KCR And Kishan Reddy Other Leaders Express Condolence To MLA Sayanna Death - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సాయన్న మృతి.. కేసీఆర్‌, కిషన్‌రెడ్డి సహా పలువురి సంతాపం

Published Sun, Feb 19 2023 3:56 PM | Last Updated on Sun, Feb 19 2023 5:10 PM

KCR And Kishan Reddy Other Leaders Condolence To MLA Sayanna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సాయన్న ఆదివారం ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సహా, పలు రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలుపుతున్నారు. 

- సాయన్న మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఈ సందర్బంగా ఐదు సార్లు ఎమ్మెల్యే గా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవను.. తనతో వారికున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

- మంత్రి కేటీఆర్‌ కూడా సాయన్న మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన మరణం చాలా బాదాకరమని అన్నారు. ఈ సందర్బంగా సాయన్న కుటుంబ సభ్యులకు కేటీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

- మంత్రి తలసాని కూడా సాయన్న మృతికి సంతాపం తెలిపారు. 

- కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సాయన్న మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో​నే సాయన్న అందరితోనూ సౌమ్యంగా, ఆత్మీయంగా మాట్లాడేవారు.  వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సాయన్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement