ఆస్పత్రిలో దురైమురుగన్ | Duraimurugan joined in hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో దురైమురుగన్

Published Mon, Nov 14 2016 3:31 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

Duraimurugan joined in hospital

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిక
అపోలో వద్దకు డీఎంకే నేతలు

సాక్షి, చెన్నై : డీఎంకే శాసనసభా పక్ష ఉప నేత, సీనియర్ నాయకుడు దురైమురుగన్ గుండెపోటుతో అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారంతో డీఎంకే వర్గాలు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నాయి. డీఎంకేలోని సీనియర్ నాయకుల్లో దురైమురుగన్ ముఖ్యుడు. అధికారంలోకి వచ్చినప్పుడుగానీ, పార్టీ పరంగాగానీ, ప్రతి పక్షంలో ఉన్నా గానీ, ఆయనకు ప్రాధాన్యతను ఆ పార్టీ అధిష్టానం ఇవ్వడం జరుగుతున్నది. దీంతో డీఎంకేలో కరుణానిధి, అన్భళగన్, స్టాలిన్ తదుపరి స్థానాన్ని ఆయనకు కేటాయించారు. మంచి వాక్చాతుర్యం , పరిస్థితులకు అనుగుణంగా స్పందించే తత్వం కల్గిన దురైమురుగన్ డీఎంకే కార్యదర్శి, శాసనసభా పక్ష ఉప నేతగా వ్యవహరిస్తున్నారు.
 
 ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం తిరుచ్చిలో జరగనున్న ఓ కార్యక్రమం నిమిత్తం చెన్నైలోని ఇంటి నుంచి విమానాశ్రయానికి బయలు దేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఆయన సృ్పహ తప్పి కింద పడ్డారు. దీనిని గుర్తించిన భద్రతా సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, ఆగమేఘాలపై అంబులెన్‌‌సలో అపోలో ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు రావడంతోనే ఆయన సృ్పహ తప్పినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయనకు అపోలో ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. దురైమురుగన్‌ను విమానాశ్రయం నుంచి అపోలో ఆసుపత్రికి తరలించిన సమాచారంతో డీఎంకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. హుటాహుటిన ఆ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్, నేతలు రాజ, జగత్క్ష్రకన్‌లతో పాటు పలువురు నేతలు అక్కడికి పరుగులు తీశారు. వైద్యులతో సంప్రదింపులు జరిపి, దురైమురుగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement