సాక్షి, హైదరాబాద్: మారేడ్‌పల్లి స్మశానవాటికలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలు లేకుండానే సాయన్న అంత్యక్రియలు ముగిశాయి. సాయన్న కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సముదాయించారు. దీంతో, సాయన్న అనుచరులు ఆందోళన విరమించారు. అనంతరం, సాయన్న అల్లుడు శరత్ చంద్ర అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేశారు.
అంతకుముందు.. సాయన్న అంత్యక్రియలు సోమవారం మారేడుపల్లిలోని హిందు స్మశానవాటికలో జరగాల్సి ఉండగా.. ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరపకపోవడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతిమ సంస్కారాలు అధికారిక లాంఛనాలతో జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాద్ యాదవ్, మల్లారెడ్డి స్మశానవాటిక నుంచి వెళ్లిపోయారు. దీంతో, సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. తర్వాత.. అంత్యక్రియల అంశంపై పద్మారావు గౌడ్.. రంగంలోకి దిగి అనుచరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ చివరకు ఎమ్మెల్యే అంత్యక్రియలు మాత్రం అధికార లాంఛనాలు లేకుండానే ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment