funeral procession
-
అధికార లాంఛనాలు లేకుండానే ముగిసిన ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: మారేడ్‌పల్లి స్మశానవాటికలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలు లేకుండానే సాయన్న అంత్యక్రియలు ముగిశాయి. సాయన్న కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సముదాయించారు. దీంతో, సాయన్న అనుచరులు ఆందోళన విరమించారు. అనంతరం, సాయన్న అల్లుడు శరత్ చంద్ర అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేశారు. అంతకుముందు.. సాయన్న అంత్యక్రియలు సోమవారం మారేడుపల్లిలోని హిందు స్మశానవాటికలో జరగాల్సి ఉండగా.. ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరపకపోవడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతిమ సంస్కారాలు అధికారిక లాంఛనాలతో జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాద్ యాదవ్, మల్లారెడ్డి స్మశానవాటిక నుంచి వెళ్లిపోయారు. దీంతో, సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. తర్వాత.. అంత్యక్రియల అంశంపై పద్మారావు గౌడ్.. రంగంలోకి దిగి అనుచరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ చివరకు ఎమ్మెల్యే అంత్యక్రియలు మాత్రం అధికార లాంఛనాలు లేకుండానే ముగిశాయి. -
హీరాబెన్ అంత్యక్రియలు.. తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ.. (ఫొటోలు)
-
అంతిమ యాత్రకు బయలుదేరిన రేవంత్ రెడ్డికి షాకిచ్చిన పోలీసులు
-
Lance Naik Sai Teja Final Rites : సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు ఫొటోలు
-
‘లవ్యూ డాడీ’ అంటూ.. సాయితేజ ఫోటోను ముద్దాడిన కొడుకు
చిత్తూరు: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన సైనికుడు లాన్స్ నాయక్ సాయితేజ పార్థివదేహానికి ఎగువరేగడిలో సైనిక లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మదనపల్లి నుంచి ఎగువరేగడ వరకూ దాదాపు 30 కిలోమీటర్ల అంతిమయాత్ర కొనసాగింది. ఎగువరేగడకు చేరుకున్న సాయితేజ భౌతిక కాయాన్ని చూడగానే ఆయన భార్య సొమ్మసిల్లి పడిపోయారు. కన్నీరుమున్నీరుగా సాయితేజ కుటుంబ సభ్యులు విలపించారు. ఆయన కొడుకు తండ్రి ఫోటోకు ‘లవ్ యూ డాడీ.. లవ్ యూ డాడీ..’ అంటూ బాధగా ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం కదిలించింది. -
సెలవిక.. సైనికా!
బి.కొత్తకోట: ‘సాయితేజ అమర్ రహే.. జై జవాన్.. భారత్ మాతాకీ జై’ అంటూ వేలాదిగా తరలివచ్చిన ప్రజల నినాదాలతో ఎగువరేగడి గ్రామం ప్రతిధ్వనించింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన లాన్స్‌నాయక్ బి.సాయితేజ అంత్యక్రియలు అతడి కుటుంబీకులు, సన్నిహితులు, బంధువుల అశ్రునయనాల నడుమ సైనిక, పోలీసు లాంఛనాలతో పూర్తయ్యాయి. బెంగళూరులోని ఆర్మీ బేస్ ఆస్పత్రి నుంచి సాయిజేజ మృతదేహం ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కురబలకోట మండలం ఎగువరేగడి గ్రామానికి చేరుకుంది. అప్పటికే వేలాదిగా తరలివచ్చిన ప్రజలు సాయితేజ భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. పార్థివదేహాన్ని తొలుత సాయితేజ ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే మైదానానికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం గంటకుపైగా ఉంచారు. అనంతరం ఇంటి సమీపంలో సిద్ధం చేసిన సమాధి వద్దకు శవ పేటికను ప్రజలు మోసుకొచ్చారు. అక్కడ సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ చేత తమ్ముడు మహేష్‌బాబు అంతిమ సంస్కారాలు చేయించారు. తర్వాత శవపేటికతో సహా సమాధి చేశారు. మధ్యాహ్నం 3:20 గంటలకు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. నినాదాలు, ఆర్తనాదాల నడుమ.. సాయితేజ మృతదేహం ఉన్న శవపేటికను మైదానంలోకి తీసుకురావడంతో జనం ఒక్కసారిగా జై జవాన్ నినాదాలతో హోరెత్తించారు. దర్శనార్థం జనం దూసుకొచ్చారు. పోలీసులు, ఆర్మీ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లకు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అరగంట వరకు ఇదేపరిస్థితి నెలకొనగా పోలీసులు జనాన్ని అదుపు చేశాక శవపేటిక వద్దకు భార్య శ్యామల, తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహన్, తమ్ముడు జవాన్ మహేష్‌బాబు, బంధువులు చేరుకోగా ఒక్కసారిగా ఆర్తనాదాలతో వాతావరణం ఆవేదనాభరితంగా మారింది. కొంతసేపు భార్య శ్యామల భర్త శవపేటిక వద్ద మౌనంగా ఉండిపోయింది. అర్తనాదాలు, జనం నినాదాలు, తోపులాటలు ఇవేమీ అర్థంకాని సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ జాతీయ పతాకం చేతపట్టి తండ్రి శవపేటిక వద్ద కూర్చున్న దృశ్యం కలచివేసింది. ఇక తండ్రి లేడన్న విషయం తెలియని మోక్షజ్ఞ తల్లి ఒడిలో కూర్చోని అటుఇటూ చూస్తూ జెండా ఊపుతూ కనిపించాడు. జనం జై జవాన్ నినాదాలు చేస్తుంటే సాయితేజ తమ్ముడు జవాన్ మహేష్‌బాబు వారితో గొంతు కలిపి జై జవాన్ అంటూ చేతులెత్తి నినాదాలు చేశాడు. అంత్యక్రియల సందర్భంగా రెండుచోట్ల అధికారిక లాంఛనాలు జరిపారు. తొలుత మైదానంలో శవపేటిక ఎదుట బెంగళూరు నుంచి వచ్చిన 11వ పారా సైనికులు గౌరవ వందనం చేశారు. అనంతరం గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. ఆర్మ్డ్ పోలీసులు కూడా గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమానికి బెంగళూరు సైనిక విభాగం నుంచి నలుగురు అధికారులు, ఐదుగురు జాయింట్ కమెండో ఆఫీసర్లు, 30 మంది సైనికులు హాజరయ్యారు. సమాధి చేసేముందు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకా లతో జనం నినాదాలు చేశారు. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు సెంథిల్‌కుమార్, వెంకట అప్పలనాయుడు సాయితేజ శవపేటికపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) వెంకటేశ్వర, బెంగళూరు నుంచి వచ్చిన 11వ పారా సైనిక విభాగం అధికారులు, మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, స్థానిక అధికారులు, ప్రముఖులు నివాళులర్పించారు. మదనపల్లె జెడ్పీ, హోప్, సీటీఎం, తంబళ్లపల్లె, చెంబకూరు హైస్కూళ్లు, మిట్స్, బీటీ కళాశాలకు చెందిన 200 మంది ఎన్సీసీ క్యాడెట్లు హాజరై నివాళులర్పించారు. అనంతరం సమాధి వద్దకు ప్రజలు శవపేటికను మోసుకొచ్చారు. శ్యామలకు జాతీయ పతాకం అందజేత సాయితేజ మృతదేహం ఉంచిన శవపేటికకు చుట్టిన జాతీయ పతాకాన్ని సైనిక అధికారులు అతడి భార్య శ్యామలకు అందజేశారు. దేశం కోసం సాయితేజ అమరుడైనాడని, మీకు దేశం అండగా ఉంటుందని దైర్యం చెప్పారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మాటిచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎద్దు అంతిమ సంస్కారం.. 3 వేల మంది హాజరు
లక్నో: మరణించిన ‘బాబూజీ’ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పూజారి మంత్రాలు పఠిస్తున్నాడు. అక్కడ గుమికూడిన ప్రజలు పూజారి ఆజ్ఞల ప్రకారం చేస్తున్నారు. దాదాపు 3 వేల మంది జనాలు బాబూజీ అంతిమ సంస్కారాలకు హాజరు అయ్యారు. ఇంత మంది అభిమానాన్ని చూరగొన్న బాబూజీ ఎంత అదృష్టవంతుడో కదా అనుకుంటున్నారా.. అయితే అక్కడే ఉంది ట్విస్ట్. ఇంత భారీ ఎత్తున జనాలు హాజరయ్యింది మనిషి కర్మకాండ కార్యక్రమానికి కాదు.. ఎద్దుది. వినడానికి కాస్త వింతగా ఉన్న ఇది వాస్తవం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ షహరాన్‌పూర్ కుర్ది గ్రామంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గ్రామస్తులు ముద్దుగా ‘బాబూజీ’ అని పిలుచుకునే ఎద్దు గత 20 ఏళ్లుగా కుర్ది గ్రామంలో ఉంటుంది. గ్రామస్తులు ఆ ఎద్దును భగవంతుడి బహుమతిగా భావించేవారు. ఇక బాబూజీ కూడా సాధు స్వభావం కల్గి ఉండి.. ఎవరికి ఏ హానీ చేసేది కాదు. పిల్లలైతే బాబూజీ దగ్గరకు వెళ్లి ఎలాంటి భయం లేకుండా దానితో ఆడుకునేవారు. అలా 20 ఏళ్లుగా గ్రామస్తుల కుటుంబంలో భాగస్వామిగా ఉన్న బాబూజీ ఈ నెల 15న మృతి చెందింది.(చదవండి: ‘పోయిన పరువు తిరిగి తీసుకురాగలరా’... క్యాబ్ డ్రైవర్ ఆవేదన) బాబూజీ మరణం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. చాలా మంది తమ ఇంట్లోనే వ్యక్తి మరణించినట్లే భావించారు. ఇక బాబూజీ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్న గ్రామస్తులు.. ఇంటికింత అని చందా వేసుకుని డబ్బు పోగు చేశారు. అలా జమ అయిన డబ్బుతో ఘనంగా బాబూజీ అంత్యక్రియలు నిర్వహించడమే కాక.. అంతిమసంస్కార కార్యక్రమాలు కూడా నిర్వహించారు. (చదవండి: కట్నంకోసం, నడివీధిలో అమానుషం: షాకింగ్) ఈ క్రమంలో ఆదివారం బాబూజీకి కర్మకాండ కార్యక్రమం నిర్వహించగా.. దీనికి ఏకంగా 3 వేల మంది హాజరయ్యారు. బాబూజీ మృతికి సంతాంప తెలిపారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘చాలా ఏళ్ల క్రితం బాబూజీ మా గ్రామానికి వచ్చింది. మా ఊరిలో పవిత్ర ప్రదేశంగా భావించే స్థలంలో బాబూజీ కనిపించడంతో.. దాన్ని దేవుడి బహుమతిగా భావించాం. చాలా మంది దాన్ని నందిగా భావించేవారు. ఇక బాబూజీ గ్రామంలో తిరుగుతున్నంకాలం మా జీవితాలు ఎంతో సంతోషంగా ఉన్నట్లు అనిపించేది. బాబూజీ మృతి మమ్మల్ని ఎంతో బాధిస్తుంది. మా కుటుంబ సభ్యుడే మరణించినంత బాధగా ఉంది’’ అని తెలిపాడు. ఈ క్రమంలో గ్రామంలోని కొందరు యువకులు బాబూజీ కటౌట్ ఏర్పాటు చేసి.. దాని మెడలో పూల దండలు, కరెన్సీ నోట్ల దండలు వేశారు. -
ఆమె మృత్యు ఘోషకు భయపడే..
సాక్షి, న్యూఢిల్లీ : ఒళ్లంతా ఛిద్రమై పక్షం రోజులపాటు ఆస్పత్రిలో అవస్థపడి అశువులు బాసిన 19 ఏళ్ల కూతురును కడసారి నుదిటి మీద ముద్దు పెట్టుకొని కాటికి పంపుదామనుకున్న ఆ కన్న తల్లి కల నెరవేరలేదు. పొంగి పొర్లుకొచ్చే కన్నీటి బిందువులు కనిపించకుండా ముఖాన కొంగు కప్పుకొని ఆఖరి సారి ఆప్యాయంగా ఆ చెంప నిమిరి పంపించాలనుకున్న కుటుంబ సభ్యుల ఆఖరి కోరిక తీరలేదు. అంబులెన్స్‌లో ఇంటికొచ్చిన మృతదేహాన్ని ఆపండంటూ ఇంటి ముందే గుమిగూడిన జనం అడ్డం పడినా....పట్టించుకోకుండా నేరుగా శ్మశానానికి పంపించి అర్ధరాత్రి దాటాక దహన సంస్కారాలు దగ్గరుండి జరిపించిన పోలీసులకు ఎన్ని శాపనార్థాలు పెడితే ఏం లాభం...? మృతదేహాన్ని ఇంటి వద్దనే ఉండనిస్తే మరుసటి రోజు పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగే ప్రమాదం ఉందని తెలిసే రాత్రికి రాత్రే దహన సంస్కారాలు జరిపించామని ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్ పోలీసులు స్వయంగా కోర్టు ముందే ఒప్పుకున్నారు. వారి చెబుతున్నది అబద్ధమని, నలుగురు నిందితులను అత్యాచారం నుంచి తప్పించేందుకు ‘రేప్ జరగలేదు’ అంటూ ఫోరెన్సిక్ నివేదిక తీసుకున్న పోలీసులు, మరోసారి అటాప్సీ చేయడానికి ఆస్కారం లేకుండా దేహాన్ని దగ్ధం చేశారని ఇటు కాంగ్రెస్, అటు దళిత పార్టీలతోపాటు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. (మేమిద్దరం ఫ్రెండ్స్.. వాళ్లే చంపేశారు..) ఆలిగఢ్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సెప్టెంబర్ 22వ తేదీన సాక్షాత్తు మేజిస్ట్రేట్ నమోదు చేసిన దళిత యువతి మరణ వాంగ్మూలంలో నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై దాడి జరిగిందని తప్ప రేప్ జరిగిందని ఆ దళిత యువతి ఆరోపించలేదంటూ బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేసిన వీడియో క్లిప్ ద్వారా కూడా వాస్తవం ఏమిటో తెలుస్తోంది. తనపై నలుగురు యువకులు ‘జబర్దస్థ్’ చేశారని ఆ వీడియోలో దళిత యువతి నాలుగు సార్లు ఆరోపించింది. దారుణంగా రేప్ చేశారని చెప్పడాని యూపీ హిందీ యాసలో ‘జబర్దస్థ్’ అని వాడడం అక్కడ సర్వసాధారణం. అత్యాచారం జరగలేదని ఢిల్లీ ఆస్పత్రి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదు. రేప్ జరిగిందని చెప్పడానికి ఆనవాళ్లు లేవని, లైంగికదాడి జరిగిన 15 రోజులకు వైద్య పరీక్షలు జరిపితే అలాంటి ఆనవాళ్లు దొరకవని వైద్య నిపుణులే తేల్చి చెప్పారు. (భయంతో బతకలేం.. ఊరొదిలి పోతాం!) తెల్లారితే మృతదేహం వల్ల పెద్ద ఎత్తున అల్లర్లు, హింస చెలరేగే అవకాశం ఉందని తెలిసే రాత్రికి రాత్రే శవాన్ని దహనం చేశామంటూ పోలీసులు కోర్టు ముందు చెప్పడంలోనే నిజముందని అనిపిస్తోంది. ఇదే కారణంగా కశ్మీర్లో అనాదిగా మిలిటెంట్ల మృతదేహాలను, భద్రతా బలగాల ఎన్కౌంటర్లలో మరణించిన వారి భౌతికకాయాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే దహన సంస్కారాలు జరుపతూ వస్తున్నారు. ఇక టెర్రరిస్టుల విషయంలోనైతే దహనం తర్వాత మిగిలే బూడిదను కూడా ఎవరికి దొరక్కుండా చేస్తున్నారు. దళిత యువతి మరణ వార్త ఇప్పటికే ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించగా, మృతదేహం రూపంలో ఆమె వినిపించే మృత్యుఘోష ఎంత మందిని కదిలిస్తుందో, ఎంత హింసను సృష్టిస్తుందోనన్న పోలీసుల భయంలో నిజం లేదనలేం! (హథ్రాస్ కేసు : గ్రామ పెద్ద సంచలన ఆరోపణలు) -
ట్రంప్ తలపై రూ.575 కోట్లు
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ జనరల్ సులేమానీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలకు ఇరాన్ వెలకట్టింది. ఆయన్ను చంపిన వారికి దాదాపు రూ.575 కోట్ల భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. మరోవైపు, అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయిన జనరల్ సులేమానీ(62) మృతదేహం సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకుంది. సులేమానీకి నివాళులర్పించేందుకు నలుపు రంగు దుస్తులు ధరించిన జనం ఇసుకేస్తే రాలనంతమంది తరలివచ్చారు. అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వంలో ప్రార్థనలు జరిగాయి. జనరల్ సులేమానీ, తదితరులకు చెందిన శవపేటికల వద్ద ప్రార్థనలు చేసే సమయంలో ఖమేనీ కన్నీటి పర్యంతమయ్యారు. అధ్యక్షుడు రౌహానీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చంపిన వారికి భారీ బహుమానం అందజేస్తామంటూ ఈ సందర్భంగా ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.ఇరాన్‌లోని 8 కోట్ల మంది పౌరుల నుంచి ఒక్కో అమెరికా డాలర్(సుమారు రూ.71.79) చొప్పున రూ.575 కోట్లు చందాగా వసూలు చేసి ట్రంప్‌ను చంపిన వారికి అందజేస్తామన్నట్లు మిర్రర్ వెబ్సైట్ తెలిపింది. సులేమానీకి నివాళులర్పిస్తూ ఖమేనీ కంటతడి అలాగైతే.. ఇరాక్‌పైనా ఆంక్షలు అమెరికా బలగాలు తమ దేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ ఇరాక్ పార్లమెంట్ తీర్మానించడంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.‘ఇరాక్ కోసం మేం చాలా డబ్బు వెచ్చించాం. మా బలగాలను ఉంచిన వైమానిక స్థావరం ఏర్పాటుకు కోట్లాది డాలర్ల ఖర్చయింది. అదంతా తిరిగి చెల్లించకుండా ఖాళీ చేసేదిలేదు. ఒక వేళ మాపై ఒత్తిడి చేసినా, తేడాగా వ్యవహరించినా ఎన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ఆంక్షలను ఇరాక్ చవిచూడాల్సి ఉంటుంది’అని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా, ఇరాన్‌లు చేస్తున్న తీవ్ర ప్రకటనల నేపథ్యంలో జర్మనీ చాన్సెలర్ మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఒక ఉమ్మడి ప్రకటన చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని పక్షాల వారు బాధ్యతగా వ్యవహరించాలని ప్రకటనలో పేర్కొన్నారు. అణు ఇంధన శుద్ధి పరిమితులపై.. తాజా పరిణామాల నేపథ్యంలో 2015 అణు ఒప్పందంలోని ఇంధన శుద్ధిపై పరిమితులను ఇకపై పట్టించుకోబోమని ఇరాన్ ప్రకటించింది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పెంచుకుంటామని, ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విస్తృతం చేస్తామని తెలిపింది. అణ్వాయుధాలను తయారు చేయబోమన్న మునుపటి హామీకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కాగా, 2018లో అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్న అమెరికా ప్రకటించిన తర్వాత ఇరాన్ చేసిన తాజా ప్రకటనతో ఈ ఒప్పందం అమలు ప్రమాదం పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విరోధం ఇప్పటిది కాదు ► 1979: అమెరికా అండతో కొనసాగుతున్న ఇరాన్ పాలకుడు మొహమ్మద్ రెజా పహ్లావీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో ఆయన అమెరికాకు పారిపోయారు. ఆందోళనకారులు టెహ్రాన్‌లోని అమెరికా ఎంబసీని 1979 నవంబర్ నుంచి 1981 జనవరి వరకు ముట్టడించారు. ► 1988: గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ విమానాన్ని అమెరికా బలగాలు కూల్చివేశాయి. ఈ ఘటనలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ► 2000: ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందనే ఆరోపణలపై అమెరికా ఆంక్షలు. ► 2002: ఇరాక్, ఉత్తరకొరియాతోపాటు ఇరాన్‌ను అమెరికా దుష్ట్రతయంలో చేర్చింది. ► 2013–16: ఒబామా హయాంలో ఇరాన్‌తో సంబంధాలు గాడినపడ్డాయి. ► 2015: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా, చైనా, జర్మనీలు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ► 2019: అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. -
మామ చితి వద్దే కుప్పకూలిన అల్లుడు
సాక్షి, సిద్దిపేట: ఇంటి పెద్ద మరణించి పుట్టెడు దుఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని విధి వక్రికరించింది. అంత్యక్రియలు నిర్వహిస్తున్న క్రమంలో అస్వస్థకు గురైన అల్లుడు చితి వద్దే కుప్పకూలాడు. దీంతో రెండు ఇళ్లలో విషాదం నెలకొంది. ఈ ఘటన గురువారం నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్దిపడగ గ్రామానికి చెందిన పండగ నారాయణ (65) సింగరేణి బొగ్గు గనిలో పని చేసి ఉద్యోగ విరమణ పొందాడు. ఉపాధి కోసం సిద్దిపేటలో ప్రైవేట్ జాబ్ చేస్తూ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి అస్వస్థకు గురై నారాయణ మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం బుద్దిపడగలో అంత్యక్రియలు నిర్వహిస్తున్న క్రమంలో అతని అల్లుడు(కూతురు భర్త) తుపాకుల శ్రీధర్‌బాబు (36) చితి వద్దే సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది గమణించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే శ్రీధర్‌బాబు మృతి చెందినట్లు తెలిపారు. సిద్దిపేటలకు చెందిన శ్రీధర్‌బాబు డ్రైవర్‌గా పని చేస్తుండగా అతని భార్య సుజాత ప్రైవేట్ స్కూల్లో పని చేస్తోంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు లతిక, కీర్తికలున్నారు. బుధవారం సుమోలో ముంబాయికి కిరాయకు వెళ్తుండగా అతని మామయ్య నారాయణ వార్త తెలియడంతో బుధవారం రాత్రి శ్రీధర్‌బాబు ఇంటికి చేరుకొని అంత్యక్రియలకు దగ్గరుండి ఏర్పాటు చేశాడు. మామ మృతదేహాన్ని చితిపై ఉంచి కుటుంబ సభ్యులతో కలసి చితి చుట్టూ తిరుగుతుండగా ఉన్నట్లుండి శ్రీధర్‌బాబు కిందపడిపోయాడు. ఒకేసారి తండ్రి, భర్త మరణించడంతో విలపిస్తున్న సుజాతను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ఈ హృదయవిదారక ఘటనను అందరిని కలిచివేసింది. -
భర్తకు తలకొరివి పెట్టిన భార్య
సాక్షి, పాపన్నపేట(మెదక్): అకాల మరణం చెందిన భర్తకు భార్య తల కొరివి పెట్టి కర్మకాండ నిర్వహించిన విషాధకర సంఘటన చూసి పలువురు కన్నీరు పెట్టారు. పాపన్నపేట మండలం తమ్మాయిపల్లి గ్రామానికి చెందిన వడ్ల సాయి రాములు(38) గురువారం అకాల మరణం చెందగా శుక్రవారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. మృతునికి భార్య రాజేశ్వరితో పాటు ముగ్గురు ఆడపిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఉన్నారు. పదేళ్లలోపు కూతుర్లు ఉండడంతో భార్యనే అన్నీ తానై కుటుంబ సభ్యుల బంధువుల సహకారంతో అగ్గి పెట్టి కర్మకాండ నిర్వహించింది. సాయిరాం తన కులవృత్తి అయిన కార్పెంటర్ పని చేస్తూ మండల విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిగా సంఘసేవలో కలిసిమెలిసి ఉండేవాడు. సాయిరాం మరణం పట్ల మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మిన్పూర్ ఎంపీటీసీ వడ్ల కుబేరుడు, సంఘ బాధ్యులు శ్రీహరి, లక్ష్మణ్, రమేష్, లింగాచారి, సాయి లింగం, పాపన్నపేట బీజేపీ మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
శవయాత్రలో శబ్ద కాలుష్యం
సాక్షి, నిజామాబాద్: శవయాత్రలో భాగంగా కోర్టు ముందు డప్పులు వాయిస్తూ బాణాసంచా పేల్చి శబ్ద కాలుష్యానికి పాల్పడిన సంఘటన ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. ఈ సంఘటన ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు..ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీకి చెందిన ప్యాట్ల లక్ష్మన్(45) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందారు. శుక్రవారం కుటుంబ సభ్యులు మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కాలనీ నుంచి అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని కోర్టు మీదుగా శవయాత్రతో బయలుదేరారు. ఈ క్రమంలో కోర్టు ఎదుట గల అంబేద్కర్ చౌరస్తా వద్ద బాణసంచా పేల్చారు. కోర్టు ఎదుట నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టించి తమ విధులకు ఆటంకం కల్పించిన వారిని తన ముందు హాజరు పరచాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు ఘటనకు బాధ్యులైన ఐదుగురిపై కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి చర్యను నిరసిస్తూ పట్టణంలోని ఎల్ఐసీ భవనం ఎదుట 63వ నెంబరు జాతీయ రహదారిపై మృతదేహంతో నాలుగు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా కూర్చుని రాస్తారోకో చేయడంతో రహదారికి ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణికులు బస్సులు వదిలి కాలినడకన బస్టాండ్‌కు చేరుకున్నారు. ఆర్మూర్ సీఐ రాఘవేందర్‌తో పాటు పోలీసులు ఆందోళనకారులకు ఎంత సర్దిచెప్పినా వినలేదు. తమ బంధువులపై పెట్టిన కేసులు ఎత్తివేసే వరకు రాస్తారోకోను విరమించేది లేదని బీష్మించుకు కూర్చున్నారు. అంత్యక్రియలు సైతం చేసేది లేదంటూ తేల్చిచెప్పారు. చివరికి ఆర్మూర్ ఏసీపీ అందె రాములు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు రాస్తారోకో చేస్తున్న స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు సర్ది చెప్పారు. వారిపై ఎలాంటి కేసులు ఉండవని పోలీసులతో పాటు న్యాయవాదులు లోక భూపతిరెడ్డి, ఎంకే నరేందర్, గంట సదానందం హామీ ఇవ్వడంతో రాస్తోరోకో విరమించారు. -
శవయాత్రలో విషాదం..!
సాక్షి, కరీంనగర్ : జిల్లాలోని గంగాధర మండలం గర్శకుర్తిలో బుధవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరణించడంతో శవయాత్ర చేస్తున్న బంధువులు, గ్రామ ప్రజలపై తేనెటీగలు మూకుమ్మడి దాడి చేశాయి. దీంతో శవాన్ని వదిలేసి జనం పరుగులు తీశారు. అయితే, తేనెటీగలు పెద్ద ఎత్తున కుట్టడంతో లచ్చయ్య అనే వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. 35 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితులు కరీంగనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
మనుషులే కాదు.. మేం కూడా స్పందిస్తాం
న్యూఢిల్లీ : మనుషులకు మాత్రమే స్పందించే గుణం ఉందనుకుంటాం. కానీ కొన్ని సార్లు జంతువులు కూడా మనుషుల్లానే స్పందిస్తాయి. విచారం, ప్రేమ, బాధ వంటి ఫీలింగ్స్‌ను వ్యక్తం చేస్తాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచిందో సంఘటన. మన ఆప్తులు చనిపోతే.. శోకించడం.. సంతాపం తెలపడం సహజం. కానీ జంతువులు కూడా ఇలానే ప్రవర్తిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం సోషల్ మీడియలో వైరలవుతోన్న ఈ వీడియోను చూస్తే నమ్మక తప్పదనిపిస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరలవుతోన్న ఈ వీడియోలో ఓ ఏనుగు చనిపోయిన పిల్ల ఏనుగును తీసుకొని రోడ్డు మీదకు వచ్చింది. ఆ వెంటనే చిన్నాపెద్దా ఏనుగులు దాని వెనకే వచ్చాయి. అవి అన్ని చనిపోయిన పిల్ల ఏనుగు మృతదేహం చుట్టూ చేరి.. ఓ నిమిషం పాటు సంతాపం తెలిపాయి. ఆ తర్వాత పిల్ల ఏనుగు మృతదేహాన్ని తిరిగి అడవిలోకి తీసుకెళ్లాయి. ఈ తతంగాన్నంతా ప్రవీణ్ కస్వాన్ అనే ఫారెస్ట్ అధికారి వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. మనుషులకే కాదు జంతువులు కూడా శోకాన్ని ప్రకటిస్తాయి.. వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి అంటున్నారు నెటిజన్లు. This will move you !! Funeral procession of the weeping elephants carrying dead body of the child elephant. The family just don’t want to leave the baby. pic.twitter.com/KO4s4wCpl0 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 7, 2019 -
జవాన్ అంతిమయాత్రలో ఎంపీ అభ్యంతరకర ప్రవర్తన
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ అజిత్ కుమార్ అంతిమ యాత్ర సందర్భంగా బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. ఉగ్రవాదుల దాడిలో నేలకొరిగిన అజిత్ కుమార్‌కు కడసారి నివాళులు అర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ఉన్నావ్‌కు తరలిరాగా జవాన్ భౌతికకాయం ఉంచిన వాహనంపై స్ధానిక ఎంపీ సాక్షి మహరాజ్ వారందరికీ నవ్వుతూ అభివాదం తెలపడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ఎండగట్టారు. కాగా, జవాన్ అంతిమయాత్రలో సాక్షి మహరాజ్ అభ్యంతరకర ప్రవర్తనతో కూడిన వీడియో, ఫోటోలను మరికొందరు పోస్ట్ చేశారు. బీజేపీ ఎంపీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ఎంపీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. సాక్షి మహరాజ్ జవాన్ అంతిమ యాత్రను అభినందన యాత్రగా పీలవుతున్నారని ఓ నెటిజన్ వ్యంగ్యాస్త్ర సంధించగా, బీజేపీ ఎంపీ చర్య సిగ్గుచేటని మరో యూజర్ మండిపడ్డారు. -
ప్రారంభమైన హరికృష్ణ అంతిమయాత్ర
-
కన్నీటి వీడ్కోలు
-
ప్రారంభమైన కరుణానిధి అంతిమయాత్ర
-
సాయంత్రం 4గంటలకు అంతిమయాత్ర ప్రారంభం
-
శ్రీదేవి అంతిమ యాత్ర
-
శ్రీదేవి అంతిమ యాత్రకు వేలాదిగా తరలిన అభిమానులు
-
శ్మశానవాటికకు శ్రీదేవి భౌతికకాయం
ముంబై : సినీనటి శ్రీదేవి అంతిమ యాత్ర ముగిసింది. ఆమె అంతిమ యాత్రకు తారాలోకం తరలి వచ్చింది. తన అభిమాన నటిని కడసారి చూసుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర సాగింది. మరోవైపు విల్లేపార్లేలోని సేవా సమాజ్ శ్మశాన వాటిక వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 9.30 సమయంలో అభిమానుల సందర్శనార్థం శ్రీదేవి ఇంటికి సమీపంలోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్లో ఉంచారు. మధ్యాహ్నం 12.30 వరకు అభిమానులను అనుమతించారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా యాత్రలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరో వెంకటేష్‌లతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు ఇప్పటికే ముంబై విచ్చేశారు విలేపార్లే హిందూ స్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీదేవికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. గౌరవ సూచకంగా ఆమె భౌతికకాయంపై పోలీసులు త్రివర్ణ పతాకం కప్పారు. ఈ నెల 24న శ్రీదేవి దుబాయ్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఆలస్యంగా.. ఆఖరిచూపులు
పొట్టకూటికోసం దేశంకాని దేశానికి వెళ్లిన వలసజీవులు విగతజీవులుగా మారి స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. సౌదీ అరేబియాలో మృతి చెందిన ఇద్దరి మృతదేహాలు ఆలస్యంగా రావడంతో వారి కుటుంబసభ్యులు కడసారిగా చూసి తల్లడిల్లిపోయారు. కష్టపడి నాలుగురాళ్లు సంపాదించుకుని వస్తారనుకుంటే ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోయారా.. అంటూ వారు రోదించిన తీరు ప్రజలను కలిచివేసింది. హన్వాడ/గుండేడ్ (మహబూబ్‌నగర్): హన్వాడ మండలం నాగంబాయితండాకు చెందిన ఆంగోత్ శంకర్‌నాయక్(45) బతుకుదె రువు నిమిత్తం సౌదీఅరేబియాకు వెళ్లాడు. వెళ్లిన కొన్ని నెలలకు శంకర్ అకస్మాత్తుగా అస్వస్తతకు గురయ్యాడు. తోటి మిత్రులు సౌదీలోని రియాద్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం అందిస్తుండగా అదే ఆస్పత్రిలో గత జనవరి 13న ప్రాణాలు విడిచాడు. అప్పటి నుంచి నేటి వరకు భార్యాపిల్లలు, బంధువులు కడసారి చూపుల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. మృతదేహం కోసం భార్య గంగమ్మ పలుమార్లు కలెక్టర్ మొదలుకుని ఎమ్మెల్యే వరకు ప్రాధేయపడింది. ఫలితం దక్కకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా గ్లోబల్ బంజారా వెల్ఫేర్ సొసైటీ వారు బాసటగా నిలిచారు. శంకర్ మృతదేహాన్ని రప్పించేందుకు జీబీడబ్ల్యూఎస్ వారిని ఆశ్రయించారు. ఇందుకోసం రూ.1.25లక్షల ఖర్చు అవుతుండగా వారే భరించి సౌదీ నుంచి ముంబాయికి, అటునుంచి హైదరాబాద్‌కు తెప్పిం చారు. మృతదేహాన్ని చూ సిన వెంటనే కుటుంబసభ్యులు ఒక్కసారిగా బోరుమన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం గ్లోబల్ బంజారా వెల్ఫేర్ సొసైటీ వారు బాధిత కుటుంబానికి రూ.62వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఆదుకోవాలని వెల్ఫేర్ ఇన్చార్జ్ డాక్టర్ ఎం.రవినాథ్ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర నూతన కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్, చిలకమర్రి నర్సింహులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వలసకూలికి అంత్యక్రియలు గండేడ్ మండలం షేక్‌పల్లి తండాకు చెందిన దేవిజానాయక్ (48) సౌదీ అరేబియాకు వలస వెళ్లి ఈనెల 13న మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహం 14 రోజుల అనంతరం స్వగ్రామానికి రాగా మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శాంతీబాయి కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం కుటంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు. -
గుడ్ బై గుడ్ బై మై డియర్ 'లీ'
సింగపూర్: సింగపూర్ వ్యవస్థాపక ప్రధాని లీ క్వాన్ యూ అంతిమయాత్ర ప్రారంభమైంది. గత సోమవారం చనిపోయిన ఆయన పార్థీవదేహాన్ని పార్లమెంటు భవనంలో పలువురు ప్రముఖుల దర్శనార్థం ఉంచిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం బ్రిగేడియర్ జనరల్ ఓంగ్జి చిన్ నేతృత్వంలోని ఎనిమిదిమంది సీనియర్ కమాండర్ల ఆధ్వర్యంలో లీ శవపేటికను పార్లమెంటు భవనం వెలుపలికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు వీడ్కోలు పలికేందుకు అశ్రునయనాలతో అశేష జనవాహిని అక్కడకు వచ్చింది. వీధుల్లో చేరిన జనం రోధిస్తూ 'గుడ్ బై గుడ్ బై మై డియర్ లీ' అంటూ వీడ్కోలు చెప్పారు. భారీ భద్రత బలగాలు మోహరించాయి. భారీ పరేడ్ నిర్వహించాయి. తమ చేతుల్లోని తుఫాకీలతో గౌరవ వందనం సమర్పించాయి. దాదాపు నాలుగు లక్షలమందికి పైగా ఆయన పార్థీవదేహానికి నివాళులు అర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఇతర దేశాల ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు.