
చిత్తూరు: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన సైనికుడు లాన్స్ నాయక్ సాయితేజ పార్థివదేహానికి ఎగువరేగడిలో సైనిక లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మదనపల్లి నుంచి ఎగువరేగడ వరకూ దాదాపు 30 కిలోమీటర్ల అంతిమయాత్ర కొనసాగింది.
ఎగువరేగడకు చేరుకున్న సాయితేజ భౌతిక కాయాన్ని చూడగానే ఆయన భార్య సొమ్మసిల్లి పడిపోయారు. కన్నీరుమున్నీరుగా సాయితేజ కుటుంబ సభ్యులు విలపించారు. ఆయన కొడుకు తండ్రి ఫోటోకు ‘లవ్ యూ డాడీ.. లవ్ యూ డాడీ..’ అంటూ బాధగా ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం కదిలించింది.