mla sayanna
-
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కూతురు వెన్నెల
హైదరాబాద్: కంటోన్మెంట్ శాసనసభా నియోజకవర్గంలో వారసురాళ్లు కదన భేరికి సంసిద్ధులవుతున్నారు. మూడు ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థులు పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న హఠాన్మరణంతో అధికార బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యరి్థగా ఆయన కుమార్తె లాస్యను ప్రకటించింది. దీంతో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు సైతం మహిళా అభ్యర్థుల వైపే మొగ్గు చూపే పరిస్థితులు ఎదురయ్యాయి. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి, ఆ వర్గం ఓటర్లపై దృష్టిపెట్టిన బీజేపీ.. ఈ ఎన్నికల్లోనే అధిక సంఖ్యలో అతివలకు టికెట్ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ► ఇక కాంగ్రెస్ సైతం తమ పార్టీ తరఫున మహిళనే రంగంలోకి దింపే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి ఇద్దరు మహిళా అభ్యర్థులు సుషి్మత శంకర్రావు, రజని ప్రధానంగా పోటీ పడుతుండగా, అధిష్టానం సుషి్మతకే టికెట్ కేటాయించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యరి్థగా దాదాపు ఖరారు చేసిందని తెలుస్తోంది. దీంతో కంటోన్మెంట్లో వారసురాళ్ల పోటీ అనివార్యం కానుంది. సుషి్మత తండ్రి శంకర్రావు 2009–14 మధ్య కాలంలో కంటోన్మెంట్లో ఎమ్మెల్యేగా పనిచేశారు. సాయన్న 1994 నుంచి 2009లో ఒక్కసారి మినహా అయిదుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గద్దర్ కుటుంబం కంటోన్మెంట్‌ను ఆనుకుని ఉండే అల్వాల్‌లో నివాసముంటోంది. బీజేపీ నుంచి సుస్మిత.. బీజేపీ నుంచి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉద్యోగి పరశురామ్, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న కపిల్ బరాబరి టికెట్ కోసం తీవ్రంగానే ప్రయతి్నస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే శంకర్రావు కుమార్తె సుషి్మతకు టికెట్ ఇప్పించడంలో ఆమె మామ వివేక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అధిష్టానం తీరుపై అసహనంతో ఉన్న వివేక్‌ను ఒప్పించే క్రమంలో బీజేపీ పెద్దలు ఆయన మేనకోడలు సుషి్మతకు టికెట్ ఖరారు చేయొచ్చనే అంచనాలున్నాయి. కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్.. కాంగ్రెస్ నుంచి స్థానిక నేతలు డీబీ దేవేందర్, నర్సింహతో పాటు పొంగులేటి అనుచరుడు పిడమర్తి, అల్వాల్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జీవక పోటీ పడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సైతం తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమర్పణకు వెళ్తూ అట్టహాసంగా ర్యాలీ నిర్వహించిన సర్వే ఆ తర్వాత సైలెంటయ్యారు. తాజా సమీకరణాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం గద్దర్ కుమార్తె వెన్నెల వైపు మొగ్గు చూపినట్లు సంకేతాలు అందుతున్నాయి. తొలి మహిళా ఎమ్మెల్యే మంకమ్మ 1957లో ఏర్పడిన కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా బీవీ గురుమూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. 1967లో ఈ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో వి. రామారావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏడాదిలోనే ఈయన మరణించడంతో ఉపఎన్నికల్లో ఆయన సతీమణి మంకమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తిరిగి 1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలిచారు. కంటోన్మెంట్ తొలి, ఏకైక మహిళా ఎమ్మెల్యేగా రికార్డు ఆమె పేరిటే ఉంది. -
ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం!...ఎమోషనల్ అయిన సీఎం కేసీఆర్
-
Hyderabad: కంటోన్మెంట్లో కారు చిచ్చు!
హైదరాబాద్: తామంతా ఒక్కటేనంటూ చెప్పుకుంటున్న కంటోన్మెంట్ బీఆర్ఎస్లో వర్గ విభేదాలు ఎట్టకేలకు బహిర్గతమయ్యాయి. ఆత్మీయ సమ్మేళనాల సాక్షిగా నేతల మధ్య ఆధిపత్య పోరు తేటతెల్లం అవుతోంది. దివంగత ఎమ్మెల్యే సాయన్న వారసులకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదంటూ కొన్ని రోజులు బాహటంగానే విమర్శలు చేస్తున్న సాయన్న వారసులు ఏకంగా తిరుగుబావుటా ఎగరవేశారు. ఆతీ్మయ సమ్మేళనాల ఇన్చార్జ్ దాసోజు శ్రవణ్, నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టేశారు. తమ నివాసానికి కూతవేటు దూరంలోనే నిర్వహించిన ఐదో వార్డు ఆతీ్మయ సమ్మేళనానికి రాకుండా అదే సమయంలో నాలుగో వార్డులో పర్యటించడం ద్వారా తమ అసంతృప్తిని వెళ్లగక్కే ప్రయత్నం చేశారు. గత నెలలో బోయిన్పల్లి మల్లారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించిన ఒకటో వార్డు ఆతీ్మయ సమ్మేళనానికి సైతం సాయన్న వారసులు లాస్య నందిత, నివేదిత గైర్హాజరయ్యారు. మంత్రులు తలసాని, మల్లారెడ్డి పాల్గొన్న సమావేశానికి సైతం రాకపోవడంతో అప్పట్లోనే చర్చనీయాంశమైంది. తాజాగా సాయన్న వారసులతో పాటు వారి వర్గానికి చెందిన మెజారిటీ నేతలు రాకపోవడం గమనార్హం. అలకకు కారణాలేంటో? దివంగత ఎమ్మెల్యే సాయన్న మరణించిన మరునాడే అంత్యక్రియల విషయంలో ఆయన వర్గీయులు అధిష్ఠానంపై సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక సాయన్న దశదిన కర్మ ముగిసిన మరునాటి నుంచే మంత్రి తలసాని, మర్రి రాజశేఖర్ రెడ్డిల నడుమ ఆధిపత్య పోరుతో సాయన్న వారసులకు ఆదరణ లేకుండా పోయింది. ఈ క్రమంలో మర్రి రాజశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో అసమ్మతి మరింత పెరుగుతూ వచి్చంది. అందరినీ కలుపుకోవడమే తన లక్ష్యమంటూ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న కార్పొరేషన్ చైర్మన్లు మన్నె క్రిశాంక్, గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌లతో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి బీఆర్ఎస్లో చేరిన శ్రీగణేశ్ తదితరులందరినీ ఒకే వేదిక మీద కూర్చునేలా చేస్తూ ఆతీ్మయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో తమ తండ్రి సాయన్న పేరును తగ్గించే కుట్రకు తెరలేపారంటూ సాయన్న వారసులు అలక వహిస్తూ వచ్చారు. అదే సమయంలో తమకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారంటూ మర్రి రాజశేఖర్ రెడ్డిని నేరుగా నిలదీసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సాయన్న హయాంలో నిరి్మంచిన మడ్‌ఫోర్ట్, మారేడుపల్లి డబుల్ ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అధిష్ఠానం పెద్దలు కొందరు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లిన సాయన్న అక్కడే తొలిసారిగా గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరి రెండ్రోజుల చికిత్స అనంతరం మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన ఆఖరి కోరికను నెరవేర్చే విషయంలోనూ తమకు సహకారం అందడం లేదని సాయన్న వారసులు ఆవేదనతో ఉన్నారని, ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే.. తాము వ్యక్తిగత పనుల వల్లే సమావేశానికి రాలేకపోయామంటూ లాస్య, నివేదిత పేర్కొనడం కొసమెరుపు ఎర్రోళ్ల సైతం.. ఇక నియోజకవర్గం పరిధిలోనే ఐదో వార్డులో నివాసముండే సమయంలోనే డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విద్యార్ధి విభాగం నేతగా, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరోలోనూ స్థానం దక్కించుకున్నారు. తొలి తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం టీఎస్–ఎంఎస్ఐ డీసీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. తాను సొంతంగా భావించే ఐదో వార్డు ఆత్మీయ సమావేశానికి తనకే ఆ హ్వానం లేదంటూ ఆయన డుమ్మా కొట్టడం విశేషం. -
అధికార లాంఛనాలు లేకుండానే ముగిసిన ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: మారేడ్‌పల్లి స్మశానవాటికలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలు లేకుండానే సాయన్న అంత్యక్రియలు ముగిశాయి. సాయన్న కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సముదాయించారు. దీంతో, సాయన్న అనుచరులు ఆందోళన విరమించారు. అనంతరం, సాయన్న అల్లుడు శరత్ చంద్ర అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేశారు. అంతకుముందు.. సాయన్న అంత్యక్రియలు సోమవారం మారేడుపల్లిలోని హిందు స్మశానవాటికలో జరగాల్సి ఉండగా.. ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరపకపోవడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతిమ సంస్కారాలు అధికారిక లాంఛనాలతో జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాద్ యాదవ్, మల్లారెడ్డి స్మశానవాటిక నుంచి వెళ్లిపోయారు. దీంతో, సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. తర్వాత.. అంత్యక్రియల అంశంపై పద్మారావు గౌడ్.. రంగంలోకి దిగి అనుచరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ చివరకు ఎమ్మెల్యే అంత్యక్రియలు మాత్రం అధికార లాంఛనాలు లేకుండానే ముగిశాయి. -
HYD: ఆగిపోయిన ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యం కారణంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, సాయన్న అంత్యక్రియల సందర్భంగా స్మశానవాటిక వద్ద ఆయన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరపాలని డిమాండ్ చేశారు. వివరాల ప్రకారం.. సాయన్న అంత్యక్రియలు సోమవారం మారేడుపల్లిలోని హిందు స్మశానవాటికలో జరగాల్సి ఉంది. అయితే, సాయన్న అంతిమ సంస్కారాలు అధికార లాంఛనాలతో జరపకపోవడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతిమ సంస్కారాలు అధికారిక లాంఛనాలతో జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాద్ యాదవ్, మల్లారెడ్డి స్మశానవాటిక నుంచి వెళ్లిపోయారు. దీంతో, సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఇక, సాయన్న అంత్యక్రియల అంశంపై పద్మారావు గౌడ్.. రంగంలోకి దిగి అనుచరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. -
సాయన్న భౌతికకాయానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నేతలు
-
సాయన్న భౌతికకాయానికి నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు
-
ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయాన్ని చూసి బోరుమన్న కుటుంబ సభ్యులు (ఫొటోలు)
-
సాయన్న బౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
-
ఎమ్మెల్యే సాయన్న మృతి.. కేసీఆర్, కిషన్‌రెడ్డి సహా పలువురి సంతాపం
సాక్షి, హైదరాబాద్: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న ఆదివారం ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సహా, పలు రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలుపుతున్నారు. - సాయన్న మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ సందర్బంగా ఐదు సార్లు ఎమ్మెల్యే గా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవను.. తనతో వారికున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. - మంత్రి కేటీఆర్ కూడా సాయన్న మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన మరణం చాలా బాదాకరమని అన్నారు. ఈ సందర్బంగా సాయన్న కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. - మంత్రి తలసాని కూడా సాయన్న మృతికి సంతాపం తెలిపారు. - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయన్న మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సాయన్న అందరితోనూ సౌమ్యంగా, ఆత్మీయంగా మాట్లాడేవారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సాయన్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు చెప్పారు. -
విషాదం: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బి. సాయన్న(72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న ఆదివారం తుదిశ్వాస విడిచారు. వివరాల ప్రకారం.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం చెందారు. ఆదివారం ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు సాయన్నను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయన్న కన్నుమూశారు. కాగా, సాయన్న గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక, సాయన్న ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సాయన్న.. 1951 మార్చి 5వ తేదీన చిక్కడపల్లిలో జన్మించారు. సాయన్నకు భార్య, ముగ్గుకు కుమారులు, కూతురు ఉన్నారు. -
మళ్లీ తెరపైకి ‘విలీనం’!
సాక్షి, హైదరాబాద్:సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్ బోర్డులను రద్దు చేసి..సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసే అంశంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డు ముఖ్య కార్యనిర్వాహణాధికారులకు రక్షణశాఖ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, బోర్డు విలీనంపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈవో అజిత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదిలావుండగా, ఇప్పటికే మనుగడలో ఉన్న కంటోన్మెంట్ల చట్టం–2006లోనూ పలు మార్పులు, చేర్పులు చేస్తూ కొత్త చట్టం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ముసాయిదా చట్టాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోంది. ఈ చట్టంలో బోర్డుల రద్దుపై ముందుకెళ్లకుండా..కీలక సంస్కరణలు, సవరణలకే మొగ్గు చూపుతున్నట్లు రక్షణశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చదవండి: అయ్యో.. ఐఫోన్ అందకపాయె..! రక్షణశాఖ ప్రతిపాదనలతో.. 2018 జులైలో దేశ వ్యాప్తంగా కంటోన్మెంట్లలోని జనావాసాలను వేరుచేస్తూ ఎక్స్‌క్లూజివ్ మిలటరీ స్టేషన్లు మార్చాలంటూ ఆర్మీ ఉన్నతాధికారులు రక్షణ మంత్రిత్వ శాఖను కోరారు. కంటోన్మెంట్ల పనితీరుపై అధ్యయనం (వర్కింగ్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డ్స్) కోసం 2018 ఆగస్టు 31న విశ్రాంత ఐఏఎస్ అధికారి సుమిత్ బోస్ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. ఇది భాగస్వామ్య పక్షాలనుంచి అభిప్రాయాలు సేకరించింది. ఆపై రద్దు అంశం తెరపైకి రావడంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైస్ 2019 ఫిబ్రవరిలో పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. దీనికి అప్పటి రక్షణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ బమ్రే స్పందిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్లను ఎక్స్‌క్లూజివ్ మిలటరీ స్టేషన్లుగా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నామని ప్రకటించారు. నిపుణుల కమిటీ నివేదిక మేరకు చర్యలు ఉంటాయన్నారు. 2109 ఏప్రిల్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగడంతో మే నెలలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఈ మధ్యలోనే ఎక్స్పర్ట్ కమిటీ ‘కంటోన్మెంట్ల చట్టం–2006’లో భారీ మార్పులు చేస్తూ నివేదికను సమర్పించింది. తదనుగుణంగా కంటోన్మెంట్ ముసాయిదా చట్టం– 2020 రూపొందించారు. ఈ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే, బిల్లులో కేవలం సవరణలు మాత్రమే ఉంటాయని, కంటోన్మెంట్ల రద్దు ప్రతిపాదనలు ఉండే అవకాశం లేదని డీజీడీఈ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. 1999లోనే ప్రయత్నించా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలపాల్సిందిగా 1999లోనే అప్పటి సీఎం చంద్రబాబు ద్వారా కేంద్ర రక్షణ శాఖకు విన్నవించా. ఈ ప్రతిపాదనపై అప్పటి రక్షణ శాఖ మంత్రి జార్జ్‌ఫెర్నాండెజ్ సానుకూలంగా స్పందించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రక్షణ శాఖ అధికారులను ఆదేశించారు. అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ స్థానిక కంటోన్మెంట్ బోర్డు తీర్మానం చేయడంతో విలీన ప్రతిపాదన అటకెక్కింది. – సాయన్న ఎమ్మెల్యే -
‘మన కూరగాయలు’ చాలా కాస్ట్ గురూ..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రవేశపెట్టిన ‘మనకూరగాయలు’ రిటైల్ విక్రయ కేంద్రాల్లో ధరలు హాట్ హాట్‌గా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు. శుక్రవారం మోండా డివిజన్ మారేడుపల్లి నెహ్రూపార్కులో ‘మన కూరగాయల’ రిటైల్ విక్రయ కేంద్రాన్ని సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు. తాజా కూరగాయలు తక్కువ ధరలో విక్రయించాలనే సంకల్పంతో ‘మన కూరగాయల’ రిటైల్ కేంద్రాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. జన సంచారం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కేంద్రాన్ని ఏర్పాటుచేసి సేల్స్మెన్ల ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. మన కూరగాయల రిటైల్ విక్రయ కేంద్రాన్ని ప్రత్యేక క్యాబిన్లో ఏర్పాటు చేశారు. కూరగాయలు తాజాగా ఉండేందుకు ఏసీని సైతం ఏర్పాటు చేశారు. అన్నిరకాల కూరగాయలతో పాటు పండ్లను ఈ కేంద్రంలో అమ్మకానికి పెట్టారు. అయితే మన కూరగాయలు విక్రయ కేంద్రంలో ధరలు చూసి వినియోగదారులు కళ్లు తేలేస్తున్నారు. బయట మార్కెట్ ధరల కంటే సుమారు కిలోకు రూ.5 నుంచి 10 వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. సూపర్ మార్కెట్ల కంటే అదనంగా రేట్లు ఉండడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. బయటి మార్కెట్ కం టే సూపర్మార్కెట్లో కొంతమేర అధిక ధరలు ఉన్నప్పటికీ అదే స్థాయిలో మనకూరగాయలు విక్రయ కేంద్రంలో ధరలు ఉండడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. నేరుగా రైతు పండించిన కూరగాయలను వినియోగదారులకు అందించాలనే సంకల్పంతో వ్యవసాయ మార్కె టింగ్ శాఖ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ధరల్లో వ్యత్యాసం మూలంగా వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. దళారీ వ్యవస్థ నిర్మూలనకు మన కూరగాయలు తాజా కూరగాయలను అందించడంతో పాటు తక్కువ ధరలో నాణ్యమైన కూరగాయాలను అందించే లక్ష్యంగా ‘మన కూరగాయలు’ విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మన కూరగాయల రిటైల్ విక్రయ కేంద్రం ద్వారా దళారుల వ్యవస్థను పూర్తిగా రూపుమాపవచ్చునని, దీంతో వినియోగదారులకు తక్కువ ధరల్లోనే కూరగాయలు లభిస్తాయన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరికొన్ని మనకూరగాయల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సాయన్న తెలి పారు. డిప్యూటీ డైరెక్టర్ పద్మహర్ష, మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మోండా మార్కెట్ కార్పొరేటర్ రూప, నగేశ్ ఉన్నారు. -
తాడ్బన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మేయర్
హైదరాబాద్ : నగరంలో కలకలం రేపిన తాడ్బన్ రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని మేయర్ పరిశీలించారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్బన్ వద్ద ఉన్న ప్రమాదకర మలుపును బుధవారం మేయర్ బొంతు రామ్మోహన్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో పాటు పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. తాడ్బన్ మూలమలుపు వద్ద చెట్ల కొమ్మలు తొలగించడంతో పాటు, సమీపంలోని నాలాను వెంటనే తొలగించాలని మేయర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. -
రామన్నకుంట నీటి మళ్లింపుపై వివాదం
కంటోన్మెంట్ : కంటోన్మెంట్ పరిధిలోని రామన్నకుంట నీటి ప్రవాహం మళ్లింపు ఉద్రిక్తతకు దారితీసింది. కుంట పూర్తిస్థాయిలో నిండిపోవడంతో బ్యాక్ వాటర్ కారణంగా ఆరోవార్డు పరిధిలోని కొన్ని కాలనీలు జలమయం కావడంతో నీటిని కిందకు వదిలారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, పాండుయాదవ్ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే సీనియర్ ఐపీఎస్ అధికారిణి తేజ్‌దీప్ కౌర్ అక్కడకి చేరుకుని సౌజన్యకాలనీలోని తన ఇంటిముందునుంచి నీరు వెళ్లకుండా మళ్లించాలని బోర్డు సభ్యులు, సిబ్బందిని ఆదేశించారు. అంతేగాకుండా రెవెన్యూ, కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది, బోర్డు సభ్యుల ప్రమేయం లేకుండానే తాను సూచించిన చోట చెరువుకు గండివేయాలని హంగామా సృష్టించారు. దీనిని అడ్డుకున్నందుకు ఆమె సహాయక సిబ్బంది తమ ప్రతాపం చూపారు. ఉన్నతాధికారి సూచనల మేరకు బోయిన్ పల్లి పోలీసులు వాగ్వాదానికి దిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. దీంతో బోర్డు సభ్యులు సమస్యను సీఈఓ సుజాత గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సౌజన్య కాలనీలోని ఆమె ఇంటి ముందుకు వరద నీరు రాకుండా బస్తాలు అడ్డుపెట్టి ప్రవాహన్ని పక్క కాలనీలోకి మళ్లించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే సాయన్న ఆ ప్రాంతంలో పర్యటించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విధుల్లో జోక్యం తగదు: కేంద్ర రక్షణశాఖ ఆధీనంలోని ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సాగే ఇక్కడి మున్సిపల్ వ్యవహరాలపై ఇతర శాఖలకు చెందిన అధికారులు జోక్యం చేసుకోవడం సమంజసం కాదు. సీనియర్ ఐపీఎస్ అధికారిణి తమ సిబ్బంది విధుల్లో జోక్యం చేసుకున్నట్లు నా దృష్టికి వచ్చింది. శనివారం ఉదయం ఈ ఘటనపై విచారణ చేపడతాం. సౌజన్య కాలనీలో ఓ వీధిలో కొందరు వ్యక్తులు తమ ఇషా్తనుసారం బస్తాలు అడ్డుపెట్టి వరద నీటి ప్రవాహాన్ని ఇతరుల ఇళ్లమీదకు వదిలిన ఘటనపై కూడా చర్యలు తీసుకుంటాం. –సుజాత గుప్తా, సీఈఓ -
ఎమ్మెల్యే సాయన్నకు గుండెపోటు
హైదరాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సోమవారం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ప్రస్తుతం హైదరగూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయన్న ఆరోగ్యంపై వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఆయన కొద్దిరోజుల క్రితం టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. -
‘కారెక్కిన’ టీడీపీ ఎమ్మెల్యే సాయన్న
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎం.ఎస్. ప్రభాకర్‌లు ‘గులాబీ’ గూటికి చేరారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో గురువారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అధికారిక నివాసంలో తనను కలసిన సాయన్న, ప్రభాకర్లకు కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ ప్రభాకర్‌ను మంత్రి హరీశ్‌రావు వెంట బెట్టుకుని రాగా, ఎమ్మెల్యే సాయన్నను టీడీపీ నుంచి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు వెంటతీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా సాయన్న, ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలను చూసే తాను టీఆర్ఎస్లో చేరానని, ముఖ్యంగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చేస్తున్న కృషి అభి నందనీయమని సాయన్న పేర్కొన్నారు. నిరంతర విద్యుత్, తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం వంటివి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. టీఆర్ఎస్లో చేరినందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పారు. టీడీపీలో తనకు ఎలాంటి ఇబ్బం దులు కలగలేదని, అన్నివిధాలా తనకు ఆదరణ లభించింద న్నారు. టీడీపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఆ పార్టీని వీడాల్సిన పరిస్థితులు ఎదురవడం తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని... అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల ఒత్తిడి మేరకే తాను పార్టీ వీడాల్సి వచ్చిందని సాయన్న పేర్కొన్నారు. టీఆర్ఎస్లో చేరినందున టీడీపీకి, టీటీడీ బోర్డు సభ్యుని పదవికి రాజీ నామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌లో అన్యాయం: ఎమ్మెల్సీ ప్రభాకర్ కాంగ్రెస్‌లో కార్యకర్తలు, నాయకులకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ ప్రభాకర్ ఆవేదన చెందారు. కాంగ్రెస్‌ను వీడి, టీఆర్ఎస్లో చేరడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, రాష్ట్ర, గ్రేటర్ అభివృద్ధి కూడా ఆయనతోనే సాధ్యమని బలంగా నమ్ముతున్నానన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేస్తానని ప్రభాకర్ తెలిపారు. -
కాంగ్రెస్, టీడీపీలకు షాక్
-
కాంగ్రెస్, టీడీపీలకు షాక్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ ఎంసీ) ఎన్నికలకు ముందు టీడీపీ, కాంగ్రెస్ లకు షాక్ తగిలింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే జి. సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ గురువారం టీఆరెఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ సమక్షంలో వీరు గులాబీ కండువా కప్పుకున్నారు. పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీలో చేరారని ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. జంటనగరాల్లో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులతో జీహెచ్ ఎంసీలో టీఆర్ఎస్ పుంజుకుంటుందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్నప్పటికీ తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదని వాపోయారు. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.