Agitation At The Funeral Of BRS MLA Sayanna In Marredpally - Sakshi
Sakshi News home page

HYD: ఆగిపోయిన ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు

Published Mon, Feb 20 2023 6:30 PM | Last Updated on Tue, Feb 21 2023 10:07 AM

Agitation At The Funeral Of MLA Sayanna In Marredpally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనారోగ్యం కారణంగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, సాయన్న అంత్యక్రియల సందర్భంగా స్మశానవాటిక వద్ద ఆయన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరపాలని డిమాండ్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. సాయన్న అంత్యక్రియలు సోమవారం మారేడుపల్లిలోని హిందు స్మశానవాటికలో జరగాల్సి ఉంది. అయితే, సాయన్న అంతిమ సంస్కారాలు అధికార లాంఛనాలతో జరపకపోవడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతిమ సంస్కారాలు అధికారిక లాంఛనాలతో జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాద్‌ యాదవ్‌, మల్లారెడ్డి స్మశానవాటిక నుంచి వెళ్లిపోయారు. దీంతో, సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. 

ఇక, సాయన్న అంత్యక్రియల అంశంపై పద్మారావు గౌడ్‌.. రంగంలోకి దిగి అనుచరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement