుంబమని, ఎవరికీ ఏ కష్టం కలిగినా అండగా ఉంటామన్నారు. శ్యామలను ప్రభుత్వపరంగా వందశాతం ఆదుకుంటామని, వ్య క్తిగతంగా ఎవరూ ఊహించని స్థాయిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. చిన్నారుల భవిష్యత్ కోసం చర్యలు తీసుకుంటా మ ని స్పష్టం చేశారు. సాయితేజను తిరిగి తెచ్చివ్వలేమని చెప్పారు. జ్వరంతోనే పరామర్శ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి జ్వరంతో బాధపడుతున్నా, సాయితేజ మృతి విషయం తెలుసుకుని అంత్యక్రియలకు సంబంధించిన చర్యలకు అధికా రులను ఆదేశించారు. శుక్రవారం జ్వరం ఉన్నప్పటి కీ రేగడివారిపల్లెకు వచ్చి సాయితేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం
బి.కొత్తకోట/బెంగళూరు/చిత్తూరు కలెక్టరేట్: తమిళనాడులోని కూనూరు వద్ద సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్‌నాయక్ బి.సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.50 లక్షల పరిహారాన్ని చెక్కు రూపంలో శనివారం అందించారు. కలెక్టర్ హరినారాయణన్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో కలిసి చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడవారిపల్లె వచ్చారు. సాయితేజ భార్య శ్యామల, తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహనలను పరామర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. లాన్స్‌నాయక్ సాయితేజ విధి నిర్వహణలో మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. దేశానికి సాయితేజ చేసిన సేవ గొప్పదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు. శ్యామల విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున మదనపల్లెలో ఇంటిస్థలాన్ని కేటాయిస్తామన్నారు. పిల్లల చదువుకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. అనంతరం సాయితేజ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. నేడు ఎగువరేగడలో అంత్యక్రియలు కాగా, సాయితేజ భౌతికకాయం శనివారం బెంగళూరు చేరుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌కు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని తరలించగా.. అక్కడ ఆర్మీ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఉదయం వరకు సాయితేజ పార్థివదేహం బెంగళూరులోనే ఉండనుంది. అనంతరం బెంగళూరు నుంచి స్వగ్రామమైన ఎగువరేగడ గ్రామానికి పార్థివదేహాన్ని తరలిస్తారు. అక్కడ సైనిక, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. మదనపల్లె, అంగళ్లు, కంటేవారిపల్లె మీదుగా రేగడవారిపల్లెకు మృతదేహాన్ని తీసుకువచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్గం వెంబడి సాయితేజకు ఘన నివాళి అర్పించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. సరిహద్దున గల చీకలబైలు నుంచి అభిమానులు, ప్రజలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐలు సుకుమార్, రామమోహన్ పరిశీలించారు. కడవరకు దేశ సేవలోనే ఉంటా: మహేష్‌బాబు తన అన్న సాయితేజ దేశ సేవలో తుది శ్వాస విడిచినా.. తాను దేశ సేవ నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని సాయితేజ సోదరుడు బి.మహేష్‌బాబు చెప్పారు. సిక్కింలో జవానుగా విధులు నిర్వర్తిస్తున్న మహేష్‌బాబు కురబలకోట మండలం రేగడవారిపల్లెలో శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘డిసెంబర్ 8న మేం పనిచేస్తున్న రెజిమెంట్ ఏఎస్పీ క్రోర్ డే వేడుకలు జరుపుకుంటుండగా మధ్యాహ్నం సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైందనే సమాచారం వచ్చింది. ఆ వెంటనే వేడుకల్ని నిలిపివేశారు. టీవీల్లో చూస్తుండగా సాయితేజ కూడా ప్రమాదంలో మృతి చెందినట్టు వార్తల్లో వచ్చింది. సాయితేజ అంటే ఎంతోమంది ఉండవచ్చు, అన్నపేరు బి.సాయితేజ కదా అని సర్దిచెప్పుకొన్నా. తర్వాత వదిన శ్యామలకు ఫోన్‌చేసి అన్న ఎక్కడికైనా వెళ్తున్నట్టు చెప్పాడా అని అడిగితే.. లేదని సమాధానం వచ్చింది. అన్న మిత్రులైన జవాన్లకు ఫోన్‌చేస్తే సెలవుల్లో ఉన్నామన్నారు. అన్న మొబైల్ స్విచ్చాఫ్ వస్తోంది. టెన్షన్ భరించలేకపోయా. చివరికి ఏదైతే జరగకూడదనుకున్నానో అదే నిజమైంది. ప్రమాదంలో మరణించిన సాయితేజ నా సోదరుడేనని తెలిసింది. మా అన్న దేశ సేవలోనే ప్రాణాలర్పించారు. అన్న మరణం తీరని లోటే అయినా, నేను జవానుగానే కొనసాగుతాను. తల్లిదండ్రుల బాధ్యతను కూడా నెరవేరుస్తా. సాయితేజ మృతి నాకే కాదు.. ఎందరో యువకులకు తీరని లోటు’ అన్నారు. -
స్వస్థలానికి సాయితేజ భౌతికకాయం.. పచ్చబొట్టు ఆధారంగా గుర్తింపు
బి.కొత్తకోట: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడపల్లెకు చెందిన బి.సాయితేజ అమరుడై శుక్రవారానికి మూడు రోజులైంది. శనివారం ఉదయం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయి తేజ భౌతికకాయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలాలకు భౌతికకాయాన్ని తరలించారు. ఆయన మరణ వార్త తెలిసిన బుధవారం సాయంత్రం నుంచి రేగడపల్లెలో విషాదం అలుముకుంది. సాయితేజ కుటుంబాన్ని ఓదార్చేందుకు, పరామర్శించేందుకు ప్రజలు, పార్టీలకు అతీతంగా నాయకులు తరలివస్తున్నారు. కడసారి చూపు కోసం అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పరామర్శకు ఎవరు వచ్చినా ‘అయ్యా.. నా బిడ్డ ఇంకా రాలేదు’ అంటూ విలపిస్తున్న తల్లి భువనేశ్వరిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సాయితేజ మృతదేహం రాక కోసం రేగడపల్లె, కురబలకోట, బి.కొత్తకోట మండలాల్లోని పలు గ్రామాలు ఎదురు చూస్తున్నాయి. సాయితేజ గురించి తెలిసిన వాళ్లు, ముఖ్యంగా సైనిక ఎంపిక కోసం శిక్షణ పొందిన వారు విలపిస్తున్నారు. సాయితేజ ఇచ్చిన శిక్షణతో ఎంతోమంది సైనికులుగా ఎంపికయ్యారు. వారంతా అతడికి నివాళులర్పించేందుకు మృతదేహం కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో రేగడపల్లెలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది డీఎన్ఏ పరీక్షల్లో జాప్యం లాన్స్‌నాయక్ సాయితేజ భౌతికకాయాన్ని గుర్తించేందుకు గరువారం రాత్రి అతడి తల్లిదండ్రులు భువనేశ్వరి, తండ్రి మోహన్, తమ్ముడు మహేష్‌బాబు, కుమారుడు మోక్షజ్ఞల నుంచి సేకరించిన రక్త నమూనాలను ఢిల్లీ తీసుకెళ్లారు. అందరి శ్యాంపిల్స్ సేకరణ పూర్తయ్యాక జెనెటిక్ ల్యాబ్స్‌లో డీఎన్ఏ పరీక్షలు జరిపి మృతదేహాన్ని అప్పగిస్తామని అధికారులు సాయితేజ కుటుంబ సభ్యులకు తెలిపారు. శనివారం ఉదయానికి ఈ ప్రక్రియ పూర్తి అయింది. సాయితేజ శరీరంపై ఉన్న పచ్చబొట్టు గుర్తుల ఆధారంగా అతడి భౌతిక కాయాన్ని గుర్తించారు. పచ్చబొట్ల వివరాలను, ఫొటోలను ఢిల్లీ సైనిక అధికారులకు వివరాలను సాయితేజ తండ్రి మోహన్ తెలిపారు. సాయితేజ ఎడమ వైపు గుండె భాగంపై భార్య పేరు ఆంగ్లంలో శ్యామ అని, కుడిచేతి మీద త్రిశూలం ఆకారంలో శివుడిబొమ్మతో కూడిన పచ్చబొట్లు ఉన్నాయి. సాయితేజ ఇంట్లో విషణ్ణవదనాలతో కుటుంబసభ్యులు, బంధువులు -
సాయితేజ మృతి: కన్నీటి సుడులు.. సంద్రమైన ఓదార్పులు
నీరాక కోసం పురిటిగడ్డ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. భరత మాత ఒడిలో ఒదిగిపోయిన తన బిడ్డను చూడాలని ఆ తల్లి కళ్లల్లో ఒత్తులేసుకుని నిరీక్షిస్తోంది. నేనున్నా నాన్నా.. అంటూ ధైర్యం చెప్పిన కుమారుడి రాకకోసం ఆ తండ్రి కంటి రెప్పవాల్చకపోవడం అందరి హృదయాలను బరువెక్కిస్తోంది. తన పెనిమిటిని చూడాలని వీరనారి కన్నీటిపర్యంతమవుతున్న తీరుకు ఊరంతా శోకసంద్రమవుతోంది. అందరితో కలివిడిగా ఉంటూ.. దేశసేవకు ప్రాణాలర్పించిన వీరజవాన్ ఎక్కడొస్తున్నాడోనని ఆ ఊరి జనం పరితపిస్తున్న తీరు చలింపజేస్తోంది. ఇప్పుడు కురబలకోట మండలం, ఎగువరేగడవారిపల్లెలో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరినోట విన్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. వీధులన్నీ వీరజవాన్‌ను తలుచుకుని కన్నీళ్లు పెడుతున్నాయి. దేశసేవకు అంకితమైన ఆ యువ ‘తేజ’ం ధైర్యసాహసాలకు ఉప్పొంగిపోతున్నాయి. జైజవాన్.. అమర్ రహే అంటూ కీర్తిస్తున్నాయి. సాక్షి, చిత్తూరు: కురబలకోట మండలం, ఎగువరేగడవారిపల్లెలో ఎవరిని కదిలించినా కన్నీళ్లే సమాధానం అవుతున్నాయి. తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో సీఎస్డీ బిపిన్‌రావత్‌తో పాటు మరణించిన లాన్స్‌నాయక్ సాయి తేజ మృతదేహం కోసం జనం ఎదురు చూస్తున్నారు. భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు గురువారం ఎగువరేగడవారిపల్లెకు చేరుకున్నారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఇన్చార్జ్ తహసీల్దార్ సయ్యద్ అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. (చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’) అనంతపురం–కృష్ణగిరి జాతీయరహదారి నుంచి ఎగువరేగడకు వెళ్లే దారిని వాహనాల రాకపోకలకు వీలుగా జేసీబీతో జంగిల్‌క్లియరెన్స్ చేయించారు. లాన్స్‌నాయక్ సాయితేజకు సైనికలాంఛనాలతో అంత్యక్రియలు జరపాల్సి ఉన్నందున అందుకు తగ్గట్టుగా అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసి కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేశారు. సాయితేజ పార్థివదేహాన్ని తల్లిదండ్రులు ఇంటికి సమీపంలోని వ్యవసాయ పొలంలో ఖననం చేస్తామని చెప్పడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. (చదవండి: సాయితేజ బిడ్డల చదువు బాధ్యత తీసుకుంటా: మంచు విష్ణు) అందరికీ ఆదర్శప్రాయుడు సాయితేజ 8వ తరగతిలోనే సైన్యం చేరాలని నిర్ణయించుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. గొర్రెల పెంపకం జీవనవృత్తి కలిగిన తమ కుటుంబాల్లో చదువు ప్రాముఖ్యతను వివరించేవాడని గుర్తుచేసుకున్నారు. ఆర్మీలో చేరితే దేశ సేవ చేయవచ్చంటూ గ్రామస్తులను ప్రోత్సహించేవాడని చెబుతున్నారు. అతని తమ్ముడు సైన్యంలో చేరేందుకు ప్రేరణగా నిలిచాడని, మరెందరో సైన్యంలో చేరడానికి కారకుడయ్యాడని కీర్తించారు. ఎప్పుడు ఇంటికి వచ్చినా తమతోపాటుగా పొలంలో వ్యవసాయ పనులు చేస్తూ సరదాగా గడిపేవారన్నారు. ఆర్మీలో చేరి దేశసేవ చేస్తే ఆ తృప్తే వేరంటూ చెప్పేవాడని స్నేహితులు తెలిపారు. చదవండి: ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు -
ఊరే అతడింటికి కదిలొచ్చింది
మదనపల్లె: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారిగా పని చేస్తూ.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన లాన్స్‌నాయక్ బి.సాయితేజ మృతదేహం కోసం అతని కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు ఆ గ్రామమంతా కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తోంది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువ రేగడవారిపల్లెకు చెందిన సాయితేజ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడని తెలియగానే ఊరికి ఊరే అతడి ఇంటి వద్దకు చేరింది. అప్పటికే విషయం తెలిసి కుప్పకూలిన లాన్స్‌నాయక్ తల్లిదండ్రులు మోహన్, భువనేశ్వరిని ఆ ఊరంతా ఓదారుస్తోంది. తమ ఊరి ముద్దుబిడ్డ ఇక లేడంటే ఇప్పటికీ గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు. ఎప్పుడూ లేనిది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు.. తల్లి శ్యామల, తాత మోహన్, నాయనమ్మ భువనేశ్వరి గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు. ఏం జరిగిందో తెలియని చిన్నారులు మోక్షజ్ఞ, దర్శిని వారందరి ముఖాల్లోకి దీనంగా చూస్తుండటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో.. సాయితేజ మృతదేహాన్ని గుర్తించేందుకు వీలుగా ఆర్మీ ప్రత్యేక బృందం అతడి తల్లిదండ్రుల నుంచి రక్త నమూనాలు సేకరించి తీసుకెళ్లింది. వీరి డీఎన్ఏల ఆధారంగా లాన్స్ నాయక్ మృతదేహాన్ని గుర్తించి.. శుక్రవారం సాయంత్రానికి స్వగ్రామానికి తరలించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు సాయితేజ మరణవార్త అధికారికంగా ధ్రువీకరించాక ఆయన భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు మదనపల్లె నుంచి ఎగువరేగడ వారిపల్లె గ్రామానికి చేరుకున్నారు. డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఇన్చార్జ్ తహసీల్దార్ సయ్యద్ ఎగువరేగడకు వెళ్లి అంతిమ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సాయితేజ పార్థివదేహాన్ని ఇంటికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. వీరజవాన్ అంత్యక్రియలకు పెద్దసంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సైనికాధికారులు, ప్రజలు హాజరవుతారన్న సమాచారంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న మరణవార్త తెలిసిన వెంటనే సాయితేజ సోదరుడు మహేష్ (బీఎస్ఎఫ్ జవాన్) సిక్కిం నుంచి గురువారం సాయంత్రం స్వగ్రామం చేరుకున్నాడు. తల్లి, తండ్రి, వదినను ఎలా ఓదార్చాలో తెలియక దుఃఖాన్ని దిగమింగుకుంటూ అందరిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. తన సోదరుడి స్ఫూర్తితోనే దేశ సేవలో చేరానన్నాడు. ‘నన్ను రమ్మని చెప్పి నువ్వెళ్లిపోయావా’ తన బిడ్డ సాయితేజకు ఎప్పుడు ఫోన్ చేసినా ‘మదనపల్లెకు వచ్చేయమ్మా. నా భార్యాబిడ్డలకు తోడుగా ఉండు. నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా’ అనే వాడని తల్లి భువనేశ్వరి వాపోయింది. ‘వ్యవసాయ పనులు పూర్తయ్యాక వస్తాలే బిడ్డా్డ అంటే.. కూలీలు చూసుకుంటార్లేమ్మా. నీవు వచ్చేయని ప్రాధేయపడేవాడు. ఇప్పుడు నా బిడ్డ లేడు. నన్నెవరు చూసుకుంటారు తండ్రీ’ అని రోదిస్తోంది. ‘అందరూ వద్దంటే నేనే పంపిస్తిని’ ‘ఆర్మీలోకి పంపొద్దని ఊళ్లో అందరూ చెబుతున్నా నేనే పంపిస్తినే. ఆడు వెళతానని పట్టుపడితే బిడ్డ కోరిక కాదనక పోతినే. ఇప్పుడు ఇట్టా జరిగితే నాకు దిక్కెవరు రామా. నీకు నేనున్నా నాన్నా అనే వాడివే బిడ్డా. మోసం చేసి వెళ్లిపోతివే సామీ. నాకు దిక్కెవరు రామా..’ అంటూ తండ్రి మోహన్ రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. -
సాయితేజ బిడ్డల చదువు బాధ్యత తీసుకుంటా: మంచు విష్ణు
కురబలకోట: అమర జవాన్ బి.సాయితేజ బిడ్డలు మోక్షజ్ఞ, దర్శిని చదువుల బాధ్యత పూర్తిగా తీసుకుంటామని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. గురువారం ఆయన పీఏ సతీశ్ కురబలకోట మండలంలోని రేగడపల్లెకు వచ్చారు. సాయితేజ భార్య శ్యామలను మంచు విష్ణుతో ఫోన్లో మాట్లాడించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ సాయితేజ బిడ్డల చదువుల బాధ్యత పూర్తిగా తీసుకుంటామని, శ్రీవిద్యా నికేతన్‌లో ఎందాకైనా చదివిస్తామని చెప్పారు. -
సైనికుడు సాయితేజ కుటుంబానికి అండగా మంచు కుటుంబం
సాక్షి, చిత్తూరు: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరుకు చెందిన సైనికుడు సాయి తేజ్ కుటుంబానికి మంచు మోహన్ బాబు కుటుంబం అండగా నిలిచింది. లాన్స్ నాయక్ సాయి తేజ ఇద్దరు పిల్లలను ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని హీరో మంచు విష్ణు వెల్లడించారు. త్వరలోనే చిత్తూరుకు వచ్చి సాయి తేజ కుటుంబాన్ని కలుస్తానని పేర్కొన్నారు. కాగా సాయితేజ అంత్యక్రియలు శుక్రవారం చిత్తూరు జిల్లా రేగడిపల్లిలో నిర్వహించనున్నారు. కాగా తమిళనాడు కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో ప్రయాణిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కూడా మరణించారు. ఊహించిన ఈ ఘటనతో సాయితేజ స్వస్థలం కురబలకోట మండలం ఎగువరేడ గ్రామం షాక్‌కు గురైంది. సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్జా(5) పాప దర్శిని (2) సంతానం. సాయితేజ కుటుంబానికి మంచు విష్ణుపరామర్శ విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను ' మా ' అధ్యక్షుడు శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ మంచు విష్ణు పరామర్శించారు. మదనపల్లిలోని ఎస్బీఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు . యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సీడీఎస్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న సాయితేజ అకాల మరణం పొందడం పట్ల ఆయన విచారకరం వ్యక్తం చేశారు 10 రోజుల్లో మదనపల్లికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని ఆయన శ్యామలకు తెలిపారు. -
సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’
Lance Naik Saiteja: ‘పాప దర్శిని ఏం చేస్తోంది.. మోక్షజ్ఞ స్కూల్‌కు వెళ్లాడా.. చిట్టితల్లిని చూడాలని ఉంది. వీడియో కాల్ చేస్తా’ అంటూ భార్య శ్యామలతో లాన్స్‌నాయక్ బి.సాయితేజ బుధవారం ఉదయం 8.45 గంటలకు మాట్లాడారు. భార్య, పాపను వీడియోకాల్‌లో చూస్తూ తాను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో కలిసి తమిళనాడు వెళుతున్నానని.. వీలు కుదిరితే సాయంత్రం చేస్తానని టాటా చెప్పిన సాయితేజ.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ ఘటనతో సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామం షాక్‌కు గురైంది. ప్రమాద విషయం తెలుసుకున్న సాయితేజ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు మదనపల్లెలో భార్య శ్యామల నివాసం ఉంటున్న ఇంటికి, ఎగువరేగడ గ్రామంలో తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో సాయితేజ చనిపోయాడని తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని, ఎలాంటి దుర్వార్త ఏ సమయంలో వినాల్సి వస్తోందని బాధాతప్త హృదయాలతో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. సాయితేజ మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. తల్లి భువనేశ్వరిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. సిపాయిగా ఎంపికై.. లాన్స్‌నాయక్ స్థాయికి.. 28 ఏళ్ల సాయితేజ 2013లో బెంగళూరు రెజిమెంట్‌కు ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యారు. అక్కడ శిక్షణ పొందుతూ డిపార్ట్మెంట్కు సంబంధించిన పరీక్షలు రాసి ఏడాది తర్వాత ప్యారా కమాండోగా ఎంపికై 11వ పారాలో లాన్స్‌నాయక్‌గా నియమితులయ్యారు. విధి నిర్వహణలో భాగంగా కశ్మీర్, బెంగళూరు హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలోబిపిన్ రావత్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తల్లి భువనేశ్వరి మాజీ ఎంపీటీసీ, తండ్రి మోహన్ సాధారణ రైతు. తమ్ముడు మహేష్‌ఆర్మీలో సిపాయిగా సిక్కింలో పని చేస్తున్నారు. సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ (5), పాప దర్శిని (2) సంతానం. కుమారుడు మోక్షజ్ఞ చదువు కోసం సాయితేజ భార్య శ్యామల మదనపల్లె ఎస్బీఐ కాలనీ రోడ్ నెం.3లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సాయితేజ చివరిగా సెప్టెంబర్‌లో వినాయక చవితికి స్వస్థలానికి వచ్చి వెళ్లారు. -
రేగడపల్లె ముద్దుబిడ్డ.. నిను మరువదు ఈ గడ్డ!
రేగడపల్లె.. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఓ కుగ్రామం. భరతమాత ముద్దుబిడ్డకు జన్మనిచ్చిన ఈ పల్లె ఇప్పుడు మౌనంగా రోదిస్తోంది. దేశానికే భద్రత కల్పించే అధికారికి రక్షణ కవచంగా నిలిచిన ఓ వీరుడు ఊహించని ప్రమాదంలో కన్నుమూయగా, నా బిడ్డడేనని గర్వంగా చాటుతోంది. మూడు పదుల వయసు కూడా లేని యువకుడు.. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి దేశం తలెత్తుకునే స్థాయికి ఎదిగి ఈ నేలలోనే ఒదిగిపోయాడు. విధి నిర్వహణలోనే∙వీర మరణం పొందాడు. దీంతో సొంతూరు కన్నీరు పెడుతోంది. దేశ సేవకు నడుంబిగించిన బి.సాయితేజ(27) అకాల మరణంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బి.కొత్తకోట: తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో లాన్స్‌నాయక్ బి.సాయితేజ మృత్యువాత పడ్డారు. దేశ భద్రత పర్యవేక్షించే సీడీఎస్ చీఫ్ సెక్యూరిటీ అధికారి అయిన ఈ యువ జవాను మృతితో స్వగ్రామం రేగడపల్లె కన్నీటి పర్యంతమవుతోంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన బి.మోహన్, బి.భువనేశ్వరి దంపతులకు బి.సాయితేజ, బి.మహేష్‌బాబు సంతానం. సాయితేజ స్థానికంగానే చదువుకున్నాడు. 10వ తరగతి పూర్తి కాగానే దేశానికి సేవ చేయాలనే తపనతో సైన్యంలో చేరాడు. డిగ్రీ పూర్తి చేసి గుంటూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌కు హజరై 2012లో సైనికుడిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పారా కమెండో పరీక్ష రాసి ఉత్తీర్ణతతో 11వ పారా లాన్స్ నాయక్ హోదా దక్కించుకున్నాడు. చీఫ్ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ఏర్పాటయ్యాక తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారిగా పనిచేస్తున్నాడు. రోజూ 10 కి.మీ రన్నింగ్ ఢిల్లీలో ఉన్నా, రేగడలో ఉన్నా సాయితేజ ప్రతిరోజు ఉదయం 10 కిలోమీటర్లు రన్నింగ్ చేసేవాడు. శరీర దృఢత్వానికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం చూసి ఊరే ఆశ్చర్యపోయేది. క్రికెట్ అడటమంటే కూడా ఎంతో ఇష్టం. గ్రామానికి చెందిన యువకులను క్రికెట్ టోర్నమెంట్లకు పంపుతూ ప్రోత్సహించేవాడు. ఎక్కడ క్రీడలు జరుగుతున్నా పాల్గొనేవాడు. రేగడలో ఉన్నన్ని రోజులు అందరితో కలసిమెలిసి ఉండటమేకాదు ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించేవాడని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. మంచి మిత్రుడు రేగడపల్లెకు చెందిన సాయితేజ, నేను మంచి స్నేహితులం. సాయితేజ 2012లో సైన్యంలో చేరగా, నేను 2014లో సీఆర్పీఎఫ్లో చేరా. ఇద్దరం ఒకేసారి సెలవులు తీసుకొని స్వగ్రామానికి వచ్చేవాళ్లం. నెలరోజులు ఎంతో సందడిగా గడిచిపోయేది. సాయితేజ మరణం నన్ను కలచివేస్తోంది. – వై.మనోజ్‌కుమార్‌రెడ్డి, సీఆర్పీఎఫ్ జవాను, రేగడపల్లె దేశ సేవలోనే ఇద్దరు కుమారులు పిల్లలు కళ్లముందే ఉండాలి.. కంటికి రెప్పలా చూసుకోవాలి.. పిల్లాపాపలతో ఇల్లు కళకళలాడాలి.. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఈ సంతోషమే. కానీ బి.మోహన్, బి.భువనేశ్వరి దంపతులు తమ కంటిపాపలను దేశ సేవకు అంకితం చేశారు. గొప్పగా బతికే ధనధాన్యాలు లేకపోయినా.. దేశానికే రక్షణ కల్పించే తమ బిడ్డలను చూసి ఉప్పొంగిపోయారు. ఉన్న ఇద్దరు పిల్లలు సైన్యంలో చేరగా.. పెద్ద కొడుకు రక్షణ విధుల్లోనే కన్నుమూశాడు. ఆ వీరునికి జన్మనిచ్చిన దంపతులను చూసి ఆ ఊరంతా ఒక్కటై వచ్చి ఓదారుస్తోంది. ఊరు ఊరే కదిలింది.. ఆ ఊరి పిల్లోడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడనే సమాచారం తెలియగానే ఊరు ఊరే సాయితేజ ఇంటి వద్దకు చేరింది. అప్పటికే విషయం తెలిసి కుప్పకూలిన జవాను తల్లిదండ్రులు బి.మోహన్, బి.భువనేశ్వరికి కుటుంబ సభ్యులై ఓదార్చారు. రక్షణ విధుల్లో తలమునకలయ్యే సాయితేజ సెలవుల్లో గ్రామానికి వచ్చినప్పుడు తలలో నాలుకగా మెలుగుతూ అందరి ఆప్యాయత చూరగొన్నాడు. అలాంటి తమ ఊరి ముద్దుబిడ్డ ఇకలేడంటే ఇప్పటికీ ఆ ఊరు నమ్మలేకపోతోంది. ఏం జరిగిందో తెలియక... ఎప్పుడూ లేనిది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు.. తల్లి శ్యామల గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు. ఏం జరిగిందో తెలియక చిన్నారులు మోక్షజ్ఞ, దర్శిని అందరి ముఖాల్లోకి దీనంగా చూస్తున్నారు. ఈ దృశ్యం చూసి కన్నీరుకార్చని హృదయం లేదు. -
Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు..
సాక్షి, చెన్నై: భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినట్టు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. బిపిన్ రావత్ ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్టు వెల్లడిచింది. చదవండి: (Bipin Rawat Chopper Crash: మృత్యువుతో పోరాడి కన్నుమూసిన రావత్) అయితే ఈ ప్రమాదంలో ఏపీ వాసి సాయితేజ్ కూడా మృతి చెందాడు. ఇతడి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నారు. 2013లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు సాయితేజ్. సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయితేజ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు. చదవండి: (Bipin Rawat: పది నిమిషాల్లో ల్యాండింగ్.. ఆ ఐదు నిమిషాల్లోనే ఘోరం!) -
డబ్బింగ్‌కే పదిహేను రోజులు పట్టింది
‘‘రిపబ్లిక్’ పక్కా కమర్షియల్ మూవీ కాదు.. డిఫరెంట్ మూవీ.. రియల్ స్టోరీ ఆధారంగా దేవ కట్టాగారు ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాకు 22 రోజులు పని చేశాం. అయితే డబ్బింగ్ చెప్పడానికి మాత్రం 15 రోజుల సమయం పట్టింది. అంటే.. డైరెక్టర్‌గారు ఎంత పర్ఫెక్షన్ కోరుకున్నారో అర్థం చేసుకోవచ్చు’’ అని ఐశ్వర్యా రాజేశ్ అన్నారు. సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా నటించిన చిత్రం ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేశ్ చెప్పిన విశేషాలు. ► కరోనా సమయంలో ఓ రోజు దేవ కట్టాగారు ఫోన్ చేసి, ‘రిపబ్లిక్’ స్క్రిప్ట్ గంట పాటు చెప్పారు. హైదరాబాద్ వచ్చి ఆయన్ని కలిశాక ఐదారు గంటల పాటు కథ చెప్పారు. హీరో, హీరోయిన్ అని కాకుండా క్యారెక్టర్స్, దాని ప్రాధాన్యతలేంటి? అని చూస్తారాయన. ఈ చిత్రంలో మైరా అనే ఎన్నారై అమ్మాయిగా కనిపిస్తాను. రొటీన్‌గా సాంగ్స్ పాడుకునేలా ఇందులో హీరో, హీరోయిన్ మధ్య లవ్‌ట్రాక్ ఉండదు. మెచ్యూర్డ్‌గా కనిపిస్తుంది. సినిమాలో లవ్ ప్రపోజ్ చేసే సీన్ కూడా ఉండదు. ► సినిమా అనేది మన జీవితాల్లో ప్రభావాన్ని చూపిస్తుంటుంది. అందుకే మనం సినిమా చూసినప్పుడు ఏదో ఒక పాయింట్‌కు కనెక్ట్ అవుతుంటాం. అలాంటి ఓ బలమైన సినిమా ద్వారా సమాజానికి అవసరమైన ఓ విషయాన్ని వివరిస్తూ తెరకెక్కించారు దేవ కట్టా. సాయితేజ్ ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. తన కెరీర్లో ‘రిపబ్లిక్’ బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. ► ఇప్పుడున్న హీరోయిన్స్‌లో సమంతగారంటే ఇష్టం. పెర్ఫార్మెన్స్ అయినా, గ్లామర్ రోల్స్ అయినా చక్కగా చేస్తారు. అనుష్కగారంటే ఇష్టం. సౌందర్యగారంటే ఎంతో అభిమానం. ప్రస్తుతం తెలుగు కథలు వింటున్నాను. త్వరలోనే కిరణ్ రెడ్డిగారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాను. తమిళంలో చాలా సినిమాలు చేస్తున్నాను. -
ఇదో కొత్త అనుభూతిని ఇస్తుంది
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా యస్.యస్. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇష్క్’. ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సమష్టిగా నిర్మించిన ‘ఇష్క్’ సినిమా ట్రై లర్‌ను సోషల్ మీడియాలో హీరో సాయితేజ్ విడుదల చేశారు. ఈ సినిమాను ఈ నెల 23న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ – ‘‘జాంబీరెడ్డి’ వంటి డిఫరెంట్ సినిమా తర్వాత నేను చేసిన సినిమా ‘ఇష్క్’. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సహించే మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థవారు కొంత గ్యాప్ తర్వాత తెలుగులో చేసిన ఈ సినిమాలో నేను హీరోగా నటించడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘యూనిట్లో అందరి సహకారంతో తక్కువ రోజుల్లో మంచి క్వాలిటీతో ఈ సినిమాను పూర్తి చేశాను. హీరోహీరోయిన్లు తేజ, ప్రియలతో పాటు ఆర్టిస్టు రవీందర్ కూడా బాగా నటించారు’’ అన్నారు యస్.యస్. రాజు. ‘‘సూపర్‌గుడ్ ఫిలింస్, మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ రెండూ ఒక్కటే. మా బ్యానర్ నుంచి వచ్చిన ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులు సూపర్‌హిట్ చేశారు. అనివార్య కారణాల వల్ల ఆరేడేళ్ల నుంచి తెలుగులో సినిమాలు చేయలేకపోయాం. ఇప్పుడు ‘ఇష్క్’ చేశాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు వాకాడ అప్పారావు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వరసాగర్, నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, పి. కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
దేవా కథ చెబుతానంటే వద్దన్నాను: సుకుమార్
‘‘ప్రస్థానం’ సినిమాని మనం ఇప్పటికీ మరచిపోలేదంటే.. ఆ సినిమాలోని సెన్సిబిలిటీస్, న్యారేషన్ అంత గొప్పగా ఉంటాయి. ‘రిపబ్లిక్’ కథను దేవా చెబుతానంటే వద్దన్నాను. ఎందుకంటే ఓ మంచి దర్శకుడి కథను వినకూడదు.. చూడాలి. ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. జీ స్టూడియోస్ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ని సుకుమార్ విడుదల చేశారు. దేవా కట్టా మాట్లాడుతూ– ‘‘సుక్కు సార్‌కి ఏకలవ్య శిష్యుణ్ణి. ‘బాహుబలి’ ఎంత ల్యాండ్ మార్క్ సినిమానో ‘రంగస్థలం’ కూడా అంతే ల్యాండ్ మార్క్ మూవీ. ‘రంగస్థలం’ కారణంగానే ‘రిపబ్లిక్’ చేశాను’’ అన్నారు. ‘‘సాయితేజ్‌తో తొమ్మిదేళ్లుగా ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రతిఫలమే ‘రిపబ్లిక్’ చిత్రం’’ అన్నారు జె.పుల్లారావు. ‘‘పొలిటికల్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు జె.భగవాన్ . సాయితేజ్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్‌గారు టీచర్ అయితే, బుచ్చిబాబు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్.. దేవాగారు మిడిల్ బెంచ్, నేను లాస్ట్ బెంచ్. నిజాయతీగా చేసిన ఈ సినిమా అందరికీ చేరువవుతుంది. మణిశర్మగారితో పని చేయాలనే నా ఆకాంక్ష ఈ సినిమాతో తీరింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు, నటులు మనోజ్ నందం, రవివర్మ, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్ జై కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పండగ ఆరంభం
సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దాసరి దర్శకత్వం వహిస్తున్న ‘ప్రతిరోజు పండగే’ చిత్రం సోమవారం ఆరంభమైంది. ‘సుప్రీమ్’ వంటి హిట్ సినిమా తర్వాత మళ్లీ సాయి తేజ్, రాశీ ఖన్నా నటిస్తున్న చిత్రం ఇది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2యూవీ పిక్చర్స్ పతాకంపై ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఏ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా జీఏ2యూవీ పిక్చర్స్ సంస్థగా ఏర్పడి సినిమాలు నిర్మిస్తున్నారు. గతంలో ఈ బ్యానర్ నుంచి మారుతి డైరెక్షన్లో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజా చిత్రంలో సత్యరాజ్, విజయ్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, ‘సత్యం’ రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, హరితేజ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎస్.కె.ఎన్, సంగీతం: తమన్. ఎస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు.