KALVAKUNTLA
-
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇక లేనట్లేనా? : MLC కవిత
-
కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు.. మహిళతో కలిసి అరాచకం!
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదైంది. గెస్ట్‌హౌస్‌లో ఒకరిని నిర్బంధించడంతో పాటు దాడి చేసి 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోపిడీ చేసినట్లు అందిన ఫిర్యాదుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిందు మాధవి అలియాస్ నందిని అనే మహిళతో కలిసి అరాచకానికి పాల్పడ్డారు. న్యాయం కోసం కన్నరావు వద్దకు వెళ్లిన సాప్ట్ వేర్ ఉద్యోగి విజయవర్ధన్‌రావు వద్ద నగలు, నగదు ఉన్నాయని తెలుసుకున్న నందిని స్కెచ్ వేసింది. కన్నారావు, శ్యామ్ ప్రసాద్ లతో కలిసి పక్కా ప్లాన్ వేసింది. టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగ రావు, ఏసీపీ కట్టా సుబ్బయ్య తమకు క్లోజ్ అంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడి ఫిర్యాదుతో కన్నారావుతో సహా ఐదుగురిపై కేసును పోలీసులు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ భుజంగ రావు సైతం కన్నారావుకు సహకరించాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఒత్తిడి తెచ్చారు. లేకపోతే ఎన్కౌంటర్ చేస్తానని భుజంగ రావు తనను బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. కాగా, గతంలోనూ బిందు మాధురిపై పలు కేసులు ఉన్నాయి. -
లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
-
కల్వకుంట్ల కుటుంబానికి.. ఆస్కార్ కాకపోతే నోబెల్ ఇవ్వాలి: కిషన్‌రెడ్డి ఎద్దేవా
సాక్షి, హైదరాబాద్: అబద్ధాలు ఆడుతూ..అవినీతికి పాల్పడుతూ, రకరకాల ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్న కల్వకుంట్ల కుటుంబానికి ఆస్కార్ కాకపోతే అంతకుముందు నోబెల్ బహుమతి ఇవ్వా లని కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ బహిరంగసభల్లో కేసీఆర్ కుటుంబబండారం బయటపెట్టడంతో, వారు పూర్తిగా కుంగుబాటుకు గురై ఏం మాట్లాడుతు న్నారో కూడా తెలియడం లేదని చెప్పారు. గురువారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రగతిభవన్‌లో వారుండేది ఇంకా రెండునెలలే, ఆ తర్వాత ఖాళీచేసి ఫామ్‌హౌస్‌కు పోవాల్సిందేనన్నారు. పెండింగ్‌లో ఉన్న ఏపీ–తెలంగాణకు కృష్ణానీటి పంపకాల బాధ్యత బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పగింత, ములుగులో గిరిజనవర్సి టీ, జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు వంటి మూడు కీలక అంశాలపై కేంద్ర కేబినెట్ ఒకేరోజు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు జాప్యంలో పూర్తి బాధ్యత చేతకాని దద్దమ్మ ప్రభుత్వం కేసీఆర్‌దేనని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అసమర్థత, నిర్ల క్ష్యం కారణంగా తెలంగాణకు పదేళ్లుగా అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్రానికి తాము పన్నులు, ఇతర రూపాల్లో రూపాయి ఇస్తే. అందులో 56 పైసలు ఇతరరాష్ట్రాలకు మళ్లిస్తున్నారని, తెలంగాణకు తగిన వాటా రావడం లేదని కేటీఆర్ చెబుతున్నారు కదా అన్న ప్రశ్నకు అవన్నీ చిల్లరోళ్ల చిల్లర మాటలని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వారికి అధికారం, అహంకారం తలకెక్కింది ‘కల్వకుంట్ల కుటుంబానికి పూర్తిగా అధికారం తలకెక్కి అహంకారమదంతో ప్రధానిపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. ప్రధానిని టూరిస్ట్ అంటూ విమర్శలు చేస్తున్నరు. ఇచ్చిన హామీలు అమలు చేయని ముఖ్యమంత్రికి సిగ్గుండాలి’ అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్‌లో కూర్చుంటున్నడు. మోదీ పర్యటనకు వస్తే విమర్శిస్తూ పోస్టర్లు వేయడానికి సిగ్గుండాలి. బయ్యారం స్టీల్ ఫాక్టరీపై ప్రధాని మోదీ ఏనాడు హామీ ఇవ్వలేదు. కేంద్రంతో సంబంధం లేకుండా తామే దానిని ఏర్పాటు చేస్తామని మాట తప్పినందుకు, ఇతర హామీలు నెరవేర్చనందుకు కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబసభ్యుల దిష్టిబొమ్మలు దహనం చేయాలి’ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి ఈ జిల్లాలు సస్యశ్యామలమై నట్టు, పొలాలు, ప్రజలకు తాగునీరు కల్పిస్తున్నట్టు హైదరాబాద్‌లో హోర్డింగ్‌లు పెట్టడం విడ్డూరమని, కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా దీని వ్యయం రూ.35 వేల కోట్ల నుంచి రూ. 57వేల కోట్లకు చేరిందన్నారు. -
సీఎం కేసీఆర్ కుటుంబంలో కరోనా కల్లోలం
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ తెలంగాణలో తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులకు కరోనా వ్యాపిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి కుటుంబసభ్యులకంతా కరోనా వ్యాపించింది. కల్వకుంట్ల కుటుంబంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మొదట ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాజిటివ్ తేలగా అనంతరం ఆయన వెన్నంటే ఉండే రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్‌కు కరోనా సోకింది. తాజాగా సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్ తేలింది. ఈ విధంగా కల్వకుంట్ల కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ పాల్గొనగా అక్కడ ఆయనకు కరోనా సోకిందని తెలుస్తోంది. కరోనా సోకిన వెంటనే సీఎం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ సమయంలోనూ కేసీఆర్ వెన్నంటే ఎంపీ సంతోశ్ కుమార్ ఉన్నారు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలకు రాగా అప్పుడు కూడా సంతోశ్ ఉన్నారు. దీంతో ఆయన పరీక్షలు చేయించుకోగా అతడికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు తాజాగా మంత్రి కేటీఆర్‌కు పాజిటివ్ తేలింది. సీఎం కేసీఆర్ వెంట ఉండడంతో కేటీఆర్‌కు కూడా కరోనా సోకినట్లు సమాచారం. ఈ విధంగా కల్వకుంట్ల కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్ కుమార్ హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. చదవండి: ప్రధాని మోదీకి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు -
‘కల్వకుంట్ల’ పాలనకు కాలం చెల్లింది
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ‘కల్వకుంట్ల’ కుటుంబ పాలనకు కాలం చెల్లిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి చూస్తుంటే ప్రజా కూటమి విజయం ఖాయమని స్పష్టమవుతోందన్నారు. శనివారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. పోలింగ్ రోజున రోహిత్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డిపై దాడి ఇందులో భాగమేనన్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళుతుండగా తనపై మెట్పల్లి వద్ద జరిగింది సాధారణ దాడి కాదని, తనను హతమార్చే కుట్ర అని ఆరోపించారు.పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేశారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని, ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగింటిలో కాంగ్రెస్ విజయం ఖాయ మని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో సైతం ప్రజలు ‘ప్రజాకూటమి’వైపు మొగ్గు చూపారన్నారు. తాము ఎగ్జిట్ పోల్ సర్వేలను విశ్వసించబోమని, గతంలో చాలా ఎన్నికల విషయంలో ఆ సర్వేలు తప్పని తేలిందని గుర్తు చేశారు. లగడపాటి సర్వేపై కేసీఆర్, కేటీఆర్‌లకు వణుకుపుడుతోందన్నారు. ఆయన సర్వే తమకు అనుకూలంగా వచ్చినప్పుడు టీఆర్ఎస్ నేతలు ఎగిరెగిరి గంతులేసి, వ్యతిరేకంగా వస్తే విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రగతి భవన్‌ను ఖాళీ చేయాల్సిందే: కుసుమ కుమార్ ఇక సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌ను ఖాళీ చేయాల్సిందేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్ అన్నారు. తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ మీడియా తెలంగాణ ప్రజల నాడిని పసిగట్టడంలో విఫలమైందన్నారు. వంశీచంద్‌రెడ్డిని పరామర్శించిన ఉత్తమ్ హైదరాబాద్: ప్రత్యర్థుల దాడిలో గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్వకుర్తి ప్రజాకూటమి అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిమ్స్ ఆస్పత్రిలో కల్వకుర్తి ప్రజాకూటమి అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని పరామర్శిస్తున్న ఉత్తమ్ -
కల్వకుంట్ల గబ్బుకు కాంగ్రెస్సే సబ్బు: సంపత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పట్టిన కల్వకుంట్ల గబ్బును 2019లో కాంగ్రెస్ అనే సబ్బుతో కడుగుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ చెప్పారు. మంగళవారం ఇక్కడ ఆయ న మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేసి, ఎన్ని డబ్బులు గుంజారనేదానిపై కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ చేశారు. కాంగ్రెస్ ఖేల్ ఖతమన్న కేటీఆర్ మాటలు అహంకారపూరితమని, అధికారం శాశ్వతం అనుకుని కళ్లు నెత్తికెక్కించుకుని ఆయన మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ అధికారం, కేసీఆర్ కు సీఎం, కేటీఆర్‌కు మంత్రి పదవి కాంగ్రెస్ భిక్ష అనే విషయం మరిచిపోవద్దన్నారు. అమెరికాలో రూ.4లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదు లుకుని ఇప్పుడు రూ.4వేల కోట్లు సంపాదించిన చరిత్ర కేటీఆర్‌దన్నారు. అదుర్స్ సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించి, పెద్దమొత్తంలో సొమ్ము ముట్టాక ఊరుకున్నారని ఆరోపించారు. -
కల్వకుంట..జర భద్రం
సంగారెడ్డి మున్సిపాలిటీ:బైక్ అయిన,, కారులైన.. చివరకు స్కూల్ బస్సులైన ఈ దారిన కాస్తా చూసే వెళ్లాల్సి వస్తోంది.. లేదంటే బోల్తా కొట్టడమే.. మట్టిలో ఇరుక్కోవడం జరుగుతుంది. ఇది ఎక్కడో కాదు సాక్షత్తు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని లాల్సాబ్ గడ్డ - కల్వకుంట ప్రధాన రహదారి దుస్థితి. లాల్సాబ్ గడ్డ నుంచి కల్వకుంటకు వెళ్లే రహదారి నిర్మాణం కోసం 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజీవ్‌నగర్ బాట కార్యక్రమంలో భాగంగా రోడ్డు పనులను ప్రారంభించారు. అదే సమయంలో కల్వకుంట నుంచి పాత బస్టాండ్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేశారు. అందుకుగాను డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయడం కోసం అధికారులు సర్వే చేసి పనులు సైతం ప్రారంభించారు. కాని పాలకుల, అధికారుల నిర్లక్ష్యం వల్ల నేటికి రోడ్డు పనులు మాత్రం పూర్తి చేయాలేకపోతున్నారు.ఈ సమస్యపై 15వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో ప్రతిసారి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నా ఏమాత్రం ఫలితం లేకపోయింది. గత వారం రోజులుగా వరుసగా వర్షలు కురియడంతో ఈ రోడ్డు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. మట్టి రోడ్డు కావడంతో ఎక్కడా పడితే అక్కడ వాహనాలు బోల్తా పడుతున్నాయి. రాత్రి వేళలలో అయితే ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు కిందపడి గాయాలపాలవుతున్నారు. పట్టణంలోని పలు ప్రైవేటు స్కూళ్లకు చెందిన బస్సులు సైతం ఈ రోడ్డున వచ్చి మట్టీలో ఇరుక్కు పోయి పంట పొలాల్లోకి వెళ్లిన సందర్భాలున్నాయి. ఇప్పటికైన అధికారులు చర్యలు తీసుకొని రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు తమ వార్డులో రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారేమాత్రం పట్టించుకోవడంలేదు. పాలకవర్గ సమావేశంలో సైతం తాను ఈ విషయంపై ప్రస్తావించినా కమిషనర్‌గాని, ఇంజనీర్లు గాని స్పందించడం లేదు. దీంతో స్కూల్‌కు వెళ్లే పిల్లలు సైతం బురదలోనే వెళ్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. -జహినాద్బేగం, వార్డు కౌన్సిలర్ -
భువనగిరిని నాగుండెల్లో పెట్టుకుంటా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బంగారు బతుకమ్మ సంబరాలు విజయవంతం భువనగిరి ‘మొదటి రోజునే విజయవంతంగా నిర్వహించిన బంగారు బతుకమ్మ సంబరాలను నా జీవితంలో మరచిపోలేను.. భువనగిరి నా గుండెల్లో నిలిచిపోతుంది’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన బంగారు బతుకమ్మ సంబరాలతో భువనగిరి పట్టణం పూలవనంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఈ పండగను తొలిసారిగా భువనగిరిలో ప్రారంభించారు. గ్రామాల నుంచి బతుకమ్మలతో భారీగా తరలి వచ్చిన మహిళలతో ఎక్కడ చూసినా బతుకమ్మ సందడి కనిపించింది. తొలిరోజు భువనగిరిలో నిర్వహించిన బంగారు బతుకమ్మ సంబరాలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బతుకమ్మలతో బంగారు తెలంగాణను సాధించుకోవడానికి పెద్ద ఎత్తున హాజరైన మహిళా శక్తి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతి బింబంగా బతుకమ్మ పండగ ఎదిగిందన్నారు. 2008లో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి బతుకమ్మ పండగను ప్రారంభించామన్నారు. తెలంగాణ బతుకమ్మ పండగను హేళన చేసినవారికి భువనగిరి సభ సమాధానం చెబుతుందన్నారు. విద్యాశాఖమంత్రి జి.జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ అసమానతలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ క ంటున్న కలలకు భువనగిరి బంగారు బతుకమ్మ సభ నిద ర్శనమన్నారు. సుఖశాంతుల కోసం తెలంగాణను పోరాడి సాధించుకున్నామన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న వాళ్లకు భువనగిరిలో జరిగిన బంగారు బతుకమ్మ సంబరాలకు హాజరైన మహిళలను చూస్తే తెలుస్తుందన్నారు. తరతరాలుగా బతుకమ్మ పండగను చేసుకుంటున్నా తెలంగాణ రాష్ర్టం రావడం వల్లే ఇంత పెద్ద ఎత్తున జరుపుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ఇంతకాలం చంపుకున్న ఆత్మగౌరవం నిలబెట్టుకున్నామనడానికి, మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకున్నామనడానికి ఇది నిదర్శనమన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మాట్లాడుతూ బంగారు బతుకమ్మ సంబరాలను ప్రభుత్వం నిర్వహించడం పట్ల కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భువ నగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంస్కృతి, అస్తిత్వం ప్రమాదంలో పడినపుడు పుట్టిన ఉద్యమ కెరటం జాగృతి అన్నారు. కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఉద్యమానికి ఊపిరినిచ్చాయని చెప్పారు. కలెక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలను తొలిసారిగా భువనగిరిలో ప్రభుత్వం నిర్వహించిందన్నారు. తెలంగాణ ప్రజల సుఖ శాంతుల కోసం ప్రభుత్వం పండగను జరుపుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో సంబరాలను పెద్ద ఎత్తున జరుపుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు బతుకమ్మ సంబరాలకు వచ్చిన మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ జాగృతి ద్వారా తెలంగాణ మహిళలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు. భువనగిరి ఆర్డీఓ నూతి మధుసూదన్ ఆధ్యక్షతన జరిగి ఈ సభలో ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు, జేసీ ప్రీతిమీనా, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు కె. ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిషోర్, వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొలుపుల అమరేందర్, నాగారం అంజయ్య, సిద్దుల పద్మ, బొట్ల పరమేశ్వర్, బిల్డర్ రవికుమార్, పారిశ్రామికవేత్త ఆంటోనిరెడ్డి, డీఎస్పీ ఎస్. శ్రీనివాస్, తహసీల్దార్లు కె. వెంక ట్‌రెడ్డి, వీరప్రతాప్, అరుణారెడ్డి పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా డాక్టర్ పోరెడ్డి రంగయ్య వ్యవహరించారు. బతుకమ్మ ఆడిన కవిత బంగారు బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో ప్రభుత్వం, తెలంగాణజాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బంగారు బతుకమ్మ ఉత్సవాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో ఆమె కలిసిపోయారు. వారిని పలకరిస్తూ సంప్రదాయ బద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ సుమారు గంటసేపు ఆడారు. దీంతో మహిళలు ఆమెను అనుకరించారు. ఆమెతో కలిసి ఆడడానికి మహిళలు ఆసక్తి చూపారు. సభ అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి మహిళలతో కలిసి వెళ్లారు. ఆమె వెంట ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత, జేసీ ప్రీతిమీనా, పలువురు మహిళా నాయకులు ఉన్నారు.