సాక్షి, హైదరాబాద్: అబద్ధాలు ఆడుతూ..అవినీతికి పాల్పడుతూ, రకరకాల ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్న కల్వకుంట్ల కుటుంబానికి ఆస్కార్ కాకపోతే అంతకుముందు నోబెల్ బహుమతి ఇవ్వా లని కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ బహిరంగసభల్లో కేసీఆర్ కుటుంబబండారం బయటపెట్టడంతో, వారు పూర్తిగా కుంగుబాటుకు గురై ఏం మాట్లాడుతు న్నారో కూడా తెలియడం లేదని చెప్పారు.
గురువారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రగతిభవన్‌లో వారుండేది ఇంకా రెండునెలలే, ఆ తర్వాత ఖాళీచేసి ఫామ్‌హౌస్‌కు పోవాల్సిందేనన్నారు. పెండింగ్‌లో ఉన్న ఏపీ–తెలంగాణకు కృష్ణానీటి పంపకాల బాధ్యత బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పగింత, ములుగులో గిరిజనవర్సి టీ, జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు వంటి మూడు కీలక అంశాలపై కేంద్ర కేబినెట్ ఒకేరోజు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు.
గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు జాప్యంలో పూర్తి బాధ్యత చేతకాని దద్దమ్మ ప్రభుత్వం కేసీఆర్‌దేనని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసమర్థత, నిర్ల క్ష్యం కారణంగా తెలంగాణకు పదేళ్లుగా అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్రానికి తాము పన్నులు, ఇతర రూపాల్లో రూపాయి ఇస్తే. అందులో 56 పైసలు ఇతరరాష్ట్రాలకు మళ్లిస్తున్నారని, తెలంగాణకు తగిన వాటా రావడం లేదని కేటీఆర్ చెబుతున్నారు కదా అన్న ప్రశ్నకు అవన్నీ చిల్లరోళ్ల చిల్లర మాటలని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
వారికి అధికారం, అహంకారం తలకెక్కింది
‘కల్వకుంట్ల కుటుంబానికి పూర్తిగా అధికారం తలకెక్కి అహంకారమదంతో ప్రధానిపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. ప్రధానిని టూరిస్ట్ అంటూ విమర్శలు చేస్తున్నరు. ఇచ్చిన హామీలు అమలు చేయని ముఖ్యమంత్రికి సిగ్గుండాలి’ అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్‌లో కూర్చుంటున్నడు. మోదీ పర్యటనకు వస్తే విమర్శిస్తూ పోస్టర్లు వేయడానికి సిగ్గుండాలి.
బయ్యారం స్టీల్ ఫాక్టరీపై ప్రధాని మోదీ ఏనాడు హామీ ఇవ్వలేదు. కేంద్రంతో సంబంధం లేకుండా తామే దానిని ఏర్పాటు చేస్తామని మాట తప్పినందుకు, ఇతర హామీలు నెరవేర్చనందుకు కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబసభ్యుల దిష్టిబొమ్మలు దహనం చేయాలి’ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి ఈ జిల్లాలు సస్యశ్యామలమై నట్టు, పొలాలు, ప్రజలకు తాగునీరు కల్పిస్తున్నట్టు హైదరాబాద్‌లో హోర్డింగ్‌లు పెట్టడం విడ్డూరమని, కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా దీని వ్యయం రూ.35 వేల కోట్ల నుంచి రూ. 57వేల కోట్లకు చేరిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment