
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే బి. సాయన్న(72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న ఆదివారం తుదిశ్వాస విడిచారు.
వివరాల ప్రకారం.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం చెందారు. ఆదివారం ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు సాయన్నను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయన్న కన్నుమూశారు. కాగా, సాయన్న గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక, సాయన్న ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సాయన్న.. 1951 మార్చి 5వ తేదీన చిక్కడపల్లిలో జన్మించారు. సాయన్నకు భార్య, ముగ్గుకు కుమారులు, కూతురు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment