
ఎమ్మెల్యే సాయన్నకు గుండెపోటు
హైదరాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సోమవారం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ప్రస్తుతం హైదరగూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయన్న ఆరోగ్యంపై వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఆయన కొద్దిరోజుల క్రితం టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే.